Registrar
-
‘నువ్వు అటెండర్‌గా పనికిరావు.. స్వీపర్‌గా పనిచేసుకో’
కుప్పం: ‘నువ్వు అటెండర్‌గా పనికిరావు..స్వీపర్‌గా, తోటమాలిగా పనిచేసుకో’ అంటూ రిజిస్టార్ వేధిస్తున్నారని బాధితురాలు మీడియాతో ఆదివారం వాపోయింది. బాధితురాలి కథనం మేరకు, 2007లో ద్రవిడ వర్శిటీలో భాగ్యలక్ష్మి అటెండర్‌గా చేరారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో అటెండర్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో వర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు సక్రమంగా ఇవ్వలేదని ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. అప్పట్లో భాగ్యలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆ ధర్నాలకు హాజరు కాలేదు. దీంతో ఆమెపై యూనియన్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ధర్నాకు రాలేదని తమిళ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో భాగ్యలక్ష్మిపై దాడి చేయించి గాయపరిచారు. దీనిపై అప్పట్లో గుడుపల్లె పోలీస్ స్టేషన్లో భాగ్యలక్ష్మి ఇచ్చినా ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును వాపసు తీసుకోవాలని వర్సిటీ అధికారులు వేధిస్తున్నారని, చెప్పినట్లు వినకపోతే అటెండర్ నుంచి స్వీపర్‌గా మార్చుతామని బెదిరిస్తున్నట్లు ఆమె వాపోయారు. దీంతో పాటు తన భర్త గుండె నొప్పితో బాధపడుతున్నారని, ఈ విషయం వర్సిటీ అధికారులకు తెలిసినా మరింత ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.ఈ మేరకు వర్సిటీ మహిళా విభాగానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. 25న పేదింటి యువతి వివాహం -
ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా
సాక్షి, విశాఖపట్నం: ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ప్రసాద్‌రెడ్డి, స్టీఫెన్‌పై టీడీపీ నేతలు నుంచి ఒత్తిడి రావడంతో వారు రాజీనామా చేశారు.నిన్న వీసీ ఛాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఓవరాక్షన్ చేశారు. ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా వీసీని భయబ్రాంతులకు గురిచేసే విధంగా టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రణవ్ గోపాల్ వ్యవహరించారుగతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రసాద్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయనను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.కాగా, తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగారు. -
ఫలితం కోసం చూడకుండా అంకితభావంతో పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘ఫలితాల కోసం ఎదురుచూడకుండా అంకితభావంతో నీ పని నువ్వు చేసుకుపో.. అని భగవద్గీతలోని శ్లోకాలు చెబుతున్నాయి..ఇది అర్బిట్రేషన్‌లో నిపుణులు ఎలాంటి కీలకపాత్ర పోషించాలో చెబుతుంది’అని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఆధ్వర్యంలో ‘ఆర్బిట్రేషన్‌లో విలువను పెంపొందించడం–నిపుణుల సూచనలు’అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’అనే భగవద్గీత శ్లోకాన్ని ఉటంకించారు.నిష్పక్షపాతానికి కట్టుబడి న్యాయమైన తీర్మానాలకు వేదికను ఏర్పాటు చేయడంతో నిపుణులకు ఈ సూత్రం ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. ఐఏఎంసీ రిజిస్ట్రార్ ప్రారంభోపన్యాసం చేశారు. భారత్‌ను అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా మార్చడంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాత్ర కీలకమని అన్నారు. కార్యక్రమంలో జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ నంద, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ పుల్లా కార్తీక్, సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ అంతర్జాతీయ మధ్యవర్తి, అంతర్జాతీయ న్యాయమూర్తి ప్రొఫెసర్ డగ్లస్ జోన్స్, లండన్, టొరంటో, సిడ్నీలోని లా ఛాంబర్స్‌తో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ ప్రొఫెసర్ జానెట్ వాకర్, ఎఫ్టీఐ కన్సల్టింగ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ లీ బేకర్, అర్బిట్రేటర్ భాగస్వామి విన్సెంట్ రోవాన్, ఎఫ్టీఐ కన్సల్టింగ్‌లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ బలిసాగర్ పాల్గొన్నారు. -
ఛీ..ఛీ.. చిల్లర పంచాయితీ!
తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ కుర్చీ కోసం ప్రొఫెసర్లు యాదగిరి, కనకయ్య మధ్య వాదులాట గల్లీ లొల్లిని తలపించింది. ఇది చాలదన్నట్లుగా వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు రెండుగా చీలిపోవడం.. పైగా బయట నుంచి దళిత సంఘాలు వర్సిటీలోకి రావడం మరీ విడ్డూరంగా మారింది. వెరసి అందరూ కలిసి అత్యున్నత విద్యాసంస్థ మర్యాదను దిగజార్చే ప్రయత్నం చేశారంటూ విద్యావర్గాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. చివరికి తమ అదుపాజ్ఞలో పనిచేసే సిబ్బందే ఏకంగా రిజిస్ట్రార్ చాంబర్, వీసీ చాంబర్ గదులకు తాళం వేసే వరకు వెళ్లడం ఎంత పరువు తక్కువో.. తమ స్థాయిని ఎంత దిగజార్చుకున్నారో ఆ కుర్చీల్లో కూర్చుండే అధికారుల విజ్ఞతకే తెలియాలి. నిజామాబాద్: రాజకీయ పార్టీల్లో గల్లీ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పదవుల కోసం కొట్లాటలు నడుస్తుండడం సర్వసాధారణం. కానీ తెలంగాణ వర్సిటలో మాత్రం అంతకుమించి అన్నట్లుగా రిజిస్ట్రార్ కుర్చీ విషయంలో ఎడతెగని రగడ కొనసాగుతుండడం విస్తుగొలుపుతోంది. వీసీ రవీందర్ గుప్తా వ్యవహార శైలి, అక్రమ నియామకాల నేపథ్యంలోనే రిజిస్ట్రార్ పదవి విషయంలో నువ్వానేనా అనేవిధంగా పంచాయితీ నెలకొన్నట్లు వర్సిటీ వర్గాలు, విద్యార్థి సంఘాలు అంటున్నాయి. రెండేళ్ల కాలంలో ఏకంగా ఆరుగురు రిజిస్ట్రార్లు పదిసార్లు కుర్చీలు మార్చుకున్న పరిస్థితి నెలకొంది. మళ్లీ తా జాగా సోమవారం వర్సిటీలో రిజిస్ట్రార్ కుర్చీ విషయమై ఆ చాంబర్లో మూడు గంటల పాటు లొల్లి నడిచింది. పాలకమండలి తీర్మానం మేరకు రిజిస్ట్రార్‌గా నియమితులైన యాదగిరి కుర్చీలో కూర్చున్నా రు. ఇదే సమయంలో కనకయ్య వచ్చి తనను వీసీ రిజిస్ట్రార్‌గా నియమించారని, తనకే కుర్చీలో కూ ర్చునే అధికారం ఉందని వాదించారు. పాలకమండలి, ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వండతోనే రిజిస్ట్రార్ బా ధ్యతలు తీసుకున్నట్లు యాదగిరి తెలిపారు. ఈ క్ర మంలో విద్యార్థి సంఘాలన్నీ అక్కడకు వచ్చి రిజిస్ట్రార్ యాదగిరికి మద్దతుగా నిలిచాయి. బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు, ఒక్క విద్యార్థి సంఘం మాత్రం కనకయ్యకు మద్దతుగా నిలిచాయి. చివరకు అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. రిజిస్ట్రార్ ఎవరో తేలేవరకు వీసీ, రిజిస్ట్రార్ చాంబర్లకు తాళాలు వేయాలని నిర్ణయించారు. మొత్తాని కి రాజకీయ పార్టీల్లో గల్లీ స్థాయిలో పదవి కోసం కొ ట్లాడుకున్న మాదిరిగా చాలాసేపు వ్యవహారం కొనసాగడం విశేషం. బయటి వ్యక్తులను తీసుకొచ్చి గొ డవ చేయించే విధంగా సంస్కృతికి బీజం వేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ లో రిజిస్ట్రార్ కుర్చీ విషయమై చిల్లర పంచాయితీ నెలకొనడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్రమాల పుట్ట పగులుతుందనేనా..? వర్సిటీకి అత్యున్నతమైన పాలకమండలి తీర్మానాలను అమలుచేసే విషయంలో వీసీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుండడం గమనార్హం. ఇప్పటికే కనకయ్యతో కలిసి వీసీ అక్రమ నియామకాలు చేయడం, విచ్చలవిడిగా సుమారు రూ. 40కోట్ల మేర అధికారిక అనుమతి లేకుండా ఖర్చులు చేయడం, అడ్వాన్సులు చెల్లించడం తదితర వ్యవహారాలపై విచారణకు ఇప్పటికే ఈసీ ఐదుగురు సభ్యుల కమిటీ నియమించింది. ఈ కమిటీ ఒక్కరోజు విచారణ చేస్తేనే రూ. కోటి మేర అక్రమ చెల్లింపులు వెలుగుచూశాయి. కమిటీ విచారణ నేపథ్యంలో 55వ పాలకమండలి తీర్మానాలపై వీసీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మళ్లీ తర్వాత 56, 57 పాలకమండలి తీర్మానాలపైనా స్టే తెచ్చుకునేందుకు వీసీ ప్రయత్నాలు చేస్తున్నారు. వీసీని ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారో కానీ, ఉన్నత విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. అక్రమాలు బయట పడతాయనే వీసీ ఇష్టం వచ్చినట్లు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ లేకుండానే కనకయ్య యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ప్రమోషన్ పొందాడని, అదేవిధంగా సర్వీసు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లాడనే విషయమై విచారణకు ఈసీ తీర్మానం చేసింది. అదేవిధంగా పీహెచ్డీ ప్రవేశాలపై సైతం కనకయ్య అక్రమాలు చేసినట్లు ఈసీ నిర్ణయించింది. ఈ వ్యవహారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక వీసీ రవీందర్‌గుప్తా, కనకయ్య చేసిన అక్రమ నియామకాలపైనా, విచ్చలవిడిగా చేసిన ఖర్చులపైనా విచారణ చేస్తే అన్నీ బయటకొస్తాయనే వీరిద్దరూ కలిసి రిజిస్ట్రార్‌గా మరొకరు ఉండేందుకు అంగీకరించకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నట్లు ఈసీ సభ్యులు తెలిపారు. ఇక వర్సిటీ ల్యాప్‌టాప్‌ను రెండేళ్లుగా తనవద్దనే ఉంచుకున్న కనకయ్య ఇప్పటివరకు అప్పగించకపోవడం విశేషం. మొత్తంమీద అక్రమ వ్యవహారాలను పాలకమండలి సభ్యులు బట్టబయలు చేయకుండా చేసేందుకే ఈ తెగింపు చర్యలకు వీసీ రవీందర్, కనకయ్య పాల్పడుతున్నట్లు వర్సిటీలో తీవ్రచర్చ జరుగుతోంది. -
రిజిస్ట్రార్ కుర్చీ కోసం ఎత్తుకుపైఎత్తులు
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ నియామకంలో బుధవారం హై డ్రామా నెలకొంది. వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ హైకోర్టు మధ్యంతర రద్దు ఉత్తర్వుల ఆధారంగా ఈసీ నియమించిన ప్రొఫెసర్ యాదగిరి స్థానంలో వర్సిటీ కొత్త రిజిస్ట్రార్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్ నిర్మల దేవిని నియమించారు. ఆమె బుధవారం ఉదయం ఓయూ నుంచి ఏడాది కాలానికి లీన్ తీసుకుని తెయూ రిజిస్ట్రార్‌గా సా యంత్రం బాధ్యతలు స్వీకరించారు. అయితే పాలనాపరమైన కారణాల వల్ల లీన్‌ను రద్దు చేస్తూ బు ధవారం సాయంత్రం ఓయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఆమెను యథాస్థానంలో తిరిగి చేరాలని కోరుతూ ఉత్తర్వులు జారీచేయడం కలకలం రేపింది. రిజిస్ట్రార్‌గా నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించక ముందే ఆమె లీన్ రద్దు చేస్తున్నట్లు ఓయూ జారీ చేసిన ఉత్తర్వులు అందినప్పటికీ వీసీ ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్మల రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించగానే వీసీ కార్యాలయం ద్వారా ఆగమేఘాలపై రిజిస్ట్రార్ సిగ్నేచర్‌ను బ్యాంక్ ఆథరైజేషన్ కోసం పంపించడం గమనార్హం. అయితే అప్పటికే బ్యాంకు పని వేళలు ముగియడంతో బ్యాంక్ అధికారులు సిగ్నేచర్ అథరైజేషన్ చేయలేకపోవడం కొసమెరుపు. వీసీ వర్సెస్ నవీన్ మిట్టల్ వ్యవహారం తెలంగాణ యూనివర్సిటీని మరింత వివాదంలోకి నెట్టేసింది. గత నెల 19న హైదరాబాద్‌లో జరిగిన 55వ తెయూ పాలకమండలి సమావేశాన్ని వీసీ వాకౌట్ చేయడం సంచనలం రేపింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాకాటీ కరుణ, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, పాలకమండలి సభ్యులు రెండేళ్ల కాలానికి తెయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగిస్తూ, పాలకమండలి ప్రమేయం లేకుండా వీసీ రవీందర్ హయాంలో జరిగిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, విచ్చలవిడి కొనుగోళ్తు, చెల్లింపులు, నిధుల దుబారా తదితర అంశాలపై విచారణ జరపాలని తీర్మానం చేశారు. వీసీ అధికారాలకు కత్తెర వేసి రిజిస్ట్రార్‌కు హక్కులు కట్టబెట్టారు. దీంతో ఈసీ నిర్ణయాలను వీసీ హైకోర్టులో సవాల్ చేశారు. తుది తీర్పు వచ్చే వరకు ఈసీ నిర్ణయాలను రద్దు చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం వీసీ రవీందర్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకంగా నవీన్ మిట్టల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రార్‌గా యాదగిరి నియామకం చెల్లదని, వారం రోజుల్లో ఓయూ నుంచి ఒకరిని రిజిస్ట్రార్‌గా నియమిస్తామని పేర్కొన్నారు. చెప్పినట్టే బుధవారం ఓయూ ఈసీఈ హెచ్‌వోడీ ప్రొఫెసర్ నిర్మల దేవిని తెయూ రిజిస్ట్రార్‌గా నియమించారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఓయూ నుంచి లీన్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్మల దేవిని వెనక్కు తిరిగి రావాని కొత్త ఉత్తర్వులు జారీ కావడం సంచనలం కలిగించింది. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ నిర్మల దేవి తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎల్.నిర్మల దేవి నియామకమయ్యా రు. ఈ మేరకు బుధవారం సాయంత్రం వీసీ డి.రవీందర్ ఆమెకు ఉత్తర్వులు అందజేశారు. వెంటనే ఆమె రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నిర్మ ల దేవి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. నిర్మలదేవి 23 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. రిజిస్ట్రార్‌గా బాధ్య తలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీచింగ్, నాన్–టీచింగ్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరి సహకారంతో తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థ ముఖ్యమన్నారు. మీడియా నిజమైన వార్తలు ప్రచురించాలని వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వీసీ రవీందర్ మాట్లాడుతూ.. త్వరలోనే తెయూలో ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభిస్తామన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యత నిచ్చే నిర్మల దేవిని రిజిస్ట్రార్‌గా నియమించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం వీసీ రవీందర్, రిజిస్ట్రార్ నిర్మలదేవిని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ విషయమై నిర్మల దేవిని సంప్రదించగా ఓయూ నుంచి లీన్ అనుమతి ఇస్తేనే తాను తెయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించానని, రద్దు ఉత్తర్వులు తనకు తెలియవన్నారు. తెయూ రిజిస్ట్రార్‌గా కంటిన్యూ అవుతానని స్పష్టం చేశారు. అయితే లీన్ రద్దు చేసినా నిర్మల దేవి తిరిగి వెళ్లకపోతే ఓయూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. నేడు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం.. ఈసీ నిర్ణయాలను రద్దుచేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పై గురువారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. వీసీ తెచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తే (స్టే వెకేట్) మళ్లీ అప్పుడు రిజిస్ట్రార్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారనుంది. దీనికి తోడు శుక్రవారం తెయూ ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. ముందు గా ఆన్లైన్లో వర్చువల్‌గా ఈసీ సమావేశం ని ర్వహించాలని భావించినా వర్సిటీలో జరుగుతు న్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్న ఈసీ స భ్యులు ప్రత్యక్షంగా సమావేశం జరపాలని భావి స్తున్నట్లు తెలుస్తోంది. వీసీ దుందుడుకు చర్య లు, నవీన్ మిట్టల్‌పై ఆరోపణలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. వీసీపై మరి న్ని చర్యలకు తీర్మానం చేసే అవకాశాలున్నాయి. రెండేళ్ల పదవీ కాలంలో వీసీ రవీందర్ ఆరుగురు రిజిస్ట్రార్లను మార్చారు. దీంతో వర్సిటీలో పాలన, టీచింగ్, పరిశోధన అటకెక్కాయి. తెయూ పాలకమండలి సభ్యుడు గంగాధర్‌గౌడ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వీసీ రవీందర్ తన చర్యలతో వర్సిటీ పరువును గంగలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఆమోదం లేకుండా నూతన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన నిర్మల దేవి వర్సిటీ నిధుల్లో నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసక్తికర పరిణామాల మధ్య తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్ నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ పాలకమండలి నిర్ణయాన్ని కాదని యాదగిరి స్థానంలో ఆమెను వీసీ రవీందర్ నియమించారు. నిర్మల లీన్‌ను రద్దు చేస్తూ ఓయూ నుంచి ఉత్తర్వులు వెలువడినప్పటికీ తెయూ వర్సిటీగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం కొసమెరుపు. ఈ పరిణామాలతో పాలక మండలి, వీసీ మధ్య పోరు తారాస్థాయికి చేరినట్లయ్యింది. -
26న పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
సాక్షి, అమరావతి: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆదివారం కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు, ఇతర చలానాలను ఆ రోజు రాష్ట్రంలోని 51 ఎస్బీఐ బ్రాంచిల్లో కట్టవచ్చని తెలిపారు. -
బ్యాంకు మోసాల కట్టడికి ఫ్రాడ్ రిజిస్ట్రీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో మోసాలు తగ్గించేందుకు, కస్టమర్ల రక్షణ కోసం.. మోసాలకు సంబంధించి సమాచారంతో ఓ రిజిస్ట్రీని (ఫ్రాడ్ రిజిస్ట్రీ) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఇందులో మోసపూరిత వెబ్సైట్లు, ఫోన్ నంబర్లు, డిజిటల్ మోసాలకు పాల్పడే తీరు తదితర వివరాలు ఉంటాయి. ఆయా వెబ్సైట్లు, ఫోన్ నంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ద్వారా మోసాలకు చెక్ పెట్టాలని ఆర్బీఐ చూస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ శర్మ తెలిపారు. ఫ్రాడ్ రిజిస్ట్రీ ఏర్పాటుకు కచ్చితమైన సమయం ఇంకా అనుకోలేదని.. ప్రస్తుతం వివిధ భాగస్వాములు, విభాగాలతో సంప్రదింపులు నడుస్తున్నాయని చెప్పారు. చెల్లింపుల వ్యవస్థలకు చెందిన భాగస్వాములు ఎప్పటికప్పుడు ఈ ఫ్రాడ్ రిజిస్ట్రీ సమాచారం పొందేలా అనుమతించాలన్నది యోచనగా చెప్పారు. కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కస్టమర్లు రిజర్వ్‌బ్యాంకు సమగ్ర అంబుడ్స్‌మన్ పథకం పరిధిలోకి వస్తారని శర్మ తెలిపారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఒకే దేశం ఒకే అంబుడ్స్‌మన్‌ను ప్రారంభించడం తెలిసిందే. 2021–22లో 4.18 లక్షల ఫిర్యాదులు అంబుడ్స్‌మన్ ముందుకు వచ్చాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 3.82 లక్షలుగా ఉన్నాయని వెల్లడించారు. గతేడాది 97.9 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు చెప్పారు. కస్టమర్లు తమ బ్యాంకు ఖాతా, కార్డుల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, మోసం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
-
‘సహకార’ వ్యూహం ఫలించేనా?
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఒక రోజు ముందు, నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పర్చింది. భారత్‌లో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక పాలనా, న్యాయశాసన, విధానపరమైన చట్రాన్ని ఈ కొత్త శాఖ అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక రోజు తర్వాత ఈ నూతన మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహిస్తారని ప్రకటించింది. విడివిడిగానే అయినప్పటికీ కలిసే వచ్చిన ఈ రెండు ప్రకటనలపై పరిశీలకులు అంచనాలు మొదలెట్టేశారు. వాస్తవానికి కో-ఆపరేటివ్‌లు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. దేశం లోని ప్రతి రాష్ట్రం కో-ఆపరేటివ్‌లకు రిజిస్ట్రార్‌ని నియమిస్తుంది. ఈ రంగాన్ని మొత్తంగా ఆ రిజిస్ట్రారే పర్యవేక్షిస్తుంటారు. పైగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఇంత పటిష్ట నిర్మాణం ఉంటూండగా, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఎందుకు సృష్టించినట్లు? పైగా ఈ శాఖను అమిత్ షా చేతిలో పెట్టడం పలు అనుమానాలకు దారి తీసింది. అయితే ఏం జరుగుతోందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇతర రంగాలకు మల్లే సహకార సంస్థలకు పెద్దగా ప్రాచుర్యం లభించదు. అవి సామాన్యంగా పతాక శీర్షికలకు ఎక్కవు. కానీ గ్రామీణ భారత్‌ని, క్రమబద్ధీకరణ లేని ఆర్థిక వ్యవస్థను బలపర్చే ఆర్థికపరమైన చట్రంలో ఇవి భాగం. ఉత్పత్తి (చక్కెర), పరపతి (పట్టణ, గ్రామీణ కో-ఆపరేటివ్‌లు, సహకార బ్యాంకులు), మార్కెటింగ్ (పాల కో-ఆపరేటివ్‌లు) వంటి వాటిలో వీటి ఉనికిని మనం చూడవచ్చు. పాత వైపరీత్యం దిద్దుబాటే లక్ష్యమా? చాలాకాలంగా కొనసాగుతున్న ఒక నియమ విరుద్ధమైన వైపరీత్యాన్ని చక్కదిద్దడానికే కేంద్రం ఈ పనికి పూనుకుందని భావిస్తున్నారు. కో–ఆపరేటివ్‌లు నిజానికి రాష్ట్ర పరిధిలోనివే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ రంగంపై ఒక కన్నేసి ఉంచుతూ వస్తోంది. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖలో సహకార సంస్థల పర్యవేక్షణ విభాగం ఉంటోంది. ఇది ప్రధానంగా వ్యవసాయంపై దృష్టి పెడుతున్నప్పటికీ, కో–ఆపరేటివ్‌ల అవసరాల పట్ల ఈ శాఖ పెద్దగా స్పందించదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాజీ సంయుక్త కార్యదర్శి ఒకరు పేర్కొన్నారు. కాలానుగుణంగా కోఆపరేటివ్లు మారుతూవచ్చాయి. కొత్తగా సహకార రంగంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లు వ్యవసాయ రంగానికి సంబంధించి ఉండటం లేదు. ఇప్పుడవి గృహనిర్మాణం, కార్మిక రంగాలలో ప్రవేశిస్తున్నాయి. ఈ కారణాలవల్ల సహకార సంస్థలను కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకురావడం ఏమంత అర్థవంతమైన చర్య కాదు అని ఆ అధికారి చెప్పారు. అయితే మోదీ నిర్ణయం ప్రకారం అమిత్ షా ఈ కొత్త శాఖకు బాధ్యతలు తీసుకున్నారు. కో-ఆపరేటివ్‌లు అభివృద్ధికి ఉపకరణాలుగా ఉపయోగపడేవి కాబట్టి రాజకీయ లక్ష్యాలు తెరమీదికి వస్తుండేవి. సహకార సంస్థలు... రాజకీయాల ప్రాబల్యం నరేంద్రమోదీని అధికారంలోకి తీసుకొచ్చిన గుజరాత్ నమూనాకు సంబంధించిన కీలకమైన అంశాల్లో కో-ఆపరేటివ్‌లపై బీజేపీ నియంత్రణ ఒకటనే విషయం ఎవరికీ పెద్దగా తెలీదు. 1990లలో బీజేపీ... గుజరాత్లో రుణపరపతి సహకార సంస్థలపై నియంత్రణను ఏర్పర్చుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత అమూల్ జిల్లా పాల యూనియన్లపై పట్టు సాధించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్, స్థానిక అధికార వ్యవస్థలను బలహీనపర్చి వాటిని తొలగించడమే దీని ఉద్దేశం. దీర్ఘకాలం అధికారంలో ఉండాలని కోరుకునే వారెవరైనా సరే... ప్రజలను, సంస్థలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. గుజరాత్లో పాల సహకార వ్యవస్థ చాలా పెద్దది. గుజరాత్‌లోని 17 వేల గ్రామాల్లో 16,500 గ్రామాలు డెయిరీల పరిధిలో ఉంటున్నాయి. అందుకే 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యాక సహకార సంస్థలను కైవసం చేసుకునే ప్రక్రియ వేగం పుంజుకుంది. కో-ఆపరేటివ్‌ల యాజమాన్యాలపై కేసులు పెట్టి వారు బీజేపీలో చేరకతప్పని పరిస్థితి కల్పించారు. 2017 నాటికి కో-ఆపరేటివ్‌లను పూర్తిగా కైవసం చేసుకోవడం పూర్తయిపోయింది. ఆ తర్వాత ప్రతిపక్షాల చేతుల్లో ఒక్క కోఆపరేటివ్ సంస్థ కూడా లేకుండా పోయింది. మొత్తం మీద చూస్తే రాజకీయ లాభం కోసం కో-ఆపరేటివ్‌లను ఉపయోగించుకోవడం గుజరాత్లో స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయనేతలు అతిగా ఖర్చుపెట్టడం, పలు కాంట్రాక్టుల ద్వారా దాన్ని తిరిగి సంపాదించుకోవడం మొదలుకావడంతో డెయిరీ ఆర్థికవ్యవస్థలు క్షీణించిపోయాయి. సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖపై మరో రెండు కొత్త ఊహలు కూడా చోటుచేసుకుంటున్నాయి. యూపీలో గ్రామీణ అసంతృప్తిని చల్లార్చడం ఎలా? ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు రైతులను శాంతపర్చడానికి కేంద్రం చేస్తున్న తీవ్రప్రయత్నాల్లో భాగమే సహకార శాఖకు కొత్త మంత్రిని తీసుకురావడం అని ఒక ఊహ. పశ్చిమ యూపీలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. యూపీలో మళ్లీ అధికారంలోకి రావాలంటే పెద్దనోట్ల రద్దు వంటి భారీ పథకాన్ని ప్రకటించడానికి బీజేపీ ఏదోలా జోక్యం చేసుకోవడం తప్పేటట్టు లేదు. ప్రైవేట్ కంపెనీలే అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనేస్తాయనే భయాందోళనలనుంచి రైతులను బయటపడేయడానికి పెద్ద ఎత్తున సహకార సంస్థలను రంగంలోకి దింపాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. యూపీ ఎన్నికలకు ముందుగా భారీ పథకం ప్రకటించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుండా చేయవచ్చని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరొక ఊహాకల్పన ఏమిటంటే గుజరాత్లో మోదీ, షా ట్రాక్ రికార్డుపై ఎక్కువగా ఆధారపడుతూ దేశం మొత్తాన్ని గుజరాత్‌గా మలచాలని లక్ష్యం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు భావిస్తున్నారు. మూడో ఊహ ఏమిటంటే, శరద్ పవార్ ఎన్సీపీ వంటి పార్టీలు మహారాష్ట్ర షుగర్ కో-ఆపరేటివ్‌లపై పట్టు సాధించడం ద్వారానే రాష్ట్ర రాజ కీయాల్లో తమ పట్టు నిలుపుకుంటూ వస్తున్నాయి. ఈ కో-ఆపరేటివ్‌లపై బీజేపీ పట్టు సాధించగలిగితే మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతాయని మునుపటి ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడొకరు చెబుతున్నారు. అయితే ఇది మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాబోదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కోఆపరేటివ్ సంస్థలు బలంగా ఉంటున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, గ్రామీణులపై బీజేపీ, ఎన్డీఏ పట్టు సడలిపోయిన సమయంలో కో-ఆపరేటివ్‌లు వారికి ఒక దారి చూపుతున్నట్లుంది. ఇప్పటికే రైతుల ఆందోళనలు వ్యవసాయ సమాజంపై కేంద్ర ప్రభుత్వ పలుకుబడిని బలహీనపర్చాయి. తిరిగి మండీల బాట పట్టడానికి బదులుగా కో-ఆపరేటివ్‌లపై పట్టు సాధిస్తే ఆ వ్యవస్థ మొత్తాన్నే కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. స్థానిక ఎన్నికలకు మాత్రమే కాకుండా ఇతర ఎన్నికలకు కూడా కో-ఆపరేటివ్‌లు ఎక్కువ నిధులను అందించే అవకాశం మెండుగా ఉంది అని గుజరాత్ పరిశీలకులు ఒకరు చెప్పారు. కో-ఆపరేటివ్ సొసైటీల కేంద్ర రిజిస్ట్రార్‌ను మంత్రిత్వ శాఖ గుప్పిట్లో పెట్టుకుంటే రాష్ట్రాల కో-ఆపరేటివ్ సొసైటీలన్నింటినీ క్రమబద్ధీకరించవచ్చు. అయితే కేంద్రం కో-ఆపరేటివ్ సంస్థలను ఎలా అదుపుచేస్తుంది అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే మరి. వచ్చే ఆరు నెలల్లోనే సహకార సంస్థలపై సంచలన చట్టం రూపకల్పనను మనం చూడవచ్చు. దేశం సాధించిన అద్భుత విజ యాల్లో సహకార సంస్థలు కూడా ఒకటి. కానీ రాజకీయ హైజాకింగ్ వల్ల ఇవికూడా స్వయంపాలనను కోల్పోయి తలకిందులవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో రాజకీయ నాయకులు మాత్రమే లాభపడి, దేశ ప్రజలు నష్టపోయే రోజులు రాబోతున్నాయన్నదే అందరి ఆందోళన. దీంతో కో-ఆపరేటివ్‌లను అంతర్జాతీయంగా పోటీపడేలా రూపుదిద్దడం అనే సవాలు కూడా ప్రశ్నార్థకం కానుంది. ఎమ్. రాజశేఖర్ వ్యాసకర్త స్వతంత్ర పాత్రికేయుడు (‘ది వైర్’ సౌజన్యంతో..) -
విజయ్ మాల్యాకు షాకిచ్చిన సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసి.. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడంటూ 2017లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం తన ఉత్తర్వులను రిజర్వు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ యూయూ లలిత్, అశోక్ భుషణ్లతో కూడిన ధర్మాసనం మల్యాకు వ్యతిరేకంగా డబ్బు కొల్లగొట్టడం, ఆస్తులను వెల్లడించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలు ఉన్నట్లు అభిప్రాయపడింది. అంతేకాక మూడేళ్లుగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్‌ను సంబంధిత కోర్టులో ఎందుకు లిస్టు చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీని ధర్మాసనం ఈ ఏడాది జూన్‌లోనే ఆదేశించింది. అంతేకాక ఈ రివ్యూ పిటిషన్‌కు సంబంధించిన ఫైల్‌ను ఏ ఏ అధికారులు డీల్ చేశారో అందరి వివరాలను అందించాలని ధర్మాసనం ఆదేశించింది. (చదవండి: మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే!) ప్రభుత్వ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపు వ్యవహారంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ కేసులో విజయ మాల్యాను దోషిగా పేర్కొంటూ జులై 14, 2017 నాడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. దీనిలో భాగంగా గురువారం సుప్రీం కోర్టు పిటిషన్‌పై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. -
మాల్యా పిటిషన్ మూడేళ్లుగా రాలేదెందుకు?
న్యూఢిల్లీ: తనపై ఉన్న ఓ కోర్టు ధిక్కారం కేసులో వ్యాపారవేత్త విజయ్ మాల్యా పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను ఎందుకు గత మూడేళ్లుగా సంబంధిత కోర్టు బెంచ్ ముందుకు తీసుకురాలేదని సుప్రీంకోర్టు.. తన రిజిస్ట్రీని ప్రశ్నించింది. దీనితో సంబంధమున్న అధికారుల పేర్లను పేర్కొంటూ, ఆలస్యానికి కారణాలను రెండు వారాల్లోగా తెలపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 2017లో విజయ్‌మాల్యా తన సంతానానికి 4కోట్ల డాలర్లను బదిలీచేయడాన్ని కోర్టు ధిక్కారంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు అదే ఏడాది తీర్పు చెప్పింది. -
సెలవు రోజున విధులకు హాజరు
చౌటుప్పల్ : సబ్ రిజిస్టార్ కార్యాలయానికి శనివారం సెలవు అయినప్పటికీ రిజిస్టార్ ఆనంద్ విధులకు హాజరయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు కొందరు గమనించి కార్యాలయానికి వెళ్లారు. ఏదో జరుగుతుందని ప్రశ్నించారు. కొంతసేపటి తర్వాత వెనుదిరిగారు. కాగా ఈ విషయమై సబ్ రిజిస్టార్ ఆనంద్‌ను వివరణ కోరగా పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను స్కానింగ్ చేసే నిమిత్తం వచ్చానన్నారు. కార్యాలయంలో ప్రతి అంశం సీసీ కెమెరాలో రికార్డవుతుందని తెలిపారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. -
హైదరాబాద్‌లో రిజిస్ట్రార్ భారీ భూదందా
-
నన్నయ రిజిస్ట్రార్ రాజీనామా
- ‘నన్నయ’ యూనివర్సిటీలో కళకలం సృష్టిస్తున్న ఆటోమేషన్ టెండర్ - వీసీకి రిజిస్ట్రార్‌కి మధ్య పెరుగుతున్న అంతరం - రిజిస్ట్రార్‌పై చర్యకు దళిత ఉద్యోగుల డిమాండ్ - రాజీనామా చేసిన రిజిస్ట్రార్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న ‘ఆటోమేషన్ టెండర్’ ఘటన చినికి చినికి గాలివానగా మారి చివరకు రిజిస్ట్రార్ తన పదవికి రాజీనామా చేసే వరకూ దారితీసింది. యూనివర్సిటీలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ‘ఆటోమేషన్’ విధానాన్ని తీసుకువచ్చేందుకు టెండర్లు పిలవడం, మూడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. ఈ టెండర్లు ఖరారు విషయమై వీసీకి, రిజిస్టార్‌కి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వీసీ చర్యలను సమర్థిస్తూ ఆటోమేషన్ విధానంపై ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదంటూ ఇటీవల యూనివర్సిటీ ఇద్దరు డీన్స్, ప్రిన్సిపాళ్లు ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలను ఖడించారు కూడా. అయినా సమస్య సద్దుమణగలేదు. వీసీ, రిజిస్ట్రార్లు ఎడమెహం, పెడమెహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రిజస్ట్రార్పై ఫిర్యాదు... గురువారం కొంతమంది దళిత ఉద్యోగులు తమ పట్ల రిజిస్ట్రార్ కులవివక్షత చూపిస్తున్నారని, ఆయన పై చర్య తీసుకోవాలంటూ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలు నాయుడికి నేరుగా ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు తాళ్లూరి బాబురాజేంద్రప్రసాద్, బీసీ ప్రజాసంక్షేమ సంఘం అధ్యక్షుడు మేరపురెడ్డి రామకృష్ణ, రాష్ట్ర ఎస్టీ సంఘం అధ్యక్షుడు కె. నారాయణరావు, రాష్ట్ర ప్రజాసంక్షేమ యువజన సంఘం అధ్యక్షుడు మహ్మద్ ఖాసీం, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, బీసీ సంఘాల అధ్యక్షుడు పిచ్చుక అనిల్‌కుమార్, దళిత నాయకులు అజ్జరపు వాసు తదితరులు 48 గంటల్లోగా ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనస్థాపంతోనే రాజీనామా విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు తనపై కులముద్ర పడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. మనస్థాపంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా గురువారం సాయంత్రం ప్రకటించారు. తాను చదివింది నోబుల్ కాలేజీలోనని, అక్కడ ఎక్కువ శాతం మంది దళితులేనని, వారే తనకు స్నేహితులన్నారు. ఇంతకాలం వారందరి మిత్రత్వంలో ముందుకు వెళ్లిన తనపై కులముద్ర వేయడం తట్టుకోలేకనే రాజీనామా చేస్తున్నానన్నారు. అందరినీ నా వారిగా చూసే తనపై దళిత వ్యతిరేకిననే ముద్ర వేయడాన్ని మానసికంగా తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ ఘటన మున్ముందు ఎంతవరకు దారితీస్తుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
ఫైనాన్స్ ఆఫీసర్ నియామకంలో జాప్యమేల?
కోట్లాది రూపాయల బిల్లులపై నేరుగా రిజిస్ట్రార్ ఆమోదం జేఎన్టీయూ: వర్సిటీలో ఫైనాన్స్ ఆఫీసర్ పదవి చాలా కీలకం. ఆర్థికపరమైన అంశాలకు చేదోడువాదోడుగా ఉండడంతో పాటు బిల్లులకు జవాబుదారీతనం ఉండాల్సిన ప్రాధాన్యం గల పోస్టు. జేఎన్టీయూ (ఏ) ఏర్పడి ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఫైనాన్స్ ఆఫీసర్ నియామకం చేపట్టకుండానే పాలనా వ్యవహారాలు నిర్వహిస్తుండడం గమనార్హం. భర్తీ చేయాలంటూ ఆదేశాలు .. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఫైనాన్స్ అధికారిని భర్తీ చేసేంతవరకు వర్సిటీ పరిధిలోని ఎవరైనా డిప్యూటీ రిజిస్ట్రార్‌ను నియామకం చేయాలని ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినా వర్సిటీ అధికారవర్గాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జేఎన్టీయూ ప్రతి నెలా రూ.3.45 కోట్లు బోధన, బోధనేతర, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. మరో వైపు కోట్లాది రూపాయలు సివిల్ వర్కులు చేస్తున్నారు. పరీక్షల విభాగం ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపులకు, ఆర్థిక వ్యవహారాలకు జవాబుదారీతనం , పారదర్శకత పెంపొందించాల్సి ఉంది. 8 సంవత్సరాలుగా ఫైనాన్స్ ఆఫీసర్‌ను నియామకం చేయకుండా రిజిస్ట్రార్ ఆర్థిక అధికారిగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఫైనాన్స్ ఆఫీసర్ నియామకం అనివార్యం. సాధారణంగా ఫైనాన్స్ ఆఫీసర్‌ను గ్రూప్–1 స్థాయి అధికారి లేదా అంతకంటే ఉన్నత స్థాయి గల వారిని డెప్యుటేషన్ మీద కాని, నేరుగా రాష్ట్ర ప్రభుత్వ నియమించాల్సి ఉంది. అయ్యవార్లకు ఆర్థిక లావాదేవీలు ఎలా తెలుస్తాయి? : జేఎన్టీయూలో ప్రొఫెసర్ స్థాయి ఉన్నవారిని రిజిస్ట్రార్‌గా నియమిస్తున్నారు. పాలనాపరమైన విషయాలు ప్రొఫెసర్లకు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ కోట్లాది రూపాయలు ఆర్థికలావాదేవీలు, ఖాతాలు సక్రమంగా ఉన్నాయా? లేవా? అనే అంశం ప్రొఫెసర్లకు ఎలా తెలుస్తాయి? ఇందులో నిపుణులైన వారే ఆర్థిక లావాదేవీలపై పూర్తి అవగాహన ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎస్కేయూలో 2014 నవంబర్ 11న రూ.3.07 కోట్ల జీతాలు అకౌంట్స్ విభాగంలో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల బినామీ ఖాతాల్లోకి మళ్లించారు. ఇలాంటి ఆర్థికపరమైన తప్పిదాలు, క్రమశిక్షణతో కూడిన ఖాతాల నిర్వహణ ఉండాలంటే సుశిక్షితులైన , నిపుణులైన ఫైనాన్స్ ఆఫీసర్‌ను నియమించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫైనాన్స్ ఆఫీసర్‌ను నియమించాలనే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. -
ఏయూలో వీసి Vs రిజిస్ట్రార్
-
ఏసీబీ వలలో ‘సబ్ రిజిస్ట్రార్’
రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పిట్టలవానిపాలెం: ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణను శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థలం తనఖా రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేసిన నేపథ్యంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ సిహెచ్.డి.శాంతో, సీఐ నరసింహారెడ్డి కథనం మేరకు... నిజాంపట్నం గ్రామానికి చెందిన చెన్ను నాగేశ్వరరావు కుమారుడు చెన్ను విజయరామరాజుకు బాపట్లలోని తమిళనాడు మర్కంటేల్ బ్యాంకులో ఇంటి నిర్మాణం కోసం రుణం మంజూరు చేశారు. ఇంటి స్థలం తనఖా రిజిస్ట్రేషన్ చేయాలని విజయరామరాజు ఈ నెల 26 వతేదీన సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణను కలిసి మాట్లాడారు. రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇంటి విలువ రూ.7 లక్షలు ఉంది. తనఖా రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.4,300 చలానా తీయాలని, అవి కాకుండా రూ.లక్షకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.7వేలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డమాండ్ చేశారు.Sరూ.5 వేలు ఇస్తానని రిజిస్ట్రార్‌తో విజయరామరాజు బేరం కుదుర్చుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని విజయరామరాజు అదే రోజు గుంటూరులోని ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. శనివారం సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణకు రూ.5వేలు లంచం ఇచ్చిన వెంటనే సమీంలో పొంచి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నగదు స్వాధీనం చేసుకుని సబ్‌రిజిస్ట్రార్‡ లక్ష్మీనారాయణ చేతులను కడిగారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శాంతో విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ రకాల పనుల నిమిత్తం అధికారులు ఎవరైనా లంచం డిమాండు చేస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. తట్టుకోలేకే ఇలా చేశాను.. పేదప్రజలను లంచాల కోసం పీడించడం ఎంత వరకు న్యాయం. రూ.7 లక్షల విలువైన ఇంటి స్థలం తనఖా రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.లక్షకు రూ.1,000 లంచం ఇవ్వాల్సిందేనని లేకపోతే చేసేది లేదని స్వయంగా సబ్‌రిజిస్ట్రార్ డిమాండు చేశాడు. బాధితుడు చెన్ను విజయరామరాజు -
నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్‌గా నరసింహారావు
నరసింహారావును అభినందిస్తున్న ఏయూ వీసీ నాగేశ్వరరావు ఏయూక్యాంపస్: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఏయూ వాణిజ్య నిర్వహణ విభాగం ఆచార్యుడు ఏ.నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు నన్నయ వర్సిటీ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయనను ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తన కార్యాలయంలో అభినందించారు. పటిష్టమైన అనుబంధ కళాశాలలను కలిగిన ఆదికవి నన్నయ వర్సిటీ నిర్వహణ ఎంతో కీలకమన్నారు. వీసీ ఆచార్య ముత్యాలనాయుడుతో సమన్వయం జరుపుతూ నన్నయ వర్సిటీ ప్రగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు. ఆచార్య నరసింహారావు ఫైనాన్స్, అకౌంటిగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో నిపుణుడు. క్రమశిక్షణ, సమయ పాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. వర్సిటీ పరిపాలనా వ్యవహారాలపై పూర్తి పట్టు కలిగి, సమర్థవంతునిగా నిరూపించుకున్నారు. 22న బాధ్యతల స్వీకరణ సోమవారం రాజహేంద్రవరంలో ఆచార్య నరసింహారావు బాధ్యతలు స్వీకరిస్తారు. నరసింహారావు ఎంకాం, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, పీహెచ్డీ పూర్తిచేశారు. ఏయూ ఆర్ట్స్ కళాశాల వార్డెన్‌గా, దూరవిద్యలో ఎంబీఏ కోర్సు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఏఐసీటీæఈ తనికీ బందం సభ్యుడిగా, ఏయూ సీపీసీ సభ్యుడిగా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేట్ సభ్యునిగా ఉన్నారు. ఐసెట్ ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో పనిచేశారు. ఎటువంటి ప్రచారాన్ని కోరుకోకుండా నిరాడంబరంగా పనిచేయడం ఆచార్య నరసింహారావు వ్యక్తిత్వానికి నిదర్శనం. -
ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్‌గా సత్తార్ సాహిర్
యూనివర్సిటీ క్యాంపస్: కర్నూలులో నూతనంగా ఏర్పాౖటెన ఉర్దూ యూనివర్సిటీ తొలి రిజిస్ట్రార్‌గా ఎస్వీయూ ఉర్దూ విభాగాధిపతి ప్రొఫెసర్ సయ్యద్ సత్తార్ సాహిర్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. 1992లో ఎస్వీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి అసోసియేట్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. ఉర్దూ విభాగాధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. ఈ ఏడాది ఏర్పాౖటెన ఉర్దూ యూనివర్సిటీకి తొలి రిజిస్ట్రార్‌గా సయ్యద్ సత్తార్ సాహిర్‌ను నియమిస్తూ ఇన్చార్జి వీసీ నరసింహులు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఘనంగా వీడ్కోలు
తెయూ(డిచ్పల్లి) : సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ వీసీ పార్థసారథి, మాజీ రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రిలకు తెలంగాణ యూనివర్సిటీలో గురువారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్వేగాన్ని తట్టుకోలేని మాజీ వీసీ, మాజీ రిజిస్ట్రార్లు కంట తడిపెట్టారు. వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన అనేక మంది అధ్యాపకులు కూడా కన్నీరు పెట్టారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ ప్రొఫెసర్ సి.సాంబయ్య మాట్లాడుతూ.. పార్థసారథి, ప్రొఫెసర్ లింబాద్రిలు న్యాయబద్ధంగా పనిచేసి అపారమైన అభిమానాన్ని సంపాదించారన్నారు. వారి హయాంలో యూనివర్సిటీకి నాక్ ‘బి’ గ్రేడ్ వచ్చిందని, తాను అందరి సహకారంతో ‘ఏ’ గ్రేడ్ తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం మాజీ వీసీ పార్థసారథి మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీతో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని అన్నారు. యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయినా, జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని పేర్కొన్నారు. మనం పదవిలో ఉన్నప్పుడు మనకు వచ్చేది గౌరవం కాదని, సీటు వదిలిన తర్వాత మనం నిజంగా గౌరవం పొందుతామా లేదా అన్నది గమనించాలన్నారు. తన సక్సెస్‌లో ప్రతి ఉద్యోగి కృషి ఉందని, ప్రొఫెసర్ లింబాద్రి తాను వేరు కాదని, క్రెడిట్ అంతా టీం వర్క్‌దే అన్నారు. ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ.. పార్థసారథి తనకు దేవుడు ఇచ్చిన అన్న అని, ఆయనకు పాదాభివందనం చేయాలని ఉందన్నారు. తనకు అంత గొప్ప వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అందరి సమష్టి కృషితోనే నాక్ గ్రేడ్ సాధించడం సాధ్యమైందని, అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తన జీవితంలో తెలంగాణ యూనివర్సిటీకి అత్యంత ప్రాధాన్యత ఉందని, మీరంతా నా కుటుంబ సభ్యులేనని, మిమ్మల్ని విడిచి వెళుతున్నందుకు బాధగా ఉందని ఉద్వేగ భరితంగా మాట్లాడారు. ప్రిన్సిపాల్, ఆర్ట్స్ డీన్ కనకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రిన్సిపాళ్లు ఎల్లోసా, సత్యనారాయణచారి, సమత, లలిత, డీన్లు యాదగిరి, వైస్ ప్రిన్సిపాళ్లు జాన్సన్, సంపత్‌కుమార్, ప్రవీణాబాయి, శివకుమార్, అంజయ్య తదితరులు ప్రసంగించారు. టూటా తరఫున అధ్యక్షుడు ప్రవీణ్, ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా నియమితులైన ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు, త్రివేణి, బాల శ్రీనివాసమూర్తి, ఘంటా చంద్రశేఖర్, పున్నయ్య, రాంబాబు, చంద్రశేఖర్ తో పాటు అకడమిక్ కన్సల్టెంట్లు, విద్యార్థి సంఘాల నాయకులు వీసీ, రిజిస్ట్రార్ల సేవలను కొనియాడారు. గజమాలలతో సన్మానం మాజీ వీసీ పార్థసారథి, మాజీ రిజిస్ట్రార్ లింబాద్రిలను ఈ సందర్భంగా గజమాలలతో సత్కరించారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి, మెమోంటోలతో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులు సన్మానించారు. -
పీయూలో పోస్టుల భర్తీకి చర్యలు
వనపర్తిటౌన్: పాలమూరు యూనివర్సిటీలో 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపామని పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 21 డిగ్రీ కళాశాల్లో అత్యధికంగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నాలుగు చోట్ల మాత్రమే రెగ్యూలర్ ప్రిన్సిపాల్ ఉన్నారని చెప్పారు. డిగ్రీ ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం అభినందనీయమన్నారు. ఆన్లైన్ విధానంతో రూ. 100 రుసుముతో రాష్ట్రంలో ఏ కాలేజీల్లోనైనా ప్రవేశానికి విద్యార్థులకు అవకాశం లభించిందన్నారు. గతంలో ఇతర జిల్లాల్లోని కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థులు నానా తంటాలు పడేవారని చెప్పారు. చాలా మటుకు విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు తెలియకపోవడంతో వారికి మరో అవకాశకంగా ఈ నెల 25 నుంచి 30 వరకు ఛాన్స్ ఇచ్చిందన్నారు. జిల్లాలోని డిగ్రీ కళాశాల్లో 21341 సీట్లు ఉన్నాయని, ఆన్లైన్లో 13 వేల వరకు నమోదు అయ్యావని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 28, 29 తేదీల్లో పీయూలో జరగనుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్‌రెడ్డి, వీరయ్య, జ్యోతి ఉన్నారు. -
పీయూలో పోస్టుల భర్తీకి చర్యలు
వనపర్తిటౌన్: పాలమూరు యూనివర్సిటీలో 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపామని పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 21 డిగ్రీ కళాశాల్లో అత్యధికంగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నాలుగు చోట్ల మాత్రమే రెగ్యూలర్ ప్రిన్సిపాల్ ఉన్నారని చెప్పారు. డిగ్రీ ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం అభినందనీయమన్నారు. ఆన్లైన్ విధానంతో రూ. 100 రుసుముతో రాష్ట్రంలో ఏ కాలేజీల్లోనైనా ప్రవేశానికి విద్యార్థులకు అవకాశం లభించిందన్నారు. గతంలో ఇతర జిల్లాల్లోని కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థులు నానా తంటాలు పడేవారని చెప్పారు. చాలా మటుకు విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు తెలియకపోవడంతో వారికి మరో అవకాశకంగా ఈ నెల 25 నుంచి 30 వరకు ఛాన్స్ ఇచ్చిందన్నారు. జిల్లాలోని డిగ్రీ కళాశాల్లో 21341 సీట్లు ఉన్నాయని, ఆన్లైన్లో 13 వేల వరకు నమోదు అయ్యావని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 28, 29 తేదీల్లో పీయూలో జరగనుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్‌రెడ్డి, వీరయ్య, జ్యోతి ఉన్నారు. -
పీయూలో పోస్టుల భర్తీకి చర్యలు
వనపర్తిటౌన్: పాలమూరు యూనివర్సిటీలో 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపామని పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 21 డిగ్రీ కళాశాల్లో అత్యధికంగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నాలుగు చోట్ల మాత్రమే రెగ్యూలర్ ప్రిన్సిపాల్ ఉన్నారని చెప్పారు. డిగ్రీ ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం అభినందనీయమన్నారు. ఆన్లైన్ విధానంతో రూ. 100 రుసుముతో రాష్ట్రంలో ఏ కాలేజీల్లోనైనా ప్రవేశానికి విద్యార్థులకు అవకాశం లభించిందన్నారు. గతంలో ఇతర జిల్లాల్లోని కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థులు నానా తంటాలు పడేవారని చెప్పారు. చాలా మటుకు విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు తెలియకపోవడంతో వారికి మరో అవకాశకంగా ఈ నెల 25 నుంచి 30 వరకు ఛాన్స్ ఇచ్చిందన్నారు. జిల్లాలోని డిగ్రీ కళాశాల్లో 21341 సీట్లు ఉన్నాయని, ఆన్లైన్లో 13 వేల వరకు నమోదు అయ్యావని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 28, 29 తేదీల్లో పీయూలో జరగనుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్‌రెడ్డి, వీరయ్య, జ్యోతి ఉన్నారు. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు చివరి అవకాశం
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం చివరి దశ ఆన్లైన్ ప్రవేశాలను ఈ నెల 25నుంచి 30వ తేది వరకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు దోస్త్ (డీవోఎస్‌టీ) వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోని వారు సైతం ఈ నెల 25 నుంచి 30వరకు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మొదటి, రెండవ దశల్లో పేర్లు నమోదు చేసుకున్న వారు పై తేదిల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఆగస్ట్ 2వ తేదిన సీట్ల కెటాయింపు ఉంటుందని, 4వ తేదిన సంబంధిత కళాశాలల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేయడంతో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్ రాజీనామా చేశారు. శనివారం జరిగిన వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ భేటీలో వర్సిటీ పాలనా వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా గంటల తరబడి నిలబెట్టడం ఏంటనే అంశంపై మాటామాటా పెరిగింది. దీంతో సుధాకర్‌పై ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మన స్థాపానికి గురైన రిజిస్ట్రార్ సుధాకర్ అప్పటికప్పుడే రాజీనామా చేశారు. -
‘అసైన్డ్’ వివరాలను రిజిస్ట్రార్లకు పంపాలి
♦ విస్తృత ధర్మాసనం తీర్పును అమలు చేయాల్సిందే ♦ ఆ తీర్పు ఆధారంగా పిటిషనర్ల డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకోండి ♦ గడువులోగా నిషేధిత భూముల జాబితా రూపొందించండి ♦ ఏపీ, తెలంగాణ అధికారులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితా తయారీకి సంబంధించి విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెవెన్యూ, దేవాదాయ శాఖలు, వక్ఫ్ బోర్డు అధికారులను హైకోర్టు ఆదేశించింది. విస్తృత ధర్మాసనం నిర్దేశించిన గడువులోగా నిషేధిత భూముల జాబితాను తయారు చేసి, ఆయా సబ్ రిజిస్ట్రార్లకు పంపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇతరులకు బదలాయించరాదన్న నిబంధనలతో కేటాయించిన అసైన్డ్ భూముల జాబితాను సైతం సబ్ రిజిస్ట్రార్లకు పంపాలని పేర్కొంది. 1954కు ముందే అసైన్డ్ భూములను పొంది ఉంటే వాటి వివరాలను, ఆ భూములకు 1977 అసైన్డ్ భూముల చట్టం వర్తించే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను రెవెన్యూ అధికారుల ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22ఎ కింద నిషేధిత భూముల జాబితాను తాజా వివరాలతో సవరించే(అప్డేట్) ముందు పిటిషనర్లు సమర్పించే వివరాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఒకవేళ 1954 కంటే ముందు అసైన్ చేసిన భూములను వేటినైనా నిషేధిత జాబితాలో చేర్చాలని నిర్ణయిస్తే, అందుకు సంబంధించి సెక్షన్ 22ఎ(1)(ఈ) కింద నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలుంటే వారు చట్టం ప్రకారం ముందుకెళ్లవచ్చని వెల్లడించింది. ఆ డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకోండి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా తమ ముందున్న పిటిషన్లు, అప్పీళ్లలో ఏవైనా డాక్యుమెంట్లను అధికారులు రిజిస్టర్ చేసి ఉంటే, అది విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా అధికారులు తీసుకునే తుది నిర్ణయానికి లోబడి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ల విషయంలో విస్తృత ధర్మాసనం తీర్పునకు అనుగుణంగా ఆ రిజిస్ట్రేషన్లను ఖరారు చేయడమా? లేక రద్దు చేయడమా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రేషన్ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియను విస్తృత ధర్మాసనం నిర్దేశించిన నాలుగు నెలల గడువు పూర్తయిన తరువాత నుంచి మూడు నెలల్లోగా పూర్తి చేయాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భూముల వర్గీకరణ, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1,633 వ్యాజ్యాలను జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ విషయంలో ఇటీవల ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలు, తీర్పును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తూ తీర్పునిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. నిషేధిత భూముల జాబితాను రూపొందించేందుకు విస్తృత ధర్మాసనం నిర్ధేశించిన గడువు పూర్తయిన తరువాత ఈ వ్యాజ్యాల్లోని పిటిషనర్లు, తమ భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ల ముందు డాక్యుమెంట్లను సమర్పించవచ్చని తెలిపింది. సబ్ రిజిస్ట్రార్లు విస్తృత ధర్మాసనం తీర్పును పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. డాక్యుమెంట్లను సమర్పించేటప్పుడు వాటితోపాటు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీని కూడా జత చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. -
గొట్లాం పీఏసీఎస్‌కు రుణాఘాతం !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : బినామీ రుణాలు గొట్లాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం( పీఎసీఎస్) కొంప ముంచాయి. ఇప్పుడా సొసైటీ ఉనికికే ముప్పు వాటిల్లనుంది. రిజిస్ట్రార్ ఆదేశాలు అమలైతే సొసైటీ గల్లా పెట్టి ఖాళీ కానుంది. భవిష్యత్‌లో వచ్చే నిధులు కూడా డీసీసీబీ ఖాతాకు వెళ్లిపోనున్నాయి. పెద్ద ఎత్తున అక్రమాలు జరగడంతో సొసైటీ నుంచి రూ.కోటీ 11లక్షల99వేల మేర రికవరీ చేయాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. అదే జరిగితే సొసైటీ నిధులు డీసీసీబీకి జమఅవుతాయి. ఈ నేపథ్యంలో సొసైటీ పరిస్థితి అగమ్య గోచరం కానుంది. బొండపల్లి మండలం గొట్లాం పీఏసీఎస్ ద్వారా 1,559 మందికి నిబంధనలకు విరుద్ధంగా రూ.కోటీ 3లక్షల 78వేల 803మేర రుణాలిచ్చేశారని గత ఏడాది నిర్వహించిన సెక్షన్ 53విచారణలో తేల్చారు. దాదాపు అన్నీ బినామీ రుణాలేనని నిర్ధారణకొచ్చారు. కాకపోతే, ఈ అక్రమాలకు అప్పట్లో పనిచేసి మృతి చెందిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులను బాధ్యులగా చేస్తూ మిగతా వారంతా తప్పించుకున్నారు. ఆ పాపమంతా వారిదేనని విచారణాధికారులు కూడా తేల్చేశారు. ఈమేరకు విచారణ నివేదికను ఆరు నెలల క్రితం పైండింగ్స్ కోసం సహకార శాఖ రిజిస్ట్రార్‌కు పంపించారు. కాకపోతే, అప్పట్లో ఇచ్చిన నివేదికలో సొసైటీ సిబ్బంది, డెరైక్టర్ల విషయమై సీరియస్‌గా తీసుకోలేదన్న ఆరోపణలొచ్చాయి. వాస్తవానికి సొసైటీలో ఏ అక్రమాలు జరిగినా అందులో పర్యవేక్షక అధికారులు, పాలకవర్గం ప్రతినిధులుగా డెరైక్టర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటోంది. ఎవరికే రుణమిచ్చినా పరిశీలించాల్సిన బాధ్యత సూపర్వైజరీ అధికారులపై ఉండగా, ఎవరికెంత రుణం ఇచ్చారన్నదానిపై పాలకమండలి సభ్యులంతా తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన అక్కడే అక్రమాలు జరిగినా సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శిని బాధ్యుల్ని చేసి విచారణ అధికారులు చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణాధికారులిచ్చిన నివేదికపై తాజాగా రిజిస్ట్రార్ పైండింగ్స్ రాసి పంపించారు. చనిపోయిన సొసైటీ అధ్యక్ష, కార్యదర్శుల్ని బాధ్యుల్ని చేసేస్తే సరిపోదని, అప్పట్లో పనిచేసిన ఉద్యోగులు, పాలకవర్గ సభ్యుల్ని కూడా భాగస్వామ్యం చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా సొసైటీకి రుణ వితరణ కోసం ఇచ్చిన నిధులు డీసీసీబీవని, బినామీ రుణాలు, ఇతరత్రా అవకతవకల నేపథ్యంలో దుర్వినియోగమైన రూ.కోటీ 11లక్షల 99వేలును సదరు సొసైటీ నుంచి డీసీసీబీ రికవరీ చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. అలాగే, అప్పట్లో పనిచేసిన ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని, పాలకవర్గ ప్రతినిధులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం సొసైటీలో సుమారు రూ.10లక్షల మేర టర్నోవర్ అవుతోంది. దాదాపు రూ.కోటీ 11లక్షల99వేలు రికవరీ చేయాలంటే సొసైటీకి భవిష్యత్‌లో వచ్చే నిధుల్ని డీసీసీబీ జమ చేసుకోవల్సి వస్తుంది. ఈ లెక్కన సొసైటీ ఉనికికే ముప్పు వాటిల్లబోతోంది. ఇంత వేగంగా కోలుకునే అవకాశం ఉండదు. దాని పరిధిలో ఉన్న రైతులకు ఇక ఎటువంటి ప్రయోజనాలు అందే అవకాశం లేదు. -
పారదర్శకత.. నాణ్యమైన విద్యే లక్ష్యం
జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ యాదయ్య సిటీబ్యూరో: జవ హర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ రిజిస్ట్రార్‌గా జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ యాదయ్య బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్‌గా యాదయ్య నియామకానికి బుధవారం సాయంత్రం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యర్ ఆమోదం తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో యాదయ్యను రిజిస్ట్రార్‌గా నియమించాలని సీఎం కేసీఆర్ స్వయంగా అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఎన్వీ రమణారావు ఇకపై సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్ యాదయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రతి విషయంలో పారదర్శకంగా మెలుగుతానని పేర్కొన్నారు. అందరి సలహాలు, సూచనలతో వర్సిటీ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేస్తామని పేర్కొన్నారు. చదువుకున్న చోటే ఉన్నత పదవి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యాదయ్య...జేఎన్టీయూహెచ్లో ఉన్నత చదువులు అభ్యసించి.. అదే వర్సిటీకి రిజిస్ట్రార్‌గా నియామకం కావడం విశేషం. 2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ఆయన్ను ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. అంతేగాక ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ... యంగ్ సైంటి స్ట్ ఫెలోషిప్ అందజేసింది. బోధన, పరిశోధనలో 20 ఏళ్ల అనుభవం ఆయన సొంతం. ప్రొఫైల్.. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మల్‌రెడ్డిగూడెం సొంతూరు భార్య పద్మ, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఇద్దరు అమ్మాయిలు ఒకటి నుంచి పదో తరగతి వరకు సర్వేల్లోని జెడ్పీహెచ్ఎస్ మలక్‌పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ 1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 1992లో జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లోకి 2000లో జేఎన్టీయూహెచ్లో పీహెచ్డీ 2001లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు 2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి గతేడాది జేఎన్టీయూహెచ్లో ప్రిన్సిపాల్‌గా నియామకం -
ఏసీబీ వలలో అవినీతి చేప
-
ఏసీబీ వలలో అవినీతి చేప
హన్మకొండ : వరంగల్ జిల్లా హన్మకొండ కో ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణమూర్తి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హన్మకొండ పీఏసీఎస్ వైస్ చైర్మన్ కంకల సదానందం నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ చిక్కాడు. పీఏసీఎస్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు సదానందంను కృష్ణమూర్తి రూ.2 లక్షలు లంచం అడిగాడు. సదానందం ఇంతకు ముందే రూ.1.5 లక్షలు చెల్లించాడు. మిగతా రూ.50 వేలు కూడా ఇచ్చేందుకు సదానందం సిద్ధమయ్యగా.. మరో పదివేల రూపాయలు అదనంగా ఇవ్వాలని కృష్ణమూర్తి డిమాండ్ చేయడంతో సదానందం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ పధకం ప్రకారం ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడ్ని జైలుకు తరలించారు. -
ర్యాగింగ్‌పై ఆరా తీసిన ఎస్వీయూ రిజిస్ట్రార్
తిరుపతి : ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు మంగళవారం ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపూ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బాలుర హాస్టల్లోని డి-బ్లాక్‌లో నిన్న ర్యాగింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొదటి ఫ్లోర్‌లోని సీనియర్ల గదిలోకి జూనియర్లను పిలిపించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. పరిచయం పేరిట సీనియర్ విద్యార్థులు ....నృత్యాలు చేయాలంటూ జూనియర్లను ర్యాగింగ్ చేసిన విషయం తెలిసిందే. -
తొలగింపు బాధ్యత మీదే!
అక్రమ లే అవుట్ల తొలగింపు బాధ్యత పంచాయతీలకు పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ లే అవుట్ల వివరాలు వీజీటీఎం ఉడా నూతన నిర్ణయం సిబ్బంది కొరత వల్లేనని చెబుతున్న అధికారులు సాక్షి, విజయవాడ : అక్రమ లే అవుట్ల తొలగింపునకు వీజీటీఎం ఉడా అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించారు. అన్ని అనుమతులు ఉన్న లే అవుట్ల జాబితాను ఉడా వెబ్సైట్లో పొందుపరిచారు. వారంలోపు ఆ జాబితాలను ఉడా పరిధిలోని అన్ని పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో భూసేకరణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే అక్రమ లే అవుట్ల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు ఇటీవల నిర్వహించిన సమీక్షలో కూడా అక్రమ లే అవుట్లను తక్షణమే తొలగించాలని ఆదేశించడం ఇందుకు బలాన్నిస్తోంది. అయితే లే అవుట్లకు అనుమతులు ఇవ్వడంతోపాటు సంబంధిత ఫీజులను ఉడా వసూలు చేస్తోంది. దీంతో లే అవుట్ల తొలగింపునకు పంచాయతీ అధికారులు ఎంత మేరకు ముందుకు వస్తారనేది ప్రశ్నార్థకమే. సిబ్బంది కొరత వల్లే! వీజీటీఎం ఉడా పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలో రెండు నగరపాలక సంస్థలు, ఎనిమిది మున్సిపాలిటీలు, సుమారు 1,400 గ్రామాలు ఉన్నాయి. ఉడాలో 120 మంది పనిచేయాల్సి ఉండగా, 58 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయడం సాధ్యం కావడం లేదని ఉడా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ లే అవుట్ల తొలగింపు బాధ్యతలను చేపట్టాలని ఆయా గ్రామ పంచాయతీలకు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని నిర్ణయించారు. తమ దృష్టికి వచ్చిన వాటిపై మాత్రం చర్యలు తీసుకుంటామని ఉడా అధికారులు చెబుతున్నారు. ఉడా పరిదిలో 476 లేఅవుట్ల ఉడా పరిధిలో రెండు జిల్లాల్లో కలిపి 2008 నుంచి ఇప్పటి వరకు అన్ని అనుమతులు ఉన్న లే అవుట్లు 476 మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఉడా పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో కూడా కొన్ని వెంచర్లు ఉన్నాయి. వీటితోపాటు అనధికారికంగా సుమారు 100 వెంచర్లు ఉన్నాయని ఉడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనధికార వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసి నష్టపోవద్దని ఉడా అధికారులు ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని అనుమతులు ఉన్న 476 లే అవుట్ల వివరాలతో ఉడా కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అవసరమైతే అనధికార లేఅవుట్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
కేయూ భూముల సర్వే ప్రారంభం
రిజిస్ట్రార్ సాయిలు నేతృత్వంలో ప్రత్యేక కమిటీ మూడు రోజుల్లో కొలతలు పూర్తి కేయూక్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయం భూముల అన్యాక్రాంతం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాజకీయ ఒత్తిళ్లతో ఇన్నాళ్లూ మరుగునపడిన ఈ వ్యవహారం మళ్లీ అదే రాజకీయ కారణాలతోనే చర్చనీయాంశంగా మారింది. అసలు యూనివర్సిటీకి సంబంధించి మొత్తం ఎంత భూమి ఉందనే విషయాన్ని తేల్చేందుకు రెవెన్యూ అధికారులు గురువారం సర్వే మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ అధికారులు కేయూలోని భూముల లెక్క తేల్చేందుకు ఇటీవల రిజిస్ట్రార్, ప్రొఫెసర్ సా యిలు నేతృత్వంలో కమిటీని నియమించారు. ఇందులో క్యాంపస్ ప్రిన్సిపాల్ రామస్వామి చైర్మన్‌గా, కేయూ అభివృద్ధి అధికారి సమ్మూలాల్ కన్వీనర్‌గా ఉన్నారు. అలాగే కేయూలోని ఉద్యోగ , విద్యార్థి సంఘాల బాధ్యు లు కూడా సభ్యులుగా ఉన్నారు. కాగా, గురువారం ఉద యం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆర్డీ ఓ వెంకటమాధవరం, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సాయి లు, పలువురు డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయ ర్లు క్యాంపస్‌లోని ఫార్మసీ హాస్టళ్ల వెనకభాగం నుంచి సర్వే మొదలు పెట్టారు. అక్కడి నుంచి కొంత దూరం నాన్‌టీచింగ్ క్వార్టర్ల వర కు ఉన్న భూములను కూడా కొలతలు వేశారు. ఇందులో 214 సర్వే నంబర్లోని భూమి కూ డా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. కాగా, సర్వేను మూడురోజుల్లో పూర్తి చేయనున్నారు. సర్వే ఎందుకంటే.. కాకతీయ యూనివర్సిటీలో భూముల్లోని 214 సర్వే నంబర్లో తన భూమి ఉందని గతంలో ఓ వ్యక్తి సర్వేయర్లతో కొలతలు వేయించుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. కాగా, 214 సర్వే నంబర్లోని 5.38 ఎకరాల భూమి మొ త్తం తనదేనని సదరు వ్యక్తి కొన్నేళ్ల నుంచి అధికారులతో వాదిస్తున్నాడు. అయితే ప్రైవేటు వ్యక్తి చెబుతున్న 5.38 ఎకరాల్లో ఎకరం 36 గుం టల భూమి ఎవరిదనే విషయంపై కొన్నేళ్లుగా ప్రైవేటు వ్యక్తికి, యూనివర్సిటీకి మధ్య కోర్టులో కేసు నడిచింది. అనంతరం జరిగిన పరిణమాలతో కొన్ని నెలల క్రితం సదరు వ్యక్తి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారుల ద్వారా సర్వే చేయించుకుని తన భూమిగా చెప్పుకుంటున్న స్థలంలో హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలో కాకతీయ యూనివర్సిటీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు భూ మి విషయాన్ని పట్టించుకోవడంలేదని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రైవే టు వ్యక్తి ఎంతభూమి వరకు హద్దులు ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు మళ్లీ సర్వేను ప్రారంభించారు. వాస్తవం గా రెవెన్యూ రికార్డుల ప్రకారం 640 నుంచి 650 ఎకరాల భూమి కాకతీయ యూనివర్సిటీకి ఉండాల్సి ఉంది. అయితే పలు చోట్ల కాకతీయ కెనాల్ ఏర్పాటైన తర్వాత ఆ ప్రాంతంలో కూడా ఆక్రమణలు జరిగాయి. యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ హద్దు లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఆక్రమణలు జరిగినట్లు తెలిసిం ది. కాగా, ఆక్రమణల వ్యవహారంపై కేయూ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ఆందోళనలతోనే అధికారులు సర్వేను చేపడున్నట్లు తెలుస్తోంది. -
రిజిస్ట్రార్ తప్పుకోవాలంటూ ఆందోళన
నేడు కూడా బంద్ కొనసాగుతుందన్న ఎస్వీయూ విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్‌ను తొలగించాలని విద్యార్థి సంఘాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఏ రిజిస్ట్రార్ చేయని విధంగా ప్రస్తుత రిజిస్ట్రార్ విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. ఆయన పదవిని చేపట్టిన రోజు నుంచి అన్నింటిలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఓఎంఆర్ షీట్లలో లక్షల రూపాయలను కమీషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. అధ్యాపకుల నియామకాల్లో నోటిఫికేషన్‌కు ముందే అడ్వాన్స్ రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ పదవి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మెస్‌లు ఎందుకు తెరవరు? ఎస్వీ యూనివర్సిటీలో కళాశాలలు పునఃప్రారంభించి నెల రోజులు కావస్తున్నా మెస్‌లు ఎందుకు తెరవలేదని విద్య్రార్థులు ప్రశ్నించారు. కార్డు విధానం ప్రవేశపెట్టి విద్యార్థులను అవమానిస్తున్నారన్నారు. ముందుగా కాషన్ డిపాజిట్ కట్టించుకున్న అధికారులు మళ్లీ మెస్‌లలో భోజనం చేయడానికి కార్డుల విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. మెస్‌లు తెరవకపోవడం వల్ల కొందరు విద్యార్థులు హోటళ్లలో తిని ఆరోగ్యం పాడుచేసుకోవాల్సి వస్తుందన్నారు. మరికొందరు పేద విద్యార్థులు గుళ్లలో ప్రసాదాలతో పొట్టనింపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఆయనకు మళ్లీ పదవి ఇవ్వాలని చూడడం దారుణమన్నారు. జాయింట్ రిజిస్ట్రార్ నాగమ్మ, ప్రిన్సిపాళ్లు కేవీఎస్.శర్మ, డి.ఉషారాణి విద్యార్థులతో చర్చించారు. వీసీ వచ్చిన తర్వాత చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని విద్యార్థులు మంగళవారం కూడా బంద్ కొనసాగిస్తామని చెప్పారు. బంద్‌లో విద్యార్థినాయకులు వెంకటరమణ, నాదముని, రామ్మోహన్, లోకనాదం, సురేష్‌నాయక్, భాస్కర్‌యాదవ్, హేమాద్రియాదవ్, ఏజే.సూరి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పాత్రికేయులను కోర్టుకు లాగుతా
ఎస్వీయూ అధికారులుగా ఏమైనా చేసుకోవచ్చు మీడియా సమావేశంలో ఎస్వీయూ రిజిస్ట్రార్ సత్యవేలురెడ్డి వీడియో ద్వారా ప్రెస్‌మీట్ రికార్డింగ్ యత్నం ఎదురు తిరిగిన మీడియా ప్రతినిధులు యూనివర్సిటీ క్యాంపస్ : పాత్రికేయులు కొంతమంది చెప్పుడు మాటలు నమ్మి తనపై అసత్య వార్తలు ప్రచురిస్తున్నారని, ఆ వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలను, సమాచారం ఇచ్చిన వ్యక్తులపై కేసులు పెట్టి కోర్టుకు లాగుతానని ఎస్వీయూ రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి అన్నారు. ఎస్వీయూలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి తన భార్యకు పదవి కట్టబెట్టారనే సమచారాన్ని టీఎన్ఎస్ఎఫ్ హరికృష్ణయాదవ్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి పత్రికలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. పత్రికల్లో అసత్యకథనాలు వస్తున్నాయన్నారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. కొంతమంది వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీటిని పాత్రికేయులు యధాతథంగా ప్రచురిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలో పరిపాలనా పరమైన ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి వీసీకి అధికారాలు ఉన్నాయని చెప్పారు. అందువల్ల తాము తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు. తన భార్య విషయంలో తాము ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని స్పష్టం చేశారు. వీడియో రికార్డింగ్ శుక్రవారం ఎస్వీయూ రిజిస్ట్రార్ నిర్వహించిన ప్రెస్ మీట్‌ను ఆయన ఆద్యంతం వీడియో రికార్డింగ్ చేయించారు. యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు ప్రెస్‌మీట్, ఇతర అధికారిక కార్యక్రమం నిర్వహించినా వీడియో రికార్డింగ్ చేసేవారు కాదు. అయితే పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించాలని రిజిస్ట్రార్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వీడియో రికార్డింగ్ చేయించారు. దీనిని పసిగట్టిన పాత్రికేయులు ఎదురు తిరిగారు. విలేకరుల సమావేశం పెట్టి అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇలా అయితే ప్రెస్మీట్లను బహిష్కరిస్తామని తేల్చిచెప్పడంతో చేసిన వీడియో రికార్డింగ్ తొలగించారు. అక్రమ కేసులు బనాయించేందుకే ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థి నాయకులపై అక్రమకేసులు బనాయించిన ఎస్వీయూ అధికారులు తాజాగా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న విలేకరులపై అక్రమ కేసులు బ నాయించడానికి ప్రయత్నిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇది అధికారులు మీడియాను భయపెట్టి గొంతునొక్కే ప్రయత్నమేనని విమర్శించారు. దీనిపై వీసీ రాజేంద్రను విలేకరులు వివరణ కోరగా వీడియో రికార్డింగ్ చేయించమని తాను చెప్పలేదన్నారు. -
ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌గా ఆచార్య: రాజశేఖర్
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 16వ రిజిస్ట్రార్‌గా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యుడు పి.రాజశేఖర్ నియమితులయ్యారు. వర్సిటీ వీసీ ఆచార్య కె.వియన్నారావు అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఏఎన్ యూ పాలక మండలి సమావేశంలో యూనివర్సిటీలోని పరిపాలన, కార్యనిర్వహణకు సంబంధించిన పలు కీలక నియామకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి సమావేశం వివరాలను ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య సి.రాంబాబు విలేకర్లకు వెల్లడించారు. రిజిస్ట్రార్‌గా నియమితులైన ఆచార్య రాజశేఖర్ ప్రస్తుతం యూజీ పరీక్షల కో- ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీకి ఇప్పటి వరకు 24 మంది రిజిస్ట్రార్లుగా పనిచేసినప్పటికీ వారిలో 9 మంది ఇన్చార్జి హోదాలో బాధ్యతలు నిర్వహించారు. దీంతో పూర్తికాలపు రిజిస్ట్రార్‌గా నియమితులైన వారిలో ఈయన 16వ రిజిస్ట్రార్. ఆచార్య జడ్.విష్ణువ ర్ధన్ పదవీ విరమణతో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన ఖాళీ అయిన ఓఎసీడీ పోస్టును కూడా భర్తీ చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఓఎస్డీగా ప్రస్తుతం ఏఎన్‌యూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆచార్య ఎ.వి.ఎ.దత్తాత్రేయరావును నియమించారు. సైన్స్ కళాశాలకు ఇప్పటి వరకు వైస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ఆచార్య సి.రాంబాబును ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల బుద్దిజం విభాగ అధ్యాపకుడు డాక్టర్ ఎల్.ఉదయ్‌కుమార్‌ను యూజీ పరీక్షల కోఆర్డినేటర్‌గా నియమించారు. రిజిస్ట్రార్, ఓఎస్డీ, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, యూజీ పరీక్షల కోఆర్డినేటర్ పోస్టుల నూతన నియామకాలు 2014 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. వీటితో పాటు ఈనెల 28వ తేదీన జరిగే ఏఎన్‌యూ 33, 34వ స్నాతకోత్సవాల్లో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చి డెరైక్టర్ ఎస్.మహేంద్రదేవ్‌కు ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్‌కు కూడా ఆమోదం తెలిపింది. -
వీఎస్కే విశ్వవిద్యాలయంలో సంఘటనలు బాధాకరం
సాక్షి, బళ్లారి : విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇటీవల వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ల మధ్య చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను ఎంతో బాధించాయని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వరనాయక్ అన్నారు. ఆయన గురువారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీసీ, రిజస్ట్రార్ల మధ్య నడుస్తున్న సంఘటనలు విద్యార్థుల చదువులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఉన్నత విద్యావంతులుగా ఉన్న వ్యక్తులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ఉన్నత విద్యాశాఖమంత్రితోపాటు రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. వీలైనంత త్వరలో ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలోని కార్మికుల పిల్లలకు బాగా చదువుకునేందుకు వసతి గృహాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఐదు ప్రాంతాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేసి, కార్మికులు పిల్లల బంగారు బాట వేస్తామన్నారు. రూ.5కోట్ల వ్యయంతో వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని, ఇందుకు బళ్లారి, రాయచూరు జిల్లాలో పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 100 కౌశల్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒక్కోదానికి దాదాపు 2 కోట్లు ఖర్చవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాధికారి బిస్వాస్, ఎస్పీ చేతన్‌సింగ్ రాథోడ్, జెడ్పీ సీఈఓ మంజునాథ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.