Private School fees
-
ఫీజుల దరువుకు బ్రేకులెలా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించిన నేపథ్యంలో, పాఠశాల విద్య డైరెక్టరేట్ దీనిపై కసరత్తుకు సిద్ధమవుతోంది. ఫీజుల నియంత్రణకు 2017లో ఆచార్య తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. సర్కారీ స్కూళ్లలో మౌలికవసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్ళు ప్రతి ఏటా ఏకంగా 25 శాతం వరకూ ఫీజులు పెంచుతున్నాయి. దీనిపై కొన్నేళ్లుగా ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై దృష్టి సారించింది. మౌలిక వసతుల ఆధారంగానే ఫీజులు! ఫీజుల నియంత్రణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. 35 లక్షల మందికిపైగా చదివే 11 వేల ప్రైవేటు స్కూళ్లను దీని పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా స్కూళ్లలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజుల పెంపునకు అనుమతించేలా నిబంధనలు రూపొందించే యోచనలో ఉంది. అవసరం లేని ఖర్చును అభివృద్ధిలా..! ఫీజుల నియంత్రణకు సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు అమలు కాకపోవడంతో చట్టపరమైన అడ్డంకులు లేకుండా చేయాలని పాఠశాల విద్య అధికారులకు ఉప సంఘం సూచించింది. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా 15 శాతం ఫీజులు పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో జీవోలిచ్చారు. వాటిని ఆధారంగా చేసుకుని పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును చేస్తూ ఆ పనులను అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఓ ఉదాహరణను పరిశీలిస్తే.. ఒక స్కూలు ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టుగా లెక్కల్లో చూపింది. ఫీజులు 25 శాతం పెంచేసింది. ఇలా స్కూళ్లు ఫీజులు అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. వీటిని క్రమబధ్ధికరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖర్చు 10 శాతం దాటితే పక్కా లెక్క ఉండాలి స్కూళ్ల మూడేళ్ల ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించవచ్చని తిరుపతిరావు కమిటీ సూచించింది. ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటి ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులకు బ్యాంకు ద్వారానే చెల్లింపులు ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి. వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని కసరత్తు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. ఈ దిశగానూ కొన్ని సిఫారసులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపేలా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టనున్నారు. -
తుది తీర్పునకు లోబడే 25% కోటా సీట్ల ఫీజు చెల్లింపు వ్యవహారం
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా కింద ఉచిత సీట్లు పొందే పిల్లల తల్లిదండ్రులు అమ్మఒడి పథకం చెల్లించే మొత్తం నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 24ను సవాలు చేస్తూ ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అధ్యక్షుడు కోగంటి శ్రీకాంత్, యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫెడరేషన్(యుపీఈఐఎఫ్) చైర్మన్ గొల్లపూడి మోహనరావు హైకోర్టును ఆశ్రయించారు. 25 శాతం కోటా కింద భర్తీ చేసే సీట్ల ఫీజులను తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 25 శాతం కోటా సీట్ల ఫీజులను ప్రభుత్వం సరైన రీతిలో నిర్ణయించలేదని వారు కోర్టుకు నివేదించారు. ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలల ఖాతాలో సొమ్ము జమ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఫీజు చెల్లింపు వ్యవహారం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను 15కి వాయిదా వేశారు. -
తెలంగాణలో చదువుకోవాలంటే లక్షలు కట్టాలి
-
‘ఫీజు’ నియంత్రణపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. వృత్తివిద్యా కళాశాలల్లో ఫీజు నియంత్రణకు ఫీజు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసిన తరహాలో ప్రైవేటు పాఠశాలలకూ ప్రత్యేక విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశించాలంటూ హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి కడప వెంకట్ సాయినాథ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది యాకారపు షీలు వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఈ పిల్లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీబీఎస్ఈ, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్, ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్లను ఆదేశిస్తూ తదుపరి విచారణన నవంబర్ 17కు వాయిదా వేసింది. -
పాఠశాలల ఫీజుల ఖరారు జీవోలపై వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఇటీవల జారీ చేసిన జీవోలు 53, 54లకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు 53, 54లను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్, మరికొన్ని విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. గ్రామ, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ ఇలా పలు స్థాయిల్లో పాఠశాలలను వర్గీకరణ చేసి ఫీజులను ఖరారు చేశారని తెలిపారు. ఇలాంటి వర్గీకరణను చట్ట నిబంధనలు ఆమోదించవన్నారు. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా ఫీజులను ఖరారు చేసిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది కె.రఘువీర్ స్పందిస్తూ.. పూర్తి వివరాలు సమర్పిస్తామని, కొంత గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
సర్కారీ బడికి సై!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కరోనా ఉపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ప్రజల ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేసింది. ఈ పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు పిల్లల చదువులు భారంగా మారిపోయాయి. ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతులు సరిగా జరగకున్నా ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు ముక్కు పిండి మరీ వసూలు చేస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ప్రైవేటులో ఫీజులు కట్టలేక,, చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ఉండటం, అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన కూడా కొనసాగుతుండటంతో తల్లిదండ్రులు సర్కారీ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీనికి తోడు 8వ తరగతిలోపు విద్యార్థులు టీసీ లేకుండానే ఎక్కడైనా అడ్మిషన్ పొందే వెసులుబాటు ఉండటంతో మరో ఆలోచన లేకుండా పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. కొన్ని స్కూళ్లు ‘నో అడ్మిషన్స్’బోర్డులు కూడా పెడుతుండటం ప్రభుత్వ స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణను స్పష్టం చేస్తోంది. 2020–21 వరకు తక్కువ చేరికలే.. 2016–17లో రాష్ట్రంలోని పాఠశాలల్లో 58.67 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందులో ప్రభుత్వ స్కూళ్లలో 48.29 శాతం మంది, ప్రైవేటు పాఠశాలల్లో 51.71 శాతం మంది ఉన్నారు. అలాగే 2017–18, 2018–19లో కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు, చేరికల శాతం రెండూ ప్రైవేటు స్కూళ్ల కంటే తక్కువగానే ఉన్నాయి. 2016 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2019–20లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2.15 శాతం మేర తగ్గిపోయింది. 2020–21లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే కరోనా విసిరిన పంజాతో ఉద్యోగాలు కోల్పోయి, ఆదాయాలు పడిపోయిన పేద, మధ్యతరగతి వారంతా ఈసారి ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు. ముఖ్యంగా పట్టణాల్లో, మండల కేంద్రాల్లోని సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. జిల్లాల వారీగా చూస్తే.. ♦వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని 562 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో జోరుగా కొత్త అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీట్లు దాదాపు నిండడంతో ఇతర గ్రామాల వారికి ‘నో అడ్మిషన్స్’’బోర్డు పెట్టారు. ♦నల్లగొండ జిల్లాలో 2,120 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. పది రోజుల్లో కొత్తగా 3,455 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చేరారు. అత్యధికంగా 6వ తరగతిలో 1,793 మంది చేరగా, 1వ తరగతిలో 1,154 మంది చేరారు. నల్లగొండ పట్టణం, మండలంలోని పాఠశాలల్లో అత్యధికంగా 557 మంది విద్యార్థులు చేరారు. ♦ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,361 మంది విద్యార్థులు చేరారు. అత్యధికంగా నేలకొండపల్లి మండలం రాయగూడెం పాఠశాలలోని 1వ తరగతిలో 160 మంది చేరారు. ♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని తరగతులు కలిపి కొత్తగా 2,996 అడ్మిషన్లు అయ్యాయి. అత్యధికంగా 3వ తరగతిలో పిల్లలు చేరారు. గౌతమ్‌పూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ తొమ్మిదవ తరగతిలో 190 మంది విద్యార్థులు, ఆనందఖని ఉన్నత పాఠశాలలో 734 మంది ఉన్నారు. ♦నిజామాబాద్ జిల్లాలో 3,245 అడ్మిషన్లు జరిగాయి. బోర్గాం(పి) హైస్కూల్లో 6వ తరగతిలో 89 మంది ప్రవేశాలు పొందారు. కరీంనగర్ జిల్లాలో 6,7,8 తరగతుల్లో 3,061 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఎక్కువమంది పిల్లలు 6వ తరగతిలో చేరారు. ♦రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 700 మంది విద్యార్థులు చేరారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం స్కూళ్లు 753 ఉండగా 1వ తరగతిలో 143 మంది 2 నుంచి 10వ తరగతి వరకు 254 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ♦సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేరేందుకు 360 దరఖాస్తులు వచ్చాయి. కేవలం 60 సీట్లు మాత్రమే ఉండడంతో మిగతావారికి అడ్మిషన్లు నిరాకరించారు. కరోనాతో ఆర్థిక పరిస్థితి తారుమారైంది నాకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది వరకు సూర్యాపేట జిల్లా కోదాడలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాను. కరోనా నేప«థ్యంలో పెట్టుబడి డబ్బులు అందక, వ్యవసాయం సరిగా సాగక ఆర్థిక పరిస్థితి తారుమారైంది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు భారంగా మారాయి. దీంతో ముగుర్నీ బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో 2, 3, 4 తరగతుల్లో చేర్పించా. ఇక్కడ ఇంగ్లిష్ మీడియం కూడా ఉంది. ఉపాధ్యాయుల బోధన కూడా బాగుందని చాలామంది చెప్పారు. గణనీయంగా పెరుగుతున్న అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధం గా ఇప్పటివరకు జిల్లాలో ఒకటో తరగతిలో 861 అడ్మిషన్లు వచ్చాయి. రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు నాలుగు వేల పైచిలుకు నూతన అడ్మిషన్లు జరగొచ్చని అంచనా వేస్తున్నాం. -
అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు : మంత్రి సురేష్
-
పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్: ప్రైవేటు ఫీజులు 15 శాతం రద్దు
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను 15 శాతం రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించి విద్యార్థుల తల్లిదండ్రులపై స్వల్పంగా భారం తగ్గించింది. ఫీజుల వసూలు ఒప్పందం సంతకం చేసిన వారు ఆ ప్రకారం ఫీజులు వసూలు చేస్తారు. ఇతరులు 15 శాతం ఫీజు రద్దు చేయాలని రాష్ట్ర పాఠశాలలు- సామూహిక విద్యా విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరం పొడవునా తరగతుల నిర్వహణపై కోవిడ్–19 ఆంక్షలు ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో ఫీజులు వసూలు చేయడం పట్ల తల్లిదండ్రుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శాంతియుత సంప్రదింపులు విజయవంతం కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. తల్లిదండ్రుల సంఘం అభ్యర్థనపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేని, నిస్సహాయ స్థితిని తల్లిదండ్రుల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ విచారకర పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు మూడు వర్గాలతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, తల్లిదండ్రుల సంఘం, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రతినిధులతో రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటైంది. కరోనా తాండవిస్తున్న పరిస్థితుల్లో పాఠశాలలు వసూలు చేస్తున్న వార్షిక ఫీజును పరిమితి మేరకు పలు అంచెలుగా ఖరారు చేసి అంచెల వారీగా ఫీజుల్లో మినహాయింపు కల్పించాలని హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలులో అసంతృప్తి తలెత్తితే తల్లిదండ్రుల సంఘం మరోసారి న్యాయం కోసం ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు కేసు విచారణకు తెరదించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలు ప్రైవేట్ పాఠశాలలు అంచెల వారీగా ఫీజులు మినహాయించే ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాయి. ఈ వివాదం మరోసారి బిగుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఒప్పందం నిరాకరించిన యాజమాన్యాలు 15 శాతం ఫీజులు రద్దు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
రూ.1.50 లక్షల ఫీజు ఎలా కట్టాలి..?
సాక్షి, పంజాగుట్ట: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ బాడీని రద్దు చేసి కొత్త బాడీని ఎంపిక చేయాలని, 2014 నుంచి లేకుండా పోయిన టీచర్స్, పేరెంట్స్ కమిటీని వెంటనే నియమించాలని యాక్టివ్ పేరెంట్స్ ఫోరం డిమాండ్ చేసింది. కరోనా నేపథ్యంలో 4 గంటల పాటు ఆన్లైన్ విద్యను బోధించి, ఎల్కేజీ విద్యార్థికి రూ.1.50 లక్షల ఫీజు కట్టమని ఒత్తిడి తెస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే టీసీ ఇస్తామనడంతో పాటు ఆన్లైన్ క్లాస్‌లకు లాగిన్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో ఫోరం ప్రతినిధులు అశోక్, ఆనంద్‌రెడ్డి, మహేందర్, శిరీష, గజేందర్ మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సదరు పాఠశాలకు 90 ఎకరాల స్థలాన్ని ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ప్రభుత్వ ఆధీనంలో పాఠశాల నడిచేదని, ప్రభుత్వ ఆదీనంలో ఉంటే సీబీఎస్ఈ ఇవ్వరనే నిబంధన ఉన్నందున ప్రభుత్వమే ఒక సొసైటీ ఏర్పాటు చేసి దానికి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తూ సీబీఎస్ఈ విద్యను బోధిస్తోందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ ఎల్కేజీకి రూ.1.5 లక్షలు ఉండేదన్నారు. కరోనా కాలంలో పూర్తి ఫీజు చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారని, తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారం 65 శాతం ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బోర్డులో ఐదుగురు సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఫీజు కట్టకపోతే టీసీ ఇచ్చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరానికి ప్రమోట్ చేయమని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
మా ఫీజులిచ్చేయండి..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లకు కూడా తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ‘హాస్టళ్ల నుంచి మీ పిల్లలను తీసుకెళ్లండి..’అని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పంపించేస్తున్నాయి. అయితే హాస్టళ్ల ఫీజులు పూర్తిగా చెల్లించిన తల్లిదండ్రులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు కట్టి నెలైనా గడవక ముందే హాస్టళ్లు మూతపడిన నేపథ్యంలో తమకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కొందరు, వచ్చే సంవత్సరానికి సర్దుబాబు చేయాలని కొందరు కోరుతున్నారు. మార్చి నెలలోనే అధికంగా చేరికలు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యక్ష బోధనను ప్రారంభించింది. ఫిబ్రవరిలోనే ప్రారంభమైనప్పటికీ మార్చి నెలలోనే ఎక్కువమంది హాస్టళ్లలో చేరారు. జేఈఈ మెయిన్ రెండో పరీక్ష అనంతరం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాస్టళ్లలో వచ్చి చేరారు. పాఠశాలల హాస్టళ్లు మొదలుకుని అన్ని కళాశాలల హాస్టళ్లలో 4.5 లక్షల మంది వరకు విద్యార్థులు చేరినట్లు అంచనా. రాష్ట్రంలో 1,584 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా, 574 కాలేజీలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. ఇవి ప్రత్యక్ష బోధన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా విద్యార్థులను హాస్టళ్లలో చేర్చుకున్నాయి. ఇక 10,900 వరకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా వేయి వరకు విద్యా సంస్థలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. వాటిల్లోనూ ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులను తల్లిదండ్రులు హాస్టళ్లలో చేర్పించారు. మరోవైపు రాష్ట్రంలోని 250 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు కూడా హాస్టళ్లను ప్రారంభించాయి. ఆయా కాలేజీ ల్లోని సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు హాస్టల్ ఫీజులు చెల్లించారు. మిగిలిన 3, 4 నెలల కాలానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు యాజమాన్యాలు వసూలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం చొరవ తీసుకోవాలిఅయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థులు సైతం వైరస్ బారిన పడుతుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలు, హాస్టళ్లు మూసేయాలని ఆదేశించింది. అయితే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు చెల్లించి నెల రోజులైనా గడవక ముందే, ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి చేర్పించిన కొందరు తల్లిదండ్రులు తమ స్వస్థలాలకు చేరారో లేదో.. హాస్టళ్లు మూతపడటంతో సమస్య ఏర్పడింది. పిల్లల చదువు కోసం అప్పులు చేసి మరీ ఫీజులు పూర్తిగా చెల్లించామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులకు చెల్లించిన ఫీజులను వెనక్కి ఇప్పించాలని, మిగతా విద్యార్థులకు సంబంధించిన ఫీజులను వెనక్కి ఇచ్చేలా లేదా వచ్చే విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
అసలు ట్యూషన్ ఫీజు అంటే..?
సాక్షి, హైదరాబాద్: లైబ్రరీ, ల్యాబ్, స్పోర్ట్స్‌కు గతంలో వేర్వేరుగా ఫీజులను వసూలు చేసిన కార్పొ రేట్, బడా ప్రైవేటు పాఠశాలలు ఇప్పుడు అన్నిం టినీ ట్యూషన్ ఫీజు కిందే వేస్తున్నాయి.. కరోనా కారణంగా ప్రజల జీవన పరిస్థితులు అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్స రంలో ట్యూషన్ ఫీజులు మాత్రమే, అదీ నెల వారీగా తీసుకోవాలని జీవో 46ను జారీ చేసింది. ఇదే ఆసరాగా తీసుకున్న ప్రైవేటు యాజ మాన్యా లు.. ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, ఇతరత్రా ఫీజు లను వేర్వేరుగా చూపించకుండా అన్నీ కలిపి ట్యూషన్ ఫీజు కిందే వేసి తల్లిదండ్రుల నుంచి వసూళ్లు చేస్తు న్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమైన 3 నెలల ప్రత్యక్ష బోధన కోసం సంవత్సరం ఫీజును ఇలా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఆలోచనల్లో పడింది. అందుకే ట్యూషన్ ఫీజు అంటే ఏంటి? అం దులో ఏమేం వస్తాయన్నది తేల్చేందుకు సిద్ధ మైంది. ఫీజుల వసూలు విధాన మెలా ఉండాలి? ఫీజుల నియంత్రణ ఎలా చేపట్టా లన్న అంశంపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్యాడైరెక్టర్ దేవసేన చర్చించారు. కొన్నేళ్లుగా డిమాండ్.. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు నియంత్రించాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే ఉంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు ఆందోళన చేయడం, విద్యా శాఖ కొంత హడావుడి చేసి వదిలేయడం పరిపాటి అయింది. వీటికి తోడు న్యాయ వివాదాలతో ఫీజుల నియంత్రణ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. 2009 ఉమ్మడి రాష్ట్రం నుంచే ఫీజుల నియంత్రణకు అప్పటి సర్కార్ చర్యలు చేపట్టగా.. వివిధ దశల్లో కోర్టు తీర్పుల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని 2017 ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటు తల్లిదండ్రులు, అటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించేందుకే అధిక సమయం పట్టింది. దీంతో 2017లోనే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచేశాయి. ఇక 2018–19 విద్యా సంవత్సరం వరకు సమావేశాలు, నివేదిక రూపకల్పనతోనే గడిచిపోయింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఆ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,725 వరకు ప్రైవేటు స్కూళ్లున్నాయి. వాటిల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకే 31 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వారు కాకుండా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు మరో 7–8 లక్షల మంది వరకు చదువుతున్నట్లు అంచనా. అయితే వాటిల్లో ఫీజుల విధానం, వాటిపై నియంత్రణ అంటూ ఏమీ లేకుండాపోయింది. యాజమాన్యాలు నిర్ణయించిందే ఫీజు.. రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.3.5 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్న పాఠశాలలున్నాయి. 10 శాతం పెంపు అశాస్త్రీయం.. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు 2016–17లో ఉన్న ఫీజులపై ఏటా ఫీజులను 10 శాతం లోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని తిరుపతిరావు కమిటీ సిఫారసు చేసింది. ఇదే అసలు సమస్యగా మారింది. సదుపాయాలపై శాస్త్రీయ అంచనా లేకుండా ఏటా 10 శాతం ఫీజులను పెంచుకునేలా ఎలా సిఫారసు చేశారంటూ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం ప్రశ్నించింది. తాజాగా విద్యాశాఖ వాటిపై ఆలోచనలు మొదలుపెట్టింది. ఆ సిఫారసుల్లోని లోపాలను తొలగించడంతో పాటు పక్కాగా ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్ పరిసర జిల్లాల్లో డీఈవోలతోనూ కమిటీ వేసింది. ఫీజుల నియంత్రణకు ఎలాంటి విధానాలు అవసరమన్న దానిపై పక్కాగా, న్యాయ వివాదాలు తలెత్తకుండా ఎలా చర్యలు చేపట్టాలన్న దానిపై దృష్టి సారించింది. -
శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై సినీ నటుడు శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) బుధవారం స్పందించింది. మౌంట్ లిటేరా జీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. కాగా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని శివ బాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజులు తగ్గించుకోమన్నందుకు ఆన్లైన్ తరగతుల నుంచి తమ పిల్లలను తొలగించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు
-
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు
-
ఆన్లైన్ ఫీ‘జులుం’.. ఐడీ, పాస్‌వర్డ్‌ల నిరాకరణ
సాక్షి, సిటీబ్యూరో: అధికారికంగా విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభమే కాలేదు. అసలు ఈ ఏడాది అవుతుందో.. కాదో? అనే అంశంపై స్పష్టత కూడా రాలేదు. కానీ నగరంలోని పలు కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు మాత్రం ఆన్లైన్ టీచింగ్ పేరుతో తరగతులను ప్రారంభించాయి. పది రోజులైందో లేదో అప్పుడే ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించాల్సిందిగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లించని వారికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల జారీని నిలిపివేస్తున్నాయి. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగుతున్నాయి. తాజాగా హిమాయత్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ స్కూలు యాజమాన్యం ఇదే అంశంపై ఒత్తిడి తీసుకురాగా, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే.. తెలంగాణ వ్యాప్తంగా 34 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో 15 లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నారు. నగరంలో సుమారు 25 ఇంటర్నేషనల్ స్కూళ్లున్నాయి. నాలుగు వేలకుపైగా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. 80 శాతం మంది విద్యార్థులు వీటిలోనే చదువుతున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.రెండు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇక కార్పొరేట్ స్కూళ్లలో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, షూ, యూనిఫాం, స్టేషనరీ అదనం. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం మార్చి 22 నుంచి అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏటా జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది వైరస్ దృష్ట్యా.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అసలు ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందో లేదో చెప్పడం కూడా కష్టమే. కానీ ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు మాత్రం ఇప్పటికే ఆన్లైన్ బోధన పేరుతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. విద్యార్థులకు ‘ఈ’ పాఠాలను తప్పనిసరి చేశాయి. యూనిఫాం వేసుకుంటేనే కంప్యూటర్ ముందు కూర్చోవాలనే నిబంధనలు కూడా పెట్టేశాయి. పాఠశాల వేదికగా పెద్దపెద్ద స్టేషనరీలు తెరిచి, స్కూలు ప్రాంగణంలోనే పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్స్, షూ, యూనిఫాం, స్కూలు బ్యాగులు.. టిఫిన్ బాక్స్‌లు.. ఇలా అన్ని వస్తువులను యథేచ్ఛగా విక్రయిస్తున్నాయి. ఇదే అంశాన్ని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీజులను నిరసిస్తూ హిమాయత్‌నగర్‌లో ఓ స్కూల్ ఎదుట పేరెంట్స్ నిరసన(ఫైల్) పిల్లలకు కంటి, వెన్నెముఖ సమస్యలు.. ఆన్లైన్ క్లాసులతో పిల్లలు మూడు నుంచి నాలుగు గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చొవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వెన్నునొప్పితో పాటు ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూడటంతో కంటిచూపు దెబ్బతింటోంది. చాలామంది విద్యార్థులు తలనొప్పి, వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అంతేకాదు.. టీచర్ చెప్పేది సరిగా అర్థం కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ బోధనలో ఎప్పటికప్పుడు అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తల, వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వస్తున్న పిల్లల సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని నగరానికి చెందిన ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ సుబ్బయ్య స్పష్టం చేశారు. అంతరాలు పెరుగుతాయి రాజ్యాంగం కల్పించిన రైట్ టు ఎడ్యుకేషన్ హక్కును కార్పొరేట్ స్కూళ్లు కాలరాస్తున్నాయి. ఆన్లైన్ పాఠాల పేరుతో సమాజంలో అంతరాలను మరింత పెంచుతున్నాయి. ఈ విధానంతో సంపన్నులకే చదువుకునే అవకాశం ఉంటుంది. పేదలకు నష్టం వాటిల్లుతుంది. విద్యార్థుల మధ్య అంతరాలు పెంచుతున్న ఆన్లైన్ పాఠాలను నిషేధించాలి. ఈ అంశంపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తాం. – వెంకట్, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్‌అసోసియేషన్ ప్రతినిధి సగం జీతాలతో.. ఫీజులెలా కడతాం? మా కూతురు హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూళ్లో చదువుతోంది. వారం రోజులుగా ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు. అప్పుడే ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించాలంటూ ఫోన్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో మా కంపెనీ సగమే జీతమే ఇస్తోంది. ఇలు గడవడమే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే ఫీజులు ఎలా చెల్లించగలం. ఆన్లైన్లో చెప్పే క్లాసులు అర్థం కావడం లేదు. ఏదైనా అనుమానం ఉంటే ఎవరూ నివృత్తి కూడా చేయడం లేదు. – ఓ స్టూడెంట్ తల్లి -
స్మార్ట్ ఫోన్ల కోసం ఇళ్లల్లో పిల్లల లొల్లి..
రామారెడ్డి/దోమకొండ : కరోనా వైరస్ మనిషి జీవన విధానంలో ఏన్నో మార్పులు తెచ్చింది. కరోనా ముందు.. కరోనా తర్వాత.. అన్నట్లుగా మనిషి జీవన విధానం మారిపోయింది. ఇక స్కూళ్ల విషయానికి వస్తే పిల్లలకు స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉంచండి.. రేడియేషన్ కారణంగా పిల్లలకు హాని కలుగుతుందని కూడా ఉద్భోద చేశాయి పాఠశాలలు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ‘‘మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు మా స్కూళ్లో చదువుతున్నారు. ఇద్దరికి ఒకేసారి ఆన్లైన్ తరగతుల టైం టేబులు ఉన్నాయి. వారు ఇద్దరు ఆన్లైన్క్లాస్కు అటెండ్ కావాలంటే మీరు ఇద్దరి పిల్లలకు స్మార్ట్ ఫోనులు ఆరెంజ్ చేయండి. లేదంటే వారు క్లాస్‌లు మిస్ అవుతారు.’’ అంటూ ఇప్పుడు స్కూళ్లే విద్యార్థుల ను స్మార్ట్‌ఫోన్ బాట పట్టిస్తున్నాయి. జిల్లాలో పట్టణ కేంద్రం కామారెడ్డితో పాటు హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలలో జిల్లా విద్యార్థులు చదువుతుంటారు. కామారెడ్డి పట్ణణంలో ఓ విద్యార్థికి వార్షిక ఫీజు సుమారుగా 40వేలు ఉండేది. ఈ విద్యార్థి ప్రస్తుతం ఆరు నుంచి ఏడో తరగతికి వెళ్లాడు. బడులు ఇంకా మొదలు కాలేదు. కరోనా నేపథ్యంలో ఇప్ప ట్లో బడులు తెరిచేది అనుమానమే. ఆన్లైన్లో మాత్రం క్లాస్ లు ప్రారంభించారు. ఏడో తరగతికి ఫీజు నిర్ణయించామని, తొలివిడత ఫీజు చెల్లించాలని, సదరు విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. స్మార్ట్ఫోన్లు కావాలని.. అసలే రైతులకు పెట్టుబడుల కాలం ఇది. మరో వైపు మధ్యతరగతి, నిరుపేదలకు బతుకు బండి లాగడానికే ఇబ్బందిగా మారిన వేళ.. ఆన్లైన్ తరగతుల కోసం ఇంట్లో పిల్లలు స్మార్ట్ ఫోన్లు కావాలంటూ లొల్లి చేస్తున్నారు. రైతులకు పెట్టుబడికి ఖర్చులు లేక, తిండికే ఇబ్బందులు పడుతున్న రోజుల్లో స్మార్ట్ఫోన్లు కోసం డబ్బులు 10నుంచి 20వేల ఎక్కడి నుంచి తేవాలని అవేదన చెందుతున్నారు. విద్యాశాఖ దృష్టి సారించేనా..? కరోనా నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కార్పొరేట్ ప్రైవేటు యాజమాన్యాలు ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నా యి. ఈ క్లాసులకు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవాలని, కనీసం తరగతు లు నిర్వహించిన ఫీజుల విషయంలో జోక్యం చేసుకుని ని యంత్రించాలని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. చిన్న స్కూళ్లకు ఇబ్బందులు ఓ వైపు కార్పొరేట్ స్థాయి పాఠశాలలు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించి, ఫీజులు వసూలు చేస్తోంటే ఎన్నో ఏళ్లుగా స్కూళ్ల నిర్వహిస్తున్న చిన్న స్కూళ్ల యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నారు. అరకొర వసతులతో నానా తంటాలు పడి పాఠశాలల నిర్వహణను నెట్టుకొస్తుండగా ఇప్పుడు ఆన్లైన్లో పెద్ద స్కూళ్లతో పోటీ పడి నిర్వహించడం ఎలా అంటూ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. తమ దగ్గర చదివే పిల్లలకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ లేవని, బడిలోనూ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తగు ఏర్పాట్ల ఇబ్బందేనని, ఆన్లైన్ క్లాస్‌లు ఆర్థికంగా భారంగా మారుతుందని వాపోతున్నారు. తల్లిదండ్రులకు భారం.. ప్రసుత్తం కరోనా వ్యాప్తి అన్ని వర్గాల ప్రజల ఉపాధిపై తీవ్రమైన ప్రభావం చూపింది. కాన్వెంట్ స్కూళ్ల నుంచి కార్పొరేట్ స్కూళ్ల వరకు వివిధ పేర్లతో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఫీజుల పేరుతో పరిస్థితులు బాగున్న రోజుల్లోనే తల్లిదండ్రుల నుంచి ఏటా లక్షల్లో ఫీజులు వసూలు చేశారు. కరోనా నేపథ్యంలో పలు కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్ క్లాస్‌ల పేరుతో కొత్త దందాకు తెరతీశా యి. ప్రస్తుత ఆన్లైన్ తరగతులకు నిర్వహణకు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలపై రేడియేషన్ ప్రభావం స్మార్ట్ఫోన్ల వినియో గంతో రేడియోషన్ ప్రభావంతో పిల్లలు అనారోగ్యం పాలవుతారని.. కానీస భద్రత పా టించకుండా పలు ప్రైవేటు యాజమాన్యాలు ఉ దయం 9 నుంచి మధ్యాహ్నం 1వరకు నడుపుతున్నారు. ఇలా సుమారు 4గంటల పాటు ఆన్లైన్ త రగతులు నిర్వహిస్తే విద్యార్థులకు రేడియేషన్ తో పాటు కళ్లపైన ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. -
స్కూళ్లు తెరుచుకోక.. వేతనాలు రాక
సింగరేణి(కొత్తగూడెం): కరోనా ప్రభావంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 223 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 7వేలమందికి పైగా ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికీ సగటున రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలుంటాయి. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడినప్పటికీ..ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తోంది. మూడు నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఫీజులు నిలిచిపోయాయని, అవి రావాల్సి ఉందని, తిరిగి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యాకనే వేతనాలిస్తామని పలు యాజమాన్యాలు దాటవేస్తున్నట్లు సమాచారం. పాఠశాలల పునఃప్రారంభంపై ఎలాంటి స్పష్టతా లేదు. ప్రస్తుత పరిస్థితిలో సీనియారిటీని కూడా లెక్కలోకి తీసుకోకుండా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్ని యాజమాన్యాలు జూనియర్ ఉపాధ్యాయులను తొలగించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. కేవలం కొందరిని మాత్రమే తిరిగి విధుల్లోకి తీసుకుంటారని ప్రైవేట్ టీచర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రభావంతోనే.. కరోనా ప్రభావంతో లాక్డౌన్ అమలు కావడంతో మార్చి నుంచి అన్నీ బంద్ అయ్యాయి. జీతాలు ఆగిపోయి..చాలామంది ఇబ్బంది పడుతున్నాం. తిరిగి స్కూళ్లు తెరిస్తేనే..ప్రైవేట్ టీచర్లకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.– భాగ్యరాజ్, ప్రైవేటు స్కూల్ టీచర్,కొత్తగూడెం ఇంకా స్పష్టత లేదు.. అరకొర వేతనాలతో పనిచేసిన వారికి ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియట్లేదు. ప్రైవేటు ఉపాధ్యాయులు చాలా కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. – షేక్ అస్లాం, ప్రైవేట్ స్కూల్ టీచర్,కొత్తగూడెం -
ఫీజులుంకు ఫుల్స్టాప్
-
చదువు‘కొనేలా’ మార్చిన ఘనత కేసీఆర్‌దే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వస్తే కామ న్ స్కూల్ విద్యావిధానం తీసుకొస్తానని సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. తన మనుమడు, తన డ్రైవర్ కొడుకు ఒకే పాఠశాలలో చదివే విద్యావిధానం తెస్తానన్న కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారని, ఆయన చెప్పిన కామన్ స్కూల్ విధానం ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని, కార్పొరే ట్ విద్యా విధానానికి పెద్దపీట వేశారని ఆరోపించారు. ‘చదువుకుందాం’నినాదాన్ని కాస్తా ‘చదువుకొందాం’గా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఫీజుల కలెక్షన్ విషయంలో దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. 2007 నుంచి ఇప్పటివరకు దాదాపు 400 శాతం ఫీజు పెరిగిందని చెప్పారు. విద్యాసంస్థలు 5 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉండకూడదన్న నియమాన్ని అతిక్రమించి దాదాపు 70 శాతం లాభాలతో నడుస్తున్న పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను డీటెయిన్ చేస్తున్నారన్నారు. మూడేళ్ల పిల్లలకు బ్యాగు బరువు తప్పడం లేదని, విద్యార్థుల బరువు కంటే వారి బ్యాగే ఎక్కువ బరువుంటోందని అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల వివరాలను తమ యువజన విభాగం సేకరించిందని చెప్పారు. వారంలోగా ఆయా విద్యాసంస్థలు తగిన చర్యలు తీసుకోకపోతే వారి పనిపడతామని లక్ష్మణ్ హెచ్చరించారు. మజ్లిస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని లక్ష్మణ్ ఆరోపిం చారు. గత పాలకులు 60 ఏళ్లలో చేసిన అప్పులని కేసీఆర్ ఆరేళ్లలోనే చేశారన్నారు. మజ్లిస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
‘మజ్లీస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటం తప్పదు’
సాక్షి, హైదరాబాద్ : మజ్లీస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాల గురించి మాట్లాడారు. ‘చదువుకుందాం’ నినాదాన్ని కాస్తా ‘చదువుకొందాం’గా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ వస్తే కామన్ స్కూల్ విధానం తీసుకోస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలికాడన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని తెలిపారు. ఫీజుల నియంత్రణ లేదు.. కార్పొరేట్ విద్యావిధానానికి పెద్ద పీట వేశారని ఆరోపించారు. ఫీజుల కలెక్షన్ విషయంలో దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. 2007 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 400 శాతం ఫీజు పెంపు జరిగిందని పేర్కొన్నారు. విద్యాసంస్థలు 5 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉండకూడదన్న రూల్‌ని అతిక్రమించి దాదాపు 70 శాతం లాభాలతో నడుస్తున్న పాఠశాలలున్నాయని తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను డిటెన్షన్ చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల బరువు కంటే వారి బ్యాగే ఎక్కువ బరువుండటం ఆందోళనకరం అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తోన్న పాఠశాలల వివరాలలు తమ దగ్గర ఉన్నాయని.. వారంలోగా వారు సర్దుకోకపోతే.. వాళ్ల పని పడతామని లక్ష్మణ్ హెచ్చరించారు. అలయన్స్ పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకోవడం సిగ్గు చేటన్నారు. -
ఫీ‘జులుం’.. ప్రైవేటు స్కూళ్ల దండయాత్ర
సాక్షి, సిటీబ్యూరో : ఎల్బీనగర్ సహారా ఎస్టేట్‌కు చెందిన రంగారెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ఆయనకు వచ్చే నెల జీతం రూ.35 వేలు. ఉప్పల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతున్న తన కుమారుడి కోసం చెల్లించిన ఫీజు రూ.45 వేలు. పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం, షూస్.. ఇలా అన్నీ కలిపి మరో రూ.12 వేలు చెల్లించాడు. ఇవి కాకుండా ఇంటి నుంచి ఉప్పల్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం బస్సు ఫీజు రూ.24000. ఇలా తన మూడో తరగతి కొడుకు కోసం జూన్ నెలలో వెచ్చించిన మొత్తం రూ.లక్షకు పైనే. తనకు వస్తున్న జీతానికి, పిల్లాడికి చెల్లించిన ఫీజుకు పొంతనే లేదు. ఇక ఇంటి అద్దె, నిత్యావసరాలు, బైక్‌లో పెట్రోల్, ఇతర ఖర్చులు ఉండనే ఉన్నాయి. ఇది ఒక్క రంగారెడ్డి ఆవేదన మాత్రమే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్షలాది మంది మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల సమస్య. జూన్ వచ్చిందంటే స్కూలుకు వెళ్లే పిల్లలున్న ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోయే పరిస్థితి. వేసవి సెలవుల్లో పిల్లలతో ఆనందంగా గడిపిన క్షణాలు జూన్ వచ్చే సరికి ఆవిరై పోతున్నాయి. ఏటా పెరుతున్న ఫీజులతో మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. కొద్దోగొప్పో సంపాదన ఉన్న కుటుంబాల పరిస్థితే ఇలా ఉంటే.. తక్కువ వేతనాలతో కాలం గడిపై అసంఘటిత కార్మికులు, చిరుద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇద్దరు పిల్లలున్న తల్లిదడ్రులు పిల్లల చదువుల కోసం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆరువేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిలో 1200 పైగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లు కొనసాగుతున్నాయి. ఆయా స్కూళ్లలో చదువు కుంటున్న లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఆయా యాజమాన్యాలు ఫీజుల పేరిట దండయాత్ర మొదలెట్టాయి. హైదరాబాద్‌లోనే అత్యధిక ఫీజులు సీబీఎస్ఈ స్కూళ్లలో సగటు వార్షిక ఫీజులో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా ఎక్కువ. చెన్నైలో రూ.40 వేలు ఉంటే, బెంగళూరులో రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు ఉంది. న్యూఢిల్లీలో రూ.60 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సీబీఎస్ ఈ పాఠశాలల్లో ఏకంగా రూ.60 వేల నుంచి రూ.4.50 లక్షలకు పైగా ఉండడం గమనార్హం. నిజానికి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే స్కూలు భవనాల అద్దెలు, ఉపాధ్యాయుల వేతనాలు తక్కువ. వాటితో పోలిస్తే ఫీజులు కూడా తక్కువగా ఉండాలి. కానీ దేశరాజధాని ఢిల్లీ కంటే ఎక్కువగా వసూలు చేస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అటకెక్కిన ప్రొ.తిరుపతిరావు కమిటీ సూచనలు అడ్డగోలు ఫీజుల పెంపుపై ప్రభుత్వం 2016లో ఉస్మానియా మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యాబోధన ఆధారంగా ఆయా పాఠశాలలను ‘ఎ,బి,సి’ గ్రేడ్లుగా విభజించి 2017లో కమిటీ నివేదిక సమర్పించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల మేరకు ఏటా పది శాతం ఫీజులు పెంచుకోచవ్చని సూచించింది. అయితే కార్పొరేట్ యాజమాన్యాలకు ఇది కూడా మింగుడుపడలేదు. కోర్టును ఆశ్రయించి అమలు ఆదేశాలను నిలుపదల చేయించి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అవి ఫక్తూ వ్యాపార కేంద్రాలు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏ స్కూలైనా ఐదు శాతం కంటే ఎక్కువ లాభాలు పొందడానికి వీల్లేదు. స్కూళ్లను ఏర్పాటు చేసిన సమయంలోనే ఎలాంటి లాభాపేక్ష లేకుండా, సామాజిక సేవే లక్ష్యంగా స్కూళ్లను స్థాపిస్తున్నట్లు అఫిడవిట్ సమర్పిస్తాయి. కానీ వాస్తవంలో మాత్రం ఫక్తూ వ్యాపార కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులో 50 శాతం ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి. కానీ ఏ ఒక్క యాజమాన్యం 20 శాతానికి మించి వేతనాలుగా వెచ్చించడం లేదు. కానీ విద్యార్థుల నుంచి ఏటా 20 నుంచి 35 శాతం ఫీజులు పెంచుతూనే ఉన్నాయి. నిజానికి ఫీజులు పెంచాలంటే జీఓ నెంబర్ 42 ప్రకారం జిల్లా ఫీజుల క్రమబద్ధీకరణ కమిటీ అనుమతి తీసుకోవాలి. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నాయి. పుస్తకాలు, యూనిఫాంలను తమ వద్దే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. పాఠశాల ఆవరణలోనే స్టేషనరీ కౌంటర్లు తెరిచినా పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. -
‘టీఆర్ఎస్ పని శూన్యం.. ప్రచారం ఘనం’
సాక్షి, హైదారాబాద్: ‘తెలంగాణలో విద్యను వ్యాపారంగా మార్చారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపైన చర్యలు తీసుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని* కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరితో విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తితో ఉన్నారని పొంగులేటి పేర్కొన్నారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడమే పరమావధిగా మారిన ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో ప్రభుత్వం..! కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. వాటి నియంత్రణపై రూపొందించిన నియమ నిబంధనలు, జీఓలను ప్రభుత్వం కావాలనే అటకెక్కించిందని ఆయన ధ్వజమెత్తారు. సీఎం స్పందించాలి.. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని పొంగులేటి అన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రచారం కల్పించుకొనే ప్రభుత్వానికి... చిత్తశుద్ధి ఉంటే ఫీజుల నియంత్రణపై వెంటనే కార్యాచరణ రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ సాధిస్తామని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారి ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ అండతోనే ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ
హైదరాబాద్: ప్రభుత్వ అండతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల దోపిడీని కొనసాగిస్తున్నాయని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు విమర్శించారు. ‘ఫీజుల పెంపుదలతో తల్లిదండ్రులపై జరుగుతున్న దోపిడీ, విద్యాప్రమాణాల పతనం’అనే అంశంపై పేరెంట్స్ అసోసియేషన్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన తిరుపతిరావు కమిషన్ సిఫార్సులను పక్కనపెట్టి ప్రైవేట్ యాజమాన్యాలు ఏటా ఫీజులు పెంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలను ఫీజుల నియంత్రణ కోసం కాకుండా ఫీజుల రద్దు కోసం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యను రద్దు చేసి ప్రభుత్వమే ఉచిత నిర్భంద విద్యను అమలు చేయాలని సూచించారు. ఆర్థోపిడీషియన్ డాక్టర్ ఆసిఫ్ అనీఫ్ మాట్లాడుతూ.. విద్యా సంస్థల విధానాల వల్ల పుస్తకాల బరువుతో చిన్నారుల్లో స్సైనల్, భుజం నొప్పి వస్తున్నాయని, ఇది గూని సమస్యకు దారితీసే అవకాశం ఉందన్నారు. డాక్టర్ సత్తార్‌ఖాన్ మాట్లాడుతూ.. ఒక దేశం భవిష్యత్తు నిర్ణయించేది విద్యారంగమేనని కానీ దురదృష్టవశాత్తూ నేటి ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యాపారీకరణ కారణంగా ప్రైవేటు రంగంలోకి నెట్టబడుతుం దన్నారు. పీఏసీసీ సభ్యులు తేజ మాట్లాడుతూ, రాజ్యాంగాలు కల్పించిన ఉచిత నిర్బంధ విద్యను అన్ని ప్రభుత్వాలు ఉల్లంఘించాయన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ స్కూళ్లలో పాత ఫీజులే
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో 2018–19లో పాత ఫీజులనే కొనసాగించాలని, అన్ని యాజమాన్యాల స్కూళ్లలో ఫీజులపై స్టేటస్ కో కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనందున పాత ఫీజులను కొనసాగిం చాలని పేర్కొంది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పాఠశాల విద్యాశాఖ అధికారులకు మెమో జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆర్జేడీలు, డీఈవోలు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు నర్సరీ/ప్రీప్రైమరీ/ఎల్కేజీ/1వ తరగతిలో ప్రవేశాలకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పాత ఫీజు లను కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయించడం లేదు. నియంత్రించడం లేదు. అయితే, ఇప్పుడు పాత ఫీజులను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
స్కూళ్ల వారీగానే ఫీజులు!
- ఆదాయ వ్యయాలను బట్టే నిర్ధారించాలని ప్రాథమిక నిర్ణయం - జీవో 1 నిబంధనల్లో మార్పులు చేయండి - నియంత్రణ కమిటీకి విజ్ఞప్తి చేసిన ప్రైవేటు యాజమాన్యాలు - నిబంధనలు కఠినంగా ఉండాలన్న తల్లిదండ్రుల సంఘాలు - రేపు మరోసారి భేటీ.. 20న ప్రభుత్వానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఫీజులను ఆయా పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టే నిర్ధారించాలని ఫీజుల నియంత్రణ కమిటీ భావి స్తోంది. వృత్తి విద్యా కాలేజీల తరహాలోనే పాఠశాలల ఆదాయ, వ్యయాలపై కిందటి సంవత్సరపు ఆడిట్ నివేదికల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తేనే శాస్త్రీ యంగా ఉంటుందన్న యోచనకు వచ్చింది. దీనిపై ఈ నెల 6న ఒకసారి, తరువాత మరోసారి సమా వేశమై చర్చించాలన్న నిర్ణయానికి వచ్చింది. మొత్తం గా ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై తుది నివేదికను సిద్ధం చేసి.. ఈ నెల 20 లోగా ప్రభుత్వ ఆమోదానికి పంపించనుంది. నిబంధనలు మార్చండి.. స్కూలు ఫీజుల నియంత్రణ కోసం ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ మంగళవారం పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయంలో భేటీ అయింది. తల్లిదండ్రుల సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపింది. స్కూలు ఫీజుల నియంత్రణకు జీవో నంబర్ 1లోని నిబంధనలను యథాతథంగా అమలు చేయవద్దని, వాటిలో మార్పులు చేయాలని ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల నియంత్రణ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. ఆ జీవో ప్రకారం పాఠశాలలకు ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50 శాతాన్ని టీచర్ల వేతనాలకు, 15 శాతం పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు, మరో 15 శాతం పాఠశాల నిర్వహణకు, ఇంకో 15 శాతం నిధు లను టీచర్లు, సిబ్బంది సంక్షేమం కోసం వెచ్చిం చాలని... యాజమాన్యాలు కేవలం 5 శాతం సొమ్ము నే లాభంగా తీసుకోవాలన్న నిబంధనను మార్చాలని కోరాయి. యాజమాన్యాల లాభం మొత్తాన్ని 5 శాతం నుంచి పెంచాలని, సంక్షేమానికి వెచ్చించాల్సిన 15 శాతంలో మార్పులు చేయాలన్నాయి. రూ.40 వేల గరిష్ట ఫీజుల విధానం ఉండాలని, ప్రాంతాలను బట్టి 5 కేటగిరీలుగా నిర్ణయించాలని కోరాయి. ఆదాయాన్ని బట్టే ఫీజులుండాలి.. ఆదాయ వ్యయాలను బట్టే స్కూల్ ఫీజులను నిర్ణ యించాలని తల్లిదండ్రుల సంఘాలు కమిటీని కోరా యి. వాటిని పరిశీలించి నిర్ణయించే జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలకు (డీఎఫ్‌ఆర్‌సీలకు) చట్టబద్ధత కల్పించాలని సూచించాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కమిటీ చైర్మన్ తిరుపతిరావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రైవేటు స్కూళ్ల ప్రకటనలు నిషేధించా లని.. కరపత్రాలు పంచుకోవచ్చని, యూజర్ చార్జీలు ఆప్షన్స్గానే ఉండాలని, రూ.500 మించిన ఫీజుల చెల్లింపును ఆన్లైన్లో లేదా బ్యాంకు చెక్కు ద్వారానే చేయాలని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే స్కూళ్ల గుర్తింపు రద్దు చేసి.. వాటిలోని విద్యార్థులను దగ్గరలోని స్కూళ్లలో చేర్పించాలని, గతంలో మాదిరిగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుంచే ప్రారం భించాలని.. ఇలా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశాలకు తల్లిదండ్రుల సంఘా లు అంగీకరించగా, ప్రైవేటు యాజమాన్యాల ప్రతిని ధులు వ్యతిరేకించారు. సమావేశంలో పాఠశాల విద్య కమిషనర్ కిషన్, అదనపు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రైవేటు యాజమాన్య ప్రతినిధులు శ్రీనివాస రెడ్డి, ఎస్‌ఎన్‌రెడ్డి, తల్లిదండ్రుల సంఘాల ప్రతిని ధులు నాగటి నారాయణ పాల్గొన్నారు.