సాక్షి, హైదరాబాద్: కమీషన్ల కక్కుర్తితోనే కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రైవేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై అసత్య విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. విద్య అందరికీ అందుబాటులో ఉండే పద్దతిలో ప్రభుత్వం పని చేస్తోందని, ఉమ్మడి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందని అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారాయణ విద్యా సంస్థలతో కార్పొరేట్ విద్యకు అంకురార్పణ జరిగిందని, ఆయన ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారని చెప్పారు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ప్రయివేటు కార్పోరేటు విద్యా సంస్థలదే హవా నడిచిందని, ప్రయివేటు విద్య కోసం భూములు తాకట్టు పెట్టి చదువుకునే దుస్థితి ఉండేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment