Admissions in Education Institutions
-
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు నేడు అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులా ల్లో ఐదోతరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఈనెల 23న ప్రవేశ పరీక్ష జరగనుంది.రాష్ట్రవ్యాప్తంగా 446 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,67,649 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఐదో తరగతిలో 51,968 సీట్లున్నాయి. మిగిలిన తరగతుల్లో సొసైటీల వారీ గా ఖాళీలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నా యి. ప్రవేశ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభా కర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
రండి బాబూ రండి.. ముందే రిజర్వ్ చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం కోసం ప్రైవేటు విద్యాసంస్థలు సీట్లను అమ్మకానికి పెట్టాయి. విద్యార్థులను ఆకర్షించేందుకు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నాయి. మధ్యవర్తులు, ఏజెంట్లు, తమ సంస్థల్లో చదివే సీనియర్లను రంగంలోకి దించుతున్నాయి. పెద్ద ఎత్తున కరపత్రాలు, ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. గ్రామాల్లో ఆటోలకు మైకులు పెట్టి ఊదరగొడుతున్నాయి. పల్లెల్లో పెద్దల్ని ఆశ్రయించి తమ విద్యార్థులకు తమ సంస్థలను సిఫారసు చేయమని అడుగుతున్నాయి. నిరుద్యోగులను నియమించుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించేలా ఇల్లిల్లూ తిప్పుతున్నాయి. వీలున్న మార్గాల్లో విద్యార్థుల ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నాయి. ఎల్కేజీ మొదలుకుని, ఇంజనీరింగ్ వరకు స్కూళ్లు, కాలేజీలు ముందస్తు ప్రవేశాలకు తెరతీశాయి. ముందస్తు అడ్మిషన్లకు ప్రభుత్వం నుంచి అనుమతి లేకున్నా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తున్నాయి. ‘బీ’ బ్యాచ్ టార్గెట్ రూ.1,000 కోట్లు! ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇంకా పూర్తవ్వలేదు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు మొదలవ్వలేదు. కానీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడేయాజమాన్య కోటా సీట్ల అమ్మకాలకు తెరలేపాయి. జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. ఇప్పుడే సీటు రిజర్వు చేసుకుంటే తక్కువ మొత్తానికే లభిస్తుందని, తర్వాత డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. రాష్ట్రంలో 150 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలుండగా.. కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 1,07,039 సీట్లున్నాయి. ఇందులో యాజమాన్య కోటా సీట్లు 30 శాతం.. అంటే 32 వేల సీట్లుంటాయి. ప్రధానంగా పది కాలేజీల్లోనే 15 వేల యాజమాన్య కోటా సీట్లున్నాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ సీట్లు 12,500 వరకూ ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 3 వేల సీట్లు వచ్చే వీలుంది. వీటికే ప్రధానంగా డిమాండ్ ఉంటోంది. జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్ మార్కుల కొలమానంగా మెరిట్ విద్యార్థులకే సీట్లివ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు వసూలు చేయాలి. కానీ యాజమాన్యాలు ఒక్కో సీటు గరిష్టంగా రూ.20 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఒక్కో సీటు సగటున రూ.7 లక్షలు అనుకున్నా..17 వేలకు పైగా యాజమాన్య సీట్ల విలువ రూ.1,000 కోట్లు దాటిపోతుందని అంటున్నారు. తగ్గేదే లేదంటున్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఏటా సగటున 4.50 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. 2 లక్షల మంది ప్రభుత్వ కాలేజీలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, గురకులాల్లో చేరుతుంటే, మిగిలిన 2.50 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో 1,500 వరకూ ప్రైవేటు జూనియర్ కాలేజీలున్నాయి. ఇందులో 500కు పైగా కాలేజీలున్న నాలుగు కార్పొరేట్ సంస్థలే హవా కొనసాగిస్తున్నాయి. దాదాపు 1.80 వేల మంది ఈ కాలేజీల్లోనే చేరుతున్నారు. 1,000 వరకు ఉండే లోబడ్జెట్ కాలేజీల్లో చేరే వారి సంఖ్య 70 వేల వరకూ ఉంటోంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ముందే ప్రవేశాల ప్రక్రియ మొదలు పెట్టాయి. టెన్త్ పరీక్షలకు ఇంకా ఎంతో సమయం ఉన్నా..భవిష్యత్‌ను నిర్ణయించేది ఇంటర్మీడియెట్టేనని, ఇక్కడే అసలైన పునాది అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. హాస్టళ్ళలో వసతులు, అత్యాధునిక పద్ధతుల్లో బోధన, నిష్ణాతులైన సిబ్బంది, కొన్నేళ్ళుగా వస్తున్న పరీక్షల ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఊళ్ళల్లో చోటామోటా నేతలకు మామూళ్ళిస్తున్నాయి. విలాస వంతమైన ట్రిప్పులు ఏర్పాటు చేస్తున్నాయి. ‘కేజీ’ చదువులపైనా క్రేజ్ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లూ జోరు కొనసాగిస్తున్నాయి. కొత్త విద్యార్థులను చేర్పించమని స్కూల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లకు టార్గెట్లు పెడుతున్నాయి. అడ్మిషన్లకు వేతనాలకు లింక్ పెడుతున్నాయి. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ రంగ స్కూళ్ళల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే కేవలం 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 36 లక్షల మంది చదువుతుండటం గమనార్హం. తల్లిదండ్రులు కూడా ప్రైవేటు స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో చేర్పించేటప్పుడే మంచి స్కూళ్ల కోసం గాలిస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వారికి గాలం వేస్తున్నాయి. అందమైన బ్రోచర్లతో, ఆకర్షణీయమైన వాట్సాప్ మెసేజీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమ స్కూల్లో చేరితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నమ్మ బలుకుతున్నాయి. అడ్మిషన్లు మొదలయ్యే లోగా చేరే వారికి ప్రత్యేక ప్యాకేజీ అంటున్నాయి. రూ. 50 వేలు మొదలుకొని, పెద్ద కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో రూ.12 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి పరిస్థితి నోటిఫికేషన్ ఇవ్వకుండానే అడ్మిషన్ల కోసం వెంటపడే కాలేజీల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ వ్యవస్థలోకి తేవాలి. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అనుమతి వచి్చన తర్వాత అడ్డుకట్ట వేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తాం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్) కఠిన చర్యలు తప్పవు వచ్చే విద్యా సంవత్సరానికి గాను ఇప్పటివరకు ఏ కాలేజీకీ అఫ్లియేషన్ ఇవ్వలేదు. కాబట్టి అడ్మిషన్లు చేపట్టినట్టు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు కూడా తొందరపడి అడ్మిషన్లు తీసుకోవద్దు. – కృష్ణ ఆదిత్య (ఇంటర్ బోర్డు కార్యదర్శి) -
తుది దశకు నీట్–పీజీ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్యవిద్యలో ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర కోటా ప్రవేశాల కోసం రెండు దశల్లో విడుదలైన అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా కేంద్రం పీజీ అడ్మిషన్లకు కటాఫ్ తగ్గించటంతో అందుకు తగ్గట్లుగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కలిపి రాష్ట్ర కోటా కింద 1,350 పీజీ సీట్లు ఉన్నాయి. కటాఫ్ తగ్గించడంతో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. పీజీ ప్రవేశాలకు అర్హత సాధించాలంటే ఇప్పటివరకు జనరల్ విద్యార్థులు 50 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 40 శాతం పర్సంటైల్ సాధించాలనే నిబంధన ఉంది. దీనివల్ల చాలా వర్సిటీలలో పీజీ సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కటాఫ్ పర్సంటైల్‌ను జనరల్‌కు 15 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 10 శాతంగా నిర్ణయించింది. తగ్గిన కటాఫ్ ప్రాతిపదికన మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం (8వ తేదీ) సాయంత్రం ఐదు గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో రిజి్రస్టేషన్ చేసుకోవాలని కోరింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. తదనుగుణంగా వెబ్ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇన్‌సర్వీస్ వైద్యులకు నిరాశే స్థానికతపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జరగాల్సిన వాదనలు 15 తేదీకి వాయిదా పడ్డాయి. దీంతో తెలంగాణ ఇన్ సర్వీస్ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ఇన్‌సర్వీస్ కోటా కింద 297 సీట్లు ఉండగా , ఇప్పటివరకు 17 మంది మాత్రమే పీజీలో చేరారు. కటాఫ్ తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తులకు ఈ నెల 11 చివరి తేదీగా నిర్ణయించటంతో.. కేసు విచారణకు ముందే ఇన్ సర్వీస్ కోటా సీట్ల భర్తీ కూడా పూర్తవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. -
యూజీసీ సిఫార్సులు ఆచరణ సాధ్యమేనా?
సాక్షి, ఎడ్యుకేషన్: ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన సంస్కరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, పీజీలో ప్రవేశాలు మొదలు.. కోర్సుల వ్యవధి వరకు యూజీసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తే ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయి. అయితే ఈ సిఫార్సులపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు సత్ఫలితాల నివ్వడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటు న్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం ‘మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులేషన్స్–2024’ పేరుతో యూజీసీ ఈ నెల ఐదో తేదీన ముసాయిదాను విడుదల చేసింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి, ఈ నెల 23వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలు రాసింది. యూజీసీ సిఫార్సులపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఏటా రెండు సార్లు ప్రవేశం..యూజీసీ సిఫార్సుల్లో ముఖ్యమైనది.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏటా రెండు సార్లు (జూలై / ఆగస్ట్, జన వరి/ఫిబ్రవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహించటం. ఇది విద్యా ర్థులకు కొంత మేలు చేసే అంశమేనని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య అభ్యసించే విషయంలో సమయం వృథా కాకుండా ఈ ప్రతిపాదన మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే..ఈ ప్రతిపాదన అమలుచేయాలంటే ఫ్యాకల్టీ, ఇతర బోధన సదుపాయా లను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్ప టికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. హెచ్‌ఈసీతో బీటెక్ చదవగలరా?యూజీసీ మరో సిఫార్సు.. అకడమిక్ నేపథ్యం ఏదైనా.. విద్యార్థులు ఉన్నత విద్యలో తమకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం కల్పించడం. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్‌లో హెచ్ఈసీ చదివిన విద్యార్థి.. బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌లలో (జేఈఈ, ఈఏపీసెట్ తదితర) ఉత్తీర్ణత సాధించి బీటెక్‌లో చేరొచ్చు. దీనిపై వ్యతిరేక అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యా ర్థులు.. గణితం, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే బీటెక్‌లో రాణించడం సాధ్యం కాదని అంటున్నారు. బహుళ ప్రవేశ, నిష్క్రమణ అవకాశంయూజీసీ ప్రతిపాదనల్లో మరో కీలకమైన అంశం బహుళ ప్రవేశ, నిష్క్రమణ (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) విధానం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో కోర్సు నుంచి వైదొలగే అవకాశం, ఆ తర్వాత మళ్లీ అదే కోర్సులో.. తదుపరి తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కల్పించటం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. కానీ.. ఇలాంటి విధానం ఫలితంగా విద్యార్థుల్లో ఉన్నత విద్య స్ఫూర్తి కొరవడే ప్రమాదం ఉందని, ఇది జాబ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. స్కిల్ కోర్సులు, అప్రెంటిస్షిప్స్ఉన్నత విద్యలో స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్స్ను సమీకృతం చేసేలా మరో ప్రతిపాదన చేశారు. బ్యాచిలర్ డిగ్రీలో మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం పూర్తి చేసుకున్న వారు.. మరో 50 శాతం క్రెడిట్స్ కోసం స్కిల్ కోర్సులను, అప్రెంటిస్‌షిప్‌ను, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్కిల్ కోర్సులను అందించే క్రమంలో.. రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.ఒకే సమయంలో రెండు డిగ్రీలుఅకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విధానంలో ఒకే సమయంలో రెండు డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అభ్యసించే విధానాన్ని కూడా యూజీసీ ప్రతిపాదించింది. విద్యార్థులు తాము చేరిన కోర్సు/విద్యా సంస్థతోపాటు మరో ఇన్స్టిట్యూట్లో లేదా మరో అభ్యసన విధానంలో అర్హత మేరకు మరేదైనా బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీలో చేరొచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మన విద్యా వ్యవస్థకు సరితూగేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండున్నరేళ్లకే బ్యాచిలర్ డిగ్రీరెండున్నరేళ్లకే డిగ్రీ పూర్తి చేసుకునేలా యూజీసీ ప్రతి పాదన చేసింది. యాక్సెలెరేటెడ్ డిగ్రీ ప్రోగామ్ పేరుతో ప్రతి విద్యా సంస్థలోని మొత్తం విద్యార్థుల్లో పది శాతం మందికి ఈ అవకాశం కల్పించాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగామ్స్ విషయంలో మూడేళ్లలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ యాక్సలెరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానంలో.. టీచింగ్–లర్నింగ్ కోణంలో సమస్య ఉత్పన్నమవుతుందని, విద్యార్థులు ఒత్తిడికి గుర వుతారని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని రెండున్నరేళ్లలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన యూ జీసీ.. పీజీ విషయంలో మాత్రం మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వారినే అర్హులుగా నిర్దేశించాలని సూచించింది. దీంతో.. రెండున్నరేళ్లకు లేదా మూడేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పీజీ ప్రవేశాల అర్హతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తక్షణ అమలు సాధ్యం కాదు..యూజీసీ ప్రతిపాదనలు, సిఫార్సులను తక్షణం అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అయిదు నుంచి పదేళ్ల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ప్రభు త్వ విద్యా సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో కొంత మేర వీటిని వెంటనే అమలు చేసే వీలుంది. – ప్రొఫెసర్. డి.ఎన్. రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీఆహ్వానించదగ్గ పరిణామంయూజీసీ తాజా సిఫార్సులను ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విషయంలో అదనపు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం అవసరమైన వనరులను ఉన్నత విద్యా సంస్థలు కల్పించాలి. – ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రొ వైస్ ఛాన్స్లర్ అడ్వయిజర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీదశల వారీగా అమలు చేయాలిగ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సంస్కరణలు అవస రమే.. కానీ అమలు విషయంలో ఫ్యాకల్టీ కొరత సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కోణంలో పలు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విధానంలో బీటెక్, సైన్స్ కోర్సుల్లో రాణించడం కష్టంగానే ఉంటుంది. – ప్రొఫెసర్. వి. బాలకిష్టారెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి -
ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2024)కు సంబంధించిన ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీసీ స్ట్రీమ్‌లో బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సులతోపాటు బైపీసీ స్ట్రీమ్‌లో బీఈ, బీ.టెక్‌లలో బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాసూ్యటికల్ ఇంజనీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సుల సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేశాయి. ఏపీ ఈఏపీసెట్–2024లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ట్ఛ్టట.టఛిజ్ఛి.్చp.జౌఠి.జీn లో లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు శనివారం రాత్రి వరకు అవకాశం ఉంది. డిసెంబర్ ఒకటో తేదీ వరకు విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఎంపిక చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో పరిశీలిస్తారు. శని, ఆదివారాల్లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు డిసెంబర్ 2వ తేదీ ఒక్క రోజు అవకాశం ఉండగా, 4వ తేదీన సీట్లు కేటాయిస్తారు. డిసెంబర్ 4 నుంచి ఆరో తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంది. బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు శనివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కళాశాలల ఎంపిక కోసం 3 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 8వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. డిసెంబర్ 11 సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి 14వ తేదీలోపు కళాశాలల్లో చేరాలి. -
పీజీ వైద్య విద్య అవకాశాలకు గండి
సాక్షి, అమరావతి: తమ పీజీ వైద్య విద్య అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతోందని ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులు మండిపడుతున్నారు. ఏపీలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదివిన వారంతా రాష్ట్రంలో స్థానికులుగా గుర్తించి పీజీ మెడికల్ అడ్మిషన్లు చేపడుతుండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఉత్తరాది సహా పక్కనున్న తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన మెడికోలకు స్థానికత కల్పించడం ఏంటని, ఒకటి నుంచి ఎంబీబీఎస్ వరకు మన రాష్ట్రంలో చదివిన మెడికోలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని, నిబంధనలు సవరించ డం కుదరదని ప్రభుత్వం చేతులు ఎత్తేయడం పట్ల మండి పడుతున్నారు. జీవో 646ను అనుసరించి ఇలా చేయాల్సి వస్తోందని ఎన్టీఆర్ వర్సిటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నెలతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. ఈ మేరకు విభజన చట్టం ప్రకారం సిద్ధార్థ వైద్య కళా శాలలో తెలంగాణాకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల కేటాయింపును రద్దు చేశారు. అయినప్పటికీ పీజీ తెలంగాణ వారికి పీజీ సీట్లు కేటాయించడం ఏ లెక్కన సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. 646 జీవోకు ఎందుకు సవరణ చేయలేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఈ జీవోకు సవరణ చేయా ల్సిందేనని మెడికోలు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తు న్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకో వాలని కోరుతున్నారు. కాగా, ఈ ఏడాది కొత్త కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా.. వద్దంటూ లేఖ రాసి గండికొట్టిన ప్రభుత్వం.. తాజాగా పీజీ విద్య విషయంలోనూ క్షమార్షం కాని తప్పిదం చేసిందంటున్నారు. మెడికోల వాదన ఇలా..రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన ఏ రాష్ట్రానికి చెందిన వారినైనా పీజీ మెడికల్ ప్రవేశాల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థానికులుగా పరిగణిస్తోంది. రాష్ట్ర కోటా సీట్లలో వారికి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 460కి పైగా ఆల్ ఇండియా, 600 మేర సీ కేటగిరి, బీ కేటగిరిలోనే బీ1 కింద 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ సీట్లలో పెద్ద ఎత్తున అడ్మి షన్లు పొంది ఎంబీబీఎస్ చదువుతుంటారు. అలాగే కన్వీనర్ కోటా కింద గత ఏడాది వరకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో తెలంగాణ విద్యార్థులు 40 శాతం మంది ఎంబీబీఎస్ చదివారు. ఇలా ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారందరికీ స్థానికత కల్పించడంతో వందల సంఖ్యలో పీజీ సీట్లు రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారు. మరోవైపు పక్కనున్న తెలంగాణా రాష్ట్రం పీజీ అడ్మిషన్ల నిబంధనలను సవరించింది. మన వాళ్లు ఎక్కడ చదివినా స్థానికత కల్పించాలిఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర ఎంబీబీఎస్ చది విన వారికి స్థానికత కల్పించే విధానాన్ని రద్దు చేయాలి. ఏపీ విద్యార్థులు ఆల్ ఇండియా కోటా కింద ఏ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినా పీజీలో మన దగ్గరే స్థానికత కల్పించాలి.మన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు స్థానికత ఇవ్వ నప్పుడు, ఇతర రాష్ట్రాల వారికి మనం స్థానికత ఇవ్వడం సరికాదు. ఆ మేరకు నిబంధనలు సవరించాలి. లేదంటే మన విద్యార్థులకే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ -
కాలేజీలు తగ్గినా.. సీట్లు పైకే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతున్నా, సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో 2020–21లో 186 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2024–25 విద్యా సంవత్సరానికి అవి 174కు తగ్గాయి. 20–21లో 98,988 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ ఏడాది సీట్లు 1,12,069కు పెరిగాయి. ఇంజనీరింగ్‌లో చేరేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ, ఇది ఈ సంవత్సరం లక్ష దాటింది. చిన్న పట్టణాల్లో కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు చేరేందుకు ఇష్టపడటం లేదని ప్రవేశాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థులు ఇంటర్ నుంచే హైదరాబాద్‌లో చదివేందుకు వస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇంజనీరింగ్‌లోనూ కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో ఎక్కువగా సీట్లు భర్తీ అవుతున్నాయి.ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపే..రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.5 లక్షల మంది ఇంటర్మిడియట్ పాసవుతున్నారు. ఇందులో 75 శాతంపైగా ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఉంటున్నారు. వీరిలో లక్ష మంది వరకూ రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్నారు. ఎన్ఐటీలు, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో చేరేవాళ్లు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర సంస్థల్లో చేరేవాళ్లు మరో 10 వేల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి 2.40 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1.80 లక్షల మంది పాసయ్యారు. కనీ్వనర్ కోటా కింద 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కలిపి మొత్తం 86,943 సీట్లు ఉన్నాయి. వీటిలో 75,107 సీట్లు భర్తీ చేశారు. దాదాపు 31 వేల బీ కేటగిరీ సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇప్పటికే ఉన్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా మంజూరైన మరో ఐదు ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల క్యాంపస్‌లలో కనీసం 10 వేల మంది చేరినట్టు అంచనా. బాసర ఆర్జీయూకేటీ, హెచ్‌సీయూలోని సీఆర్‌రావు విద్యా సంస్థతో పాటు తమిçళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని డీమ్డ్ వర్సిటీల్లో మరో 10 వేల మంది చేరే వీలుంది. ఎందుకీ క్రేజ్ఇంజనీరింగ్ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని విద్యార్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరే వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఐటీ కంపెనీల నియామకాలన్నీ కంప్యూటర్ కోర్సులు చేసినవారితోనే జరుగుతున్నాయి. డిగ్రీ, ఇతర కోర్సుల్లోనూ కంప్యూటర్ అనుబంధం ఉంటే తప్ప ఐటీ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది.దీంతో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రైవేటు కాలేజీలు కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే మంచి ఫ్యాకల్టీ ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో పాటు అన్ని బ్రాంచీల్లోనూ మార్పు అనివార్యమవుతోంది. ఐటీ ఆధారిత బోధన విధానం తప్పనిసరి అవుతోంది. అందుకే విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌పై క్రేజ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ప్రభావమే మార్చేస్తోంది ఇంజనీరింగ్‌లోని అన్ని బ్రాంచీల్లోనూ ఆరి్టఫిíÙయల్ టెక్నా లజీ దూసుకొస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లోనే కాదు... సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్‌లోనూ ఏఐ లేకుండా ముందుకెళ్లడం కష్టం. అందుకే బ్రాంచీ ఏదైనా ఏఐ మీద విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఇంజనీరింగ్ చేస్తూనే... ఏఐ నేర్చుకుంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. – డాక్టర్ కె.విజయకుమార్‌రెడ్డి రెక్టార్, జేఎన్టీయూహెచ్ -
స్థానికత నిబంధనను పక్కకు పెట్టి.. దరఖాస్తులు స్వీకరించండి
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ప్రస్తుతానికి స్థానికత నిబంధనల అంశాన్ని పక్కకు పెట్టి పిటిషనర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. నేటితో దరఖాస్తుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో పిటిషనర్లు తమ వద్ద ఉన్న ఫార్మాట్లో స్థానికత సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. పిటిషనర్లు తమ పిటిషన్ వివరాలను సంబంధిత అధికారులకు ఇవ్వాలని చెప్పింది.ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుతాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ‘ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీల అడ్మిషన్ నిబంధనలు– 2017లోని రూల్ 3(ఏ)ను సవాల్ చేస్తూ హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహా అభినామ్తోపాటు మరో 13 మంది తరఫున న్యాయవాది కొండపర్తి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ గత నెల 19న రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 33 చట్టవిరుద్ధం. జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తోపాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలి. పరీక్షలు ఇక్కడే రాయాలి. ఇది చట్టవిరుద్ధం. స్థానికతపై కొత్త రూల్స్ అంటూ వైద్యారోగ్య శాఖ జారీ చేసిన ఈ జీవోను కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం ఇరుపక్షాల వాద నలు వినింది. ప్రస్తుతానికి స్థానికత నిబంధనను పక్క కుపెట్టి దరఖాస్తులు స్వీకరించాలని, తుది తీర్పునకు లోబడి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. -
21, 22 తేదీల్లో ఇంజనీరింగ్ సీట్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల మార్పిడి (స్లైడింగ్)కి ఈ నెల 21, 22 తేదీల్లో అవకా శం కల్పించాలని సాంకేతిక విద్య విభాగం నిర్ణయించింది. స్లైడింగ్ ప్రక్రియను ప్రతీ ఏటా కాలేజీలే చేపట్టేవి. ఈసారి సాంకేతిక విద్య కమిషనరేట్ దీన్ని నిర్వహిస్తోంది.స్లైడింగ్ పేరుతో ప్రైవేటు కాలేజీలు కొన్నేళ్ళుగా సాగిస్తున్న సీట్ల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి. స్లైడింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లను కలుపుకుని స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం మీద ఈ నెలాఖరుకు కౌన్సెలింగ్ ముగించుకుని ఇంజనీరింగ్ క్లాసులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.స్లైడింగ్‌కు 3 వేల సీట్లుజాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. అలాగే తుది దశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. ఈ రకంగా తుది దశ కౌన్సెలింగ్ నాటికి ప్రతీ ఏటా దాదాపు 3 వేల మంది స్లైడింగ్ ద్వారా సీట్లు మారుతుంటారు. కాలేజీలో తుది దశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చిన వాళ్ళు ఈ నెల 17 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇలా చేయని పక్షంలో ఆ సీటును ఖాళీ అయినట్టుగా ప్రకటిస్తారు. విద్యార్థులు సీట్లు రద్దు చేసుకున్నా వాటినీ ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటికే ఆ కాలేజీలో చేరిన విద్యార్థులు నచ్చిన బ్రాంచీలో ఖాళీలుంటే స్లైడింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ప్రైవేటు కాలేజీలు ర్యాంకర్ల చేత తొలి దశలోనే కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా చేసేవి. తుది దశ ముగిసిన తర్వాత సీటు రద్దు చేసుకునేలా చేసేవి. ఈ సీటును స్లైడింగ్ ప్రక్రియలో ఎక్కువ రేటు పెట్టి ఇతర బ్రాంచీల్లో ఉన్నవారికి అమ్ముకునేవి. ఇప్పుడు ప్రభుత్వమే స్లైడింగ్ చేపట్టడం వల్ల ఆ అవకాశం ఉండే వీల్లేదు.స్పాట్లో కంప్యూటర్ సీట్లు కష్టమేఈ ఏడాది కంప్యూటర్, అనుబంధ బ్రాంచీల్లో సీట్లు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. స్పాట్ అడ్మి షన్లలో ఈ సీట్లు పొందే అవకాశాలు తక్కువనే అధికారులు అంటున్నారు. గత ఏడాది సీట్లు పెద్ద ఎత్తున మిగిలిపోయాయి. జేఈఈ కౌన్సెలింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో జాతీయ కాలేజీ ల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో మొదటి, రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత మళ్ళీ రాష్ట్ర కాలేజీలకు దరఖాస్తు చేయలేదు. గత ఏడాది అన్ని బ్రాంచీల్లో కలిపి తుది దశ కౌన్సెలింగ్ తర్వాత 19,154 సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది మాత్రం 5,039 సీట్లు మాత్రమే మిగిలా యి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో 2023లో తుది దశ కౌన్సెలింగ్‌లో 5,723 సీట్లు మిగిలితే... ఈ ఏడాది తుది దశ కౌన్సెలింగ్ నాటికి కేవలం 1,225 సీట్లు మిగిలాయి. ఇవి కూడా మారు మూల ప్రాంతాల కాలేజీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా ఆశించే కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో స్పాట్ అడ్మిషన్లలో పెద్దగా సీట్లు వచ్చే అవకాశం కన్పించడం లేదు. -
సర్కార్ బడికి క్యూ
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి మీ పిల్లలను మా పాఠశాలలో జాయిన్ చేయించాలని తల్లిదండ్రులను కోరుతుంటారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో సీన్రివర్స్గా మారింది. తల్లిదండ్రులే తమ పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ప్రవేశాల కోసం క్యూ కడుతున్నారు. అది ఎక్కడ అనుకుంటున్నారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నతపాఠశాల. ఈ పాఠశాలను మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యాబోధన అందిస్తుండటంతో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పాఠశాలలో 1,208 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలోనే మూడో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలగా దీనికి గుర్తింపు వచ్చింది. 6 నుంచి 10వ తరగతి వరకు.. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికిగాను 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. 6వ తరగతిలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదే పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5వ తరగతి పూర్తి చేసి.. 6వ తరగతి ప్రవేశం కోసం 61 మంది వచ్చారు. ఇంకా 129 సీట్లకు ఇతర పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు 161 సీట్లు ఖాళీగా ఉండగా 630 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. దీంతో ప్రతిభ ఉన్న వారికి అవకాశం కలి్పంచాలనే ఉద్దేశంతో ఈ నెల 13న విద్యార్థులకు ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఇఫ్లూ దత్తతఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్‌కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. 9వ తరగతి విద్యార్థులకు స్పాని‹Ù, ఫ్రెంచ్, స్పోకెన్ ఇంగ్లిష్ నేరి్పస్తున్నారు. 150 మంది విద్యార్థులకు వివిధ భాషలు నేరి్పంచారు. ఈ ఏడాది మరో 150 మందికి నేరి్పంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. గురు, శుక్ర వారాల్లో ఆన్లైన్లో బోధిస్తుండగా, తరగతిగదిలో శనివారం ప్రొఫెసర్లు నేరుగా వచ్చి బోధిస్తున్నారు. విద్యార్థులు ధారాళంగా స్పాని‹Ù, ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుతున్నారు. డ్రామా, స్కిట్లు, సాంగ్స్ కూడా పాడుతున్నారు.రోబోటిక్స్... ఇందిరానగర్ పాఠశాలలో రోబోటిక్స్ విద్యను హైదరాబాద్‌కు చెందిన సోహం అకడమిక్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది. మూడు సంవత్సరాలుగా ప్రతీ ఏడాది 100 మంది విద్యార్థులకు నేరి్పస్తున్నారు. వారంలో రెండు రోజులు క్లాసులు నిర్వహిస్తున్నారు.గర్వపడుతున్నాం.. మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పింస్తుండటంతో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. అందుకు గర్వపడుతున్నాం. విద్యార్థుల తాకిడి పెరగడంతో స్క్రీనింగ్‌కు పరీక్ష పెట్టాం. వీటిలో వచి్చన మార్కులు, వారి కుటుంబపరిస్థితిని బట్టి అడ్మిషన్లు ఇస్తాం. ఈ నెల 20తేదీలోగా ఎంపిక పూర్తవుతుంది. – రాజప్రభాకర్‌రెడ్డి, హెచ్ఎం, జెడ్పీ హైసూ్కల్, ఇందిరానగర్ సీటు కోసం వచ్చాను మా తమ్ముడి భార్య చనిపోయింది. నా మేనల్లుడిని ఇందిరానగర్ స్కూల్లో 6వ తరగతిలో చేరి్పంచేందుకు వచ్చాను. పరీక్ష రాయించాను. ఇందులో చదివితే విద్యావంతుడు అవుతాడని నమ్మకంతో సీటు కోసం తిరుగుతున్నా. – బాలలక్ష్మి, సిద్దిపేటఈ ఏడాది కొత్తగా ఎన్సీసీ ఈ ఏడాది కొత్తగా ఎన్సీసీ ప్రవేశపెట్టారు. కరీంనగర్‌కు చెందిన 9వ బెటాలియన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. 8వ తరగతి నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ⇒ ఈ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీ, కా ర్పొరేట్ కళాశాలలో ఉచిత సీట్లకు ఎంపికవుతున్నారు. 2023–2024 విద్యా ఏడాదిలో 231 మంది పదో తరగతి పరీక్ష రాయగా 229 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇటీవల విడుదలైన పాలిసెట్‌లో వెయ్యిలోపు ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. -
4 ట్రిపుల్ ఐటీలకు 48 వేల దరఖాస్తులు
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన అడ్మిషన్లలో భాగంగా మంగళవారం వరకు 48 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024–25 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు మే 6న విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుంది. ఇంతవరకూ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కింద మరో 400 సీట్లు ఉన్నాయి. మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్ అనుసరించి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి 50 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ట్రిపుల్ఐటీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.జూలై ఒకటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై ఒకటి నుంచి నిర్వహించనున్నారు. సైనిక ఉద్యోగుల పిల్లలకు జూలై ఒకటి నుంచి 3 వరకు, క్రీడా కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 6వ తేదీ వరకు, దివ్యాంగుల కోటా అభ్యర్థులకు జూలై 3న, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా అభ్యర్థులకు జూలై 2, 3 తేదీల్లో, ఎన్సీసీ కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు పరిశీలించనున్నట్లు ట్రిపుల్ ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. -
గుడ్ న్యూస్.. ఇకపై యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) అనుమతించింది. ఈ విషయాన్ని కమిషన్ చైర్పర్సన్ ఎమ్ జగదీష్ కుమార్ మంగళవారం వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు అంటే జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. మే 5న జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రతి సంవత్సరం జూలై-ఆగస్టులో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీనివల్ల భారతదేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు జూలై-ఆగస్టులో ప్రారంభమై మే-జూన్‌లో అకడమిక్ సెషన్‌ను ముగిస్తున్నాయి.గత ఏడాది ఒక అకాడమిక్ సంవత్సరంలో దూరవిద్యలో(ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) విద్యార్థులు జనవరి, జూలైలో రెండుసార్లు ప్రవేశం పొందేందుకు యూజీసీ అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు అయిదు లక్షల మంది విద్యార్థులు మరో విద్యా సంవత్సరం వరకు వేచి ఉండకుండా అదే ఏడాది డిగ్రీలొ చేరడానికి సహాయపడిందని కుమార్ పేర్కొన్నారు. ‘‘మన దేశంలోని యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ కల్పించినట్లయితే అది ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టులో ప్రవేశం పొందలేకపోయిన వారికి ఎంతో దోహదపడుతుంది. రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృథా కాకుండా ఉంటుంది. అటు కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించుకోవచ్చు. తద్వారా పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని యూజీసీ చీఫ్ వెల్లడించారు.రెండుసార్లు ప్రవేశాలు కల్పించడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు తమ ఫ్యాకల్టీ, ల్యాబ్, క్లాస్రూమ్, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని వెల్లడించారు. భారతీయ విద్యా సంస్థలు ఈ విధానం పాటించడం వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా పోటీ ప్రపంచంలో మనం మరింత మెరుగుకావచ్చని, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు ఉంటుందన్నారు.దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది కలిగిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా విద్యాసంస్థల అంతర్గత నిబంధనలను మార్చుకోవాలని సూచించారు. -
బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల..
మంచిర్యాల: ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్‌ఐటీలో నూతన విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి వర్సిటీ అధికారులు సోమవారం ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.rgukt.ac.in వెబ్సైట్లో, ఈమెయిల్ ద్వారా admissions@rgukt.ac.in సందర్శించాలని సూచించారు.ఆరేళ్ల సమీకృత(ఇంటిగ్రేటెడ్) ఇంజనీరింగ్ కోర్సు కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలో.. ఏ కోర్సులు చేయించాలో.. అనే విషయంపై విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువులపైనే ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. తెలంగాణలోనే ఏకై క విద్యాలయ ప్రాంగణాన్ని కలిగి ఉన్న బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులూ తమ పిల్లలను ఇక్కడే చదివించాలనుకుంటున్నారు.గ్రామీణ విద్యార్థులకు వరం..గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్య ను అందించే బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పల్లె విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ సువర్ణ అవకాశంగా మారింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి బాసర ట్రిపుల్‌ఐటీలో ఏటా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి అందులో అర్హత ఉన్నవారిని ఎంపికచేసి సీట్లను కేటాయిస్తుంది. మూడేళ్లక్రితం ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా పాలిసెట్ అర్హతను జోడించి సీట్లను కేటాయించారు. అప్పట్లో కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండడంతో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాలిసెట్ అర్హతను జోడించి సీట్లు కేటాయించారు. ఈ యేడు పాత విధానంలో సీట్లు భర్తీ చేయనున్నారు.వేల సంఖ్యలో దరఖాస్తులు..బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020–21లో 32వేల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 2021–22లో 20,178 మంది, 2022–23లో 31,432 మంది, 2023–24లో 32,635 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.సమీకృత విద్యావిధానం..ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్లపాటు ఇంటర్‌తో పాటు సమీకృత ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. మొదటి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ కోర్సు నేర్పిస్తారు. అనంతరం అందులో మెరిట్ ఆధారంగా మరో నాలుగేళ్ల ఇంజనీరింగ్ సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. పీయూసీ విద్య అనంతరం మెరుగైన అవకాశాలు వస్తే విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఉంది. నాలుగేళ్ల బీటెక్‌లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తున్నారు.మొదటి రెండేళ్ల పీయూసీలో సాధించిన మార్కుల ఆధారంగానే బీటెక్‌లో కోర్సులు కేటాయిస్తారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ అధికారులు అన్ని వసతులను సమకూరుస్తారు. ల్యాప్‌టాప్, అందరికీ ఒకేరకమైన దుస్తులు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ అందిస్తారు. హాస్టల్, భోజన వసతి యూనివర్సిటీయే కల్పిస్తుంది. చదివే విద్యార్థుల కోసం శారీరక, మానసిక వికాసానికి ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు సైతం తరగతులు నిర్వహిస్తున్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి.ఏటా భారీగా దరఖాస్తులు..బాసర ట్రిపుల్‌ఐటీలో చదివేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడడంతోనే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇక్కడ సీటు దక్కించుకునేందుకు ఏటా 30 వేలకు పైగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ చదివేందుకు పోటీపడుతున్నారు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
‘ఐదు’ తప్పి, ఆరులో ప్రమోషన్ కోసం న్యాయపోరాటం
దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఐదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఫెయిల్ కావడంతో ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు ఆ పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ పదేళ్ల బాలుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలల హక్కుల కోసం జరిగిన ఈ పోరాటంలో తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆ బాలునికి మద్దతుగా నిలిచారు. ఈ కేసు అలకనందలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. 2023-24 సంవత్సరంలో 10 ఏళ్ల బాలుడు ఐదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. అయితే సదరు పాఠశాల యాజమాన్యం ఆ బాలుడు ఫెయిలయ్యాడనే విషయాన్ని తెలియజేయకుండా 15 రోజుల వ్యవధిలో తిరిగి అతనికి మరోమారు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఆ బాలుడు ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ బాలుడిని ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది విద్యా చట్టంలోని సెక్షన్ 16(3)ని ఉల్లంఘించడమేనని ఆ బాలుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ బాలుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సి హరిశంకర్ ధర్మాసనం ఆ బాలునికి సిక్స్త్‌లో అడ్మిషన్ కల్పించకపోతే అతని చదువు దెబ్బతింటుందని పేర్కొంది. ఆరో తరగతిలో ఆ బాలుడిని కూర్చోవడానికి పాఠశాల అనుమతిస్తే, అది పాఠశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని వ్యాఖ్యానించింది. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సదరు ప్రైవేట్ స్కూల్‌తో పాటు విద్యా డైరెక్టరేట్‌ను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 4న జరగనుంది. తన ఫెయిల్యూర్ గురించి స్కూల్ తనకు తెలియజేయలేదని కోర్టులో పిటిషన్ వేసిన బాలుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు రెండు నెలల సమయం కావాలని కోరాడు. దీంతో సదరు పాఠశాల యాజమాన్యం రెండు నెలల తరువాత ఆ విద్యార్థికి తిరిగి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది. -
పది పరీక్ష రాశారా? మా కాలేజీలో చేరండి
‘హలో.. నమస్కారమండి.. మీ పాప/బాబు పదో తరగతి అయిపోయింది కదండి.. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు.. మాది కార్పొరేట్ కాలేజ్. ఐఐటీ.. మెయిన్స్.. అడ్వాన్స్.. ఏసీ.. నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లున్నాయి. ఇప్పుడు జాయిన్ అయితే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం.. రిజల్ట్స్ వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి.. మీ ఇష్టం.. ఆలోచించుకొండి..’ ఇది జిల్లాలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్. ఇలా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకొని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి. ఆదిలాబాద్‌టౌన్: తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ నాలి చేసైనా మంచి కళాశాలలో చదివించాలనే ఆ లోచనలో ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. అందించేది అరకొర విద్యే అ యినప్పటికీ.. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రౌచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులు సైతం అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫలితాలు రాక ముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునేలా.. ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్వోలు వి ద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజ మాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధన ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వరాదు. కానీకాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈవిధంగా వ్యవహరిస్తున్నా యి. హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకు పీఆర్వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళా శాలల్లో ఇచ్చే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, తదితర విషయాలను వివరిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. టార్గెట్ పెడుతూ.. కొన్ని యాజమాన్యాలు పీఆర్వోలను ప్రత్యేకంగా ని యమించుకొని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నా యి. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటీవ్లు సైతం అందజేస్తున్నాయి. మరోవైపు సంబంధి త కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర అ ధ్యాపకులు, సిబ్బంది తప్పకుండా ప్రతి ఒక్కరు 25 చొప్పున ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. ప్రవేశాలు చేసిన వారికి మాత్రం ఇన్సెంటీవ్, కొంత కమీ షన్ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్ కళాశాలకు రూ.5వేల వరకు, హాస్టల్ క్యాంపస్ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2500 అందజేస్తున్నా రు. కాగా, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నది కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 13 మోడల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబాపూలే, ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు 45 ప్రైవేట్ కళాశాలలు 14 భారీగా ఫీజులు.. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌కు సంబంధించి జిల్లా నుంచి ఏటా వెయ్యి నుంచి 2వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఐఐటీ, నీట్, ఏసీ సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో ఏడాదికి రూ.3లక్షలు, సాధారణ చదువుకు రూ.1లక్ష 50వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు సైతం రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కారు కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నాం. స్కాలర్షిప్ కూడా పొందవచ్చు. – రవీంద్రకుమార్, డీఐఈవో -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం దరఖాస్తు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించామని తెలిపారు. ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చని.. విద్యాభ్యాçÜం అంతా ఆంగ్లంలోనే ఉంటుందన్నారు. WWW.cse.ap.gov.in/apms.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్‌ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్‌పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్‌కు లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్‌ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్‌ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
పీజీపై తగ్గుతున్న క్రేజ్
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఉన్న సీట్లలో కనీసం సగం భర్తీ అవ్వడం కూడా కష్టంగా ఉంది. డిగ్రీలో బీకాం వరకూ అత్యధిక ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులు ఎంకామ్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. పీహెచ్డీ స్థాయి వరకూ వెళ్ళాలనుకునే వాళ్లు ఎంఎస్సీ కోర్సును ఎంచుకుంటున్నారు. ఇక బీఏ కోర్సుల్లో చేరే వాళ్ళే తక్కువగా ఉంటుంటే, ఎంఏ వరకూ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంకా తక్కువ. గ్రూప్స్, సివిల్స్ రాయాలనుకునే విద్యార్థులు మాత్రమే ఇటువైపు వెళ్తున్నారు. ఈ మూడు ప్రధాన కోర్సులకు కలిపి రాష్ట్రంలో 50 వేల కన్వినర్ కోటా సీట్లు ఉంటే, గడచిన విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు కేవలం 20,484 మంది మాత్రమే. అంటే కేవలం 40.96 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ పరిస్థితికి కారణమేంటి? ఇంటర్ తర్వాత ఎక్కువ శాతం ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనే భావిస్తున్నారు. ఇంజనీరింగ్ తర్వాత ఏదైనా ప్రైవేటు కంపెనీల్లో స్థిరపడొచ్చని, లేదా విదేశీ విద్యకు వెళ్లచ్చని ఆలోచిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే, వీరిలో 90 వేల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 20 వేల మంది ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్ వర్శిటీల్లోకి వెళ్తున్నారు. 40 వేల మంది వరకూ ఇంటర్‌తో విద్య ముగించి ఏదో ఒక వృత్తి, ఉద్యోగంలో స్ధిరపడుతున్నారు. ఇక బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా 2.20 లక్షల వరకూ ఉంటోంది. ఇందులోనూ కంప్యూటర్ నేపథ్యం ఉన్న బీకాం, ఆనర్స్ బీఏ వంటి కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉన్న పరిజ్ఞానంతో ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. బీఎస్సీ చేసిన విద్యార్థులు కూడా ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల వైపు చూస్తున్నారు. పోస్టు–గ్రాడ్యుయేట్ చేసినా పెద్దగా ఉద్యోగాలు ఉండవనేది యువతలో ఉన్న అభిప్రాయం. లెక్చరర్‌గా వెళ్ళేందుకు మాత్రమే ఇది తోడ్పడుతుందనే భావన ఉంది. దీంతో డిగ్రీ చేసినా పీజీకి వెళ్ళడం లేదని ఇటీవల యూజీసీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. పీజీలోని ప్రధాన కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు ... కొత్త కోర్సులైనా అంతేనా? పీజీ కోర్సులు నిర్వీర్యం అవ్వడం వల్ల దేశంలో పరిశోధన శక్తి పడిపోతోందని యూజీసీ హెచ్చరిస్తోంది. పీజీ వరకూ విద్యార్థులు వెళ్ళేలా అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలని పేర్కొంటోంది. ఇందులో భాగంగానే ఎంఎస్సీ డేటా సైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ వంటి కోర్సుల్లో మార్పులు చేశారు. సరికొత్త సిలబస్‌ను జోడించారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు. అయినప్పటికీ పెద్దగా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. పీజీలో మొత్తం 48 కోర్సులుంటే, వాటిలో జాగ్రఫీ, ఎంపీఎడ్, టూరిజం, లైబ్రరీ సైన్స్, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ కోర్సుల్లో ప్రవేశాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఎంకాం, ఎమ్సెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఎన్ని మార్పులు చేసినా ఫలితం ఉండటం లేదు. స్టాటిస్టిక్స్‌లో గత ఏడది 417 సీట్లుంటే, కేవలం 358 మంది చేరారు. ఏంఏ రాజనీతి శాస్త్రంలో 639 మంది చేరారు. ఎమ్మెస్సీ మేథ్స్‌లో 1445కు మించి చేరలేదు. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే వాళ్ళల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటున్నారు. దీంతో పరిశ్రమల భాగస్వామ్యంతో పీజీ కోర్సులు నిర్వహించాలని యూజీసీ సూచిస్తోంది. పీజీ తర్వాత పరిశోధన రంగానికి పీజీ విద్యార్థులు వెళ్ళే సరికొత్త విధానంపై కసరత్తు చేయాలని సూచించింది. దీనిపై వచ్చే విద్యా సంవత్సరంలోగా సరికొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని యూజీసీ భావిస్తోంది. ఉపాధి వైపే యువత మొగ్గు డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌తోనే ఏదో ఒక ఉపాధి వైపు వెళ్ళాలని యువత భావిస్తోంది. పీజీ కోర్సుల తర్వాత ఉద్యోగాలు పెద్దగా ఉండవనే భావన కూడా పీజీ ప్రవేశాలు తగ్గడానికి కారణం. పీజీలో అనేక మార్పులకు అడుగులు పడుతున్నాయి. భవిష్యత్‌లో పీజీ అవసరం అన్న భావన విద్యార్థుల్లో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
టెన్త్, ఇంటర్లో భారీగా ‘రీ అడ్మిషన్లు’
సాక్షి, అమరావతి: గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్’ అవకాశాన్ని భారీ సంఖ్యలో వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో చేరిన రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో నూరు శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) సాధనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్ తప్పినవారికి రాష్ట్ర ప్రభుత్వం పునర్ ప్రవేశ అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి, ఆయా విద్యార్థులను తిరిగి ఎన్రోల్ చేశారు. దాంతో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది, ఇంటర్లో 90,251 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పినవారు తిరిగి ఫీజు కట్టి పరీక్షలు రాస్తే (సప్లిమెంటరీ) వారిని ‘ప్రైవేటు’ విద్యార్థులుగా పరిగిణిస్తారు. కానీ.. రీ అడ్మిషన్ తీసున్న వారిని ‘రెగ్యులర్’ విద్యార్థులుగానే పరిగణిస్తారు. ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. ఆయా తరగతుల్లో రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఫెయిలైన సబ్జెక్టులు మాత్రమే కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పబ్లిక్ పరీక్షల్లో అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మార్కులను పరిశీలించి, ఆయా సబ్జెక్టుల్లో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అంతిమంగా లెక్కలోనికి తీసుకుంటారు. ఉదాహరణకు ఓ విద్యార్థి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫెయిలై, ఇప్పుడు రీ అడ్మిషన్ తీసుకుంటే.. గతేడాది మ్యాథ్స్ పేపర్లో 70 మార్కులు వచ్చాయనుకుంటే.. ఈ ఏడాది పరీక్షల్లో అదే పేపర్ 30 మార్కులే వస్తే.. గత ఏడాది వచ్చిన 70 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే.. అన్ని సబ్జెక్టులు పాసైన రీ అడ్మిషన్ విద్యార్థుల సర్టీఫికెట్లపై ప్రైవేట్/కంపార్ట్మెంటల్/స్టార్ గుర్తు వంటివి లేకుండా ‘రెగ్యులర్’ అని గుర్తింపు ఇస్తారు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తింపజేశారు. ఒక్కసారే అవకాశం ఓ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన వారికి మరుసటి సంవత్సరం మాత్రమే రీ అడ్మిషన్‌తో పాటు అన్ని రెగ్యులర్ ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు రెండో ఏడాదీ ఫెయిలైతే వారికి మరో అవకాశం ఉండదు. వారు ప్రైవేటుగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 2022–23లో ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫెయిలై తిరిగి రెగ్యులర్ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరానికి గాను వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు. వీరు ఈ విద్యా సంత్సరంలో అన్ని సబ్జెక్టులు పాసైతే ‘రెగ్యులర్’ సర్టీఫికెట్ అందుకుంటారు. ఫెయిలైతే తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిందే. -
హార్టీకల్చర్ కోర్సులో ప్రవేశాలకు కౌన్సెలింగ్
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని 11 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హార్టీసెట్–2023లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీఎస్సీ హార్టీకల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో జరిగిన ఈ కౌన్సెలింగ్‌కు 300 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ టి.జానకీరామ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యాన విద్యకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. వర్సిటీ పరిధిలోని నాలుగు ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు, ప్రైవేటు యాజమాన్యంలోని నాలుగు అనుబంధ ఉద్యాన కళాశాలల్లో హార్టీసెట్ ద్వారా బీఎస్సీ హార్టీకల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి మొత్తం 92 సీట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యాన కళాశాలల్లో 52 సీట్లు, ప్రైవేటు ఉద్యాన కళాశాలల్లో 40 సీట్లకు ఈ కౌన్సెలింగ్ జరిగింది. -
టెన్త్ ఫెయిలైన 88,342 మంది తిరిగి బడికి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉన్నత విద్య చదవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. అందుకే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారు. పలు సంస్కరణలు తెచ్చారు. అందులో భాగమే టెన్త్ ఫెయిలైన విద్యార్థులను తిరిగి స్కూళ్లలో ఎన్రోల్ చేయించి తరగతులకు పంపడం. వారు పదో తరగతి ఫెయిలైన తర్వాత చదువు మానేయకుండా ఈ చర్యలు చేపట్టారు. మధ్యలో చదువు మానేస్తే పిల్లల భవిష్యత్తు అస్తవ్యస్తమవుతుంది. దీంతో వారిని తిరిగి తరగతులకు పంపుతున్నారు. తిరిగి పదో తరగతిలో చేరిన వారికి విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ప్రభుత్వం అందిస్తోంది. గత విద్యా సంవత్సరంలో 1.23,680 మంది విద్యార్థులు టెన్త్ ఫెయిలయ్యారు. వారు తిరిగి స్కూల్స్‌లో చేరారా లేదా అనే వివరాలన్నింటినీ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల ద్వారా ప్రత్యేక ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో ప్రభుత్వం సేకరించింది. వారిలో 88,342 మందిని ఇప్పటివరకు తిరిగి పదో తరగతిలో ఎన్రోల్ చేయించింది. ఇప్పుడు ఈ విద్యార్థులంతా తిరిగి తరగతులకు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సమీక్షించారు. అదనంగా చేరికలు గత విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 1,26,212 మంది అదనంగా చేరారు. గత విద్యా సంవత్సరంలో టెన్త్‌లో 6,64,511 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 7,90,723 మంది ఎన్రోల్ అయ్యారు. అందరినీ బడిబాట పట్టించడంతో పాటు ఆ పిల్లలందరూ డిగ్రీ వరకు చదివేలా సూక్ష్మస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేయడమే ఇందుకు కారణమని అధికారులు వెల్లడించారు. పాస్ అయిన విద్యార్ధులు అంతటితో చదువు ఆపేయకుండా తదుపరి కోర్సుల్లో చేరుతున్నారా లేదా అనే వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో సేకరిస్తోంది. చదువు ఆపేసిన వారిని పై తరగతుల్లో చేరేలా ప్రోత్సహిస్తోంది. ప్రతి పేద విద్యార్ధి ఆరి్థక స్థోమత లేక మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా రాస్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, నాడు–నేడు కార్యక్రమాలన్నీ విద్యార్ధులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే పథకాలే. -
మరింత సులభంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్థారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగకూడదని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పలు శాఖలు ప్రత్యేకంగా వీటిని అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు లేని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుంది. ఆ శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాలి. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని నిర్దేశించారు. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తీసుకుంటారని తెలిపింది. ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్ టైమ్‌లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది. ఆరు దశల ధ్రువీకరణ ఇలా.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆరు దశల్లో దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆధార్ కార్డు, ఇతర వివరాల ద్వారా ఆ వ్యక్తికి ఉన్న భూమి, మున్సిపల్ ఆస్తి, 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు, వారు వినియోగించే విద్యుత్ యూనిట్లను పరిశీలిస్తారు. వీటి ద్వారా వారి ఆరి్థక స్థితిని నిర్ధారిస్తారు. -
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు
చేర్యాల(సిద్దిపేట): వసతి గృహంలో హాయిగా చదువుకోవలసిన విద్యార్థులు వంట పనివారిగా మారి చపాతీలు తయారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారంలో చపాతీలు అందించాల్సి ఉంటుంది. కానీ వాటి తయారీకి సరిపడా మనుషులు లేకపోవడంతో విద్యార్థులతో చేయించారు. ప్రిన్సిపాల్ సహకారంతోనే కాంట్రాక్టర్ ఇలా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గురుకుల ప్రిన్సిపాల్ అశోక్‌బాబు వద్ద ప్రస్తావించగా.. తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందని స్పష్టం చేశారు. అందువల్లే విద్యార్థులతో వంట పని చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
21 నుంచి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. -
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ జనన ధ్రువీకరణ పత్రమే (Birth Certificate) ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా పరిగణించబోతోంది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డ్ (Aadhaar Card), వోటర్ కార్డులకు దరఖాస్తు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులకు బర్త్ సర్టిఫికెట్‌ను ఏకైక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు. ఈమేరకు సవరించిన కొత్త చట్టం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023ను పార్లమెంట్ గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. "జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తోంది" అని కేంద్ర హోం శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. జనన,మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అమలులోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించినవారు పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి చట్టం అనుమతిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, వివాహ నమోదు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వయంప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా సమర్పించవచ్చు. (వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..) ఈ చట్టం ప్రకారం.. నమోదిత జనన, మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉంది. చీఫ్ రిజిస్ట్రార్లు (రాష్ట్రాలచే నియమించిన), రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంతాల్లో రాష్ట్రాలచే నియమించిన) జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్‌తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు. ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర స్థాయిలో ఇలాంటి డేటాబేస్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమో దు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులు శాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం
విజయనగరం ఫోర్ట్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/నంద్యాల టౌన్/కోనేరుసెంటర్/ఏలూరు టౌన్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కళాశాలల్లో శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లాలోని గాజులరేగ వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల ప్రారంభించారు. అమె మాట్లాడుతూ..మొదటి ఏడాది విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాలలో అందుబాటులో ఉన్న 150 సీట్లలో ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు చేరారని, మరో 34 సీట్లు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మీ హాజరయ్యారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఫేజ్ 1,2 లలో 120 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసి ప్రవేశాలు కల్పించారు. తొలిరోజు తరగతులకు 70 మంది హాజరయ్యారు. నంద్యాలలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల హాజరు నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 2023–24 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల్లో 222 మంది భోదన, భోదనేతర సిబ్బందితో, 150 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 150 సీట్లకుగానూ ఇప్పటివరకూ 113 మంది విద్యార్థులు చేరారు. కళాశాలకు 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 17 మంది సీనియర్ రెసిడెంట్లు, ఇతర సిబ్బందిని నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన 112 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఏపీ వైద్యవిద్య అదనపు డైరెక్టర్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో విద్యాభ్యాసంకోసం వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం యూఎస్ కాన్సులేట్ పలు సూచనలు చేసింది. అమెరికాలో చదువు, ఆపై ఉద్యోగం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వెళ్తున్న విషయం విదితమే. అమెరికా వెళ్లే విద్యార్థులు ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా పొందాలి? యూనివర్సిటీల ఎంపిక ఎలా? వీసా దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వీసా ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధం కావాలన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి టీవీ, సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా చీఫ్ ఎమ్మి, యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రాంతీయ అధికారి సుజనా మైరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లార్సెన్ మాట్లాడుతూ, అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వారిలో తెలుగువారు కూడా ఉన్నారని, అమెరికాలో చదువుకుని స్థిరపడే వారి సంఖ్య ప్రతీయేటా పెరుగుతోందని ఆమె వివరించారు. వీసాల మంజూరులో... యూఎస్ వెళ్లే వారికి వీసా మంజూరులో ఆలస్యమవుతోందన్న ప్రశ్నకు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా చీఫ్ ఎమ్మి సమాధానమిస్తూ వీసాల జారీని సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వారికి అనుకున్న సమయంలోనే వీసా ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు. స్లాట్లు విడుదలకాగానే బుక్ చేసుకోవాలని, వీసాకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధ్రువపత్రాలు చెక్ చేసిన తర్వాత, ఫింగర్‌ప్రింట్స్‌ను నమోదు చేసి, అన్ని సక్రమంగా ఉన్నాయని చెక్ చేసిన వెంటనే వీసాను మంజూరు చేస్తున్నామని వివరించారు. వీసా స్లాట్ల బుకింగ్ కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా నాలుగు యూఎస్ కాన్సులేట్స్‌లో అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. ఉచితంగా ఎడ్యుకేషన్ ఫెయిర్.. అమెరికాలో చదవాలనే విద్యార్థులకు ఉచితంగా ‘స్టడీ ఇన్‌ద యూఎస్ యూనివర్సిటీ ఫెయిర్’ నిర్వహిస్తున్నట్లు యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రీజనల్ ఆఫీసర్ సుజనా మైరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని నొవాటెల్ కన్వెన్షన్‌లో ఆగస్ట్ 26 ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఫెయిర్ నిర్వహిస్తామని, విద్యార్థుల అనుమానాలన్నింటినీ ఉచితంగా నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. మరిన్ని వివరాలకు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.యూఎస్ఐఈఎఫ్.ఓఆర్జీ.ఐ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. అమెరికాలో 4,700 యూనివర్సిటీలు ఉన్నాయని, ఈనెల 26న నిర్వహించే ఫెయిర్‌కు 40 ప్రముఖ యూనివర్సిటీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రశ్నలకు యూనివర్సిటీ ప్రతినిధులు సమాధానమిస్తారన్నారు. ఫేక్ యూనివర్సిటీల వివరాలు ఎలా కనుక్కోవాలి? ఫేక్ యూనివర్సిటీల వివరాలు ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నకు సుజనా సమాదానమిస్తూ... అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని యూనివర్సిటీల వివరాలను అధికారికంగా వెబ్సైట్లలో ఉంచుతుందని చెప్పారు. జాయిన్ కావాలనుకున్న యూనివర్సిటీ వివరాలు వెబ్సైట్లో ఉన్నాయో లేదో విద్యార్థులు చెక్ చేసుకోవాలన్నారు. విద్యకు సంబంధించి అమెరికాకు చెందిన 8 కేంద్రాలు ఇండియాలో ఉన్నాయని.. వీటిలో సంప్రదించినా గుర్తింపు పొందిన యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. -
ప్రైవేటు మాయకు చెక్ పెట్టండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను చేర్చుకుని కూడా ఇంటర్ బోర్డ్‌కు ప్రవేశాలు చూపని ప్రైవేటు కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27లోగా ప్రతి విద్యార్థి అడ్మిషన్ వివరాలను పంపేలా జిల్లా ఇంటర్ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ‘ఇంటర్ లెక్కల్లో కాలేజీల మాయ’ శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించా రు. 2లక్షల మంది టెన్త్ పాసయిన విద్యార్థులు ఎక్కడ చేరారు? వారి వివరాలు తెలియజేయాలని ఆమె అధికారు లను కోరారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులు చేరినా, వాటి డేటా ఇంటర్ బోర్డ్‌కు చేరలేదనే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులతో చర్చించారు. పనులు పూర్తికాకపోతే ఎలా: సబిత రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశా లల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి సబిత అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని నవీన్ మిత్తల్‌కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాలకోసం, ల్యాబ్‌ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారంలోగా పుస్తకాలు అందాలి విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయ డానికి ఆర్టీసీపైనే ఆధారపడకుండా ప్రయివేట్ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరేవిధంగా చర్యలు చేపట్టా లని ఆదేశించారు. మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా అన్ని వనరులు ఉండి కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదన్నారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వివిధ జిల్లాల ఇంటర్ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. డేటా పంపకపోతే విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీకి జరిమానా ఈ నెల 27లోగా ప్రైవేటు కాలేజీల్లో చేరిన విద్యార్థుల డేటా పంపాలని, అలా చేయకుండా తర్వాత పంపితే నెలాఖరు వరకూ ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీపై జరిమానా విధించాలని బోర్డ్ అధికారులకు మిత్తల్ సూచించారు. ఆ గడువు కూడా దాటితే విద్యా ర్థికి రూ. వెయ్యి చొప్పున కాలేజీపై జరిమానా విధించా లని తెలిపారు. ఆఖరి నిమిషం వరకూ వేచి చూసి ఆ తర్వాత సెక్షన్లు పెంచుకోవడం, ఒక క్యాంపస్‌లో ప్రవే శాలు, మరో క్యాంపస్‌లో అడ్మిషన్లు చేపట్టే ప్రైవేటు కాలేజీలపై నిఘా పెట్టాలని, ఇలాంటి చర్యలకు పాల్ప డే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నని, అవసరమైతే సదరు కాలేజీ అనుమతి కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని జిల్లా అధికారు లను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆదేశించారు. -
పారదర్శకంగా వైద్యవిద్య అడ్మిషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో 2023–24 సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లు పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వీసీ డాక్టర్ కోరుకొండ బాబ్జి తెలిపారు. అందుకు సంబంధించి అడ్మిషన్స్ విభాగం వారితో కలిసి మూడుసార్లు మాక్ ట్రయల్ నిర్వహించామన్నారు. యూనివర్సిటీ పరిధిలోని సీట్లు, అడ్మిషన్ల ప్రక్రియ వంటి అంశాలను గురువారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. తెలంగాణ జీవోపై నిర్ణయం.. 2014 జూన్ రెండు తర్వాత తెలంగాణలో కొత్తగా వచ్చిన వైద్య కళాశాలల్లోని యూజీ సీట్లలో 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇచ్చేది లేదని అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో మంజూరైన ఎంబీబీఎస్ సీట్లతో పాటు, పీజీ సీట్లు కూడా అన్ రిజర్వుడ్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు నిలిపివేసే విషయంలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,109 సీట్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 15 శాతం ఆలిండియా కోటాలో పోగా, మిగిలిన సీట్లకు ఇక్కడ అడ్మిషన్లు జరుపుతామన్నారు. 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,000 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వాటిలో 50 శాతం.. 1,500 సీట్లను ఏ కేటగిరిలో భర్తీ చేస్తామని వీసీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి డైనమిక్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చిందని వీసీ తెలిపారు. ఏపీ, తెలంగాణలకు విభజన ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి నూతన విధానాన్ని అనుసరిస్తామని కేంద్రానికి చెప్పినట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పీజీ, యూజీ అడ్మిషన్లు నిర్వహిస్తామని వివరించారు. -
గురుకుల సీటుకు సిఫారసు కట్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురు కుల విద్యాసంస్థల్లో సిఫారసు లేఖలకు కాలం చెల్లింది. గురు కులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగి శాక మిగులు సీట్ల భర్తీలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫా రసు లేఖలను ఏమాత్రం పరిగణ నలోకి తీసుకో రాదని... కేవలం మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. గత నెలలో ప్రవే శాల ప్రక్రియను ప్రారంభించిన గురుకుల సొసై టీలు తొలివిడత కౌన్సెలింగ్ చేపట్టి సీట్లు పొందిన విద్యార్థులకు గడువులోగా నిర్దేశిత విద్యాసంస్థల్లో రిపోర్టు చేయాల్సిందిగా స్పష్టం చేశాయి. మెజారిటీ విద్యార్థులు ఆయా సంస్థల్లో చేరగా మిగులు సీట్లకు సంబంధించి మరో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారని ఆశావహులు భావించారు. కానీ గురుకుల సొసైటీలు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేయలేదు. మరోవైపు అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమవగా బోధన సైతం వేగంగా కొనసాగుతోంది. మెరిట్‌కే పరిమితం...: రాష్ట్రంలో ఐదు గురుకుల విద్యాసంస్థల సొసైటీలు న్నాయి. మహాత్మా జ్యోతిభాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం పాఠశాల విద్యాశాఖ పరిధిలో కొనసాగుతోంది. ఐదు సొసైటీల పరిధిలో 1005 పాఠశాలలు, కళాశాలలున్నాయి. వాటిలో ఐదో తరగతి అడ్మిషన్లతోపాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు, ఇంటర్ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్‌కు ఏటా అడ్మిషన్లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల పరిధిలో ఐదో తరగతికి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మిగతా తరగతులకు మాత్రం సొసైటీలు వేరువేరుగా ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తాయి. -
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీఆర్గనైజషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేసింది. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు 85శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ఎంబిబిఎస్ సీట్లు పొందేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది తెలంగాణ ప్రభుత్వం. నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. చదవండి: సీఎం కేసీఆర్ టూర్.. ఎస్సై గంగన్నతో మామూలుగా ఉండదు మరి! తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. ఇందులో 15శాతం అన్ రిజర్వుడు కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇదే విధానం కొనసాగితే, పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 1820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి. 1820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో సమానం. ప్రతి ఏటా కాలేజీలు పెరిగినా కొద్ది ఈ సీట్ల మరింత పెరగనుంది. కొత్త మెడికల్ కాలేజీలలో అల్ ఇండియా కోట 15% సీట్లు యధాతదం గా ఉంటాయి. దీనిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు. తెలంగాణ విద్యార్థుల డాక్టర్ కల సాకారం దిశగా.. తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏండ్ల కాలం నుంచి వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలు సీఎం కేసీఆర్ ఆలోచనతో అమలు చేస్తున్న నిర్ణయాలు దగ్గర చేస్తున్నాయి. తెలంగాణ సోయితో ఆలోచించిన ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1820 మెడికల్ సీట్లు వచ్చేలా చేసింది. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ వైద్యారోగ్య రంగం గణనీయమైన వృద్ది సాధించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
US: యూనివర్సిటీల్లో ఆ రిజర్వేషన్లపై నిషేధం
వాషింగ్టన్ డీసీ: అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు అడ్మిషన్ విధానాల్లో జాతి, తెగ పదాలను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇకపై ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. ఆ పదాలను నిషేధిస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 👨⚖️ ఈ మేరకు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆ సంచలన తీర్పు చదువుతూ.. ఒక స్టూడెంట్ను అతని అనుభవాల ఆధారంగా పరిగణించబడాలిగానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత అడ్మిషన్లు కొనసాగడానికి వీల్లేదు అంటూ తీర్పు కాపీని చదివి వినిపించారాయన. 👉 అమెరికాలో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యాసంస్థలు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC)ల్లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత కోరుతూ ఓ విద్యార్థి సంఘం వేసిన పిటిషన్ ఆధారంగా అమెరికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 👉 ఒకప్పుడు అఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష కొనసాగేది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో వాళ్లకు అవకాశాలు దక్కేవి కావు. 👉 అయితే.. 1960లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా యూనివర్సిటీలలో నల్ల జాతి పౌరులకు,ఇతర మైనారీటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో పలు నూతన విధానాలు తీసుకొచ్చారు. 👉 అయితే.. జాతి సంబంధిత అడ్మిషన్ విధానాల వల్ల సమానత్వానికి తావు లేకుండా పోయిందని, పైగా మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరం అవుతున్నాయని సదరు గ్రూప్ సుప్రీం ముందు వాదించింది. 👉 నల్లజాతి అమెరికన్లకు చోటు కల్పించేందుకు ఆసియన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్నది ప్రధాన అభ్యంతరం చాలా కాలంగా కొనసాగుతోందక్కడ. 👨⚖️ తాజాగా.. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని 6-3 న్యాయమూర్తుల మెజార్టీ సదరు రెండు యూనివర్సిటీలలో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ట్రంప్ తప్పా అంతా ఆగ్రహం యూనివర్శిటీ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై నిషేధం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారాయన. అమెరికాలో వివక్ష ఇంకా మనుగడలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. జాతుల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు తుది నిర్ణయం కాదంటూ ప్రధానంగా ప్రస్తావించారాయన. The odds have been stacked against working people for too long – we cannot let today's Supreme Court decision effectively ending affirmative action in higher education take us backwards. We can and must do better. pic.twitter.com/Myy3D5jUGH — President Biden (@POTUS) June 30, 2023 సుప్రీం తీర్పు.. భవిష్యత్తు తరాలకు అవకాశాలను నిరాకరించడమే అవుతుందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అభిప్రాయపడ్డారు. తీర్పును వర్ణాంధత్వం అంటూ అభివర్ణించిన ఆమె.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడమే అంటూ తీవ్రంగా వ్యతిరేకించారామె. Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation. Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d — Vice President Kamala Harris (@VP) June 29, 2023 రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాల పేరిటే ఈ విధానాలు తెరపైకి వచ్చాయని.. తద్వారానే తాను, తన భార్య మిచెల్లీ లాంటి వాళ్లం వృద్ధిలోకి వచ్చామని అంటున్నారాయన. ఆ విధానాలు తెచ్చిన ఉద్దేశ్యాన్ని న్యాయవ్యవస్థ గుర్తించి ఉంటే బాగుండేదని అంటున్నారాయన. Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table. In the… https://t.co/Kr0ODATEq3 — Barack Obama (@BarackObama) June 29, 2023 ట్రంప్ మాత్రం ఇలా.. ఇది గొప్ప శుభదినం అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ సైతం ఉంచారు. అమెరికాకు ఇది గొప్ప రోజు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన.. ఆశించిన తీర్పు. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్‌సోషల్‌లో పోస్ట్ చేశారాయన. -
ఒంటిమామిడి..నిల‘బడి’oది!
