girl suicide
-
ఫోన్ బాగు చేయించలేదని యువతి ఆత్మహత్య
జైపూర్: సెల్‌ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగితే నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్య చేసు కుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కూతురు సాయిషుమా (19) మంచిర్యాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ పాడైపోవడంతో బాగు చేయించమని అడిగింది. దీంతో తరచూ సెల్‌ఫోన్ పాడు చేస్తున్నా వని తల్లి మందలించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. ‘అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు’ అంటూ సాయిషుమా మనస్తాపం చెందింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకుంది. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కిందికి దించినా అప్పటికే మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు. -
టీడీపీ నేత వినోద్ జైన్‌కు జీవిత కాల శిక్ష.. బాలిక తాత, తల్లి స్పందన ఇదే..
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపులతో బాలికను చిదిమేసిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారు. ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిచింది. కామాంధుడి దురాగతాలను తట్టుకోలేక ఈ లోకం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ బాలిక.. అమ్మ, నాన్న, తమ్ముడి గురించే ఎక్కువగా తన లేఖలో పరితపించింది. ఆ ఐదు పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్లో బంధాలు, బాంధవ్యాల గురించే ఎక్కువగా ప్రస్తావించింది. ‘ఐ లవ్ యు మమ్మీ.. డాడీ.. మీరంతా బాగుండాలి’ అని ఆకాంక్షించింది. వినోద్‌కుమార్ జైన్‌కు సెక్షన్ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’తో బాలిక తాత మాచాలరావు, తల్లి మాధురి మాట్లాడారు. ‘‘ పాపకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ లోటస్ అపార్ట్మెంట్లో అడుగు పెట్టాం. టీడీపీ నేత వినోద్ జైన్ నా మనమరాల్ని అత్యంత దారుణంగా చిత్ర హింసలకు గురి చేశాడు. ఎవరికి చెప్తే ఏం జరుగుతుందో అనే భయంతో పాప అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల శిక్ష పడటం చాలా సంతోషంగా ఉంది. తప్పు చేసిన వాడిని దేవుడు క్షమించడు. చట్టం, న్యాయం గెలిచింది. పైనున్న పాప ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చదవండి: టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష ‘‘రాజకీయంగా ఉన్న పలుకుబడితో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు వినోద్‌కుమార్ జైన్ ప్రయత్నించాడు. కేసులో త్వరగా ట్రయల్స్ పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. కేసులో వేగవంతమైన విచారణ జరిపినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. సీఎం చొరవతోనే ఈ కేసు వేగంగా ముందుకు కదిలింది. నిందితుడికి శిక్ష పడాలని ర్యాలీలు చేసిన విద్యార్థులకు, స్థానికులకు, లాయర్లకు కృతజ్ఞతలు. నిందితుడికి శిక్ష పడాలని పోరాటం చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి రోజా, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు’’ అని వారు పేర్కొన్నారు. చదవండి: 2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను -
ప్రేమ.. పెళ్లికి తల్లి అడ్డు చెప్పిందని..
దహెగాం: ప్రేమ..పెళ్లి వద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఒక బాలిక ఆత్మహత్య చేసు కుంది. కుమురంభీం జిల్లా దహె గాం మండలం రాళ్లగూడ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ సనత్‌కుమార్ కథనం ప్రకారం.. రాళ్ల గూడ కు చెందిన నాగపురి స్వరూపకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భర్త మోహన్ చనిపోయాడు. చిన్నకూతురు శిరీష(16) ఇంటర్ ఫెయిల్ కావడంతో ఇంటివద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన యువకుడిని 8 నెలలుగా ప్రేమిస్తోంది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఇప్పుడే ప్రేమ, పెళ్లి ఏంటని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష బుధవారం వేకువజామున ఇంటి వెనకాల పురుగు మందు తాగింది. వెంటనే శిరీషను తల్లి కాగజ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మృతు రాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఏఎస్ఐ కుమార్తె ఆత్మహత్య.. కారణం అదేనా?
మైసూరు: కర్నాటకలోని మైసూరు నగరంలో సహాయ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గోపీనాథ్ కుమార్తె గిరిజా లక్ష్మీ (19) ఆత్మహత్య చేసుకుంది. జలపురి పోలీసు వసతి గృహంలోని సీ బ్లాక్‌లో ఉంటున్న ఇంటిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. కాగా, బయటకు వెళ్లి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటికి రాగా గిరిజ ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇక, బీకాం చదువుతున్న గిరిజా ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజుల క్రితమే గిరిజా అన్న అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధే ఆత్మహత్యకు కారణమని అనుమానాలున్నాయి. -
కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ అరెస్టు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇంతియాజ్ లైంగిక వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇంతియాజ్‌పై 306, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి ప్రేమించకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుంది. టీడీపీ నాయకుడి బెదిరింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో చెప్పింది. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎర్రబల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు, రాధమ్మ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యారాణి(17). అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని మెడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడైన నల్లచెరువుకు చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి ఇంతియాజ్.. ఫేస్బుక్లో సంధ్యారాణితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఎర్రబల్లికి వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే తనని ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల సంధ్యారాణి తల్లిదండ్రులతో కలిసి పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లగా.. అక్కడికీ వచ్చి మరీ వేధించాడు. తనను ప్రేమించకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి తీవ్ర భయాందోళలనకు లోనైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులకు ఇంటికొచ్చిన సంధ్యారాణి బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. -
ఇష్టం లేని స్కూల్‌కు వెళ్లలేను.. పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం
కుషాయిగూడ: తల్లిదండ్రులు తనకిష్టం లేని స్కూల్‌కు వెళ్లామంటున్నారని మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా దోరదేవరపాడు గ్రామానికి చెందిన నాగళ్ల రవి, రాధ దంపతులు. 17 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. కాప్రా కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని శ్రీహన్స్ వజ్రం అపార్టుమెంట్లో ఉంటున్నారు. రవి వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. వీరి కూతురు కావ్య (15) సైనిక్‌పురి గోకుల్‌నగర్‌లోని సిటీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. సాకేత్‌లోని విద్యాభారతి స్కూల్లో 9వ తరగతి చదివిన కావ్యను.. ఆ పాఠశాల దూరం అవుతుందన్న ఉద్దేశంతో అపార్టుమెంట్‌కు సమీంలోని సిటీ హైస్కూల్లో చేర్పించారు. కొత్తగా చేరిన స్కూల్లో చదువుకోవడం తనకు ఇష్టం లేదని తిరిగి పాత పాఠశాలలోనే తనను చేర్పించాలని తల్లిదండ్రులతో చెప్పింది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనే ఉంది. స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని తండ్రి ప్రశ్నించాచు. సదరు స్కూల్‌కు వెళ్లడం తనకు ఇష్టం లేదని కావ్య సమాధానం ఇవ్వడంతో కూతురును రవి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. అదే సమయంలో అపార్టుమెంట్ ఎదుట పెద్ద శబ్దం రావడంతో అందరూ బయటకు వచ్చారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న కావ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: మొదటి పెళ్లి విషయం దాచి, ప్రేమిస్తున్నానన్నాడు.. మతం మార్చుకొని -
మా అమ్మాయిని సూటిపోటి మాటలతో చంపేశారు!
సాక్షి, పలమనేరు: పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. సూటిపోటి మాటలు, వేరే పాఠశాలకు మార్చడాన్ని అవమానంగా భావించి తమ కుమార్తె ఉరేసుకుని తనువు చాలించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి కథనం మేరకు.. పట్టణంలోని రాధాబంగ్లా ప్రాంతానికి చెందిన వజీర్ కూతురు నిజ్బా స్థానిక బ్రహ్మర్షి పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. టెన్త్ క్లాస్‌లో నిజ్బా, మరో బాలిక టాపర్లుగా పోటీపడి చదువుతున్నారు. పిల్లల మధ్య జరిగే చిన్నపాటి విషయాల కారణంగా తరచూ పాఠశాల బినామీ కరస్పాండెంట్ రమేష్ నిజ్బా తల్లిదండ్రులను చులకనగా మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో నిజ్బా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు బడికి వెళ్లలేదు. తిరిగి స్కూల్‌కు వెళ్లగా ఒకేక్లాస్‌లో ఇద్దరు విద్యార్థినుల మధ్య చదువులో పోటీ కారణంగా ఇబ్బందిగా ఉందని, పరీక్షలు ఇక్కడే రాసినా కొన్నాళ్లు వేరే స్కూల్‌కు పంపుదామని కరస్పాండెంట్ చెప్పినట్లు బాలిక తండ్రి వజీర్ తెలిపాడు. దీంతో రెండ్రోజుల నుంచి రంగబాబు సర్కిల్లోని ఆదర్శ స్కూల్‌కు నిజ్బా వెళ్తోంది. ఇలా ఉండగా మంగళవారం ముభావంగా ఉండడంతో పాఠశాల హెచ్ఎం తండ్రిని పిలిచి బాలికను ఇంటికి పంపించారు. ఇంటికొచ్చిన బాలిక తాను స్కూల్ యూనిఫామ్ మార్చుకుంటానని గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చింది. కిటికీలో నుంచి చూడగా మెడకు చున్నీ చుట్టుకుని వేలాడుతోంది. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బాలిక తల్లి నసీమా తన బిడ్డను సూటిపోటి మాటలతో చంపేశారయ్యా అంటూ కన్నీటి పర్యంతమైంది. పలమనేరులో ఉద్రిక్తత తమ కుమారై ఆత్మహత్యకు కారణమైన బ్రహ్మర్షి పాఠశాల కరస్పాండెంట్, టీచర్లను అరెస్టు చేసే దాకా బిడ్డకు అంత్యక్రియలను నిర్వహించమని మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేయడంతో పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు స్థానిక రంగబాబు సర్కిల్లో ఆందోళనలకు దిగారు. వీరికి బంధువులు, స్నేహితులు మద్దతు తెలిపారు. బిడ్డ మృతికి కారణమైన కరస్పాండెంట్‌ను, వేరే స్కూల్ విద్యార్థినిని తమ పాఠశాలలో మూడు రోజులు పెట్టుకున్న ఆదర్శ పాఠశాల హెచ్ఎంను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో పలమనేరు ఇన్చార్జ్ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి బాధితులతో మాట్లాడి పరారీలో ఉన్న నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన స్థానిక టీడీపీ నాయకులను ఆందోళనకారులు అడ్డగించడం గమనార్హం. -
డీబార్ చేశారని మనస్థాపం.. హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్య
బెంగళూరు: పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఆరోపణలతో కాలేజీ నుంచి డీబార్ చేయడంతో విద్యార్థిని హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు జీవనబీమా నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ విద్యార్థిని ముళబాగిలు కు చెందిన భవ్య (19). ప్రైవేటు పీజీ హాస్టల్లో ఉంటూ కోరమంగల జ్యోతినివాస్ కాలేజీలో పస్ట్ ఇయర్ బీకాం చదువుతోంది. పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిందని శుక్రవారం కాలేజీ నుంచి డీబార్ చేశారు. దీంతో తీవ్రంగా బాధపడిన భవ్య సాయంత్రం తన సోదరికి ఫోన్ చేసి తనను కాలేజీ నుంచి డీబార్ చేశారని, నేను ఇక బతకలేను అని చెప్పింది. తల్లిదండ్రులు భయపడి తిరిగి ఫోన్ చేయగా భవ్య స్పందించలేదు. దీంతో వారు బెంగళూరుకు బయల్దేరారు. కొంతసేపటికే ఆమె హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి దూకడంతో మృత్యువాత పడింది. కుమార్తె మృతికి కాలేజీ పాలకమండలి కారణమని భవ్య తల్లిదండ్రులు జీవనబీమానగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
బాలిక ఆత్మహత్య.. నోటు పుస్తకాలను పరిశీలించగా అసలు విషయం!
సాక్షి, చెన్నై: మదురవాయిల్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక కోయంబేడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈమె శనివారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న మదురవాయిల్ పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికకు చెందిన నోటు పుస్తకాలను పరిశీలించగా.. అందులో తాను ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని.. కానీ ఆ యువకుడు మరొకరిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. తనను మోసం చేశాడని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొంది. దీంతో ప్రేమించిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మోకాళ్ల నొప్పులు తట్టుకోలేక.. చెన్నై పెరంబూరు దామోదరం వీధి ప్రాంతానికి చెందిన శశికళ (58). భర్త పళనిస్వామి మృతి చెందారు. ఈమె ఇద్దరి కుమార్తెలకూ వివాహమైంది. ఈనేపథ్యంలో మూడేళ్లుగా శశికళ మోకాలు నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసినది. వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన శనివారం ఇంటిలో కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఇరుగుపొరుగు వారు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. తిరువిక నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడు మందలించడంతో.. తిరువొత్తియూరు: తంజై జిల్లాలో ప్లస్‌టూ విద్యార్థిని, చెన్నై మదురవాయిల్ సమీపంలో పదవ తరగతి విద్యార్థిని, పెరంబూరులో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. తంజావూరు జిల్లా వరత్తనాడుకు చెందిన కరుణానిధి కుమార్తె విద్య (17). ఈమె వరత్తనాడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్–2 చదువుతోంది. విద్య శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు శశికుమార్ (30) తీవ్రంగా మందలించడంతో ఆవేదనకు గురై విద్య ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గణిత ఉపాధ్యాయుడు శశికుమార్‌ను అరెస్టు చేశారు. -
కామాంధుడిని ఎన్కౌంటర్ చేయండి.. తల్లడిల్లిపోతున్న దీక్షిత తల్లిదండ్రులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఏలూరు టౌన్: విజయవాడలో కామాంధుడు వినోద్‌జైన్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను తలచుకొంటూ తల్లడిల్లిపోతున్నారు. దీక్షిత ఫొటోను దగ్గరపెట్టుకొని, చూసుకొంటూ కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. సీసీ ఫుటేజీలోని దృశ్యాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. దుర్మార్గుడిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేయండని రోదిస్తున్నారు. మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూడాలని, తమకు ఎదురైన కష్టం మరొకరికి రాకూడదంటూ వేడుకొంటున్నారు. తనకు ఇష్టమైన రంగు డ్రస్ వేసుకొని, వాంకింగ్కు వెళ్లే ముందు హగ్ చేసుకొందని, కరోనా కేసులు పెరుగుతున్నాయమ్మ, వాకింగ్ వద్దని చెప్పానని, వెళ్లొస్తానమ్మా అంటూ..వెళ్లిపోయిందని బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతోంది. మెట్లు, లిఫ్ట్ వద్ద ఉండి నిందితుడు విష్ చేసేవాడని, వయసు రీత్యా తమకు అనుమానం రాలేదని చెప్పారు. పరామర్శించిన ఎమ్మెల్సీ... బాలిక కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పరామర్శించి ఓదార్చారు. నిందితుడిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేసి మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా చూడాలని బాలిక తల్లి తనతో అన్నట్లు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శన కామాంధుడు వినోద్ జైన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు, కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి బాలికకు నివాళులర్పించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లోని దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి, మేయర్ షేక్ నూర్జహాన్, స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ బొద్దాని అఖిల, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
వినోద్ జైన్‌కు రిమాండ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలోని విద్యాధరపురానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక బలవన్మరణానికి కారకుడైన కామాంధుడు వినోద్ జైన్ (48)ను భవానీపురం పోలీసులు ఆరెస్టుచేసి, మంగళవారం సాయంత్రం విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సునీల్‌కుమార్ ముందు హాజరుపరిచారు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరా దృశ్యాలను సీజ్‌చేసి కోర్టుకు సమర్పించారు. తొలుత.. ఐపీసీలోని 306, 354(ఏ), (డి) 509, 506 పోక్సో చట్టంలోని 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. విచారణ అనంతరం.. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 354, 354డి, 509, 506 ఐపీసీ సెక్షన్లను చేర్చారు. దీంతో మేజిస్ట్రేట్ నిందితుడికి ఈనెల 15 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం వినోద్‌ను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. మరిన్ని ఆధారాల కోసం నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికకు ఏమైనా మెసేజ్‌లు పంపించేవాడాç? వీడియోలు ఏమైనా తీశాడా? బాలిక ఆత్మహత్య లేఖ కాకుండా గతంలో ఇంకా ఎక్కడైనా రాసుకుందా, తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను కూడా పోలీసులు విచారించారు. బాలిక బయటకు వెళ్లే సమయాల్లో వినోద్ జైన్ అక్కడే ఉండేవాడని అతను చెప్పాడు. రిమాండ్ రిపోర్ట్‌లో అంశాలివే.. ► బాలికను లైంగికంగా వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి వినోద్ జైన్ కారకుడయ్యాడు. ► బాలిక ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఆత్మహత్యకు కారకుడయ్యాడు. ► బాలిక నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని జీ–43లో నిందితుడు ఉండేవాడు. ► జనవరి 29వ తేదీ సా.5.15 గంటలకు అపార్ట్మెంట్ పైనుంచి బాలిక దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలలుగా వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్లో ఆమె స్పష్టంగా రాసింది. ► దీంతోపాటు ఆమె సెల్‌ఫోన్, ట్యాబ్‌లో ఆ వేధింపులను పొందుపరిచింది. ► లిఫ్ట్, మెట్ల వద్ద వెంటపడేవాడు. బాలిక తమ్ముడు విఘ్నేష్ (10)ను స్కూల్ ఆటో వద్దకు తీసుకెళ్లేటప్పుడు, సరుకుల కోసం షాపునకు వెళ్లేటప్పుడు, వాకింగ్‌కు వెళ్లేటప్పుడు వినోద్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ► ఈ బాధలను భరించలేక ఆమె అపార్టుమెంట్ పైనుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. బాలిక సూసైడ్ నోట్‌తోపాటు, సెల్‌ఫోన్, ట్యా బ్‌ను పోలీసులు సీజ్‌చేశారు. 12 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. -
బాలలపై వేధింపుల నివారణకు చర్యలు
సాక్షి, అమరావతి: తనకు జరిగిన అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విజయవాడ విద్యార్థిని ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఉదంతంపై తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లిన కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విద్యాలయాల్లో బాలబాలికలకు ఏవిధమైన కౌన్సెలింగ్ ఇస్తున్నారనే దానిపై ఆరా తీశారు. చదువుతున్న బాలికల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారా? లేదా? అంటూ మృతురాలు చదువుకున్న విజయవాడలోని ఫిట్జీ స్కూల్ యాజమాన్యానికి సోమవారం నోటీసులు జారీ చేశారు. చిన్నారుల శరీర భాగాలను తాకడం వెనుక దురుద్దేశాలను పసిగట్టేందుకు వారికి తరగతి గదుల్లో అవగాహన కల్పించాల్సిన అంశాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే అమలవుతున్న చర్యలేమిటని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయాన్ని వివరణ కోరుతూ లేఖ రాశారు. బాలలపై వేధింపుల అంశంపై విద్యాలయాల్లో కచ్చితంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. తద్వారా వారిలో ధైర్యం నింపి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించారు. -
2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను: నేరాన్ని ఒప్పుకున్న వినోద్ జైన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/విజయనగరం/నగరి: లైంగిక వేధింపులతో బాలికను చిదిమేసిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు జైన్‌ను ఆదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లుగా తాను రెండు నెలలుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమేనని చెప్పాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానన్నాడు. బాలిక స్కూల్‌కు వెళ్లి వచ్చే సమయాల్లో లిఫ్ట్, మెట్ల వద్ద వేచి ఉండేవాడినని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆనందించేవాడినని చెప్పాడు. తాను చేసింది తప్పేనని, ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని.. వ్యవహారం ఇంతవరకు వస్తుందని కూడా తాను ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది. ప్రేమానుబంధాలకు బాలిక ప్రాధాన్యత మరోవైపు.. ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. అందులో ఎక్కువగా ప్రేమానుబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. రక్తసంబంధాలపై ఎంతో మమకారం పెంచుకున్నట్లు అందులోని ప్రతీ పదం ద్వారా అర్ధమవుతుంది. చిన్న వయసులోనే ప్రేమానుబంధాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. రక్తసంబంధాలపై ఎంతో మమకారాన్ని పెంచుకుంది. కామాంధుడి దురాగతాలను తట్టుకోలేక ఈ లోకం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ బాలిక.. అమ్మ, నాన్న, తమ్ముడి గురించే ఎక్కువగా తన లేఖలో పరితపించింది. ఆ ఐదు పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్లో బంధాలు, బాంధవ్యాల గురించే ఎక్కువగా ప్రస్తావించింది. ‘ఐ లవ్ యు మమ్మీ.. డాడీ.. మీరంతా బాగుండాలి’ అని ఆకాంక్షించింది. తల్లిదండ్రుల పట్ల ఆమెకున్న ఎనలేని ప్రేమాభిమానాలను ఆ లేఖలో చాటుకుంది. తన తమ్ముడ్ని సైతం పదేపదే ప్రస్తావించింది. తమ్ముడి పట్ల తనకున్న అభిమానాన్ని వివరించిన తీరు అందరినీ కదిలించింది. తనను బాగా చూసుకున్నారని తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ లేఖలోని అంశాలు చూసిన కుటుంబీకులు, స్థానికులు ఇంత ఘోరం చేశాడా, అని కన్నీటీపర్యంతం అవుతున్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావటంలేదు. ‘న్యాయం చేయండి, మా బంగారు బొమ్మను మాకు తీసుకురండి’ అంటూ వారు తల్లడిల్లుతున్న తీరు చూపరులకూ కన్నీరు తెప్పిస్తోంది. అలాంటి వాడు అనుకోలేదు.. ఇక పోలీసులు అపార్టుమెంట్ వాసులను విచారించినప్పుడు, బాలిక వచ్చీవెళ్లే సమయంలో మెట్లు, లిఫ్ట్ వద్ద వినోద్ జైన్ కనిపించేవాడని చెప్పారు. అయితే, అతని వయస్సు రీత్యా అనుమానం రాలేదన్నారు. ఇలా వికృత చేష్టలకు పాల్పడతాడని తాము ఊహించలేదని తెలిపారు. ఇంతటి నీచానికి పాల్పడిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేసినా తక్కువేనని చెప్పినట్లు తెలిసింది. ఫుటేజీలో వికృత చేష్టలు అపార్ట్మెంట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజీలో కామాంధుని వికృత చేష్టల దృశ్యాలు ఉన్నట్లు తెలిసింది. బాలిక అపార్ట్మెంట్ నుంచి దూకే దృశ్యాలు కూడా రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. అపార్టుమెంటు పిట్టగోడ చివర బాలికను గమనించిన ప్రత్యక్ష సాక్షులు.. కింద పడతావు అని అరుస్తున్నా దూకేసిందని.. అంతా నిమిషంలోపే సంఘటన జరిగిందని వారు చెబుతున్నారు. మిన్నంటిన ఆందోళనలు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వినోద్ జైన్‌ను కఠినంగా శిక్షించాలని కృష్ణాజిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, అందోళనలు మిన్నంటాయి. ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడ సింగ్‌నగర్‌లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి ర్యాలీ నిర్వహించారు. భవానీపురంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు పి. చైతన్యరెడ్డి, గుడివాడ నరేంద్రల ఆధ్వర్యంలో స్కూలు పిల్లలతో కలిసి మానవహారం, ర్యాలీ చేపట్టారు. కుమ్మరిపాలెం, లెనిన్ సెంటర్లో కూడా చేపట్టారు. పలువురు కార్పొరేటర్లు కూడా తమ తమ డివిజన్లలో శాంతియుతంగా నిరసన తెలిపారు. దోషిని కఠినంగా శిక్షించాలని విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు ఇక జిల్లాలోని జగ్గయ్యపేట, నూజివీడు, పెడన, గుడివాడలలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లాలోనూ సోమవారం నిరసన ర్యాలీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. కీచకులను టీడీపీ పెంచి పోషిస్తోంది : రోజా టీడీపీ అధినేత చంద్రబాబు కీచకులను పెంచి పోషించడంవల్లే ఇలా రాష్ట్రంలో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. వినోద్ జైన్‌కు వేసే శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే మరొకరు ఇలాంటి ఆలోచన చేయడానికే భయపడేలా ఉండాలన్నారు. బాలిక ఆత్మశాంతి కోసం సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో ఆమె పార్టీ నేతలతో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిందితుడు వినోద్ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని చెప్పారు. పైగా నారీ సంకల్ప యాత్ర దీక్ష చేపట్టడం వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష వెనుక అసలు హీరో నారా లోకేష్ అని అందరికీ తెలుసునన్నారు. లోకేష్ పీఏ టీడీపీ మహిళలనే వేధిస్తున్నాడని ఆ విషయాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఈ నారీ దీక్ష చేపట్టి తన కొడుకును కాపాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని రోజా ఆరోపించారు. -
టీడీపీ శ్రేణులు నారీ దీక్ష వినోద్ జైన్ ఇంటి ముందు చేయాలి: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: లోకేష్ పీఏపై వచ్చిన అభియోగాలు పక్కదారి పట్టించేందుకే నారీ సంకల్ప దీక్ష పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ మేరకు రోజా మీడియాతో మాట్లాడుతూ.. 'టీడీపీ హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. తాజాగా విజయవాడలో టీడీపీ నాయకుడి వేధింపుల వల్ల జరిగిన ఓ ఘటనలో కూడా ఆడపిల్ల చనిపోతూ క్షోభ పడింది. టీడీపీ శ్రేణులు నారీ దీక్ష వినోద్ జైన్ ఇంటి ముందు చేయాలి. నారీ నరకాసురులు ఎక్కువైపోయారు. కత్తెర పట్టుకుని తిరిగిన టీడీపీ మహిళా నేతలు ఇప్పుడు ఎక్కడకు వెళ్లారు. తెలుగు మహిళలు ఇపుడు ఎక్కడున్నారు. టీడీపీ హయాంలో మహిళలపై ఎన్నో అకృత్యాలు, అత్యాచారాలు జరిగాయి. మహిళా సంక్షేమం కోసం పనిచేస్తోన్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆడపిల్లకు అన్యాయం జరిగితే సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆడిబిడ్డలకు అన్యాయం జరిగితే సీఎం జగన్ ఊరుకోరు' అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చదవండి: (కేంద్రం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం: విజయసాయిరెడ్డి) -
వినోద్ జైన్‌కు ఉరిశిక్ష విధించాలి
సాక్షి, అమరావతి: టీడీపీ కీచక నేత వినోద్‌జైన్‌కు ఉరిశిక్ష విధించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రభుత్వాన్ని కోరారు. వినోద్ జైన్ వ్యవహారం రాష్ట్రం మొత్తం తలదించుకునేలా ఉందన్నారు. మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించి.. ఆమె ప్రాణాన్ని హరించాడని మండిపడ్డారు. తక్షణమే ఈ ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత సోమవారం మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి.. ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేయడం దారుణమన్నారు. వినోద్ జైన్‌ను సంఘం నుంచి వెలివేయాలన్నారు. నారీ సంకల్ప దీక్షలంటే ఎవరు నమ్ముతారు? దుర్యోధనుడు, దుశ్శాసనుడికి మహిళల మీద ఎంత గౌరవం ఉందో.. చంద్రబాబు, లోకేష్‌లకూ అంతే గౌరవం ఉందని సునీత ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు మహిళల్ని వేధించి, వంచించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు నారీ సంకల్ప దీక్షలంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. టీడీపీది దుస్సంకల్ప దీక్ష అని విమర్శించారు. నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో నమోదైన లైంగిక వేధింపుల కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేసినవి 60 రోజుల్లో కేవలం 14.5 శాతం మాత్రమే అన్నారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 93.6 శాతం మేర కేసులను దర్యాప్తు చేశారని తెలిపారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమేనని చెప్పారు. దీన్ని బట్టి సీఎం వైఎస్ జగన్‌కు మహిళల భద్రత పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మహిళలను మోసం చేయడమే బాబు నైజం 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసం చేయడం, దగా చేయడమేనని సునీల దుయ్యబట్టారు. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నవారిలో సీఎం వైఎస్ జగన్ దేశంలోనే బెస్ట్ సీఎంగా ఉన్నారని కొనియాడారు. చంద్రబాబు దుర్యోధనుడిగా డైరెక్షన్ ఇస్తుంటే, లోకేష్ ఉత్తర కుమారుడిలాగా మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. గతంలో లోకేష్ బాగోతాలు, స్మిమ్మింగ్‌ఫూల్ ఫొటోలను వాళ్లే బయట పెట్టుకున్నారని తెలిపారు. మహిళల పట్ల వాళ్ల నీచ సంస్కృతి ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే నారీ సంకల్ప దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని దుస్థితిలో బాబు ఉన్నారన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాల్లాంటివి ఒక్కటైనా చంద్రబాబు అమలు చేశారా? 31 లక్షల ఇళ్లు ఇచ్చారా? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. -
‘నా బిడ్డ జీవితాన్ని చిదిమేసిన కామ పిశాచిని ఉరి తీయండి’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘పద్నాలుగేళ్ల పాటు ఏ లోటూ లేకుండా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నా. కేంబ్రిడ్జి చదువులు చదివించాను. ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడుతుంది. ఎంఏ పీహెచ్డీ చదివిన నేను నా విజ్ఞానాన్నంతా నా బిడ్డకు పంచాను. నేను పని చేసే స్కూల్లో బాలికలకు కౌన్సెలింగ్ చేసేదాన్ని. నా బిడ్డకు నేర్పుకోనా? చదువు తప్ప మరో ధ్యాసలేని నా బిడ్డపై కామాంధుడి కళ్లు పడటం ఏమిటి? బిడ్డ భవిష్యత్ కోసం ఎన్నో పూజలు చేశాను. అయినా దేవుడు మాకు అన్యాయం చేశాడు. నా బిడ్డ జీవితాన్ని చిదిమేసిన కామ పిశాచిని ఉరి తీయండి. మాకు న్యాయం చేయండి’ అంటూ ఆత్మహత్య చేసుకున్న దీక్షిత గౌరి తల్లి అనురాధ.. ఆదివారం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దోషిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు. ఈ ఘటన దురదృష్టకరం.. అతన్ని ఉరి తీసినా తప్పు లేదు కామాంధుడు! విజయవాడలో టీడీపీ నేత అకృత్యం టీడీపీ నేత ఘాతుకంపై ఆగ్రహ జ్వాల -
ఈ ఘటన దురదృష్టకరం.. అతన్ని ఉరి తీసినా తప్పు లేదు
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య ఘటన అత్యంత దురదృష్టకరమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ నేత వినోద్‌జైన్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి పరామర్శించారు. బాలిక తండ్రి గంగాధర్‌కుమార్, తాతయ్య మాంచాలరావులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాలిక ఎంతో మనోవేదనకు గురైందని, టీడీపీ నేత వినోద్ జైన్ తనను లైంగికంగా ఇబ్బందికి గురిచేసినట్లు సూసైడ్ నోట్లో పేర్కొందని తెలిపారు. మూడు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంతగా మానసిక వేదనకు గురైందో అర్థం చేసుకోవచ్చన్నారు. బాలిక తాతయ్య రిటైర్డ్ తహసీల్దారు అని, పిల్లల కోసం ఏలూరు నుంచి విజయవాడ వచ్చినట్లు తెలిపారన్నారు. 50 ఏళ్లకు పైగా వయసున్న వినోద్ జైన్ దారుణంగా ప్రవర్తించాడని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వినోద్‌జైన్ ఎంపీ కేశినేని నాని ముఖ్య అనుచరుడని, వినోద్ తరఫున చంద్రబాబు కూడా గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు. బాలిక తల్లిదండ్రుల బాధ చూడలేక పోతున్నామని, దోషిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి చెప్పారు. చంద్రబాబు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ వద్ద, మెట్ల వద్ద అసభ్యంగా ప్రవర్తించాడని, మానవత్వం లేని వ్యక్తికి సంఘంలో చోటు ఉండకూడదన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు దుర్గమ్మ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. చిత్రంలో దీక్షిత గౌరి తల్లిదండ్రులు అతన్ని ఉరి తీసినా తప్పు లేదు బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్ నోట్లో రాసిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల విద్యార్థిని లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు పురిగొల్పిన వినోద్‌జైన్‌ను ఉరితీసినా తప్పులేదన్నారు. వినోద్‌జైన్ దుర్బుద్ధి కారణంగా ప్రతిభావంతురాలైన బాలిక బలైందన్నారు. కుటుంబానికి చెప్పుకోలేని స్థితిలో ఆ బాలిక భయపడి మేడ మీద నుంచి దూకిందంటే ఏ మేరకు వేధించాడో అర్థమవుతోందన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతల పేర్లు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే, ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. బాలిక లేఖ చూసే వరకూ వాస్తవం బయటకు రాలేదని, రెండు నెలలుగా శరీరాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టాడన్నారు. టీడీపీలో వినోద్‌జైన్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు అహరహం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే టీడీపీ వాళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారని ఆమె ప్రశ్నించారు. మానసిక సంఘర్షణకు నిదర్శనం! బాలిక చనిపోక ముందు తీవ్ర మానసిక వేదనకు గురైందని తెలుస్తోంది. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వినోద్ జైన్ ఇంటిని విచారణ నిమిత్తం సీజ్ చేశారు. బాలిక సూసైడ్ చేసుకునే ముందు సుమారు 20 నిమిషాల పాటు టెర్రస్‌పై అటూ ఇటూ తిరిగినట్లుగా సీసీ కెమెరాలో కనిపించింది. తద్వారా ఆ బాలిక ఎంతో సంఘర్షణకు లోనైనట్లు అర్థమవుతోంది. జైన్‌పై భవానీపురం పోలీసులు పోక్సో చట్టం, ఐపీసీ 306, 354(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, స్థానిక కార్పొరేటర్ రెహమతున్నీసా బాలిక ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. బాలిక తల్లిని ఓదార్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తాత లైంగిక వేధింపులతో దీక్షిత గౌరి (14) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బాలిక తాత, విశ్రాంత తహసీల్దార్ గోవాడ మాంచాలరావు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రెండో కుమార్తె అనురాధ, అల్లుడు గంగాధర కుమార్, వారి పిల్లలు దీక్షిత గౌరి (14), నందశ్రీ విఘ్నేష్ (10) ఉంటున్న అపార్ట్మెంట్లోని జీ 25 ఫ్లాట్‌కు ఎదురుగా మరో ఫ్లాట్‌లో ఈయన ఉంటున్నారు. అనురాధ వన్‌టౌన్ కొత్తపేటలోని అన్నపూర్ణ మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయినిగా, అల్లుడు గంగాధరకుమార్ ఎన్టీటీపీఎస్లో డీఈఈగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు మాంచాలరావు వాకింగ్ చేస్తుండగా ఎవరో ఒక పాప కిందకు దూకిందని అందరూ అనుకుంటుండగా ఆయనా వెళ్లి చూశారు. కిందకు దూకింది తన మనుమరాలు దీక్షిత గౌరి అని గుర్తించారు. ఆయనకు ఏం జరిగిందో అర్థంకాక కుమార్తె ఉంటున్న ఫ్లాట్‌లోకి వెళ్లి దీక్షిత గౌరి గదిలో చూడగా బెడ్‌పై నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ కనిపించింది. విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సూసైడ్ నోట్‌ను వారికి అందజేశారు. -
‘వాళ్ల అమ్మను చివరిసారి ఐ లవ్ యూ అంటూ కౌగిలించుకుంది’
విజయవాడ: తమ మనవరాలు ఆత్మహత్య చేసుకోవడానికి టీడీపీ నేత వినోద్ జైన్ కారణమని బాలిక తాత మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు మాట్లాడలేని విధంగా వినోద్ జైన్ లైంగికంగా వేధించినట్లు సూసైడ్ నోట్లో రాసిందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తన మనవరాలు ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని, కాకపోతే నిన్న మధ్యాహ్నం నుండి మూడీగా ఉందన్నారు. ‘సాయంత్రం నాలుగు గంటల సమయంలో నేను మా కుమార్తె వాకింగ్ కి వెళ్తున్న సమయంలో పలకరించింది. ఒకసారి వాళ్ళ అమ్మ వద్దకు వచ్చి ఐలవ్ యూ మమ్మీ అంటూ రెండుసార్లు మాట్లాడి తల్లిని కౌగిలించుకుంది. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పలేదు. తరువాత మా కుమార్తె, నేను వాకింగ్ కి వెళ్ళాం. అపార్ట్ మెంట్ వాసులు ఎవరో చిన్నారి సూసైడ్ చేసుకుందని చెబితే అక్కడికి వెళ్లి చూశాం. అక్కడ నిర్జీవంగా నా మనవరాలు పడి ఉంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులు మా మనవరాలు బెడ్ రూమ్‌కి వెళ్లారు. బెడ్రూమ్ లో తన బుక్ లో సూసైడ్ నోట్ రాసి ఉంది. అందులో మేము మాట్లాడలేని విధంగా వినోద్ జైన్ లైంగికంగా వేధించినట్లు రాసింది. నా మనవరాలు మరణానికి కారణమైన వినోద్ జైన్ ని కఠినంగా శిక్షించాలి అని బాలిక తాత మాణిక్యలరావు కన్నీటిపర్యంతమయ్యారు. విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లోని ఒక అపార్ట్మెంట్ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేకెత్తించింది. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ బాలిక సూసైడ్ నోట్లో రాయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
గత 2 నెలలుగా బాలికను వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లోని ఒక అపార్ట్మెంట్ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో కలకలంగా మారిన విషయం తెలిసిందే. బెంజి సర్కిల్ వద్ద గల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక నిన్న(శనివారం) ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్ నోట్లో పేర్కొందని స్థానిక ఏసీపీ హనుమంతరావు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్టు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. లైంగిక వేధింపుల వల్లే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడిని, అతని కుటుంబ సభ్యుల్ని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టామని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్ల కింద కేసులను నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా వినోద్ జైన్ ఇంటిని ఇప్పటికే సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. గత 2 నెలలుగా బాలికను.. వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఈ క్రమంలో బాలిక ఎవరికీ చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించిందని అన్నారు. నిందితుడు వినోద్‌జైన్.. ఎలాంటి ఇబ్బందులకు గురిచేసేవాడో బాలిక సూసైడ్ నోట్లో రాసిందని ఏసీపీ తెలిపారు. బాలిక.. లిఫ్ట్‌లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వేధించేవాడని సూసైడ్ నోట్లో రాసింది. కాగా, రెండు పేజీల్లో బాలిక తన బాధను తెలియజేసిందని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. చదవండి: బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ -
మమ్మీ డాడీ..సారీ.. నాదే తప్పు
సాక్షి, జడ్చర్ల: ఆన్లైన్ క్లాసుల పేరుతో ఓ ప్రైవేట్ టీచర్ ఉచ్చులో చిక్కుకున్న బాలిక కథ విషాదాంతమైంది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపిన పోక్సో కేసులో బాధితురాలు (15ఏళ్ల బాలిక) బుధవారం జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మమ్మీ, డాడీ సారీ.. తప్పు నాదే’ అని బాలిక రాసిన సూసైడ్ నోట్ గదిలో దొరికింది. ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేసి మానేసిన రాజాపూర్‌కు చెందిన దేవరకాడి మహేశ్(35) ఆన్లైన్ క్లాసుల పేరుతో బాధితురాలిని వలలో వేసుకుని పలుసార్లు తన కామవాంఛ తీర్చుకున్నాడు. చదవండి: Drugs Case: నాలుగేళ్ల కిందటి డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు ఈ నేపథ్యంలోనే ఈ నెల 4న కారులో బాలికను హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఈలోగా పోలీసు కేసు, విచారణ గురించి తెలుసుకున్న నిందితుడు బాలికను 10న రాజాపూర్ బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లాడు. నిందితుడు మహేశ్, అతడికి సహకరించిన అతని మిత్రుడిని 13న పోలీసులు అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి బుధవారం పోలీసులు బాలికకు సమన్లు జారీ చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి సమన్లు ఇవ్వడంతో బాలిక మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. చదవండి: నేపాలీ గ్యాంగ్: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! -
తల్లి మరణం తట్టుకోలేక.. కూతురు ఆత్మహత్య
సాక్షి, చిట్యాల: నెల రోజుల క్రితం తల్లి కరోనాతో మృతి చెందగా, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితలలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టెం వరలక్ష్మి కరోనాతో నెల రోజుల క్రితం మృతి చెందింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు పట్టెం భవాని(17)శనివారం పురుగుల మందు తాగింది. గమనించిన తండ్రి వీరస్వామి మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. -
అత్తారింటి వేధింపులు: వివాహిత ఆత్మహత్య
కామారెడ్డి: మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందమైన భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నది. పెళ్లైన కొద్ది కాలనికే అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డిలోని గుమస్తా కాలనీ సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... వాంబే కాలనీకి చెందిన స్రవంతి (19) అనే యువతి గుమస్తా కాలనీకి చెందిన సల్మాన్‌ను ప్రేమించింది. వారిద్దరు ఈఏడాది జనవరి 7న ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన పేరును సమీరాగా మార్చుకుంది. గత రెండు నెలలుగా అత్తవారింటి నుంచి బయటకు వచ్చి భర్తతో కలిసి వేరే కాపురం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్రవంతి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కూతురు ఒంటిపై గాయాలున్నాయని, ఆమె మృతిపై సందేహాలు ఉన్నాయని తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. దేవునిపల్లి ఎస్సై రవికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. చదవండి: నెల వరకు ఎవ్వరూ ఇతనికి ఫోన్ చేయొద్దు.. కలవద్దు! -
బాలికపై వృద్ధుని అకృత్యం, బాధితురాలు ఆత్మహ్యత్య
భోపాల్: వృద్ధుని చేతిలో అత్యాచారానికి గురైన బాలిక నిద్రమాత్రలు మింగి చనిపోయింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్యారేమియా(68)అనే వ్యక్తి స్థానికంగా వార్తా పత్రిక నిర్వహిస్తున్నాడు. ఇతడు తన వద్ద పనిచేసే ఐదుగురు బాలికలపై పలు పర్యాయాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు గత ఏడాది జూలైలో కేసు నమోదయింది. ఇతని బారిన పడిన బాలికలందరికీ స్థానిక షెల్టర్ హోంలో ఆశ్రయం కల్పించారు. బాధితుల్లో ఇద్దరు సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. అందులో ఒక బాలిక (17) మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందని అనుమానిస్తున్నారు. పరిస్థితి విషమించి ఆమె బుధవారం రాత్రి కన్నుమూసిందని అధికారులు వెల్లడించారు. ఘటనపై అధికారులు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. నిందితుడైన ప్యారేమియాను జమ్మూకశ్మీర్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన స్వీటీ విశ్వకర్మ(21)పై కేసు నమోదు చేశారు. గత ఏడాది జూలైలో అతని నివాసంలో జరిపిన సోదాల్లో ఖరీదైన కార్లు, మద్యం బాటిళ్లు, వన్యప్రాణుల ఎముకలు, పోర్న్ సీడీలు తదితరాలు లభించాయి. ప్యారే మియాపై ఐపీసీ, పోక్సో, అట్రాసిటీ, ఎక్సైజ్, వైల్డ్ లైఫ్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. -
యజమాని వేధింపులు: బాలిక ఆత్మహత్య
సాక్షి, శంషాబాద్: యజమాని వేధింపులు భరించలేకే హిమాయత్‌నగర్‌లో మూడు రోజుల క్రితం బాలిక ఆత్మహత్య చేకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సోమవారం శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఈ నెల 24న బాత్కు మధుయాదవ్(44) ఇంట్లో పనిచేసే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మృతిచెందిన బాలికతో పాటు ఆమె సోదరి నాలుగేళ్లుగా మధుయాదవ్ ఇంట్లో నెలవారీ జీతానికి పనిచేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన రాత్రి పని ఉందని చెప్పి నిద్రిస్తున్న బాలికను మధుయాదవ్ ఇంట్లోని రెండో అంతస్తుకు తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఆమె సోదరి నిద్రలేచి చూసేసరికి బాలిక ఉరి వేసుకుని ఉంది. కడుపు నొప్పితో ఉరి వేసుకుందని చెప్పాలని మధుయాదవ్ బాలిక సోదరిపై ఒత్తిడి చేశాడు. కాగా పోలీసు విచారణలో మధుయాదవ్ వేధింపుల కారణంగానే తన అక్క ఉరి వేసుకుందని ఆమె వెల్లడించింది. దీంతో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం, వేధింపులకు పాల్పడిన కారణంగా మధుయాదవ్‌పై నిర్భయ చట్టం, జువైనల్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. గతంలో కూడా మధుయాదవ్‌పై మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉందని, అతడిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో కేసును వేగంగా దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. హోంమంత్రి మహమూద్ అలీ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. విచారణను వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ రంజిత్‌రెడ్డి సీపీ సజ్జనార్‌ను కోరారు. నిందితుడిని అరెస్టు చేయాలని ఆందోళన.. మొయినాబాద్ రూరల్ (చేవెళ్ల): బాలిక అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆమె బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బాత్కు మధుయాదవ్ బాలికపై అత్యాచారం చేసి చంపేశాడని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి హిమాయత్‌నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. నిందితుడు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని, పోలీసులు కూడా అతడికే వత్తాసు పలుకుతున్నారని రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలసుకున్న శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడారు. కేసు విచారణ బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు డీసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. మహిళ ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం ఆమనగల్లు: వివాహేతర సంబంధం మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. తలకొండపల్లి ఎస్ఐ బీఎస్ఎస్ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన చెన్నమ్మ(38), రాములు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేశంపేట మండలంలోని పోమాల్‌పల్లికి చెందిన జంగయ్యతో చెన్నమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుని షాద్‌నగర్‌లో జ్యూస్ బండి నిర్వహిస్తుంది. తన సోదరి కనిపించడం లేదని ఈనెల 22న షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో చెన్నమ్మ తమ్ముడు కురుమయ్య ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి షాద్‌నగర్ సీఐ శ్రీధర్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు జంగయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 20న చెన్నమ్మ, జంగయ్య తలకొండపల్లి మండలంలోని చెన్నారం సమీపంలో గల మల్లప్పగుట్టపైకి వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఇద్దరూ గొడవపడ్డారని, తాగిన మత్తులో ఉన్న జంగయ్య రాయితో చెన్నమ్మను కొట్టడంతో అక్కడే మృతిచెందిందని తెలిపారు. సోమవారం మల్లప్పగుట్ట సమీపంలో చెన్నమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని.. ఇబ్రహీంపట్నంరూరల్: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురైన భర్త చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలంలోని చాందన్ఖాన్గూడ గ్రామానికి చెందిన పండ్ల రమేష్(30) భార్య ప్రేమలతతో కలిసి తుర్కయంజాల్‌లో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, ఇటీవల ప్రేమలత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్ ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకునేందుకు తుర్కయంజాల్ మసాబ్ చెరువులో దూకాడు. రోడ్డున పోయే వారు గమనించి ఆదిబట్ల పోలీసులకు సమాచారం అందజేయగా పెట్రోలింగ్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు యాదగిరి చెరువులో దూకి రమేష్‌ను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చారు. రమేష్‌ను కాపాడిన పోలీసులు, సీపీ చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకుంటున్న కానిస్టేబుల్ సత్యనారాయణ డీజీపీ, రాచకొండ సీపీ ప్రశంస.. చెరువులో దూకిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు యాదగిరిని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్లో అభినందించారు. అదేవిధంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, హోంగార్డులను సోమవారం నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని నగదు పురస్కారం అందజేశారు. -
డాక్టర్ సలహా నచ్చక బాలిక ఆత్మహత్య
సూరత్ : కరోనా వైరస్ పుణ్యమా అని ఇంటిలో చేసేదేం లేక చూస్తే టీవీ లేకుంటే.. స్మార్ట్ ఫోన్ వినియోగం అన్న చందంగా మారిపోయింది. ప్రధానంగా ఆన్లైన్ గేమ్స్ ఆడడం పిల్లలకు అలవాటుగా మారింది. స్మార్ట్ ఫోన్, టీవీని వదిలిపెట్టడం లేదు. వాడొద్దని పెద్దలు హెచ్చరిస్తే ఆత్మహత్యలకు సైతం తెగిస్తున్నారు. తాజాగా టీవీ, ఫోన్‌ను వాడొద్దని ఓ డాక్టర్ ఇచ్చిన సలహాతో మనస్తాపం చెంది 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో చోటు చేసుకుంది. (చదవండి : మహిళ దురాగతం : పిండిలో విషం కలిపి..) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కతర్గం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక జాహ్నవి గత కొన్ని వారాలుగా తల నొప్పి, చాతీ నొప్పితో బాధపడుతోంది. ఇటీవల ఆమె తల్లిదండ్రులు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్.. టీవీ, స్మార్ట్ ఫోన్‌ను ఎక్కువగా చూడడం వల్లే తలనొప్పి వస్తుందని, కొద్ది రోజులు వాటికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను టీవీ, ఫోన్‌కు దూరంగా పెట్టారు. డాక్టర్ సలహాతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత మంగళవారం సాయంత్రం దుస్తులు మార్చుకుంటానని నాన్నమ్మకి చెప్పి గదిలోకి వెళ్లిన జాహ్నవి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. సాయంత్రం మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తెరచి చూడగా.. బాలిక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. డాక్టర్ సలహా నచ్చకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
ప్రేమ కథ: యువతి ఆత్మహత్య, యువకుడు హత్య
సాక్షి, బాగేపల్లి: ఒక ప్రేమకథ విషాదాంతం కావడంతో పాటు గ్రామంలో కక్షలకు ఆజ్యం పోసింది. బాగేపల్లి తాలుకాలోని యగవమద్దలఖాన గ్రామంలో యువకుడు హత్య, అనంతరం విధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. యువకుడు హరీష్‌ను హత్య చేసిన కేసులో వెంకటేశ్, అతని సోదరున్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు హరీష్, వెంకటేశ్ కుమార్తె ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో 10 రోజుల క్రితం ఇద్దరు ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని పథకం వేశారు. ఇరు కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రేమ జంటను పట్టుకుని కుటుంబాలకు అప్పజెప్పారు. ఇరువర్గాలూ పంచాయతీ చేసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత రెండు రోజులకే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణంతో ఆగ్రహోదగ్రుడైన వెంకటేశ్.. శుక్రవారం రాత్రి కాపుకాచి హరీష్ రాగానే కత్తితో దాడిచేశాడు. 17 సార్లు పొడవడంతో హరీష్ మరణించాడు. తరువాత నిందితులు పరారు కాగా, హతుని బంధువులు వారి ఇళ్లపై దాడి చేసి వస్తుసామగ్రిని ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం కేసులో సుమారు 10 మందిని అరెస్టు చేసి మరో 15 మంది కోసం గాలిస్తున్నారు. గ్రామంలో మహిళలు తప్ప పురుషులు కనిపించకుండా పోయారు. రెండో పెళ్లి చేసుకొని డబ్బు దండుకున్నాడు హుబ్లీ: భార్య ఉన్నా లేదని చెప్పి తనను వివాహం చేసుకొని లక్షల రూపాయలు నగదు దండుకొని మొదటి భార్య పిల్లలతో తనపై దాడి చేయించాడని నగరానికి చెందిన ఓ మహిళ వాపోయింది. ఆదివారం ఆమె హుబ్లీలో మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకుంది. కలఘటిగి తాలూకా హీరేహొన్నళ్లికి చెందిన వ్యక్తి 2012లో తనను వివాహం చేసుకొని కాపురం చేశాడని, ఈక్రమంలో తన ఇంటి స్థలాన్ని అమ్మించి రూ.25 లక్షలు తీసుకొన్నాడని ఆరోపించింది. ఆ డబ్బు ఇవ్వాలని కోరినందుకు మొదటి భార్య పిల్లలతో కలిసి తనపై దాడి చేయించారని, దీనిపై కలఘటిగి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాననన్నారు. అయితే ఆ వ్యక్తికి రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయింది. అధికారులు న్యాయం చేయాలని వేడుకుంది. -
చదవాలని మందలిస్తే..
సాక్షి, ఎడపల్లి (బోధన్): చదువులో వెనుకబడిందని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బోర్గం శంకర్, అన్నపూర్ణ దంపతులు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కూతురు స్నేహలత (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె కొంతకాలంగా ఫిట్స్ వ్యాధితో బాధ పడుతోంది. అయితే, ఆమె చదువులో వెనుకబడి ఉందని గమనించిన తల్లిదండ్రులు బాగా చదవమని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్నేహలత.. ఇంట్లోని బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. తాగొచ్చి వేధిస్తున్నాడని.. భర్తను నరికి చంపిన భార్య కరీమాబాద్ : నిత్యం మద్యం తాగొచ్చి హింసిస్తున్న భర్తను భార్య దారుణంగా నరికి చంపింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం శంభునిపేట బుడిగజంగాల కాలనీలో గురువారం చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ సీఐ నరే‹Ùకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న చిల్ల రాజ్‌కుమార్ (27), యాకలక్ష్మి దంపతులు. కూలి పనులు చేసే రాజ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడమే కాకుండా హింసిస్తున్నాడు. ఈ క్రమంలో విసిగిపోయిన యాకలక్ష్మి గురువారం ఉదయం భర్త రాజ్‌కుమార్‌ను గొడ్డలితో నరికి చంపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులే ఆమెను బలిగొన్నాయా?
సాక్షి, వైఎస్సార్ కడప : రెక్కాడితేగాని డొక్కాడని బతుకు.. కష్టపడి తమ బిడ్డను చదివించుకుంటున్నారు. చదువులో రాణించి ఉజ్వల భవిష్యత్ పొందుతుందని కలగన్నారు. కానీ, కన్నబిడ్డ ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు నిశ్ఛేష్టులయ్యారు . పుల్లంపేటలో మంగళవారం సాయంత్రం పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. రాజంపేట పట్టణంలోని బీఎస్ హాల్ సమీపంలోని కొండపల్లి కృష్ణమోర్తి, గౌరి దంపతులు ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తమ కుమార్తె లక్ష్మీప్రసన్న పుల్లంపేట ఆదర్శపాఠశాలలో పదో తరగతి చదువుతుంటే సంబరపడిపోయారు. చదివి పెద్ద ఉద్యోగం చేస్తుందని భావించారు. కానీ లక్ష్మీప్రసన్న గత కొంతకాలంగా చురుకుగా ఉండడం లేదు. ఆరా తీస్తే స్కూలులో చదువులో మార్కులు తదితర విషయాలపై ఉపాధ్యాయుడు శివ ఇబ్బంది పెడుతున్నాడని వాపోయేది. సహచరి విద్యార్థినిలకు చెప్పుకొని బాధపడేది. పలు సందర్భాలలో కుమార్తెను ఓదార్చేందుకు ఆమె తల్లి ప్రయత్నించి విఫలమైంది. ఏమైందో తెలియదు.. మంగళవారం సాయంత్రం స్కూలు ముగిసిన తర్వాత ఆ బాలిక తానుంటున్న హాస్టలు గదికి చేరుకుంది. గడియ వేసుకుంది. ఒంటిపైనున్న చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత గదికి చేరుకున్న కొందరు విద్యార్థులు ఈ సంఘటన చూసి నివ్వెరపోయారు. స్కూలు వర్గాలకు చెప్పారు. కానీ అంతకుమునుపే పాఠశాలకు ఆ బాలిక తల్లి వచ్చింది. తన బిడ్డను ఓదార్చుదామని వచ్చినట్టు భోగట్టా. కానీ ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో బయటే ఉండిపోయింది. తీరా హాస్టలు గదిలో కుమార్తె లక్ష్మీప్రసన్న తనువు చాలించిందని తెలుసుకున్న మృతురాలి తల్లి నిర్ఘాంతపోయింది. ఇలా అర్ధాంతరంగా ప్రాణం తీసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. గుండెలవిసేలా రోదించింది. స్థలానికి రాజంపేట అర్బన్ సీఐ శుభకుమార్, పుల్లంపేట ఎస్ఐ వినోద్‌కుమార్, తహసీల్దార్ ఉమామహేశ్వర్, డాక్టర్ సానే శేఖర్, ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి, డీఈఓ శైలజ, ఎంఈఓ రంగనాథయ్య తదితరులు చేరుకున్నారు. ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు. -
ఫ్రెండ్‌కు లవ్ యూ బంగారం మెసేజ్.. దీంతో..
సాక్షి, నందిపేట్ (నిజామాబాద్): స్నేహితురాలి తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం నయేగావ్ గ్రామానికి చెందిన సాయన్న భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి తొమ్మిదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం డొంకేశ్వర్ గ్రామానికి వలస వచ్చాడు. గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద పాలేరు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని రెండో కూతురు లలిత (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే, శనివారం తన క్లాస్మేట్ అయిన మండలంలోని నికాల్పూర్ గ్రామానికి చెందిన పల్లవికి ఫోన్లో ‘ఐలవ్ యు బంగారం’ అని మెస్సేజ్ పెట్టింది. ఈ విషయాన్ని పల్లవి తన తండ్రి హన్మంత్‌కు చెప్పింది. దీంతో హన్మంత్ మరో ఇద్దరిని తీసుకుని శనివారం డొంకేశ్వర్‌లోని లలిత ఇంటికి వచ్చి నిలదీశాడు. ఈ మెస్సేజ్ ఎందుకు పెట్టావని నిలదీస్తూ, చెప్పకుంటే పోలీసులకు చెబుతామని హెచ్చరించి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంటి నుంచి వెళ్లి పోయింది. తల్లిదండ్రులు చుట్టపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామంలోని మంచినీటి బావిలో శవమై తేలిన లలితను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఆరిన విద్యా దీపం
పూట గడవని బతుకుల్లో చదువులెందుకని భ్రమపడ్డారుగానీ.. రేపటి రోజున తమ బిడ్డే పది మందికి అన్నం పెడుతుందని ఊహించలేకపోయారు. ఆడ పిల్లకు పది చదువుచాలని అపోహపడ్దారుగానీ.. తమ ఇంటే సరస్వతీ పుత్రిక పుట్టిందని గుర్తించలేకపోయారు. చదువులు వద్దంటే నాలుగు రోజులు మౌనంగా రోదిస్తుందనుకున్నారుగానీ.. ఆ చదువే తన ప్రాణమని తెలుసుకోలేకపోయారు. అమ్మాయి కాలేజీకెళితే అప్పులు పాలవుతామని ఆందోళనపడ్డారుగానీ.. ఆ ఆడ బిడ్డే ఆర్థిక అండవుతుందని అర్థం చేసుకోలేకపోయారు. పది మెట్టు దాటిన బిడ్డ.. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని ఆలోచించలేకపోయారు ఆ తల్లిదండ్రులు..అక్షరమే తన ఆయువని అమ్మానాన్నకు అర్థమయ్యేలా చెప్పలేక, చదువుపై మమకారం చంపుకోలేక దుగ్గిరాల మండలం చిలువూరులో ఎలుకల మందు తిని బాలిక తనువు చాలించింది. దేదీప్యమానంగా వెలగాల్సిన విద్యాదీపం ఆరిపోయింది. సాక్షి, దుగ్గిరాల: ఎలుకల మందు తిని పదో తరగతి బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిలువూరు గ్రామానికి చెందిన ఓ బాలిక పదో తరగతి పూర్తి చేసి వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటుంది. మే 14వ తేదీ వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ నెల 9వ తేదీ ఇంటర్మీడియట్ చేరాలని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇక చదివించలేమని తేల్చిచెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లి కూలీ పని కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇంటిలో ఉన్న ఎలుకల మందు తాగింది. తిరిగి తల్లి ఇంటికి వచ్చే సమయానికి నోటి వెంట నురగరావడంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 12వ తేదీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 15వ తేదీ శనివారం రాత్రి 7.30 గంటలకు మృతి చెందింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ వై. అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు : పోకిరీల వేధింపులు తాళలేక బాలిక ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన నెలమంగల తాలూకా ఎడేహళ్లి గ్రా మంలో చోటుచేసుకుంది. ఎడేహళ్లిని చెంది న ధనలక్ష్మి (14)ని ఇదే గ్రామానికి చెందిన జగదీష్, రవికుమార్ అనే ఇద్దరు యువకులు నిత్యం వేధించేవారు, యువకుల వేధింపులు తాళలేని ధనలక్ష్మి శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక ధనలక్ష్మి మృతి చెందింది. మరణానికి ముందు పోలీసులు బాలిక వద్ద తీసుకున్న మరణ వాగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. -
పుణేలో కోరుట్ల యువతి ఆత్మహత్య
కోరుట్ల: పుణేలో కోరుట్ల యువతి పిట్ల మౌనిక(23) నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. కోరుట్లలో నివాసముంటున్న పిట్ల శేషు–జ్యోతి దంపతుల కుమార్తె మౌనిక హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. తండ్రి శేషు ఉపాధికోసం దుబాయ్ వెళ్లగా తల్లి జ్యోతితో కలిసి మౌనిక కోరుట్లలో ఉంటోంది. రెండేళ్ల క్రితం పుణేలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. వారంక్రితం ఆ కంపెనీలో తక్కువ జీతం ఉండడంతో పని మానేసి వేరే కంపెనీలో ఉద్యోగంకోసం ఇంటర్వ్యూకు హాజరైనట్లు సమాచారం. ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేదనే తీవ్ర ఒత్తిడిలో బుధవారం సాయంత్రం తల్లికి ఈ విషయం ఫోన్లో చెప్పి బాధపడినట్లు సమాచారం. అనంతరం సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆందోళన చెందిన తల్లి జ్యోతి వివరాలు తెలుసుకునేందుకు యత్నించగా మౌనిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం అందింది. ఈ విషయంపై పుణేలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. తల్లి జ్యోతి, బంధువులు మౌనిక ఆత్మహత్యతో తీవ్ర విషాదంలో మునిగి పోయారు. మౌనిక తండ్రి శేషు దుబాయ్ నుంచి వచ్చినట్లు సమాచారం. -
ప్రేమ వేధింపులకు బాలిక బలి
మంచిర్యాలక్రైం: ప్రేమికుని వేధింపులు భరించలేక ఓ బాలిక (17) తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిని బూర్ల రాజయ్య, స్వరూప దంపతుల కూతురు సంధ్యకు అదే గ్రామానికి చెందిన ఎండీ.అక్బర్ కొంతకాలం క్రితం పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుందామంటూ వెంట పడుతున్నాడు. ఏడాదిన్నర క్రితం సంధ్య సీసీసీ నస్పూర్‌లో ఉంటున్న చిన్నమ్మ ఇంటికెళ్లింది. ఆ సమయంలో అక్బర్ సంధ్యను కిడ్నాప్ చేశాడు. ఈ విషయంలో అక్బర్‌పై సీసీసీ పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలేబుల్ కేసు నమోదైంది. అక్బర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్బర్‌ను మరిచిపోవాలని కుటుంబసభ్యులు సంధ్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మూడు నెలల జైలుశిక్ష అనంతరం బెయిల్‌పై వచ్చిన అక్బర్.. సంధ్యను వివాహం చేసుకుంటానంటూ మళ్లీ వేధించసాగాడు. అతడి వేధింపులు భరించలేని సంధ్య కుటుంబం ఇటీవల మంచిర్యాలలోని సున్నంబట్టివాడకు మకాం మార్చారు. అయినా అక్బర్ నుంచి వేధింపులు ఆగలేదు. ఇటీవల ఇంటికి వెళ్లి సంధ్యను తానే పెళ్లి చేసుకుంటానని, తనను కాదని ఎవరు చేసుకున్నా వారి అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంధ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబస భ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తు న్నట్లు మంచి ర్యాల ఎస్సై ఓంకార్‌యాదవ్ తెలిపారు. -
ప్రేమికుడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు తనను ప్రేమించడంతో పాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై సీహెచ్.రమేష్‌బాబు కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్‌కు చెందిన బూర్గుల యాకమ్మ, పాపయ్య మనుమరాలు బూర్గుల ప్రవళిక(19)కు తల్లి ఉపేంద్రమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో ఆమె అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటోంది. ఇదే కాలనీకి చెందిన బల్లెం మార్కయ్య కుమారుడు చంటి, ప్రవళికలు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రవళికను పెళ్లి చేసుకుంటానని చంటి కాగితం కూడా రాసి ఇచ్చాడు. అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బల్లెం చంటిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. మృతదేహన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. -
యువకుడి వేధింపులకు విద్యార్థిని బలి
మాగనూర్ (మక్తల్): ప్రేమ పేరుతో వేధింపులకు ఓ విద్యార్థిని బలైంది. ఈ సంఘటన మాగనూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మాగనూర్‌కు చెందిన సౌందర్య(20) హైదరాబాద్‌లో ఉంటూ డిగ్రీ చదువుతుంది.ఈ క్రమంలో మంగళవారం స్వగ్రామానికి వచ్చింది. అయితే మక్తల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం యువకుడు ఏకంగా తన తల్లితోపాటు యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడు. అయితే తాను ప్రేమించకున్నా ఇంటికి రావడాన్ని తట్టుకోలేని యువతి అవమానభారంతో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయమై ఏఎస్ఐ మహిభూషన్రెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో సీఐ వెంకట్ అక్కడికి చేరుకొని విద్యార్థిని కుటుంబ సభ్యులతో వివరాలు తెలుసుకున్నారు. -
‘ఖని’లో బాలిక ఆత్మహత్య
కోల్‌సిటీ(రామగుండం): స్కూల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించినందుకు గోదావరిఖనిలో పొరండ్ల వైష్ణవి(14) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ ఎస్సై ఎ.వెంకటేశ్వర్లు వివరాల మేరకు... స్థానిక ఫైవింక్లయిన్ ఏరియాకు చెందిన పొరండ్ల ఆనంద్, సరిత దంపతులకు కొడుకు రాహుల్, కూతురు వైష్ణవి ఉన్నారు. దంపతులిద్దరూ స్థానిక విఠల్‌నగర్ పార్క్ సమీపంలో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్థానికంగానే ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వైష్ణవి 15 రోజులుగా స్కూల్‌కు వెళ్లడంలేదు. ఈ విషయంపై వైష్ణవిని తల్లిదండ్రులు మందలించారు. ఆదివారం ఉదయం తల్లి, తండ్రితోపాటు సోదరుడు కూరగాయాల దుకాణంలో ఉండగా, వైష్ణవి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో మనస్తాపంకు గురై ఇంటి పైకప్పు ఇనుప ఊచకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోంచి కూరగాయల దుకాణంకు వెళ్లిన తండ్రి, గంట తర్వాత ఇంట్లో దాచిన డబ్బుల కోసం ఇంటికి వచ్చాడు. మధ్యరూంలో వైష్ణవి ఉరికి వేల్లాడుతూ కనిపించడంతో, హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆనంద్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బాలిక ఉసురు తీసిన లేఖ..
ముంబై : మహారాష్ట్రలోని పందార్పూర్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రాసిన లవ్‌లెటర్‌తో మనస్థాపం చెందిన 15 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలికకు దుండగుడు రాసిన లేఖ క్లాస్ టీచర్ చేతికందడంతో ఆమె అందరి ఎదుట బాలికను మందలించింది. బాలిక తల్లితండ్రులను పిలిచి లేఖ విషయం వారికి చేరవేసింది. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన బాధిత విద్యార్ధిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఈ ఘటనపై స్పందిస్తూ తమకు స్కూల్ నుంచి ఫోన్ కాల్ రావడంతో తాను అక్కడికి వెళ్లగా తన కుమార్తె ఏడుస్తూ కనిపించిందన్నారు. తమ కుమార్తె చేతిలో ప్రేమలేఖ ఉందని టీచర్ చెప్పగా, తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, ఈ లేఖ ఎవరు రాశారో కూడా తనకు తెలియదని తమ బాలిక చెప్పిందన్నారు. అనంతరం ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందిన తమ కుమార్తె సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. బాలిక మరణించిన కొద్దిసేపటికే వాఖ్రి గ్రామస్ధులు పందార్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మరణానికి కారణమైన గుర్తుతెలియని ప్రేమికుడు ఎవరనేది నిగ్గుతేల్చనున్నారు. -
ప్రేమ కోసం విద్యార్థిని.. పరువు కొసం ప్రియుడి తండ్రి
వెంకటాపురం(ఎం): సంక్రాంతి పండుగ వేళ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకొని మృతిచెందడంతో మండల పరిధిలోని పాలంపేట గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మండలంలోని పాలంపేటకు చెందిన బోడ సుమలత–సంజీవయ్య దంపతుల పెద్ద కూతురు సింధూజ(18) మండలంలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం హైదారాబాద్‌లో ఉంటున్నారు. సంక్రాంతి సెలవులకు ఈనెల 10న సాయంత్రం సింధూజ పాలంపేటలోని తన పెద్దనాన్న రవి ఇంటికి వచ్చింది. సింధూజ పాలంపేటకు చెందిన కొండబత్తుల రమేష్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు తెలిసింది. ఈనెల 14న సింధూజ ఇంటివద్దే ఉదయం 10 గంటలకు పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు ము లుగు ప్రభుత్వ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొం దుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. తన కూతురు కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని సింధూజ తల్లి సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సింధూజ తల్లిదండ్రులు ఆమె ఫోన్ డాటాను పరిశీలించారు. సింధూజ మృతికి ఇదే గ్రామానికి చెందిన కొండబత్తుల రమేష్ కారణమని 15న ఉదయం వెంకటాపురం పోలీసులకు ఆమె తల్లి దండ్రులు మరోసారి ఫిర్యాదు చేశారు. అలాగే రమేష్ ఇంటి ఎదుట మృతదేహంతో మంగళవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ క్రమంలో కొండబత్తుల రమేష్ తండ్రి రాజు సాయంత్రం ఇంటివద్దే పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యల మృతి చెందాడు. -
కాటేసిన మైనర్ల ప్రేమ..!
రెండు కుటుంబాలవి పక్క పక్క ఇళ్లే.. తెలిసీ తెలియని వయసులో ఇద్దరు మైనర్లలో ఆకర్షణ మొదలైంది. అది పరిచయానికి దారితీసి ఇద్దరి మనసులు కలిశాయి..కొంతకాలంగా సాగుతున్న వారి ప్రేమ హద్దులు దాటడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బయటికి పొక్కడంతో పెద్దల మధ్య విభేదాలు పొడచూపాయి. తమ ప్రేమను ఒప్పుకోరనో..? విడిచి ఉండలేనని నిర్ణయించుకుందో..? మరో కారణమో తెలియదు కానీ ఆ బాలిక బలవన్మరణానికి ఒడిగట్టింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి (మనుగోడు) : నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో ఇద్దరు మైనర్ల కుటుంబాలు పక్కపక్కనే నివాసముంటున్నాయి. బాలిక తొమ్మిదో తరగతి వరకు చదివి కూలి పనులకు వెళ్తుండగా బాలుడు ఇంటర్మీడియట్ చదువుతూ ఆటో నడుపుతున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలిక పత్తికూలికి ఆ బాలుడి తండ్రి ఆటోలోనే వెళ్లేది. అలా తండ్రి లేని సమయంలో బాలుడు ఆటో నడుపుతుండగా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. హద్దులు దాటి.. గర్భందాల్చి.. ఇద్దరు మైనర్లే కావడం.. జీవితంపై అవగాహన లేకపోవడం.. సినిమాల ప్రభావం వెరసి వారి ప్రేమ కాలక్రమేణా హద్దులు దాటింది. ఇద్దరి మనసులు ఒక్కటి కావడంతో బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ తమను వేరు చేస్తారో అన్న భయాందోళనతో బాలిక మిన్నకుండిపోయింది. బాలిక ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో ఏడు నెలల గర్భవతి అని తెలియడంతో కుటుంబ సభ్యులు నిలదీయడంతో తమ ప్రేమాయణం బయటపెట్టింది. ప్రేమికుల మధ్య వాగ్వాదం అయితే, శుక్రవారం సాయంత్రం బాలిక కుటుంబాలు ఇంట్లోనే మంతనాలు జరుపుతున్నారు. ఈ సమయంలో బాలుడు వారి ఇంటి ఎదురుగా నుంచి వెళ్తుండగా బాలిక గమనించింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సదరు బాలుడు కోపోద్రిక్తుడై బాలికపై చేయి చేసుకున్నాడు. బాలుడి ఇంటి ఎదుట ధర్నా.. బాలిక మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు మధ్యాహ్నం బాలుడి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే బాలుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలిక మృతికి కారణమైన సదరు బాలుడితో పాటు అతడి తండ్రిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు నాంపల్లి ఎస్ఐ శివకుమార్ తెలిపారు. అబార్షన్ చేయించమని.. విషయం తెలుసుకుని కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు శుక్రవారం సదరు ప్రేమికుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రిని నిలదీశారు. ఇద్దరూ మైనర్లే కావడంతో విషయం తర్వాత చర్చిద్దామని తొలుత బాలికకు అబార్షన్ చేయించమని బాలుడి తండ్రి సూచిం చాడు. అందుకు రూ.5వేలు కూడా ముట్టజెప్పాడు. అయితే ఆస్పత్రికి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులకు ఏడు నెలల గర్భానికి అబార్షన్ చేయాలంటే రూ. 25వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్ చేయగా స్వీచ్ ఆఫ్ రావడం, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగివచ్చారు. పురుగుల మందు తాగి.. వారిద్దరి మధ్య ఏం విషయంలో వాగ్వాదం జరిగిందో, ప్రేమికుడు చేయిచేసుకున్నాడనో.. పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిందో తెలియదు కానీ వెంటనే ఇంట్లోకి వెళ్లిన బాలిక పురగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు సదరు బాలికను నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడినుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. -
యువకుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
కోల్‌సిటీ(రామగుండం): యువకుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నేహ(15) నానమ్మ జులేఖాబేగం వద్ద ఉంటోంది. శనివారం ఆమె నానమ్మ తో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాబాయ్ రజాక్ ఇంటికి వెళ్లింది. సాయంత్రం బాబాయ్, నానమ్మ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో నేహ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద ‘నన్ను క్షమించండి.. నేను ఏ తప్పు చేయలేదు’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన మాతంగి కిరణ్ అలియాస్ నిఖిల్ కొంతకాలంగా ప్రేమ పేరుతో నేహను వేధింపులకు గురిచేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి బాబాయ్, నానమ్మ తెలిపారు. నిం దితుడిని అరెస్ట్ చేయాలని మృతు రాలి బంధువులు, ముస్లింలు గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐలు వాసుదేవరావు, మహేందర్ జోక్యం చేసుకొని వారికి నచ్చజెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉప్పల్‌లో యువతి ఆత్మహత్య
-
కోటా కోసం తనువు చాలించిన బాలిక..
సాక్షి, ముంబై : మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. రాధాబాయ్ కాలే మహిళా కళాశాలకు చెందిన పదకొండో తరగతి విద్యార్థిని కిషోరి బబన్ కకాడే అనే విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుందని ఎస్పీ రంజన్ కుమార్ శర్మ చెప్పారు. మరాఠాలకు కోటా కోరుతూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని బాలిక లేఖలో పేర్కొంది. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో తాను 89 శాతం మార్కులు సాధించినా పదకొండో తరగతిలో సైన్స్ గ్రూపులో అడ్మిషన్ సాధించలేకపోయానని లేఖలో పేర్కొందని ఎస్పీ తెలిపారు. వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే తన తండ్రి రూ 8000 ఫీజు చెల్లించడంతో అడ్మిషన్ పొందానని, ఫీజు చెల్లించడం తన కుటుంబానికి భారమని, రిజర్వేషన్ వర్తించే కులాల్లో 76 శాతం మార్కులు వచ్చినా వారికి కేవలం రూ 1000 ఫీజుతో అడ్మిషన్ లభించిందని లేఖలో బాలిక ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగంలో రిజర్వేషన్లు లేని మరాఠా వర్గానికి చెందడంతో తాను వివక్ష ఎదుర్కొన్నానని బాలిక పేర్కొందని పోలీసులు తెలిపారు. తన మరణంతో మరాఠా ఉద్యమం బలపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బాలిక ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వ తీరును పలు మరాఠా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి. -
పుట్టినరోజు నాడే కానరానిలోకాలకు..
