
సాక్షి,హైదరాబాద్:హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు.ఆదివారం(నవంబర్ 10) తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
‘మహారాష్ట్రలో కూడా సీఎం రేవంత్ అబద్ధాలాడుతున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతుకైనా బోనస్ వచ్చిందా. రైతుబంధు ఇవ్వడం లేదని రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ఎందుకు చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలి.
రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ అయిందని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కట్టలేదు.ఉన్న ఇళ్లు కూలగొట్టింది’అని హరీశ్‌రావు విమర్శించారు.

ఇదీ చదవండి: ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణలో బతుకులు చీలికలు పీలికలే: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment