interrupted
-
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
ముంబై: ముంబై మహా నగరాన్ని వర్షం ముంచెత్తింది. ముంబై ప్రధాన నగరంతో పాటు శివార్లలోని పలు ప్రాంతాల్లో సోమవారం(మే13) భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.సాయంత్రం 5గంటలకు విమాన సర్వీసులను మళ్లీ పునరుద్ధరించారు. సర్వీసులను నిలిపివేసిన సమయంలో మొత్తం 15 విమానాలను డైవర్ట్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. వర్షం వల్ల మెట్రో, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రోడ్ల మీద చెట్లు విరిగి పడిపోయాయి. -
హైదరాబాద్: మెట్రో రైల్లో సాంకేతిక లోపం
-
మొరాయించిన మెట్రో రైలు.. ప్రయాణికుల ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు మొరాయించింది. సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. గురువారం రాత్రి మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లే మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీ స్టేషన్లో సుమారు ఇరవై నిమిషాలకు పైగా మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చదవండి: వేడుకల పేరుతో శివారులో అసాంఘిక కార్యకలాపాలు.. అడ్డాలుగా ఫాంహౌస్‌లు -
లైవ్‌లోకి వచ్చేసిన బుడతడు..
న్యూస్ రూమ్‌లో నుంచి విశ్లేషణ అందిస్తున్న మహిళ రిపోర్టర్‌కు ఆమె కొడుకు వల్ల చిన్నపాటి ఇబ్బంది కలిగింది. అయితే అందుకు సంబంధించిన వీడియో ఆ చానల్ వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కుబె అనే మహిళ ఎంఎస్ఎన్బీసీ చానల్లో న్యూస్ కరస్పాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రోజున ఉత్తర సిరియాలో టర్కీ దాడులకు సంబంధించిన విశ్లేషణను ఆమె లైవ్‌లో అందిస్తున్నారు. విశ్లేషణ మధ్యలో కుబె కొడుకు ర్యాన్.. వెనకాల నుంచి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన ఆమె ‘నన్ను క్షమించండి, నా పిల్లలు ఇక్కడే ఉన్నార’ని చెప్పారు. మళ్లీ వెంటనే తన విశ్లేషణను ప్రారంభించారు. అయితే ఈ సమయంలో చానల్ స్క్రీన్‌పై ఆ విశ్లేషణకు సంబంధించిన గ్రాఫిక్ విజువల్‌ను ప్లే చేశారు. ఈ దృశ్యాలను ఎంఎస్ఎన్బీసీ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. కొన్నిసార్లు బ్రేకింగ్ న్యూస్ కవర్ చేసేటప్పడు.. అనుకోని బ్రేకింగ్ న్యూస్ జరుగుతుందని పేర్కొంది. #workingmoms అనే ట్యాగ్ కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 3.4 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. వర్క్ ప్లేస్‌లోకి పిల్లల్ని తీసుకురావడానికి అవకాశం కల్పించిన ఆ చానల్ నిర్వహకులను కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గతంలో బీబీసీ చానల్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. Sometimes unexpected breaking news happens while you're reporting breaking news. #MSNBCMoms #workingmoms pic.twitter.com/PGUrbtQtT6 — MSNBC (@MSNBC) October 9, 2019 -
ఫేస్బుక్ 12 గంటలు బంద్
శాన్ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్, దాని అనుంబంధ ఇన్స్టాగ్రాం వంటి ఆన్లైన్ వేదికలు బుధవారం గంటలతరబడి పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతటి భారీస్థాయిలో ఫేస్బుక్లో సమస్య ఉత్పన్నం కావడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాల్లో ఫేస్బుక్ అత్యంత ఎక్కువ సమయం పనిచేయకుండా పోయిందనీ, కొన్ని చోట్ల దాదాపు 12 గంటలపాటు వినియోగదారులు ఆన్‌లైన్‌లోకి రాలేకపోయారని downdetector.com అనే వెబ్సైట్ వెల్లడించింది. ప్రస్తుతం దాదాపుగా అన్ని చోట్లా మళ్లీ ఫేస్బుక్, దాని అనుబంధ ఉత్పత్తులు మళ్లీ సాధారణంగా పనిచేస్తున్నాయంది.అనేక చోట్ల తమ వెబ్సైట్లు, యాప్‌లు పనిచేయకపోవడం నిజమేనని ఫేస్బుక్ స్వయంగా వెల్లడించింది. అయితే ఈ సమస్యపై పూర్తి వివరాలు అందించేందుకు నిరాకరించింది. ఇది ‘సేవల నిరాకరణ దాడి’ ఫలితం మాత్రం కాదని స్పష్టం చేసింది. బుధవారం నాటి అంతరాయం కారణంగా అనేక ప్రకటనలు వినియోగదారులను చేరుకోలేదనీ, కాబట్టి ఆ ప్రకటనలు ఇచ్చిన వారికి డబ్బును తిరిగి చెల్లించే యోచనలో ఫేస్బుక్ ఉందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. దీనిపై ఫేస్‌బుక్‌ను సంప్రదించినా స్పందన రాలేదు. -
ఇంతకీ టీడీపీ మోదీ ప్రభుత్వంలోనే ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చే ధైర్యం చేయలేకపోతోంది. మరోవైపు నేటి సభలో గందరగోళం సృష్టించి మొక్కుబడిగా ఏదో చేస్తున్నామనే హడావుడిని సృష్టిస్తోంది. బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై ఎటూ తేల్చలేకపోతోంది. అయితే ఈ పరిణామాలపై ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘లోక్‌సభలో ఊహించని సన్నివేశాలు కనిపించాయి. సభను అర్థాంతరంగా వాయిదా పడింది. అసలేం జరుగుతోంది? టీడీపీ.. మోదీ ప్రభుత్వంలో భాగస్వామి అవునా? కాదా?’’ అంటూ ట్విటర్లో ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఓ వైపు నిరసనలంటూనే.. మరోవైపు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావటం టీడీపీ ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తోంది. Crazy scenes in Lok Sabha: TDP MPs, part of ruling alliance, disrupt the house over AP special status. Force adjournment. Isn't TDP part of the Modi Govt? What the hell is going on here? — Rajdeep Sardesai (@sardesairajdeep) 6 February 2018 -
నేడు భారత్ బంద్
-
నేడు భారత్ బంద్
♦ బ్యాంకింగ్, రవాణా, టెలికం సేవలకు తీవ్ర అంతరాయం ♦ సమ్మెలో పాల్గొంటున్న 10 కేంద్ర కార్మిక సంఘాలు ♦ 12 డిమాండ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా బంద్: కార్మిక సంఘాలు ♦ కనీస వేతనం రూ. 18 వేలు, పెన్షన్ రూ. 3 వేలు చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర కార్మిక సంఘాల బంద్‌తో ప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభించనున్నాయి. బ్యాంకింగ్, ప్రజా రవాణా, టెలికం వంటి కీలక సేవలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం ఉదాసీనత, కార్మిక వ్యతిరేక చట్ట సవరణలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) మినహా అన్ని ప్రధాన సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. సమ్మెలో 18 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటారని అంచనా. తమ డిమాండ్ల పరిశీలనకు కేంద్రం హామీ, రెండేళ్ల బోనస్, కనీస వేతనం రూ.350కి పెంపు చర్యలు సరిపోవ ంటూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. నెలకు కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని, నెలకు రూ. 3 వేల కనీస పెన్షన్ వంటి 12 డిమాండ్లు పరిష్కరించాలన్నాయి. ‘12 అంశాలతో కూడిన డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏకపక్ష కార్మిక వ్యతిరేక చట్ట సవరణల్ని నిరసిస్తూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు రోడ్లపై నిరసన తెలుపుతారు’ అని కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి తివారీ చెప్పారు. కార్మికులతో ఘర్షణ పడాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని, వారి సహకారం, మద్దతు కావాలని కార్మిక మంత్రి దత్తాత్రేయ అన్నారు. మొత్తం 12 డిమాండ్లలో ఎనిమిది కార్మిక శాఖకు సంబంధించినవి కాగా వాటిలో ఏడింటిని అంగీకరించామని చెప్పారు. కనీస వేతనం రూ. 18 వేలు సహేతుకమే: సమ్మెతో ఓడరేవులు, పౌరవిమానయానం, రవాణా, టెలికం, బ్యాంకింగ్ రంగాలు స్తంభిస్తాయని టీయూసీసీ ప్రకటించింది. ఆస్పత్రులు, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సిబ్బంది బంద్‌లో పాల్గొంటారని, రోజువారీ విధులకు భంగం కలగకుండా నిరసన తెలుపుతారంది. కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఓఐఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటారని తివారీ చెప్పారు. తాము ఎక్కువ అడగడం లేదని, ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నెలవారీ కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని కోరుతున్నామన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు సరైనదేనంటూ సమర్ధించుకున్నారు. నేటి సమ్మెలో రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం లేదు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు నెలవారీ వేతనం రూ. 18 వేల నుంచి దాదాపు రూ. 26 వేలకు పెంచాలన్న వారి డిమాండ్ పరిశీలనకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. 11 రాష్ట్రాల్లో రాస్తారోకోలు: ఏఐటీయూసీ సంఘటిత, అసంఘటిత రంగాలకు సంబంధించిన పారిశ్రామిక ప్రాంతాలు, పలు విభాగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) తెలిపింది. ఢిల్లీలోని ఓక్లా, కీర్తినగర్, మయపురి ఏరియా, వజీర్పూర్, మంగోల్‌పూరి, పత్పర్గంజ్ సహా అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించింది. బ్యాంకులు, బీమా, యూనివర్సిటీ, తపాలా, టెలికం, రక్షణ, ఇంధన రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారని, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్నాటక సహా 11 రాష్ట్రాల్లో రాస్తారోకోలు చేస్తామని ఏఐటీయూసీ పేర్కొంది. ఆగస్టు 31న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాట్లాడారని, కార్మికులకు సరైన వేతనం, సాంఘిక భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆగస్టు 31న మంత్రి దత్తాత్రేయ చెప్పారని తెలిపింది. రేడియాలజిస్టుల సమ్మె.. తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో రేడియాలజిస్టులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీంతో రేడియాలజీ , అల్ట్రాసోనోగ్రఫీ, ఇతర స్కానింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. స్తంభించనున్న బ్యాంకింగ్ రంగం ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు సంఘాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించడంతో నేటి సమ్మెతో ఆ రంగం కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే వినియోగదారులకు బ్యాంకులు ఆ విషయాన్ని వెల్లడించాయి. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోషియేషన్(ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోషియేషన్(ఏఐబీఓఏ), ఆలిండియా ఆఫీసర్స్ కాన్ఫడరేషన్(ఎఐబీఓసీ), ఇండియన్ నేషనల్ బ్యాంకు ఆఫీసర్స్ కాంగ్రెస్‌లు బంద్‌కు నోటీసులిచ్చాయి. -
ఖరీఫ్‌కు సన్‌స్ట్రోక్!
♦ పంటల సాగుకు కరుణించని వరుణుడు ♦ ఎండ, వడగాడ్పులకు సాగు చేసిన పైర్లు సైతం ఎండుముఖం ♦ విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఆందోళనలో అన్నదాతలు జూలై మాసం.. రైతన్నకు ఎంతో కీలకం. జూన్ నెల సగంలోనే నైరుతీ రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. జూలై నెలంతా పంటల సాగులో అన్నదాతలు బిజీబిజీగా ఉంటారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం పరుగులు తీస్తుంటారు. కానీ, ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా ఆ హడావిడి కనిపించడం లేదు. తొలకరికి ముందే మండుటెండల్లో వచ్చిపోరుున వరుణుడు.. రుతుపవనాలు వచ్చినాగానీ మొహం చాటేశాడు. జూలై నెల సగం గడిచిపోతున్నా.. జిల్లాపై కనికరం చూపడం లేదు. పైగా, భానుడి ప్రతాపం, వడగాడ్పులు వెరసి ఇప్పటికే సాగుచేసిన పంటలను ఎండుముఖం పట్టిస్తున్నారుు. అన్నదాతకు నిద్ర లేకుండా చేస్తున్నారుు. ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సన్‌స్ట్రోక్ తగులుతోంది. వర్షాలు కురవాల్సిన సమయంలో వేడిగాలులతో రైతులకు షాక్ కొడుతోంది. వరుణుడి దోబూచులాటకుతోడు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో నిత్యం అంతరాయం పంటలపై పగతీర్చుకుంటూ అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నారుు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులైనా.. నేటికీ సక్రమంగా వర్షాలు కురవలేదు. అరకొరగా సాగుచేసిన లేతపైర్లు సైతం ఈదురుగాలులు, వడగాడ్పులతో విలవిల్లాడుతున్నాయి. గత రెండేళ్ల కరువు పరిస్థితులు ఈ ఏడాది కూడా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నారుు. కొత్తగా పంటల సాగు సంగతి అటుంచితే.. ఇప్పటికే వేసిన పంటలైనా చేతికొస్తాయో లేదోనని రైతులకు బెంగపట్టుకుంది. 2,35,857 హెక్టార్లకుగానూ 27,500 హెక్టార్లలోనే సాగు... జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలదాటింది. ప్రారంభంలో ముందస్తుగా మురిపించిన వర్షాలు పంటల సాగుపై రైతులకు ఆశలు పెంచారుు. అన్నదాతలు వెంటనే పలు రకాల పంటలు సాగుచేశారు. కానీ, అనంతరం వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు చతికిలపడింది. ప్రస్తుత సీజన్లో 2,35,857 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు సుమారు 27,500 హెక్టార్లలో సాగయ్యూరుు. వరి 32,185 హెక్టార్లకుగానూ 20 హెక్టార్లలోనే సాగైంది. జొన్న 220 హెక్టార్లకుగానూ అసలు సాగుకే నోచుకోలేదు. సజ్జ 17,030 హెక్టార్లకుగాను కేవలం 600 హెక్టార్లలోనే సాగైంది. రాగి, మొక్కజొన్న, అలసంద, సొయాచిక్కుడు పంటల సాగు ఎక్కడా కనిపించడంలేదు. సాగుచేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరం... ఖరీఫ్‌లో పూర్తిస్థారుులో పంటల సాగు సంగతి అటుంచితే, సాగుచేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెసర 4,145, మినుము 600, కంది 1,191, వేరుశనగ 1,661 హెక్టార్లలో సాగుచేశారు. 4,579 హెక్టార్లకుగానూ 8,856 హెక్టార్లలో భారీగా నువ్వు సాగుచేశారు. ఈ సీజన్లో 6,008 హెక్టార్లకుగాను కేవలం 485 హెక్టార్లలోనే కూరగాయలు సాగు చేశారు. జీలుగ కూడా మరో 100 హెక్టార్లలో సాగైంది. సాగుచేసిన పంటలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పంటలు పూత, కాయ దశలో ఉండగా, వర్షాలు లేక ప్రతికూల పరిస్థితులు వాటిని వేధిస్తున్నారుు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో వడగాడ్పులు, ఎండలకు తోడు విద్యుత్ అంతరాయంతో సాగునీటి కష్టాలు పంటలను నాశనం చేస్తున్నారుు. తీరప్రాంతంలో ఎండుతున్న వేరుశనగ... జిల్లాలోని తీరప్రాంతంలో ఇప్పటికే విస్తారంగా సాగైన వేరుశనగ వడగాడ్పుల దెబ్బకు విలవిల్లాడుతోంది. తరచూ విద్యుత్ అంతరాయంతో బోర్లు సైతం పనిచేయక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఈదురుగాలుల దెబ్బకు కరెంటు నిలవకపోవడంతో రైతులు విద్యుత్ మోటార్ల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ కష్టాలు చాలవన్నట్లు అడుగంటిన భూగర్భజలాలతో బోర్లలో నీరు రావడం గగనమవుతోంది. విద్యుత్ మోటార్లు తరచూ మొరాయిస్తున్నారుు. పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. జిల్లావ్యాప్తంగా రోజూ కారుమబ్బులు.. కటిక చీకట్లు తప్ప.. చుక్క వానపడని పరిస్థితి నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆకాశంవైపు చూస్తున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అరుుతే ఖరీఫ్ పంటల సాగు దాదాపు నిలిచిపోయినట్టు చెప్పాలి. ఎటుచూసినా ఎడారిని తలపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది తీవ్ర కరువు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం
ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5వ దశ 9వ యూనిట్లో సోమవారం మధ్యాహ్నం 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. యూనిట్‌లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీ సమస్య తలెత్తడంతో ఉత్పత్తి నిలిపేశారు. వెంటనే సీఈ ఎం.సిద్ధయ్య నేతృత్వంలో మరమ్మతులు చేపట్టారు. మంగళవారం ఉదయం నాటికి ఉత్పత్తి పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
సాక్షి టీవీ ప్రసారాలకు 9నిమిషాలు అంతరాయం
హైదరాబాద్ : ఉపగ్రహం సాంకేతిక సమస్యల కారణంగా సాక్షి టీవీ ప్రసారాల్లో గురువారం మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 12.09 గంటల వరకూ అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయానికి చింతిస్తున్నాం. -
శ్రీశైలం - మహబూబ్ నగర్ల మధ్య రాకపోకలు బంద్