ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్లకు గడువు పొడిగింపు
Published Sat, Jul 30 2016 11:59 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉర్దూ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల గడువును ఆగస్టు 6వ తేదీ వరకు పొడిగించినట్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ అమర్‌నాథ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం జూలై 30 నుంచి ఆగస్టు ఆరో తేదీ వరకు గడువును పొడిగించామని వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఉస్మానియా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.
Advertisement
Advertisement