ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్‌గా సత్తార్‌ సాహిర్‌ | sattar sahir as urdu university registrar | Sakshi
Sakshi News home page

ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్‌గా సత్తార్‌ సాహిర్‌

Published Wed, Aug 10 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

sattar sahir as urdu university registrar

యూనివర్సిటీ క్యాంపస్‌: కర్నూలులో నూతనంగా ఏర్పాౖటెన ఉర్దూ యూనివర్సిటీ తొలి రిజిస్ట్రార్‌గా ఎస్వీయూ ఉర్దూ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సయ్యద్‌ సత్తార్‌ సాహిర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. 1992లో ఎస్వీయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి అసోసియేట్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. ఉర్దూ విభాగాధిపతిగా, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. ఈ ఏడాది ఏర్పాౖటెన ఉర్దూ యూనివర్సిటీకి తొలి రిజిస్ట్రార్‌గా సయ్యద్‌ సత్తార్‌ సాహిర్‌ను నియమిస్తూ ఇన్‌చార్జి వీసీ నరసింహులు ఉత్తర్వులు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement