karne prabhaker
-
గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
సాక్షి, భువనగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ శుక్రవారం తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులో సుమారు 438 ఎకరాల్లో 1500 కోట్ల వ్యయంతో ఇండస్ట్రీయలైజేషన్ జరిగింది. పార్కు నిర్మాణంతో.. పరిసర గ్రామాల్లోని సుమారు 30 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలపడంతో.. ప్రారంభోత్సవం కోసం అక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ప్రారంభోత్సవం రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కలిసి నేడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. సోమవారం బడ్జెట్ కేటాయింపుల అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వివిధ పథకాలకు కేటాయింపులు తగ్గించలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు బాగున్నాయని అన్నారు. ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ : నోముల నర్సింహయ్య తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెటని, ప్రజారంజకంగా ఉందని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య కొనియాడారు. సోమవారం బడ్జెట్ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని సంక్షేమ రంగాలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. -
బీజేపీ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు
-
‘కత్తి మహేశ్ అయినా నెత్తి మహేశ్ అయినా’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనూ తెలంగాణ ప్రభుత్వం అనుమతించబోదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. అది కత్తి మహేశ్ అయినా నెత్తి మహేశ్ అయినా సామరస్యాన్ని చెడగొడితే ఉపేక్షించమని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్‌పై తీసుకున్న నిర్ణయానికి డీజీపీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ప్రాధాన్యత లేని వ్యక్తుల మాటలను ప్రసారం చేసేప్పుడు మీడియా మరింత సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాడిందే పాడినట్టు కాళేశ్వరంపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలను గందరగోళ పరిచేట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టును ఎందుకు కట్ట లేదో జీవన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు ప్రతిపాదిస్తే మహారాష్ట్రతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేకపోయిందని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి అవివేకంతో మాట్లాడుతున్నారని, కాళేశ్వరంపై సుప్రీంకోర్టు తాజాగా వేసిన పిటిషన్‌ను కొట్టి వేయడం కాంగ్రెకు చెంపపెట్టు అన్నారు. సుప్రీంలోద తాజాగా పిటిషన్ వేసిన దొంతు లక్ష్మీనారాయణ వెనక కూడా కాంగ్రెస్ ఉందన్నారు. కోర్టులతో మొట్టి కాయలు వేయించుకోవడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై కోర్టుల్లో కేసులు నిలవక పోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక స్థలంగా మారిందని జీవన్ రెడ్డి అంటున్నారనిఒ, ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు పర్యాటక స్థలాలుగా మారితే తప్పేంటి అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లకు గ్రీసు పెట్టిన పాపాన కూడా పోలేదని, కాళేశ్వరానకి గత ఏడాది కాలంలోనే పది రకాల అనుమతులు సాధించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కోర్టుల్లో కేసులు వేయడం మానుకుని ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలన్నారు. -
పోరాటం చేతకాక అక్కసెందుకు: కర్నె
సాక్షి, హైదరాబాద్ : విభజన హామీలను సాధించుకోవడం చేతకాక తెలంగాణపై మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అక్కసును వెళ్లగక్కుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో అభివృద్ధిని చూసి టీజీ వెంకటేశ్‌కు కడుపు మండిపోతోందన్నారు. ఆయన మాటల్లో అసూయ, ద్వేషం కనిపిస్తున్నాయని, ఇలాంటి వెకిలి చేష్టలు మానుకోవాలని హెచ్చరించారు. కర్నె ప్రభాకర్‌తో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. -
ఉత్తమ్ రాజీనామా చేస్తావా ?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడిందే మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. విపక్షాలు అబద్దాలు చెబుతుంటేనే పాలకపక్షం వివరణ ఇవ్వాల్సిన బాధ్యతతోనే ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ ఎందుకు చేపట్టారో కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి హజరైతే తెలిసేవని విమర్శించారు. కాంగ్రెస్ హయాం 2007లో ప్రాజెక్టులు ప్రారంభించి తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు. నీటి లభ్యత లేని కారణంగానే తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మేడిగడ్డకు మారిందని తెలియచేశారు. కాంగ్రెస్ నేతలు గోబెల్స్‌కు జేజమ్మలుగా మారారంటూ ఎద్దేవా చేశారు. తుమ్మిడి హెట్టి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. మహారాష్ట్ర తో గోదావరి జలాల పై ఒప్పందం కుదుర్చుకోకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభించిన దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని, కానీ పక్క రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుని శరవేగంగా గోదావరి పై ప్రాజెక్టులు కడుతున్న ఘనత టీఆర్ఎస్ది అని ప్రభాకర్ పేర్కొన్నారు. తుమ్మిడి హట్టి, గ్రావిటీ ప్రాజెక్టు అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని, లేకపోతే పీసీపీ చీఫ్ పదవిని వదలుకుంటారా అని సవాల్ విసిరారు. మిడ్ మానేరు ను కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో పూర్తి చేయలేకపోయిందని, కానీ టీఆర్ఎస్ సర్కార్ కేవలం 10 నెలల్లో పూర్తి చేశారని తెలియచేశారు. సమైక్య పాలకుల మోచేతి నీళ్లు తాగిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇపుడు అదే ధోరణిలో ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరగడం అత్యంత సహజమని కర్నె తెలిపారు. 40 కోట్ల రూపాయలతో మొదలైన శ్రీరామ్ ప్రాజెక్టు అంచనావ్యయం 43 వేల కోట్లకు పెరగలేదా అని ప్రశ్నించారు? ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన సందేహాలకు మంత్రి హరీష్ రావు వెయ్యి సార్లు వివరణ ఇచ్చారని అన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడితే కాంగ్రెస్ నేతలకు ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. విహార యాత్రలు చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం పై బురద జల్లితే సహించబోమన్నారు. కర్నాటక ఫలితాలు ప్రాంతీయ పార్టీ ల ప్రాముఖ్యతను చాటాయని అభిప్రాయ పడ్డారు. -
టీఆర్ఎస్కు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దాన్ని టీఆర్ఎస్కు ఆపాదించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలసి కర్నె శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, నల్లగొండలో జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వీరేశం, చివరకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. హతుడు శ్రీనివాస్, నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్‌లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచర బృందంలోని వారేనన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్ తదితరులు నల్లగొండకు వెళ్లి శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నె విమర్శించారు. శ్రీనివాస్ హత్యపై న్యాయ విచారణ జరగాలని టీఆర్ఎస్ఎల్పీ పక్షాన కోరుతున్నామన్నారు. ఎమ్మెల్యే వీరేశం ఫోన్‌కాల్స్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్‌కాల్స్ జాబితాను కూడా బయట పెట్టాల్సిందిగా కోరాలన్నారు. ఫొటోలే విచారణకు ప్రామాణికమైతే నిందితులంతా కోమటిరెడ్డితో ఫొటోలు దిగారని, ప్రెస్మీట్లో ఆ ఫోటోలను విడుదల చేశారు. ఎమ్మెల్యే వీరేశంతో నిందితులు దిగిన ఫొటో ఆయన పీజీ పరీక్ష రాసేందుకు వచ్చినప్పుడు కాలేజీ వద్ద దిగినదని, యువ శాసన సభ్యుడు కాబట్టి వీరేశంతో వారు ఫొటోలు దిగారన్నారు. కాంగ్రెస్‌కు హత్యా రాజకీయాలు మొదట్నుంచీ అలవాటేనని, టీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు వ్యతిరేకమని కర్నె పేర్కొన్నారు. -
కమీషన్ల కోసమే ‘ప్రైవేట్’కు వత్తాసు
సాక్షి, హైదరాబాద్: కమీషన్లపైన కక్కుర్తితోనే కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రైవేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆ రెండు పార్టీల నేతలు ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్య ను అందరికీ అందుబాటులో తెచ్చేందుకు కేసీఆర్ సర్కారు కృషి చేస్తోందని తెలిపారు. ఉమ్మడి పాలనలో ప్రభుత్వ విద్య తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కార్పొరేట్ విద్యా సంస్థల హవాతో తల్లిదండ్రులు భూములను తాకట్టు పెట్టి పిల్లలను చది వించుకోవాల్సిన దుస్థితి ఉండేదని దెప్పిపొడిచారు. నారాయణ విద్యా సంస్థలతో కార్పొరేట్ విద్యకు తలుపులు బార్లా తెరిచింది తెలుగుదేశం ప్రభుత్వమే నని, వాటి అధిపతి ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని గుర్తు చేశా రు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. -
సర్వనాశనం చేసింది కాంగ్రెస్, టీడీపీలే: కర్నె
సాక్షి, హైదరాబాద్: కమీషన్ల కక్కుర్తితోనే కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రైవేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై అసత్య విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. విద్య అందరికీ అందుబాటులో ఉండే పద్దతిలో ప్రభుత్వం పని చేస్తోందని, ఉమ్మడి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారాయణ విద్యా సంస్థలతో కార్పొరేట్ విద్యకు అంకురార్పణ జరిగిందని, ఆయన ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారని చెప్పారు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ప్రయివేటు కార్పోరేటు విద్యా సంస్థలదే హవా నడిచిందని, ప్రయివేటు విద్య కోసం భూములు తాకట్టు పెట్టి చదువుకునే దుస్థితి ఉండేదన్నారు. -
మహాసభలపైనా విమర్శలేనా?: కర్నె
సాక్షి, హైదరాబాద్: మన యాస, భాషకు చక్కటి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలను అందరూ భావిస్తుంటే కొందరు కువిమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. భాష, ప్రాంతం వేర్వేరన్న సంగతిని గుర్తించలేని వారే ఇలా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ యాసతో మాట్లాడనివ్వని పరిస్థితుల్లో భాషకు తల్లులు ఉండరని ఉద్యమంలో చెప్పామని భరతమాత, తెలంగాణ తల్లి మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రమాత ఉండేదని, కుట్రతో తెలుగుతల్లిగా మార్చారని అన్నారు. ఉద్యమసమయంలో తాము తెలుగుతల్లినే తప్ప ఆంధ్రమాతను విమర్శించలేదని గుర్తుచేశారు. ఇంటి పండుగ వంటి ప్రపంచ తెలుగు మహాసభలను శపిస్తూ మాట్లాడటాన్ని ప్రజలు సహించరని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలకు కమీషన్లే కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. -
బీసీలపై కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు: కర్నె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనకబడిన కులాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ లోతైన అధ్యయనం చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో కూర్చుని బీసీలపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఎంబీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీల కోసం అన్నీ పార్టీలతో కలసి కార్యాచరణ చేపడుతుంటే కాంగ్రెస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కనుసన్నల్లో ఉన్న కోదండరాం నిరుద్యోగ యువతను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. -
రైతుల కష్టాలకు కాంగ్రెస్సే కారణం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. వారు పదేపదే ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. చేయాల్సిం దంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నట్లుగా ఉందన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు 42 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణమన్నారు. వారి హయాంలో రైతు దగా పడ్డాడని, రైతును ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుపుల్లలు వేసే పనిలో వారు తీరికలేకుండా ఉన్నారని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు క్షమాపణ చెప్పి, లెంపలు వేసుకుని చలో అసెంబ్లీ నిర్వహించాలన్నారు. కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి రైతు సమస్యల మీద మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జైపాల్‌రెడ్డి కల్వకుర్తి ప్రాజెక్టుపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. 90శాతం పనులు పూర్తి చేశామంటున్నారని, మరి మిగిలిన 10శాతం పనులు పూర్తిచేయక పోవడానికి కారణం ఏమి టని నిలదీశారు. కనీస మద్దతు ధర వచ్చేంతవరకు పత్తి రైతులు తమ పంటలను అమ్ముకోవద్దన్నారు. ఓవైపు కోర్టుల్లో కేసులు వేస్తున్న కాంగ్రెస్ నేతలు మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల్లో జాప్యాన్ని ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులపై నిజంగానే వారికి ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై వేసిన కేసుల ను ఉపసంహరించుకోవాలన్నారు. -
ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే వారి పని: కర్నె
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా వ్యతిరేకించడం, విమర్శించడం విపక్షాలకు అలవాటుగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఏడాది కిందట కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినపుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందని, దానిని మిగతా విపక్షాలు అనుసరించాయని విమర్శించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలు ఏర్పాటు చేసిన ఏడాది లోపే కొత్త భవనాలకు శంకుస్థాపన చేయడం సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. మంత్రి హారీశ్ ముచ్చర్ల ఫార్మా సిటీకి అందరికంటే ముందుగా తన భూమిని సేకరణకు ఇచ్చి సహకరించారని, కాంగ్రెస్ హయాంలో ప్రస్తుత మంత్రి ఈటల రాజేందర్ 8 ఎకరాల భూమిని ఔటర్ రింగ్ రోడ్డు కోసం లాక్కుని కాంగ్రెస్ నేతలు రాక్షసానందం పొందారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు సరైన కారణాలు చెప్పకుండా వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. -
భూరికార్డుల ప్రక్షాళనపై విపక్షాల విషం: కర్నె
సాక్షి, హైదరాబాద్: ఎనభై ఏళ్ల కిందటి రెవెన్యూ రికార్డులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విపక్షాలు విషం గక్కుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమై పది రోజులే అవుతుందని, ఇంతలోనే అనేక అక్రమాలు బయటపడ్డాయన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రికార్డుల్లో భూములు లేకున్నా 9వేల ఎకరాలకు సంబంధించి బ్యాంకుల నుంచి అక్రమంగా రుణాలు తీసుకున్నట్లు బయటపడిందన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ పూర్తిగా నిర్వీర్యమయ్యిందని ఆరోపించారు. 42 ఏళ్ల కాంగ్రెస్ పాలన అక్రమాలకు కోదండరాం వత్తాసు పలకడం దుర్మార్గమని.. ఆయన కాంగ్రెస్ అనుబంధ నాయకుడిగా మారారని విమర్శించారు. రికార్డుల ప్రక్షాళనకు ఇంకా 80 రోజుల గడువుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ భూదందాలు ఇంకెన్ని బయట పడుతాయో చూడాలన్నారు. న్యాయమైన రైతులకే ఎకరాకు రూ.8వేల పెట్టుబడి దక్కాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. ఇకనైనా విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకించడం మానితే మంచిదని కర్నె హితవు పలికారు. -
కాంగ్రెస్‌ను చూసి సిగ్గే సిగ్గు పడుతోంది
హైదరాబాద్: రాహుల్ గాంధీ సభలో తమ పాలనపై కాంగ్రెస్ చార్జీషీట్ పెడుతామంటే సిగ్గే సిగ్గు పడుతోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా టూర్ తో బీజేపీ నేతలు అభాసు పాలయినట్టే కాంగ్రెస్ కూడా రాహుల్ టూర్ తర్వాత అభాసు పాలు కాక తప్పదన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన అక్రమాలను తెలంగాణ ప్రజలు మరిచి పోలేదన్నారు. రాహుల్ కు అబద్దాలు చెప్పి అభాసు పాలుకావద్దని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో మహబూబ్‌నగర్ నుంచి వలసలు ఉండేవి, ఇపుడు వలసలు ఆగినందుకు మా మీద ఛార్జ్ షీట్ వేస్తారా ? అని నిలదీశారు. రైతులకు 17 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసినందుకు మా మీద ఛార్జి షీట్ వేస్తారా అని ప్రశ్నించారు. ఎర్ర జొన్న రైతులపై కాంగ్రెస్ హయాంలో జరిగిన దాష్టీకాన్ని తెలంగాణ మరిచి పోలేదని అన్నారు. తెలంగాణ యావత్తు కేసీఆర్ వెంట ఉందని చెప్పారు. టీడీపీ తో పొత్తు గురించి మాట్లాడిన జైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నందుకు ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలన్నారు. తాము పూర్తి సర్వే వివరాలు వెల్లడిస్తే కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ కాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ టికెట్ లు అడిగేందుకు గాంధీ భవన్ వచ్చే వారే ఉండరని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంపై ఏవేవో మాట్లాడుతున్నారు.. సర్వే అబద్ధమని అని నమ్మితే హుజుర్ నగర్ నుంచి రాజీనామా చేయండని సవాల్ విసిరారు. ఉత్తమ్ రాజీనామా చేస్తే ఆయన మీద సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటామని వ్యాఖ్యానించారు. -
'కుట్రపూరితంగానే సెక్షన్-8 ప్రస్తావన'
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగానే సెక్షన్-8 అంశాన్ని ప్రస్తావిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సి కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు విషయంలో అప్పుడు చంద్రబాబు సెక్షన్-8 అంశాన్ని ప్రస్తావించగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తుతోందని ఆయన తెలిపారు. దొంగలు దొంగలు ఒకటైనట్టుగా కాంగ్రెస్, టీడీపీలు కలిశాయని ఆయన విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.