
సాక్షి, హైదరాబాద్: ఆందోళనకు అనుమతి లేకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ఉస్మానియా వర్సిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఉస్మానియా రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఉస్మానియా వర్సిటీలో నిరసనలకు అనుమతి లేదంటూ రిజిస్ట్రార్ ఈ నెల 13న జారీ చేసిన సర్కులర్ చట్టవిరుద్ధమంటూ ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), 21ను ఉల్లంఘించినట్లేనని.. ఆ సర్కులర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ బీ.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉస్మానియాలో నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్న స్టాండింగ్ కౌన్సిల్.. అయితే కాలేజీ ఆవరణల్లో, డిపార్ట్‌మెంట్‌లో ఆందోళనలను నిలిపివేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిజస్ట్రార్‌కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment