urdu university
-
'రోస్టర్ రిజర్వేషన్ మేరకే నియామకాలు'
సాక్షి, కర్నూలు : ఏపీ డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా మంగళవారం కర్నూల్ జిల్లాలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యునివర్సిటీని సందర్శించారు. సరైన వసతులు లేక యునివర్సిటీలో అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. వెంటనే యునివర్సిటీ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈసీ ప్రతిపాధించిన రోస్టర్ రిజర్వేషన్ ప్రకారమే యునివర్సిటీలో నియామకాలు చేపడతామని మంత్రి తెలిపారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంజాద్ వెల్లడించారు. -
అయిన వారైతే అందలమే!
సాక్షి, కర్నూలు : కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.ముజఫర్ అలీకి గత తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్ల పదవీ కాలాన్ని కట్టబెట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉర్దూ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయనకు పదవీ విరమణ సమయం రెండు నెలలు ఉండగా అప్పటి ప్రభుత్వం ఉర్దూ వర్సిటీ వీసీగా నియమిస్తూ 2017 మార్చి 25న జీఓ 54ను జారీ చేసింది. నిబంధనలకు, సంప్రదాయాలకు నీళ్లు వదలి నాలుగేళ్ల పదవీ కాలాన్ని ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఆయనపై గత ప్రభుత్వానికి ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్సిటీల యాక్ట్ ప్రకారం రాష్ట్రంలోని వైస్ చాన్సలర్ల పదవీ కాలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. అయితే ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పదవికి ఏకంగా నాలుగేళ్ల టెన్యూర్ ఇవ్వడం గమనార్హం. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు కావడంతో గత రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్సిటీల వ్యవహారాలను చూసిన విశ్రాంత ప్రొఫెసర్ ఒకరు (ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు) ఈ వ్యవహారాన్ని నడిపించారు. కొత్త వర్సిటీ ఏర్పడినప్పుడు ఎలాంటి సెర్చ్ కమిటీ లేకుండానే సమర్థవంతుడు, వర్సిటీ అభివృద్ధికి పాటు పడే వ్యక్తిని ప్రభుత్వమే ఎక్స్ఆర్డినరీ కేసు కింద వైస్ ఛాన్సలర్‌ను నియమిస్తుంది. అయితే ముజఫర్ అలీకి నాలుగేళ్ల పదవిని ఇవ్వడం కోసం ఉర్దూ వర్సిటీ యాక్ట్ 13ను ప్రత్యేకంగా తయారు చేయించి.. ప్రభుత్వ ఆమోదం పొందేలా చూశారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఈయన పనితీరుపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీ రిజిస్ట్రార్‌కు, ఈయనకు మధ్య విభేదాలున్నాయని తెలుస్తోంది. రెండు మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగించారు. కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్ నియామకం కోసం 22 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టుల భర్తీ, నోటిఫికేషన్ విడుదల విషయాల్లో వీసీ, రిజిస్ట్రార్ రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం సాధించేందుకు ఎవరికి వారు యత్నిస్తున్నారు. గత నెల 24న వర్సిటీలో తరగతులు ప్రారంభమయ్యాయి. సుమారు 150 మంది విద్యార్థులు ఉండగా.. పది మంది కూడా తరగతులకు హాజరు కావడం లేదు. ఆరేడుగురు గెస్ట్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు హాజరు కావడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఉన్నత విద్యాశాఖాధికారులు వర్సిటీపై ప్రత్యేక శ్రద్ధ చూపి చదువుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి« సంఘాల నేతలు కోరుతున్నారు. అన్నీ సర్దుకుంటాయి వర్సిటీలో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే. టీచింగ్ స్టాఫ్ నియామకంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. వాటిని అధిగమించి వారంలోగా కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. కొత్త వర్సిటీలు ఏర్పడినప్పుడు వాటి అభివృద్ధికి కొంత సమయం పడుతుంది. అందుకోసమే ప్రత్యేక యాక్ట్ ద్వారా నాలుగేళ్ల పదవీకాలం ఇచ్చారు. – ప్రొఫెసర్ ముజఫర్ అలీ, వీసీ, ఉర్దూ విశ్వవిద్యాలయం -
పునాదిలోనే అనాథ!
నిర్మాణ దశలోనే నిలిచిన ఉర్దూ కళాశాల భవనంనవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడలో నిర్మిస్తున్న ఉర్దూ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి నిధుల గ్రహణం పట్టింది. అంచనాలకు మించి వ్యయం కావడంతో పనులు సగంలోనే నిలిచిపోయాయి. సమయానికి నిధులు సమకూర్చడంలో విజయవాడ నగరపాలక సంస్థ పాలకులునిర్లక్ష్య వైఖరి అవలంబించారు. దీంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి కావాల్సిన భవనం ఇంకా నిర్మాణదశలోనే ఆగిపోయింది. భవానీపురం(విజయవాడ పశ్చిమ): వించిపేటలోని మహ్మదాలిపురం మున్సిపల్ స్కూల్ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఉర్దూ జూనియర్ కళాశాలకు శాశ్వత భవనం నిర్మించాలన్న ఆలోచనతో నగరపాలక సంస్థ విద్యాధరపురం కబేళా వద్ద ప్రభుత్వ స్థలంలో ఎకరం భూమిని కేటాయించింది. గత ఏడాది మార్చిలో శంకుస్థాపన చేసింది. టెండర్లు పిలిచిన నాలుగు నెలలకు అది అప్రూవల్ అయ్యింది. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయిన రెండు నెలలకు ప్లాన్ ఇచ్చారు. అనంతరం నాబార్ట్ నిధుల నుంచి మంజూరయిన రూ.2.3 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి కళాశాల భవనం ఈ ఏడాది మే నెలకు పూర్తి కావల్సి ఉంది. కళాశాల నిర్మాణం కోసం కేటాయించిన స్థలం గతంలో డంపింగ్ యార్డ్ ఉండటంతో ఫౌండేషన్ ఖర్చు భారీగా పెరిగిపోయింది. దీంతో అంచనా వ్యయానికి మించి ఖర్చు అయ్యింది. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ 5 నెలల కిందటే వీఎంసీ పాలకుల దృష్టికి తీసుకువెళ్లారు. మరో కోటి రూపాయలు ఉంటేగానీ పూర్తికాదని తెగేసి చెప్పారు. వీఎంసీ పాలకుల నిర్లక్ష్యం.. సహజంగా ఇటువంటి సందర్భాల్లో రీ ఎస్టిమేషన్ వేసి ఏదో ఒక వర్క్ నుంచి నిధులు మంజూరు చేయటం పరిపాటి. కానీ పాలకుల నిర్లక్ష్యంతో పనులు సగంలోనే నిలిచి పోయాయి. కళాశాల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ 90 శాతం పూర్తికాగా, ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ దశలో ఆగిపోయింది. ఏదో ఒక రకంగా నిధులు మంజూరు చేయిస్తామన్న గ్యారెంటీని పాలకులు కాంట్రాక్టర్‌కు ఇవ్వకపోవడంతో ఆయన చేతులెత్తేశారు. పాలకుల ఆరాటం కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోయినా తమ హయాంలో ప్రారంభించామన్న క్రెడిట్ కొట్టేయడానికి పాలకులు ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల నగర మేయర్ కోనేరు శ్రీధర్ అక్కడికి వచ్చి పరిశీలించారు. అయితే పనులు సగంలోనే నిలిచిపోవడంతో శివాలెత్తిపోయి అధికారులను, కాంట్రాక్టర్‌ను రాయలేని భాషలో తిట్టినట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈ నెల 3న కాలేజీ తరగతులు పునఃప్రారంభం కావల్సి ఉండగా, ఆ రోజునే ప్రారంభోత్సవం చేసేద్దామని ఆయన భావించారు. అయితే అది 12వ తేదీకి వాయిదా పడింది. ఉర్దూ కళాశాల తెప్పించిన ఘనత వెలంపల్లిదే నగరానికి ఉర్దూ జూనియర్ కళాశాల తీసుకువచ్చిన ఘనత అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకే దక్కుతుంది. అంతేకాకుండా కాలేజీలో విద్యార్థులకు అవసరమైన బెంచీలను కూడా ఆయనే తన కుమారుడు సాయి అవినీష్ జ్ఞాపకార్థం బహూకరించారు. నగరంలో నాలుగు ఉర్దూ పాఠశాలలు ఉన్నప్పటికీ కాలేజి లేకపోవడంతో ఆయా పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు పై చదువులకు వేరే ఉరు వెళ్లాల్సి వస్తుంది. దీనిపై ముస్లింలు చేసిన విజ్ఞప్తి మేరకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వెలంపల్లి శ్రీనివాసరావు విశేష కృషి చేసి జూనియర్ కాలేజీ తెప్పించారు. అప్పటికి శాశ్వత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా వించిపేట మహ్మదాలిపురంలోని నగరపాలక సంస్థ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. -
ఉర్దూ ఎంతో తియ్యనైనది
హైదరాబాద్: ఉర్దూ భాష ఎంతో తియ్యనైనదని... మా తాత కూడా చదివేవారు, మాట్లాడేవారని ఐటీ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. మంచి భాషను ప్రోత్సహించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం రెండవ రాష్ట్ర భాషగా ఉర్దూకు గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ‘రోడ్ టు జీఈఎస్’ పేరిట ఢిల్లీలో ప్రారంభమైన ‘షురువాత్’ బస్సు నగరానికి చేరుకోగా ఉర్దూ విశ్వవిద్యాలయంలో దానికి మంత్రి ‘ఫ్లాగ్ ఇన్’స్వాగతం పలికారు. అనంతరం నీతి ఆయోగ్, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఫౌండేషన్ సంయుక్తంగా గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలోని ఓపెన్ ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటు న్నాయన్నారు. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్‌తో మరింతగా ప్రోత్సాహకం లభిస్తుందని, ఇది ప్రారంభమేనని, భవిçష్యత్తులో మరిన్ని అద్భుతాలు చూసే అవకాశం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉర్దూ వర్సిటీ చాన్స్‌లర్ జఫర్ సరేశ్‌వాలా, గెల్ఫ్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, వర్సిటీ వీసీ డాక్టర్ షకీల్ ఆహ్మద్, ‘షురువాత్’ బస్ టీమ్ సభ్యులు, విద్యార్థులు, స్టార్టప్ నిర్వాహకులు పాల్గొన్నారు. -
ఉర్దూ వర్సిటీకి 144 ఎకరాల భూమి కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉర్దూ యూనివర్సిటీకి ఓర్వకల్‌లోని మార్కెట్ విలువపై భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్‌లోని 531–1, 556ఏ సర్వే నంబర్లలో 144 ఎకరాల భూములను కేటాయించింది. ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేటాయించిన భూములను ఉన్నత విద్యాశాఖకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఉర్దూ యూనివర్సిటీ పీజీసెట్ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ పీజీ సెట్ ఫలితాలను శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తార్ సాహెబ్ విడుదల చేశారు. మొత్తం 80 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 56 మంది అర్హత సాధించారని అన్నారు. ఈ నెల12 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని, ఎంఏ ఇంగ్లిషు, ఎకనామిక్స్, ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్, 13వ తేదీన ఎంఏ ఉర్దూ, ఎంకామ్ జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరు అయ్యేవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు జిరాక్స్‌కాపీలు తీసుకోరావాలన్నారు. -
ఉర్దూ యూనివర్సిటీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: ఉర్దూ యూనివర్సిటీ రెండవ సెమిస్టర్ ఫలితాలను మంగళవారం వైస్‌చాన్స్‌లర్ ముజఫర్ అలీ విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూజీ బీఏ ఎకనామిక్స్‌లో 12 మంది విద్యార్థులకు గాను 10మంది, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 16 మందికి 16 మంది ఉత్తీర్ణులైయ్యారన్నారు. పీజీలో ఎంఏ ఇంగ్లిష్‌లో 100 శాతం(24 మంది విద్యార్థులు), ఉర్దూలో 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 17 మంది, ఎంకామ్‌లో 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారన్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో ఉర్దూ హానర్స్, ఎకనామిక్స్ హానర్స్, బీకామ్ హానర్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ హానర్స్‌లో జూన్ 14వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించామన్నారు. -
ఉర్దూ వర్సిటీలో దరఖాస్తుల గడువు పెంపు
కర్నూలు (సిటీ): డాక్టర్ అబ్దుల్‌హక్ ఉర్దూ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగించారు. ఈమేరకు విషయాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ఏ సత్తార్ సాహెబ్ మీడియాకు తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ గడువును ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడగించామని చెప్పారు. పూర్తి వివరాలకు 94904 94532 / 79810 90584 నంబరును సంప్రదించాలని సత్తార్ సాహెబ్ తెలిపారు. -
ఉర్దూ వర్సిటీకి 144.34 ఎకరాల భూమి కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉర్దూ యూనివర్సిటీకి 144.34 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్లు గ్రామంలోని 531, 556ఎ తదితర సర్వే నబర్లలోని ప్రభుత్వ భూములను వర్సిటికీ కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి జేసీ శర్మ.. జీవో ఆర్టీ నబరు 379ని జారీ చేశారు. ఈ భూములను హయ్యర్ ఎడ్యుకేషన్‌కు అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. -
ఉర్దూ వర్సిటీకి వీసీ నియామకం
కర్నూలు(సిటీ) : డాక్టర్ మౌలీ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ కె.ముజాఫిర్ అలీని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ జీవో ఆర్టీ నెం.54ను జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో మొదటి ఉర్దూ యూనివర్సిటీని కర్నూలు నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉర్దూ శాఖ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కె.ముజాఫిర్ను ఈ వర్సిటీకి వీసీగా నియమించారు. -
ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ల గడువు పొడిగింపు
– ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలులో ఏర్పాటు చేసిన డాక్టర్ అబ్దుల్‌హక్ ఉర్దూ యూనివర్సిటీలో ప్రవేశాలకు మరోసారి గడువు పొడిగించినట్లు రిజిస్ట్రార్ సత్తార్సాహెబ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ ఎకనామిక్స్(హానర్స్), బీఎస్సీ(హానర్స్) కంప్యూటర్స్, బీకామ్(హానర్స్) కామర్స్, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ఉర్దూ, ఎంకామ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించామన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉర్దూ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందేందుకు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవావలని ఆయన కోరారు. -
ఉర్దూ వర్సిటీకి ఒక్క ఎకరా కేటాయించారా?
– మైనారిటీ ఓట్ల కోసం హడావుడి – బాబు రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం – విలేకర్ల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజం కర్నూలు(టౌన్): ‘ఉర్దూ యూనివర్సిటీæ నిర్మాణం ఇంకా మొదలుకాలేదు. నిధులు కేటాయించలేదు. వర్సిటీకి రిజిస్ట్రార్ తప్పా..అధ్యాపకులు, సిబ్బందిని నియమించలేదు. అంతేందుకు యూనివర్సిటీ పేరుమీద ఒక్క ఎకరా భూమి బదలాయింపు జరిగిందా?’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హాఫీజ్‌ఖాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదంతా మైనారిటి ఓట్ల కోసమే అధికారపార్టీ నేతలు చేస్తున్న హడావుడి అని మండిపడ్డారు. మంగళవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ యూనివర్సిటీ తరగతులు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతున్నట్లు ప్రచారం చేయకపోవడంతో మొత్తం ఆరు కోర్సుల్లో 180 సీట్లు ఉంటే 55 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఉర్దూ వర్సిటీ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఇంగ్లిషులో ముద్రించడం సిగ్గుచేటన్నారు. 2004 సవంత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం దష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రహెమాన్ మాట్లాడుతూ జిల్లాలో 7 ఎకరాల్లో హజ్‌హౌస్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ నీటి మూటలేనా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం టీడీపీ వేస్తున్న ఎత్తుగడలను ముస్లిం మైనార్టీలు, మత పెద్దలు గమనించాలని కోరారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమా...? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండున్నరేళ్ల పాలనలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో దానిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని టీడీపీ నేతలకు ౖÐð ఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య సవాల్ విసిరారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇతరపార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే బాబు చేసిన అభివద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత 2014 సంవత్సరంలో కర్నూలులో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబునాయుడు ప్రజలకు 23 హమీలు ఇచ్చారన్నారు. అందులో ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు.రెండురోజుల క్రితం అనంతపురంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో కూడా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మరోసారి మోసం చేసేందుకు యత్నించారన్నారు. ఎప్పుడూ డబ్బుల్లేవు అనే ముఖ్యమంత్రి మరి ఇచ్చిన హామీలకు వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలపై ప్రభుత్వం 6 నెలల ముందే ఎందుకు మేల్కోలేదన్నారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేవలం కాంట్రాక్టర్లకు, పార్టీ కార్యకర్తలకు దోచి పెట్టేందుకే హడావుడి పనులతో ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. ప్రజల్లో తెలుగుదేశానికి విశ్వసనీయత పోయిందని, అందుకనే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు భయపడుతున్నారని చెప్పారు. కర్నూలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీకి ఉన్న ప్రజాదరణను చూసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు జంకుతున్నారని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనార్టీసెల్ నాయకులు జహీర్‌ఖాన్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి మద్దయ్య, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు టి.వి. రమణ పాల్గొన్నారు. -
మైనార్టీ విద్యార్థులకు సువర్ణ అవకాశం
– ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభించిన గంటా, కేఈ – రెండేళ్లలో పక్కా భనాల్లోకి మార్చుతాం – ఎమ్మెల్యే ఎస్వీకి కేఈ చురకలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలులో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం మైనార్టీ విద్యార్థులకు సువర్ణ అవకాశమని మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉస్మానియా కళాశాలలో తాత్కాలికంగా మంగళవారం ఉర్దూ యూనివర్సిటీకి రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఉర్దూ వర్సిటీ కోసం తాత్కాలికంగా తరగతి గదులను కేటాయించిన ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ అజ్రాజావేద్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేఈ మాట్లాడుతూ.. ఉస్మానియా కళాశాలలో చదివి తాను జీవితంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నానని, ఉర్దూ వర్సిటీ విద్యార్థులు కూడా లక్ష్యం కోసం నిరంతరం చదివి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని సూచించారు. అంతకముందు రాజకీయ ప్రసంగం చేసిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కేఈ చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో అలాంటి ప్రసంగం చేశారని.. ఆయన మరచిపోయిన మరికొన్ని పథకాలను మైనార్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు నగరంలో రూ.207 కోట్లతో అభివద్ధి పనులు జరుగుతున్నాయని, తన హయాంలోనే ఉర్దూ యూనివర్సిటీ నెలకొందని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ పేర్కొన్నారు. ఉర్దూ యూనివర్సిటీని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేసి ఇక్కడే ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. నేటి నుంచి తరగతులు ప్రారంభం ఉర్దూ యూనివర్సిటీ తరగతులను బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఇన్చారి వైస్ చాన్సులర్ వై.నరసింహులు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇప్పడు కూడా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మొత్తం ఆరు కోర్సుల్లో 87 మంది చేరినట్లు చెప్పారు. ఇందులో ఎంఏ ఉర్దూ కోర్సుకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్లు సత్తార్ సాహేబ్, బి.అమర్నాథ్, కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఏజేసీ రామస్వామి, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ ఆజ్రాజావేద్, పలువురు మైనార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగుకీర్తి.. విశ్వదీప్తి పుస్తకావిష్కరణ 2014 సంవత్సరంలో ఉస్మానియా కళాశాలలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సంచిక తెలుగు కీర్తి..విశ్వదీప్తి అనే గ్రంథాన్ని మంత్రులు గంటా శ్రీనివాసరావు, కేఈ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. -
16న ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభోత్సవం
– తాత్కాలికంగా ఉస్మానియాలో ఏర్పాటు – మంత్రి గంటా, డీప్యూటీ సీఎం కేఈ హాజరు – 1.70 లక్షల రూపాయలు విడుదల – ఇన్చార్జి రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ వెల్లడి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉస్మానియా కళాశాలలో తాత్కాలిక ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభోత్సవాన్ని 16వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జి రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ వెల్లడించారు. ప్రారంభోత్సవానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి హాజరవుతారన్నారు. తరగతులు 17 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శుక్రవారం ఆర్‌యూలోని సెనేట్ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. రెండేళ్లలో పక్కాభవనాలు రెడీ ఓర్వకల్లు సమీపంలోని ఎడ్యుకేషనల్ హబ్‌లో ఉర్దూ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను కేటాయించినట్లు అమర్నాథ్ చెప్పారు. వాటితో రెండేళ్లలో పక్కాభవనాలు పూర్తి చేసి అక్కడికి యూనివర్సిటీ తరలిస్తామన్నారు. ఉస్మానియా డిగ్రీ కళాశాలలో తాత్కాలికంగా 1.70 కోట్లతో రెండేళ్ల పాటు వర్సిటీ కార్యాకలాపాలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడ విద్యార్థులకు కావాల్సిన తరగతి గదులు, కార్యాలయాలకు సబంధించి అన్ని రకాల సదుపాయలను కల్పించామన్నారు. లైబ్రేరీ కోసం పుస్తకాలను కూడా కొనుగోలు చేసినట్లు వివరించారు. ఆరు కోర్సులతో ప్రారంభం.. ఉర్దూ యూనివర్సిటీ మొత్తం ఆరు కోర్సులతో ప్రారంభం అవుతోందని పేర్కొన్నారు. ఇందులో యూజీ స్థాయిలో బీఏ, బీకామ్, బీఎస్సీ, పీజీ స్థాయిలో ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ఉర్దూ, ఎంకామ్ కోర్సులు ఉన్నట్లు చెప్పారు. ఆయా కోర్సులకు మొత్తం 87 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ అతితక్కువ ఫీజుతో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక విద్యార్థులకు హాస్టల్ సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్ బేసిక్‌పై అధ్యాపకుల నియామకం ప్రస్తుతం యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు లేకపోవడంతో రెగ్యులర్‌గా ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసుకునేందుకు వీలేదన్నారు. దీంతో కాంట్రాక్ట్, విజిటింగ్, గెస్టు ఫ్యాకల్టీలను తాత్కాలికంగా నియమించుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 8 మంది కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను నియమించామన్నారు. మిగిలిన వారిని అసవరం మేరకు తీసుకుంటామని వివరించారు. -
అంతా ప్రచార ఆర్భాటమే!
ఉర్దూ యూనివర్సిటీ కోసం నిధులను విడుదల చేయని ప్రభుత్వం – ఆర్యూ నిధులతో పనులు చేయిస్తున్న అధికారులు – 16న మంత్రిం గంటాతో ప్రారంభోత్సవం – ఆడ్మిషన్లపై ఆసక్తి చూపని విద్యార్థులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభోత్సవంపై ప్రచార ఆర్భాటం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూనివర్సిటీ కోసం రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. మరోవైపు ఈ నెల 16న యూనివర్సిటీని తాత్కాలికంగా ఉస్మానియా డిగ్రీ కళాశాలలో ప్రారంభిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మెంటర్ వర్సిటీగా ఉన్న రాయలసీమ యూనివర్సిటీ నిధులను అధికారులు ఖర్చు చేసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్యూ నిధుల మళ్లీంపు.. కొత్తగా ఏర్పాటు కానున్న ఉర్దూ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌గా ఆర్యూ వీసీ వై.నరసింహులును ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రభుత్వం అనుమతితో ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ఆర్యూ రిజిస్ట్రార్ అమర్నాథ్కు బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు. ఉస్మానియా కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు కానున్న ఉర్దూ యూనివర్సిటీ కోసం ఆయన రూ.10 లక్షలను ఆర్యూ నిధుల నుంచి కేటాయించారు. వాటితో 35 కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, భవనాలకు పెయింటింగ్ వేయించారు. ఆ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. రూ.1.70 కోట్ల కోసం రెండునెలలుగాఎదురుచూపు మరోవైపు ఉర్దూ యూనివర్సిటీని తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఖర్చుల కోసం రూ.1.70 కోట్లను కేటాయించాలని రెండు నెలల క్రితమే ఇన్చార్జి వీసీ వై.నరసింహులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిధులు కూడా రాలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో అధికారులు ఆర్యూ నిధులను మళ్లీంచి పనులు జరిపిస్తున్నారు. హడావుడిగా వర్సిటీలో ప్రవేశాలకు ప్రకటన కర్నూలులోని ఉర్దూ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పించాలని తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావించారు. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ప్రభుత్వం నుంచి వర్సిటీ ప్రారంభోత్సవానికి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే కర్నూలు నగర మున్సిపల్ ఎన్నికలను దష్టిలో ఉంచుకొని ఇక్కడి నాయకులు మైనార్టీ ఓటర్ల కోసం సీఎంపై ఒత్తిడి తెచ్చి వర్సిటీ ప్రారంభోత్సవంపై జూన్‌లో ప్రభుత్వం నుంచి ప్రకటన చేయించారు. చాలా ఆలస్యంగా ప్రకటన జారీ కావడంతో ఉర్దూ వర్సిటీలో ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు అప్పటికే ఇతర వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం ఉర్దూవర్సిటీలో బీఏ కోర్సుకు 20, బీఎస్సీ కోసం 9 మంది, ఎంఏ ఇంగ్లిషు 25. ఎంఏ ఉర్దూ కోసం 28 మంది, ఎంకామ్‌కు ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీ ప్రారంభోత్సవానికి రానున్న మంత్రి గంటా ఉర్దూ యూనివర్సిటీని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుతో ఈ నెల 16న ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఉస్మానియా కళాశాలలో వర్సిటీ కోసం కేటాయించిన భవనాలకు సున్నం వేయిస్తున్నారు. వర్సిటీకి అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నారు. రూ.10 లక్షల ఆర్యూ నిధులను కేటాయించాం– అమర్నాథ్, రిజిస్ట్రార్ ఉర్దూ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం ఒక్క రూపాయిని విడుదల చేయలేదు. దీంతో రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన రూ.10 లక్షలతో అక్కడ తాత్కాలికంగా అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నాం. నేడో..రేపో ప్రభుత్వం నుంచి ఉర్దూ యూనివర్సిటీ కోసం 1.70 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆర్యూ నిధులను వెనక్కి తీసుకుంటాం. -
ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్‌గా సత్తార్ సాహిర్
యూనివర్సిటీ క్యాంపస్: కర్నూలులో నూతనంగా ఏర్పాౖటెన ఉర్దూ యూనివర్సిటీ తొలి రిజిస్ట్రార్‌గా ఎస్వీయూ ఉర్దూ విభాగాధిపతి ప్రొఫెసర్ సయ్యద్ సత్తార్ సాహిర్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. 1992లో ఎస్వీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి అసోసియేట్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. ఉర్దూ విభాగాధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. ఈ ఏడాది ఏర్పాౖటెన ఉర్దూ యూనివర్సిటీకి తొలి రిజిస్ట్రార్‌గా సయ్యద్ సత్తార్ సాహిర్‌ను నియమిస్తూ ఇన్చార్జి వీసీ నరసింహులు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్లకు గడువు పొడిగింపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉర్దూ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల గడువును ఆగస్టు 6వ తేదీ వరకు పొడిగించినట్లు ఇన్చార్జి రిజిస్ట్రార్ అమర్నాథ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం జూలై 30 నుంచి ఆగస్టు ఆరో తేదీ వరకు గడువును పొడిగించామని వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఉస్మానియా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. -
నిబంధనలు.. తూచ్!
ఆర్యూ రిజిస్ట్రార్‌కు ఉర్దూ వర్సిటీ బాధ్యతలు ఇన్చార్జ్ వీసీ నిర్ణయం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్ నియామకం విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జి వీసీ ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని వాటి సారాంశం. రాయలసీమ యూనివర్సిటీ నుంచే డాక్టర్ అబ్దుల్‌హక్ ఉర్దూ యూనివర్సిటీ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం ఉర్దూ వర్సిటీ ఇన్చార్జి వీసీగా ఆర్యూ వీసీ వై. నరసింహులును నియమించింది. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ఎవరినీ నియమించలేదు. అయితే ఇన్చార్జి వీసీ ఆర్యూ రిజిస్ట్రార్ అమరనాథ్‌కే ఊర్దూ వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ పేరు మీద ప్రకటనలు.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ ప్రవేశాలకు పచ్చజెండా ఊపింది. తాత్కాలికంగా ఉస్మానియా డిగ్రీ కళాశాలలో తరగతుల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి వీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌తో పాలన సాగించాలని నిర్ణయించారు. తర్వాత ఏఓను నియమించకపోగా అమర్నాథ్కే అనధికారికంగా బాధ్యతలు అప్పగించారు. ఉర్దూ వర్సిటీ ప్రకటనలు, న్యూస్ బులెటిన్లు రిజిస్ట్రార్ పేరుతో విడుదల అవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధం.. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఒక యూనివర్సిటీ అధికారి మరో యూనివర్సిటీకి పని చేయడం నిబంధనలకు విరుద్ధమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ నియామకంలో వీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా తప్పులు దొర్లితే బాధ్యత ఎవరూ వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంపై వీసీ దష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు రిజిస్ట్రార్ నియామకం కోసం ప్రభుత్వానికి కనీసం నివేదిక కూడా పంపలేదని తెలుస్తోంది. నా పేరుతో ప్రకటనలు ఇవ్వలేను వీసీ పేరుతో ప్రకటనలు విడుదల చేయడానికి వీలు కాదు. తాత్కాలికంగా అమర్నాథ్కే ఇన్చార్జి రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించా. త్వరలోనే ఉర్దూ వర్సిటీకి పూర్తి స్థాయి రిజిస్ట్రార్ వస్తారు. – వై. నరసింహులు, వైస్ ఛాన్స్లర్ -
'కర్నూలులో అంతర్జాతీయ విమానాశ్రయం'
కర్నూలు: వచ్చే ఏడాది నుంచి ఉర్దూ కోసం ప్రత్యేక డీఎస్సీ ని నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న ఉర్దూ విశ్వవిద్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొని మాట్లాడారు. ఉర్దూ యూనివర్సిటీ కోసం 125 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల నుంచి ఇమామ్ లకు రూ. 5 వేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా షాదీఖానా కోసం స్థలం కేటాయిస్తున్నామన్నారు. కర్నూలులో 900 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకాబోతుందన్నారు. మరో వైపు కర్నూలు లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. అనంతరం ఆయన గోరుకల్లుకు చేరుకుని అక్కడ రిజర్వాయర్ పరిశీలించారు. -
ఉర్దూ వర్సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యం
సీపీఎం, పోలీసుల మధ్య తోపులాట కడప : కడపలో ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు దిష్టిబొమ్మతో ప్రదర్శనగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేసే హక్కు తమకు ఉందని, దీన్ని అడ్డుకోవడానికి మీరెవరంటూ సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇవేవి పట్టని పోలీసులు దిష్టిబొమ్మను లాగేశారు. ఈ సందర్బంగా పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వావాదం, తొపులాట చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. సీపీఎం కార్యకర్తలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు నిర్వహించారు. ఈ దశలో ప్రక్కనే నిరాహార దీక్షా శిబిరంలో ఉన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్, కార్యకర్తలు, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, మేయర్ సురేష్‌బాబు తదితరులు కూడా సీపీఎం కార్యకర్తలతో జత కలిశారు. ఈ సందర్బంగా సీపీఎం నగర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ కడపలో ఉర్దూ వర్శిటీని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన చంద్రబాబు నేడు మాట మార్చారని విమర్శించారు. కడపజిల్లాలో తమ పార్టీకి సీట్లు రాలేదని సీఎం కక్షగట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 11 జాతీయ స్థాయి సంస్థలను మంజూరు చేయగా, అందులో ఒక్కటి కూడా కడపకు ఇవ్వకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదని, జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన డీఆర్డీఓ పరిశోధనా కేంద్రాన్ని కూడా ఇతర జిల్లాలకు మళ్లించి అన్యాయం చేశారన్నారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్శిటీ విషయంలో కూడా ప్రభుత్వం ఇదే ధోరణి అవలంభిస్తోందని చెప్పారు. వర్శిటీ సాధన కోసం గత 16 రోజులుగా యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. ఈ దశలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించినా పోలీసులతో అడ్డుకోవడం దారుణమని దుయ్యబట్టారు. అనంతరం నాయకులు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న దీక్షా శిబిరంలోకి వెళ్లారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబులు మాట్లాడుతూ జిల్లా వాసులు ఎవరూ అడగకపోయినప్పటికీ ఉర్దూ వర్శిటీని ఏర్పాటు చేస్తానంటూ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పుడేమో మాటమార్చి కర్నూలు, గుంటూరు అంటూ రోజుకోమాట చెప్పడం దారుణమన్నారు. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు కేంద్రం కడప ఉందని చెప్పారు. అలాగే ముస్లిం జనాభా కూడా కడపలోనే అధికంగా ఉందన్నారు. అన్ని అనుకూలతలు ఉన్న కడపలోనే ఉర్దూ వర్శిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ కర్నూలు, గుంటూరులలో కూడా యూనివర్శిటీని నెలకొల్పినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా, వైఎస్సార్సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, షఫీ, కాంగ్రెస్ నాయకులు సత్తార్, సీపీఎం నాయకుడు సిద్దిరామయ్య, శంకర్, యాక్షన్ కమిటీ చైర్మన్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
కడపలోనే ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఇన్సాఫ్ సంఘాలు సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వచ్చిన విద్యార్థులు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీ సులకు, విద్యార్థి సంఘ నాయకులకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం సాగింది. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ఒక దశలో లాఠీలు ఝుళిపించారు. ఈ సంఘటనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి ఏఐఎస్ఎఫ్ నాయకులు గంగా సురేష్, కొమ్మద్ది ఈశ్వరయ్య, అకుంశం తదితరులను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించా రు. కార్యక్రమానికి హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న కార్యకర్తలను పోలీసులు దౌర్జన్యపూరితంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. కడపలో ఉర్దూ వర్శిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శాసనసభలో ప్రకటించి ఇప్పుడు కర్నూలులో ఏర్పాటు చేస్తామంటూ మాట మార్చడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ముని నాయుడు, వీరయ్య, శ్రీశైలం, ఇన్సాఫ్ నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న రిలే దీక్షలు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ యూనివర్సిటీ కోసం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నాటికి 16వ రోజుకు చేరాయి. జెమ్స్ పాఠశాల విద్యార్థులు ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఈ దీక్షల్లో వర్సిటీ యాక్షన్ కమిటీ చైర్మన్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం నివాస ప్రాంతాల్లో సాంకేతిక శిక్షణ సంస్థలు
కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముస్లిం నివాస ప్రాంతాల్లో పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి సాంకేతిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ముక్తార్‌అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. శుక్రవారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో 17 ఫౌండేషన్ డేలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సంస్థల్లో సాంకేతిక శిక్షణ పొందిన ముస్లిం యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉర్దూ దేశ సంస్కృతి అనీ, దీన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మదర్సాల్లో ఆధ్యాత్మిక బోధనతోపాటు ఉర్దూ పాఠశాలల్లో ఆంగ్లం, హిందీ సబ్జెక్ట్‌ల్లో కూడా విద్యనందించాలని ఆయన కోరారు. మైనారిటీల సాధికారత, అభివృద్ధికి కేంద్రం కృషి దేశంలోని మైనారిటీల సాధికారిత, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మైనారిటీలు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్లేందుకు తాము కృషి చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని పర్యాటక భవన్లో శుక్రవారం మైనారిటీ సంక్షేమంపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 50శాతానికి పైగా మైనారిటీలు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని చెప్పారు. మైనారిటీలు ఎదిగేందుకు కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు చేపడుతామన్నారు. ఏ మతం చాంపియన్ అనే చర్చ అనవసరం పుట్టుకతో అందరూ ముస్లింలేనని ఇటీవల ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నఖ్వీ నిరాకరించారు. ఏ మతం చాంపియన్ అనే అంశం జోలికి తాను వెళ్లనని, ఎవరూ మాట్లాడకూడదన్నారు. ఘర్ వాపసీ, లవ్ జిహాదీలకు కేంద్రం వ్యతిరేకమని చెప్పారు. టైస్టులకు సాయపడేలా పాకిస్తాన్ తీసుకునే చర్యలు గర్హనీయమన్నారు. టైస్టు లక్వీకి బెయిల్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అడిగిన ప్రశ్నకు అది రాష్ట్రాల అంశమని నఖ్వీ దాటవేశారు.