సాక్షి,హైదరాబాద్:ఉన్న పథకాలు బంద్ పెట్టడమే తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో బుధవారం(అక్టోబర్ 16) మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్‌గా మాట్లాడారు.
‘ఒక చీర కాదు..రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు.దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సహపరిచింది.రూ.15వేలు రైతుబంధు అన్నాడు..గుండు సున్నా చేశాడు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడు.
ముదిరాజ్,గంగపుత్రులంటే సీఎం రేవంత్‌కు చిన్నచూపు.ఆగస్టులో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదు.మేం రూ. 100కోట్లు ఖర్చు చేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్‌లో పెట్టిందే రూ.16కోట్లు.ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు’అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా
Comments
Please login to add a commentAdd a comment