వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా? | Aap Claims Br Ambedkar Photo Removed From Delhi Chief Minister Office | Sakshi
Sakshi News home page

వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?

Published Mon, Feb 24 2025 5:29 PM | Last Updated on Mon, Feb 24 2025 6:30 PM

Aap Claims Br Ambedkar Photo Removed From Delhi Chief Minister Office

ఢిల్లీ :  సీఎం రేఖా గుప్తా (Delhi cm Rekha Gupta)  వివాదంలో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష ఆమ్‌ ఆద్మీ పార్టీ (aam aadmi party)
నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను సీఎం రేఖా గుప్తా అవమానించారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది?

ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులైన అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ ఫొటోల్ని తొలగించిందని, ఆ ఫొటోల స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను ఉంచినట్లు ఆప్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనా ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫొటోల్ని పోస్ట్‌ చేశారు. ఆ సోషల్‌ మీడియా పోస్ట్‌లో తాను సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ ఫొటోలు ఉన్నాయని, నూతన సీఎంగా బాధత్యలు చేపట్టిన రేఖాగుప్తా ఆ ఫొటోల్ని తొలగించి వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టారని పేర్కొన్నారు.

 
ఇదే అంశంపై అతిషీ మర్లేనా మీడియాతో మాట్లాడారు. బీజేపీ దళిత వ్యతిరేకి. తాజాగా,ఘటనతో ఆధారాలతో సహా భయట పడింది. తమ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్‌ సింగ్‌,అంబేద్కర్‌ ఫొటోలు పెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ యాంటీ దళిత్‌ ఎజెండాతో ముందుకు సాగుతుంది. అంబేద్కర్‌,భగత్‌ సింగ్‌ ఫొటోల్ని తొలగించిందని విమర్శలు గుప్పించారు.

ఆప్‌కు భయం పట్టుకుంది
ఆ ఆరోపణల్ని సీఎం రేఖాగుప్తా స్పందించారు. తన కార్యాలయంలో అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ ఫొటోలు ఉన్నాయంటూ ఆప్‌ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాడు పెండింగ్‌లో ఉన్న 14 కాగ్‌ నివేదికలను సభలో ప్రవేశపెడతామని ఆదివారం సీఎం రేఖాగుప్తా ప్రకటించారు. ఆ ప్రకటనకు ఆప్‌ భయపడిందని, ప్రజల్ని మభ్య పెట్టేలా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని మండిపడ్డారు. మీరెన్ని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసినా.. కాగ్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగి తీరుతుందన్నారు.  

ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రభుత్వ అధిపతి ఫొటో పెట్టకూడదా? దేశ రాష్ట్రపతి ఫొటో పెట్టకూడదా? జాతిపిత గాంధీజీ ఫొటో పెట్టకూడదా? భగత్ సింగ్, అంబేద్కర్‌ మన మార్గదర్శకులు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధిపతిగా, మేం వారి ఫొటోలు పెట్టేందుకు స్థలం కేటాయించాం. ఆప్‌ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం నా పని కాదు.నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement