సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేయడంతో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్ రాజీనామా చేశారు. శనివారం జరిగిన వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ భేటీలో వర్సిటీ పాలనా వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా గంటల తరబడి నిలబెట్టడం ఏంటనే అంశంపై మాటామాటా పెరిగింది. దీంతో సుధాకర్‌పై ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మన స్థాపానికి గురైన రిజిస్ట్రార్ సుధాకర్ అప్పటికప్పుడే రాజీనామా చేశారు.