ముంబైలో భారీ వర్షం..లోకల్‌ రైళ్లతో పాటు 36 విమానాలు రద్దు | Mumbai Rains 36 Flights Canceled | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ వర్షం..లోకల్‌ రైళ్లతో పాటు 36 విమానాలు రద్దు

Published Mon, Jul 22 2024 6:52 AM | Last Updated on Mon, Jul 22 2024 7:41 AM

Mumbai Rains 36 Flights Canceled

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబైని ఎడతెరిపిలేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మహానగరం ముంబైతో పాటు సబర్బన్ ప్రాంతాలలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 100 మి.మీ.కి మించిన వర్షపాతం నమోదైంది.

ముంబైలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. దాదర్- మాతుంగా స్టేషన్ల మధ్య సెంట్రల్ రైల్వే సెక్షన్‌లో నీరు నిలిచిపోవడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. ఇదేవిధంగా ముంబై విమానాశ్రయంలో మొత్తం 36 విమానాలు రద్దు చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా విమానాలతో సహా 15 విమానాలను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement