- రిజిస్ట్రార్ సాయిలు నేతృత్వంలో ప్రత్యేక కమిటీ
- మూడు రోజుల్లో కొలతలు పూర్తి
కేయూక్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయం భూముల అన్యాక్రాంతం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాజకీయ ఒత్తిళ్లతో ఇన్నాళ్లూ మరుగునపడిన ఈ వ్యవహారం మళ్లీ అదే రాజకీయ కారణాలతోనే చర్చనీయాంశంగా మారింది. అసలు యూనివర్సిటీకి సంబంధించి మొత్తం ఎంత భూమి ఉందనే విషయాన్ని తేల్చేందుకు రెవెన్యూ అధికారులు గురువారం సర్వే మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ అధికారులు కేయూలోని భూముల లెక్క తేల్చేందుకు ఇటీవల రిజిస్ట్రార్, ప్రొఫెసర్ సా యిలు నేతృత్వంలో కమిటీని నియమించారు.
ఇందులో క్యాంపస్ ప్రిన్సిపాల్ రామస్వామి చైర్మన్‌గా, కేయూ అభివృద్ధి అధికారి సమ్మూలాల్ కన్వీనర్‌గా ఉన్నారు. అలాగే కేయూలోని ఉద్యోగ , విద్యార్థి సంఘాల బాధ్యు లు కూడా సభ్యులుగా ఉన్నారు. కాగా, గురువారం ఉద యం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆర్డీ ఓ వెంకటమాధవరం, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సాయి లు, పలువురు డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయ ర్లు క్యాంపస్‌లోని ఫార్మసీ హాస్టళ్ల వెనకభాగం నుంచి సర్వే మొదలు పెట్టారు.
అక్కడి నుంచి కొంత దూరం నాన్‌టీచింగ్ క్వార్టర్ల వర కు ఉన్న భూములను కూడా కొలతలు వేశారు. ఇందులో 214 సర్వే నంబర్‌లోని భూమి కూ డా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. కాగా, సర్వేను మూడురోజుల్లో పూర్తి చేయనున్నారు. సర్వే ఎందుకంటే.. కాకతీయ యూనివర్సిటీలో భూముల్లోని 214 సర్వే నంబర్‌లో తన భూమి ఉందని గతంలో ఓ వ్యక్తి సర్వేయర్లతో కొలతలు వేయించుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు.
కాగా, 214 సర్వే నంబర్‌లోని 5.38 ఎకరాల భూమి మొ త్తం తనదేనని సదరు వ్యక్తి కొన్నేళ్ల నుంచి అధికారులతో వాదిస్తున్నాడు. అయితే ప్రైవేటు వ్యక్తి చెబుతున్న 5.38 ఎకరాల్లో ఎకరం 36 గుం టల భూమి ఎవరిదనే విషయంపై కొన్నేళ్లుగా ప్రైవేటు వ్యక్తికి, యూనివర్సిటీకి మధ్య కోర్టులో కేసు నడిచింది. అనంతరం జరిగిన పరిణమాలతో కొన్ని నెలల క్రితం సదరు వ్యక్తి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారుల ద్వారా సర్వే చేయించుకుని తన భూమిగా చెప్పుకుంటున్న స్థలంలో హద్దులు ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సమయంలో కాకతీయ యూనివర్సిటీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు భూ మి విషయాన్ని పట్టించుకోవడంలేదని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రైవే టు వ్యక్తి ఎంతభూమి వరకు హద్దులు ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు మళ్లీ సర్వేను ప్రారంభించారు. వాస్తవం గా రెవెన్యూ రికార్డుల ప్రకారం 640 నుంచి 650 ఎకరాల భూమి కాకతీయ యూనివర్సిటీకి ఉండాల్సి ఉంది.
అయితే పలు చోట్ల కాకతీయ కెనాల్ ఏర్పాటైన తర్వాత ఆ ప్రాంతంలో కూడా ఆక్రమణలు జరిగాయి. యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ హద్దు లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఆక్రమణలు జరిగినట్లు తెలిసిం ది. కాగా, ఆక్రమణల వ్యవహారంపై కేయూ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ఆందోళనలతోనే అధికారులు సర్వేను చేపడున్నట్లు తెలుస్తోంది.