అది నగరానికి దగ్గరగా ఉన్న గ్రామం. ఊరు మొత్తం రైతు కుటుంబాలు. పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలని వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. విద్యార్థులెవరూ లేకపోవడంతో ఊర్లోని సర్కారు బడి మూతబడింది. ఒకసారి రాలేగావ్ సిద్ధి నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పిన మాటలు వారిలో ప్రేరణ రగిలించాయి. ప్రైవేట్ స్కూళ్లకు కట్టే డబ్బులతో మన ఊరి పాఠశాలను తెరిపించుకోవాలనుకుని నిశ్చయించుకుని స్కూల్‌ను తెరిపించుకున్నారు. ఇప్పుడు ఆ పాఠశాల.. నో అడ్మిషన్ బోర్డు పెట్టేవరకు చేరుకుంది. ఇదీ.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి పాఠశాల విజయగాథ. – సాక్షి, వరంగల్ డెస్క్ మూతబడినా... ఒంటిమామిడి గ్రామస్తులందరూ తమ పిల్లలను వరంగల్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. 2005లో విద్యార్థుల సంఖ్య జీరోకు చేరుకోవడంతో పాఠశాల మూతపడింది. 2014–15లో ఆ గ్రామం నీటి సంరక్షణలో రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రామస్తులు మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి గ్రామానికి వెళ్లి నీటి సంరక్షణలో అన్నా హజారే చేపడుతున్న చర్యలను గమనించారు. వాటిని గ్రామస్తులకు వివరించేందుకు కంపచెట్లతో నిండిపోయిన ఆ పాఠశాల ఆవరణను శుభ్రం చేసి సమావేశమయ్యారు. రాలేగావ్‌సిద్ది నుంచి వచ్చిన ఓ వక్త మాట్లాడుతూ నీటి సంరక్షణలో మీ గ్రామం బేషుగ్గా ఉంది.. మరి మీ పాఠశాల ఎందుకు మూతపడింది అన్న మాటలు గ్రామస్తులను ఆలోచనలో పడేశాయి. దీంతో ఎంతమంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారో సర్వే చేశారు. 270 మంది పిల్లలు ఏటా చదువు కోసం రూ.35 లక్షలు కడుతున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఆ డబ్బులో కొంత మన పాఠశాల నిర్వహణకు పెట్టుకుని తెరిపించుకుందామని గ్రామసభలో తీర్మానం చేశారు. దీన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అనుమతి ఇచ్చారు. దీంతో పాఠశాల 270 మంది విద్యార్థులతో పునఃప్రారంభమైంది. తర్వాత టెన్త్ వరకు అనుమతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 496 మంది విద్యార్థులు ఉన్నారు. అయినా 9 మంది ఎస్జీటీలే ఉండటంతో మరో 11 మంది ప్రైవేట్ టీచర్లను పెట్టుకుని పాఠశాలను నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందంగా ఫీజు చెల్లింపు పాఠశాల నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఏడాదికి కొంత ఫీజు రూపంలో విరాళం ఇస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులు సంవత్సరానికి రూ.5 వేలు, హైసూ్కల్ విద్యార్థులు రూ.6 వేలు ఇస్తుంటారు. ప్రైవేట్‌గా పెట్టుకున్న టీచర్లకు నెలకు రూ.2.20 లక్షలు వేతనం చెల్లిస్తుండటం గమనార్హం. పాఠశాల నిర్వహణలో చైర్మన్ పొన్నాల రాజు ఆధ్వర్యంలోని 24 మంది సభ్యులున్న పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఇక్కడ ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులు ఇన్‌చార్జీలుగా ఉంటారు. ఆ తరగతికి సంబంధించి అన్ని అంశాలను వారే చూసుకుంటారు. పాఠశాల ప్రత్యేకతలివీ.. ♦ ప్రతి తరగతి గది సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ♦ మధ్యాహ్న భోజనం వండేందుకు ముగ్గురు వంట మనుషులను పెట్టి ఒక్కొక్కరికి రూ.4,500 వేతనం ఇస్తున్నారు. ♦ ముగ్గురు స్కావెంజర్లను నియమించుకున్నారు. ♦ మంచినీటి కోసం ప్రత్యేకంగా వాటర్ ప్లాంట్‌ఏర్పాటుచేశారు. ♦ అన్ని హంగులతో డీజీ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్‌ల్యాబ్, లైబ్రరీ ♦ ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహణ ♦ మండలంలో టెన్త్‌లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన ఏకైక పాఠశాలగా గుర్తింపు పొందింది. పలువురు విదేశీయులు పాఠశాలను సందర్శించారు. ఏకతాటిపై నిలబడ్డాం గ్రామస్తులందరం ఒక్కతాటిపై నిలబడి పాఠశాలను నిలబెట్టుకున్నాం. పిల్లలు బాగా చదువుతున్నారు. ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంతో ఉంది. కానీ ఇప్పుడు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు టీచర్లు లేరు. రేషనలైజేషన్, బైఫర్కేషన్ కాలేదని స్కూల్ అసిస్టెంట్లను ఇవ్వడం లేదు. ఐదు అదనపు తరగతి గదులు కావాలి. స్థలం కూడా సరిగా లేకపోవడంతో ఇరుకుగా ఉంది. – పొన్నాల రాజు, ఎస్ఎంసీ చైర్మన్ పిల్లలను ఇన్వాల్వ్ చేసి బోధిస్తాం విద్యార్థులు ఉదయం 8 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు బడినుంచి వెళ్తారు. స్టడీ అవర్స్‌లో టీచర్లు దగ్గరుండి చదివించడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి అంశంలో పిల్లలను ఇన్వాల్వ్ చేసి బోధన సాగుతుంది. ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు పెట్టాం. – ఆరోగ్యమ్మ గోపు, హెచ్ఎం అర్థమయ్యేలా చెబుతారు బట్టీ విధానం ఉండదు. ప్రతి పాఠం సుల భంగా అర్థమయ్యేలా చెబుతారు. కంప్యూటర్ తరగతులు కూడా ఉన్నాయి. స్టడీ అవర్స్ వల్ల మేము బాగా చదవగలుగుతున్నాం. మధ్యాహ్న భోజనం కూడా బాగుంటుంది. – పరకాల సాత్విక, టెన్త్ విద్యార్థిని -
అనుమతి లేకుండా అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం: ఎలాంటి అనుమతులు లేని గురునానక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఆర్థికంగానే కాకుండా, విద్యా సంవత్సరం నష్టపోయామని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు కారణమైన వర్సిటీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఓ చట్ట సవరణ తెచ్చింది. గత ఏడాది సెపె్టంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారు. ఇప్పటివరకూ దీనిపై గవర్నర్ దగ్గర్నుంచి స్పష్టత రాలేదు. అయితే, గురునానక్‌తోపాటు మరో కాలేజీ కూడా బిల్లుపై స్పష్టత రాకుండానే విద్యార్థులను చేర్చుకుంది. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. గురునానక్ కాలేజీలో 3వేల మంది విద్యార్థులు చేరారు. 2022–23 విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. దీనిపై ప్రభుత్వం సంబంధిత కాలేజీలకు నోటీసులివ్వగా, విద్యార్థుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఈ చర్యతో తమకు జరిగిన నష్టం భర్తీ కాదని విద్యార్థులు అంటున్నారు. తమకు అన్యాయం చేశారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులు కళాశాలలోకి చొరబడి రాళ్లు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. -
సర్కారీ స్కూళ్లు.. అడ్మిషన్లు ఫుల్.. సీట్లు నిల్
సన్నగిల్లిన నమ్మకంతో చిన్నచూపు చూసిన వారే ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల కోసం పరుగులు తీస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిరాదరణకు గురైన బడులన్నీ ఇప్పుడు సకల సౌకర్యాలను.. శాశ్వత నిర్మాణాలను సమకూర్చుకుంటున్నాయి. అంతేగాక ఆంగ్ల మాధ్యమ బోధన కూడా అందుబాటులోకి వచ్చింది. ఫీజులు భారమైనా.. బడులు దూరమైనా.. వేలకు వేలు కట్టి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిన తల్లిదండ్రులు ఇప్పుడు తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తహతహలాడుతున్నారు. ఫలితంగా సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్లను భారీగా డిమాండ్ పెరిగింది. ఏ పాఠశాలలో చూసినా ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆటోనగర్ (విజయవాడ తూర్పు)/నెల్లూరు (టౌన్ ః విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. ఈ నెల 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభించారు. అయితే, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దొరకడం కష్టంగా మారింది. ఇప్పటికే నగరపాలక సంస్థ పరిధిలోని ఏ పాఠశాలకు వెళ్లినా అడ్మిషన్లు దొరకని పరిస్థితి నెలకొంది. 14 డివిజన్ పరిధిలోని గోవిందరాజుల ధర్మ ఈనాం ట్రస్ట్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలోనూ అడ్మిషన్లు దొరకడం లేదు. రెండు రోజుల నుంచి 6వ తరగతి పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా వస్తున్నారు. ఇక్కడ 1వ నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 6 నుంచి 10 వతరగతి వరకు సుమారు 1,285 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడే 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి అడ్మిషన్ ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి ఇక్కడ 6వ తరగతి చేరడానికి వచ్చే వారిని చేర్చుకోవడం లేదు. ఇప్పటికే ఇక్కడ 6వ తరగతిలో 100కు పైగా అడ్మిషన్లు వచ్చాయి. మరింత మంది విద్యార్థులను చేర్చేకుంటే తరగతి గదులు సరిపోవనే ఉద్దేశంతో పిల్లలను చేర్పించుకోవడానికి ఉపాధ్యాయులు వెనుకాడుతున్నారు. నెల్లూరులో ఇదీ పరిస్థితి నెల్లూరు భక్తవత్సల నగర్‌లోని కేఎన్నార్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. దీంతో అడ్మిషన్లు ఇవ్వలేమంటూ ఉపాధ్యాయులు చేతులెత్తేశారు. పాఠశాల గేటుకు ‘నో వెకెన్సీ’ బోర్డు తగిలించారు. సీఎం వైఎస్ జగన్ తొలి విడత నాడు–నేడులో భాగంగా రూ.64 లక్షలతో ఈ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారు. రెండోవిడత నాడు–నేడులో రూ.2.22 కోట్లతో 20 అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. ఇవి పూర్తయితే మరో రెండు వేల మందికి పైగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని హెచ్ఎం విజయప్రకాష్ చెప్పారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 1,786 మంది విద్యార్థులున్నారు. నెల్లూరు నగరంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. అడ్మిషన్ దొరకడం లేదు గోవిందరాజు పాఠశాలలో అడ్మిషన్ దొరకడం లేదు. వారం తర్వాత చెబుతామంటున్నారు. మా పాప హాసిని సాయి ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదివింది.సీఎం వైఎస్ జగన్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదించాలని నిర్ణయం తీసుకున్నాం. సీటు దొరుకుతుందో లేదో అర్ధం కావడం లేదు. – మాధవరావు, విద్యార్థి తండ్రి, యనమలకుదురు, విజయవాడ చాలామంది వస్తున్నారు.. ఈ పాఠశాలలో 1,285 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది అదనంగా మరో 100 అడ్మిషన్లు వచ్చాయి. పక్కనే ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో 700 మంది ఉన్నారు. ఇక్కడ గత ఏడాది 5వ తరగతి చదివిన వారు సుమారు 80 మందికి పైగా ఉన్నారు. వీరందరికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది కొత్తగా చాలా మంది పిల్లలు ఇక్కడ చేరాలని వస్తున్నారు. – ఎం.శ్రీనివాసరావు, హెచ్ఎం, విజయవాడ ప్రైవేట్ స్కూల్ వదిలి ఇక్కడ చేరా ఇక్కడ పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారు. అందుకే.. ప్రైవేట్ స్కూల్ వదిలేసి ఇక్కడ చేరా. ఏదన్నా అర్థం కాని విషయం ఉంటే సాయంత్రం నిర్వహించే స్టడీ అవర్స్‌లో ఆ సబ్జక్టు ఉపాధ్యాయుడిని అడిగితే పూర్తిగా వివరిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తా. – సీహెచ్ ఆదిత్యశ్రీ, పదో తరగతి, నవాబుపేట వచ్చే విద్యా సంవత్సరం మరిన్ని అడ్మిషన్లు ఉపాధ్యాయుల సమష్టి కృషి, విద్యార్థుల్లో పట్టుదల, కృషి ఉండటం వల్లే అత్యధిక మార్కులు సాధించగలుగుతున్నాం. ఇక్కడ చదువుకునే వారు ఎక్కువగా పేద విద్యార్థులు. వారికి నాణ్యమైన విద్య అందించడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. వచ్చే విద్యా సంవత్సరానికి 20 గదులు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల మరింత మంది విద్యార్థులను చేర్చుకునేందుకు వీలుంటుంది. – విజయప్రకాష్, హెచ్ఎం, నెల్లూరు -
అడ్డదారులు తొక్కితే నిషేధమే!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్) ప్రవేశాల్లో అడ్డదారులు తొక్కే మెడికల్ కాలేజీలపై నిషేధం విధిస్తామని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించింది. తప్పుడు పద్దతుల్లో ఇచ్చే మొదటి సీటుకు రూ.కోటి, రెండో సీటుకు రూ.2 కోట్లు జరిమానా విధిస్తామని.. మరోసారి తప్పు చేస్తే తదుపరి ఏడాది సంబంధిత మెడికల్ కాలేజీని నిషేధిస్తామని స్పష్టం చేసింది. మెడికల్ అడ్మిషన్లు తదితర అంశాలపై గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. బ్లాక్ చేసి అమ్ముకుంటూ.. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్న ఉదంతాలు ఎన్నో బయటపడుతున్నాయి. ముఖ్యంగా బీ కేటగిరీ సీట్లను ఎన్నారై సీట్లుగా మార్చుకోవడం, తప్పుడు అర్హతలున్నా సీట్లు ఇవ్వడం, అడ్మిషన్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సీట్లు కేటాయించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. దీనితో అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇక నుంచి మెడికల్ కాలేజీలకు రేటింగ్ వైద్య కాలేజీల ఏర్పాటు, కొత్త కోర్సుల అనుమతి కోసం ఎన్ఎంసీ నిబంధనలను విడుదల చేసింది. వీటి అమలుకు ‘మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (మార్బ్)’ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. మార్బ్ నుంచి లిఖితపూర్వక అనుమతులు లేకుండా కొత్తగా వైద్య కాలేజీలు ఏర్పాటు చేయడానికిగానీ, కొత్త కోర్సులు ప్రారంభించడానికిగానీ వీల్లేదు. ఎంబీబీఎస్, పీజీ కోర్సుల కోసం కొత్త కాలేజీల ఏర్పాటుకు ఈ సంస్థ దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి సంస్థలు, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఏర్పాటైన కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్బ్ అన్ని కోణాల్లో పరిశీలించి అనుమతి ఇస్తుంది. మార్బ్ అనుమతి లేకుండా ఇప్పటికే తరగతులు నిర్వహిస్తున్న ఏ మెడికల్ కాలేజీలో కూడా సీట్లు పెంచడానికి వీల్లేదు. మార్బ్ థర్డ్ పార్టీ సంస్థల సాయంతో మెడికల్ కాలేజీల పనితీరును పరిశీలించి రేటింగ్ ఇస్తుంది. ఇక ప్రతీ మెడికల్ కాలేజీ వార్షిక నివేదికను సంబంధిత బోర్డులకు అందజేయాలి. గుర్తింపు పొందిన వైద్య అర్హత ఉంటేనే.. గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండా ఏ వ్యక్తి కూడా మెడికల్ ప్రాక్టీస్ చేయకూడదని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ఇందుకోసం ‘మెడికల్ ప్రాక్టీషనర్ల నమోదు, మెడిసిన్ నిబంధనల ప్రాక్టీస్ లైసెన్స్– 2023’ను విడుదల చేసింది. మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్సు కోసం నేషనల్ మెడికల్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. విదేశాల్లో వైద్యవిద్య చదివినవారు జాతీయ స్థాయిలో సంబంధిత పరీక్ష పాస్ కావాలి. రాష్ట్ర వైద్య మండలిలో దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, అది జాతీయ వైద్య రిజిస్టర్లోనూ, రాష్ట్ర వైద్య రిజిస్టర్లో కూడా కనిపిస్తుంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్కు జారీచేసిన మెడిసిన్ ప్రాక్టీస్ లైసెన్స్ ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అత్యున్నత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వైద్య విద్య ఉండాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. అందుకోసం ‘గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్–2023’ను విడుదల చేసింది. విద్యార్థి కి ఉన్నతమైన, నాణ్యమైన ఎంబీబీఎస్ లేదా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యను అందించడానికి తగిన ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. -
జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభించవచ్చు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ శుక్రవారం విడుదల చేశారు. జూన్ 30లోగా ప్రవేశాలు పూర్తి చేయాలని,ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులు జూన్ 1 నుంచి ప్రారంభించాలని సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని కాలేజీలకు సూచించారు. టెన్త్ గ్రేడింగ్ ఆధారంగానే ప్రవేశాలు జరపాలని ఆదేశించారు. ఇంటర్ బోర్డ్ గుర్తింపు ఉన్న కాలేజీల జాబితాను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని, ఆ కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని సూచించారు. ప్రతీ కాలేజీ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. సీట్లలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇతర అర్హతలున్న వారికి 5, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం కేటాయించాలన్నారు. ప్రతీ కాలేజీ బాలికలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను బోర్డ్ విడుదల చేసింది. మార్గదర్శకాలు ఇవీ... ♦ ఇంటర్లో ప్రతీ సెక్షన్లో 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు నిర్వహించాలంటే కాలేజీ విధిగా బోర్డ్ అనుమతి తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఏ కాలేజీ వ్యవహరించినా కఠిన చర్యలుంటాయి. ♦ విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పకుండా నమో దు చేయాలి. అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాలి. ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి? ఎన్ని మిగిలి ఉన్నాయి? అప్డేట్ సమాచారం బోర్డ్‌పై ప్రదర్శించాలి. ♦ జోగిని, తండ్రి లేని పిల్లల విషయంలో పేరెంట్స్ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలి. బాలికలకు అన్ని రకాల రక్షణ వ్యవస్థను కాలేజీలే క ల్పించాలి. -
అడ్డగోలు అడ్మిషన్లుచెల్లవ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు మరింత దృష్టి పెట్టింది. అనుమతుల్లేకుండా అడ్డగోలుగా చేపట్టే అడ్మిషన్లు చెల్లవని స్పష్టంచేసింది. అలాంటి కాలేజీల వివరాలు సేకరించి తమకు పంపాలని జిల్లా ఇంటర్ అధికారులను ఆదేశించింది. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. దీంతోపాటు ఈ ఏడాది సకాలంలో అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈలోగా ఎక్కడా ఏ కాలేజీ అడ్మిషన్లు తీసుకోవడానికి వీల్లేదని, కాలేజీకి గుర్తింపు రాకపోతే బోర్డు బాధ్యత వహించదని స్పష్టంచేసింది. ప్రతీ ప్రైవేటు కాలేజీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను పొందుపరుస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఏటా బోర్డు నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై గట్టి నిఘా ఉంచాలని, వాటి వివరాలను తమకు పంపాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. మెరుగైన బోధన ఉండాల్సిందే.. ఎక్కడైతే అనుబంధ గుర్తింపు పొందుతారో, అక్కడే కాలేజీ నిర్వహించాలని, ఒకచోట అనుమతి, వేరొకచోట కాలేజీ ఉంటే పర్మిషన్ రద్దు చేస్తామని ప్రైవేటు ఇంటర్ కాలేజీలను బోర్డు హెచ్చరించింది. ఈ దిశగా వివరాలు సేకరించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన బోధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది ఒక క్యాంపస్‌కే పరిమితం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేటప్పుడు వారి వివరాలను ఈ ఏడాది నుంచి బోర్డు ఆన్లైన్లో నమోదు చేయబోతోంది. విద్యాసంవత్సరం మొదట్లో నియమించిన అధ్యాపకులే చివరి వరకూ ఉండాలనే నిబంధన విధించింది. ఒకవేళ అధ్యాపకుడిని మారిస్తే ఆ విషయాన్ని బోర్డు అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల బోధన ఏ స్థాయిలో జరుగుతుందనేది అంచనా వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ తప్పనిసరి ఈ ఏడాది నుంచి సిబ్బంది బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయనున్నారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో బోధించే అధ్యాపకులు విధిగా పీజీ చేసి ఉండాలి. వారి వివరాలు, ఆధార్, బయోమెట్రిక్‌కు అవసరమైన వివరాలను ఆన్లైన్ ద్వారా ఫీడ్ చేస్తారు. విద్యా సంవత్సరం ముగిసే వరకూ వారి బయోమెట్రిక్ కొనసాగేలా చూస్తారు. ప్రతీ కాలేజీలో ప్రత్యేక మొబైల్ నంబర్ అందుబాటులో ఉండాలని, ఇది జిల్లా ఇంటర్ విద్యాధికారికి తెలపాలని సూచించారు. విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్ణయించిన తేదీల్లోనే ప్రవేశాలు, తరగతులు జరగాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. -
స్కూళ్లల్లో దోపిడీ షురూ..! జోరుగా ముందస్తు అడ్మిషన్లు
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నిలువు దోపిడీ ప్రారంభమైంది. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో అడ్మిషన్ల దందాకు దిగాయి.కొన్ని పాఠశాలలు ముందస్తు సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రా యితీ అని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో తీవ్ర పోటీ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఎల్కేజీ, యూకేజీ సీట్లకు అధిక డిమాండ్ ఉండగా, అతర్వాత తరగతుల్లో సీట్ల ఖాళీలును బట్టి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫీజులు, అడ్మిషన్ ఫీజు విషయం పక్కకు పెడితే ..అసలు సీటు దక్కడం అనే ప్రశ్నార్ధకంగా తయారైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఆయా స్కూల్లో పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 1000 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా స్కూల్స్‌లో సీట్లకు రెండింతలు దరఖాస్తులు రావడంతో ప్రతి సీట్‌కు తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యమే... కార్పొరేటు, ప్రైవేటు స్కూల్స్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ఇష్టారాజ్యంగా తయారైంది. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ..అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిన కాడికి దండుకుంటున్నాయి. కేవలం నర్సరీకే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. స్కూల్ యూనిఫాం, పుస్తకాలు ముడిపెట్టి ముందుగానే అడ్మిషన్ ఫీజు చేలిస్తేనే సీటు గ్యారంటì హామీ ఇవ్వడం పరిపాటిగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. కనిపించని నోటీసు బోర్డు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రై వేటు స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలేశాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్ కార్పొరేట్, ప్రై వేటు స్కూళ్లలో అడ్మిషన్లకు యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు సైతం టార్గెట్ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్ పూర్తి చేయకుంటే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగానికి ఎసరు తప్పని పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: Andhra Pradesh: బోధనలో నవశకం -
వరంగల్ ఆయుర్వేద వైద్య కళాశాలలో అడ్మిషన్లు రద్దు!
కాశిబుగ్గ: వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాలలో 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు రద్దయినట్లు తెలిసింది. కళాశాలలో అధ్యాపకులు, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి కారణంగా నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్(ఎన్సీఐఎస్ఎం) రద్దు చేసినట్లు సమాచారం. 2022 ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీలోని ఎన్సీఐఎస్ఎం.. వైద్య కళాశాలతోపాటు కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రిలో ఆన్లైన్లో తనిఖీలు చేసింది. కళాశాల, వైద్యశాలలో సరిపోను బోధన సిబ్బంది, వైద్యులు, బోధనేతర సిబ్బంది, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, కళాశాలకు వెబ్సైట్, ల్యాబొరేటరీలో కనీస సౌకర్యాలు, పరికరాలు లేకపోవడాన్ని బృందం గుర్తించింది. అధ్యాపకులు, సిబ్బందిని నియమించాలని స్థానిక అధికారులు ప్రభు త్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదని తెలిసింది. కళాశాలను పార్ట్‌టైం అధ్యాపకు లు, సిబ్బందితో నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిన ఎన్సీఐఎస్ఎం సీట్లను రద్దు చేస్తున్నట్లు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనట్లు తెలిసింది. అడ్మిషన్ల రద్దుతో తెలంగాణలోని 63 మంది విద్యార్థులు వైద్యులుగా అయ్యే అవకాశాలు కోల్పోనున్నారు. రిక్రూట్మెంట్ లేక ఖాళీలు 2011 నుంచి అ«ధ్యాపకులు, వైద్యశాలలో డాక్టర్లు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో రాష్ట్రంలోని రెండు ఆయుర్వేద వైద్య కళాశాలల్లో అధ్యాపకులు, వైద్యుల పోస్టులు ఖాళీలు ఉండటంతో సిలబస్ పూర్తికావడం లేదని, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలని విద్యార్థులు పలుమార్లు కళాశాలల్లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పీజీ పూర్తి చేసిన విద్యార్థులను పార్ట్‌టైం లెక్చరర్లుగా నియమించినా వేతనాలు చెల్లించకపోవడంతో బోధించడం లేదు. -
‘సెట్’ అడ్మిషన్లన్నీ ఈ నెలలోనే
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్–2022 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఆయన విడుదల చేశారు. ఈసెట్, ఐసెట్, పీజీఈ సెట్, జీప్యాట్, బీఆర్క్‌లకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేసినట్లు వివరించారు. అలాగే పీఈ సెట్, పీజీ సెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లను త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఆర్ సెట్ పరీక్ష నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేశామన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి కేటగిరీ–బి (యాజమాన్య కోటా) సీట్లలో ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3నుంచి 15వరకు అవకాశం ఇచ్చామన్నారు. నాన్ ఎన్ఆర్ఐ కోటా సీట్లను సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభించామని, అక్టోబర్ 17వ తేదీతో ఈ అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. కొన్ని సెట్ల తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ముగియగా.. కొన్ని సెట్ల తొలివిడత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వాటినీ పూర్తిచేసి రెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టేందుకు వీలుగా షెడ్యూళ్లను ఖరారు చేశామని వివరించారు. డిగ్రీ కోర్సుల సీట్ల కేటాయింపు కాగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యాకోర్సులన్నిటికీ అడ్మిషన్లను ఆన్లైన్లోనే కల్పిస్తున్నామని హేమచంద్రారెడ్డి వివరించారు. జూలై 22న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చామని, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెల 14న డిగ్రీ అభ్యర్థులకు తొలివిడత సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు. వారంతా 15వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్ల హానర్ కోర్సులుగా చేశామని, డిగ్రీలో చేరిన విద్యార్థులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడేళ్లకే ఎగ్జిట్ అయ్యే విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. ఇప్పటికే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. ఇంటర్న్‌షిప్‌తోపాటు అదనంగా మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ వంటి వివిధ ఆధునిక కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులను కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహమ్మద్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 కోటా కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ చట్టబద్దతపై దాఖలైన దాదాపు 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. 50 శాతం జనరల్ కోటాలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సీనియర్ లాయర్లు రవి వర్మ కుమార్, పి. విల్సన్ సహా పలువురు లాయర్లు కోర్టులో వాదించారు. ఈడబ్ల్యూఎస్‌కు ఆర్థికపరిస్థితినే గీటురాయిగా తీసుకోకూడదని తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ లాయర్ శేఖర్ నఫరే వాదించారు. వీటిని అటార్నీ జనరల్ వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు. -
అంధుల పాఠశాలలో ప్రవేశాలు.. సదరం సర్టిఫికెట్ తప్పనిసరి
కడప ఎడ్యుకేషన్: కడప శంకరాపురంలోని అంధుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో చేరే బాల, బాలికలకు ఉచితంగా చదువు చెప్పడమే కాకుండా.. ప్రత్యేక హాస్టల్ వసతి కూడా కల్పిస్తారు. ఈ పాఠశాలలో ఏపీతో పాటు తెలంగాణకు చెందిన వారు కూడా చేరవచ్చు. ఆసక్తి ఉన్నవారు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.శంకరయ్య సూచించారు. దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా సదరం మెడికల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు మూడు ఫోటోలను జతచేసి దరఖాస్తు చేయాలని సూచించారు. పది ఫలితాల్లో ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9291306870, 9494077761 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని పేర్కొంది. జూలై 1 నుంచి తరగతులు చేపట్టాలని సూచించింది. ఇంటర్ మొదటి దశ అడ్మిషన్ల షెడ్యూల్.. దరఖాస్తుల విక్రయం: జూన్ 20 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 20 అడ్మిషన్లు ప్రారంభం: జూన్ 27 అడ్మిషన్లు పూర్తయ్యేది: జూలై 20 ఫస్టియర్ తరగతులు ప్రారంభం: జూలై 1 చదవండి: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న.. -
AP: ఆ విద్యార్థులకు అలర్ట్.. 20వ తేదీలోగా చేరాలి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ప్రవేశం పొందాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల ఎంపిక జాబితాను ఖరారు చేసినట్లు తెలిపారు. 20వ తేదీ తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. -
16 వరకు మోడల్ స్కూళ్లలో ప్రవేశాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 16 వరకు ఆన్లైన్లో నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల అనంతరం అభ్యర్థులు తగిన సమాచారంతో ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ అప్లికేషన్లను ఆమోదిస్తారు. దరఖాస్తుదారుల జాబితాలను జిల్లాల వారీగా ఈ నెల 22న ప్రకటిస్తారు. అనంతరం పాఠశాల వారీగా సీట్ల కేటాయింపునకు జూన్ 24 నుంచి 28వ తేదీ వరకు ఆయా జిల్లాల్లో లాటరీ నిర్వహిస్తారు. స్కూళ్ల వారీగా ఎంపిక జాబితాను జూన్ 30న ప్రకటిస్తారు. జూలై 1వ తేదీన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఇదిలా ఉండగా.. మోడల్ స్కూళ్లలో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూళ్లలో సీట్ల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ స్కూళ్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం తరగతికి 80 సీట్లుండగా.. ఇప్పుడు వాటిని 100కు పెంచారు. ఇంటర్(బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ)కు సంబంధించి ప్రస్తుతం 20 చొప్పున సీట్లుండగా ఇప్పుడు 40 చొప్పున పెంచారు. రిజర్వేషన్లను అనుసరించి ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఈ పాఠశాలల్లో పూర్తిగా ఉచితంగా విద్యనభ్యసించవచ్చు. ఇతర వివరాల కోసం https://apms.apcfss.in ను సందర్శించాలి. ఇదే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. -
ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, పాడేరు: కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియంలో బాలబాలికలకు కో ఎడ్యుకేషన్ పద్ధతితో విద్యాబోధన ఉంటుందని ఆయన వివరించారు. ప్రతి తరగతికి 60 సీట్లు చొప్పున బాలికలకు 30, బాలురకు 30 కేటాయిస్తున్నామని ఆయన వివరించారు. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జి.కె.వీధి, డుంబ్రిగుడ(అరకు సంతబయలు), చింతపల్లి, ముంచంగిపుట్టు(పెదబయలు), అనంతగిరి, అరకులోయ, హుకుంపేట(పాడేరు), పెదబయలు, పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు కోరుతున్నామన్నారు. 6వ తరగతిలో ప్రవేశాలకు గాను 5వ తరగతి పాసైన విద్యార్థిని, విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. కొయ్యూరులో 7వ తరగతిలో బాలురకు మూడు సీట్లు, బాలికలకు మూడు సీట్లు ఖాళీలున్నాయని, పాడేరులో 7వ తరగతిలో బాలురకు ఆరు సీట్లు ఖాళీలున్నాయన్నారు. దరఖాస్తు, ఇతర వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన కోరారు. మే 16వ తేదీలోపు 6,7తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని, మే 21వ తేదీన ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తుల సమర్పణకు దగ్గరలోని గురుకుల పాఠశాల/కళాశాలలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2022–23 విద్యాసంవత్సరానికి గాను ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రతిభ విద్యాలయాల్లో నాణ్యమైన విద్య, ఇతర సౌకర్యాలను అమలు చేస్తుందన్నారు. విశాఖలోని మారికవలస ప్రతిభ పాఠశాలలో 8వ తరగతిలో బాలికలకు 45 సీట్లు, విజయనగరం జిల్లా జోగంపేట ప్రతిభ పాఠశాలలో 8వ తరగతి(బాలురు)కు 45సీట్లు కేటాయించారన్నారు. అలాగే ప్రతిభా కళాశాలల్లో సీవోఈ, ఎస్‌వోఈ విభాగాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆయన వివరించారు. మారికవలసలో బాలికలు, జోగంపేటలో బాలురు ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, కేవలం గిరిజన బాలబాలికలు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు. 8వ తరగతి ప్రవేశాలకు గాను ప్రభుత్వం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 7వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు వచ్చేనెల 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రవేశపరీక్షను పాడేరు గురుకుల పాఠశాల, అరకులోయ గురుకుల కళాశాలల్లో మే 29న నిర్వహిస్తామని పీవో వెల్లడించారు. (చదవండి: మే నెలాఖరుకు 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: ఆదిమూలపు సురేశ్) -
యూజీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022–23 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు. జూలై మొదటివారంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. సోమవారం ఆయన వర్చువల్ విధానంలో విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ స్కోర్ తప్పనిసరి అని, ఈ ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించినట్టు వివరించారు. ఈ పరీక్షకు క్లాస్–12 ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి సిలబస్ ఉంటుందని జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షకు 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండబోదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. సీయూఈటీతో ప్రయోజనాలు అధిక కట్-ఆఫ్‌ల ఒత్తిడి నుంచి విద్యార్థులకు సీయూఈటీతో ఉపశమనం కలగనుంది. అంతేకాదు తల్లిదండ్రులు, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గుతుంది. వర్సిటీకో ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆమేరకు వ్యయప్రయాసలు తప్పుతాయి. అయితే సీయూఈటీపై విద్యావేత్తలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్య ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఎలా ఉంటుంది? సీయూఈటీ అనేది మూడున్నర గంటల పాటు జరిగే కంప్యూటరైజ్జ్ మల్టిఫుల్ చాయిస్ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించబడుతుంది. మొదటిది అభ్యర్థులు ఎంచుకున్న భాషలో వారి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, నేపాలీ, పర్షియన్, ఇటాలియన్, అరబిక్, సింధీ, కశ్మీరీ, కొంకణి, బోడో, డోగ్రీ, మైథిలీ, మణిపురి, సంతాలి, టిబెటన్, జపనీస్, రష్యన్, చైనీస్ వంటి అదనపు భాషలలో మరొక ఐచ్చిక పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో అభ్యర్థులు ప్రామాణిక సబ్జెక్ట్‌లు ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న 27 సబ్జెక్టుల్లో కనీసం ఒకటి, గరిష్టంగా ఆరు ఎంచుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లోని రసాయన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం.. కామర్స్ నుంచి అకౌంట్స్ లేదా బిజినెస్.. హ్యుమానిటీస్ నుంచి సైకాలజీ లేదా సోషియాలజీ వంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. మూడవ విభాగంలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సహా సాధారణ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని కోర్సులకు నిర్దిష్ట పరీక్షలు అవసరం కావచ్చు. కొన్నింటికి భాష, సాధారణ సామర్థ్య పరీక్షలు రాస్తే సరిపోతుంది. (క్లిక్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల) రిజర్వేషన్ ప్రస్తుతం ఉన్న అడ్మిషన్, రిజర్వేషన్ విధానాన్ని సీయూఈటీ ప్రభావితం చేయదు. విశ్వవిద్యాలయాలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా పాత పద్ధతిలోనే జనరల్, రిజర్వేషన్ సీట్లు భర్తీ చేస్తాయి. మైనారిటీ విద్యార్థుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసే జేఎంఐ, ఏఎంయూ కాలేజీల రిజర్వేషన్ విధానాలను సీయూఈటీ ప్రభావితం చేయదు. అయితే, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశ అర్హత సాధించాలంటే విద్యార్థులందరూ తప్పనిసరిగా సీయూఈటీ రాయాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు మినహాయింపు విదేశీ విద్యార్థులకు సీయూఈటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. సూపర్‌న్యూమరీ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు వారికి ప్రవేశం కల్పిస్తాయి. సంగీతం, ఫైన్ ఆర్ట్స్, థియేటర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ప్రాక్టికల్, ఇంటర్వ్యూలు నిర్వహించడానికి విశ్వవిద్యాలయాలకు యూజీసీ అనుమతిస్తుంది. నీట్, జేఈఈ పరీక్షలకు సీయూఈటీ వర్తించదు. సీయూఈటీ స్కోర్ వాడుకోవచ్చు 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సులు చదవాలంటే సీయూఈటీ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడే సంస్థలు.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్లను ఉపయోగించుకోవచ్చు. -
8 నుంచి ఓయూ హాస్టళ్ల మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్ వార్డెన్ శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌లను కూడా మూసివేస్తామని చెప్పారు. విద్యార్థులు హాస్టల్ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. పీజీఈసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ పీజీఈసెట్ ఈ నెల 6 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ పి.రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ వరకూ ఆన్లైన్ రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని, 9 నుంచి 11 వరకూ వెబ్ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 19వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువుంటుందని వెల్లడించారు. ‘డిగ్రీ వన్‌టైమ్ చాన్స్’ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్‌టైమ్ చాన్స్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్లాగ్, వన్‌టైమ్ చాన్స్ ఫలితాలు.. బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్ శ్రీనగేశ్ తెలిపారు. (తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు) పీజీ ప్రవేశాల చివరి విడత వెబ్ కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. సీపీజీఈటీ–2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్‌కౌన్సెలింగ్ జరగనున్నట్లు కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్య ర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్‌కు హాజరు కావాలన్నారు. ఈ నెల 12నుంచి 15వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సీట్లు లభించిన విద్యార్థులు 20 నుంచి 25 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా సర్వేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడ బ్ల్యూఆర్‌ఈఐఎస్) అదనపు కార్యదర్శిగా వి.సర్వేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వేశ్వర్‌రెడ్డి గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకుడిగా, టీసీఆర్టీఐ (గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ) సంచాలకుడిగా కొనసాగుతున్నారు. గిరిజన గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో మంగళవారం రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అదనపు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు సర్వేశ్వర్రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. -
ఎన్నారైలకు సీబీఎస్ఈ శుభవార్త! స్కూల్ అడ్మిషన్లపై కీలక ప్రకటన
విదేశాల్లో ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుభవార్త తెలిపింది. ఎన్నారై పిల్లల చదువుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇక్కడ చదివించాలంటే గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్తున్న ఇండియన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విదేశాల్లో విద్యా చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో కొందరు తమ పిల్లలను ఇండియాలో చదివించేందుకు మొగ్గు చూపుతుంటారు. మరికొందరు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు మిస్ అవకూడదని తమ సంతానానికి ఇండియాలో ఎడ్యుకేషన్ అందించాలని నిర్ణయించుకుంటారు. ఇలాంటి వారంతా తమ పిల్లలను ఇండియాలో సీబీఎస్ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న స్కూళ్లలో చేర్పిస్తుంటారు. ఇలాంటి ఎన్నారై విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి సీబీఎస్ఈ కొన్ని మార్గదర్శకాలు అమలు చేస్తోంది. గతంలో సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం ఇక్కడి స్కూళ్లలో అడ్మిషన్ పొందాలంటే విదేశాల్లో సీబీఎస్సీకి సరిసమానమైన సిలబస్ అందిస్తున్న ఎడ్యుకేషన్ బోర్డులకు అనుబంధంగా ఉన్న స్కూల్లో విద్యార్థులు చదువుతూ ఉండాలి. ఇందుకు సంబంధించిన పత్రాలను సీబీఎస్ఈకి సమర్పించాలి. వాటిని పరిశీలించి సీబీఎస్ఈ అప్రూవల్ ఇస్తుంది. ఆ తర్వాతే స్థానికంగా అడ్మిషన్లు ఖరారు అవుతాయి. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చేపట్టే అడ్మిషన్లలో ఈ రూల్ ఇప్పటి వరకు ఫాలో అవుతూ వస్తున్నారు. కోవిడ్ కారణంగా కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో నిబంధనలు కఠినతరమయ్యాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. లేదంటే జీతాల్లో కోత పడింది. దీంతో తమ పిల్లలను ఇండియాలో చదివించాలని భావించే పేరెంట్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే సీబీఎస్ఈ ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు వారికి అడ్డంకిగా మారాయి. చేర్చుకోండి ఎన్నారైలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రూల్స్‌ని సీబీఎస్ఈ సడలించింది. సీబీఎస్ఈకి సరి సమానమైన సిలబస్ అందించని విదేశీ బోర్డులకి అనుబంధంగా ఉన్న స్కూళ్లలో చదివిన విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముందస్తుగా బోర్డు నుంచి ఎటువంటి అప్రూవల్ లేకుండానే అడ్మిషన్ ఇవ్వవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో విద్యార్థిని పరీక్షించి నిర్ణయం తీసుకోవచ్చంది. చివరగా అడ్మిషన్లు ఖరారు చేసేందుకు బోర్డుకు రిక్వెస్ట్ చేయాలని సూచించింది. సీబీఎస్ఈ తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఇబ్బందులు పడుతున్న ఎన్నారైలకు ఊరట లభించనుంది. చదవండి: ఎన్నారైలు.. తరాలు మారినా.. మూలాలు మరవడం లేదు -
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
అయోధ్య: కాలేజీలో అడ్మిషన్ కోసం నకిలీ మార్క్ షీట్‌ను సమర్పించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారీకి(బీజేపీ) ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఆయనకు రూ.8 వేల జరిమానా విధించింది. తివారీని పోలీసులు జైలుకు తరలించారు. ఆయనపై 1992లో అయోధ్యలో సాకేత్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. గ్రాడ్యుయేషన్ సెకండియర్‌లో ఫెయిలైన తివారీ 1990లో నకిలీ మార్క్ షీట్ సమర్పించి, పై తరగతిలో చేరినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. -
ఏపీ: ప్రైవేటు కాలేజీలపై ఇంటర్ బోర్డు ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికొచ్చిందని, అలాంటి చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కాకుండానే, ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొంది.. ఫీజులు కూడా చెల్లించినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా కాలేజీలు వెంటనే వాపసు ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్ఐవో(రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్)లు గుర్తించి, గుర్తింపు రద్దుతో సహా, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు. -
సీటు కావాలంటే ‘సీఈటీ’ రాయాల్సిందే
ముంబై సెంట్రల్: ఇంటర్ మొదటి సంవత్సరంలో (11వ తరగతి) అడ్మిషన్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) పరీక్షలో వచ్చిన మార్కులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో మూల్యాంకనం ఆధారంగా వెలువడ్డ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ కాలేజీల్లో సీట్లు లభించడం కష్టతరం కానుంది. సీఈటీలో మంచి మార్కులు సాధించినవారికి అడ్మిషన్లు ఇచ్చిన తర్వాతే మిగతావారికి అవకాశం లభించనుంది. గతంలో పదో తరగతి పరీక్షల్లో 90 శాతం, ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో నేరుగా తమకు ఇష్టమైన కాలేజీలో, ఇష్టమైన సబ్జెక్ట్‌లో ప్రవేశం పొందేవారు. కళాశాలలు కూడా 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకే ప్రాధాన్యత ఇచ్చేవి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఈసారి పరిస్థితులు మారాయి. పదో తరగతి పరీక్షల ఫలితాలను అంతర్గత మూల్యాంకన పద్ధతిలో వెలువరించారు. దీంతో కళాశాలలు ఆ ఫలితాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంతేగాక, ప్రతీ ఏడాదిలా కాకుండా ఈసారి కాలేజీల్లో ప్రవేశాలకు సీఈటీ పరీక్షలు పాస్ కావాలనే మెలిక పెట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పైగా, సీఈటి పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరగనున్నాయి. రాష్ట్ర సిలబస్ ప్రకారం ఈ సీఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఆ సిలబస్‌లో చదివిన విద్యార్థులకు ఎక్కువ ఇబ్బంది కలగదు. కానీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు సీఈటీ పరీక్షలు పాసవ్వాలంటే కష్టపడాల్సి వస్తుందని విద్యా విభాగ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి సీఈటీ ఆప్షనలే అయినప్పటికీ, ఈ ఏడాది మాత్రం సీఈటీలో పాసైన విద్యార్థులకే ప్రముఖ కాలేజీలు ప్రాధాన్యత ఇవ్వనున్నాయని స్పష్టమవుతోంది. ముందుగా సీఈటీ ద్వారా సీట్లను భర్తీ చేసుకున్నాకే మిగతా విద్యార్థులకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. గత సంవత్సరం ముంబైలో పదకొండో తరగతిలో ప్రవేశాల కోసం మొదటి లిస్ట్‌లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు లభించిన వారికే అవకాశం కల్పించారు. కామర్స్, సైన్స్ విభాగాల్లో ప్రముఖ కాలేజీల్లో మొదటి కట్ ఆఫ్ 95 శాతం మించిపోయింది. 85 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీల్లో ప్రవేశాల కోసం రెండో లిస్ట్ వరకు ఎదురు చూడక తప్పలేదు. అయితే, ఈ సంవత్సరం మాత్రం మారిన పరిస్థితుల నేపథ్యంలో సీఈటీ పరీక్ష ఫలితాల కట్ ఆఫ్‌నే పరిగణనలోకి తీసుకోనున్నారు. పనిచేయని వెబ్సైట్.. సీఈటీ పరీక్ష కోసం విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించిన వెబ్సైట్ సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులలో అయోమయం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫలితాల అనంతరం సీఈటీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేసిన మొదటి రోజే సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొందరు మాత్రమే సీఈటీ పరీక్షలకు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగలిగారు. రెండో రోజు మరికొందరు నమోదు చేసుకున్నప్పటికీ జూలై 22వ తేదీ నుంచి వెబ్సైట్లో మరో సమస్య ఏర్పడింది. ఇలా అనేక సమస్యలతో శనివారం కూడా వెబ్సైట్ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కోసం జూలై 26వ తేదీ వరకు ఇచ్చిన గడువును పెంచనున్నారని సమాచారం. ఇదిలావుండగా సీఈటీ పరీక్షలు ఆగస్టు 21వ తేదీన జరగనున్నాయి. అయితే, ఈసారి ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి లాంటి ప్రక్రియలు సెప్టెంబర్ వరకు పూర్తి అవుతాయని, అక్టోబర్‌లో కాలేజీలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. -
అడ్మిషన్లకు పోటాపోటీ: కాలేజీల వద్ద విద్యార్థుల కిటకిట
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్లస్‌టూ పరీక్షల్లో ప్రభుత్వం ఆల్‌పాస్ ప్రకటించడంతో కాలేజీల్లో సీటు దక్కించుకునేందుకు విద్యార్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంది. కొత్త విద్యాసంవత్సరంలో కాలేజీ అడ్మిషన్లు ఆన్లైన్లోనే జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించగా మంగళవారం నుంచి అన్ని కాలేజీల వద్ద విద్యార్థులు పోటెత్తుతున్నారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుని వెళుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి కరోనా ప్రబలడంతో విద్యావ్యవస్థ కుప్పకూలింది. పాఠశాలలు, కాలేజీలు మూతపడగా ఆన్లైన్లోనే విద్యాబోధన, పరీక్షలు జరుగుతున్నాయి. ఇదిలాఉండగా, ప్లస్‌టూ పరీక్ష ఫలితాలు, మార్కుల జాబితాను రెండురోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌లో చేరేవారు ఈనెల 26వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులో చేసుకోవాలని ప్రభుత్వం చెప్పగానే విద్యార్థులంతా తమ తమ విద్యాసంస్థల్లోని నోటీసు బోర్డు వద్దకు చేరుకుంటున్నారు. మార్కుల జాబితా చేతబట్టుకుని తమకు ఇష్టమైన ప్రభుత్వ, ప్రయివేటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలకు వెళ్లి వివిధ గ్రూప్‌లలో చేరేందుకు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి తిరునెల్వేలి ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మైథిలి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ప్లస్‌టూ పరీక్షల్లో అందరూ (8,16,473 మంది) పాస్ కావడంతో కాలేజీల్లో చేరేందుకు అందరికీ అవకాశం వచ్చింది. దీంతో సీటు దక్కించుకునేందుకు విద్యార్థులు తీవ్రంగా పోటీపడుతున్నారని అన్నారు. విద్యార్థులు నేరుగా రావద్దు, ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొందండని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ పాఠశాలలూ కిటకిట: చెన్నై కార్పొరేషన్ ఆధీనంలోని పాఠశాల్లో విద్యార్థుల చేరిక విపరీతంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గత పదేళ్ల తరువాత కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లక్ష దాటిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో 119 ప్రాథమిక, 92 ప్రాథమికోన్నత, 38 ఉన్నత, 32 మహోన్నత పాఠశాలలున్నాయి. అన్ని పాఠశాలల్లో తరగతి గదులను స్మార్ట్ క్లాస్ రూములుగా మారుస్తున్నారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా తమిళం, ఆంగ్ల బోధన, క్రీడా మైదానం వసతులు కల్పిస్తున్నారు. యూకేజీ నుంచి ఎల్కేజీ వరకు 1.50 లక్షల మందికి విద్యాబోధనకు అనువైన వసతులున్నాయి. అయితే కార్పొరేట్ స్కూళ్లపై మోజుతో ప్రజలు కార్పొరేషన్ స్కూళ్ల పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి వల్ల గత ఏడాదిన్నర కాలంగా స్థితిగతులు పడిపోవడంతో ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. కార్పొరేట్ స్కూళ్ల వైపు కన్నెత్తి చూసే స్థోమతలేక కార్పొరేషన్ స్కూళ్లవైపు దృష్టి సారిస్తున్నారని చెన్నై కార్పొరేషన్ విద్యాధికారి భారతిదాసన్ మీడియాకు చెప్పారు. 2021–22 విద్యాసంవత్సరంలో 27,311 మంది కొత్త విద్యార్థులు చేరారు. వీరిలో 19,038 మంది ప్రయివేటు స్కూళ్ల నుంచి వచ్చారు. దీంతో తమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య లక్షా 1,757కు చేరింది. 2011లో విద్యార్థుల సంఖ్య లక్ష దాటింది. పదేళ్ల తరువాత మరలా లక్షకు పైగా విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెంచేలా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. -
ఏపీ బీజీ ఇంటర్ సెట్–2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్).. 2021–2022 విద్యాసంవత్సరానికి 164 సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజీలు, మూడు ఐఐటీ మెడికల్ అకాడెమీస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిం ది. బాలయోగి గురుకులం ఇంటర్మీడియెట్ కామన్ ఎం ట్రెన్స్ టెస్ట్(బీజీ ఇంటర్ సెట్–2021) ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ► ఏపీఎస్‌డబ్ల్యూఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు 2021–22. ► అర్హతలు: 2021 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బీజీ ఇంటర్ సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ► వయసు: 31.08.2021 నాటికి 17 ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక ఏడాది సడలింపు లభిస్తుంది. ∙విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: 2021–22 బీజీ ఇంటర్ సెట్లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, ఫిజికల్ సైన్స్ 15 ప్రశ్నలు, బయోసైన్స్ 15 ప్రశ్నలు, సోషల్ సైన్స్ 15 ప్రశ్నలు, ఇంగ్లిష్(కాంప్రెహెన్షన్ అండ్ గ్రామర్) 15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ► ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. అలాగే ఇందులో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ► ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఐఐటీ–మెడికల్ అకాడెమీస్ పరీక్ష ఐఐటీ–మెడికల్ అకాడెమీస్‌ను ఎంచుకొని.. బీజీ ఇంటర్ సెట్లో మెరిట్లో నిలిచిన విద్యార్థులకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు:ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2021 ► పరీక్షా తేదీ: త్వరలో వెల్లడిస్తారు ► వెబ్సైట్: https://apgpcet.apcfss.in/Inter చదవండి: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్ -
‘గురుకుల’ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 38 సాధారణ, 12 మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.ఆర్.ప్రసన్నకుమార్ శనివారం తెలిపారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ, అనంతపురం జిల్లాలోని కొడిగెనహళ్ళితో సహా మిగిలిన పాఠశాలల్లో 2021– 22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతిలో (ఇంగ్లిష్ మీడియం) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభంకాగా, ఈనెల 30 వరకు ‘హెచ్‌టీటీపీఎస్.ఏపీఆర్ఎస్. ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్’ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలవారీగా కలెక్టరు కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా జూలై 14న అర్హులను ఎంపిక చేస్తారు. ప్రవేశానికి అర్హత.. ఓ.సీ, బీ.సీలకు చెందిన విద్యార్థులు 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31మధ్య పుట్టి ఉండాలి. ∙ఎస్సీ, ఎస్టీలు 2008 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి. ∙అభ్యర్థులు జిల్లాలో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4 తరగతులు చదివి ఉండాలి. ∙ఓసీ, బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలోనే చదివి ఉండాలి. ∙గ్రామీణ, పట్టణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. ∙అభ్యర్థి తల్లి, తండ్రి, సంరక్షకుల 2020–21 ఆర్థిక సంవత్సరాదాయం రూ .1,00,000 మించరాదు. -
Telangana: జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 2021–22 విద్యా సంవత్సరంలో మొదటి దశ ప్రవేశాలకు మంగళవారం నుంచి తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా మంగళవారం నుంచి దరఖాస్తుల పంపిణీ, ప్రవేశాల ప్రారంభానికి మొదటి దశ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. జూలై 7 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి అవుతుందని పేర్కొంది. జనరల్, వొకేషనల్ విభాగాల్లో ప్రభుత్వ /ప్రైవేట్ ఎయిడెడ్ /ప్రైవేట్ అన్ఎయిడెడ్ /కో–ఆపరేటివ్ /టీఎస్ రెసిడెన్షియల్/ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్/ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్/ ఇన్సెంటివ్/ మైనారిటీ/ కేజీబీవీ/ టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కంపోజిట్ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సర ప్రవేశాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించింది. పదో తరగతి ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు (ప్రొవిజనల్ అడ్మిషన్లు) చేపట్టొచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు పేర్కొంది. విద్యార్థులు ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్, టీసీలు సమర్పించాక ప్రవేశాలు (ప్రొవిజనల్ అడ్మిషన్లు) ఖరారు అవుతాయని తెలిపింది. రెండో దశ అడ్మిషన్లు ఎప్పుడు చేపట్టాలనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ అనుబంధ (అఫీలియేటెడ్)కాలేజీల్లోనే ప్రవేశాలు పొందేలా విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లు acadtsbie.cgg.gov.in, tsbie.cgg.gov.inలో పొందుపరిచిన గుర్తింపు, అనుబంధ కాలేజీల జాబితాలను సరిచూసుకోవాలని తెలిపింది. జీపీఏ ఆధారంగానే.. పదోతరగతి పరీక్షల్లో గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ), సబెక్ట్‌ల వారీగా గ్రేడ్ పాయిం ట్ల ఆధారంగా ఇంటర్ ప్రవేశాలు నిర్వహించాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించొద్దని సూచించింది. ఇతర అంశాల ప్రాతిపదికన ప్రవేశాలు చేపట్టే జూనియర్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ► కాలేజీల్లో ప్రవేశానికి విద్యార్థులు తమ ఆధార్ కార్డులు సమర్పించాలి. ► ప్రతీ విభాగంలో 88కి మించకుండా అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ప్రవేశాలు చేపట్టాలి. ► తగిన అనుమతులు పొందాకే అదనపు సెక్షన్లు తెరవాలి. ఉల్లంఘనలకు పాల్పడితే పెనాల్టీ వేయడంతో పాటు కాలేజీపై అనర్హత వేటు, తదితర చర్యలు ఉంటాయి. ► ప్రవేశాలకు సంబంధించి అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దు. ఉల్లంఘనలపై కఠినచర్యలు. ► జోగినీల సంతానానికి సంబంధించి దరఖాస్తు పత్రంలో తండ్రి పేరుకు బదులు తల్లి పేరును పేర్కొనాలి. ► విదార్థినుల రక్షణకు సంబంధించి ప్రిన్సిపాళ్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ► కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలను రూల్ ఆఫ్ రిజర్వేషన్లను పాటిస్తూ సీట్లు భర్తీ చేయాలని ఆదేశించింది. ప్రవేశాలకు ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు.. ► బీసీలు: 29 శాతం (ఏ–7, బీ–10, సీ–1, డీ–7, ఈ–4 శాతం) ► ఎస్సీలు: 15 శాతం ► ఎస్టీలు: 6 శాతం ► ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్: 5 శాతం ► దివ్యాంగులు: 3 శాతం ► ఎక్స్ సర్వీస్‌మెన్, రాష్ట్రంలో నివసించే డిఫెన్స్ సిబ్బంది: 3 శాతం (విడిగా అమ్మాయిలకు కాలేజీలు లేనిచోట ప్రతీ కేటగిరీలో వారికి మూడో వంతు లేదా 33.33 శాతం సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది) చదవండి: జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు! -
పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలనే అంశంపై.. అధికారులతో సమావేశం నిర్వహించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో నిబంధన ప్రకారమే అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు.(చదవండి: ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ) ఆన్లైన్లోనే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని.. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇప్పటికే రూపొందించామని వెల్లడించారు. ‘‘ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్లపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. వచ్చే సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ. ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే ఇంటర్ అడ్మిషన్లు. ఈ నెల 18 నుంచి ఇంటర్ తరగతులు. కాలేజీల్లో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలి. యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామని’’ మంత్రి సురేష్ పేర్కొన్నారు.(చదవండి: చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు) -
సీట్ల కొరత లేదు: ఇంటర్ బోర్డు
సాక్షి, విజయవాడ: ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ అడ్మిషన్లపై మార్చి నెలలోనే సర్క్యులర్ ఇచ్చామని పేర్కొన్నారు. సీట్ల కొరత ఉందని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇంటర్లో చేరడానికి ఎక్కడా సీట్ల కొరత లేదని తెలిపారు. కొత్తగా మంజూరైన 208 కళాశాలలతో కలిపి మొత్తం 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. (చదవండి: విదేశాల్లోనూ యువతకు ఉపాధి కల్పన) పదవ తరగతి పాసైన ప్రతీ ఒక్కరికి సీటు లభిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో అగ్నిమాపకశాఖ ఎన్ఓసి లేని కళాశాలలకు కూడా 60 రోజుల గడువుతో అనుమతులిచ్చామని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకి లోబడి ఇంటర్ అడ్మిషన్లు కొనసాగింపు, సీట్ల సంఖ్య ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామకృష్ణ పేర్కొన్నారు. (చదవండి: ప్రణయ్ ఆత్మహత్య.. సంచలన విషయాలు) -
‘టీసీ’ లేకున్నా అడ్మిషన్..
సాక్షి, చెన్నై: ప్రైవేటు స్కూళ్లలో ఇదివరకు చదువుకుని ఉన్న పక్షంలో, ఆ విద్యార్థులు టీసీలు సమర్పించకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే వెసులుబాటను విద్యాశాఖ కల్పించింది. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల ఒత్తిడి తీసుకొస్తుండడంతో చర్యలు తప్పవని విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్ హెచ్చరించారు. కరోనా కష్టాలు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిప్పి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అనేక మంది ప్రస్తుతం మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలల్లో అడ్మిషన్లు హోరెత్తుతున్నాయి. అయితే, ఇది వరకు తమ పిల్లలు చదువుకున్న పాఠశాలలు టీసీలు ఇవ్వడంలో జాప్యం చేయడం, ఫీజులు చెల్లిస్తేనే టీసీ అంటూ వేధిస్తున్నట్టుగా విద్యాశాఖకు ఫిర్యాదులు పెరిగాయి. అదే సమయంలో ఒక తరగతి నుంచి మరో తరగతిలో చేరాలంటే ప్రభుత్వ పాఠశాలలో టీసీ సమర్పించాల్సి ఉంది. అయితే, ప్రైవేటు విద్యా సంస్థలు టీసీలు ఇవ్వకుండా వేధిస్తుండడంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పలేదు. దీనిపై విద్యాశాఖకు ఫిర్యాదులు హోరెత్తాయి. దీంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీసీ సమర్పించకుండానే అడ్మిషన్లు పొందేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తిరుచ్చి విద్యాశాఖ అధికారి శాంతి పేర్కొంటూ ఫిర్యాదులను పరిగణించి టీసీ లేకున్నా అడ్మిషన్లపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. కాగా, ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులను ఈరోడ్‌లో శాలువతో సత్కరించి మరీ ఉపాధ్యాయులు ఆహ్వానిస్తుండడం విశేషం. ఇక, అడ్మిషన్లను పరిగణించి ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లోనే ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. చర్యలు తప్పవు.. ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్ హెచ్చరికలు జారీ చేశారు. ఫీజుల పేరిట తల్లిదండ్రుల్ని వేధిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తే, ఆయా విద్యా సంస్థలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఒకటో తరగతిలో లక్షా 72 వేల మంది కొత్తగా చేరారని, సెప్టెంబరులోనూ అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో సాగుతాయని తెలిపారు. పాఠ్యపుస్తకాలన్నీ సిద్ధంగానే ఉన్నాయని, కొత్తగా చేరే విద్యార్థులకు 14 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు తగ్గ చర్యలపై సీఎంతో సమీక్షించనున్నామన్నారు. ఇదిలాఉండగా వివిధ కళాశాల్లో చదువుతూ అరియర్స్ రాయడం కోసం ఫీజులు కట్టిన విద్యార్థులందరూ ఆల్‌పాస్ అని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఈ దృష్ట్యా, వీరిని కూడా పాస్ చేయాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. -
గురుకులాల్లో ‘5’కు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: గురుకులం అడ్మిషన్లకు కరోనా అడ్డంకి కాబోతోంది. ఐదో తరగతి ప్రవేశాలకు ఈసారి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటమే దీనికి కారణం. సాధా రణ పాఠశాలల్లో విద్యార్థులు ఉదయం హాజరై సాయంత్రానికి ఇంటి ముఖం పడతారు. కానీ, గురుకుల పాఠశాలల్లో బోధన, అభ్యాసన, వసతి అంతా ఒకేచోట ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 700కు పైగా గురుకుల పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశా లలో ఐదో తరగతి నుంచి పదో తరగతివరకు (ఆరు తరగతులు) ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు, ప్రతి సెక్షన్‌కు 40మంది పిల్లలుం టారు. ఈ లెక్కన ఒక్కో పాఠశా లలో 480 మంది విద్యార్థులుం టారు. ప్రతి సంవత్సరం మే నెలాఖరుకే ఐదో తరగతిలో అడ్మి షన్ల ప్రక్రియ పూర్తయ్యేది. ఈసారి క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించినా కరోనా కారణంగా ప్రవేశ పరీక్ష నిర్వహించకపోవడంతో అడ్మిషన్ల ప్రక్రియ స్తంభించింది. ఫిజికల్ డిస్టెన్స్ కీలకం: కొత్తగా ఏర్పాటు చేసిన, అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల భవనాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం ఇబ్బందే. ఈ ఏడాది ఐదో తరగతి అడ్మిషన్లు నిలిపివేస్తే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించే వీలుంటుందని సొసైటీలు భావిస్తున్నాయి. పదేళ్లలోపు పిల్లల ఆరోగ్యంపట్ల మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ పదేపదే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐదో తరగతి ప్రవేశాలకు బ్రేక్ ఇస్తే మంచిదని అధికారులు అంటున్నారు. ఇటీవల గురుకుల సొసైటీ కార్యదర్శులు నిర్వహించిన సమావేశాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్నిబట్టి అడ్మిషన్లు చేపట్టడమో, నిలిపివేయడమో జరుగుతుంది. ఒకట్రెండు రోజుల్లో మరోవిడత అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుండగా కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించిన తర్వాత గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నట్లు గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
ఎంట్రెన్స్ పరీక్షలు, ఫలితాల కోసం నిరీక్షించలేకే..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన కలకలంతో ఎంట్రెన్స్ పరీక్షల కోసం ఎదురు చూడకుండా పలువురు నగర విద్యార్థులు ప్రైవేట్ వర్సిటీల వైపు దృష్టి సారిస్తున్నారు. అత్యుత్తమ బోధన, ల్యాబ్ సదుపాయాలు, ప్రాక్టికల్‌గా ఆయా సబ్జెక్టులను బోధించే ప్రైవేట్ వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మా, మేనేజ్మెంట్ తదితర కోర్సుల విషయంలో మెజార్టీ విద్యార్థులు ప్రైవేటు వర్సిటీల్లో అడ్మిషన్ల కోసం పరుగులు తీస్తున్నట్లు విద్యారంగ నిపుణులు చెప్తున్నారు. అక్కడ విద్యాబోధన అనంతరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం దక్కించుకునే అవకాశాలుండటంతో ఆయా సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు. ఇక ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం కోవిడ్ కారణంగా ఎంట్రెన్స్ పరీక్షలను రద్దు చేయడంతో ఆయా విద్యాసంస్థలకు నగర విద్యాసంస్థల నుంచి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుండటం విశేషం. ప్రైవేటు వర్సిటీలకు భారీగా దరఖాస్తులు.. ప్రధానంగా మన పొరుగునే ఉన్న చెన్నై, బెంగళూరు నగరాల్లోని పలు ప్రైవేటు డీమ్డ్ వర్సిటీలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందేందుకు సిటీ విద్యార్థులు వేలాది మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల కోవిడ్ కారణంగా ఎంట్రెన్స్ పరీక్షను రద్దు చేయడంతో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ పొందేందుకు నిత్యం ఏపీ, తెలంగాణా, గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి సుమారు పదివేల దరఖాస్తులు తమకు అందుతున్నాయని వీఐటీ వైస్ ప్రెసిడెంట్ జీవీ సెల్వమ్ తెలిపారు. ఇందులో సింహభాగం హైదరాబాద్ నుంచే వస్తున్నాయంటున్నారు. ఏటా తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షలకు పైగా దరఖాస్తులు అందుతాయని తెలిపారు. అడ్మిషన్ ఇచ్చేందుకు.. ఇంటరీ్మడియెట్ లేదా ప్లస్‌టు మార్కులు, జేఈఈ లేదా స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్‌లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ఆగస్టు నెలలో విడుదల చేస్తామన్నారు. ఇక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి సైతం ఈ ఏడాది 25 శాతం మేర దరఖాస్తులు పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులోనూ నగర విద్యార్థుల దరఖాస్తులే అధికమని సంస్థ అడిషనల్ డైరెక్టర్ అమన్ పేర్కొన్నారు. పరుగులు ఎందుకంటే.. కోవిడ్ పంజా విసరడంతో పలు ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ,అడ్మిషన్లు పొందే ప్రక్రియ ఆలస్యమౌతోందని నగరానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. సెపె్టంబర్, అక్టోబర్ వరకు నిరీక్షించేకంటే ప్రైవేటఫ్ విద్యా సంస్థలు, డీమ్డ్ వర్సిటీల్లో తమ పిల్లలను చేరి్పస్తేనే బాగుంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కోవిడ్ కారణంగా ఇళ్లకే పరిమితమైన తమ పిల్లలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న కారణంగా ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో సీటు సాధించేందుకు యతి్నస్తున్నట్లు మరికొందరు పేరెంట్స్ తెలిపారు. డీమ్డ్ వర్సిటీల్లో బోధన, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తాయన్న నమ్మకం కూడా ఆ దిశగా సిటీ విద్యార్థులు తరలి వెళ్లేలా చేస్తోంది. -
‘నారాయణ’ టీచర్.. అరటి పండ్లు అమ్ముకుంటూ
సాక్షి, నెల్లూరు (టౌన్) : అడ్మిషన్లు చేయించని ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని నెల్లూరు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నఫళంగా తమను ఉద్యోగాల్లోంచి తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితేంటని వాపోతున్నారు. కరోనా కారణంగా మార్చి 15 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆ సమయంలో ఆన్లైన్ పాఠాలు చెప్పించారు. ఏప్రిల్ నెలకు సగం జీతమే ఇచ్చి, మే నెల వేతనాన్ని పూర్తిగా నిలిపేశారు. అదేమని ప్రశ్నిస్తే ఒక్కొక్కరు 7 నుంచి 10 అడ్మిషన్లు చేయిస్తేనే ఇస్తామని లేకుంటే ఆసలు స్కూలుకే రావొద్దని నారాయణ యాజమాన్యం తెగేసి చెప్పింది. ఓ వైపు కరోనా తీవ్రత, మరో వైపు ప్రజలు ఎవరినీ ఇళ్ల దరిదాపులకు రానీయని పరిస్థితిలో అడ్మిషన్లు ఎలా చేస్తామని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. (‘నారాయణ’ ఉపాధ్యాయుల ఆమరణ నిరాహారదీక్ష) ► నెల్లూరు నగరంలోని స్టోన్‌హోస్‌పేట అరుణాచలం వీధిలో ఉన్న నారాయణ స్కూల్లో ఐదుగురు టీచర్లను ఈ కారణంతో తొలగించడంతో వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ► మినీబైపాస్‌లోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో పనిచేస్తున్న మరో ఏడుగురు టీచర్లకూ స్కూల్‌కు రావొద్దని చెప్పారు. ► ఈ విధంగా జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల్లోంచి 40 నుంచి 50 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించినట్టు చెబుతున్నారు. వీరిలో కొంత మంది ఇంటి అద్దెలు చెల్లించలేక సొంత ఊర్లకు వెళితే.. మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ► స్టోన్‌హోస్‌పేటలోని ‘నారాయణ’ బ్రాంచిలో పనిచేసిన తెలుగు టీచర్ పట్టెం వెంకటసుబ్బయ్య ఇప్పుడు తోపుడు బండిపై అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. ఎంఏ తెలుగు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీఈడీ చదివిన వెంకటసుబ్బయ్య రెండేళ్లుగా నారాయణ విద్యాసంస్థలో పనిచేస్తున్నారు. ► అడ్మిషన్లు చేయలేదన్న కారణంతో తమను ఉద్యోగాల్లోంచి తొలగించడం దారుణమని మరో టీచర్ కాటుబోయిన శ్రీనివాసులు చెబుతున్నారు. -
విద్యాసంవత్సరం ఖరారు చేసిన యూజీసీ
సాక్షి, హైదరాబాద్ : విశ్వవిద్యాలయాల్లో చేరనున్న కొత్త విద్యార్థులకు నూతన అకడమిక్ సెషన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పేర్కొంది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్ట్‌లోనే ప్రారంభించవచ్చని తెలిపింది. ప్రస్తుత విద్యాసంవత్సర ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను జూలైలో నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫారసులు అన్నింటికీ యూజీసీ ఆమోదం తెలిపింది. కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభంతోపాటు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు, ఓపెన్ చాయిస్ అసైన్మెంట్స్, ప్రజెంటేషన్ బేస్డ్ అసెస్మెంట్కు ఆమోదం తెలిపింది. అలాగే పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించడానికి ఓకే చెప్పింది. అవకాశముంటే గతంలో సెమిస్టర్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం మార్కులను ఇవ్వడం, 50 శాతం మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ఇవ్వడానికి అంగీకరించింది. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ముందు సెమిస్టర్ మార్కులుండవు కనుక 100 శాతం ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ఇవ్వొచ్చని పేర్కొంది. ప్రతి విద్యార్థిని తదుపరి సెమిస్టర్/సంవత్సరానికి ప్రమోట్ చేయాలని పేర్కొంది. విద్యార్థులు గ్రేడ్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటే వచ్చే సెమిస్టర్లో ప్రత్యేకంగా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. 2019–20 విద్యా సంవత్సరంలో రెండో సెమిస్టర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అన్ని కోర్సులకు ఒకే రకమైన విధానాన్ని అవలంభించాలని పేర్కొంది. చదవండి: రికార్డు స్థాయిలో మరణాలు పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలా? లేక ఆఫ్‌లైన్‌లోనా అన్న విషయాన్ని తమకున్న వనరులు, విద్యార్థుల వెసులుబాటులను దృష్టిలో పెట్టుకుని వర్సిటీలే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. లాక్డౌన్ సమయంలో విద్యార్థులు క్లాస్‌లకు హాజరయినట్లే భావించాలంది. ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు అదనంగా ఆరు నెలల సమయం ఇవ్వాలని పేర్కొంది. వైవా పరీక్షను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నిర్వహించాలని పేర్కొంది. తాము పేర్కొన్నవన్నీ సూచనలుగా భావించాలని, పరిస్థితులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. 2019–20 విద్యా సంవత్సరం సెమిస్టర్‌కే కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోతే చేపట్టాల్సిన చర్యలపైనా మార్గదర్శకాలు జారీ చేసింది. ►కొన్ని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. ఆన్లైన్, ఈ–లెర్నింగ్ విధానంలో మిగిలిపోయిన సిలబస్‌ను మే 31వ తేదీలోగా పూర్తి చేయాలని పేర్కొంది. ప్రాజెక్టు వర్క్స్‌ను మే 16 నుంచి 31లోగా పూర్తి చేయాలని తెలిపింది. జూన్ 16 నుంచి 30వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వాలంది. జూన్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలి వస్తే మాత్రం జూన్ 15 వరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలి. ఇవి మినహా 2020–21, 2021–22లో విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలకు, పరీక్షల విధానాలకు ఓకే చెప్పింది. ►ప్రస్తుత కరోనా విస్తృతి నేపథ్యంలో ప్రతి విద్యా సంస్థ విద్యార్థులు గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను స్వీకరించాలి. వాటిని త్వరగా పరిష్కరించాలి. ►యూజీసీ కూడా హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. పరీక్షలు, అకడమిక్ కార్యక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ►విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనివర్సిటీలు సోషల్ డిస్టెన్స్ అమలు చేసేలా పక్కా ఏర్పాట్లు చేయాలి. ►విద్యా సంస్థల్లో 25 శాతం బోధన ఆన్లైన్లో చేపట్టేలా, 75 శాతం బోధన ప్రత్యక్ష పద్ధతిలో చేసేలా చర్యలు చేపట్టాలన్న సిఫారసుకు యూజీసీ ఓకే చెప్పింది. ►రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్స్ ఇచ్చినా సాధారణ పరిస్థితి వచ్చాక, వీలైతే జూలైలో వారికి పరీక్షల నిర్వహించాలని పేర్కొంది. ►ప్రతి యూనివర్సిటీ కరోనా (కోవిడ్–19) సెల్‌ను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల విద్యా సంబంధ అంశాలు, అకడమిక్ కేలండర్, పరీక్షలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలి. ►ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించేలా ప్రతి యూనివర్సిటీ ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలి. 6 రోజుల పని విధానం అమలు చేయాలి. ►ఇప్పటికే ఉన్న విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి, ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. తరగతులూ ప్రారంభిస్తారు. 2021–22 విద్యా సంవత్సరం మాత్రం 2021 ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. -
టీచర్ ‘చదువులకు’ వెనకాడుతున్నారు
2012లో ఉమ్మడి రాష్ట్రంలో టీచర్ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో చర్యలు తీసుకుంది. భర్తీ ఇంకా పూర్తి కాలేదు. భర్తీలో జాప్యం, ప్రైవేట్‌లో వచ్చే వేతనాలు తక్కువగా ఉండటం టీచర్ కోర్సులపై ప్రభావం చూపుతోంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులకు డిమాండ్ తగ్గిపోతోంది. విద్యారంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇచ్చేవేతనాలు చాలక ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. గతంలో టీచర్ కావాలన్న ఆశతో భారీ ఎత్తున ఉపా ధ్యాయ కోర్సులను అభ్యసించగా క్రమంగా డిప్లొమా ఇన్ ఎలి మెంటరీ ఎడ్యు కేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకాడుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. డీఎడ్‌లో గతంలో 11 వేలకుపైగా విద్యార్థులు చేరితే ఇప్పుడు ఆ సంఖ్య 5 వేలకు పడిపోయింది. అలాగే బీఎడ్‌లోనూ గతంలో 16 వేల మందికిపైగా విద్యార్థులు చేరితే వారి సంఖ్య 12 వేలకు తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరంలో పదుల సంఖ్యలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తగ్గిపోయిన అవకాశాలు.. ఉపాధ్యాయ విద్యలో 2010 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. దీంతో ఆ ప్రభావం నియామకాలపైనా పడుతోంది. ఫలితంగా 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపట్టింది. ఆ నోటిఫికేషన్ ద్వారా 8,972 పోస్టులను భర్తీ చేస్తోంది. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు రంగంలో ఇచ్చే వేతనాలు తక్కువగా ఉంటుండటంతో ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. డీఎడ్‌కు భారీ దెబ్బ... బీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే డీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అభ్యర్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఒకప్పుడు డీఎడ్‌తోపాటు బీఎడ్ చేసిన వారు కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులే. అయితే 2010లో కొత్త నిబంధనల ప్రకారం బీఎడ్ చేసిన వారు కేవలం స్కూల్ అసిస్టెంట్‌గానే వెళ్లాలని, ఎస్జీటీ పోస్టులకు అనర్హులని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో అప్పటి నుంచి బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది. అయితే గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం మరో నిబంధనను అమల్లోకి తెచ్చింది. బీఎడ్ చేసిన వారు ఉద్యోగం వచ్చాక చైల్డ్ సైకాలజీలో ఆరు నెలల ఇండక్షన్ ట్రైనింగ్ చేస్తే సరిపోతుందని పేర్కొంది. దీంతో డీఎడ్‌లో చేరే వారి సంఖ్య మరింతగా తగ్గిపోయింది. పైగా ఇంటర్ తరువాత రెండేళ్ల డీఎడ్ చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. డిగ్రీ పూర్తయ్యాక ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటే బీఎడ్ చేయవచ్చన్న ఆలోచన విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఒకవేళ డీఎడ్ రెండేళ్లు చేసినా స్కూల్ అసిస్టెంట్ కావాలంటే మళ్లీ మూడేళ్లు డిగ్రీ చేయాలి. దాంతోపాటు మరో రెండేళ్లు బీఎడ్ చేయాల్సి వస్తోంది. వాటి కంటే ఇంటర్ తరువాత డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత బీఎడ్ చేస్తే సరిపోతుందన్న ఆలోచనలకు విద్యార్థులు వస్తున్నారు. దీంతో డీఎడ్వైపు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. మూసివేతకు యాజమాన్యాల దరఖాస్తులు... రాష్ట్రంలో బీఎడ్, డీఎడ్ కాలేజీలను నడుపలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. గత ఐదేళ్లలో బీఎడ్, డీఎడ్ కాలేజీల సంఖ్య తగ్గిపోయింది. 2015–16 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 225 బీఎడ్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 208కి తగ్గిపోయింది. ఇందులో ఈ విద్యా సంవత్సరంలో 7–8 కాలేజీలు మూతపడ్డాయి. ఇక డీఎడ్ కాలేజీలు 210 ఉండగా ప్రస్తుతం అవి 140కి తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో గత విద్యా సంవత్సరంలో 30 కాలేజీలు మూతపడగా ఈ విద్యా సంవత్సరంలో 40 డీఎడ్ కాలేజీలు మూసివేత కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఆ మేరకు కాలేజీలు తగ్గిపోయాయి. -
దోస్త్ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం దోస్త్ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ ప్రవేశాల్లో చేరేందుకు బుధవారం నుంచి 21 వరకు దోస్త్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. అలాగే బుధవారం (నేటి) నుంచి ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. 26వ తేదీన ప్రత్యేక విడత సీట్లు కేటాయిస్తామని.. 26 నుంచి 29 తేదీల్లో కాలేజీల్లో చేరేందుకు గడువు ఉంటుందని చెప్పారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసి వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారితో పాటు గతంలో ఇచ్చినా సీటు దక్కని వాళ్లు కూడా ఈ ప్రత్యేక విడతలో మరోసారి ప్రయత్నం చేయొచ్చని ఆయన వెల్లడించారు. సీటు వచ్చిన కాలేజీల్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు మళ్లీ రూ.400 చెల్లించి తాజాగా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సీటు వచ్చి కాలేజీల్లో చేరిన విద్యార్థులు మెరుగైన సీటు కోసం ప్రయత్నిస్తే మూడో విడత వెబ్ ఆప్షన్లనే మళ్లీ సమర్పించాల్సి ఉంటుందని లింబాద్రి వివరించారు. -
అడ్మిషన్స్ క్లోజ్డ్
సాక్షి, ఒంగోలు టౌన్: నూతన ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ రంగ విద్యకు గత వైభం రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాలే దీనిని బలపరుస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు పోటెత్తుతున్నారు. గత ఏడాది ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం, ఈ ఏడాది ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరగడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. దానికితోడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యకు పెద్ద పీట వేయడం కూడా పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరగడానికి కారణమైంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేయడంతోపాటు పాఠశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించడంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు పోటీ పడుతున్నారు. కనుమరుగు నుంచి కళకళ గతంలో ప్రభుత్వ పాఠశాలలు అవసాన దశలో ఉండేవి. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగా ఉండేది. దాంతో ఉపాధ్యాయులు కూడా ఉన్న కొద్ది మందికి నామమాత్రంగా పాఠాలు బోధించేవారు. ఏటికేడు విద్యార్థుల సంఖ్య దిగజారిపోతుండటంతో చివరకు అక్కడ పాఠశాలలు కనుమరుగయ్యాయి. పాఠశాలల రేషనలైజేషన్ పేరుతో గత ప్రభుత్వం వాటి సంఖ్యను రాష్ట్రవ్యాప్తంగా కుదించేసింది. 2014–2015 విద్యా సంవత్సరంలో 393 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 72 ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా డీ గ్రేడ్ అయ్యాయి. 20 మంది కంటే విద్యార్థులు తక్కువగా ఉంటే ఆ పాఠశాలలు కనుమరుగు అయ్యేవి. అలాంటి స్థితి నుంచి నేడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. విద్యారంగానికే ప్రాధాన్యత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన సమయంలో ఎక్కువగా విద్యాశాఖ గురించే ఉండటం విశేషం. ప్రభుత్వ విద్యకు అగ్రస్థానం ఇస్తున్నారు. దానికితోడు అమ్మ ఒడి పథకం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేందుకు ఎంతగానో దోహదపడుతోంది. పేదరికంలో ఉన్నప్పటికీ తమ పిల్లలను బడికి పంపిస్తే ప్రతి ఏటా 15వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించి పేదింటి బిడ్డల చదువుకు భరోసా ఇచ్చారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరగడం, ఇంకోవైపు ప్రభుత్వం నుంచి గట్టి భరోసా రావడంతో తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. నగరంలో పెరుగుతున్న బోర్డుల సంఖ్య ఒంగోలు నగరంలోని ప్రభుత్వ, మునిసిపల్ పాఠశాలల్లో అడ్మిషన్ క్లోజ్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇటీవల స్థానిక బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడంతో అడ్మిషన్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టారు. ఆ పాఠశాల ప్రాంగణంలోని మోడల్ స్కూల్లో కూడా పరిమితికి మించి విద్యార్థినులు చేరడంతో అడ్మిషన్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టారు. తాజాగా స్థానిక కోర్టు సెంటర్లోని పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో కూడా అడ్మిషన్ క్లోజ్డ్ అనే బోర్డు పెట్టారు. ఆ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 419 మంది విద్యార్థినులు చేరారు. ఈ విద్యా సంవత్సరంలో 480 మంది చేరాలంటూ నగర పాలక సంస్థ కమిషనర్ కంఠమనేని శకుంతల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు. దాంతో ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఉపాధ్యాయులు కూడా గట్టిగా కృషి చేయడంతో 560 మంది చేరారు. దీంతో అడ్మిషన్ క్లోజ్డ్ అని పాఠశాల గోడలపై నోటీసు రూపంలో అంటించారు. నగరంలోని మునిసిపల్ పాఠశాలలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అనేక చోట్ల అడ్మిషన్ క్లోజ్డ్ అనే బోర్డులు వెలవనున్నాయి. -
ప్లీజ్.. నో అడ్మిషన్
భీమవరం(పశ్చిమ గోదావరి) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ‘అమ్మఒడి’ పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. భీమవరం పట్టణం నాచువారి సెంటర్లోని పొట్టిశ్రీరాములు మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు భారీ స్థాయిలో జరిగాయి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటుచేశారు. మంగళవారం పాఠశాలను సందర్శించిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్వీ రమణ పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య ప్రకారం పాఠశాలలో 750 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లకు అవకాశం ఉందని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 850 మించిపోవడంతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటుచేశారు. నూతనంగా భవన నిర్మిస్తే విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు అవకాశం ఉందని హెచ్ఎం చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కేవీవీ భోగేశ్వరరావు, ఉపాధ్యాయులు వీఎం రాధాకృష్ణ, జె సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లోని పరీక్షతో బ్రిటన్‌లో చదవొచ్చు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈతో పాటు ఇతర పోటీ పరీక్షల ద్వారా కూడా విద్యార్ధులను ఎంపిక చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌లోని క్వీన్ యూనివర్సిటీ తెలిపింది. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో వారికి అవకాశం కల్పిస్తామని వైస్ చాన్స్‌లర్ ఇయాన్ గ్రీర్ స్పష్టంచేశారు. సాధారణంగా యూకే యూనివర్సిటీలు లెవెల్–ఏ పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే ప్రవేశ పరీక్షలకు వివిధ దేశాల్లో విభిన్న ప్రామాణికతలు ఉంటాయని, భారత్‌లోని పరీక్షలు తాము నిర్దేశించుకున్న స్థాయిలోనే ఉన్నాయని ఇయాన్ అన్నారు. చాలా మంది విద్యార్థులు ప్రతిభ ఉన్నా సీట్ల కొరతతో ఐఐటీల్లో చేరలేకపోతున్నారన్నారు. మరో అవకాశం లేక తక్కువ స్థాయి ఉన్న కాలేజీల్లో చేరతారన్నారు. ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ కాలేజీల్లో చదివే అవకాశం కల్పిస్తామన్నారు. జేఈఈలాగే ఇతర జాతీయ స్థాయి పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకునే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా 200 మందికి పైగా భారత విద్యార్థులను చేర్చుకున్నామని, రానున్న అయిదేళ్లలో మరింత మందిని చేర్చుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. -
సర్కారు బడి భళా..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పుంజుకుంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని తాళలేక విద్యార్థులు క్రమంగా సర్కారు బడిబాట పడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 3 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన బడిబాట తాలూకు ప్రాథమిక గణాంకాలను శనివారం విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 3.02 లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. గత సంవ త్సరం ఇదే సమయానికి 1.86 లక్షల మంది విద్యార్థులే అడ్మిషన్లు తీసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు నిరంతర ప్రక్రియ. అయితే ప్రతి పాఠశాల సమాచార నివేదికలో నిర్ణీత తేదీ నాటికి కొత్త అడ్మిషన్లు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను నమోదు చేస్తుంది. ఈ క్రమంలో వచ్చే నెలాఖరు నాటి వివరాల ఆధారంగా పాఠశాలల్లో చేరిన విద్యార్థుల గణాంకాలపై స్పష్టత వస్తుంది. గురుకులాల తర్వాత ప్రభుత్వ బడులే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు తీవ్ర పోటీ నెలకొంది. వాటి ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలపై కొంత ప్రభావం పడింది. కానీ గురుకులాల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు చూస్తున్నారు. రాష్ట్రంలో 40 వేల పాఠశాలలున్నాయి. వాటిలో 10 వేల స్కూళ్లను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తుండగా మిగతా 30 వేల స్కూళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. గతేడాది గణాంకాల ఆధారంగా విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో 52 శాతం విద్యార్థులున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేవలం 42 శాతమే ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా మారుతున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. తాజాగా నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఏకంగా 3 లక్షల మంది విద్యార్థులు నమోదు కావడమే అతిపెద్ద ఉదాహరణ. ఈ నమోదు సంఖ్య ప్రైవేటు పాఠశాలల్లో 10 శాతం విద్యార్థుల సంఖ్యకు సమానం కావడం గమనార్హం. ఈ ఏడాది బడిబాటలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 20,117 మంది విద్యార్థులు నమోదయ్యారు. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 3,836 మంది విద్యార్థులు నమోదయ్యారు. 30 శాతం స్కూళ్లలో 100 శాతం ఫలితాలు రాష్ట్రంలో 4,637 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 1,580 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. ఇవి కాకుండా 185 కేజీబీవీలు, 97 ఆదర్శ పాఠశాలలు, 33 ఎయిడెడ్ పాఠశాలలు, 47 ఆశ్రమ పాఠశాలలు, 59 ప్రభుత్వ పాఠశాలలు కూడా నూరు శాతం ఫలితాలు సాధించాయి. అదే ప్రైవేటు కేటగిరీలో 5,177 స్కూళ్లకుగాను 2,279 స్కూళ్లలో మాత్రమే వంద శాతం ఫలితాలొచ్చాయి. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ భారీగా పెరిగింది. హైస్కూల్ విద్యార్థికి ట్యూషన్ ఫీజు రూపంలో ఏటా రూ. లక్ష చెల్లించాల్సి వస్తోంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు ప్రభుత్వ బడిబాట పడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు అల్పాహారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఈ కారణంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పన సమస్యకు పరిష్కారం చూపితే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. -
‘కార్పొరేట్’ గాలం!
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథకాలనీకి చెందిన లావణ్య చదువులో మేటి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఈ బాలిక ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందినందున ప్రైవేట్ కాలేజీలో చదువుకునే ఆర్థికస్తోమత లేదు. ఇది తెలుసుకున్న ఓ వ్యక్తి లావణ్య తండ్రి కృష్ణకుమార్‌కు ఫోన్ చేసి ‘నేను హైదరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను. మీ కూతురిని మా కాలేజీలో చేర్పిస్తే చదువుకయ్యే ఖర్చునంతా మేమే భరిస్తాం..’ అని హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేట్ చదువు ఉచితంగా అందుతుందనే ఉద్దేశంతో ఆ తండ్రి అందుకు అంగీకరించారు. ఇలా ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ ఇలాంటి ఫోన్‌కాల్స్ వస్తూనే ఉన్నాయి. వారి ప్రతిభను తెలుసుకున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఏజెంట్లు విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించి ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునేలా గాలం వేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో అప్పుడే ఇంట ర్మీడియెట్ అడ్మిషన్ల హడావుడి మొదలైంది. ప్రస్తుతం ఆయా కాలేజీల పోటాపోటీ ప్రచారాలు.. ఫోన్ కాల్స్‌తో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది. విద్య వ్యాపారంలో ట్రెండ్ మార్చిన కార్పొరేట్ కాలేజీలు వినూత్న పద్ధతిలో మొదలుపెట్టాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు స్థానిక పాఠశాలల నుంచి తెప్పించుకున్న కాలేజీ యాజమాన్యాలు.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఆకర్షించేందుకు శతవిధాలా యత్నిస్తున్నాయి. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్లు చేయించుకునేందుకు జిల్లాలో ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో డిగ్రీ పూర్తి చేసిన కొందరిని నియమించుకున్నాయి. కొందరిని వేతనాల వారీగా, ఇంకొందరిని పర్సంటేజీల రూపంలో డబ్బు చెల్లిస్తున్నాయి. మరికొన్ని కాలేజీలైతే.. ఏకంగా తమ ఏజెంట్లకు ప్రచారకర్తల పదవులతో గుర్తింపు కార్డులూ జారీ చేసేశాయి. కేవలం ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో బడా కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే పదుల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకోవడం గమనార్హం. ఇప్పటికే రంగంలో దిగిన ఆయా కాలేజీల ఏజెంట్లు అడ్మిషన్లతో హోరెత్తిస్తున్నారు. ఈ విషయంలో లక్ష్యాలను నిర్దేశించుకుని.. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా వాటిని పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 41,364 మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో చాలావరకు ప్రైవేట్ కా>లేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 110 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు గ్రూపుతో పాటు విద్యార్థులకు ఇచ్చే ఇతర పరీక్షల శిక్షణను బట్టి ఏడాది రూ. పది వేల నుంచి రూ.40వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. పాలమూరు టు హైదరాబాద్! స్థానికంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలే గాక హైదరాబాద్‌కు చెందిన పలు కార్పొరేట్ కాలేజీలు సైతం పాలమూరు జిల్లాపై దృష్టి సారించాయి. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గుర్తించి వారిని తమ కాలేజీల్లో చేర్పించుకునేందుకు ఏజెంట్లను నియమించుకున్నాయి. మంచి ఫలితాలు సాధించిన వారికి ఉచిత విద్య, వసతి వల వేస్తున్నాయి. మిగతా విద్యార్థులకు వచ్చిన జీపీఏను బట్టి ఫీజు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా ఎంపీసీ విద్యార్థులు ఎంసెట్, ఐఐటీ, ఏఐఈఈఈ, జేఈఈ, ఎన్ఈటీ, సీఏ కోర్సుల వైపు మొగ్గు చూపుతారు. బైపీసీ విద్యార్థులు బీ–ఫార్మసి, ఎంబీబీఎస్, బీయూఎంఎస్, కోర్సుల వైపు; ఎంపీసీ, సీఈసీ విద్యార్థులు సీఏ, సివిల్స్ కోసం యత్నిస్తుంటారు. వీరిలో సంబంధిత కోర్సులు.. వాటి కాలానికనుగుణంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో కేవలం ఫస్టియర్ వరకే ఎంసెట్, ఐఐటీ ఎంట్రెన్స్ శిక్షణ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులను ‘ఇన్కేర్’ బ్యాచ్‌గా విభజించి రూ.1.05లక్షల నుంచి రూ. 1.4లక్షల వరకు ఫీజు నిర్ణయించుకున్నాయి. అదే జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీలయితే సాధారణ ఫీజుతోపాటు అదనంగా మరో రూ.40వేలు తీసుకుంటున్నాయి. వీరికి రెండో సంవత్సరంలో ఎలాంటి శిక్షణ ఉండదు. ఐఐటీ, ఏఐఈఈఈ ఎంట్రెన్స్ శిక్షణ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులను ‘స్పార్క్’ బ్యాచ్‌గా విభజించి ఫస్టియర్‌తో పాటు సెకండియర్ సగం విద్యా సంవత్సరం వరకు శిక్షణ ఇస్తారు. వీరి నుంచి హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ కాలేజీలు ఏటా రూ.1.25లక్షలు, జిల్లాకు చెందిన కాలేజీలు రూ.50వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. చదువులో వెనకబడిన వారిని రెగ్యులర్ బ్యాచ్‌గా విభజించి కేవలం వార్షిక పరీక్షలో పాస్ అయ్యేలా బోధిస్తారు. వీరి నుంచి కార్పొరేట్ కాలేజీలైతే రూ.60వేల నుంచి రూ.లక్ష.. జిల్లాకు చెందిన కాలేజీలు అదనంగా రూ.20వేల వరకు వసూలు చేస్తారు. మెరిట్ విద్యార్థులను ‘జూనియర్ ఫాస్ట్ ట్రాక్’ బ్యాచ్ కింద చేర్చి.. వారికి ఐఐటీ, ఏఐఈఈఈ, జేఈఈ, ఎన్ఈటీ ఎంట్రెన్స్‌కు శిక్షణ ఇస్తారు. వీరి నుంచి ఏటా రూ. 1.35లక్షల వరకు ఫీజు నిర్ణయించారు. రూ.5వేలకే సీటు బుకింగ్ నాణ్యమైన విద్య.. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామంటూ పదో తరగతి విద్యార్థులు.. వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు రూ.ఐదు వేలకే అడ్మిషన్ ఖాయం చేసేస్తున్నాయి. టెన్త్ ఫలితాల్లో సాధించిన జీపీఏను బట్టి విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందని చెబుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందకపోవడం.. చెప్పుకోదగ్గ కాలేజీలు లేకపోవడం.. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను పెద్ద కాలేజీల్లో చదువు చెప్పించాలనే ఆశను ఆసరాగా చేసుకుని పలు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇలా గాలం వేస్తున్నాయి. కాలేజీలు పునఃప్రారంభమైన తర్వాత సీట్లు దొరుకుతాయో లేదోనని విద్యార్థుల తల్లిదండ్రులూ ఇప్పట్నుంచే సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కాగా, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒక్కో ఏజెంట్‌కు ప్రతి అడ్మిషన్‌పై రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల వరకు చెల్లిస్తున్నాయి. జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీలు మాత్రం రూ.2,500 నుంచి రూ.నాలుగు వేల వరకు (విద్యార్థులు చెల్లించే ఫీజును బట్టి) ఇస్తున్నాయి. -
గంటలో 247 అడ్మిషన్లు!
తిరువనంతపురం: నాణ్యమైన విద్యను అందిస్తే.. ఆ పాఠశాలకు, టీచర్లకు పిల్లల్లో, తల్లిదండ్రుల్లో ఎంతటి డిమాండ్ ఉంటుందో చెప్పేందుకు కేరళలలోని ఓ పాఠశాల తాజా ఉదాహరణగా నిలుస్తోంది. చదువంటే కేవలం అక్షరాలు రుద్దించడం మాత్రమే కాదని, పిల్లల్ని అన్నివిధాలా తీర్చిదిద్దడమేనని నిరూపిస్తున్న సదరు పాఠశాలలో ప్రవేశాలకు క్యూ కడుతున్నారు. ప్రవేశాలను ప్రారంభించిన తొలి గంటలోనే 247 మంది చేరారంటే.. ఆ పాఠశాల మిగతావాటి కంటే భిన్నమైనదనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే.. కేరళలోని అలప్పుజా జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాల కోసం మే 3న 15 కౌంటర్లు తెరిచారు. దీంతో ఒక్క గంటలోనే 247 మంది ప్రవేశం పొందారు. ఫస్ట్ క్లాసులో 170 మంది, రెండో తరగతిలో ఆరుగురు, మూడో తరగతిలో ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. ఇక ఎల్కేజీ, యూకేజీలోనైతే భారీగా చేరారు. ఇంతగా ఈ పాఠశాలలో చేరడానికి కారణమేంటంటే.. ఇక్కడ చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఎక్స్ట్రా – కరిక్యూలర్ యాక్టివిటీస్ చేయించడానికి కూడా అంతకు మించి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే గతేడాది రెండున్నర గంటల్లో 233 మంది విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. ఈసారి ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. కాగా ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ పుష్పలత తెలిపారు. మొత్తంగా ఈ పాఠశాలలో 650 మంది విద్యార్థులు చదువుతున్నారు. -
పిల్లలను బడిలో చేర్పిస్తేనే కొలువు ఉంటుంది!
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చిరుద్యోగుల బతుకులు చిత్తవుతున్నాయి. నేటి నుంచి వేసవి సెలవులు. భార్య, పిల్లలతో సరదాగా గడపాల్సిన టీచర్లు అడ్మిషన్ల వేటలో పడ్డారు. జూన్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థుల కోసం అడ్మిషన్ల వేట మొదలైంది. ప్రైవేట్/కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఆ పాఠశాలల్లో పని చేయాలో? లేక బయటకు రావాలో.. తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు. టార్గెట్ చేరుకుంటేనే జీతాలు.. ప్రైవేట్/కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నెల నుంచే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గ్రామాలు, పట్టణాల్లోకి పంపిస్తున్నారు. ఓట్ల ప్రచారం, ఇంటింటి సర్వేలు చేసే వారిలా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా..ఏం చదువుతున్నారని అడిగి వారిని తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఓసారి మా పాఠశాలలో వసతులు చూడండి..ఫీజులు పరిశీలించండి.. ఫలితాలు చూడండంటూ ఏకరువు పెడుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర చదువుకునే పిల్లలను, వారి తల్లిదండ్రులను కూడా వదలడం లేదు. ఆ వీధిలో ఉండేవారినో, బంధువుల పిల్లలనైనా మా స్కూల్లో, లేదా కళాశాలలో చేర్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు. రోజు ఫోన్ చేయటం, మెసేజ్‌లు పెట్టి అభ్యర్థిస్తున్నారు. ఒక్కొక్కరు 10–15 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించాలి. అలా చేర్పిస్తేనే జీతాలు ఇస్తారు. లేకుంటే జీతం రాదు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో సదరు విద్యాసంస్థ నుంచి పరీక్షలకు హాజరైన విద్యార్థులు భారీ ఎత్తున ఫెయిల్ కావటంతో తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నామని లెక్చరర్స్ వాపోతున్నారు. సమ్మర్లో జీతాలు ఇవ్వరు..పని చేయాల్సిందే కొన్ని విద్యాసంస్థల్లో ఏడాదికి కేవలం 10 నెలలు మాత్రమే జీతాలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. కాదు కూడదంటే ఉద్యోగాలు వదిలేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. 2 నెలలపాటు జీతాలు అందక కుటుంబాలను నడపటానికి ఉపాధ్యాయులు నానాఇబ్బందులు పడుతున్నారు. సెలవుల్లో సైతం కొత్త అడ్మిషన్ల వేటలో పడాల్సిందే. అనుకున్న టార్గెట్ సాధించాల్సిందే. కొంతమంది ఉపాధ్యాయులు టార్గెట్ నుంచి తప్పించుకోవటానికి తమ సొంత ఖర్చులతో అడ్మిషన్ ఫీజులు చెల్లించి యాజమాన్యాల ఒత్తిడి నుంచి తప్పించుకుంటున్న పరిస్థితి. విద్యార్థులకూ తప్పని తిప్పలు.. తమ విద్యాసంస్థలో చదివే విద్యార్థులను సైతం ఒక్కో విద్యార్థి ఒక్కొక్కరిని కొత్తగా స్కూల్లో జాయిన్ చేయాలంటూ టీచర్ల ద్వారా చెప్పించి నైతిక విలువలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారు. అడ్మిషన్లు చేయించకపోతే స్కూల్ యాజమాన్యాల చేతిలో ఉన్న మార్కులు పడవేమోనన్న భయాందోళనలు సృష్టిస్తున్నారు. యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకుంటున్న పాపానపోవటం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ పెద్దలకు అందుతున్న ముడుపుల వల్లే చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. వెంకటేశ్వరరావు (36) (పేరు మార్చబడినది) ఎంఎస్సీ(మాథ్స్), ఎంఈడీ చేసి విజయవాడలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆయన స్కూల్ ముగిశాక కొన్ని పేపర్లు పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ‘‘ సార్..మీ అమ్మాయి/ అబ్బాయిని మా స్కూల్లో చేర్పించండి. మీ పిల్లలను చేర్పించలేకపోతే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి సార్..ప్లీజ్. మాకు టార్గెట్ విధించిన అడ్మిషన్స్ పూర్తి చేయకపోతే వేసవి సెలవుల్లో జీతాలు రావు. కనీసం ఓ ఐదారు మందిని కొత్తగా చేర్చకపోతే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగమే పోయే ప్రమాదముంది సార్, ’’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద వాపోతున్నాడు. ఇది ఒక్క వెంకటేశ్వరరావు పరిస్థితే కాదు రాష్ట్రంలోని దాదాపు 30వేల ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పని చేస్తోన్న 4.5 లక్షల మంది ప్రైవేట్ టీచర్లందరిది ఇదే దుస్థితి. యాజమాన్యాలు విధించిన టార్గెట్‌ను పూర్తి చేయకపోతే ఉద్యోగాలు పోయే ప్రమాదముండటంతో దిక్కుతోచని స్థితిలో మండుటెండల్లో ఇంటింటికి తిరుగుతూ పాట్లు పడుతున్నారు. యాజమాన్యాల వేధింపులను కట్టడి చేయాలి... అడ్మిషన్లు చేయించాలంటూ ఉపాధ్యాయులపైన పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. చట్టం ప్రకారం వేసవి సెలవుల్లో తరగతులు, అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహించడం నేరమని ప్రశ్నించిన వారిపై వేధింపులకు దిగుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వకపోవటం, జీతాలు కట్ చేయటం వంటి వాటిపై ప్రభుత్వం స్పందించి యాజమాన్యాల దాష్టికాలను అరికట్టాలి. – డి.అంబేడ్కర్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ -
ఐటీఐలలో ఐదు ట్రేడ్లు ఔట్!
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లలో డిమాండ్ లేని ట్రేడ్లను రద్దు చేయాలని కార్మిక, ఉపాధి కల్ప న శాఖ నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో అడ్మిషన్లను పరిగణిస్తూ.. గత మూడేళ్లుగా అడ్మిషన్ల తీరును విశ్లేషించింది. ఇప్పటికే ఐదు ట్రేడ్లలో ప్రవేశాల్లేవు. ఆయా రంగాల్లో ఉపాధి కల్పన కూడా ఆశాజనకంగా లేకపోవడంతో వాటిని రద్దు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫౌండ్రీమన్, షీట్ మెటల్ వర్కర్, రేడియో అండ్ టీవీ మెకానిక్, వైర్‌మెన్, సెక్రెటేరియల్ ప్రాక్టీస్ ట్రేడ్లు రద్దు కానున్నాయి. రాష్ట్రంలో 290 ఐటీఐలు ఉన్నాయి. వీటిలో 65 ప్రభుత్వ ఐటీఐలు కాగా, 235 ప్రైవేటు సంస్థ లు నిర్వహిస్తున్నాయి. వీటి పరిధిలో 50 వేల మంది వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు. ట్రెండ్‌కు తగ్గ ట్రేడ్లు.. నైపుణ్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి నిపుణులను తయారు చేసేలా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. అక్కడున్న పరిస్థితులు, ఉపాధి అవకాశాల ఆధారంగా ఐటీఐలలో కొత్త ట్రేడ్లు ఏర్పాటు చేసుకునే వీలుంది. దీంతో డిమాండ్ లేని వాటిని తొలగించి కొత్త ట్రేడ్ల చేర్పుపై ఉపాధి కల్పన, శిక్షణల విభాగం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న ఐటీఐలలో 32 ట్రేడ్లు ఉన్నాయి. వీటిలో 13 ట్రేడ్లకు శిక్షణ కాలం ఏడాది కాగా, 18 ట్రేడ్లు రెండేళ్ల కాల పరిమితి కేటగిరీలో ఉన్నాయి. మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్ ట్రేడ్ పూర్తికి మాత్రం మూడేళ్లు పడుతుంది. ప్రస్తుత ట్రేడ్లలో ఐదింటిలో ప్రవేశాల్లేవు. తొలగించిన స్థానంలో కొత్తగా ఐదు ట్రేడ్లు చేర్చే అంశంపై ఉపాధి కల్పన, శిక్షణ శాఖ అధ్యయనం చేస్తోంది. వచ్చే విద్యా ఏడాది నాటికి కొత్త ట్రేడ్ల చేర్పుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఐటీఐలలో కామన్ ట్రేడ్లు అమలు చేసే దానిపైనా అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రతి ఐటీఐని పరిశ్రమలతో అనుసంధానం చేసి, ఉపాధి అవకాశాలు పెంచే లా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. -
246 కళాశాలల్లో విద్యార్థుల్లేరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంకట స్థితి తలెత్తింది. అత్యున్నత విద్యా ప్రమాణాలతో బోధన చేపట్టాల్సిన కాలేజీలకు నిర్వహణ భారం గుదిబండగా మారింది. ఈ పరిస్థితిని తట్టుకోలేక యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నా యి. 2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 246 కాలేజీల్లో బోధన నిలిచిపోయినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 6,306 కాలేజీలున్నాయి. ఆయా కాలేజీలు ఏటా సంబంధిత యూని వర్సిటీ/ బోర్డు నుంచి గుర్తింపు పత్రాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీల్లో బోధనా సిబ్బంది, మౌలిక వసతులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని వర్సిటీ/బోర్డు అనుమతులు జారీ చేస్తుంది. అనుమతులున్న కాలేజీల్లోనే విద్యార్థుల ప్రవేశానికి వీలుం టుంది. ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ గుర్తింపు ఉన్న కాలేజీలకే వర్తిస్తాయి. ఈ క్రమంలో ఈ ఏడాది 6,060 కాలేజీలు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోగా వాటిలో ఇప్పటివరకు 5,788 కాలేజీలకే గుర్తింపు పత్రాలు జారీ అయ్యాయి. మిగతా కాలేజీల గుర్తింపు ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. బోధనకు దూరంగా 246 కాలేజీలు... 2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 246 కాలేజీల్లో ప్రవేశాలు జరగలేదు. ఇంటర్మీడియెట్ ప్రవేశాలు మాన్యువల్ పద్ధతిలో నిర్వహించగా డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్లో చేపట్టారు. పీజీ, ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు పూర్తి చేశారు. ఆన్లైన్, సెట్ల ద్వారా నిర్వహించే అడ్మిషన్ల ప్రక్రియలో కాలేజీలు ముందుగా అనుమతి పత్రాలు, కోర్సు వివరాలను కన్వీనర్లకు సమర్పించాల్సి ఉంటుంది. కాలేజీలు వివరాలు ఇచ్చాకే వాటి ఆధారంగా సీట్ల లభ్యతనుబట్టి అడ్మిషన్లు పూర్తవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 246 కాలేజీలు సమ్మతి పత్రాలు సమర్పించకపోవడంతో ఆయా కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోలేదు. డిగ్రీ, పీజీ కాలేజీలే అత్యధికం... ఈ ఏడాది ప్రవేశాలు జరగని వాటిలో అత్యధికంగా డిగ్రీ, పీజీ కాలేజీలే ఉన్నాయి. డిగ్రీ, పీజీ కేటగిరీలో ఏకంగా 197 కాలేజీల్లో విద్యార్థులు చేరలేదు. అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 87 కాలేజీలుండగా... ఆ తర్వాత స్థానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 53 కాలేజీలున్నాయి. ఈ ఏడాది 15 ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రవేశాలు జరగలేదు. అదేవిధంగా నర్సింగ్, లాబ్‌టెక్నీషియన్ కోర్సులకు సంబంధించిన పారామెడికల్ కాలేజీలు 8, ఐటీఐలు 7, బీఈడీ కాలేజీలు 4, టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు పరిధిలోని 4 పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు జరగలేదు. యునివర్సిటీ/బోర్డులవారీగా రెన్యువల్ కాని కాలేజీలు యూనివర్సిటీ/బోర్డు కాలేజీలు ఎల్ఈటీ 7 డీఎస్ఈ 4 జేఎన్టీయూ 15 కాకతీయ 53 మహాత్మాగాంధీ 20 ఉస్మానియా 87 పాలమూరు 18 శాతవాహన 19 తెలంగాణ 6 -
‘రీయింబర్స్మెంట్’ ఎగ్గొట్టేందుకు అడ్మిషన్లనే ఆపేశారు
సాక్షి, అమరావతి:రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు కనీసం కోర్సుల్లో చేరేందుకు కూడా అవకాశం కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న వైనమిది. ఒకవైపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ కోర్సులు అభ్యసి స్తున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి వస్తుందని ఏకంగా పారామెడికల్ కోర్సులకు అడ్మిషన్లనే ఆపేసింది. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఎగ్గొట్టేందుకోసం ఇలా చేయడం గమనార్హం. 2018–19 సంవత్సరానికి పారామె డికల్ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ నోటిఫి కేషన్ ఇవ్వకుండా ఆపేయడం వల్ల రాష్ట్రంలో 50 వేల మందికిపైగా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా అడ్మిషన్లు జరపకుండా నిలిపేసిన ఘటన లేనే లేదు.కానీ ఏపీలోని ప్రభుత్వానికే ఇది సాధ్యమైంది. పేద విద్యార్థుల కల చెదిరింది.. రాష్ట్రంలో పారామెడికల్ కోర్సులకు సంబంధించి ప్రభుత్వ కళాశాలల్లో 861 సీట్లు ఉండగా.. ప్రైవేటు కళాశాలల్లో 49,572 సీట్లు ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సుల్లో చేరేవారిలో అత్యధికులు పేద కుటుంబాలకు చెందినవారే. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందినవారు, ఇతర బీసీ వర్గాల విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు. వైద్య ఆరోగ్యశాఖలో వృత్తి నైపుణ్య కోర్సులుగా పేరున్న ఈ కోర్సుల్లో చేరినట్లయితే.. కనీసం ప్రైవేటు రంగంలోనైనా త్వరగా ఉద్యోగాలొ స్తాయన్నది వారి ఆశ. అయితే వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. 2018–19 విద్యా సంవత్సరానికి కనీసం అడ్మిషన్లు జరపకుండా వారి జీవితాలతో ఆడుకుంది. పారామెడికల్ బోర్డుకు సెక్రటరీ లేరని, కొన్ని సాంకేతిక కారణాలు అడ్డుగా ఉన్నాయంటూ పైకి రకరకాల కారణాలు చెబుతున్నా.. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే అడ్మిషన్లను ఆపేసినట్టు సంబంధిత అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం. అడ్మిషన్లు జరగకపోవడంతో వేలాదిమంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు జరగనందున ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరింత నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అడ్మిషన్లు లేకపోవడంతో వేలాదిమంది తెలంగాణకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర విద్యార్థులకు అక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనందున వారు మొత్తం ఫీజులు చెల్లించి చదవాల్సిన పరిస్థితి నెలకొంది. పారామెడికల్ కోర్సులకు సంబంధించి సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద సగటున రూ.50 కోట్లు చొప్పున రెండేళ్లకు కలపి సుమారు రూ.100 కోట్లు వరకు ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ ఫీజు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఏకంగా ఈ ఏడాదికి అడ్మిషన్లను ఆపేసినట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వకుండా తమ జీవితాలతో ప్రభుత్వం ఆడుకుందని వాపోతున్నారు. ప్రైవేటులోనైనా వస్తాయనుకుంటే.. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న పారామెడికల్ ఉద్యోగాలను పూర్తిగా కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోయాయి. డిప్లొమా ఇన్ అనస్థీషియా, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ వంటి 17 రకాల కోర్సులు చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలన్నిటినీ ఔట్సోర్సింగ్ పేరిట పలు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడంతో వాళ్లే అనర్హులతో పనిచేయించుకుంటున్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క పారామెడికల్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కనీసం కోర్సులు పూర్తిచేస్తే ప్రైవేటులో అయినా ఉద్యోగాలొస్తాయనుకుంటే అడ్మిషన్లు జరపరు. అంతేకాదు ప్రైవేటు కళాశాలల్లో ఎలాంటి తనిఖీలు చేయకుండా బాగాలేవని 200 కళాశాలల్లో సీట్లు ఆపేశారు. ఇది కూడా కేవలం ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆపేశారు. ఆయా కళాశాలలు కోర్టుకెళితే సర్కారు తీరును కోర్టు తీవ్రంగా మందలించింది. అయినా ఇంతవరకూ సర్కారు నుంచి స్పందన లేదు. అడ్మిషన్ కోసం ఎదురుచూసినా.. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటికీ అడ్మిషన్ రాలేదు. బయటికెళ్దామంటే ఇతర రాష్ట్రాల్లో రూ.50 వేల వరకూ ఖర్చవుతుంది. ఏం చేయాలో దిక్కుతెలియడం లేదు. –వి.రాజేష్, కృష్ణా జిల్లా డీఎంఎల్టీ కోర్సు చేద్దామని డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్‌టెక్నాలజీ కోర్సు చేద్దామనుకుంటున్నా. కానీ నోటిఫికేషన్ రాలేదు. ఇతర రాష్ట్రానికెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు తెలంగాణలో అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. –యశోద, గుంటూరు తెలంగాణలో చేరాల్సి వచ్చింది మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో చేరదామని ఎదురు చూశాను. ఇక్కడ ఐదు నెలలు దాటినా నోటిఫికేషనే రాలేదు. చేసేది లేక చివరకు డబ్బులు చెల్లించి తెలంగాణలో చేరాల్సి వచ్చింది. –సాయిప్రసాద్, ప్రొద్దుటూరు నోటిఫికేషన్ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్ రాకపోవడంతో తెలంగాణలో రూ.50 వేలు చెల్లించి డీఎంఎల్టీలో చేరా. అదే ఇక్కడైతే మైనార్టీ కోటాలో ఫీజురీయింబర్స్‌మెంట్ వచ్చేది. కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. –షాకీర్‌బాషా, సోమయాజులపల్లి, అనంతపురం జిల్లా కళాశాలలు.. సీట్ల వివరాలు ఇలా ప్రభుత్వ కళాశాలలు 08 ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 861 ప్రైవేటు కళాశాలలు 433 ప్రైవేటు కళాశాలల్లో సీట్లు 49,572 కళాశాలల్లో కోర్సులు 17 -
ఆదర్శం.. సువర్ణావకాశం
విశాఖపట్నం ,ఆరిలోవ(విశాఖ తూర్పు): గ్రామీణ ప్రాంతంలో ప్రతిభా వంతులైన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చేరేందుకు చక్కని అవకాశం ఉంది. ఉచిత వసతి, భోజనం, విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన ఆదర్శ విద్యాలయాల్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించలేని పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించేందుకు ఈ ఆదర్శ పాఠశాలలను నెలకొల్పారు. జిల్లాలో ఐదు ఆదర్శ విద్యాలయాలు 2013లో రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయగా మన జిల్లాలో నర్సీపట్నం మండలం వేములపూడి, రావికమతం మండలం మరుపాక, చీడికాడ మండలం మంచాల, కశింకోట మండలం తేగాడ, మునగపాక మండలం పాటిపల్లిలో ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో 80 మంది వంతున 5 పాఠశాలల్లో 400 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిభావంతులైన బాలబాలికలకు ప్రవేశం కల్పిస్తారు. వారికి ఇంటర్ వరకు అన్ని సౌకర్యాలతో ఉచిత విద్యను అందిస్తారు. దరఖాస్తు చేసుకోండిలా.. ఏపీ ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీపీ.జీవోవీ. ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్ తీసుకుని ఆయా మండలాల్లోని ఆదర్శ బడుల్లో సమర్పించాలి. ఆధార్, కులం, ఆదాయం, తదితర ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. ప్రవేశ రుసుం ఓసీ, బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50లను ఏపీ ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో చెల్లించాలి. రిజర్వేషన్లు ఇలా.. ఆదర్శ పాఠశాలల్లో ప్రతి తరగతిలో 15శాతం ఎస్సీలకు, ఆరు శాతం ఎస్టీలకు, 29శాతం బీసీలకు(బీసీ‘ఎ’–07, బీసీ‘బీ’–10, బీసీ‘సీ’–01, బీసీ‘డీ’–07, బీసీ‘ఈ’–04శాతం) కేటాయించారు. దివ్యాంగులకు మూడు శాతం, బాలికలకు 33.33శాతం సీట్లను కేటాయించారు. నిర్దేశించిన గ్రూపుల్లో అర్హులైన వారు లేని పక్షంలో ఇతర విభాగాల్లోని వారితో భర్తీ చేస్తారు. ఇక మిగిలిన 50శాతం సీట్లను ఇతర కులాలకు నిర్దేశిస్తారు. మార్చి 31న ప్రవేశ పరీక్ష ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి మార్చి 31న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 23 నాటికి పూర్తి చేయాలి. 2019 మార్చి 31న ఉదయం 9 నుంచి 11గంటల వరకు ఆయా ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఎంపిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం ఉంటుంది. అర్హులు ఎవరంటే.. ♦ ఓసీ, బీసీ విద్యార్థులు 2007 సెప్టెంబరు 1, 2009 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ♦ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2005 సెప్టెంబరు 1, 2009 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ♦ జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలలో చదివి ఉండాలి. 2018–19లో మాత్రం ఐదో తరగతి చదివి ఉండాలి.. రాత పరీక్ష ఇలా.. మార్చి 31న ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ఐదో తరగతి సామర్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఇంగ్లిష్ పాఠ్యాంశాలపై 25 మార్కుల వంతున ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరో తరగతిలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు కనీస అర్హతగా 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 35 మార్కులు విధిగా సాధించాలి.