tirupati rao
-
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
సాక్షి, నెట్వర్క్: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన 200 కుటుంబాలు టీడీపీని వీడి మంగళవారం గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి నుంచి టీడీపీకి చెందిన పలువురు యువత తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. విస్సన్నపేట మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కి చెందిన టీడీపీ మైనార్టీ నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడ టీడీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ ఆధ్వర్యంలో 50 మంది ముస్లీం మైనార్టీ నేతలు, మహిళలు పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బిళ్లు కృష్ణమూర్తి కుమారులైన బిళ్లు బ్రదర్స్‌గా పిలువబడే బిళ్లు నర్సింహరావు, బిళ్లు అన్నవరం, యర్రంశెట్టివారిపాలెం గ్రామం పూతినీడివారిపాలెంలో జనసేన, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యే ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పాలకొల్లులోని 18వ వార్డు బెత్లహాంపేటలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, యలమంచిలి మండలంలోని అడవిపాలెం పంచాయతీ గగ్గిపర్రుకు చెందిన టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సమక్షంలో పార్టీలో చేరారు. భీమవరానికి చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు, 100 మందికిపైగా నాయి బ్రాహ్మణులు, చిన ఆమిరం, భీమవరంలోని అప్పారావు తోట, నరసయ్య అగ్రహారం ప్రాంతాలకు చెందిన 50 మంది క్షత్రియులు, భీమవరం 18వ వార్డుకు చెందిన ముస్లిం సోదరులు వార్డు మాజీ కౌన్సిలర్ కోడె యుగంధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్పీలో చేరారు. ఏలూరు జిల్లా సీతంపేటలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంపీ కోటగిరి శ్రీధర్ సమక్షంలో సీతంపేట జనసేన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సమక్షంలో గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. నంద్యాలలోని 36వ వార్డు సంజీవనగర్ ఏరియా నుంచి 200 కుటుంబాలు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. -
ప్రైవేట్ స్కూళ్లలో పాత ఫీజులే
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో 2018–19లో పాత ఫీజులనే కొనసాగించాలని, అన్ని యాజమాన్యాల స్కూళ్లలో ఫీజులపై స్టేటస్ కో కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనందున పాత ఫీజులను కొనసాగిం చాలని పేర్కొంది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పాఠశాల విద్యాశాఖ అధికారులకు మెమో జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆర్జేడీలు, డీఈవోలు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు నర్సరీ/ప్రీప్రైమరీ/ఎల్కేజీ/1వ తరగతిలో ప్రవేశాలకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పాత ఫీజు లను కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయించడం లేదు. నియంత్రించడం లేదు. అయితే, ఇప్పుడు పాత ఫీజులను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్ : కోర్టు ఆదేశాల్ని ఉద్దేశ పూర్వకంగా అమలు చేయలేదని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తహసీల్దార్ టి.తిరుపతిరావుకు హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధించింది. దీనిపై తహసీల్దార్ అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరు వారాలపాటు నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్.రామచంద్రరావు బుధవారం తీర్పు వెలువరించారు. తహసీల్దార్ తిరుపతిరావు ఇతర రెవెన్యూ అధికారులపై 2014లో లింగమయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులో న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు 2009 నాటి రిట్లో పేర్కొన్న ఆస్తులను లింగమయ్య అనే వ్యక్తి పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని (మ్యుటేషన్) శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని, ఆస్తులను లింగమయ్య పేరిట మార్చాకే సదరు ఆస్తులు కొనుగోలు చేసిన వారుంటే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించడానికి హైకోర్టు వీలు కల్పించింది. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో లింగమయ్య కోర్టు ధిక్కార కేసు దాఖలు చేశారు. తహసీల్దార్ కావాలనే మ్యుటేషన్ చేయలేదని పేర్కొన్న న్యాయమూర్తి.. తిరుపతిరావుకు జైలు శిక్ష, జరిమానా విధించారు. -
నీటిగుంటలో పడి ఇద్దరు బాలుర మృతి
గంపలగూడెం మండలం వినగడప పంచాయతీ లంబాడీతండాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన రాజశేఖర్(14), తిరుపతి రావు(12) అనే ఇద్దరు బాలురు నీటి గుంటలో పడి మృతిచెందారు. ఒకరి రక్షించబోయి మరొకరు మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అగ్రీగోల్డ్ బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలి
- ఆత్మహత్య చేసుకున్న మృతులకు పిండ ప్రధానం గుణదల అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధిత మృతులకు మంగళవారం ఉదయం పద్మావతి ఘాట్‌లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో పిండ ప్రధాన కార్యక్రమం జరిగింది. బాధితుల సంఘం ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి వి. చంద్రశేఖర్ తదితరులు పిండ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధిత డిపాజిటర్లు మొత్తం 20 లక్షల మంది ఉన్నారని, అందులో 3 లక్షల మంది ఏజట్లు ఉన్నారని వీరంతా ప్రభుత్వ జోక్యం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. 100 మందికి పైగా బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని, వీరందరికీ తమ సంఘం తరఫున పిండ ప్రధానం చేస్తున్నామని తెలిపారు. అగ్రిగోల్డ్ చేసిన ఆర్థిక కుంభకోణానికి డిపాజిటర్లు బలైపోతున్నారని, ప్రభుత్వం ఆదుకుని డిపాజిటర్లకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. డిపాజిట్ దారులను ఆదుకునేందుకు రూ.100 కోట్లు విడుదల చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ప్రతి నెలరూ. 1000 కోట్ల అస్తుల వేలం వేయటానికి చర్యలు తీసుకోవాలని, అలాగే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల జాబితాను ఆన్లైన్లో పొందుపరచి, కొంత ఏజంట్లకి బాండ్ల రూపంలో నగదును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు షరీఫ్, వెంకటేష్, టి. పెద్ద వెంకటేశ్వర్లు, కే.ఆర్ ఆంజనేయులు, ఆర్. పిచ్చయ్య, పటేల్ శ్రీనివాసరెడ్డి, మూనంపాటి సుబ్బలక్ష్మీ, ఆంజనేయులు, కాంత్రి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిగారి బరితెగింపు
తన మాట వినని ఇరిగేషన్ అధికారుల బదిలీ వరదల సమయంలో వద్దని చెప్పినా వీడని పట్టు ఓ బడా కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకు అధికార దుర్వినియోగం రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఓ మంత్రికి కోపమొస్తే అధికారుల బదిలీ ఓ లెక్కా! తనకు సంబంధం లేని శాఖలో చొరబడి మరీ అడ్డగోలు బదిలీలకు కారణమయ్యారు మన జిల్లా మంత్రి. ప్రజా సంక్షేమానికి అధికారాన్ని ఉపయోగించాల్సిన ఆయన పంతం నెగ్గించుకోవడానికి జనాన్నే ప్రమాదంలోకి నెట్టే చర్యకు పాల్పడ్డారు. వరదలు వచ్చే అవకాశమున్న ఈ సమయంలో కీలకమైన అధికారుల బదిలీ తగదని ఉన్నతాధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా తన మాట వినని వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు. కాకినాడ :‘ఆ అధికారిని సాగనంపాల్సిందే...మంత్రిగా చెబుతున్నా ఆ మాత్రం పనిచేయలేరా... లేదంటే నా పరువు ఏం కావాలి...’ ‘వచ్చే మూడు నెలలు చాలా క్రూషియల్ సర్...వరదలు వచ్చే సమయం..అనుభవం ఉన్న అధికారులుండాలి కదా...కనీసం ఇన్‌చార్జిగానైనా కొనసాగిద్దాం..పంపేస్తే ఇబ్బంది సర్...’ ధవళేశ్వరం నీటిపారుదలశాఖ ఎస్ఈ బదిలీ వ్యవహారంలో కేబినెట్లో ఒక మంత్రి, ఇరిగేషన్ ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చ ఇది. ధవళేశ్వరం ఇరిగేషన్ ఎస్ఈ ఎస్.సుగుణాకరరావు, ఈఈ తిరుపతిరావును ఈనెల 22న బదిలీ చేశారు. ఎస్ఈని తుని ఎల్ఎంసీ (లెఫ్ట్ మెయిన్ కెనాల్- పోలవరం)కి, తిరుపతిరావును విశాఖకు బదిలీ చేశారు. ఈఈ ఇక్కడకు వచ్చి నాలుగేళ్లు పైనే అయింది. ఎస్ఈ వచ్చి రెండున్నరేళ్లు. ఈ రెండు పోస్టులు గోదావరి వరదల సమయంలో చాలా కీలకం. ఒకటో ప్రమాద హెచ్చరిక సమయంలో ఈఈ, మూడో ప్రమాద హెచ్చరికప్పుడు ఎస్ఈ ఫ్లడ్ కన్జర్వేటర్లుగా వ్యవహరిస్తారు. అనుభవం ఉన్న ఇద్దరినీ ఒకేసారి వరదలు వచ్చే తరుణంలో బదిలీ చేయడమంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. అందుకే వీరిని బదిలీ చేయవద్దని జిల్లా యంత్రాంగం నీటిపారుదలశాఖ కార్యదర్శికి నివేదిక సమర్పించింది కూడా. అయితే ఇవేమీ పట్టించుకోకుండా కేవలం రాజకీయ కారణాలతో వారిని సాగనంపాలనే ప్రయత్నాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయని ఇరిగేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రికి కోపం ఎందుకొచ్చిందంటే... కోనసీమలో రాజోలు ప్రాంతానికి చెందిన ఒక బడా కాంట్రాక్టర్‌తో ఆ మంత్రికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన గ్రోయిన్స్ పనులు చేశారు. వాటికి సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మంజూరు చేయాలని కాంట్రాక్టర్ రెండు నెలలుగా తిరుగుతున్నారు. చివరకు మంత్రి ద్వారా ఇరిగేషన్ అధికారులకు సిఫార్సు కూడా చేయించుకున్నారు. కానీ పనుల నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతోంది. కమిటీ నివేదిక వచ్చే వరకు బిల్లులు మంజూరు చేసే అవకాశం లేదని ఇరిగేషన్ అధికారులు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని ఆ కాంట్రాక్టర్ మంత్రి ముందుంచారు. ఆ మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. తాను చెప్పిన వారికే పనులు చేయకుంటే ఎవరికి మాత్రం పనులు చేస్తారంటూ ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. ఆ క్రమంలోనే ఎస్ఈ, ఈఈల బదిలీలపై ఆ మంత్రి పంతం పట్టారు. ఉన్నతాధికారుల మాటా భేఖాతరు వరదలు ముంచుకొస్తున్న తరుణంలో కదపడం సరికాదని ఇరిగేషన్ ఉన్నతాధికారులు సైతం వాదించారని సమాచారం. ఎస్ఈ సుగుణాకరరావు స్థానంలో హైదరాబాద్‌లో నీటిపారుదలశాఖ హెడ్‌క్వార్టర్స్‌లో ఇటీవల ఎస్ఈగా పదోన్నతి వచ్చిన అధికారిని నియమించాలని మంత్రి పట్టుబట్టారని తెలిసింది. ఇందుకు సెక్రటరీ స్థాయిలో సానుకూలత లభించకపోవడంతో, మంత్రి అహం దెబ్బతిని ఎట్టి పరిస్థితుల్లోను ఎస్ఈని సాగనంపాల్సిందేనని పట్టుబట్టడంతో చేసేది లేక పరిపాలనా సౌలభ్యం పేరుతో అధికారులు ఎస్ఈని తుని బదిలీ చేశారు. సొంత శాఖలో కింది స్థాయి ఉద్యోగుల బదిలీలలో కూడా ఆయన మాట చెల్లదని జిల్లాలో ఆ మంత్రిగారికి పేరుంది. అటువంటిది మరోశాఖలో అధికారుల బదిలీకి పట్టుబట్టి పంతం నెగ్గించుకోవడం విశేషం. వరదల సీజన్ పూర్తి అయ్యేవరకైనా ఎస్ఈని ఇన్చార్జిగా కొనసాగించాలని నీటిపారుదలశాఖపై అవగాహన ఉన్నవారు కోరుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం, లంక గ్రామాలు ఎక్కువగా ఉన్న జిల్లా. ఈ సీజన్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని సీడబ్ల్యూసీ హెచ్చరికలు కూడా ఉన్నాయి. 534 కిలోమీటర్ల ఏటిగట్టులో 459 కిలోమీటర్లు పటిష్టం చేశారు. మిగిలిన ఏటిగట్టు వరదల గండాన్ని ఎదుర్కోగలదో లేదో తెలియని పరిస్థితి. బ్యారేజ్‌పై 261 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం 41 మంది మాత్రమే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న నీటిపారుదలశాఖ అధికారులు ఉండాలి. కానీ ఒక మంత్రికి కోపం వచ్చిందని వరదల సమయంలో కీలక అధికారులను సాగనంపడం సమంజసమా అనేది జిల్లా ఇన్చార్జి మంత్రి, సంబంధిత శాఖా మంత్రి అయిన దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచించాలి. -
పులిపాడులో మొసలి కలకలం
గుంటూరు జిల్లా గురజాల మండలలోని పులిపాడు గ్రామంలో మొసలి కలకలం రేపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పులిపాడు గ్రామ సరిహద్దులో బ్రిడ్జి దగ్గర కొన్నిరోజుల నుంచి ముసలి సంచరిస్తూ కోతులను, లేగదూడలను తింటున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. అనంతరం అటవీ శాఖకు సమచారం అందించడంతో ఆ శాఖ అధికారులు స్థానికుడు జమ్మిగుంపుల రాంబాబు సహకారంతో జేసీబీ ద్వారా తవ్వించారు. వాగుకట్టలో 25 అడుగుల సొరంగంలో మొసలి బయట పడింది. మెసలిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. మొసలిని పట్టుకొని దగ్గరలో ఉన్న కృష్ణానదిలో వదిలిపెడతామని ఫారెస్టు రేంజ్ అధికారి కె.రామిరెడ్డి తెలిపారు. ఫారెస్టు డిఫ్యూటిరేంజ్ అధికారి జి.రాజశేఖర్ గౌడ్, ఫారెస్టు బీట్ అధికారి ఆర్వీఎస్ తిరుపతిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలు దుర్మార్గం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. ఉద్యోగాల తొలగింపు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇకనైనా తీరుమార్చుకోవాలని, వారి సంక్షేమానికి చొరవ చూపాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో భాగంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఇందిర కాంతి పథం, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్‌ను ముట్టడించి మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బైవిరి కృష్ణమూర్తి, సీఐటీయూ అధ్యక్షుడు తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ టీడీపీ హాయంలో గడచిన ఆరు నెలలుగా రాష్ట్రంలో కాంట్రాక్టు- అవుట్ సోర్సింగ్, స్కీం వర్కర్ల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న కార్మికుల టీడీపీ ప్రభుత్వం పొట్టకొడుతోందని, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులను ఇప్పటికే తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇందిర కాంతి పథం, ఆశ వర్కర్లు, అంగన్వాడీలపై రాజకీయ నాయకులు వేధింపులు పెరుగుతున్నాయని, కనీస భద్రత కరువైందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక ప్రభుత్వంగా మారడమే కాకుండా, కార్పొరేట్, బూర్జువా నాయకులకు వత్తాసుగా నిలుస్తోందని దుయ్యబట్టారు. పేద మహిళల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఐకేపీ సీఎఫ్‌లకు 18 నెలలుగా వేతనాలు చెల్లించడంలేదని, దీనిపై మూడు నెలలుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం చలించడం లేదని, అధికార గర్వంతో మహిళా సంక్షేమం విస్మరిస్తోందని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంచాలని, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం చర్యల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం వంట కార్మికులు 13 నెలల బిల్లులు చెల్లించాలని, ఆశ కార్యకర్తలకు కేవలం రూ.400 ఇచ్చే పారితోకాన్ని ఇకనైనా పెంచాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నమ్మి ఓట్లు వేసిన చిరుద్యోగులను, ప్రజలను ప్రభుత్వం నట్టేట ముంచుతోందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల, స్కీం వర్కట్ల సమస్యల పరిష్కారం సకాలంలో జరగకపోతే, ప్రజలను చైతన్యపరిచి, ప్రజాఉద్యమం తీసుకువస్తామని, రాక్షసపాలనను అంతమొందిస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాను సందర్శించిన డీఆర్వో హేమసుందర వెంకటరావు మాట్లాడుతూ ప్రధాన డిమాం డ్లు ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. దీంతో ధర్నాను ముగించారు. మహాధర్నాలో సుమారు 1800 మంది మహిళలు వచ్చారు. వారు కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నారు. కేవీపీఎస్ కార్యదర్శి డి.గణేష్, చలపతిరావు, అమ్మన్నాయుడు, పంచాది అరుణ, నాగమణి, హిమప్రభ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల సంఘీభావం కార్మిక సంఘాల ధర్నాకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు సంఘీబావం తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు డోల జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కిల్లి రామమోహన్‌రావు, చౌదరి సతీష్, ప్రసాద్, గంజి ఎజ్రా తదితరులు పాల్గొన్నారు. -
బస్సు కింద పడి ఇన్స్పెక్టర్ మృతి
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఎక్కబోతూ ఓ ఇన్స్పెక్టర్ బస్సు కిందపడి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేబీఎస్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వరంగల్ రేంజ్ సీఐడీలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిరావు(48) కరీంనగర్ వెళ్లడానికి బుధవారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో జేబీఎస్‌కు వచ్చారు. అదే సమయంలో జేబీఎస్ బయటిదారిలో కరీంనగర్ డిపో-1కు చెందిన ఏపీ29జడ్-1779 బస్సు వస్తోంది. ఆ బస్సు ఎక్కడానికి తిరుపతిరావు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫుట్‌బోర్డు నుంచి కాలు జారడంతో బస్సు వెనుక టైర్ల కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. తిరుపతిరావు స్వస్థలం కరీంనగర్ జిల్లా గోదావరిఖని. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సాలూరు టీడీపీలో లొల్లి!
సాలూరు : సాలూరు మున్సిపాలిటీలో ఆధిక్యం సాధించిన టీడీపీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠా న్ని కైవసం చేసుకున్నా... వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో ఇంకా కొలిక్కి రాలేకపోతోంది. మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 17 స్థానాలలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా, 9 వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, మిగిలిన మూడు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో ఆ పార్టీ పెద్దలు ఒక నిర్ణయూనికి రాలేకపోతున్నారు. వైస్ చైర్మన్ పదవి కోసం ప్రధానంగా ఇద్దరు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతి రావు తన భార్య శ్యామలకు ఆ పదవిని కట్టబెట్టాలని పట్టుబడుతుండగా, వైస్ చైర్మన్ పదవిని తనకు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని..ఇచ్చిన మాటను నిలుపుకోవాలని మరో సీనియర్ కౌన్సిలర్ కాకి పాండురంగారావు పట్టుబడుతున్నారు. తన భార్యకు పదవి ఇవ్వకపోతే పార్టీ పట్టణ అధ్యక్ష పదవిని చేపట్టలేనని ఆ పార్టీ నాయకుల ఎదు ట నిమ్మాది స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే పాండు రంగారావు మాత్రం తనకు వైస్ చైర్మన్ ఇవ్వకపోతే పార్టీని వీడేందుకు కూ డా వెనుకాడనని తెగేసి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన హెచ్చరికలను పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. దీంతో ఆయన మద్దతుదారులను సమీకరిస్తున్నట్టు భోగట్టా. కాగా వైస్ చైర్మన్ ఎంపికలో ప్రతిసారీ అనూహ్యంగా మార్పులు, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2005లో చైర్పర్సన్ గా ముగడ గంగమ్మ ఎన్నిక కాగా వైస్ చైర్మన్‌గా ముందు పువ్వల నాగేశ్వరరావు పేరును ప్రతి పాదించారు. ఆఖరి నిముషంలో గొర్లె మధుసూదనరావు తెరపైకి వచ్చారు. అంతకుముం దు జరజాపు ఈశ్వరరావు పాలకవ ర్గంలో కొల కోటి సూర్యనారాయణను వైస్ చైర్మన్‌గా నిర్ణయిస్తే, అనూహ్యంగా గిరి రఘు పదవి చేపట్టా రు. అంతకన్నా ముందు కేతిరెడ్డి గాయత్రిదేవి పాలకవర్గంలో చూస్తే వైస్ చైర్మన్‌గా జరజాపు సూరిబాబు పేరును నిర్ణయిస్తే పువ్వల నాగేశ్వరరావును ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ కొన సాగుతోంది. -
ఆటో డ్రైవర్ నిజాయితీ..
ప్రయాణికుడి నగల బ్యాగును తిరిగి ఇచ్చిన వైనం కల్లూరు, న్యూస్‌లైన్: తన ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన రెండులక్షల రూపాయల విలువైన నగల బ్యాగును ఆటో డ్రైవర్ భద్రపరిచి తిరిగి ఇచ్చేయగా అందరూ అభినందించారు. వివరాలు.. ఖమ్మం నగరానికి చెందిన తవిడిశెట్టి రాఘవరావు.. బంధువుల వివాహం కోసం కృష్ణా జిల్లా తిరువూరు వెళ్లేందుకు ఖమ్మంలో ఆర్టీసీ బస్సు ఎక్కి కల్లూరులో దిగాడు. అక్కడి నుంచి తిరువూరు వెళ్ళేందుకు బస్సు లేకపోవడంతో ఆటో (డ్రైవర్ పేరు దాసరి తిరుపతిరావు) ఎక్కి కూర్చున్నాడు. అది బయల్దేరడం ఆలస్యమవుతుందని గ్రహించి.. హడావుడిగా దిగేసి మరో ఆటో ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లాక, తన బ్యాగును మొదట ఎక్కిన ఆటోలోనే మరిచిపోయిన విషయం గుర్తుకొచ్చింది. అతడు వెంటనే ఆటో దిగి, కల్లూరులోని పరిచయస్తులకు ఫోన్ చేసి విషయం చెప్పి, ఆటో డ్రైవర్ ఆనవాళ్లు చెప్పాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాను కూడా మరో ఆటోలో కల్లూరుకు చేరుకున్నాడు. థ్యాంక్ గాడ్.. నగలతో కూడిన ఆ బ్యాగు క్షేమంగానే ఉంది...! దానిని ఆటో డ్రైవర్ దాసరి తిరుపతిరావు గమనించి, తిరిగి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే స్వంతదారుడు రావడంతో.. ఆటో యూనియన్ అధ్యక్షుడు ఖమ్మంపాటి శ్రీనివాసరావు, కోశాధికారి ముజీమ్ సమక్షంలో ఆయనకు ఆ బ్యాగును అందజేశాడు. ఈ విషయం తెలుసుకున్న సాటి డ్రైవర్లు, స్థానికులు... నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచావంటూ దాసరి తిరుపతిరావును మనసారా అభినందించారు.