ఆగస్టు 8 నుంచి స్కూళ్లకు సెలవు | From August 8 to leave schools | Sakshi
Sakshi News home page

ఆగస్టు 8 నుంచి స్కూళ్లకు సెలవు

Published Thu, Jul 7 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

From August 8 to leave schools

పుష్కరాల సందర్భంగా విజయవాడలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు ఆగస్టు 8 నుంచి 25వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఆయా విద్యాసంస్థల భవనాల్లో పుష్కర విధులకు వచ్చే సిబ్బందికి వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.


అన్ని భవనాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని, ఏ సంస్థకూ దీని నుంచి మినహాయింపు ఉండదని స్పష్టంచేశారు. ఆయా భవనాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement