Functions
-
ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో మేనేజర్‌గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది. ‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను. ఈవెంట్స్‌కి స్టీల్ గిన్నెల రెంట్ మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్‌తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్‌కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్‌షాప్స్‌లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. హస్తకళాకారుల నుంచి.. నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్‌లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను. గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను. ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్‌స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్‌లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను. కార్పోరేట్ కంపెనీలలో వర్క్‌షాప్స్ కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్‌ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్‌షాప్స్ ఉంటాయి. అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకల్లేవ్!
దేశం మొత్తం(ఆ రాష్ట్రం మినహాయించి) అంగరంగ వైభవంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. కానీ, పరిస్థితులు ఆ రాష్ట్రాన్ని జెండా పండుగకు దూరంగా ఉంచేశాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని కుంభవృష్టితో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సైతం మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రమాద ఘటనల్లో 55 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై తన ప్రసంగంలో ఈ అంశాన్ని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. ఊహించని స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని చెప్పారు. బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విపత్తు నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు. Visual of Pandoh Himachal Pradesh right now pic.twitter.com/KQ2Tn9sz9B — Go Himachal (@GoHimachal_) August 14, 2023 రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు జరిగాయని సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలాన్, సిమ్లా, మండి, హమిర్పూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన విపత్తు నిర్వహణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంఢీగర్-సిమ్లా జాతీయ రహదారితో సహా ప్రధాన రహదారులు మూతపడ్డాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో విపత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొదట ఏడుగురు మరణించారు. శివమందిర్ కూలిపోయిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోచోట కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 17 మంది కాపాడామని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు. That has happened in #Himachal to build a 4 Lane road the Govt. Bulldoze houses, shops, bussiness establishment in the name of development but In this Himalayan Ranges. But now Nature is taking revenge. The Roads are crumbling down. Location NH 5 , Solan India pic.twitter.com/hQii08aoTl — Ravi Rana (@RaviRRana) August 11, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
ఒక్కరోజు ఎస్ఐ స్వాతి.. ఇక లేదు
వ్వెంల(సూర్యాపేట) : ఽఒక్కరోజు ఎస్ఐగా విధులు నిర్వహించిన ధరావతు స్వాతి ఇక లేదు. కొంత కాలంగా ప్రాంక్రియాటిస్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె గురువారం రాత్రి తుదిశ్వాస విడిచింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని జగనాతండాకు చెందిన ధరావతు స్వాతి (23) డిగ్రీ చదువుతూ కేన్సర్ బారినపడింది. దీంతో ఆమె చిరకాల కోరిక ఎస్ఐ కావాలని ఉండటంతో తల్లిదండ్రులు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని కలిశారు. తమ కూతురు కోరికను తీర్చాలని కోరారు. స్పందించిన ఆయన ఒక్కరోజు ఎస్ఐగా విధులు నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మేక్ ఏ విష్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆమెను చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో ఒక్కరోజు ఎస్ఐగా విధులు నిర్వహించేలా నియమించారు. దీంతో ఆమె జూన్ 6వన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్లి మంత్రి జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్వాతి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఇళ్లకే మద్యం పంపిణీ అయ్యేలా గ్రీన్ సిగ్నల్..పెళ్లిళ్లలో కూడా తాగొచ్చు..
సాధారణంగా మద్యం విక్రయించాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. ఇప్పటి వరకు క్లబ్‌లు, స్టార్ హోటల్స్‌కి మాత్రమే మద్యం వినియోగం కోసం లైసెన్స్ ఇచ్చేవారు. ఇక ఇళ్లలోని ఫంక్షన్స్ ఉత్సవాలు, స్టేడియం నుంచి జాతీయ, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాల వరకు అన్ని చోట్ల మద్యం సర్వ్ చేయాలన్న లేదా కలిగి ఉండాలన్న లైసెన్స్ ఉండాల్సిందే. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం 'ఎఫ్.ఎల్.12' అనే ఒక ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని కూడా ఎక్సైజ్ శాఖ గత నెలలోనే జారీ చేసింది. మద్యం అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది తమిళనాడు ప్రభుత్వం. అందులో భాగంగానే మద్య అమ్మకాలు పెంచేలా ఈ ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకువచ్చింది. దీంతో పెళ్లిళ్లలోనూ, ఇతర శుభాకార్యల్లోనూ మద్యం సేవించడానికి అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం వాణిజ్య సముదాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక లైసెన్స్ వివరాలు.. దీన్ని డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్(ఎక్సైజ్) జారీ చేస్తారు. ఇది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఈ లైసెన్స్ అతిథులు, సందర్శకుల తోపాటు అంతజర్జాతీయ లేదా జాతీయ ఈవెంట్లలో పాల్గొనేవారికి సర్వ్ చేసేందుకు, కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. దీని ఈవెంట్ తేదీ ఏడు రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆయా ప్రదేశాల్లో మద్యం విక్రయించాలంటే ఈ ప్రత్యేక లైసెన్సు ఉండాలి. అందుకోసం ప్రభుత్వాన్నికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్యపరమైన ఈవెంట్లకు ప్రత్యేక లైసెన్స్ వార్షిక రుసుము కింద మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. లక్ష, మున్సిపాలటీల్లో రూ. 75వేలు, ఇతర ప్రదేశాల్లో రూ. 50,000 వరకు ఉంటుంది. అదే ఒక్కరోజు ఈవెంట్ నిర్వహణకు అయితే మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 11 వేలు, మున్సిపాలటీల్లో రూ. 7500, ఇతర ప్రదేశాల్లో రూ. 5వేలు వరకు ఉంటుంది. ఇక గృహ వేడుకల సమయంలో నాన్-కమర్షియల్‌గా ఒక్కరోజుకి ఈ ప్రత్యేక లైసెన్స్‌ను రూ. 11,000 (మునిసిపల్ కార్పొరేషన్లలో), రూ. 7,500 (మున్సిపాలిటీలలో) రూ.5 వేలు(ఇతర ప్రదేశాల్లో). (చదవండి: ఆరోగ్య మంత్రి వీడియో చాట్ దుమారం.. బీజేపీ రాజీనామా డిమాండ్) -
ఇంటికో నలభీముడు.. జిల్లాలో ఏ ఫంక్షన్ అయినా ఆ ఊరి నుంచే..
ఆ ఊరులో ఇంటికో నలభీముడు తయారయ్యారు. వంటల తయారీలో చేయి తిరిగిన నైపుణ్యం ఆ ఊరి వారికే సొంతమైంది. భూస్వామి ఇంట.. వంటలో మెళకువలు నేర్చుకున్న సుబ్బయ్య కీర్తి జిల్లా అంతటా పాకింది. జిల్లాలో తొలి క్యాటరింగ్ ఏర్పాటుకు బీజం వేసింది. వంటలంటే.. వేగూరే అని పేరు తెచ్చి పెట్టింది. ఆ ఊరి వంటల రుచి ఎందరికో బతుకు దారి చూపింది. సాక్షి, నెల్లూరు: ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా.. షడ్రుచుల భోజనాలు వేగూరు నుంచే వెళ్తాయి. దిగువ మధ్య తరగతి నుంచి ధనవంతుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్ ఏదైనా వేగూరు రుచులు నోరూరిస్తాయి. క్యాటరింగ్ అంటే గుర్తొచ్చేది జిల్లాలోని కోవూరు మండలం వేగూరు. ఆ గ్రామానికి చెందిన సుబ్బయ్య తన చిన్నతనంలో మోడేగుంటకు చెందిన దేవెళ్ల సుబ్బరామిరెడ్డి అనే భూస్వామి వద్ద పశువుల కాపరిగా చేరారు. ఆ రోజుల్లో ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు, పని వాళ్లతో కలిపి సుమారు 60 నుంచి 70 మంది ఉండేవారు. వారందరికీ వంట చేయడం ఆ ఇంటి ఇల్లాలు తులశమ్మకు కష్టమైంది. దీంతో సుబ్బయ్యను వంట పనుల్లో సహాయకారిగా నియమించుకున్నారు. ఆమె వద్ద వంట చేయడంలో సుబ్బయ్య మెళకువలను నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన వంటల రుచుల కీర్తి జిల్లా అంతటా పాకింది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కుటుంబాలు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వంట చేసేందుకు సుబ్బయ్యను తీసుకెళ్లే వారు. జిల్లాకు చెందిన దివంగతులు మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, నెల్లూరు నర్తకీ సినిమాహాలు యజమానులు గుండా రాజమ్మ, ఆనం కుటుంబీకులు ఇలా పలువురు ప్రముఖులు వారిళ్లలో జరిగే కార్యక్రమాలకు వంటలు చేసేందుకు సుబ్బయ్యనే పిలిపించుకునేవారు. ఆయనతో వంటలు చేయించుకునేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో ఉన్న తమ వారి కోసం తీసుకు వెళ్లే వారని స్థానికులు చెబుతున్నారు. 30 రకాల వంటలు వెజ్, నాన్ వెజ్ వంటల వెరైటీల తయారీలో వేగూరు వంట మాస్టార్లది చేయితిరిగిన నైపుణ్యం.. వారికే సొంతం. వేగూరులో తమ స్వగృహాల సముదాయాల్లోనే వంటలు తయారు చేసి జిల్లా నలుమూలలకు వాహనాల్లో పంపడం ఇక్కడి ప్రత్యేకత. శాఖాహార, మాంసాహార వంటలతో పాటు బిరియానీ, పాయ, చిల్లీ చికెన్, మటన్ బిరియానీ, వడ, పాయసం, జాంగ్రీ, లడ్డూ తదితర సుమారు 30 రకాలను తయారు చేయడం సిద్ధహస్తులు. క్యాటరింగ్ సెంటర్ వంట గది తొలి క్యాటరింగ్ ఇక్కడే జిల్లాలో తొలి క్యాటరింగ్ ఈ ఊరి నుంచే ప్రారంభమైంది. వంట మాస్టార్ సుబ్బయ్య వద్ద సహాయకారిగా ఉన్న పసుపులేటి వెంకటసుబ్బయ్య ఇళ్లలో, హోటళ్లలో వంట మనిషిగా పనులు చేయడంతో వేగూరు వంటగాళ్లకు పేరొచ్చింది. ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో ఆలోచనలో పడ్డారు. వచ్చిన పనినే నమ్ముకుని ఆదాయం పెంచుకునేందుకు పాతికేళ్ల కిందట సొంతంగా గ్రామంలోనే క్యాటరింగ్ ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆదాయం పెరగ్గా, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువత అదే బాట పట్టారు. ఈ గ్రామంలో సుమారు 120 క్యాటరింగ్ కేంద్రాలు నిర్వహిస్తుండగా ఒక్కో దానిలో పది నుంచి 30 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఊరి యువత కొందరు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ తదితర నగరాల్లో క్యాటరింగ్ కేంద్రాలు హోటళ్లను ఏర్పాటు చేసుకుని రాణిస్తున్నారు. బిరియానీ తయారు చేస్తున్న మాస్టర్ ప్రతి ఇంట్లో నలభీముడున్నాడు మా గ్రామంలో ప్రతి ఇంట్లో నలభీముడు తయారయ్యారు. మా నాన్న సుబ్బయ్య ఎంతో ఇష్టంగా వంటలు చేయడాన్ని గమనించి నేనూ నేర్చుకున్నా. కొందరు నాతో పచ్చళ్లు చేయించుకుని లండన్‌లోని తమ పిల్లలకు పంపుతున్నారు. నాకు ఫోన్లు చేసి మీ రుచులు బ్రహ్మాండం అని చెబుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. గతంలో కోటలో వంటలు చేసేందుకు ఇక్కడి నుంచి మేము బాండిళ్లు, వంట సామగ్రితో ఆర్టీసీ బస్సులు ఎక్కబోతే కొందరు కండక్టర్లు తక్కువగా చూసేవారు. బస్సుల్లో సైతం ఎక్కించుకోలేదు. ఇప్పుడు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని వెళ్లి చేసి వస్తున్నాం. – రామిశెట్టి వెంకటేశ్వర్లు, వేగూరు -
జన జీవనం ఫుల్‌జోష్
రెండేళ్ల క్రితం ఊహించని ఉపద్రవం.. కరోనా మహమ్మారి ఇంటి నుంచి కాలు బయట పెట్టనీయలేదు. ప్రాణభయం వెంటాడటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీవన ప్రయాణానికి లాక్ పడింది. శుభకార్యాల్లేవు.. చుట్టపు చూపుల్లేవు.. విహారయాత్రలు అసలే లేవు. కనీసం బంధుమిత్రుల కడసారి వీడ్కోలుకు వెళ్లలేని ధైన్యస్థితి. క్రమంగా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత జనజీవనం పట్టాలపై పరుగులు తీస్తోంది. మళ్లీ పూర్వ వైభవం వచ్చిందా అన్నట్లుగా అంతటా రద్దీ వాతావరణం కనిపిస్తోంది. ఉత్సవాలు, పెళ్లిళ్లు, వేడుకలు, జాతరలు జనంతో కళకళలాడుతున్నాయి. కోవెలకుంట్ల: కరోనా మహమ్మారి రెండేళ్లపాటు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలను కకావికలం చేసింది. కోవిడ్ కట్టడికి 2020 మార్చి చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించిపోయింది. అదే ఏడాది ఏప్రిల్ నెలలో సంజామల మండలం నొస్సం గ్రామంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. తర్వాత క్రమంగా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 3.08 లక్షల మంది వైరస్ బారిన పడగా వీరిలో 1,305 మందిని వైరస్ కబళించింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్‌లతో దాదాపు రెండేళ్ల పాటు కరోనా భయం వెంటాడింది. 2020 సెప్టెంబర్ వరకు ఫస్ట్‌వేవ్ కొనసాగగా జిల్లాలో 60 వేల మంది కరోనా బారిన పడగా 458 మంది మృత్యువాత పడ్డారు. 2021 మార్చి నెలాఖరు నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. నాలుగు నెలలపాటు కొనసాగిన వేవ్‌లో జిల్లాలో 1.23 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 820 మంది కరోనా కాటుకు బలైపోయారు. ఈ వేవ్‌లో వైరస్ పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బాధితులు భయాందోళన గురికావడంతో ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రెట్టింపు మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో థర్డ్‌వేవ్ (ఒమిక్రాన్) ప్రారంభం కాగా 1.25 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి, రెండు వేవ్‌లతో పోలిస్తే థర్డ్‌వేవ్‌లో కేసుల సంఖ్య భారీగా పెరిగినా ప్రజలకు వైరస్‌ను ప్రాణాపాయం తప్పింది. జిల్లాలో కేవలం ఐదు మరణాలు మాత్రమే సంభవించాయి. మూడు వేవ్‌లలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా ప్రభావం తొలగిపోవడంతో జనజీవనం పూర్వవైభవం సంతరించుకుంది. రెండేళ్లపాటు మాయమైన పెళ్లిళ్ల సందడి మళ్లీ కనిపిస్తోంది. అన్ని రకాల వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. వేసవికాలం కావడంతో పల్లెల్లో దేవరలు, తిరుణాళ్లు, ఉత్సవాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోస్ వేయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థులకు సైతం వ్యాక్సిన్‌నేషన్ పూర్తి చేస్తుండటంతో ప్రజలు ధైర్యంగా తమ పిల్లలతో బయటకు వస్తున్నారు. అయితే ప్రజలు ఇల్లు దాటితే తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించి కరోనా బారి నుంచి రక్షణ పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు పరీక్షలు ఎంతో కీలకం. 2020 మార్చి నెలలో కరోనా వైరస్ వ్యాప్తితో 2019–20 విద్యా సంవత్సరం పరీక్షలు విద్యార్థులు రాయలేకపోయారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఆ తర్వాత 2020–21 విద్యా సంవత్సరం కూడా సగం ఏడాది లాక్డౌన్ మింగేసింది. ఆ సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లు విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు లేకుండానే పాస్ చేసింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 2021–22 విద్యా సంవత్సరం పరీక్షలు కొనసాగుతుండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కరోనా రెండేళ్ల కాలంలో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఓ వైపు ఆన్లైన్ చదువులు, మరో వైపు క్రీడలు లేకపోవడంతో మానసింగా కుంగిపోయారు. ఈ క్రమంలో తరగతుల నిర్వహణతో పాటు ఆటలతో పాటు శిక్షణ శిబిరాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు ఊరట కలిగింది. విద్యార్థులు నష్టపోయారు 20 సంవత్సరాల నుంచి నేను కోవెలకుంట్ల పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. కరోనా వైరస్ ప్రభావంతో 2020 మార్చి 24 నుంచి 2022 ఆగస్టు వరకు కేవలం రెండు, మూడు నెలల మాత్రమే పాఠశాలలు కొనసాగాయి. విద్యార్థులు ఎంతో నష్టపోయారు. కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. – దస్తగిరి, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు, సౌదరదిన్నె, కోవెలకుంట్ల వ్యాపారాలు పుంజుకుంటున్నాయి కరోనాతో రెండేళ్లపాటు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. షాపులు తెరుచుకునేందుకు అవకాశం లేక నష్టాలు చవిచూశాం. గత 15 సంవత్సరాల నుంచి సెల్‌షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాను. కరోనాతో షాపు మూత పడి పూటగడవటమే కష్టంగా ఉండింది. కరోనా కష్టాలు తొలగిపోవడంతో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. – బలరాం, సెల్‌షాపు యజమాని, కోవెలకుంట్ల అప్రమత్తంగా ఉండాలి కరోనా తొలిగిపోయిందని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తతలు పాటించాలి. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో కరోనా వైరస్ విశ్వరూపం చూపడంతో వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో తిరిగి కరో నా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా నిబంధనలు పాటించాలి. – విద్యాసాగర్, డాక్టర్, రేవనూరు పీహెచ్సీ, కోవెలకుంట్ల మండలం ఘనంగా స్మరించుకుంటూ.. కరోనా కాలంలో ఎన్నో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అయిన వారు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినా అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. ప్రాణ భయంతో కడసారి చూపునకు నోచుకోలేక ఎంతో మంది విలవిలలాడారు. ఫోన్లోనే కుటుంబీకులను పరామర్శించాల్సిన పరిస్థితి ఎదురైంది. నాడు అందరూ ఉన్నా అంత్యక్రియలకు కుటుంబీకులు మాత్రమే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కొందరు వర్ధంతి వేడుకలకు బంధుమిత్రులను ఆహ్వానించడంతో ఘనంగా స్మరించుకుంటున్నారు. -
ఈవెంట్ ఎంతో ఈజీ.. వేడుక ఏదైనా మేనేజ్ చేస్తారు
కల్చర్ మారిపోతోంది. ప్రజల ఆలోచనా విధానం కొత్తదనాన్ని కోరుకుంటోంది. రెడీమేడ్ను ఎక్కువగా ఇష్టపడుతోంది. ఒకప్పుడు పెళ్లి కోసం నెలల తరబడి కసరత్తు జరిగేది. ఊరూవాడా కలిసి వివాహ వేడుకల్లో పాలుపంచుకునేది. కానీ రోజులు మారాయి. పెళ్లిళ్లు, పుట్టిన రోజు తదితర వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తమకు నచ్చిన విధంగా వీటిని నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉంటే చాలు.. ఒక్క ఫోన్ కాల్‌తో పిసరంత కష్టం లేకుండా కావలసినవన్నీ స్మార్ట్‌గా సిద్ధమైపోతున్నాయి. ఇక ఏర్పాట్ల హడావుడి లేకపోవడంతో కుటుంబం అంతా సంతోషంలో హైలెస్సా అంటూ ఎంజాయ్ చేస్తోంది. అదరహో అనిపించేలా.. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల ధగధగలతో కల్యాణ వేదికలు కనువిందు చేస్తాయి. స్వర్గలోకాన్ని తలపించే స్వాగత ద్వారాలు అలరిస్తాయి. అక్కడ మంచు, వర్షం కురుస్తున్న అనుభూతి కలిగించే భారీ సెట్లు, ఫైర్ షాట్లు అబ్బుర పరుస్తాయి. విందారగించేందుకు లెక్కకు మిక్కిలి రుచులు కళ్లెదుట ప్రత్యక్షమవుతాయి. నిశ్చితార్థం, మెహందీ, సంగీత్, హల్దీ, వివాహం, రిసెప్షన్ తదితర వేడుకలతో పాటు ఫొటో షూట్లు, వధూవరుల ఊరేగింపు వంటి ఏర్పాట్లన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్లే సమకూరుస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇక ఫంక్షన్‌కు వచ్చే వారికి వినోదాన్ని పంచడానికి ప్రత్యేకంగా ఉర్రూతలూగించే డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లు ఉంటాయి. వచ్చిన వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు హుషారైన యాంకర్లు ఉంటారు. ఇంకా పెళ్లి పందిళ్లు, పురోహితులను సమకూర్చే బాధ్యతలను తీసుకునే ఈవెంట్ మేనేజ్మెంట్లూ ఉన్నాయి. విజయవాడ నగర పరిధిలో వందకు పైగా ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలున్నాయి. వీటిలో 50 వరకు నాణ్యమైన, పది అత్యంత నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తున్నవిగా గుర్తింపు పొందాయి. రోబో సర్వింగ్.. చీర్ గాళ్స్ హంగామా.. పెళ్లిళ్లకు వచ్చిన వారికి రోబోలతో స్వాగతం పలకడం, సర్వింగ్ చేసే సరికొత్త ట్రెండ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరికొందరు మరో అడుగు ముందుకేసి రష్యాకు చెందిన చీర్ గాళ్స్ (నలుగురైదుగురుండే బృందం)ను రప్పించి వారితో వయ్యారాలొలికిస్తూ ఆనందాన్ని పంచుతున్నారు. స్వాగత ద్వారాల వద్ద వీరిని ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతున్నారు. రోబోలు, చీర్ గాళ్స్ సంస్కృతి హైదరాబాద్‌లో ఇప్పటికే ఉంది. ఇటీవల కొంతమంది స్థితిమంతులు విజయవాడలోనూ ఈ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. రోబోకు రూ.50–60 వేలు, చీర్ గాళ్స్‌కు రూ.50–70 వేల వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. సరికొత్తగా కొన్ని వివాహాల్లో కేరళ డ్రమ్స్, పంజాబీ డోలు వాయిద్యాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. రూ.లక్షల్లో ప్యాకేజీలు.. ► పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎవరి స్థాయిని బట్టి వారు వివాహ వేడుకలకు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది ఖర్చు ఎంత అన్నది కాదు.. పెళ్లి ఎంత ఘనంగా చేశామా? అన్నదే ముఖ్యమని ఆలోచిస్తున్నారు. వివాహ వేడుకలకు ఎంత వెచ్చిస్తే అంత స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న వారూ ఉన్నారు. ► దీంతో ఈవెంట్ మేనేజర్లు విందు భోజనాలు, కల్యాణ మండపాల డెకరేషన్, విద్యుదలంకరణ, ఫొటో, వీడియో షూట్లు, డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లు వంటి వాటికి వేర్వేరు ధరలు నిర్ణయిస్తున్నారు. అన్నీ కలిపి ఓ ప్యాకేజీగాను, అలాకాకుండా వేర్వేరు ప్యాకేజీలుగాను వెసులుబాటు కల్పిస్తున్నారు. ► డెకరేషన్‌కు కనీసం రూ.లక్ష నుంచి ఏడెనిమిది లక్షలు, ఫొటోగ్రఫీ/ఫొటో షూట్లకు రూ.70 వేల నుంచి రూ.5–6 లక్షలు, విందు భోజనాలకు రూ.లక్ష నుంచి రూ.5–6 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారు. ► విజయవాడలో కొంతమంది స్థితిమంతులు వివాహ వేడుకలకు రూ.30 లక్షలు వెచ్చిస్తున్న వారూ ఉన్నారు. ► మునుపటికి భిన్నంగా ఇటీవల పలువురు డెకరేషన్ కంటే ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని విజయవాడలోని అమ్మ ఈవెంట్స్ నిర్వాహకుడు అనిల్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కావాల్సిన విధంగా.. నా వివాహం ఇటీవల విజయవాడలో జరిగింది. రిసెప్షన్ ఘనంగా చేసుకోవాలనుకున్నాను. స్నేహితుల సాయంతో నగరంలో పేరున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను సంప్రదించాను. చివరకు ఓ ఈవెంట్ సంస్థకు అప్పగించాను. మాకు రిసెప్షన్‌కు ఏం కావాలో, ఎలాంటి డెకరేషన్ అవసరమో వాళ్లకు చెప్పాం. మా అభిరుచులకు అనుగుణంగా అన్నీ వారే సమకూర్చారు. డెకరేషన్ వగైరాలు కనుల పండువగా ఏర్పాటు చేశారు. అందువల్ల రిసెప్షన్ ఎలా జరుగుతుందా? అన్న ఆలోచనే లేకుండా పోయింది. ఈ రోజుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. – విజయసాయి, విజయవాడ ట్రెండ్ మారుతోంది.. వివాహ వేడుకల ట్రెండ్ మారుతోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులు తగ్గించి ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యత పెరిగింది. వెరైటీ వంటకాలు, వినూత్న హంగామాలు, లైవ్ మ్యూజిక్‌లు వంటి వాటిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వేడుక సమ్‌థింగ్ స్పెషల్‌గా, స్టేటస్ సింబల్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. కొందరు రోబోలు, చీర్ గాళ్స్ సందడితో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నారు. వారి టేస్ట్‌కు అనుగుణంగా సంస్థలు అన్నీ సమకూరుస్తున్నాయి. – విజ్జు విన్నకోట, సెలబ్రిటీ ఈవెంట్స్, విజయవాడ -
ఎన్నిసార్లు చెప్పినా అంతే..! ఒకరింట్లో విందు.. మరొకరింట్లో నిద్ర బందు
సాక్షి, శంషాబాద్: ఒకరి ఇంట్లోని శుభకార్యం మరో ఇంటికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. ఓ వైపు టపాసుల మోత.. మరో వైపు శబ్దాల హోరుతో పలు ఫంక్షన్‌హాళ్ల వద్ద అర్ధరాత్రి వరకు జరుగుతున్న కార్యక్రమాలకు సమీప కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఒకే చోట ఐదు.. ►శంషాబాద్‌లోని సిద్ధంతి, నక్షత్ర, సాయినగర్ కాలనీ సమీపంలో ఒకే చోట ఐదు ఫంక్షన్‌హాళ్లు ఉన్నాయి. ఒకే చోట అధిక సంఖ్యలో ఇవి ఉండటం వల్ల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా సమీప కాలనీ వాసులకు వీటి శబ్దం కారణంగా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. పలుసార్లు ఫిర్యాదు.. ►అనుమతి లేకుండానే అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున సౌండ్ బాక్సుల శబ్దాలు, టపాసుల మోతతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ విషయంపై కాలనీ వాసులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే సారి అన్ని ఫంక్షన్‌హాళ్లలో వేడుకలు జరిగినప్పుడు శబ్దం తీవ్రత మరింతగా బాధిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేజర్ కాంతులపై నిషేధం.. ►విమానాశ్రయానికి సుమారు 8 కిలో మీటర్ల వరకు ఎలాంటి లేజర్ కాంతులు ఏర్పాటు చేయకూడదని గతంలో అనేకసార్లు ఎయిర్‌పోర్టు అధికారులతో పాటు స్థానిక సంస్థలు కూడా ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేశాయి. గతంలో పోలీసుల దృష్టి పెట్టినప్పుడు కొంత మేర తగ్గించి తిరిగి యథాతథంగా కొనసాగిస్తున్నారని వాపోతున్నారు. తెల్లవారే వరకు శబ్ధాలు.. ఒక్కోసారి రాత్రి నుంచి తెల్లారే వరకు కూడా శబ్దాల హోరు తగ్గడం లేదు. టపాసుల మోతతో పాటు సౌండ్ బాక్సుల్లో మితిమీరిన శబ్దం ఫంక్షన్ హాళ్ల నుంచి వెలువడుతోంది. వీటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. – రాజిరెడ్డి, సాయినగర్ కాలనీ -
Shilpa Ramam: ‘శిల్పారామం’లో శుభకార్యాలకు ధరలు ఎంతో తెలుసా..
సాక్షి, మాదాపూర్(హైదరాబాద్): పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్న మాదాపూర్ శిల్పారామం వివాహాది శుభకార్యాలకు వేదికగా కూడా నిలుస్తోంది. మొత్తం 45 ఎకరాల్లో శిల్పారామం విస్తరించి ఉంది. కేవలం సందర్శకులు తిలకించేందుకే కాకుండా వివాహాది శుభకార్యాలు చేసుకొనేందుకూ అధికారులు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక ప్రదేశాలను శిల్పారామంలో అందుబాటులో ఉంచారు. శిల్పారామంలోని వేదికలు ఇవే.. ► శిల్పారామంలో వివాహాది శుభకార్యాల కోసం ఈ కింది వేదికలు ఇస్తారు. ► ఏ ప్రదేశాన్ని బుకింగ్ చేసుకున్నా.. తప్పనిసరిగా రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సందర్శకులను ఆకట్టుకొనేందుకు... ► చిన్నపిల్లలు, తల్లిదండ్రులు సరదాగా గడిపేందుకు ఉయ్యాలలు, పిల్లలకు మేధాశక్తి పెరిగేందుకు ఉపయోగపడే ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. ► కోనసీమ, బోటింగ్, బ్యాటరీకారు, ఎడ్లబండి వంటివి ఆకట్టుకునేలా ఉంటాయి. గ్రీనరీ, పూలమొక్కలు, ఆకర్షణీయమైన చెట్లు ఇక్కడి ప్రత్యేకతలు: ► సందర్శకులకు మరింత ఆకట్టుకునేలా రకరకాల పక్షులను పెంచుతున్నారు. ► వివిధ రకాల పక్షుల కోసం 12 కేవ్లు ఏర్పాటు చేశారు. ► రాతితో తయారు చేసిన సందేశాత్మక విగ్రహాలు ఏర్పాటు చేశారు. ► సందర్శకులు వీటి వద్ద ఫొటోలకు ఫోజులిస్తూ సరదాగా గడుపుతుంటారు. ► వీకెండ్స్‌లో ఆంపీ థియేటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా మేళాల నిర్వహణ ... ► ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు నిర్వహించే మేళాలో దాదాపు 550 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. విద్యార్థులు, దివ్యాంగులకు రాయితీ.. ► 10వ తరగతి వరకు చదివేవారికి 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ► పాఠశాల నుంచి లేఖ తీసుకొచ్చి కార్యాలయంలో అందజేయాలి. ► దివ్యాంగులు, స్వచ్చంద సంస్థల వారికి కూడా 50 శాతం రాయితీ ఇస్తారు. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.. శిల్పారామం అంటే కేవలం సందర్శకులకే కాకుండా శుభకార్యాలను నిర్వహించుకునేందుకు కూడా అవ కాశం కల్పిస్తున్నాం. వీటి కోసం ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేశాం. ఇక్కడ తరచూ శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ వేదిక కోసం ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లోనూ ముందుగా బుక్ చేసుకోవాలి. – జి.అంజయ్య, శిల్పారామం జనరల్ మేనేజర్ చదవండి: వినూత్న ఆలోచనలను ఆవిష్కరించండి -
పెళ్లికి వస్తారు.. గిఫ్టులు ఎక్కడున్నాయో తెలుసుకుని..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: బంధువుల వలే వివాహాలకు హాజరై అదును చూసి విలువైన వస్తువులు, నగుదును కాజేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఆరు సంవత్సరాల బాలిక కూడా ఉంది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్ జిల్లాకు చెందిన ప్రశాంత్ (22), శ్రావణ్ (21)తోపాటు ఓ మహిళ, ఆరు సంవత్సరాల బాలికతో నెలరోజుల క్రితం నగరానికి వచ్చారు. కారును అద్దెకు తీసుకోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ఫంక్షన్‌హాల్స్‌లో జరిగే శుభకార్యాల్లో బంధువుల వలే హాజరయ్యేవారు. ఆయా శుభకార్యాల్లో బంధువులు ఇచ్చిన ఖరీదైన గిప్టులను ఎక్కడ పెట్టారో తెలిపి బాలికను పంపించే వారు. ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారి వాటిని తీసుకువచ్చి ఆ మహిళకు అందించేది. దొంగలించిన సొత్తుతో నిమిషాల వ్యవధిలో శుభకార్యం నుంచి వెళ్లిపోయే వారు. మైలార్‌దేవ్‌పల్లితో పాటు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలా మూడు దొంగతనాలకు పాల్పడ్డారు. గతనెల మూడో వారంలో జరిగిన శుభకార్యంలో విందు నిర్వహించిన కుటుంబ సభ్యులు విలువైన వస్తువులతో పాటు నగదును ఓ బ్యాగ్‌లో వేసి స్టేజిపైనే ఉంచారు. ఈ శుభకార్యంలో పాల్గొన్న చిన్నారి చాకచక్యంగా దానిని తీసుకోని ఉడాయించింది. విందులో ఏర్పాటు చేసిన వీడియో కెమెరాలో చిన్నారి బ్యాగ్ తీసుకువెళ్లిన సంఘటన రికార్డయ్యింది. కుటుంబ సభ్యులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శంషాబాద్ ఎస్ఓటీ సహాయాన్ని కోరారు. ఆ రోజు ఫంక్షన్‌హాల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు బయటకు వెళ్లిన వాహనాల పూర్తి వివరాలను సేకరించి బుధవారం నిందితులైన ఇద్దరు యువకులు, మహిళ, చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐ20 కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు. -
మీ ఇంట్లో శుభకార్యాలకు మారువేషాల్లో అధికారులు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, బారసాలు, పూజలు ఇతర శుభకార్యాలు జరిగే చోట ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యటిస్తారని బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కాకాణి తెలిపారు. అక్కడ కరోనా నియమాలు పాటిస్తున్నారా...? లేదా..? ఎంతమంది హాజరయ్యారు...? ఒకవేళ ఉల్లంఘన జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. వీడియోలు పరిశీలన.. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తుండడంతో బీఎంసీ అధికారులకు కంటిమీద కినుకులేకుండా పోయింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా శుభకార్యాలు జరుగుతున్న పంక్షన్ హాళ్లకు, మైదానాల్లోకి బంధువుల రూపంలో బీఎంసీ సిబ్బంది మారువేషాల్లో వెళతారు. అక్కడ వేదికపై ఎంత మంది బంధువులున్నారు? 50 మంది బంధువుల కంటే ఎక్కువ ఉన్నారా..? కరోనా నియమాలు పాటిస్తున్నారా..? లేదా..? అనేది నిర్ధరించుకుంటారు. అవసరమైతే వీడియోగ్రాఫర్లు చిత్రీకరించిన క్లిప్పింగులను పరిశీలించే అధికారాలు కూడా సిబ్బందికి కట్టబెట్టినట్లు కాకాణీ చెప్పారు. ఒకవేళ మాస్క్‌లు ధరించని, భౌతిక దూరం పాటించని పక్షంలో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు. అవసరమైతే స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు కూడా నమోదు చేస్తారు. నగరంలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో బీఎంసీ పరిపాలన విభాగం అనేక ఆంక్షలు విధించింది. ప్రైవేటు, వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాల్లో 50 శాతం హాజరుండాలని నిబంధన విధించింది. కోవిడ్ నియమాలు కచ్చితంగా అమలుచేస్తున్నారా అనేది నిర్ధరించుకునేందుకు అకస్మాత్తుగా బీఎంసీ అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. నియమాల ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి గతంలో కంటే ఇప్పుడే మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదవండి: (కరోనా విజృంభణ.. రెండు వారాలపాటు లాక్డౌన్) -
పెళ్లిళ్లపై కరోనా కాటు!
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్–19 (కరోనా) ప్రభావం శుభకార్యాలపై తీవ్రంగా చూపుతోంది. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడంతోపాటు విస్తరించకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే కార్యక్రమాలను వాయిదా లేదా తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు, పక్క రాష్ట్రంలోని ముంబై, పుణే, బెంగళూరులతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవడంతో పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టుకున్న పలు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహుర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. దీంతో రెండు, మూడు నెలల ముందే ఫంక్షన్ హాల్స్, కేటరింగ్ తదితరాలను బుక్ చేసుకున్నారు. తమ వ్యాపారం జోరుగా సాగుతుందని ఫంక్షన్ హాల్, డెకరేషన్లు, ఫుడ్ కేటరింగ్ యజమానులు భావించారు. (మనిషిపై కరోనా ప్రభావమిలా..) అయితే వైరస్ కారణంగా ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకున్న వారు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి పెళ్లిళ్లు పెట్టుకున్నా ఫంక్షన్ హాల్స్‌కు బంధువులు వస్తారో.. రారో అని వధువరుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొందరు ఇప్పటికే శుభకార్యాలు రద్దు చేసుకోవడంతో కేటరింగ్, డెకరేటర్లకు, ఫంక్షన్ హాళ్లకు బుకింగ్ సమయంలో చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ముంబై దాదర్‌లోని ధురు ఫంక్షన్ హాల్ యజమాని మనోహర్ సాల్వీ, జోగేశ్వరిలోని మాంగళ్య మంగల్ హాల్ యజమాని అమిత్ తెలిపారు. (కరోనాపై సీఎం కేసీఆర్ ప్రకటన) కరోనా కారణంగా శుభకార్యాలు రద్దయ్యే ప్రమాదం ఉండటంతో తమ ఆదాయానికి గండిపడుతుందని ఫంక్షన్ హాల్స్, డెకరేటర్లు, కేటరింగ్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఇప్పటికే 85 కేసులు నమోదు అవ్వగా.. వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు.ఇక తెలంగాణలోనూ వైరస్ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న ప్రమాదకర వైరస్ అక్కడ కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ ఆసియా వెలుపల గల దేశాలపై మరణమృదంగం మోగిస్తోంది. -
జెడ్పీ స్థాయీ సంఘాల ప్రాధాన్యం పెరిగేనా?
సాక్షి, ఆదిలాబాద్: కొత్త జెడ్పీ.. పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు దాటింది. పాలన వ్యవహారాలు ప్రారంభమైతేనే పనితీరు ఎలా ఉంటుందో తెలుస్తుంది. పాలకవర్గం ఇంకా క్రియాశీలకం కాలేదు. సమావేశాల నిర్వహణతోనే ఇటు జెడ్పీలో అధికారులు, సిబ్బంది పరంగా విధుల నిర్వహణ, ఇటు పాలకవర్గం వ్యవహారం స్పష్టం అవుతుంది. ప్రస్తుతం కొత్త జెడ్పీ పాలకవర్గం ‘స్థాయీ’ పెంచేలా వ్యవహరిస్తుందా.. లేదా అనేది భవిష్యత్ నిర్ధారించనుంది. మ్మడి జిల్లా ఉన్నప్పుడు 52 మండలాలతో జెడ్పీ పాలన సందడిగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలపాటు కొత్త జెడ్పీలు ఏర్పాటు చేయడంతో మార్పులు జరిగాయి. అప్పుడు 52 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉండగా, ప్రస్తుతం కొత్త జిల్లాలో 18 మండలాల్లో ఆదిలాబాద్‌అర్బన్ మండలం మినహా 17 మంది ఉన్నారు. దీంతో స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశంలో మునపటి సభ్యుల సందడి కనిపించే అవకాశం లేదు. అయితే ప్రస్తుత పాలకవర్గంలో అధికార టీఆర్ఎస్ తొమ్మిది మంది సభ్యులను కలిగి ఉంది. ఇక బీజేపీ ఐదుగురు, కాంగ్రెస్ ముగ్గురు జెడ్పీటీసీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ఉట్నూర్ జెడ్పీటీసీ చారులత జెడ్పీ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. దీంతో ఆమె కాంగ్రెస్ వైపు ఉండే అవకాశాలు లేవు. అయినా జెడ్పీచైర్మన్ ఎన్నిక సమయంలో ఐదుమంది సభ్యులు ఉన్న బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దించడం, దానికి కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్ వైపు ఉండడంతో పాలకవర్గం అధికార పార్టీ వంతైంది. ఇదిలా ఉంటే స్థాయీ సంఘం, సర్వసభ్య సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి అధికార టీఆర్ఎస్ పార్టీని సమస్యలపై ఎండగట్టే అవకాశాలు లేకపోలేదు. అలాంటి సమయంలో రాజకీయాలకే కొత్తైన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సమర్థవంతంగా వారిని తిప్పికొడతారా.. లేనిపక్షంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది సమావేశాల్లోనే స్పష్టమయ్యే పరిస్థితి ఉంది. సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. అయితే స్థాయీ సంఘాల్లో మాత్రం వారిని కూడా సభ్యులుగా తీసుకోనున్నారు. కాగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వారే ఉండటంతో పాలక పక్షానికి బలంగా ఉంది. అయితే ఎంపీ బీజేపీ సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఆ పార్టీకి ఐదుగురు సభ్యులు ఉండటం, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు మద్దతు పలికే అవకాశం ఉండడంతో సమావేశాల్లో వాడీవేడి ఉండే అవకాశాలు లేకపోలేదు. స్థాయీ సంఘాలు కీలకం.. జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన 60 రోజుల్లోపు స్థాయీ సంఘాలను నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏడు స్థాయీ సంఘాలు ఉన్నాయి. వాటిలో ప్రణాళిక ఆర్థిక పన్నులు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యసేవలు, మహిళ సంక్షేమం, సాంఘిక సంక్షే మం, నిర్మాణ పనుల స్థాయీ కమిటీలు ఉన్నా యి. ఇందులో ప్రణాళిక ఆర్థిక పన్నులు, నిర్మాణ పనుల స్థాయి కమిటీలకు సభ్యుల నుంచి అధిక డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం జెడ్పీలో 17మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, కోఆప్షన్ సభ్యులను మన జెడ్పీ స్థాయీ సంఘంలో సభ్యులుగా తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు సంపూర్ణంగా ఉండగా, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని మండలాలు పాక్షికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలతోపాటు ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలను కూడా స్థాయీ సంఘంలో సభ్యులుగా తీసుకోవాల్సి వస్తుందా.. లేదా అనే విషయంలో జెడ్పీ ఉన్నతాధికారులు రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిబంధన ఉందో ఇక్కడ కూడా అదే అమలవ్వాలని ఉంది. తద్వారా జిల్లాలో పాక్షికంగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆదిలాబాద్ జెడ్పీ స్థాయీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తారా.. లేదా అన్నది త్వరలో తేలిపోనుంది. అయితే ఈ స్టాండింగ్ కమిటీల నియామకానికి సంబంధించి ఇప్పటి వరకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో కదలిక కనబడటంలేదు. సుమారు నెలరోజుల సమయం ఉండడంతో అధికారులు పై విషయాల్లో స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీలుగా ఉపాధ్యాయ వర్గం నుంచి గెలిచిన రఘోత్తం రెడ్డి, పట్టభద్రుల స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన పురాణం సతీశ్‌లు ఉన్నారు. అయితే పురాణం సతీశ్‌ను స్థాయీ సంఘంలో సభ్యుడిగా తీసుకునే విషయంలో అధికారులు స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా సతీశ్ మంచిర్యాల జిల్లా ఓటరుగా ఉండడంతో అక్కడి జెడ్పీలోనే స్థాయీ సంఘం సభ్యుడిగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నియామకాలు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా అధికార పార్టీ సభ్యులకే స్థాయీ సంఘంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అదే సమయంలో విపక్ష సభ్యులకు కూడా సంఘాల్లో అవకాశం కల్పించినా అప్రాధాన్యత సంఘాల్లో వారికి చోటు కల్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పాలకవర్గాన్ని విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో త్వరలో తేలిపోనుంది. సమావేశాలతోనే పాలనలో పరుగు జెడ్పీ కొలువుదీరి నెలరోజులు దాటినా ఇప్పటికీ పాలన పట్టాలెక్కలేదు. ప్రధానంగా సమావేశాల ప్రారంభంతోనే వేగం పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరంగా ఆదిలాబాద్ జెడ్పీలో 69 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేవారు. అయితే నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌లో కొత్త జెడ్పీల ఏర్పాటుతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులనే అక్కడికి విభజించారు. ప్రస్తుతం కొత్త ఆదిలాబాద్ జెడ్పీలో 22 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ప్లానింగ్, అకౌంట్స్, వర్క్స్, జీపీఎఫ్, విద్య సెక్షన్లను ఒక్కొక్క సూపరింటెండెంట్ పర్యవేక్షించేవారు. ప్రస్తుతం ఈ ఐదు సెక్షన్లకు కలిపి ఇద్దరు సూపరింటెండెంట్లను నియమించారు. అయితే ఇప్పటికి కార్యకలాపాల పరంగా వేగం పుంజుకోలేదు. ప్రధానంగా ఒకట్రెండు సమావేశాలు జరిగి విధివిధానాలు స్పష్టమైతేనే జెడ్పీలో అధికార కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది. సీఈఓలకే నిధుల కేటాయింపు అధికారం.. ఆదిలాబాద్ జెడ్పీలో ఎన్నికల సమయంలో, ప్రమాణస్వీకారం రోజు సీఈఓగా ఉన్న నరేందర్‌ను ఇక్కడి నుంచి మంచిర్యాలకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం కిషన్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్యలో సీఈఓగా వేణు అనే అధికారి ఇక్కడికి బదిలీపై వచ్చి ఒకేరోజు పనిచేసి వెళ్లిపోయారు. ప్రధానంగా రెవెన్యూ అధికారి అయిన వేణు జెడ్పీ కార్యకలాపాల్లో పీఆర్ సిబ్బంది మధ్య ఇక్కడ ఇమడలేకపోయారన్న విమర్శ లేకపోలేదు. అదే సమయంలో గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీలోనే ఏఓగా పనిచేసిన కిషన్ ఆదిలాబాద్ జెడ్పీ సీఈఓగా రావడం యాదృచ్చికంగా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఉమ్మడి పాలకవర్గంలో జెడ్పీకి వివిధ పథకాల కింద నిధుల కేటాయింపు జరగకపోవడంపై అప్పట్లో సభ్యులు ప్రతీ సమావేశంలోనూ ఆక్షేపన వ్యక్తం చేసేవారు. ప్రస్తుతం కొత్త జెడ్పీలకు నిధులు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిధుల విడుదల, వినియోగం, అధికారాలను జెడ్పీ సీఈఓకు కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో జెడ్పీ సీఈఓల ఆమోదం తర్వాత నిధుల కేటాయింపు, విడుదల, పంపిణీ అధికారాలు డిప్యూటీ సీఈఓలకు ఉండగా, ప్రస్తుతం మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఈఓల పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వారి స్థానంలో ప్రతీ జెడ్పీకి అకౌంట్ ఆఫీసర్ పోస్టును కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి జెడ్పీకి ఏఓగా వ్యవహరించిన కిషన్ ప్రస్తుతం సీఈఓగా నిధుల విడుదల, వినియోగంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. ఆదేశాలు రావడమే తరువాయి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే స్థాయీ సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఈ సంఘాల ఏర్పాటుతోపాటు మన జెడ్పీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. – కిషన్, జెడ్పీ సీఈఓ -
షాదీఖానా ఇంతేనా..?
సాక్షి, భద్రాచలంటౌన్: ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నా అవి కొంతమంది అధికారుల అలసత్వంతో ఆ పథకాలు నీరుగారిపోతున్నాయి. సుమారు 16 ఏళ్ల క్రితం సుమారు రూ. 7.5లక్షలతో ముస్లీంలు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మండల పరిషత్ నిథులతో పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో షాదీఖానా నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు షాదీఖానా గురించి పట్టించుకున్న నాథుడే లేడు. అనంతరం మరో రూ. 5లక్షలు వెచ్చించి ఆధునీకరించారు. ఫంక్షన్లు జరుపుకునేందుకు ఒక హాలు, వేదిక, ఇరువైపులా రెండు గదులు, రెండు స్నానాల గదులు నిర్మించారు. అధికారులు తమ లక్ష్యాన్ని మరవడంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన షాదీఖానా నేడు పశువులకు నిలయంగా మారింది. అధికారుల పర్యవేక్షణ శూన్యం... ట్రాక్టర్, బండి నిలిపి ఉంచిన దృశ్యం షాదీఖానా నిర్మించిన నాటినుండి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇంతవరకు షాదీఖానాలో పెళ్లిబాజా మోగలేదు. నిర్మించిన నాటినుండి అధికారులు ముస్లీం కమిటీలకు కూడా నిర్వహణ బాధ్యతలను అప్పగించకపోవడంతో నేడు అది దీనస్థితిలో ఉంది. షాదీఖానా చుట్టుపక్కల నివశిస్తున్న వారు తమ గేదెలను షాదీఖానాలోని హాలు, గదుల్లో కట్టి వేసి వాటికి గడ్డి, కుడితి పెడుతుండటంతో పాటు వాటి వ్యర్థాలను కూడా ఖాళీస్థలంలో వేస్తున్నారు. దీంతో దుర్గంథం వెదజల్లుతొంది. షాదీఖానా రోడ్డు పక్కనే ఉండటంతో దారిన పోయే వారు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. షాదీఖానా స్థలం కబ్జా... షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వ అధికారులు 39సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అధికారులు పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో అది కబ్జా కు గురయ్యింది. సుమారు 17సెంట్లు మాత్రమే మిగిలిందని ముస్లీం కమిటీ నాయకులు వాపోతున్నారు. షాదీఖానా నిర్మించిన అధికారులు ప్రహరీ నిర్మించకపోవడంతో షాదీఖానలో విద్యు త్ మీటరు, బోరు మోటారు చోరీకి గురయ్యాయి. ఫంక్షన్‌హాల్స్ ధరలు ఆకాశంలో... సాధారణంగానే ఫంక్షన్‌హాల్స్ ధరలు అధికంగానే ఉంటున్నాయి. సామాన్య ముస్లీం కుటుంబాలు వేలు పోసి తమ ఇంట్లోని శుభకార్యాలను ఫంక్షన్‌హాల్స్‌లో నిర్వహించుకోలేని పరి స్థితి ఉంది. దీంతో అప్పులు చేసి ఫంక్షన్‌హాల్స్‌లో శుభకార్యాలను నిర్వహించుకోవాల్సి వస్తుంది. ఇది తమకు ఎంతో భారంగా మారిందని వారు వాపోతున్నారు. షాదీఖానాను ఆధునికరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో పాటు స్థానిక అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదని జామా మసీదు అధ్యక్షుడు షఫీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలంలోనే ఈ దుస్థితి జిల్లాలో ఏ మండల కేంద్రంలో చూసినా ముస్లీంలకు ఏర్పాటు చేసిన షాదీఖానాలు ఆధునాతన సదుపాయాలతో కూడి ఉన్నాయి. కేవలం భద్రాచలంలోనే ఇటువంటి పరిస్థితి దాపురించింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నా షాదీఖాను గురించి ఎవరు పట్టించుకోక పోవడం దారుణం. ఇప్పటికైనా అధికారులు స్పందించి షాదీఖానాను అందుబాటులోకి తీసుకు వచ్చి ముస్లీం కమిటీకి అప్పగించాలి. -ముస్లీం మైనార్టీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్కే ఖదీర్ దుర్గంధం భరించలేకపోతున్నాం గేదెలను షాదీఖానా ముందు, లోన కట్టి వేస్తున్నారు. పేడను కూడా అక్కడే వేస్తుండటంతో దుర్గంధంతో పాటు విపరీతమైన దోమలతో రాత్రిళ్లు నిద్ర కూడా పోలేని పరిస్థితి ఉంది. ఆదివారం 12 ట్రక్కుల పేడను తీసుకు వెళ్లారు. అధికారులు స్పందించి షాదీఖానా చుట్టూ ప్రహరీ గోడనైనా నిర్మిస్తే బాగుంటుంది. -లక్ష్మీ, స్థానికురాలు -
అక్రమార్కుల ‘ఉపాధి’ రూ.28 కోట్లు..!
ఏళ్లు గడుస్తున్నా రికవరీ చేయని అధికారులు నోటీసులు, మెమోలు ‘మామూలే..’ మూలన పడ్డ ఫైళ్లు.. అధికారులపై చర్యలు శూన్యం దర్జాగా విధులు నిర్వర్తిస్తున్న అక్రమార్కులు సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి.. ఆదిలాబాద్ కల్చరల్ : గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. అందిన కాడికి అధికారులు దండుకోవడంతో అభాసుపాలవుతోంది. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు చేసే చిన్నపాటి పొరపాట్లకు సస్పెండ్ చేస్తూ తొలగించే అధికారులు.. నిధులు కాజేసి, లెక్క చూపని అధికారులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోగా.. షోకాజు నోటీసులతో అధికార యంత్రాం గం సరిపెడుతోంది. రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఆర్టీఐ యాక్టు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఠాకూర్ జోగేందర్‌సింగ్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు ఆర్టీఐ యాక్టు ద్వారా దరఖాస్తు చేసుకోగా.. గత ఏడాది నవంబర్‌లో వివరాలు వెల్లడించా రు. అక్రమార్కుల వివరాలు ఇందులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అధికారులు అక్రమాలకు పాల్పడి రూ.28 కోట్లు దుర్వినియోగం చేశారు. ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందనే విమర్శలున్నాయి. చేయని పనులు చేసినట్లుగా, మట్టి, మొరం రోడ్లు వేసినట్లుగా, పనులు చేయకుండా చేసినట్లుగా, చెరువుల్లో మట్టితీత.. వంటి పలు రకాల పనులు చేయించినట్లు మస్టర్లు రికార్డు చేసి రూ.కోట్లలో ఉపాధి నిధుల ు దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ విషయం సామాజిక తనిఖీ బృందాల పరిశీలనలో వెల్లడైంది. ఎవరెంత దుర్వినియోగం చేశారంటే.. : నిధులు దుర్వినియోగం చేసిన వారిలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఏఈఈలు, ట్రైబ ల్వెల్పేర్ ఏఈలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎంపీడీవోలు మొ త్తం రూ.కోటీ 9 లక్షల 31,593 దుర్వినియోగం చేసినట్లు సామాజిక తనిఖీ లో తేలింది. పంచాయతీ రాజ్ ఏఈఈలు 40 మంది రూ.కోటి 8 లక్షల 16,102 దుర్వినియోగం చేయగా.. రికార్డులు కూ డా అప్పగించని నిధులు రూ.10 కోట్ల 7 లక్షల 74,584 దుర్వినియోగం చేశారు. మొత్తం రూ.11కోట్ల 15 లక్షల 90,686 పంచాయతీరాజ్ ఏఈఈలు 40 మంది స్వాహా చేశారు. ట్రైబల్ వెల్పేర్ ఏఈలు 17 మంది రూ.14 లక్షల 49,861 తప్పుడు లెక్కలతో కాజేసినట్లు సామాజిక తనిఖీలో తేలింది. రికార్డులు కూడా అందించకుండా రూ.16 కోట్ల 33 లక్షల 58,947.. మొత్తం రూ. 16 కోట్ల 48 లక్షల 08,808 అక్రమాలకు గురైనట్లు సామాజిక తనిఖీ బృం దం తేల్చింది. ఉమ్మడి జిల్లా లో ఎంపీడీవోలు, పీఆర్ ఏఈఈలు, టీడబ్ల్యూఏఈలు కలిసి మొత్తం రూ.28 కోట్ల 73 లక్షల 31,087 దుర్వినియోగం చేశారు. ఉన్నతాధికారుల హస్తం ఉండడంతోనే రికవరీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడిన కొందరు విధుల్లోనే ఉన్నారు. రూ.కోట్లల్లోనే అవినీతి..: కుభీర్ ఎంపీడీవో సత్యనారాయణ రూ. 95,09, 752 దుర్వినియోగం చేశారు. 2010లో పంచాయతీ రాజ్ కమిషనర్ చార్జి మెమో జారీ చేశారు. పలుమార్లు చార్జి మెమోలు అందించినా ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోగా రికవరీ కూడా చేయడం లేదు. ఉట్నూర్‌కు చెందిన ఎంపీడీవో చందర్ 9 లక్షల నిధులకు లెక్కలు చూపలే దు. మిగతా ఎంపీడీవోలు లక్షల్లో నిధులను జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలున్నాయి. తాండూరు పీఆర్ ఏఈఈ రూ.10,51,905, కెరమెరి ఏఈఈ రూ.18,51,717, ఉట్నూర్‌కు చెందిన ఏఈఈ రూ.17,12,428, జైనథ్ ఏఈ ఈ రూ.7,55,357, తాండూరుకు చెందిన ఏఈఈ రూ.5,61,987 నిధులు దుర్వినియోగం చేశారు. తాంసి ఏఈఈ రూ.94 లక్షల 63,531, భీమిని ఏఈఈ రూ.2 కోట్ల 75 లక్షల 86,110, ఆదిలాబాద్ ఏఈఈ రూ.కోటీ 3 లక్షల 49,200, దహెగాం ఏఈఈ 90 లక్షల 94,476 నిధులకు లెక్కలు చూపలేదు. వీరితోపాటు వాంకిడి, జన్నారం, తదితర మండలాల పీఆర్ ఏఈఈ, ఏటీడబ్ల్యూ ఏఈలు, ఎంపీడీవోలు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. -
నేడు విధులకు కలెక్టర్
అనంతపురం అర్బన్: సింగపూర్ పర్యటనకు వెళ్లిన కలెక్టర్ కోన శశిధర్ సోమవారం జిల్లాకు చేరుకున్నారు. మంగళవారం నుంచి ఆయన విధులకు హాజరుకానున్నారు. కలెక్టర్ ఈ నెల 23న కుటుంబ సమేతంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే. -
ప్రజల యోగక్షేమాలు చూసేది ఎల్ఐసీ ఒక్కటే
ఆదికవి నన్నయ్యయూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు ముగిసిన ఎల్ఐసీ బీమా వారోత్సవాలు ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ప్రజలు యోగక్షేమాలు చూసేది భారతీయ జీవితబీమాసంస్థ(ఎల్ఐసీ) ఒక్కటేనని ఆదికవి నన్నయ్య యూనవర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఎల్ఐసీ డైమండ్‌జూబ్లీ బీమా వారోత్సవాలు ముగింపు వేడుకలు స్థానిక సూర్య గార్డెన్స్‌లో బుధవారం సాయంత్రం సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు అధ్యక్షతనజరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రైవేటు సెక్టార్ల కంటే ప్రభుత్వ సెక్టార్లు మంచిసేవలు అందిస్తున్నాయన్నారు. ఎల్ఐసీ సేవాకార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు మాట్లాడుతూ 60 ఏళ్ల కాలంలో ఎల్ఐసీ సాధించిన ప్రగతిని వివరించారు. మార్కెటింగ్ మేనేజర్ ఈఏ విశ్వరూప్, సీఆర్ఎం డిప్యూటి మేనేజర్ కె.కేశవరావు మాట్లాడుతూ బీమా వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. యూనియన్ నాయకులు ఎస్.గన్నియ్య ఎల్ఐసీ ద్వారా అందిస్తున్న స్కాలర్ షిప్పులు అందుకున్న విద్యార్థులను పరిచయం చేసి వారికి బహమతులను అందజేశారు. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, ఎల్ఐసీ ఉద్యోగులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ఉద్యోగులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎల్ఐసీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు,ఏజెంట్లు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రజల యోగక్షేమాలు చూసేది ఎల్ఐసీ ఒక్కటే
ఆదికవి నన్నయ్యయూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు ముగిసిన ఎల్ఐసీ బీమా వారోత్సవాలు ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ప్రజలు యోగక్షేమాలు చూసేది భారతీయ జీవితబీమాసంస్థ(ఎల్ఐసీ) ఒక్కటేనని ఆదికవి నన్నయ్య యూనవర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఎల్ఐసీ డైమండ్‌జూబ్లీ బీమా వారోత్సవాలు ముగింపు వేడుకలు స్థానిక సూర్య గార్డెన్స్‌లో బుధవారం సాయంత్రం సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు అధ్యక్షతనజరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రైవేటు సెక్టార్ల కంటే ప్రభుత్వ సెక్టార్లు మంచిసేవలు అందిస్తున్నాయన్నారు. ఎల్ఐసీ సేవాకార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు మాట్లాడుతూ 60 ఏళ్ల కాలంలో ఎల్ఐసీ సాధించిన ప్రగతిని వివరించారు. మార్కెటింగ్ మేనేజర్ ఈఏ విశ్వరూప్, సీఆర్ఎం డిప్యూటి మేనేజర్ కె.కేశవరావు మాట్లాడుతూ బీమా వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. యూనియన్ నాయకులు ఎస్.గన్నియ్య ఎల్ఐసీ ద్వారా అందిస్తున్న స్కాలర్ షిప్పులు అందుకున్న విద్యార్థులను పరిచయం చేసి వారికి బహమతులను అందజేశారు. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, ఎల్ఐసీ ఉద్యోగులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ఉద్యోగులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎల్ఐసీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు,ఏజెంట్లు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు
కోదాడ: హైకోర్టును వెంటనే విభజించాలని, సీమాంధ్ర న్యాయమూర్తులను వారి స్వస్థలాలకు పంపాలని కోరుతూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు కోర్టు దిక్కార నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం కోదాడ జూనియర్ సివిల్‌కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈదుల కష్ణయ్య మాట్లాడుతూ వెంటనే కోర్టు ధిక్కార నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు ప్రజాస్వామ్య బద్దంగానే తమ నిరసన వ్యక్తం చేస్తే దానికి నోటీసులు జారీ చెయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ముల్కా వెంకటరెడ్డి, గాలి శ్రీనివాసనాయుడు, రంజాన్పాష, ఎల్. ధనమూర్తి, చింతకుంట్ల రామిరెడ్డి, కేఎల్ఎన్ ప్రసాద్, మందా వెంకటేశ్వర్లు, పగడాల రాంమచంద్రారెడ్డి, ఎలుక సుధాకర్‌రెడ్డి, రంగారావు, విజయ్‌కుమార్, యశ్వంత్ రామారావు, గట్ల నర్సింహారావు, ఉయ్యాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 8 నుంచి స్కూళ్లకు సెలవు
పుష్కరాల సందర్భంగా విజయవాడలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు ఆగస్టు 8 నుంచి 25వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఆయా విద్యాసంస్థల భవనాల్లో పుష్కర విధులకు వచ్చే సిబ్బందికి వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. అన్ని భవనాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని, ఏ సంస్థకూ దీని నుంచి మినహాయింపు ఉండదని స్పష్టంచేశారు. ఆయా భవనాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. -
నిధులున్నా.. పనులు సున్నా!
ఆగిన ప్రతిపాదనలు ఏఈ లేక కుంటుపడుతున్న అభివృద్ధి కీలకపోస్టు ఖాళీ ఉన్నతాధికారులకు నివేదించినా.. స్పందన కరువు పరకాల : నగర పంచాయతీలో కీలకపోస్టు ఖాళీ అయ్యింది. సంబంధిత అధికారి లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయాలని నివేదిక అందించిన ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ప్రధాన ఆటంకంగా మారింది. నగర పంచాయతీలో కమిషనర్ తరువాత కీలకపోస్టు ఏఈ. నగర పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఏఈగా రవీంద్రనాథ్ విధులు నిర్వహించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తునే భూపాలపల్లి నగర పంచాయతీకి ఇన్చార్జిగా వ్యవహారించారు. ఈక్రమంలో రవీంద్రనాథ్ను భూపాలపల్లి ఏఈగానే పూర్తి బాధ్యతలను అప్పగించారు. దీతో మే 30వ తేదీన పరకాల నుంచి ఆయన వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఏఈ పోస్టు ఖాళీగా మారింది. కనీసం ఇన్చార్జిని నియమించకపోవడంతో ఆ బాధ్యతలను కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రతిపాదనలకు ఆటంకం.. నగర పంచాయతీ అభివృద్ధి కోసం సీఎం స్పెషల్ ఫండ్ మంజూరు చేశారు. కూరగాయల మార్కెట్ ఆధునీకరణ కోసం రూ.1కోటి, అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు, బస్టాండ్ నుంచి ఆర్టీసీ డిపో వరకు, బస్టాండ్ నుంచి బుడిగజంగాల కాలనీలోని నగర పంచాయతీ కార్యాలయం వరకు సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.60కోట్లు, నూతన నగర పంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.1.50కోట్లు, స్లాటర్ హౌజ్(గొర్రె, మేల వధశాల) నిర్మాణం కోసం రూ.50 లక్షల నిధులు విడుదలయ్యాయి. వీటితోపాటుగా 14వ ఫైనాన్స్ రూ. 1కోటి నిధులు విడుదలయ్యూరుు. ఈ పనులకు ప్రతిపాదనలు చేసే బాధ్యత ఏఈపైనే ఉంటుంది. కాని ఏఈ లేక పోవడంతో నిధులున్న ప్రతిపాదనలు చేసే నాథుడు లేక ఆటంకం కలుగుతోంది. కొత్త ఏఈ లేక పోవడంతో ఎక్కడిపనులు అక్కడే ఆగుతున్నాయి. నిధులు ఉన్నప్పటికీ పనుల బాధ్యతను చూసే అధికారి లేక అభివృద్ధి ముందుకు సాగడం లేదు. వీటితోపాటుగా స్వచ్ఛభారత్ మిషన్ కింద నిర్మాణం చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నారుు. ముఖ్యంగా మిషన్ భగీరథ కింద ప్రారంభించిన రూపాయికే నల్లా కనెక్షన్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేక ఇబ్బందులు పడుతుండగా ఏఈ పోస్టుఖాళీగా మారడంతో కమిషనర్‌పై అదనపు బాధ్యత నిర్వర్తించాల్సి వస్తోంది. -
డుమ్మా కుదరదిక
సిబ్బంది పని తీరుపై డేగకన్ను అమలైతే డుమ్మా కొట్టే వారి ఆటకట్టు కసరత్తు చేస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆ శాఖ లక్ష్యం ఉన్నతం.. తల్లీబిడ్డల క్షేమం కోరి పలు పథకాలు అమలు చేసింది. క్షేత్రస్థాయిలో మాతా శిశువులకు అందలేదు. కారణం అంగన్వాడీ కార్యకర్తలు విధులకు డుమ్మా కొట్టడమేనని ప్రభుత్వ సర్వేలో తేలింది. కేంద్రాలు నడపకుండా డుమ్మా కొట్టే అంగన్వాడీ కార్యకర్తలకు చెక్ పెట్టేందుకు స్త్రీ శిశుసంక్షేమ శాఖ బయోమెట్రిక్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విధానం అమలైతే విధులకు గైర్హాజరయ్యే అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బంది ఆటలకు చెక్ పెట్టినట్టే. చిత్తూరు(గిరింపేట): జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తల సమయపాలన కోసం బయోమెట్రిక్ ఏర్పాటు చేయనున్నారు. తల్లీ బిడ్డ సంక్షేమం కోసం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ పలు పథకాలను అమలు చేస్తోంది. ఇందులో గర్భిణుల్లో రక్తహీనత, మాతాశిశు మరణాలను నివారణ, కిశోర బాలికలకు పౌష్టికాహారం, నిరుపేద చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది.ఈ పథకాల అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.వేలాది కోట్లు విడుదల చేస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రగతి కనిపించలేదు. ఇందుకు గల కారణాలను గుర్తించగా క్షేత్ర స్థాయిలోని సిబ్బంది సక్రమంగా పని చేయడం లేదని తేలింది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బందితో పనిచేయించడం, సమయపాలనకు అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఆ దిశ గా చర్యలు చేపడుతోంది. త్వరలో ఈ విధానం జిల్లాలో అమలుకానుంది. ఈ విధానం అమలైతే ఇప్పటివరకు యూనియన్ సమావేశాలు, ఆ పనులూ, ఈ పనులూ అంటూ తమ విధులకు డుమ్మా కొట్టేవారిని గుర్తించి కొరడా ఝళిపించనుంది. వేలలో సిబ్బంది జిల్లాలో 3640 అంగనవాడీ కేంద్రాలున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు - 3640, మినీ అంగన్వాడీ కేంద్రాలు 1128 ఉన్నాయి. వీటిలో ఓ కార్యకర్త, ఓ ఆయా వంతున 9,536 మంది పనిచేస్తున్నారు. వీటిని పాలనా సౌలభ్యం కోసం మొత్తం 21 ప్రాజెక్టులుగా విభజించారు. ఆయా ప్రాజెక్టులో కేంద్రాల పర్యవేక్షణకు 21 మంది చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు( సీపీడీఓ), 10 మంది అడిషనల్ చైల్డు డెవలప్మెంట్ ఆఫీసర్లు(ఏసీడీపీవో), రోజు వారీ తనిఖీల నిమిత్తం సూపర్వైజర్లు గ్రేడ్-1లో 51 మంది. గ్రేడ్-2లో 65 మంది పనిచేస్తున్నారు. లక్షలాది మందికి లబ్ధి అంగన్వాడీ కేంద్రాల ద్వారా దారిద్య్రరేఖకు దిగువనున్న బాలింతలకు, గర్భిణులు, మురికివాడలలో నివసిస్తున్న 6 నుంచి 72 నెలలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పథకం అమలు చేస్తున్నారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఆకు కూరతో భోజనం, బాలింతలు, గర్భిణులకు టేక్ హోమ్ రేషన్(టీహెచ్ఆర్) ఇస్తున్నారు. ఈ పథకాల ద్వారా సుమారు 85 వేల మంది గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్లలోపు ఉన్న 1,00,850 మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఒక్కో కేంద్రం లో 30 నుంచి 40 మంది దాకా పిల్లలు ఆ కేంద్రాల్లోనే భోజనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాలు సక్రమం గా పనిచేయకపోవడంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం, టేక్‌హోమ్ రేషన్ అందడం లేదు. దీంతో నిధులు దుర్వినియోగమై పక్కదారి పడుతున్నాయి. ఈ క్రమంలో పథకాన్ని పక్కా అమలు చేసి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ లక్ష్యం సాధించాలన్న ఆలోచనతో బయోమెట్రిక్‌ను ప్రవేశపెడుతున్నారు. బయోమెట్రిక్‌తో సిబ్బంది హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టి, కేంద్రాలకు సక్రమంగా రాని సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు. -
‘దళితుడిననే నాపై విమర్శలు’
ఎంపీపీ ఈర్ల సదానందం రేగొండ : ఎంపీపీగా దళితుడిననే ఎంపీటీసీలు విమర్శిస్తున్నారని స్థానిక ఎంపీపీ ఈర్ల సదానందం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతి నిధులను సర్వసభ్య సమావేశంలో వివరించిన అనంతరం ఆమోదం పొందిన వాటికి మాత్రమే నిధులను విడుదల చేసి ప్రతీది రికార్డు ప్రకారమే ప్రజా అవసరాల ప్రకారం ఖర్చు చేశానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల తీర్మానం మేరకే ఎంపీటీసీలకు నిధులు విధులు అనేవి కల్పించడం జరగుతుందని, కేవలం మండల సభ తీర్మానంతో ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించబడవన్నారు. ఇప్పటికైన కేవలం రాష్ట ప్రభుత్వంతోనే ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులను విధులను కల్పించడం సాధ్యం కాదనే విషయాన్ని ఎంపీటీసీలు గమనించాలన్నారు. -
ఉత్తమ సేవలకు ఉగాది పురస్కారం
తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, క్రైం ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిలకు మహోన్నత సేవా పతకాలు ఆగస్ట్ 15న సీఎం చేతుల మీదుగా అవార్డుల ప్రదానం తిరుపతి క్రైం/చిత్తూరు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలోని వివిధ విభాగాలైన ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పీఎఫ్, పీపీటీసీల్లో ఉత్తమ సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఇద్దరు మహోన్నత సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి. తిరుపతి క్రైం ఎస్ఐ ప్రభార్ రెడ్డి ఉన్నారు. శంకర్‌రెడ్డి 2001లో ఎస్ఐ ఉన్నప్పుడు సేవా పతకం అందుకున్నారు. తర్వాత 2006లో సీఐగా పనిచేసేటప్పుడు ఉత్తమ సేవా పతకం వరించింది. ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీగా పలు కేసులు ఛేదించారు. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2016 ఉగాది పండుగ సందర్భంగా ఇచ్చే మహోన్నత సేవా పతకానికి ఎంపిక చేసింది. ఈయన ప్రస్తుతం తిరుపతిలో ఏసీబీలో పనిచేస్తున్నారు. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి మొదట కానిస్టేబుల్‌గా విధులు చేపట్టారు. ఇప్పటిదాకా ఈయన ఉత్తమసేవలు అందించి 800 రివార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఈయన సీసీఎస్ క్రైంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1993లో రాష్ట్ర ప్రభుత్వం ఈయన సేవలను గుర్తించి ఉత్తమ సేవా పతకం, 2003లో ఐపీఎం (ఇండియన్ పోలీస్) మెడల్ ఇచ్చారు. 2016 ఉగాది పండుగ సందర్భంగా ఇచ్చే మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం తిరుపతి క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. పలువురికి సేవా పతకాలు వివిధ పోలీస్స్టేషన్లలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సేవాపతకాలను ప్రకటించింది. ఇందులో తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ, సీఐడీ డీఎస్పీ అభిషేకం, ఎస్ఏఎఫ్ ఏఎస్ఐ జి.చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మేనీ.వెంకట్రమణ ఉన్నారు. అదేవిధంగా పోలీస్సేవా పతకానికి వెస్ట్ సీఐ అంజూయాదవ్, సీఐ అనీషా, ఎం.సుధాకర్‌రెడ్డి, కళ్యాణ్‌డ్యామ్ పోలీస్ శిక్షణా కళాశాల ఏఆర్ఎస్ఐ వి.ఆర్.మురుగన్, తిరుమల పోలీస్ హెడ్‌కానిస్టేబుళ్లు ఎస్.రాజేంద్ర, సుధాకర్, ఎస్పీఎఫ్ ఎస్.జగదీష్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్‌కానిస్టేబుల్ జయచంద్రారెడ్డి, ఈస్ట్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ వెంకటచలపతి ఎంపికయ్యారు. వీరికి 2016 ఆగస్ట్ 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. చిత్తూరు అర్బన్ జిల్లా పరిధిలో నలుగురికి పురస్కారాలు చిత్తూరు పోలీసు జిల్లాలో పనిచేస్తున్న నలుగురు పోలీసులకు 2016- ఉగాది పురస్కారాలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు డీసీఆర్బీ (జిల్లా నేర చిట్టాల విభాగం)లో పనిచేస్తున్న సుధాకరరెడ్డి, చిత్తూరులోని ఆపరేషన్‌రెడ్‌లో పనిచేస్తున్న సీఐ షాదిక్అలీ, మొలకలచెరువు సీఐ రుషికేశవ్లతో పాటు వాల్మీకీపురం ఏఎస్ఐ లీలావతమ్మలకు ఉగాది పురస్కారాలు ప్రకటించారు. వచ్చే ఏడాది వీటిని అందుకోనున్నారు. 07టీపీయల్148ఎ-26120013 పోలీస్ సేవా అవార్డు గ్రహిత జయచంద్ర(విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్‌కానిస్టేబుల్) -149ఎఃప్రభాకర్రెడ్డి, సీసీఎస్ క్రైం తిరుపతి (మహోన్నత సేవా పతకం) -150ః సుధాకర్, సీసీఎస్ క్రైం తిరుమల (సేవా పతకం) -151ః రాజేంద్ర, తిరుమల సీసీఎస్ (సేవాపతకం) -152ః అభిషేకం,సీఐడీ డీఎస్పీ(సేవాపతకం) -153ః అంజూయాదవ్, వెస్ట్సీఐ (పోలీస్ పతకం) -154ః శంకర్ రెడ్డి, ఏసీబీ డీఎస్పీ(మహోన్నతసేవాత పతకం) -
ఎన్ఎంఆర్ కార్మికులు ఇంటికే
సోమవారం నుంచి విధులకు రావద్దని చెప్పిన తుమ్మపాల కర్మాగారం ఎండీ ఆందోళన చేసిన కార్మికులతో చర్చలు.. 20 వరకు కొనసాగిస్తామని స్పష్టీకరణ బకాయిలు రాకపోవడంతో కార్మికుల ఆకలికేకలు ప్రభుత్వం తరుపున ఆర్డీవో చెప్పే ప్రకటన కోసం ఎదురుచూపు అనకాపల్లి: తుమ్మపాల చక్కెర కర్మాగారం పరిధిలో ఉద్యోగులను ఇంటికి పంపించే కార్యక్రమం మొదలైంది. తాజాగా 140 మంది ఎన్‌ఎంఆర్‌లు విధులకు రావద్దంటూ కర్మాగారం ఎండీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కార్మికుల్లో కలవరం మొదలైంది. ఏటాలాగే ఈ ఏడాది కూడా క్రషింగ్ కోసం ఆగస్టు నుంచే ఎన్ ఎంఆర్ కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. రెగ్యులర్ కార్మికులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా 19 నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. అయినప్పటికీ గానుగాట జరుగుతుందనే ఆశతో కార్మికులు ఉత్సాహంగా ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టారు. వాస్తవానికి కర్మాగారం కష్టాల్లో ఉన్న నేపధ్యంలో గానుగాటపై స్పష్టత లేకుండా ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టడం తప్పిదమే. ఈ క్రమంలోనే కార్మికులు సైతం యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.10 లక్షలతో ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టగా అప్పటికే గానుగాట లేనట్లుగా సంకేతాలు వచ్చాయి. దీంతో ఆ సొమ్మంతా వృథా అయింది. ఆఖరి నిమిషం వరకు గానుగాటపై ఆశలు చిగురింప చేసిన యాజమాన్యం అసలు విషయాన్ని దాచింది. వాస్తవానికి డిసెంబర్ 4వతేదీకే ఈ ఏడాదికి తుమ్మపాల గానుగాట లేదని యాజమాన్యానికి స్పష్టత వచ్చినా పూర్తిస్థాయి గోప్యత ప్రదర్శించింది. దీంతో రైతులు, కార్మికులు గానుగాట కోసం ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. 33వరోజుకు చేరిన దీక్షలు.. రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని, గానుగాట జరపాలని డిమాండ్‌చేస్తూ చక్కెర కర్మాగార పరిరక్షణ కమిటీ చేపట్టిన దీక్షలు శనివారంతో 33వరోజుకు చేరాయి. ఎండీ చాంబర్లో నిరసన ఎన్ఎంఆర్ కార్మికులను సోమవారం నుంచి విధులకు హాజరుకావద్దని ఎండీ తెలపడంతో కార్మికులు ఎండీ చాంబర్లో బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు రూ.10 లక్షలతో చేపట్టిన ఓవర్‌హాలింగ్ పనులు వృథాగా పోతాయని, యంత్రాలు పూర్తిగా పాడవుతాయని కార్మికులు పేర్కొనడంతో ఎండీ ఉన్నతాధికారులను సంప్రదించారు. తద్వారా ఈనెల 20 వరకు 140 మంది ఎన్ఎంఆర్ కార్మికులను కొనసాగించి యంత్రాలను విడదేసే పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈలోపు కార్మికుల జీతాలను చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో సోమవారం కర్మాగారానికి రానున్న ఆర్డీవో ప్రభుత్వం తరుపున ఇచ్చే హామీని తెలపనున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మేరకు రైతుల బకాయిలు చెల్లిస్తామే తప్ప కార్మికులు జీతాల కోసం ఆగాలని చెప్పడంతో కార్మికుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. కర్మాగార కార్మికుల బకాయిలు 3 కోట్లు, పీఎఫ్ బకాయిలు 1.5 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 1.5 కోట్లు రావాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా రాలేదు. ఈ నేపధ్యంలో ఆర్డీవో ఏంచెబుతారోనని అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. -
రూ. 90 కోట్లు.. 31 ఫంక్షన్ హాళ్లు
పనులకు టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ పెళ్లిళ్లతోపాటు సభలు, సమావేశాలకు వీలుగా మల్టీపర్పస్‌గా నిర్మాణం ఒక్కోదాని అంచనా వ్యయం రూ. 2.90 కోట్లు ఆగస్టు పది నుంచే పనులు ప్రారంభం కావాలి: కమిషనర్ సోమేశ్‌కుమార్. హైదరాబాద్: గ్రేటర్ ప్రజలు ఫంక్షన్లు, పెళ్లిళ్లు, తదితర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు రూ. 90 కోట్లతో 31 బహుళ వినియోగ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో సంబంధిత ఇంజనీర్లు టెండర్లు ఆహ్వానించారు. విశ్వనగరంలో భాగంగా ఓవైపు ఎస్సార్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్) పనుల కోసం రూ. 2631 కోట్లు మంజూరు చేస్తూ, ప్రభుత్వం జీహెచ్ఎంసీకి పరిపాలనపర అనుమతులివ్వడం తెలిసిందే. వాటికి అతిత్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈలోగా జీహెచ్ఎంసీ నిధుల నుంచే రూ. 90 కోట్లతో ఫంక్షన్ హాళ్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు. అంతర్జాతీయ ప్రమాణాల ఫ్లై ఓవర్లు.. స్లమ్ఫ్రీలో భాగంగా పేదలకు ఉపకరించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోపాటు పేదలు, దిగువ మధ్యతరగతి వారి కోసం మార్కెట్లు, ఫంక్షన్‌హాళ్లు, బస్షెల్టర్లు తదితరమైనవి లేకపోవడం గుర్తించిన సీఎం కె. చంద్రశేఖరరావు వాటి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం తెలిసిందే. అందుకు అనుగుణంగా వాటి ఏర్పాటు కోసం గత కొద్ది వారాలుగా స్థలాలను అన్వేషించిన అధికారులు ఆయా అవసరాల కోసం తగిన స్థలాలను గుర్తించారు. వాటిల్లో 31 ప్రాంతాల్లో బహుళ ఉపయోగ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మొత్తం 50 ఫంక్షన్‌హాళ్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా, తొలుత సర్కిల్‌కు రెండు చొప్పున 18 సర్కిళ్లలో వెరసి 36 ఫంక్షన్‌హాళ్లు నిర్మించాలని భావిస్తున్నారు. స్థలం అందుబాటులో ఉన్న 31 ప్రదేశాల్లో ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఒక్కోహాలు అంచనా వ్యయం రూ. 2.90 కోట్లు. టెండర్ల ప్రక్రియను ఆగస్టు 10 లోగా పూర్తిచేసి వెంటనే పనులు ప్రారంభించాలని కమిషనర్ ఆదేశించారు. టెండర్లకు ఎందుకింత తొందర? 31 ఫంక్షన్ హాళ్లల్లో నాలుగింటికి ఈనెల 28 నుంచే టెండర్లు ఆహ్వానించగా, శుక్రవారం సాయంత్రానికి గడువు కూడా ముగిసింది. మిగతా వాటికి 7వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువుంది. పనులు నాణ్యంగా జరిగేందుకు అర్హులైన వారు ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేందుకు తగినంత సమయం ఇవ్వకుండా నాలుగింటికి హడావుడిగా గడువు కూడా ముగిసిపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. త్వరలో మార్కెట్లు, బస్షెల్టర్లు..: ఇప్పటికే ఆయా స్థలాలను పలు అవసరాల కోసం గుర్తించిన అధికారులు ఇతర స్థలాల్లో ఆధునిక మార్కెట్లు, బస్షెల్టర్లు, పార్కింగ్ ప్రదేశాలు(ఆటో, ట్యాక్సీస్టాండ్లతోపాటు), ఆధునిక దోబీఘాట్లు, మహిళల టాయ్లెట్లు, ఆటస్థలాలు, జిమ్‌లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి ప్రత్యేక మార్గదర్శకాలివి.. దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలోమూడంతస్తులుగా నిర్మించాలి. ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు. మరో అంతస్తులో భోజనాలకు ఏర్పా ట్లు. సెల్లార్లో పార్కింగ్ సదుపాయం. పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునేలా ఏర్పాట్లు. ఫంక్షన్‌హాళ్లు నిర్మించనున్న ప్రదేశాలు.. ఇప్పటికే టెండరు గడువు ముగిసినవి.. 1. జుమ్మెరాత్‌బజార్(పురానాపూల్-ముస్లింజంగ్ బ్రిడ్జి) 2. ఆజాద్ మార్కెట్, ఇసామియా బజార్ 3. మునిసిపల్ కళ్యాణమంటపం (శాంతినగర్) 4.దూద్‌బావి, రైల్వే క్వార్టర్స్ దగ్గర, చిలకలగూడ టెండర్లకు 7వ తేదీ వరకు గడువున్నవి... 5. చక్రిపురం చౌరస్తా, కుషాయిగూడ 6. పోలీస్‌స్టేషన్ వెనుక, కుషాయిగూడ 7. శ్రీరామ్‌నగర్‌కాలనీ, (కాప్రాసర్కిల్) 8. కొత్తపేట. 9. గాంధీ విగ్రహం వద్ద(ఎల్బీనగర్ సర్కిల్) 10. సుబ్రహ్మణ్యం కాలనీ(సర్కిల్-4) 11.భానునగర్ (సర్కిల్-4) 12. మైలార్‌దేవ్‌పల్లి (రాజేంద్రనగర్ సర్కిల్) 13. అత్తాపూర్ విలేజ్(రాజేంద్రనగర్ సర్కిల్) 14.భోజగుట్ట(సర్కిల్-7) 15. అంబర్‌పేట 16. హకీంబాబా దర్గా, ఫిల్మ్‌నగర్ 17. బంజారాహిల్స్ 18.లక్ష్మీనరసింహస్వామి ఆలయం, షేక్‌పేట 19. గచ్చిబౌలి 20. రాయదుర్గం 21. చందానగర్ 22. హఫీజ్‌పేట 23.రైల్వేట్రాక్ వద్ద, శాంతినగర్ (సర్కిల్-13) 24. బొబ్బుగూడ మార్కెట్ (కూకట్పల్లి సర్కిల్) 25.ఆల్విన్‌కాలనీ 26. జగద్గిరిగుట్ట 27. సర్వే నం.2/2 ఓల్డ్ అల్వాల్ 28. హెచ్ఎంటీ కాలనీ 29.టీఆర్టీ క్వార్టర్స్, సికింద్రాబాద్ 30. కేపీహెచ్‌బీ 31. ఫేజ్ 2 హౌసింగ్‌కాలనీ(నార్త్‌జోన్) -
బహు పాత్రాభినయం !
చిత్తూరు నగరపాలక సంస్థలో అందరికీ ఇన్‌చార్జ్‌ల బాధ్యత భర్తీకాని కొత్త పోస్టులు పదోన్నతుల కోసం పడిగాపులు చిత్తూరు (అర్బన్): జిల్లా కేంద్రమైన చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని సిబ్బంది వివిధ రకాల విధులు నిర్వర్తిస్తూ బహు పాత్రాభినయం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల్ని ఎవరూ భర్తీ చేయమని అడగడంలేదు. ఇక మాకు అన్నీ అర్హతలు ఉన్నాయి.. పదోన్నతులు ఇవ్వం డయ్యా అని అడిగినా వినిపించుకోవడంలేదు. చేసేదేమీలేక ఉన్న సిబ్బందే పలు సీట్లకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తూ ఊడి గం చేస్తున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ తరువాత పరిపాలన మొత్తం సహాయ కమిషనర్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏడాదికి పైగా సహాయ కమిషనరు పోస్టు ఖాళీగా ఉంది. కార్యాలయంలో మేనేజరుగా పనిచేస్తున్న అధికారే సహాయ కమిషనరుగా, సీ-1 గుమాస్తా, రెవెన్యూ అధికారి పనిని చక్కబెడుతూ బహుపాత్రల్ని పోషిస్తున్నారు. {పజారోగ్య శాఖ విభాగంలో బహు పాత్రాభినయం చేసే వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కార్పొరేషన్‌కు ఐదే శానిటరీ ఇన్స్పెక్టర్ల పోస్టులు మంజూరయినా ఇక్కడ ఉన్నది మాత్రం ఒక్కరే. దీంతో నలుగురు మేస్త్రీలకు అదనంగా శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవ్వడం తో అందరూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే కార్మికుల జీత భత్యా లు, డీఅండ్‌వో ట్రేడ్ లెసైన్సులు చూసే ఎఫ్-1, ఎఫ్-2 విధులను ఒక్కరే నిర్వర్తిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెవెన్యూ విభాగంలో ఐదు యూడీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల పోస్టులు ప్రభుత్వం నుంచి మంజూరైనా భర్తీకి మాత్రం నోచుకోలేదు. ఫలితంగా ఇద్దరు ఆర్ఐలు నాలుగు పోస్టుల్ని పంచుకున్నారు. వాణిజ్య భవనాల నుంచి అద్దెలు వసూలు చేయాల్సిన ఏ-1 పోస్టు చూసే వ్యక్తే మీటింగ్ గుమాస్తా పని సైతం చేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో సివిల్ పనులు చూసే అసిస్టెంట్ ఇంజనీరు ఎలక్ట్రికల్ బాధ్యతను మోస్తున్నారు. ఇక పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కూడా నత్తనడకన సాగుతోంది. అర్హత ఉన్న వారిని పదోన్నతులు ఇవ్వకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. కమిషనరు క్యాంప్ క్లర్క్‌గా ఉన్న వ్యక్తే పట్టణ ప్రణాళిక విభాగంలో జీ-2 గుమాస్తా పనిచేస్తూ ద్విపాత్రభియనం చేస్తున్నారు. ఇలా కార్పొరేషన్ కార్యాలయంలో చాలా మంది అధికారులు, సిబ్బంది అదనపు బాధ్యతల్ని నిర్వర్తిసున్నారు. ప్రభుత్వానికి నివేదించాం కార్పొరేషన్‌కు కొన్ని పోస్టులు మంజూరయ్యాయి. మరికొన్ని పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. నియామకాలు జరగకపోవడంతో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయమని రాష్ట్ర పురపాలక పరిపాలన సంచాలకుల ద్వారా ప్రభుత్వాన్ని అడిగాం. అక్కడి నుంచి చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇక అర్హత ఉన్న ఉద్యోగులకు త్వరలో పదోన్నతులు ఇచ్చేస్తాం. - జి.శ్రీనివాసరావు, కమిషనరు, చిత్తూరు కార్పొరేషన్ -
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు
కర్నూలు : శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సబ్ డివిజన్ల వారీగా డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలన్నారు. మట్కా, బెట్టింగ్, పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆదోనిలో మట్కా జోరుగా సాగుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలుసుకుని ఆదోని డీఎస్పీతో పాటు సీఐల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. మట్కా మహమ్మారిపై జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించాలని ఆదేశించారు. మట్కా నిర్వాహకులతో అధికారులకు సంబంధాలు ఉన్నట్లు వెలుగు చూస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ కేసులను ఆరా తీసి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీలు వారి పరిధిలోని కేసులపై శ్రద్ధ వహించాలన్నారు. మట్కా నిర్వాహకులను జిల్లా నుంచి తరిమివేయాలని సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు రాయచూరు, బళ్లారి ప్రాంతాలకు వెళ్లి మట్కా నిర్వహిస్తున్నవారిని, వారిని నియంత్రించడానికి కర్ణాటక పోలీసు అధికారులతో చర్చించాలని ఆదోనిడీఎస్పీని ఆదేశించారు. దోపిడీలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలపై ఆరు నెలలకొకసారి సీఐలతో సమావేశాలు నిర్వహించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీలకు సూచించారు. మతకలహాలు జరిగే ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లా కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మసలుకోవాలని సూచించారు. రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, తరచూ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. నంద్యాలలో ఒక హత్య కేసు ఛేదించినందుకు గాను డాగ్ స్క్వాడ్ హ్యాండ్లర్కు రివార్డు ప్రకటించారు. మాధవరం ఎస్ఐ వ్యక్తిత్వం మార్చుకోవాలని హెచ్చరించి ఆయన పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో నష్టపోతావని డోన్ పట్టణ ఎస్ఐ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సరిహద్దులో వాహనాలు లేని పోలీస్స్టేషన్లకు వాటిని సమకూరుస్తున్నట్లు చెప్పారు. కొంతకాలంగా జిల్లాలో లారీల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జలదుర్గం, జిల్లెల వంటి గ్రామాల్లో అంటరానితనాన్ని పూర్తిగా రూపు మాపాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సెల్‌ను ఇంకా అభివృద్ధి చేసుకొని పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆళ్లగడ్డ ఏఎస్పీ శేషుకుమార్, డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, పి.ఎన్.బాబు, ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, బి.ఆర్.శ్రీనివాసులు, వి.వి.నాయుడు, హరినాథరెడ్డి, దేవదానం, మురళీధర్, వినోద్‌కుమార్, సుప్రజతో పాటు సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
విధుల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించాలి
అనంతపురం క్రైం : రోజురోజుకీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విధుల్లో జోడించి, ప్రజలకు మెరుగైన సేవలందిద్దామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్, అనంతపురం రేంజ్ డీఐజీ బి.బాలకృష్ణ, ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు పిలుపునిచ్చారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు శాఖ అధికారులతో పాటు ఆర్టీఏ, ఆర్అండ్బీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అటవీ, ఎక్సైజ్, ఆర్టీసీ, వైద్య, ఫోరెన్షిక్ మెడిసిన్, స్త్రీశిశు సంక్షేమ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సీఐడీ, మునిసిపల్ అధికారులతో అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? మున్ముందు ఏం జరగబోతోంది? అనే అంచనాలతో పాటు సమాచారం పోలీసులు సేకరించాలన్నారు. ఇందుకోసం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్‌ను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకుని అందుకనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. రహదారుల భద్రత కోసం ప్రతి మూన్నెళ్లకోసారి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహించి, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. సామాన్యుడికి సేవలు అందించేందుకు కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా అధికారుల వరకు సమన్వయంతో పని చేయాలన్నారు. డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు గట్టిగా పని చేస్తే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిజాయితీ, నిష్పక్షపాతంగా పని చేస్తే ఫ్యాక్షన్ ప్రాంతాల్లో సైతం పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కల్గుతుందన్నారు. ఫ్యాక్షన్ నియంత్రణ కోసం ఇదివరకూ తీసుకున్న గ్రామాల సందర్శన, పల్లెనిద్ర, కార్డినల్ సెర్చ్, ఆకస్మిక తనిఖీలు, కానిస్టేబుళ్లతో గ్రామాలపై నిఘా తదితర చర్యలు మున్ముందు కొనసాగించాలన్నారు. అదనపు ఎస్పీ కే.మాల్యాద్రి, ఏఎస్పీ అభిషేక్ మహంతి, డీఎఫ్ఓ రాఘవయ్య, డీటీసీ సుందర్‌వద్ది, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వరావు, డీఎస్పీలు మల్లికార్జునవర్మ, సుబ్బారావు, రవికుమార్, ఖాసీంసాబ్, సీఎం గంగయ్య, బీ. విజయ్‌కుమార్, నరసింగప్ప, మహబూబ్‌బాషా, వెంకటరమణ, దుర్గాప్రసాద్, నాగరాజు, శివరామిరెడ్డి, ఎస్ఎం బాషా, రామాంజనేయులు, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. విధులు, సాంకేతిక పరిజ్ఞానం, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, Functions, technology, the District Collector Mr. Kona -
నేడు పల్స్‌పోలియో
ఏర్పాట్లు పూర్తి 11 వేల మంది సిబ్బంది నియామకం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణికోటీశ్వరి చిత్తూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉదయం 8.30 గంటల నుంచి పోలియో చుక్కలను పిల్లలకు వేయనున్నారు. ఇందు కోసం 11,616 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా ఐదేళ్లలోపు వయస్సుగల 4,77,721 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మే రకు శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ కె.కోటీశ్వరి ఈ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2017 నాటికి పోలియో లేని దేశంగా భారత్ అవతరించడానికి ప్రభుత్వాలు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లాలో ఆది వారం సామూహికంగా పిల్లలకు పోలియో చుక్కల్ని వేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 2,854 పల్స్ పోలియో బూత్‌లు, వంద సంచార బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు పోలియో చుక్కలు వేయించుకోవడానికి అనువుగా రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లలో సైతం సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ఇక జిల్లాలో 394 హైరిస్క్ ప్రాంతాల్లో 2,850 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యం గా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 18వ తేదీన పోలియో చుక్కలు వేయించుకోలేని పిల్లల్ని గుర్తించి 19, 20 తేదీల్లో పోలియో చుక్కలు వేస్తామన్నారు. జ్వరం, దగ్గు లాంటి ఇబ్బందులున్న పిల్లలు, ముందు రోజు పోలి యో చుక్కలు వేయించుకున్న పిల్లలు సైతం ఆదివారం తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో మందును వేయించుకోవాలన్నారు. తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, బోయకొండ ఆలయాలకు వచ్చే భక్తుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి సైతం ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాకు 6 లక్షల వ్యాక్సిన్లు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు వరసుందరం, వెంకటప్రసాద్, టి.సురేఖ, టి.మునిరత్నం, దోసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇలాగైతే విధులు నిర్వర్తించలేం
ప్రొద్దుటూరు క్రైం: వైద్యుడిపట్ల అనుచితంగా ప్రవర్తించిన రేడియో గ్రాఫర్‌పై చర్యలు తీసుకోకుంటే ఎన్ని రోజులైనా విధులకు హాజరయ్యేది లేదని జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలోని ఎక్స్‌రే ల్యాబ్‌లో ఉన్న రేడియోగ్రాఫర్ రామచంద్రయ్య క్యాజువాలిటీలో ఉన్న వైద్యుడు శివరాంను దూషించడమే గాక అనుచితంగా ప్రవర్తించినందుకు నిరసనగా సోమవారం వైద్యులందరూ విధులను బాయ్‌కాట్ చేశారు. ముందుగా వైద్యులందరూ క్యాజువాటీలో సమావేశమయ్యారు. అందరి అభిప్రాయం మేరకు విధులను బహిష్కరిస్తున్నట్లు వైద్యులు శివరాం, సుధీర్‌రెడ్డి ప్రకటించారు. ఆస్పత్రిలో వైద్యులంటే ఎవరికీ గౌరవమే లేదని ఈ సందర్భంగా డాక్టర్ శివరాం అన్నారు. ఇలానే ఉంటే ప్రతి ఒక్కరూ వైద్యులపై తిరగబడతారన్నారు. ఇంత చదువు చదివింది వీళ్లతో మాటలు పడటానికా అని ఆవేదన చెందారు. ఎక్స్‌రే కోసం ఫోన్ చేయాలంటే క్యాజువాలిటీ లోని నర్సులు కూడా భయపడుతున్నారన్నారు. ఎక్స్‌రే ఎందుకు రాస్తున్నావని వైద్యుడిని ప్రశ్నించడం ఎక్కడా జరగలేదన్నారు. నర్సింగ్ సిబ్బంది, రోగుల మధ్య రేడియోగ్రాఫర్ తనను దూషించాడన్నారు. అందుకు బాధిత రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బందే సాక్ష్యమన్నారు. ఇంత చేసి కూడా మళ్లీ తమపైనే నిందారోపణలు చేయడం సమంజసంగా లేదన్నారు. 24 గంటల్లో రేడియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోకుంటే తదుపరి కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తామన్నారు. మరో వైద్యుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మద్యం మత్తులో విధులకు హాజరు కావడమే గాక ఒక డాక్టర్‌ను దూషించడం ఎంత మాత్రం సబబుగా లేదన్నారు. ఆది నుంచి ఆయన ప్రవర్తన అంతే.. డాక్టర్ శివరాం సంఘటన జరిగిన తర్వాత వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందరూ ముందుకు వచ్చారు. రేడియోగ్రాఫర్ రామచంద్రయ్య గతంలో తమను కూడా చాలా ఇబ్బంది పెట్టాడని, పరుష పదజాలంతో దూషించాడని కొందరు వైద్యులు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. వైద్యులు విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి, రామచంద్రారెడ్డిలతో పాటు పలువురు నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. అనంతరం వైద్యులందరూ సూపరింటెండెంట్ బుసిరెడ్డి, ఆర్ఎంఓ డేవిడ్లకులిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బెదిరింపు ఫోన్ కాల్‌పై డీఎస్పీకి ఫిర్యాదు వైద్యులందరూ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉండగా యూనియన్ నాయకుడంటూ కడప నుంచి ఒక వ్యక్తి డాక్టర్ శివరాంకు ఫోన్ చేశాడు. జరిగిందేదో జరిగింది.. పట్టింపులు మాని విధులకు వెళ్లండి.. లేదంటే మేము కూడా రేపటి నుంచి బంద్ చేస్తాం అని ఫోన్ చేసినట్లు శివరాం తెలిపారు. ఫోన్ సంభాషణను సెల్‌ఫోన్ మైక్ ఆన్ చేసి అందరికీ వినిపించారు. దీంతో వైద్యులందరూ డీఎస్పీ శ్రీనివాసులరెడ్డికి ఫిర్యాదు చేశారు. డాక్టర్ల నుంచి అందిన ఫిర్యాదును డీసీహెచ్ఎస్కు పంపిస్తానని సూపరింటెండెంట్ బుసిరెడ్డి అన్నారు. రేడియోగ్రాఫర్ రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ తాను డాక్టర్ శివరాంను దూషించలేదన్నారు. -
కిడ్స్ డిజైన్
Show Masters పిల్లలుంటే పండుగ. పండుగ అంటేనే పిల్లలు. క్రిస్మస్, న్యూ ఇయర్ అయిపోయాయి. ఇక సంక్రాంతి.. ఈ పండుగకు ‘కళ’ తెచ్చే చిల్డ్రన్ కోసం డిఫరెంట్లీ డిజైన్డ్ డ్రెస్‌లు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. వీటిని పరిచయం చేసేందుకు అందమైన చిన్నారి మోడల్స్ ఉండనే ఉన్నారు. దీంతో ఇప్పుడు చిన్నారుల ఫ్యాషన్ షోలు ఊపందుకున్నాయి. మరోవైపు తమ డిజైనర్ల సత్తా చూపడానికి కిడ్స్ డ్రెస్‌ల డిజైనింగ్ ఒక మార్గంగా ఎంచుకుంటున్నాయి ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్. ..:: ఎస్.సత్యబాబు అమ్మాయిల తర్వాత డ్రెస్సింగ్ స్టైల్స్‌లో బోలెడన్ని వెరైటీలు అందుబాటులో ఉన్నది పిల్లలకే. సింపుల్‌గా రెడీమేడ్‌తో సరిపెట్టేసే రోజులకు బైబై చెప్పేస్తున్న పేరెంట్స్ పిల్లల దుస్తులపై శ్రద్ధ పెడుతున్నారు. తమ అలంకరణ సంగతి ఎలా ఉన్నా పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్లకు వెళుతున్నప్పుడు పిల్లలు గ్రాండ్‌గా కనపడాలని ఆరాట పడుతున్నారు. పిల్లల డ్రెస్సింగ్‌కు వచ్చే కాంప్లిమెంట్లు సహజంగానే దానికి కారణమైన పేరెంట్స్‌కు దక్కుతాయి కాబట్టి.. తమ క్యూట్ డార్లింగ్స్ ధరించే దుస్తుల్లో వెరైటీ కోసం డిజైనర్ల దగ్గర క్యూ కడుతున్నారు. చిన్నారులకు డిజైనింగ్ ఓ సవాల్... క్యూట్‌గా, హ్యాపీ లుక్స్‌తో ఉండే చిన్నారులకు స్టైల్స్ క్రియేట్ చేయడం ఛాలెంజ్లాంటిదని డిజైనర్ల అభిప్రాయం. ఎందుకంటే పిల్లలు ఏ దుస్తుల్లోనైనా అందంగా కనిపిస్తారు. ఇన్నోసెన్స్, స్పాంటేనియటీ, బ్రైట్ స్మైలింగ్.. చిల్డ్రన్కు నేచురల్‌గా వచ్చే అలంకారాలు. డ్రెస్ ద్వారా వాటిని మరింత మెరపించాల్సిన బాధ్యత డిజైనర్లపై ఉంటుంది. మరోవైపు పార్టీలకు పిల్లల్ని తీసుకెళ్లడం కూడా ఇటీవల బాగా పెరిగింది. అలాంటి చోట తమ పిల్లల డ్రెస్సింగ్ అద్భుతంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు. దీని కోసం పెద్దవాళ్ల కన్నా మిన్నగా తమ పిల్లల డ్రెస్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఎన్నెన్నో వెరైటీలు... చిన్నారుల దుస్తుల డిజైన్లకు వెరైటీ థీమ్‌లను ఎంచుకుంటున్నారు డిజైనర్లు. మోడ్రన్ యుగపు ప్రతినిధులుగా కనిపించేలా చేసే ఇండోవెస్ట్రన్స్, ఫంకీగా అనిపిస్తూ అందర్నీ ఆకట్టుకునే డిస్కోవేర్, రెండు మూడు రకాల థీమ్‌లను కలిపి రూపొందించే కాక్టైల్ వేర్, నగర శివార్లలోని రిసార్ట్స్‌కు వెళ్లినప్పుడు ధరించేందుకు వీలుగా రిసార్ట్ వేర్, పెళ్లిళ్లు వంటి సందర్భాలకు నప్పే వెడ్డింగ్ వేర్... ఇలా పెద్దలకు ధీటుగా చిన్నారులకు ప్రత్యేకమైన థీమ్ డిజైన్లు వచ్చేశాయి. హిట్ ‘షో’.. కొన్ని రోజులుగా సిటీలో చిన్నారుల ఫ్యాషన్ షోలు పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రెగ్యులర్ షోలలో టీజింగ్ పార్ట్గానో, సరదా కోసం మాత్రమే పిల్లల డ్రెస్సింగ్ సీక్వెన్స్ పెట్టేవారు.. ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో పిల్లల డ్రెస్సింగ్ కోసమే షోలు నిర్వహిస్తున్నారు. వీటికి పేరెంట్స్ పెద్దసంఖ్యలో హాజరవుతూ తమ పిల్లల కోసం ఎంతో శ్రద్ధగా డిజైన్లను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో చైల్డ్ మోడల్స్ కూడా పెరిగారు. ఇది ప్యూర్లీ వెడ్డింగ్ వేర్. తలపాగా నుంచి షేర్వాని వరకూ... జార్జెట్, వెల్వెట్ కాంబినేషన్‌తో హైలీ డిజైన్డ్ వెస్ట్రన్‌వేర్. ఎంబ్రాయిడరీని సరైన రీతిలో జత చేయడంతో దీనికి మరింత లుక్ వచ్చింది. గ్రే శాటిన్ ఫ్యాబ్రిక్ మీదఎల్లో సిల్క్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్‌తో రూపొందిన ఈ డ్రెస్... రిసార్ట్ వేర్. ఆప్లిక్ వర్క్‌తో ఎల్లో, బ్లాక్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీ కలగలిపి... దీనికి గ్రే బ్యాక్‌గ్రౌండ్ జత చేశారు. జార్జెట్, కాటన్ సిల్క్‌లు గార్మెంట్ డిజైన్‌కి అదనపు సొబగులు అద్దుతున్నాయి. లుక్ అదుర్స్ రా సిల్క్, క్రేప్, నెట్ క్లాత్‌తో చేసిన సాఫా వంటి ఫ్యాబ్రిక్స్‌ను యూజ్ చేశారు. పింక్ బాటమ్తో చక్కగా అమరిపోయిన హాఫ్ వైట్ టాప్‌కి.. స్టోన్స్‌కు ఫ్రెంచ్ నాట్స్ ఎంబ్రాయిడరీ జత చేయడంతో పార్టీవేర్ లుక్ మరింతగా డ్రెస్‌పై మెరిసింది. ఇది లేటెస్ట్ ట్రెండ్.. తమ పిల్లల కోసం కూడా డిజైనర్లను సంప్రదించడం అనేది సిటీలో లేటెస్ట్ ట్రెండ్ అనే చెప్పాలి. ఇది డిజైనర్లకు తమను తాము ఆల్రౌండర్లుగా నిరూపించుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే... చిల్డ్రన్ డ్రెస్సింగ్‌లో ప్రయోగాలకు బాగా వీలుంటుంది. అందుకే మా స్టూడెంట్స్‌కి తరచూ చిన్నారుల దుస్తుల శైలులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచిస్తుంటాం. పిల్లల ఫ్యాషన్ షోల ద్వారా డిజైనర్ల సత్తాను ప్రదర్శించవచ్చు. - క్రితిక, ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నొవేషన్ -
బస్సు కింద పడి ఇన్స్పెక్టర్ మృతి
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఎక్కబోతూ ఓ ఇన్స్పెక్టర్ బస్సు కిందపడి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేబీఎస్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వరంగల్ రేంజ్ సీఐడీలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిరావు(48) కరీంనగర్ వెళ్లడానికి బుధవారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో జేబీఎస్‌కు వచ్చారు. అదే సమయంలో జేబీఎస్ బయటిదారిలో కరీంనగర్ డిపో-1కు చెందిన ఏపీ29జడ్-1779 బస్సు వస్తోంది. ఆ బస్సు ఎక్కడానికి తిరుపతిరావు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫుట్‌బోర్డు నుంచి కాలు జారడంతో బస్సు వెనుక టైర్ల కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. తిరుపతిరావు స్వస్థలం కరీంనగర్ జిల్లా గోదావరిఖని. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నవసేన
సాక్షి, సిటీబ్యూరో: జంట కమిషనరేట్ల పరిధిలో ఆదివారం భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. తొమ్మిది మంది కొత్తవారికి పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో ఇద్దరిని సైబరాబాద్‌కు, ఏడుగురిని హైదరాబాద్‌కు కేటాయించారు. ఇక్కడ విధులు నిర్వహించిన 13 మంది ఇతర జిల్లాలకు, డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. జంట కమిషనరేట్లు ఏర్పాటయ్యాక ఇంత పెద్ద సంఖ్యలో ఐపీఎస్‌లు బదిలీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్ర విభజన నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. నగర పోలీసు కమిషనరేట్‌లో శాంతి భద్రతల విభాగానికి చెందిన ఐదుగురు, ట్రాఫిక్ విభాగానికి చెందిన ఇద్దరు ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించారు. సైబరాబాద్‌లో జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్‌తోపాటు ఐదు జోన్లలో కేవలం మాదాపూర్ మినహా మిగిలిన నాలుగు జోన్ల డీసీపీలు విశ్వప్రసాద్, రమేష్‌నాయుడు, ఏఆర్ శ్రీనివాస్, కోటేశ్వరరావులను కదిలించారు. వీరి స్థానంలో కేవలం మల్కాజిగిరి జోన్‌కు మాత్రమే కొత్తగా అధికారిని నియమించారు. బాలానగర్, ఎల్బీనగర్ జోన్లకు అధికారులను నియమించాల్సి ఉంది. జాయింట్ పోలీసు కమిషనర్‌గా వచ్చిన కొత్త అధికారికి శంషాబాద్ జోన్ డీసీపీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. త్వరలో సైబరాబాద్‌కు మరో ముగ్గురు ఐపీఎస్‌లు రావాల్సి ఉంది. ఇంటెలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేసిన డాక్టర్ వి.రవీందర్ తూర్పు మండలం డీసీపీగా బదిలీ అయ్యారు. సమర్ధవంతంగా.. వరంగల్ డీఐజీగా బదిలీ అయిన 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎం.మల్లారెడ్డి సిటీ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం పని చేశారు. నాలుగేళ్ల మూడు నెలల పాటు సేవలందించారు. కడప జిల్లా ఎస్పీగా పని చేస్తూ మల్లారెడ్డి 2010 ఆగస్టులో హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ డీసీపీ-2గా ఏడాదికి పైగా విధులు నిర్వర్తించారు. అక్కడ నుంచి నగర భద్రతా విభాగం (సీఎస్‌డబ్ల్యూ) డీసీపీగా బదిలీ అయ్యారు. ఇక్కడ పని చేస్తుండగానే 2012 జూన్‌లో డీఐజీగా పదోన్నతి పొంది సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్-క్వార్టర్స్ సంయుక్త పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర క్రితం స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. అనేక ఉద్యమాలు, ఉద్రిక్తతలతో పాటు కీలక ఘట్టాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలను సమర్ధవంతంగా పర్యవేక్షించారు. -
యూనిఫాంకు ‘మంగళం'
కర్నూలు(హాస్పిటల్): ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫాం, క్లీనింగ్ కోసం ప్రతి నెలా అలవెన్స్, రూ.వేలల్లో వేతనం అందిస్తే.. ఏ ఉద్యోగి అయినా చక్కగా విధులు నిర్వహిస్తారు. ఈ పరిస్థితి ఇతర శాఖల్లో కనిపిస్తుందేమో కానీ.. కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులు మాత్రం ఇందుకు భిన్నం. యూనిఫాం వేసుకోకపోవడమే కాదు.. పనివేళలు కూడా వీరికి పట్టవు. వచ్చిన వారు సైతం చుట్టపు చూపుగానే హాజరవుతుండటం.. లేదంటే బినామీలతో పని చేయిస్తూ సొంత వ్యాపారాలు చూసుకోవడం వీరికే చెల్లింది. ప్రధానంగా ఎంఎన్ఓ, ఎఫ్‌ఎన్‌ఓల పనితీరు విమర్శలకు తావిస్తోంది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఓపీ, ఐపీ కలుపుకొని మొత్తం 60 వార్డులు ఉన్నాయి. కింది స్థాయిలో రోగికి సేవలందించాల్సిన మేల్ నర్సింగ్ ఆర్డర్లీ(ఎంఎన్ఓ), ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ(ఎఫ్ఎన్ఓ)లు కలిపి 114 మంది పని చేస్తున్నారు. వీరితో పాటు తోటీలు 37 మంది, స్వీపర్లు 26 మంది, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, టైలర్, కార్పెంటర్, బార్బర్ వంటి పోస్టుల్లో ఒక్కొక్కరు పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సీనియర్ ఉద్యోగులు ప్రతి నెలా రూ.50 వేల వేతనం పొందుతున్నారు. అయితే విధి నిర్వహణలో మాత్రం పూర్తి స్థాయిలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎంఎన్ఓ, ఎఫ్‌ఎన్‌ఓలకు ప్రభుత్వం ప్రత్యేకంగా యూనిఫాం ఉచితంగా అందిస్తోంది. వీటిని ధరిస్తే ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులని గుర్తు పట్టే వీలుంటుంది. ప్రతి సంవత్సరం రూ.1500 యూనిఫాంకు, ప్రతి నెలా క్లీనింగ్‌కు రూ.100 ప్రకారం చెల్లిస్తున్నారు. అయితే అనేక వార్డుల్లో ఉద్యోగులు ఖద్దరు దుస్తులు వేసుకొని రావడం, 50 శాతంకు పైగా ఉద్యోగులు యూనిఫాంను ధరించకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో ఏ వ్యక్తి ఆసుపత్రి ఉద్యోగి, ఏ వ్యక్తి కాదో గుర్తు పట్టలేని పరిస్థితి. ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈ సమస్య జఠిలంగా మారింది. వేళలు పాటించాలని ఓ వైపు జిల్లా కలెక్టర్ పదే పదే చెబుతున్న ఉద్యోగులు తమకేం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. వేలకు రావాలంటూ ప్రభుత్వాసుపత్రి టెలిఫోన్ ఎక్ఛేంజిలో బయో మెట్రిక్ విధానం(కంప్యూటర్ థంబ్ ఇంప్రిషన్) ద్వారా విధులకు హాజరవుతున్నట్లు నమోదు చేయాలి. అలాంటిది ఎంత మంది ఉద్యోగులు నమోదు చేస్తున్నారనేది ప్రశ్నార్థకం. 24 గంటల ల్యాబ్ ఎదుటనున్న షెడ్డుల్లో పనిచేసే టెక్నికల్ సిబ్బంది ఏనాడూ బయో మెట్రిక్ నమోదు చేసుకున్న దాఖలాల్లేవు. వీరిలో ఒక ఉద్యోగి వేతనం అక్షరాల రూ.48 వేలు. ఉదయం అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ బయటి వ్యాపారాల్లో తలమునకలవుతున్నారు. ఆయన తరఫున వెయ్యి రూపాయల వేతనంతో బినామీ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓల్లో ఎక్కువ స్థాయిలో బినామీ ఉద్యోగులు పని చేస్తుండటం బహిరంగ రహస్యం. పాలనను గాడిన పెట్టాల్సిన పర్యవేక్షణ అధికారులు ఆ దిశగా కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణమవుతోంది. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, స్వీపర్, స్ట్రెచర్ బాయ్.. ఇలా ఏ ఒక్కరూ యూనిఫాం వేసుకోకపోయినా ఉన్నతాధికారులు ప్రశ్నించకపోవడం ఆసుపత్రిలో పాలన ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. -
సందు చూసి..
పండుగ పూట వైన్ షాపుల దందా బెల్ట్ షాపులకు మందు డోర్ డెలివరీ ఎక్సైజ్ అండదండలతో వ్యాపారుల ఇష్టారాజ్యం ధనదాహంతో నిబంధనలకు తిలోదకాలు గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం సాక్షి ప్రతినిధి, వరంగల్ : దసరాకు ముందే పల్లెలను మత్తులో ముంచెత్తి... జేబులు నింపుకునేలా మద్యం వ్యాపారులు కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ఆయా ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని వైన్‌షాపుల నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి.. ట్రాలీ ఆటోలతో మద్యం సీసాలను నేరుగా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. పలువురు ఎక్సైజ్ అధికారుల అండదండలతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలన్న చందంగా కొనసాగుతోంది. అంతేకాదు... మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం వచ్చేలా ఎక్సైజ్ అధికారు లు విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. ప్రభుత్వం అధికారికంగా కేటాయించి న వైన్ షాపులు, బార్లలోనే మద్యం అమ్మకాలు జరగాలని నిబంధనలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ నిబంధనలకు ఎక్సైజ్ శాఖ అధికారులే పాతర వేస్తున్నారు. బెల్ట్ షాపుల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాల్సిన వారు... ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం తెప్పించేందుకు తాపత్రయపడుతున్నారు. వైన్‌షాపుల నుంచి బెల్ట్ షాపులకు ఆటోల్లో మద్యం సరఫరా దందా వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఎక్కువగా జరుగుతోంది. వర్ధన్నపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలోని మండలాల్లో ఈ రకమైన దందా ఇంకా ఎక్కువగా ఉంది. దీనిపై పలువురు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ... వర్ధన్నపేట ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. సిండికేట్‌గా మారి... వర్ధన్నపేట మండల కేంద్రంలో మూడు వైన్ షాపులు, ఇదే మండలంలోని ఇల్లంద, పంథిని, ఐనవోలు గ్రామాల్లో ఒకటి చొప్పున వైన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జూన్ 1 నుంచి ఈ ఆరు వైన్ షాపులు ప్రారంభమయ్యాయి. వైన్ షాపులు తెరుస్తూనే నీళ్లు కలిపిన మద్యాన్ని ఇష్టారాజ్యంగా విక్రయించడం మొదలుపెట్టారు. దీనికి ఇక్కడి ఎక్సైజ్ శాఖ అధికారులు సహకరించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తారుు. చివరకు కొందరు ఫిర్యాదు చేయడంతో ఒక వైన్ షాపులో తనిఖీ చేసి మూసివేశారు. సదరు నిర్వాహకుడు ఫైన్ చెల్లించి... ఆ షాపును మళ్లీ తెరిచాడు. ఆరు షాపుల్లో పోటీ వల్ల దాడులు జరిగాయని భావించి... అన్ని షాపుల యజమానులు ఒక్కటయ్యారు. ఆరు వైన్ షాపులకు వచ్చిన మద్యాన్ని ఒకే గోదాంలో పెట్టి... ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలోని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఆరు వైన్ షాపులకు సంబంధించిన అమ్మకాల్లో వాటా ఎలా అనే దానికి కొత్త ఉపాయం రచించారు. ఆరు వైన్ షాపుల సరుకులో ఏ మద్యం సీసా ఎవరిది అనే దాన్ని గుర్తించేందుకు ఆయా వైన్ షాపుల పేరులో మొదటి అక్షరంతో స్టిక్కర్లను ముద్రించారు. వీటి ఆధారంగా అమ్మకాలకు సంబంధించిన డబ్బులు పంచుకుంటున్నారు. ఎక్సైజ్ పని మారింది... బెల్ట్ షాపులను నియంత్రణను పక్కనబెట్టిన ఎక్సైజ్ శాఖ కొత్త రకమైన విధులను చేపట్టింది. బెల్ట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్నది ఆయా ప్రాంతాలకు చెందిన వైన్ షాపుల మద్యం సీసాలేనా అని మాత్రమే చూస్తోంది. తనిఖీకి వచ్చిన అధికారులు బెల్ట్ షాపును మూసివేయకుండా... వెళ్తూ వెళ్తూ ఒకటిరెండు ఖరీదైన మద్యం సీసాలు తీసుకెళ్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమాలకు పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్దతు ఇస్తుండడంతో... మద్యం వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండే దసరా సీజన్లో ఇష్టారాజ్యంగా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. -
ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు
నందిగామ : ఉప ఎన్నికల కౌంటింగ్ సమర్థంగా నిర్వహిం చేందుకు కౌంటింగ్ విధులు నిర్వహించే వారు అధికారులకు సహకరించాలని నియోజవకర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు పలు శాఖల అధికారులకు సూచించారు. నందిగామ కేవీఆర్ కళాశాలలో మంగళవారం జరిగే కౌంటింగ్‌లో అధికారులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహించేటప్పుడు అధికారులందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న ఈవీఎంలు లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చేటప్పుడు, లెక్కించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నందిగామ తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావుతో పాటు ఎంపీడీవో పి.సుశీల పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
వంద పడకల ఆస్పత్రి జీవోకు కృషి చేస్తా
చంద్రగిరి: చంద్రగిరిలోని ఏరియా ఆస్పత్రిని వందపడకల ఆస్పత్రిగా మార్చేందుకు అవసరమైన జీవో తీసుకురావడానికి కృషి చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏరియా ఆస్పత్రి చైర్మన్ హోదాలో బోర్డు కమిటీ సభ్యులను నియమించారు. ఈ కమిటీలో చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి సభ్యులుగా చంద్రగిరి ఎంపీపీ, తిరుపతి రూరల్ ఎంపీపీ, పాకాల ఎంపీపీ, చంద్రగిరి జెడ్పీటీసీ, ఆర్సీ. పురం జెడ్పీటీసీ, తిరుపతి రూరల్ జెడ్పీటీసీ, చంద్రగిరి సర్పంచ్, తహశీల్దార్, వైద్యాధికారి, డీసీహెచ్ఎస్, మానవ హక్కుల సభ్యులు ఒకరు, స్థానిక సేవ సభ్యులు ఒకరిని నియమించారు. అలాగే చిన్నగొట్టిగల్లు ఏరియా ఆస్పత్రి కమిటీ సభ్యులుగా చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళెం, రామచంద్రాపురం, ఎంపీపీలు, చిన్నగొట్టిగళ్లు, యర్రావారిపాళెం, పాకాల జెడ్పీటీసీలు, వైధ్యాధికారి, స్థానిక సర్పంచ్, తహశీల్దార్, డీసీహెచ్ఎస్, ఐకేపీ, సేవా సంఘం తరఫున ఒకరిని నియమించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ నియమించిన బోర్డు సభ్యుల పర్యవేక్షణలో అస్పత్రి వర్గాలు పనిచేస్తాయన్నారు. నియోజకవర్గానికి ఎంతో తలమానికంగా చంద్రగిరి ఆస్పత్రి ఉందన్నారు. 31 మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉందని అయితే ఇద్దరు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ఏరియా అస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా జీవో తీసుకురావాలని అధికారులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని పలు సమస్యలపై ప్రస్తావించానన్నారు. ముఖ్యంగా 100 పడకల జీవోకు ప్రభుత్వం ఆమోదం తెలిపాలని కోరానన్నారు. దీనికి ప్రభుత్వం, సంబంధిత మంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కరిస్తామన్నారు. పూర్తిస్థాయిలో వైద్యం అందంచగలిగే విధంగా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు తమ సమస్యలను వివరించారు. స్పందించిన ఎంఎల్ఏ జిల్లా వైద్యాధికారితో ఫోన్‌తో మాట్లాడి చంద్రగిరి ఏఎన్ఎం నర్సులను కొనసాగించాలని తెలిపారు. ఎంపీపీ కుసుమ, వైఎస్ ఎంపీపీ వనజ, మండల కన్వీనర్, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ, వేణుగోపాల్‌రెడ్డి, హేమేంద్రకుమార్‌రెడ్డి, ఎంపీటీసీలు బుజ్జి, నవనీతమ్మ, భారతి, జ్యోతి, నాగరాజు, మంగయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు మల్లం చంద్రమౌళిరెడ్డి, సర్పంచి ఉమామహేశ్వరి, తొండవాడ సర్పంచ్ సిద్దముని, నాయకులు అగరాల భాస్కర్‌రెడ్డి, బండారు హేమచంద్ర, ఒంటి శివశంకర్, కో ఆప్షన్ సభ్యులు మస్తాన్, మణి, ఫరూక్, జయకుమారి, అస్పత్రి సూపరింటెండెంట్ కె.శారద, డాక్టర్లు పద్మజ, ఆపర్ణ, దినే్ష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు ఉపపోరు
‘నందిగామ’ ఓటర్లు - 1,84,064 బరిలో ఉన్న అభ్యర్థులు - 4 పోలింగ్ కేంద్రాలు - 200 పోలింగ్ సమయం - ఉ. 7 నుంచి సా. 6 వరకు నందిగామ రూరల్ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈవీఎంలతోపాటు ఇతర సామగ్రిని అందించేందుకు పట్టణంలోని కేవీఆర్ కళాశాలలో శుక్రవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సిబ్బందికి సామగ్రి పంపిణీని రజనీకాంతరావు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 1,84,064 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 90,731 మంది, మహిళలు 93,309 మంది, ఇతరులు 24 మంది ఉన్నారని తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా 200 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు 1,400 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని వివరించారు. 129 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, ఇందుకోసం నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన 250 మంది విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ సమయంలో ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే మరొకటి ఏర్పాటు చేసేందుకు 80 సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ వద్ద ఉదయం నుంచి ఎన్నికల సిబ్బంది గ్రామాలకు తరలివెళ్లేంత వరకు ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు కూడా కేవీఆర్ కళాశాలలోనే ఉండి పర్యవేక్షించారు. ఉప ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని జిల్లాలోని పలు డిపోలకు చెందిన 40 బస్సుల్లో శుక్రవారం సాయంత్రం ఆయా గ్రామాలకు తరలించారు. కేవీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ క్యాంపులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావుతోపాటు సిబ్బంది, పోలీసులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బరిలో నలుగురు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ తరఫున బోడపాటి బాబురావు, స్వతంత్ర అభ్యర్థులుగా మాతంగి పుల్లారావు, కటారపు పుల్లయ్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలో గెలుపుకోసం టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. బందోబస్తుకు 1,500 మంది పోలీసులు : ఎస్పీ ఉప ఎన్నికకు 1,500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్టు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జి.విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం నందిగామ వచ్చిన ఆయన ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ ఉప ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంత్రావును అడిగి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఫిర్యాదు నందిగామ : పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఉన్న జిల్లా అడిషనల్ ఎస్పీ సాగర్, ఏజేసీ చెన్నకేశవరావుకు శుక్రవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పహారా ఏర్పాటు చేయడంతోపాటు నాయకులను కూడా ఇక్కడ ఉండనివ్వడంలేదని, టీడీపీ కార్యాలయం వద్ద మాత్రం ఎటువంటి పహారా లేదని నరహరిశెట్టి తెలిపారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావు, నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, పాలేటి సతీష్, తలమాల డేవిడ్‌రాజు, గింజుపల్లి అనిల్, పసుపులేటి శ్రీనివాసరావు ఉన్నారు. టీడీపీ భారీగా మద్యం, నగదు పంపిణీ కంచికచర్ల : ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్, టీడీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేసిన టీడీపీ నాయకులు ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రులను రంగంలోకి తీసుకొచ్చారు. నందిగామలో మకాంవేసి కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తి పోశారు. అయినప్పటికీ తక్కువ మెజారిటీ వస్తే అధినేత ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించి డబ్బు, మద్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. పలు గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో ఓటుకు రూ.200 నుంచి రూ.300 వరకు పంపిణీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు అకాల మరణంతో సానుభూతి పవనాలు వీస్తాయని టీడీపీ తరఫున బరిలో ఉన్న ఆయన కుమార్తె సౌమ్య విజయం సాధిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ భయపడుతోందని సమాచారం. ఎన్నికల ముందు టీడీపీ చేసిన వాగ్ధానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదని కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. రైతులు, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో మోసం చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా టీడీపీ నాయకుల ఆందోళనకు కారణమని పరిశీలకులు చెబుతున్నారు. -
ఆర్టీసీ కార్మికులు విధుల బహిష్కరణ
కాంప్లెక్స్ ఎదుట ధర్నా నిలిచిన డిపో బస్ సర్వీసులు ఆందోళనకు పాడేరు ఎమ్మెల్యే మద్దతు డీఎం ప్రవీణపై చర్యలకు అధికారుల హామీ పాడేరు: పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ వి.ప్రవీణ తమను వేధిస్తున్నారని, శాఖాపరమంటూ అక్రమంగా చర్యలు చేపడుతున్నారని యూనియన్లకు అతీతంగా ఆర్టీసీ కార్మికులంతా గురువారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించారు. కాంప్లెక్స్ ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు ధర్నా చేపట్టడంతో ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం ఉదయం డిపోలోని 38 బస్సులూ కదల లేదు. డిపో మేనేజర్ ప్రవీణను బదిలీ చేసేంత వరకు విధుల్లోకి చేరేది లేదని భీష్మించారు. ప్రయాణికుల ఇక్కట్లు మధ్యాహ్నం వరకు బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. కార్మికుల ఆందోళనకు వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంపూర్ణ మద్దతునిచ్చారు. డీఎం బదిలీకి అధికారుల హామీ ఇంతలో విశాఖ నుంచి వచ్చిన ఆర్టీసీ డీవీఎం జీవన్ ప్రసాద్, సెక్యూరిటీ ఇంజినీర్ ప్రసాదరావు, కార్మిక సంఘం నేత రమణతో కలిసి ఎమ్మెల్యే చర్చలు జరిపారు. డీఎం ప్రవీణను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఏఎస్పీ ఎ.బాబూజీ కూడా అక్కడకు చేరుకున్నారు. డీఎం ప్రవీణ బదిలీకి చర్యలు తీసుకుంటామని, విధులకు గైర్హాజరైనందుకు కార్మికులపై ఎలాంటి చర్యలూ ఉండవని ఆర్టీసీ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సంతృప్తి చెందారు. ఆమె సూచనతో కార్మికులంతా మధ్యాహ్నం 2 గంటలకు ఆందోళనను విరమించి విధులకు హాజరవడంతో డిపోలో బస్సులన్నీ కదిలాయి. -
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ !
విద్యాశాఖ కసరత్తు ఉపాధ్యాయుల హాజరుశాతం పెంచేందుకే ఫలితంగా నాణ్యత ప్రమాణాల పెంపు వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు సాక్షి, విజయవాడ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల విధులు, తరగతుల బోధన, హాజరుశాతం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని నిశితంగా పరిశీలించడానికి సన్నాహాలు చేస్తోంది. నిర్దేశిత సమయం కల్లా ఉపాధ్యాయులు విధులకు హాజరు కావడం లేదనే అపవాదు ఉంది. దీంతో నూతన పద్ధతి ద్వారా ఉపాధ్యాయుల హాజరును నిశితంగా పరిశీలించి సకాలంలో పాఠశాలకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవడానికి కసరత్తు చేస్తోంది. దీని అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించే పనిలో జిల్లా విద్యాశాఖ అధికార గణం నిమగ్నమై ఉంది. విద్యాశాఖలో నాణత్య ప్రమాణాలు పెంపులో భాగంగానే ఈ చర్యలని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 3,340 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 2,768 ఉన్నాయి. మిగిలినవి ఎయిడెడ్ పాఠశాలలు. అలాగే ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్యాభోధన చేసే పాఠశాలలు 440 ఉన్నాయి. వీటిలో 370 ప్రభుత్వ పాఠశాలలు కాగా 70 ఎయిడెడ్ పారశాలలున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1వతరగతి నుంచి 10 వతరగతి వరకు చదివే విద్యార్థులు 3.20 లక్షల మంది ఉన్నారు. జిల్లాలోని ప్రయివేట్ పాఠశాలల్లో 2.6 లక్షల మంది విద్యార్థులున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో 12 వేల మంది టీచర్లు వివిధ కేటగిరిల్లో పనిచేస్తున్నారు. గత మూడేళ్లుగా ఉత్తీర్ణతా శాతం పెంపు కోసం జిల్లా విద్యాశాఖ అనేక నూతన మార్గాలు అనుసరిస్తోంది. ఈ విధానం వల్ల నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించడంతో పాటు ఉపాధ్యాయుల్లో సమయపాలన పెరుగుతుందని తద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చనే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖమంత్రి, సీఎం సానుకూలంగా స్పందించి దీనిని ప్రవేశపెడతామని ప్రకటించారు. మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ... జిల్లాలోని 3,340 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో బయోమెట్రిక్ సిస్టం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరపాలకసంస్థలు, వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో ఈవిధానం అమలులో ఉంది. జిల్లాలో 12 వేల మంది టీచర్లు ఉండటంతో అందరి హాజరుశాతాన్ని నిశి తంగా పరిశీలించడం అధికారులకు కష్టతరంగా మారింది. ఉపాధ్యాయుల హాజరుశాతాన్ని ఆయా పాఠశాలల హెచ్ఎం నిత్యం పరిశీలించి, నెలకోసారి ఎంఈవోకు నివేదిస్తారు. అక్కడ నుంచి డివిజన్ విద్యాధికారికి, అక్కడినుంచి నుంచి జిల్లా విద్యాధికారికి చేరతాయి. జిల్లాలో సగటున ఉపాధ్యాయుల హజరుశాతం ప్రస్తుతం 90 శాతంపైనే ఉంది. అయితే ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. -
సర్వే..‘ఘన’ గణ
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే-2014లో భాగంగా గ్రేటర్ నగరం కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. గతంలో మున్నెన్నడూ లేని విధంగా.. ఏ ప్రభుత్వ కార్యక్రమానికీ సహకరించని విధంగా ప్రజలు ఈ కార్యక్రమానికి స్పందించారు. విధులు మానుకొని ఇళ్లవద్దే వేచి చూస్తూ ఎన్యూమరేటర్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. రాత్రి 10 గం టల వరకు కూడా సర్వే జరిగినప్పటికీ.. ఇంకా చాలామంది నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. గతంలోని కర్ఫ్యూలను, బంద్‌లను మరిపిస్తూ నగరం బోసిపోయింది. గ్రేటర్లో 2011 జనాభా లెక్కల మేరకు 15.24 లక్షల కుటుంబాలుండగా.. ప్రస్తుతమది 20.24 లక్షలకు చేరి ఉండవచ్చునని అంచనా వేసిన అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసినప్పటికీ.. చాలా ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు వెళ్లలేకపోయారు. వెళ్లినప్రాంతాల్లో వారికప్పగించిన కుటుంబాల కంటే లెక్కకుమిక్కిలిగా కుటుంబాలు కనిపించడంతో శక్తికి మించి పనిచేశారు. పెరిగిన రద్దీతో మరోవైపు ఒకే చోట కూర్చొని సర్వే ఫారాలు నింపారు. రాత్రి 10.30 గంటల వరకు 15.35 లక్షల కుటుంబాల సర్వే జరిగినట్లు ఒక అధికారి తెలిపారు. బుధవారం కానీ.. పూర్తి సమాచారం తెలిసే పరిస్థితి లేదు. మిగిలిపోయిన ప్రక్రియను బుధవారం ముగించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ సూచించారు. ఎవరెంతగా శ్రమించినా ప్రజాస్పందన ముందు నిందలపాలు కాక తప్పలేదు. ఫారాలు అందలేదని.. ఎన్యూమరేటర్లు రాలేదనే ఫిర్యాదుల వరద ఆగలేదు. సర్వే ముగిశాక అసిస్టెంట్ ఎన్యూమరేటర్లుగా పాల్గొన్నవారికి చాలాచోట్ల రెమ్యునరేషన్ అందలేదంటూ ఘర్షణలు.. గందరగోళాలు చోటుచేసుకున్నాయి.నిర్బంధాలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో కొందరు సర్వే ఫారాలు నోడల్అధికారులకు అందజేయకుండా ఇళ్లకు తీసుకువెళ్లారు. ఒకే రోజు సర్వే కావడంతో తమ వివరాలు నమోదు కాావేమోననే అందోళన పలువురిలో కనిపించింది. జీహెచ్ఎంసీ చేసిన ప్రీవిజిటల్లు.. శిక్షణలు తగిన ఫలితాన్నిచ్చినప్పటికీ ఊహించని స్పందనతో చేసిన ఏర్పాట్లు సరిపోలేదు.దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు. తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శల వర్షం గుప్పించారు. సర్వే జరగని ఇళ్లు.. తాళాలు వేసిన ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించి.. తదుపరి ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. కుటుంబాల సంఖ్యకు సరిపోని సిబ్బంది సమగ్ర కుటుంబ సర్వేలో తమ వివరాలు అందించేందుకు ప్రజలు తమకు తాముగా ముందుకొచ్చినా.. అందరి వివరాలూ సేకరించేందుకు సిబ్బంది సరిపోలేదు. లెక్కకుమిక్కిలిగా ఉన్న కుటుంబాలు.. జనాభాకు సరిపడా లేని ఎన్యూమరేటర్లతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ వివరాలు తీసుకోవాలంటూ రాత్రి పొద్దుపోయేంతదాకా ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో సవాల్‌గా స్వీకరించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో 15.24 లక్షల కుటుంబాలు ఉండగా, రాత్రి 8 గంటల వరకు 15.5 లక్షల కుటుంబాల సర్వే పూర్తయిందన్నారు. ఎన్నో బృందాలు రాత్రి 9.30 గంటల వరకూ సర్వే నిర్వహించినందున బుధవారం కానీ పూర్తి వివరాలు అందే పరిస్థితి లేదని చెప్పారు. పూర్తి సహకారమందించిన నగర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, సిబ్బందికి కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మిగిలినపోయిన ఇళ్లతో పాటు తాళాలు వేసి ఉన్న ఇళ్ల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి విషయంలో వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. సర్వేలో భాగంగా ఇంకా మిగిలిపోయిన పనులేవైనా ఉంటే బుధవారం పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారన్నారు. -
సర్వే డ్యూటీకి రాకుంటే ఇంక్రిమెంట్ నిలిపివేస్తాం
హన్మకొండ అర్బన్:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే విధులపై నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్న ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ జి.కిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించిన ఎన్యూమరేటర్లు సర్వేకు సంబంధించిన శిక్షణకు గానీ, విధులకు గానీ రాకపోతే సదరు ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ నిలిపివేసేవిధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే పనులు, శిక్షణ కార్యక్రమాలపై శనివారం రాత్రి కలెక్టరేట్లో సమీక్షించారు. ఇటీవల నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు సుమారు 2వేల మంది ఉద్యోగులు హాజరుకాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షణకు రానివారు, కొత్తగా సమాచారం అందుకున్న ప్రైవేటు ఉద్యోగులు ఆదివారం(17న) ఉదయం కలెక్టరేట్లో రిపోర్ట్ చేయాలని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా ప్రైవేటు ఇంజనీరింగ్, జూనియర్ కళాశాలల సిబ్బంది, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది, ఎన్ఐటీ, సీకేఎం కళాశాల సిబ్బందిని సర్వే విధులకు ఎంపిక చే స్తున్నామని, వీరికి శిక్షణ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ పౌసుమిబసు, నగర కమిషనర్ పాండాదాస్, డీఆర్వో సురేందర్‌కరణ్, సీపీవో బీఎన్‌రావు, ఈడీవో విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
పెళ్లి అయిన 40 రోజులకే..
విధినిర్వహణలో గుండెపోటుతో హోంగార్డు హఠాన్మరణం తిరుమలలో విషాదం సాక్షి, తిరుమల : పెళ్లి అయిన నలభై రోజులకే టీటీడీ హోంగార్డు జె.సురేంద్ర(30) విధులు నిర్వహిస్తూ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన తిరుమలలోని టీటీడీ ఉద్యోగులలో విషాదం నింపింది. వివరాలిలా.. పాపానాయుడు పేటకు చెందిన జె.సురేంద్ర(30) టీటీడీ విజిలెన్స్ విభాగంలో మూడవ సెక్టార్ పరిధిలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. గతనెల 11వ తేదీన ఆలయ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రామ్మూర్తి కుమార్తెతో సురేంద్రకు వివాహమైంది. సురేంద్ర శ్రీవారిమెట్టు మార్గంలో నడచివచ్చే భక్తులకు టోకెన్లపై చేతి స్టాంపు ముద్రించే విధుల కోసం శుక్రవారం ఉదయం 6 గంటలకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు 350 మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకుని భోజనం చేసి తిరిగి మెట్లమార్గం ద్వారా అక్కడికి చేరుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఛాతీలో నొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో తలకు గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సహచర సిబ్బందితో పాటు భక్తులు సురేంద్రను చేతులపై మోసుకుని తిరుమలకు తీసుకొచ్చి అంబులెన్స్ ద్వారా అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రెండు రోజులుగా ఛాతీనొప్పితో సురేంద్ర బాధపడేవాడని, శుక్రవారం ఉదయం నుంచే నొప్పిగా ఉందని పలుమార్లు చెప్పాడని విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది తెలిపారు. తలకు గాయం కావడంపై టూ టౌన్ ఎస్ఐ వెంకటరమణ దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాసరావు, ఏవీఎస్వోలు సాయిగిరిధర్, కోటేశ్వరరావు మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. నిరుపేద కుటుంబానికి చెందిన సురేంద్ర హఠాన్మరణం బాధాకరమని, మృతుని సతీమణిని టీటీడీ ఆదుకోవాలని అధికారులు కోరారు. -
లోకాయుక్త సోదాలు
ఐదుగురు అధికారుల ఇళ్లపై దాడులు ఓ ఐఎఫ్ఎస్ అధికారి ఇంటిపై కూడా సాక్షి, బెంగళూరు : అక్రమ మార్గంలో ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు ఐదుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో లోకాయుక్త ఏక కాలంలో గురువారం సోదాలు నిర్వహించింది. ప్రతి ఒక్కరూ అదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలను కర్ణాటక లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్.ఎన్ సత్యనారాయణరావు మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి హరికుమార్ ఝా మైసూరు సేల్స్ ఇంటర్ నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతని వద్ద రూ.2.17 కోట్ల స్థిరాస్తులు, రూ.48.42 లక్షల చరాస్తులు ఉన్నాయి. వీటి విలువ నిందితుని సంపాదన కంటే దాదాపు 100 రెట్లు అధికం. ప్రజాపనుల శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న బీఎల్ రవీంద్రబాబు, అతని కుటుంబ సభ్యుల పేరుపై రూ.8.23 కోట్ల విలువైన భవంతులు, పొలాలు, ఇంటిస్థలాలు ఉన్నాయి. వీటితో పాటు రూ.2.48 కోట్ల బంగారు, వెండి, నగదు ఉన్నట్లు లోకాయుక్త సోదాల్లో బయటపడ్డాయి. అతని సంపాదన కంటే 324 రెట్ల ఎక్కువ ఆస్తులున్నట్లు తేలింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డెరైక్టర్‌గా (ఫైనాన్స్) విధులు నిర్వర్తిస్తున్న పద్మనాభన్ వద్ద రూ.2.96 కోట్ల స్థిర, రూ.19.50 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. అతని సంపాదనతో పోలిస్తే 107 రెట్ల ఆస్తులు అధికంగా ఉన్నట్లు తేలింది. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్‌లో అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేస్తున్న ఆర్ భాస్కర్ కలిగి ఉన్న స్థిర, చరాస్తుల విలువ అతని సంపాదన కంటే 127 రెట్లు ఎక్కువగా ఉంది. రాష్ట్ర అబ్కారీ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసమూర్తి వద్ద 207 రెట్ల ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
మానవ నాడీ వ్యవస్థ..నిర్మాణం.. విధులు
సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ శరీరంలోని వివిధ భాగాల మధ్య వేగవంతమైన సమన్వయానికి ఉపయోగపడేది నాడీ వ్యవస్థ.. సకశేరుకాల్లో ఉన్నతమైన నాడీ వ్యవస్థ ఉంటుంది. జంతువుల్లో పూర్వపరమైన నాడీవ్యవస్థ ప్రోటోన్యూరాన్స రూపంలో సీలెంటరేటా అనే వర్గంలో కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా నాడీవ్యవస్థ సంక్లిష్టత పెరుగుతుంది. సకశేరుకాల్లో ముఖ్యంగా క్షీరదాల్లో అత్యంత సంక్లిష్టతతో కూడిన నాడీ వ్యవస్థ ఉంటుంది. మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ మొత్తం ప్రత్యేక నాడీ కణాలు లేదా న్యూరాన్స్ (Nerve cells)తో తయారవుతుంది. నాడీకణాన్ని తొలిసారిగా ఫాసిల్, హిస్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించారు. నాడీ వ్యవస్థ మొత్తం నాడీ కణా లతో తయారవుతుందన్న నాడీకణ సిద్ధాంతాన్ని కజాల్ (cajal) అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. నాడీ వ్యవస్థలోని మెదడు, వెన్నుపాము, నాడులు ఇలా అన్ని భాగాలు నాడీకణాలతోనే తయారవుతాయి. పుట్టినప్పుడు ఉండే నాడీకణాలు ఆ తర్వాత కూడా అదే సంఖ్యలో ఉంటాయి. కారణం శరీరంలో నాడీకణాలకు విభజన శక్తి ఉండదు. మిగతా శరీర భాగాలు కణ విభజన ద్వారా, నాడీకణం పెరుగుదల ద్వారా పరిమాణంలో పెరుగుతాయి. కాబట్టి నాడీకణాలు శరీరంలో అత్యంత పొడవైన కణాలు అయ్యాయి. నాడీకణ నిర్మాణం: ఇందులో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. సైటిన్ లేదా కణదేహం, ఏక్సాన్. సైటాన్ వెడల్పుగా ఉంటుంది. దీనిలో కేంద్రకం చుట్టూ కణద్రవ్యంలో ప్రత్యేక నిసిల్స్ కణికలు ఉంటాయి. కణదేహం అంచుల నుంచి డెండ్రైట్స్ అనే విభజనలు ఏర్పడతాయి. సైటాన్ నుంచి పొడవుగా సాగే తంతువు వంటి నిర్మాణమే అక్షీయతంతువు లేదా ఏక్సాన్. దీని చివర కూడా టెలీడెండ్రైట్స్ అనే సూక్ష్మ విభజనలు ఉంటాయి. ఏక్సాన్ చుట్టూ మైలిన్ అనే కొవ్వు పదార్థంతో తయారైన ఒక మందమైన పొర ఉంటుంది. ఇది విద్యుత్ బంధకంగా వ్యవహరిస్తుంది. నాడీకణంలో సాగే నాడీ ప్రచోదనం బయటకు చేరకుండా ఇది అడ్డుకుంటుంది. మైలిన్ పొర లేదా మెడుల్లరీ షీట్‌కు బాహ్యంగా న్యూరిలెమ్మ అనే పల్చటి పొర ఉంటుంది. ఇది మైలిన్ పొర పని తీరును నియంత్రిస్తుంది. మైలిన్ పొర, న్యూరిలెమ్మల మధ్య ష్క్వాన్ కణాలు అనే ప్రత్యేక సూక్ష్మకణాలు ఉంటాయి. ఇవి మైలిన్ పొరను స్రవిస్తాయి. ఏక్సాన్పై అక్కడక్కడ మైలిన్ పొర, న్యూరిలెమ్మ లేని నొక్కుల వంటి ప్రాంతాలు ఉంటాయి. వీటిని Ranvier nodes అంటారు. ఇవి నాడీకణం ద్వారా సాగే నాడీ ప్రచోదన వేగాన్ని పెంచుతాయి. ఇలాంటి అనేక నాడీకణాల కట్టను నాడి లేదా ూ్ఛటఠ్ఛి అంటారు. ఒక నాడిలో అనేక నాడీకణాలు ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉంటాయి. ఏ రెండు నాడీకణాలు భౌతికంగా అతుక్కొని ఉండవు. వాటి మధ్య ఉన్న ఖాళీ ప్రాంతాన్ని నాడీ కణసంధి (synapse) అంటారు. నాడీ ప్రచోదనం: శరీరంలో సాగే వేగవంతమైన నాడీ సమాచార ప్రసారం నాడీ ప్రచోదనం. ఇది విద్యుత్ రసాయన ప్రవాహం. ఇది ఒక నాడీ కణంలో విద్యుత్ రూపంలో ప్రవహిస్తుంది. రెండు నాడీ కణాల మధ్య నాడీ కణ సంధి వద్ద ఒక రసాయన మాధ్యమంతో ముందుకు సాగుతుంది. ఈ విధంగా నాడీ ప్రచోదనంలో ఉపయోగపడే రసాయనాలను నాడీకణ అభివాహక పదార్థాలు లేదా న్యూరో ట్రాన్సమీటర్లు అంటారు. అసిటైల్ కొలిన్, డోపమైన్, సెంటోనిన్ వంటివి ముఖ్యమైన న్యూరో ట్రాన్సమీటర్లు. నాడీవ్యవస్థ: మానవ నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజిస్తారు. అవి.. కేంద్రనాడీ మండలం, పరధీయ నాడీమండలం, స్వయం చోదిత నాడీమండలం. మెదడు, వెన్నుపాములను కలిపి కేంద్రనాడీమండలం అంటారు. కీలక భాగం: మెదడు కీలకమైన భాగం. మెదడు నుంచి సాగే పొడవైన దారం వంటి నిర్మాణం వెన్నుపాము. ఈ రెండింటి చుట్టూ రక్షణ కవచాలుగా మూడు పొరలు ఉంటాయి. వీటిని మెనింజిస్ పొరలు అంటారు. వీటి మధ్య ఉన్న మస్తిష్కమేరు ద్రవం (cerebro spinal fluid) shock absorber గా వ్యవహరిస్తూ మెదడు, వెన్నుపాములను యాంత్రిక అగాధాల నుంచి రక్షిస్తుంది. వీటికి అదనంగా మెదడుకు కపాలం, వెన్నుపాముకు వెన్నెముక రక్షణనిస్తాయి. మస్తిష్కం: మెదడులోని అతిపెద్ద భాగం పూర్వ మెదడులోని ప్రధాన భాగం మస్తిష్కం (cerebrum). ఇది రెండు మస్తిష్క గోళార్థాల రూపంలో ఉంటుంది. దీని ఉపరితలం అంతా గైరీ, సల్సీ పలు ఎత్తుపల్లాలతో కూడిన ముడతలు పడి ఉంటుంది. ఇవి మస్తిష్కం, ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఫలితంగా మస్తిష్కం విధులు బాగా పెరుగుతాయి. ఆలోచన, తెలివి తేటలు, విచక్షణశక్తి, జ్ఞాపకశక్తి సమస్య పరిష్కారం, సాధన, అనుభవం నుంచి నేర్చు కోవడం ప్రేమ, ద్వేషం, బాధ, దుఃఖం, వంటి భావాలను మస్తిష్కం నియంత్రిస్తుంది. అనుమస్తిష్కం: మస్తిష్కం తర్వాత అతి పెద్దభాగం అనుమస్తిష్కం (cerebellum). ఇది శరీర సమతాస్థితి, కండర సంకోచం, కండర సంకోచ వేగం వంటి చర్యలను నియంత్రిస్తుంది. మెదడు దిగువన పాన్‌స, మజ్జాముఖం ఉంటాయి. మెదడు వెన్నుపాముల మధ్య సమాచార మార్పిడికి పాన్‌స ఉపకరిస్తుంది. శ్వాస, మింగడం వంటి అనియంత్రిత చర్యలను ఇది నియంత్రిస్తుంది. ఇది చాలా సున్నితమైన భాగం. దీనికి బలమైన గాయమైతే శ్వాస ఆగి వ్యక్తి వెంటనే మరణించే ప్రమాదం ఉంది. మెదడులోని మరో ముఖ్యమైన భాగం అథాపర్వంకం (Hyphothalamus). ఆకలి, దప్పిక, నిద్ర, మెలకువ, లైంగిక వాంఛ, శరీర ఉష్ణోగ్రతలను ఇది నియంత్రిస్తుంది. వెన్నుపాము: వెన్నుపాము మెదడు నుంచి ఒక దారంలాగా కొనసాగుతుంది. ఇది వెన్నెముకలో సంరక్షింపబడుతుంది. ఇది ఒక సెంటీమీటర్ వ్యాసంలో ఉంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్యల్లో పాల్గొంటుంది. వేడి తగిలినపుడు లేదా ఏదైనా గుచ్చుకున్నపుడు ఉన్నట్టుండి స్పందించే చర్యనే అసంక ల్పిత ప్రతీకారచర్య అంటారు. ఇందులో మెదడు ప్రమే యం ఉండదు. పరధీయ నాడీ మండలం : మెదడు, వెన్నుపాము నుంచి సాగే నాడులను కలిపి పరధీయ నాడీ మండలం అంటారు. మెదడు నుంచి సాగే నాడులను కపాల నాడులు (Cranial nerves) అంటారు. ఇవి 12 జతలు. వెన్నుపాము నుంచి సాగే నాడులు.. వెన్నునాడులు. ఇవి 31 జతలు. విధుల ఆధారంగా వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించవచ్చు. జ్ఞానేంద్రియాల నుంచి మెదడు వెన్నుపాములకు నాడీ సమాచారాన్ని ప్రసారం చేసేవి జ్ఞాననాడులు (sensory nerves). మెదడు, వెన్నుపాముల నుంచి శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్న అస్థికండరాలకు ప్రధానంగా సమాచారాన్ని అందించేవి చాలక నాడులు (Motor nerves). ఈ రెండు రకాల చర్యలను ప్రదర్శించే నాడులు మిశ్రమనాడులు. వెన్నునాడులన్నీ మిశ్రమ నాడులే. స్వయంచోదిత నాడీ మండలం: శరీర అంతర్భాగాలు అంతటా ఆవరించి ఉన్న ప్రత్యేక నాడీ కేంద్రాల వంటి నిర్మాణం స్వయంచోదిత నాడీమండలం. ఇది మెదడు, వెన్నుపాములకు స్వతంత్రంగా పని చేస్తుంది. రెండు రకాలుగా ఉంటుంది. అవి.. సహానుభ్యత నాడీవ్యవస్థ, పరసహానుభ్యత నాడీవ్యవస్థ. పేగు, జీర్ణాశయం, మూత్రపిండాలు, పిత్తాశయం సంకోచాన్ని సహానుభ్యత నాడీవ్యవస్థ ప్రేరేపిస్తుంది. వీటి సడలికను పరసహానుభ్యత నాడీ వ్యవస్థ నిర్వహిస్తుంది. గుండెలయ, లాలాజల స్రావం, రక్తనాళాల సంకోచ సడలికలను కూడా స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రిస్తుంది. మాదిరి ప్రశ్నలు 1.పార్కిన్సన్స్ వ్యాధి ఏ న్యూరోట్రాన్స్మీటర్ లోపం ద్వారా సంభవిస్తుంది? ఎ) అసిటైల్ కొలిన్ బి) డోపమైన్ సి) సెరటోనిన్ డి) హిస్టమైన్ 2.మెనింజస్ పొరలో బాహ్యంగా ఉండేవి? ఎ) డయామేటర్ బి) అరక్నాయిడ్ సి) డ్యూరామేటర్ డి) ఏదీకాదు 3.మెనింజస్ పొరల వాపు, మెనింజై టిస్ వ్యాధి కారకం? ఎ) బ్యాక్టీరియం బి) వైరస్ సి) శిలీంద్రం డి) అన్నీ 4.మెదడులో థర్మోస్టాట్‌గా వ్యవహరించే భాగం? ఎ) అథాపర్యంకం బి) మస్తిష్కం సి) అనుమస్తిష్కం డి) మజ్జముఖం 5.ప్రపంచ అల్జీమర్స్ దినం? ఎ) సెప్టెంబర్ 12 బి) సెప్టెంబర్ 21 సి) డిసెంబర్ 21 డి) డిసెంబర్ 12 6.మస్తిష్క గోళార్థాలను అనుసంధానించే నాడీ దండం? ఎ) కార్పస్ కాల్లోజం బి) కార్పస్ ఆల్బికన్స్ సి) కార్పస్ స్ట్రయేట్ డి) కార్పస్ ల్యూటియం 7.అనుమస్తిష్కం బరువు మెదడులో ఏ మేరకు ఉంటుంది? ఎ) 50 శాతం బి) 30 శాతం సి) 20 శాతం డి) 10 శాతం 8.అంథాపర్యంకం బరువు? ఎ) 100 గ్రాములు బి) 4 గ్రాములు సి) 1 గ్రాము డి) 50 గ్రాములు 9.మెదడు విద్యుత్ తీవ్రతను కొలిచే పరికరం? ఎ) ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ బి) ఎలక్ట్రో ఎన్సిఫలోగ్రాఫ్ సి) స్ట్రోమర్ డి) స్ఫిగ్మామానోమీటరు 10.జపనీస్ ఎన్సిఫలైటిస్ వ్యాధి ఏ కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఎ) అనాఫిలస్ దోమ బి) ఎడిస్ దోమ సి) క్యూలెక్స్ దోమ డి) ఏదీకాదు 11. మెదడు బరువు సాధారణంగా? ఎ) 250 గ్రాములు బి) 1350గ్రాములు సి) 900 గ్రాములు డి) 600 గ్రాములు 12.ఎలక్ట్రోఎన్సిఫలోగ్రాఫ్లో మొత్తం ఎన్ని తరంగాల్లో మెదడు విద్యుత్ తీవ్రతను కొలుస్తారు? ఎ) 4 బి) 3 సి) 2 డి) 1 13.మస్తిష్క మేరు రసంలో అధిక మోతాదులో ఉండే ఖనిజం? ఎ) సోడియం బి) పొటాషియం సి) క్లోరిన్ డి) కాల్షియం 14.నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఎ) పుణే బి) గుర్గావ్ సి) నాసిక్ డి) ముంబై 15.ప్రపంచ పార్కిన్సన్స్ డే? ఎ) జనవరి 22 బి) ఏప్రిల్ 11 సి) మే 10 డి) జూన్ 21 16.మెదడు క్షిణత వ్యాధి పేరు? ఎ) కురు బి) స్క్రేపీ సి) మ్యాడ్ కౌ వ్యాధి డి) అన్నీ 17.శరీర వివిధ భాగల కదలికల మధ్య సమన్వయం లేని స్థితి? ఎ) అస్థీనియ బి) అటాక్సియ సి) డిమెన్షియ డి) ఏదీకాదు 18.అల్జీమర్స్ వ్యాధి గ్రస్తుల ప్రధాన లక్షణం? ఎ) మతిమరుపు బి) మూర్చ సి) గుండెనొప్పి డి) కండరనొప్పి 19.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసెన్సైస్ ఎక్కడ ఉంది? ఎ) న్యూఢిల్లీ బి) హైదరాబాద్ సి) బెంగళూరు డి) ముంబై 20.హైపోథలామస్ ద్వారా ఏ గ్రంధి నియంత్రణ జరుగుతుంది? ఎ) కాలేయం బి) పీయూష సి) లాలాజల గ్రంధి డి) క్లోమం