ముంబైని ముంచెత్తిన భారీ వర్షం | Heavy Rain Lashes In Mumbai June 22 2024 | Sakshi
Sakshi News home page

ముంబై వాసులకు ఉపశమనం.. ముంచెత్తిన భారీ వర్షం

Published Sat, Jun 22 2024 8:31 PM | Last Updated on Sat, Jun 22 2024 8:31 PM

Heavy Rain Lashes In Mumbai June 22 2024

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని శనివారం(జూన్‌22) సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ముంబై వాసులకు వేసవి వేడి నుంచి పూర్తి ఉపశమనం దొరికినట్లయింది.  పశ్చిమ తీరం వెంబడి రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. 

కర్ణాటక, కేరళ,గోవాలకు ఐఎండీ  ఏకంగా రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. ఒడిషాకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.  రానున్న ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, యానాంలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ వెల్లడించింది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement