కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు
కోదాడ: హైకోర్టును వెంటనే విభజించాలని, సీమాంధ్ర న్యాయమూర్తులను వారి స్వస్థలాలకు పంపాలని కోరుతూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు కోర్టు దిక్కార నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం కోదాడ జూనియర్ సివిల్‌కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈదుల కష్ణయ్య మాట్లాడుతూ వెంటనే కోర్టు ధిక్కార నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు ప్రజాస్వామ్య బద్దంగానే తమ నిరసన వ్యక్తం చేస్తే దానికి నోటీసులు జారీ చెయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ముల్కా వెంకటరెడ్డి, గాలి శ్రీనివాసనాయుడు, రంజాన్‌పాష, ఎల్. ధనమూర్తి, చింతకుంట్ల రామిరెడ్డి, కేఎల్‌ఎన్ ప్రసాద్, మందా వెంకటేశ్వర్లు, పగడాల రాంమచంద్రారెడ్డి, ఎలుక సుధాకర్‌రెడ్డి, రంగారావు, విజయ్‌కుమార్, యశ్వంత్ రామారావు, గట్ల నర్సింహారావు, ఉయ్యాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.