న్యూఢిల్లీ, సాక్షి: దేశ చరిత్రలోనే తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ పదవి విషయంలో అధికార-ప్రతిపక్ష కూటమికి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం.. ఇరు పక్షాల నుంచి అభ్యర్థులు నిలపడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో 78 ఏళ్ల తర్వాత.. అదీ స్వాతంత్ర దేశంలో తొలిసారి ఈ ఎన్నిక జరగబోతోంది.
దేశంలో.. 1925 ఆగస్టు 24న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్‌భాయ్ జె పటేల్ స్పీకర్‌గా నెగ్గారు. టి.రంగాచారియార్‌పై కేవలం రెండు ఓట్ల (58-56) తేడాతో ఆయన విజయం సాధించారు. 1925 - 1946 మధ్య ఆరుసార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. అయితే.. 1946లో కాంగ్రెస్ నేత జి.వి.మౌలాంకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. పార్లమెంటు(పాత పార్లమెంట్)గా మారింది. ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా మౌలాంకర్ స్పీకర్‌గా కొనసాగారు.
1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మాలంకర్ మరణంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న అయ్యంగార్.. స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్‌గా అయ్యంగార్ నియమితులయ్యారు.
అలా.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం జాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్ అధికార పక్షం తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షం తీసుకోవడం ఆనవాయితీగా వచ్చింది. యూపీఏ హయాంలో కూడా విపక్షాలకు డిప్యూటీ ఇచ్చారు.
అయితే.. 2014లో ఆ ఆనవాయితీని ఎన్డీయే కూటమి బ్రేక్ చేసింది. తన మిత్రపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చుకుంది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో నెగ్గడంతో మిత్రపక్షానికి కూడా ఇవ్వకుండా ఆ పోస్టును ఖాళీగా ఉంచింది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో లోక్‌సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment