
ఢిల్లీ : ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం రేఖా గుప్తాను టార్గెట్ చేసింది. మొన్నటికి మొన్న సీఎం క్యాంప్ ఆఫీసులో రేఖాగుప్తా బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాల్ని తీసేయించారని ఆరోపణలు గుప్పించింది. ఆప్ నేత అతిషీ మర్లేనా ట్వీట్ కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆప్ మరోసారి సీఎం రేఖా గుప్తాను ప్రస్తావిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో 1౩ సెకన్ల వీడియోను షేర్ చేస్తూ ఇక్కడ నిద్ర పోతున్నది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. తమకు సేవ చేయాలని ఢిల్లీ ప్రజలు రేఖాగుప్తాను అసెంబ్లీకి పంపించారు. కానీ అసెంబ్లీ సమావేశం జరిగే సమయంలో సీఎం గారు నిద్రపోతున్నారు’అని సెటైర్లు వేసింది.
అంతేకాదు, సీఎం గారు అంబేద్కర్,భగత్ సింగ్‌ను అవమానించడంలో మీరు కొంత సమయం తీసుకున్నట్లయితే, దయచేసి అసెంబ్లీ చర్చపై కూడా కొంచెం దృష్టి పెట్టండి’అని వ్యాఖ్యానించింది. ఇక ఆప్ షేర్ చేసిన వీడియోలో సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో కళ్లు మూసుకున్నట్లు కనిపిస్తున్న దృశ్యాల్ని చూడొచ్చు.
CM मोहतरमा के दो रूप‼️
1️⃣ विपक्ष में रहते हुए जनता के काम रोकना
2️⃣ सरकार में रहते हुए सदन के अंदर कुंभकर्णी नींद सोना pic.twitter.com/zY6E72pquU— AAP (@AamAadmiParty) February 26, 2025
అయితే, ఆప్ షేర్ చేసిన వీడియోపై రేఖా గుప్తా అభిమానులు, బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. మా సీఎం అసెంబ్లీ చర్చను కళ్లుమూసుకుని శ్రద్దగా వింటున్నారని, ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ఆప్ కావాలనే టార్గెట్ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment