రాంచీ: పాత పెద్ద నోట్ల రద్దుకు మరో విద్యార్థిని బలైంది. బీఈడీ అడ్మిషన్ ఫీజు సకాలంలో చెల్లించలేక జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ జిల్లాలో ఓ అమ్మాయి గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిందు తన గ్రామీణ బ్యాంక్ ఖాతాలోని రూ.37,000 నుంచి ఫీజు కోసం రూ.30,000 విత్‌డ్రా చేయాలనుకుంది. అరుుతే, రెండ్రోజుల క్రితం బ్యాంకు అధికారులు ఆమెకు ఖాతా నుంచి కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చారు. రూ.30,000 ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో సకాలంలో కాలేజీ ప్రవేశ రుసుం చెల్లించలేక, మనోవేదనకు గురైన బిందు ఆత్మహత్య చేసుకుందని గ్రామ సర్పంచ్ రాయ్‌మణి చెప్పారు.
అడ్మిషన్‌కు నగదులేక విద్యార్థిని ఆత్మహత్య
Published Fri, Dec 9 2016 2:53 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement
Advertisement