సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనూ తెలంగాణ ప్రభుత్వం అనుమతించబోదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. అది కత్తి మహేశ్ అయినా నెత్తి మహేశ్ అయినా సామరస్యాన్ని చెడగొడితే ఉపేక్షించమని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్‌పై తీసుకున్న నిర్ణయానికి డీజీపీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ప్రాధాన్యత లేని వ్యక్తుల మాటలను ప్రసారం చేసేప్పుడు మీడియా మరింత సంయమనం పాటించాలని సూచించారు.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాడిందే పాడినట్టు కాళేశ్వరంపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలను గందరగోళ పరిచేట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టును ఎందుకు కట్ట లేదో జీవన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు ప్రతిపాదిస్తే మహారాష్ట్రతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేకపోయిందని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి అవివేకంతో మాట్లాడుతున్నారని, కాళేశ్వరంపై సుప్రీంకోర్టు తాజాగా వేసిన పిటిషన్‌ను కొట్టి వేయడం కాంగ్రెకు చెంపపెట్టు అన్నారు. సుప్రీంలోద తాజాగా పిటిషన్ వేసిన దొంతు లక్ష్మీనారాయణ వెనక కూడా కాంగ్రెస్ ఉందన్నారు. కోర్టులతో మొట్టి కాయలు వేయించుకోవడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులపై కోర్టుల్లో కేసులు నిలవక పోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక స్థలంగా మారిందని జీవన్ రెడ్డి అంటున్నారనిఒ, ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు పర్యాటక స్థలాలుగా మారితే తప్పేంటి అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లకు గ్రీసు పెట్టిన పాపాన కూడా పోలేదని, కాళేశ్వరానకి గత ఏడాది కాలంలోనే పది రకాల అనుమతులు సాధించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కోర్టుల్లో కేసులు వేయడం మానుకుని ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment