బస్సు కింద పడి ఇన్‌స్పెక్టర్ మృతి | The inspector found dead lying under the bus | Sakshi
Sakshi News home page

బస్సు కింద పడి ఇన్‌స్పెక్టర్ మృతి

Published Thu, Dec 18 2014 1:56 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

The inspector found dead lying under the bus

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఎక్కబోతూ ఓ ఇన్‌స్పెక్టర్ బస్సు కిందపడి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేబీఎస్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వరంగల్ రేంజ్ సీఐడీలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిరావు(48) కరీంనగర్ వెళ్లడానికి బుధవారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో జేబీఎస్‌కు వచ్చారు.

అదే సమయంలో జేబీఎస్ బయటిదారిలో కరీంనగర్ డిపో-1కు చెందిన ఏపీ29జడ్-1779 బస్సు వస్తోంది. ఆ బస్సు ఎక్కడానికి తిరుపతిరావు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫుట్‌బోర్డు నుంచి కాలు జారడంతో బస్సు వెనుక టైర్ల కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. తిరుపతిరావు స్వస్థలం కరీంనగర్ జిల్లా గోదావరిఖని. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement