న్యూఢిల్లీ: తనపై ఉన్న ఓ కోర్టు ధిక్కారం కేసులో వ్యాపారవేత్త విజయ్ మాల్యా పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను ఎందుకు గత మూడేళ్లుగా సంబంధిత కోర్టు బెంచ్ ముందుకు తీసుకురాలేదని సుప్రీంకోర్టు.. తన రిజిస్ట్రీని ప్రశ్నించింది. దీనితో సంబంధమున్న అధికారుల పేర్లను పేర్కొంటూ, ఆలస్యానికి కారణాలను రెండు వారాల్లోగా తెలపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 2017లో విజయ్‌మాల్యా తన సంతానానికి 4కోట్ల డాలర్లను బదిలీచేయడాన్ని కోర్టు ధిక్కారంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు అదే ఏడాది తీర్పు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment