
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనకబడిన కులాల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్ లోతైన అధ్యయనం చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో కూర్చుని బీసీలపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఎంబీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీల కోసం అన్నీ పార్టీలతో కలసి కార్యాచరణ చేపడుతుంటే కాంగ్రెస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కనుసన్నల్లో ఉన్న కోదండరాం నిరుద్యోగ యువతను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment