
శాన్‌ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్, దాని అనుంబంధ ఇన్‌స్టాగ్రాం వంటి ఆన్‌లైన్ వేదికలు బుధవారం గంటలతరబడి పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతటి భారీస్థాయిలో ఫేస్‌బుక్‌లో సమస్య ఉత్పన్నం కావడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాల్లో ఫేస్‌బుక్ అత్యంత ఎక్కువ సమయం పనిచేయకుండా పోయిందనీ, కొన్ని చోట్ల దాదాపు 12 గంటలపాటు వినియోగదారులు ఆన్‌లైన్‌లోకి రాలేకపోయారని downdetector.com అనే వెబ్‌సైట్ వెల్లడించింది.
ప్రస్తుతం దాదాపుగా అన్ని చోట్లా మళ్లీ ఫేస్‌బుక్, దాని అనుబంధ ఉత్పత్తులు మళ్లీ సాధారణంగా పనిచేస్తున్నాయంది.అనేక చోట్ల తమ వెబ్‌సైట్లు, యాప్‌లు పనిచేయకపోవడం నిజమేనని ఫేస్‌బుక్ స్వయంగా వెల్లడించింది. అయితే ఈ సమస్యపై పూర్తి వివరాలు అందించేందుకు నిరాకరించింది. ఇది ‘సేవల నిరాకరణ దాడి’ ఫలితం మాత్రం కాదని స్పష్టం చేసింది. బుధవారం నాటి అంతరాయం కారణంగా అనేక ప్రకటనలు వినియోగదారులను చేరుకోలేదనీ, కాబట్టి ఆ ప్రకటనలు ఇచ్చిన వారికి డబ్బును తిరిగి చెల్లించే యోచనలో ఫేస్‌బుక్ ఉందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. దీనిపై ఫేస్‌బుక్‌ను సంప్రదించినా స్పందన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment