boycotted
-
బిల్కిస్ బానో దోషులకు ఇదోరకం శిక్ష!
గాంధీనగర్: బిల్కిస్ బానోస్ సామూహిక అత్యాచార కేసులో దోషులకు క్షమాభిక్ష.. తదనంతర సన్మాన ఘట్టం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వాళ్లను మళ్లీ కటకటాల వెనక్కి పంపాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే.. జైలు నుంచి విడుదలయ్యాక ఆ పదకొండు మందిలో చాలావరకు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలీసులు మాత్రం వాళ్ల కదలికలపై నిఘా పెట్టి ఉంచగా.. సొంత వూరిలోనే అవమానాలు, ఛీత్కారాలు, బెదిరింపులతో భయంభయంగా గడుపుతున్నాయి దోషుల కుటుంబాలు. గుజరాత్‌లోని రంధిక్పూర్లో.. చాలావరకు దోషుల ఇళ్లకు తాళాలు ఉన్నాయ్. అక్కడంతా నిశబ్ద వాతావరణం నెలకొంది. తమ విడుదలపై విమర్శలు చెలరేడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ మళ్లీ అరెస్ట్ చేస్తారో.. అక్రమ కేసులు బనాయించి కటకటాల వెనక్కి నెడతారేమో అని ఊరి వదిలి పారిపోయినట్లు బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన వివరణ ద్వారా తెలుస్తోంది. బిల్కిస్ బానోస్‌పై అఘాయిత్యం జరిగే సమయంలో.. శైలేష్ భట్ బీజేపీ క్రియాశీలకగా నేతగా ఉన్నాడు. ఆ సమయంలోనే శైలేష్ భట్, మిటేష్ భట్లు ఇళ్లలో ఉండేవాళ్లు కారని.. రాజకీయాలంటూ తిరిగేవాళ్లని చుట్టుపక్కల వాళ్లు చెప్తున్నారు. ఆగష్టు 15న రెమిషన్ మీద విడుదలయ్యాక ఈ ఇద్దరు ఇళ్లకు తాళాలు వేసుకుని ఎటో వెళ్లిపోయారు. మరో దోషి రాధేశ్యామ్ షా ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి. ఇక మరో నిందితుడు బకాభాయ్ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆ కుటుంబం మరో చోట గుడారం వేసుకుని జీవిస్తోంది. అయితే తన భర్త జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి గ్రామస్తులు కొందరు ఆయన్ని వెంబడించి.. ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని బకాభాయ్ భార్య మంగ్లీబెన్ చెబుతోంది. ఆ భయంతో తన భర్త బయటకు రావడం మానేశాడని ఆమె అంటోంది. అంతేకాదు.. తప్పుడు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపుతామంటూ కొందరు ఆయన్ని బెదిరిస్తున్నారని ఆమె వాపోతోంది. దోషుల్లో నలుగురైదుగురిది మాత్రమే ఉన్నత కుటుంబాలు. మిగతా కుటుంబాలు కూలీనాలీ చేసుకుని బతికేవే!. గ్రామస్థుల నుంచి ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీ నుంచి దోషుల కుటుంబాలపై అప్రకటిత బహిష్కరణ నడుస్తోంది. అప్పటిదాకా కూలీనాలీ పనులు చేసుకుంటూ పోతున్న ఆ కుటుంబాలకు(ఐదారు).. వాళ్లు విడుదలయ్యాక ఉపాధి లేకుండా పోయింది. వెలివేత, చిన్నచూపు తప్పడం లేదు. తప్పు చేసింది ఒకరైతే.. శిక్ష తాము అనుభవించాల్సి వస్తోందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఇప్పుడు. ఇదీ చదవండి: బొగ్గు కుంభకోణం: ఇప్పుడు ఆ మంత్రిపై సీబీ‘ఐ’ -
Winter Olympics 2022: చైనాకు షాకివ్వనున్న మరో రెండు దేశాలు..
UK And Canada Boycotts China Winter Olympics: చైనా రాజధాని బీజింగ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని బ్రిటన్, కెనడా దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుధవారం ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరగుతుందన్న కారణంగా ఈ దేశాలు శీతాకాల విశ్వక్రీడలను బహిష్కరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు ఇదివరకే ప్రకటించాయి. అయితే, వరుసగా ఒక్కో దేశం ఒలింపిక్స్‌ను బహిష్కరించడంపై చైనా అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్న దేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. కాగా, జపాన్, న్యూజిలాండ్ కూడా చైనా ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి కోవిడ్ ఉద్భవించిందన్న కారణంగా ఆయా దేశాలు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజింగ్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరగనున్నాయి. చదవండి: IND A Tour Of SA: టీమిండియాలో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్..! -
వేల్పూరు వాడిలో రైతు కుటుంబం బహిష్కరణ : నిజామాబాద్
-
పోలింగ్‌కు దూరంగా బీజీకేపాళెం
చిట్టమూరు: మండలంలోని బురదగల్లి కొత్తపాళెం ప్రజలు శనివారం జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలను బహిష్కరించారు. కొన్నేళ్లుగా తమ గ్రామానికి శాశ్వత రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, తమకు రోడ్డు వేసే విషయంలో కచ్చితమైన హామీ ఇస్తే కానీ ఓట్లు వేయమని అధికారులకు తెగేసి చెప్పారు. గత ప్రభుత్వం కూడా తమ రోడ్డు పనులు చేపట్టలేదన్నారు. అదేమంటే తమ గ్రామం పక్షుల రక్షిత కేంద్రం (యూకోసెన్సిటివ్ జోన్)లో ఉందని అటవీ శాఖ అధికారులు తారు రోడ్డు వేసేందుకు అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారన్నారు. ఉదయం 10 గంటలైనా ఓటర్లు ఎవరూ పోలింగ్ కేంద్రానికి రాకపోవడంతో పోలింగ్ అధికారులు ఉన్నతాధికాల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, తహసీల్దార్ శ్రీరామకృష్ణ, ఎంపీడీఓ భాస్కర్‌రావు గ్రామానికి చేరుకుని పంచాయతీ సర్పంచ్ ఎర్రబోతు మణి, గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ రోడ్డు విషయమై గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రనసాద్‌రావు, కలెక్టర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారన్నారు. కేంద్ర ప్రభుత్వం, అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. వచ్చిన వెంటనే తారు రోడ్డు నిర్మాణం కచ్చితంగా చేపడుతారన్నారు. ప్రస్తుతానికి గుంతలుమయంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని సబ్ కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బీజీకేపాళెం ప్రజలతో చర్చలు జరుపుతున్న సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ.. తమకు కచ్చితమైన హామీ కావాలనడంతో ఫోన్ ద్వారా కలెక్టర్ చక్రధర్‌బాబుతో మాట్లాడించారు. అయినప్పటికీ ససేమిరా అని అనడంతో సబ్ కలెక్టర్ వెనుదిరిగారు. సాయంత్రం 4 గంటల సమయంలో గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు, వైఎస్సార్సీపీ నాయకులు చెన్నారెడ్డి బాబురెడ్డి, వంకా రమణయ్య బురదగల్లి కొత్తపాళెంకు చేరుకుని ప్రజలతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే మాటలు కూడా గ్రామస్తులు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు. పంచాయతీలో మొత్తం 1,705 మంది ఓటర్లు ఉన్నారు. బురదగల్లి, కొత్తపాళెం, కుమ్మరిపాళెం, పేరపాటి తిప్ప గ్రామాలకు సంబంధించి అధికారులు మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే 278 పోలింగ్ బూత్‌లో మాత్రం పంచాయతీ సర్పంచ్ ఎర్రబోతు మణి తన ఓటు వేశారు. ఆయనతో పాటు మరో వ్యక్తి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పంచాయతీలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వేచి ఉన్నారు. -
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై బహిష్కరణ..
సాక్షి, అమరావతి: పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ల నైతిక విలువలను గాలికొదిలేసి.. తెలుగుదేశం పార్టీ కరపత్రికలా, ప్రసార సాధనంలా పని చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బహిష్కరించింది. నిన్న ఏబీఎన్ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జి వుల్లూరి గంగాధర్ వెల్లడించారు. టీడీపీ ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయించకుండా, తిరిగి అతన్ని ఈ రోజు చర్చకు ఆహ్వానించడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. మీడియా ముసుగులో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికలపై నేటి నుంచి బహిష్కరణ విధిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి జరిగే పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆంధ్రజ్యోతిని ఆహ్వానించరాదని, ఆ టీవీ ఛానల్లో జరిగే చర్చా కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ యొక్క ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ ఏబీఎన్ ఛానల్ తమకు నచ్చిన వారిని డిబేట్ల పేరుతో ఆహ్వానించి, వారి వాయిస్‌ను పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఏబీఎన్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని ప్రకటించారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
బాయ్‌కాట్ మీర్జాపూర్2 .. ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్
ముంబై: ప్రముఖ వెబ్ సరీస్ మీర్జాపూర్ సీక్వెల్ బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. నిన్న (బుధవారం) మీర్జాపూర్ 2ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ట్విటర్ యూజర్లు ట్రైలర్ విడుదలకు ముందు నుంచే మీర్జాపూర్ 2ను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottMirzapur2 అనే పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ సిరీస్‌లో హీరోగా నటిస్తున్న ఫజల్ అలీ, సహా నిర్మాత ఫర్హాన్ అక్తర్‌లు. గతేడాది వీరు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు మద్దతునిచ్చారు. వారి తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ‘తమ దేశానికి విధేయత చూపని నటుల సినిమాలు కానీ వెబ్ సిరీస్‌లు కానీ మాకోద్దు #BoycottMirzapur2’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. (చదవండి: మీర్జాపూర్ 2 ట్రైలర్ విడుదల) No more movies or web series of people who are not loyal to their country #BoycottMirzapur2 pic.twitter.com/OwowUApZsn — ISHWARI K (@ISHWARIK2) October 7, 2020 మరోవైపు మిర్జాపూర్ సీజన్2 కోసం ఎంతో ఆస్తక్తిగా ఎదురు చుస్తున్నామంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. ‘మీర్జాపూర్ 2 ట్రైలర్ ఆశాజనకంగా ఉంది’ ఈ సిరీస్ కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్న.. ట్రైలర్ చూస్తుంటే ఉత్సాకంగా ఉంది. మొదటి సిజన్ తరహాలోనే సిక్వేల్ కూడా సూపర్ హిట్ అవుతుంది’ అంటూ అభిమాను ట్వీట్ చేస్తున్నారు. అంతా బాగుంటే వచ్చే నెలలో ప్రుముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమోజాన్ ప్రైంలో మీర్జాపూర్ విడుదల కావాల్సీంది. అయితే ఈ వివాదాల మధ్య మరి మీర్జాపూర్2 విడుదల అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. -
మీర్జాపూర్‌ను బాయ్‌కాట్ చేస్తారా?
అనుకున్నట్లు అన్నీ కుదిరితే వచ్చే నెలలో మీర్జాపూర్ వెబ్‌సిరీస్ సీక్వెల్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. మీర్జాపూర్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా పార్ట్ 1 విషయంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్ట్‌తో రాజమౌళి ఫ్యాన్స్‌ను ఊరించిన మాదిరిగా ఈ వెబ్‌సిరీస్ మొదటి పార్ట్ చివరిలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. అందుకే ఎప్పుడెప్పుడు ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ విడుదల అవుతుందా? ఈ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందామా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ కు ఇబ్బందులు తప్పేటట్టు కనిపించడం లేదు. Its here ! #mirzapur2 https://t.co/rlSs0mvu4J — Ali Fazal M / میر علی فضل / अली (@alifazal9) October 6, 2020 దానికి ప్రధాన కారణం కో ప్రొడ్యూసర్ ఫర్హ ఖాన్, హీరో అలీ ఫజల్. వీరు గత ఏడాది పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు మద్దతునిచ్చారు. దీంతో #బాయ్‌కాట్ మీర్జాపూర్2 అని ట్వీట్టర్లో ట్రెండ్ అవుతుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం దీనికి వ్యతిరేకంగా వెబ్ సిరీస్ విడుదల కావాలని తమ వంతు ప్రచారం చేస్తున్నారు. దీనిపై వివిధ రకాల మీమ్స్ ద్వారా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. చదవండి: ‘మీర్జాపూర్-2’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. -
కత్తి మహేష్‌కు మరో చేదు అనుభవం!
సాక్షి, తిరుపతి : శ్రీరాముడిపై తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలతో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఇదివరకే ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించిన విషయం విధితమే. అయితే తన సొంతూరుకు వెళ్లాలనుకున్న కత్తి మహేష్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అతడిని స్వగ్రామానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా ఎర్రవారిపల్లి మండలంలోని తన స్వగ్రామం యలమందకు వెళ్తున్నట్లు పీలేరు పోలీసులకు కత్తి మహేష్ తెలిపారు. ఈ మేరకు పీలేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయనను పోలీసులు వద్దని వారించారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్ యలమందకు వెళితే అక్కడ హిందూ ధార్మిక సంఘాలు దాడి చేసే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు. అయినా కత్తి మహేష్ వెనక్కి తగ్గకపోవడంతో.. బలవంతంగా జీపు ఎక్కించారు పీలేరు పోలీసులు. అక్కడినుంచి ఆయనను బెంగళూరుకు తరలించారు. కాగా, కత్తి మహేష్‌పై వేటు వేసిన తర్వాత స్వామి పరిపూర్ణానందను సైతం పోలీసులు హైదరాబాద్ నగరం నుంచి ఆరు నెలలపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా, కత్తి మహేష్‌ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిషేధించాలంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేటు పడ్డ తర్వాత శ్రీరాముడిపై కత్తి మహేష్ పాడిన శ్లోకం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంబంధిత కథనాలు కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! అమోఘం: కత్తి మహేష్ నోట శ్రీరాముడి శ్లోకం! -
‘కత్తి’ని తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలి!
సాక్షి, అనతపురం : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై అనుచిత వాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని భజరంగదళ్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ఈ రోజు(మంగళవారం) రెవెన్యూ అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడుతున్న కత్తి మహేష్ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. సీతారాముల చరిత్రను కించపరిచే విధంగా మాట్లాడుతున్న కత్తిపై కేసు నమోదు చేయాలన్నారు. హిందూ ధర్మగ్రహ యాత్రకు తెలంగాణలో అవకాశం కల్పించి, పరిపూర్ణానంద స్వామీజీకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చర్చావేదికలు పెట్టి మత విశ్వాసాలపై డిబెట్ పెడుతున్న టీవీ9 చానల్‌ను సైతం మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భజరంగదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కసాపురం రవి, సోమశేఖర్, రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కత్తి మహేశ్‌పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. వినతిపత్రం అందజేస్తున్న భజరంగదళ్ నాయకులు -
తొలిసారి తెరపైకి కత్తి మహేష్ తండ్రి
-
తొలిసారి తెరపైకి కత్తి మహేష్ తండ్రి
సాక్షి, చిత్తూరు : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై ఈ రోజు(సోమవారం) హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. కత్తి ఇటీవల శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే కత్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీనిపై కత్తి మహేష్ తండ్రి కత్తి ఓబులేసు స్పందించి శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా కొడుకును కాదు.. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాముడి గురించి నా కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని పేర్కొన్నారు. రామాయణం విష వృక్ష పుస్తకం.. పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందన్నారు. నా కొడుకు హిందువే.. నాస్తికుడు కాదు.. అస్తికుడేనని తెలిపారు. నా కొడుకు తన భార్యతో కలిసే ఉన్నాడు విడిపోలేదని చెప్పారు. ఈ నెల 4న లక్నో వెళ్లి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారని తెలిపారు. సామాజిక మాథ్యమాల్లో కావాలనే కొంతమంది నా కొడుకుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. -
‘కత్తి మహేశ్ అయినా నెత్తి మహేశ్ అయినా’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనూ తెలంగాణ ప్రభుత్వం అనుమతించబోదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. అది కత్తి మహేశ్ అయినా నెత్తి మహేశ్ అయినా సామరస్యాన్ని చెడగొడితే ఉపేక్షించమని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్‌పై తీసుకున్న నిర్ణయానికి డీజీపీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ప్రాధాన్యత లేని వ్యక్తుల మాటలను ప్రసారం చేసేప్పుడు మీడియా మరింత సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాడిందే పాడినట్టు కాళేశ్వరంపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలను గందరగోళ పరిచేట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టును ఎందుకు కట్ట లేదో జీవన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు ప్రతిపాదిస్తే మహారాష్ట్రతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేకపోయిందని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి అవివేకంతో మాట్లాడుతున్నారని, కాళేశ్వరంపై సుప్రీంకోర్టు తాజాగా వేసిన పిటిషన్‌ను కొట్టి వేయడం కాంగ్రెకు చెంపపెట్టు అన్నారు. సుప్రీంలోద తాజాగా పిటిషన్ వేసిన దొంతు లక్ష్మీనారాయణ వెనక కూడా కాంగ్రెస్ ఉందన్నారు. కోర్టులతో మొట్టి కాయలు వేయించుకోవడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై కోర్టుల్లో కేసులు నిలవక పోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక స్థలంగా మారిందని జీవన్ రెడ్డి అంటున్నారనిఒ, ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు పర్యాటక స్థలాలుగా మారితే తప్పేంటి అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లకు గ్రీసు పెట్టిన పాపాన కూడా పోలేదని, కాళేశ్వరానకి గత ఏడాది కాలంలోనే పది రకాల అనుమతులు సాధించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కోర్టుల్లో కేసులు వేయడం మానుకుని ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలన్నారు. -
అవసరమైతే కత్తి మహేశ్‌కు మూడేళ్ల జైలు
-
కత్తి మహేశ్‌ను అందుకే బహిష్కరించాం : డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : గత నాలుగేళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కేవలం కొందరు వ్యక్తుల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదని భావించి సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరించినట్లు డీజీపీ వెల్లడించారు. కత్తి మహేశ్ పోస్టులు, ఆపై బహిష్కరణ విషయంపై సోమవారం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సొంత జిల్లాకు కత్తి మహేశ్ కత్తి మహేశ్ అనే వ్యక్తి టీవీ చానళ్లను, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పదే పదే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్ వ్యాఖ్యలు, పోస్టులతో మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అయినప్పటికీ సమాజంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావిస్తున్నాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన క్రమంలో హైదరాబాద్ నుంచి కత్తి మహేశ్‌ను 6 నెలలపాటు బహిష్కరించాం. ఆయన సొంత జిల్లా చిత్తూరుకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. చట్టాలను ఉల్లంఘించి ఒకవేళ మళ్లీ అతను నిషేధ సమయంలో హైదరాబాద్‌లో ప్రవేశిస్తే మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అంతేగాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కత్తి మహేశ్‌పై నిషేధం విధించాల్సి ఉంటుంది. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. భారతదేశం నలుమూలల నుంచి ఎక్కడినుంచైనా వచ్చి ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు. కానీ కత్తి మహేశ్ తరహాలో ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. శాంతి భద్రతలు బాగుండటం వల్లే తెలంగాణ పౌరులు, ఉద్యోగులు, అన్నివర్గాల వారు అభివృద్ది కోసం వాళ్ల పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఎవరో కొందరు వ్యక్తులు కావాలని పని గట్టుకుని, ప్రసార మాధ్యమాలను వేదికగా చేసుకుని ఇతర వర్గాల మధ్య తగాదాలు పెట్టడం చేయకూడదు. పదే పదే తమకున్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్తితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. సహకరిస్తే చర్యలు తప్పవు కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రక్రియలో ఇతర వర్గాలు, మతాలు, ప్రాంతాల వారి మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఆయా వ్యక్తులకు సహకరించిన వారిపై సైతం చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతరత్రా మాధ్యమాల ద్వారా ఏ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా నోటీసులు జారీ చేస్తాం. కత్తి మహేశ్ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన ఓ ఛానల్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వారిచ్చే సమాధానం బట్టి చర్యలు ఉంటాయి. సెక్షన్ 16, 17 కేబుల్ యాక్ట్ ప్రకారం మేనేజ్మెంట్ రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చాం. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సంబంధిత కథనం కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! -
కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ వేటు
-
కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు!
సాక్షి, హైదరాబాద్ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని కత్తిని ఆదేశించారు. ఈ మేరకు ఆయనను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని.. నగరం నుంచి తీసుకెళ్లారు. ఏపీలోనూ కత్తి మహేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్తూరులోని స్వగ్రామానికి కత్తి మహేశ్‌ను పోలీసులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆయనను హైదరాబాద్ నుంచి బహిష్కరించారా? లేక తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించారా? అన్నది తెలియాల్సి ఉంది. ఎన్ని నెలలపాటు కత్తి మహేశ్‌ను నగరం నుంచి బహిష్కరించారనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ నగర బహిష్కరణ, స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్టుపై మరిన్ని వివరాలు తెలిపేందుకు తెలంగాణ డీజీపీ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. శ్రీరాముడిపై తాజాగా కత్తి మహేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో కత్తి మహేశ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముండటంతో కత్తి మహేశ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి : ధర్మాగ్రహ యాత్రకు నో.. పరిపూర్ణానంద హౌస్ అరెస్టు! -
బ్రిటిష్ దౌత్యాధికారుల్ని బహిష్కరించిన రష్యా
మాస్కో: రష్యాకు చెందిన 23 మంది దౌత్యాధికారుల్ని బ్రిటన్ బహిష్కరించడంపై పుతిన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇందుకు ప్రతిగా మాస్కోలోని 23 మంది బ్రిటిష్ దౌత్యాధికారుల్ని రష్యా బహిష్కరించింది. వీరంతా వారం రోజుల్లోగా మాస్కో నుంచి వెళ్లిపోవాలని రష్యా విదేశాంగశాఖ శనివారం ఓ ప్రకటన జారీచేసింది. అంతేకాకుండా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని బ్రిటిష్ కాన్సుల్‌ను మూసివేయాలని రష్యా ఆదేశించింది. ఈ మేరకు మాస్కోలోని బ్రిటిష్ రాయబారి లౌరీ బ్రిస్టోను పిలిపించుకున్న రష్యా విదేశాంగశాఖ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించింది. -
కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు
కోదాడ: హైకోర్టును వెంటనే విభజించాలని, సీమాంధ్ర న్యాయమూర్తులను వారి స్వస్థలాలకు పంపాలని కోరుతూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు కోర్టు దిక్కార నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం కోదాడ జూనియర్ సివిల్‌కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈదుల కష్ణయ్య మాట్లాడుతూ వెంటనే కోర్టు ధిక్కార నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు ప్రజాస్వామ్య బద్దంగానే తమ నిరసన వ్యక్తం చేస్తే దానికి నోటీసులు జారీ చెయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ముల్కా వెంకటరెడ్డి, గాలి శ్రీనివాసనాయుడు, రంజాన్పాష, ఎల్. ధనమూర్తి, చింతకుంట్ల రామిరెడ్డి, కేఎల్ఎన్ ప్రసాద్, మందా వెంకటేశ్వర్లు, పగడాల రాంమచంద్రారెడ్డి, ఎలుక సుధాకర్‌రెడ్డి, రంగారావు, విజయ్‌కుమార్, యశ్వంత్ రామారావు, గట్ల నర్సింహారావు, ఉయ్యాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.