ఉత్తమ సేవలకు ఉగాది పురస్కారం | Award for the best services to the Ugadi | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు ఉగాది పురస్కారం

Published Fri, Apr 8 2016 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

Award for the best services to the Ugadi

తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, క్రైం ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డిలకు మహోన్నత సేవా పతకాలు
ఆగస్ట్ 15న సీఎం చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

 

తిరుపతి క్రైం/చిత్తూరు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలోని వివిధ విభాగాలైన ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్పీఎఫ్, పీపీటీసీల్లో ఉత్తమ సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఇద్దరు మహోన్నత సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి. తిరుపతి క్రైం ఎస్‌ఐ ప్రభార్ రెడ్డి ఉన్నారు. శంకర్‌రెడ్డి  2001లో ఎస్‌ఐ ఉన్నప్పుడు సేవా పతకం అందుకున్నారు. తర్వాత 2006లో సీఐగా పనిచేసేటప్పుడు ఉత్తమ సేవా పతకం వరించింది. ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీగా పలు కేసులు ఛేదించారు. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2016 ఉగాది పండుగ సందర్భంగా ఇచ్చే మహోన్నత సేవా పతకానికి ఎంపిక చేసింది. ఈయన ప్రస్తుతం తిరుపతిలో ఏసీబీలో పనిచేస్తున్నారు. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి మొదట కానిస్టేబుల్‌గా విధులు చేపట్టారు. ఇప్పటిదాకా ఈయన ఉత్తమసేవలు అందించి 800 రివార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఈయన సీసీఎస్ క్రైంలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1993లో రాష్ట్ర   ప్రభుత్వం ఈయన సేవలను గుర్తించి ఉత్తమ సేవా పతకం, 2003లో ఐపీఎం (ఇండియన్ పోలీస్) మెడల్ ఇచ్చారు. 2016 ఉగాది పండుగ సందర్భంగా ఇచ్చే మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం తిరుపతి క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.
 

పలువురికి సేవా పతకాలు
వివిధ పోలీస్‌స్టేషన్లలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సేవాపతకాలను ప్రకటించింది. ఇందులో తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ, సీఐడీ డీఎస్పీ అభిషేకం, ఎస్‌ఏఎఫ్ ఏఎస్‌ఐ జి.చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మేనీ.వెంకట్రమణ ఉన్నారు. అదేవిధంగా పోలీస్‌సేవా పతకానికి వెస్ట్ సీఐ అంజూయాదవ్, సీఐ అనీషా, ఎం.సుధాకర్‌రెడ్డి, కళ్యాణ్‌డ్యామ్ పోలీస్ శిక్షణా కళాశాల ఏఆర్‌ఎస్‌ఐ వి.ఆర్.మురుగన్, తిరుమల పోలీస్ హెడ్‌కానిస్టేబుళ్లు ఎస్.రాజేంద్ర, సుధాకర్, ఎస్‌పీఎఫ్ ఎస్.జగదీష్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హెడ్‌కానిస్టేబుల్ జయచంద్రారెడ్డి, ఈస్ట్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ వెంకటచలపతి ఎంపికయ్యారు. వీరికి 2016 ఆగస్ట్ 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు.

 
చిత్తూరు అర్బన్ జిల్లా పరిధిలో నలుగురికి పురస్కారాలు

చిత్తూరు పోలీసు జిల్లాలో పనిచేస్తున్న నలుగురు పోలీసులకు 2016- ఉగాది పురస్కారాలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు డీసీఆర్‌బీ (జిల్లా నేర చిట్టాల విభాగం)లో పనిచేస్తున్న సుధాకరరెడ్డి, చిత్తూరులోని ఆపరేషన్‌రెడ్‌లో పనిచేస్తున్న సీఐ షాదిక్‌అలీ, మొలకలచెరువు సీఐ రుషికేశవ్‌లతో పాటు వాల్మీకీపురం ఏఎస్‌ఐ లీలావతమ్మలకు ఉగాది పురస్కారాలు ప్రకటించారు. వచ్చే ఏడాది వీటిని అందుకోనున్నారు.

 

07టీపీయల్148ఎ-26120013  పోలీస్ సేవా అవార్డు గ్రహిత జయచంద్ర(విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హెడ్‌కానిస్టేబుల్) -149ఎఃప్రభాకర్‌రెడ్డి, సీసీఎస్ క్రైం తిరుపతి (మహోన్నత సేవా పతకం)
-150ః సుధాకర్, సీసీఎస్ క్రైం తిరుమల (సేవా పతకం)
-151ః రాజేంద్ర,  తిరుమల సీసీఎస్ (సేవాపతకం)
-152ః అభిషేకం,సీఐడీ డీఎస్పీ(సేవాపతకం)
-153ః అంజూయాదవ్, వెస్ట్‌సీఐ (పోలీస్ పతకం)
-154ః శంకర్ రెడ్డి, ఏసీబీ డీఎస్పీ(మహోన్నతసేవాత పతకం)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement