సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో 2018–19లో పాత ఫీజులనే కొనసాగించాలని, అన్ని యాజమాన్యాల స్కూళ్లలో ఫీజులపై స్టేటస్ కో కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనందున పాత ఫీజులను కొనసాగిం చాలని పేర్కొంది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పాఠశాల విద్యాశాఖ అధికారులకు మెమో జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆర్జేడీలు, డీఈవోలు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు నర్సరీ/ప్రీప్రైమరీ/ఎల్‌కేజీ/1వ తరగతిలో ప్రవేశాలకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పాత ఫీజు లను కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయించడం లేదు. నియంత్రించడం లేదు. అయితే, ఇప్పుడు పాత ఫీజులను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment