
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్ : విభజన హామీలను సాధించుకోవడం చేతకాక తెలంగాణపై మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అక్కసును వెళ్లగక్కుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో అభివృద్ధిని చూసి టీజీ వెంకటేశ్‌కు కడుపు మండిపోతోందన్నారు. ఆయన మాటల్లో అసూయ, ద్వేషం కనిపిస్తున్నాయని, ఇలాంటి వెకిలి చేష్టలు మానుకోవాలని హెచ్చరించారు. కర్నె ప్రభాకర్‌తో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment