
సాక్షి,హైదరాబాద్: మూడు నెలల్లో బీసీ కుల గణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణనపై బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం(సెప్టెంబర్10)విచారించింది.
పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం మూడు నెలల్లో కులగణన చేయడం సాధ్యమేనా కోర్టును మళ్లీ సమయం అడుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: స్థానిక సంస్థల నిధులు పెంచండి