ముంబై: ముంబై మహా నగరాన్ని వర్షం ముంచెత్తింది. ముంబై ప్రధాన నగరంతో పాటు శివార్లలోని పలు ప్రాంతాల్లో సోమవారం(మే13) భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
సాయంత్రం 5గంటలకు విమాన సర్వీసులను మళ్లీ పునరుద్ధరించారు. సర్వీసులను నిలిపివేసిన సమయంలో మొత్తం 15 విమానాలను డైవర్ట్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. వర్షం వల్ల మెట్రో, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రోడ్ల మీద చెట్లు విరిగి పడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment