
ఢిల్లీ : ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్డగోలు ఫీజుల దందాపై చరిత్రలో తొలిసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ స్కూళ్లలో ఫీజులు ఎంత మేరకు ఉండాలనే అంశంపై ప్రభుత్వం విధివిధానాల్ని ఖరారు చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది.
ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025పై ఢిల్లీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి చట్టాన్ని ఆమోదించింది.
అనంతరం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడారు. నా ఆనందానికి అవధుల్లేవు.ఢిల్లీ ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది.
📢 Big Reform in Delhi Education!
CM Rekha Gupta: “For the first time in history, Delhi Govt has passed a foolproof Bill to regulate fees and set clear guidelines for all 1677 schools — aided, unaided, private, all included.”
A bold step toward transparency and fairness in… pic.twitter.com/YzwzSBpLwP— भँ० अजीत सिंह तोमर (@Bhanwar_Ast) April 29, 2025
ఢిల్లీ ప్రభుత్వం చారిత్రాత్మక,సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025 ముసాయిదా బిల్లును ఈరోజు కేబినెట్ ఆమోదించిందని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’అని అన్నారు.
ఢిల్లీలోని 1,677 పాఠశాలలు ఎయిడెడ్, నాన్-ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అయినా, ఫీజులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకం, విధానాన్ని నిర్ణయిస్తారు. చరిత్రలో మొదటిసారిగా, అటువంటి బిల్లును ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు.
విద్యా మంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ, కొత్త నిబంధనలను అమలు చేయడానికి మూడు కమిటీలను ఏర్పాటు చేస్తామని, పాఠశాల మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు సంవత్సరాల పాటు ఫీజులను ప్యానెల్లు నిర్ణయిస్తాయని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొంటారని చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని పలు స్కూళ్లు ఏకపక్షంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తల్లి దండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.ఫిర్యాదులతో పలు పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తన ప్రభుత్వం పారదర్శకత, పిల్లల విద్యా హక్కు రక్షణకు కట్టుబడి ఉందని ఆ సమయంలో సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.