సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చే ధైర‍్యం చేయలేకపోతోంది. మరోవైపు నేటి సభలో గందరగోళం సృష్టించి మొక్కుబడిగా ఏదో చేస్తున్నామనే హడావుడిని సృష్టిస్తోంది. బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై ఎటూ తేల్చలేకపోతోంది.
అయితే ఈ పరిణామాలపై ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘లోక్‌సభలో ఊహించని సన్నివేశాలు కనిపించాయి. సభను అర్థాంతరంగా వాయిదా పడింది. అసలేం జరుగుతోంది? టీడీపీ.. మోదీ ప్రభుత్వంలో భాగస్వామి అవునా? కాదా?’’ అంటూ ట్విటర్‌లో ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే ఓ వైపు నిరసనలంటూనే.. మరోవైపు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావటం టీడీపీ ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తోంది.
Crazy scenes in Lok Sabha: TDP MPs, part of ruling alliance, disrupt the house over AP special status. Force adjournment. Isn't TDP part of the Modi Govt? What the hell is going on here?
— Rajdeep Sardesai (@sardesairajdeep) 6 February 2018
Comments
Please login to add a commentAdd a comment