భువనగిరి క్రైం : ప్రేమపేరుతో వేధింపులకు ఓ బాలిక బలైంది. కళాశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థినిని నిత్యం వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురై పుట్టిన రోజు నాడే ఆయువు తీసుకుంది. ఈ విషాద సంఘటన శుక్రవారం భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంకు చెందిన పెద్దపొల్ల నర్సింహ, స్వప్నలకు ముగ్గురు పిల్లలు. తల్లి పట్ట ణ పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తుండగా, తండ్రి రోజూవారీ కూలి పనులు చేసుకుంటాడు. వీరి రెండో కూతురు మాధవి(16) భువనగిరిలోనే ఇం టర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మాధవిని కొన్ని రోజులుగా భువనగిరి పట్టణంలోని ఎల్బీనగర్కు చెందిన శ్రీకాంత్, సింగన్నగూడేనికి చెందిన అన్నదమ్ములు బొంతల కిరణ్, తేజాలు ప్రేమపేరుతో వేధిస్తున్నారు. ఈ విషయం మా ధవి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు యు వకులను మందలించారు. అయిన వారిలో మా ర్పు రాలేదు. గురువారం(ఈనెల19న) మాధవి పుట్టిన రోజు అవడంతో వేధింపుల భయంతో కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంది. మనస్తాపంతో దిగులు చెందిన మాధవి తలకు రాసుకునే నూనె(సూపర్ వేస్మాల్) డబ్బా తీసుకుని ఇంటి దగ్గరలోనే ఉన్న న్యూరవీంద్ర నగర్ వద్ద ఉన్న పో చమ్మ గుడి వద్దకు వెళ్లింది. ఈ విషయం నిం దితుల ద్వారానే తెలుసుకున్న మాధవి తల్లి అక్కడికి వెళ్లేలోపే అపస్మారక స్థితిలో ఉంది. దీంతో అప్రమత్తమైన తల్లి మాధవిని వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించింది. భువనగిరి ఏరి యా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. నిందితులపై కేసు నమోదు చేశాం : సీఐ మాధవి మృతికి కారణమైన ముగ్గురు నిందితుల ను అదుపులోకి తీసుకున్నామని భువనగిరి పట్టణ సీఐ వెంకన్న తెలిపారు. ఈ ముగ్గురు కొంతకాలంగా మాధవిని ప్రేమపేరుతో వేధిస్తున్నారని చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఫోక్సో యాక్టు, ప్రేమపేరుతో వేధింపులతో వేధించినందుకు కేసు నమోదు చేశామని చెప్పారు. మా కూతురిని వాళ్లే పొట్టనబెట్టుకున్నారు : మాధవి తల్లిదండ్రులు తమ కూతురుని ఆ ముగ్గురు యువకులే పొట్టన పెట్టుకున్నారని మాధవి తల్లిదండ్రులు నర్సింహ, స్వప్నలు ఆరోపించారు. కొంతకాలంగా వీళ్లు మాధవిని వేధిస్తున్నారని చెప్పారు. పుట్టిన రోజు నాడు మాధవి గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిందన్నారు. విషయం తెలుసుకున్న శ్రీ కాంత్, తేజ, కిరణ్‌లు గుడి వద్దకు వెళ్లి బలవంతంగా సుపర్ వేస్మాల్ ఆయిల్‌ను తాగించారని ఆరోపించారు. మళ్లీ ఆ విషయాన్ని వాళ్లే తనకు వచ్చి చెప్పారని, తాము వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తన కూతురు అపస్మారక స్థితికి చేరుకుం దని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పింది. ఆస్పత్రికి తీసుకువెళ్లే మార్గమధ్యలో ‘అమ్మ నాన్న నేను వెళ్లిపోతున్నాను.. అక్క జాగ్రత్త’ అని చెప్పిం దని తల్లి రోదించింది. తన కూతురు చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరిం ది. ఇలాంటి పరిస్థితి ఎవరి తల్లిదండ్రులకు రావద్దని రోదిస్తూ చెప్పింది. మాధవి ఇంటి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ ఆ త్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సీఐ వెం కన్న తెలిపారు. శ్రీకాంత్‌ను సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు, ప్రస్తు తం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉం దని ఆయన తెలిపారు. -
బాలిక ఆత్మహత్య
రుద్రవరం(ఆళ్లగడ్డ): రుద్రవరం మండలం లోని ఆలమూరు గ్రామంలో ఓ బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, బంధువులు తెలిపిన మేరకు వివరాలు.. రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఆలమూరుకు వలస వచ్చి మిఠాయిలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. దగ్గరి బంధువైన ఓ బాలిక వారితోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆ బాలికను ఓ ఆకతాయి నిత్యం ఫోన్లో, అప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్లి వేధించేవాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందేమోనని భయపడిన బాలిక మంగళవారం రాత్రి నిద్రమాత్రలు మింగి పడుకుంది. బుధవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గమనించిన కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందింది. ఈ విషయంపై రుద్రవరం ఎస్ఐ పీరయ్యను సంప్రదించగా.. బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నది వాస్తవమేనని, కుటుంబ సభ్యులు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అయితే ఓయువకుడు వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోందని, బాలిక ఫోన్ కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టామన్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పైశాచికం
ఇక్కడ..అక్కడ..అని కాదు. దేశంలోని పట్టణ ప్రాంతాలైనా..మారుమూల ప్రాంతాలైనా..చివరికి ఆదివాసీ కొండ ప్రాంతాలైనా..దుర్యోధన, దుశ్శాసన దుర్వినీతి లోకంలో..అడుగు బయట పెట్టాలంటే బాలికలు, మహిళలకు వణుకు పుడుతోంది. ఎక్కడ ఏ కామాంధుడు ఏ వైపు నుంచి కాటేస్తాడోనన్న ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. బాలికలు, మహిళలను బయటకు పంపించాలన్నా..తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు కూడా చిగురుటాకుల్లా కంపిస్తున్నారు. ఎక్కడ నుంచి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని గుండెలు అరచేతిలో పెట్టుకుని భీతిల్లుతున్నారు. ఒరిస్సా ,జయపురం: నేటి సమాజంలో బాలికలు, మహిళలపైన అత్యాచారాలు, హత్యలు ప్రతిరోజూ పెరుగుతున్నట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి. ఇది దేశ ప్రజలను కలవర పరుస్తున్నా..కామాంధుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. ఇటువంటి సంఘటనలు అన్ని ప్రాంతాలలోను వెలుగుచూస్తున్నాయి. బహుళ ఆదివాసీ ప్రాంతమైన అవిభక్త కొరాపుట్ జల్లాలో కూడా తరచూ ఇటువంటి అమానుష సంఘటనలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా బాలికలు, వివాహితులను మానభంగం చేసి ఆ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పైసాచికంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి పైసాచిక చర్య వల్ల ఒక బాలిక సమాజంలో తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్ జిల్లా ఝోరిగాం సమితిలోని ఒక గ్రామంలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు జగన్నాథ్గౌడ అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆ వీడియో క్లిప్పింగ్‌లను గ్రామవాసులంతా చూశారు. ఈ విషయం తరువాత ఆ యువకుడు గ్రామం విడిచి పరారయ్యాడు. కుంగిపోయిన తల్లిదండ్రులు కుమార్తెను అత్యాచారం చేసిన వీడియో వైరల్ కావడంతో బాలిక తల్లి దండ్రులు సిగ్గుతో కుంగిపోయారు. ఆ వైరల్ ప్రసారాన్ని నిలుపు చేసేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేక పోయారు. చట్టం పట్ల వారికి అవగాహన లేక చైతన్యవంతులు కాక పోవడంతో ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయారు. బాధిత బాలిక సోమవారం తన సోదరిని వెంట తీసుకుని కట్టెలు ఏరేందుకు సమీప అడవికి వెళ్లింది. కొంత సమయం తరువాత చెల్లెలిని ఇంటికి పంపేసింది. అక్క ఇంటికి ఎప్పటికీ రాకపోవడంతో తల్లిదండ్రులకు సోదరి విషయం తెలిపింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమె కోసం అన్ని ప్రాంతాలలోను వెతికారు. కానీ జాడ కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం ఝెరిగాం పోలీసులకు సమాచారం తెలియజేశారు. అడవికి వెళ్లి ఇంటికి రాని బాలిక ఫిర్యాదు అందిన తరువాత ఝోరిగాం ఎస్డీపీఓ హేమంత కుమార్పాఢి, ఎస్సై సుభాష్ బెహరా తమ సిబ్బందితో గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. కనిపించని బాలిక అడవికి వెళ్లిన విషయం తెలుసుకున్న వారు అడవికి వెళ్లారు. అక్కడ ఆ బాలిక ఆత్మహత్య చేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలిక ఆత్మహత్య విషయం తెలిసిన నవరంగ్‌పూర్ ఎస్పీ వివేకానంద శర్మ ఝోరిగాం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కేసు వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని విచారణ చేశారు. నాలుగు నెలల కిందట ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన జగన్నాథ్గౌడ అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుసుకున్న ఎస్పీ..శీఘ్రంగా సమగ్ర దర్యాప్తుపై పోలీసులను ఆదేశించారు. వీడియో వైరలోని ఫొటోలను పరిశీలించిన పోలీసులు ఆ గ్రామంలోని ముగ్గురు యువకులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చి తమదైన శైలిలో విచారణ చేసి విడిచి పెట్టారు. వారు తెలిపిన విషయాల మేరకు పోలీసులు అన్ని ప్రాంతాలలోను నింది తుడు గౌడ కోసం గాలించారు. ఎట్టకేలకు జగన్నాథ్ గౌడను అరెస్ట్ చేసి కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ అమానుష సంఘటనపై అవిభక్త కొరాపుట్‌లో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఈ దారుణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలి కుటుంబం చాలా నిరుపేదదని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామప్రజలు కోరుతున్నారు. -
వేధింపులకు వేసారి..
సాక్షి, కాన్పూర్ : పదేపదే వెంబడించి వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు యువకుల ఆగడాలు శ్రుతిమించడంతో కాన్పూర్‌కు సమీపంలోని చిత్వకేదా గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలోని ఓ చెట్టుకు ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. తన శరీరంపై నిందితుల పేర్లతో కూడిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. మరణించిన యువతిని గ్రామానికి చెందిన నేహ కుష్వాహగా గుర్తించామని, సూసైడ్ నోట్ ఆధారంగా విచారణకు ఆదేశించామని ఎస్పీ రతన్‌కాంత్ పాండే తెలిపారు. బాధిత యువతిని సమీప గ్రామానికి చెందిన సంజయ్ కోరి అతని సోదరుడు సోను గత కొద్ది రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. నిందితులకు మరణ శిక్ష విధించాలని ఆమె సూసైడ్ నోట్లో డిమాండ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. -
నన్ను ప్రేమించు లేకపోతే..
మైసూరు: ప్రేమించాలంటూ యువకుడు వేధింపులు తాళలేక ఆత్మహత్య కు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దక్షిణ గ్రామీణ పోలీసుల కథనం మేరకు... మైసూరు తాలూకాలోని రమ్మనహళ్లి గ్రామానికి చెందిన రజని(16)పీయూసీ చదువుతుండేది. అదే కాలేజీకి చెందిన ఇంటి పక్కనే ఉంటున్న దొడ్డస్వామి అనే యువకుడు తనను ప్రేమించాలంటూ బాలికను వేధించేవాడు. తనకు ఇష్టం లేదని తిరస్కరించినా వెంటపడి వేధించేవాడు. ప్రేమించకపోతే తనతో కలసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని బెదిరంచేవాడు. దీంతో మనస్థాపం చెందిన రజనీ ఆరు నెలల క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లితండ్రులు రజనీని కే.ఆర్.ఆసుపత్రికి తరలించగా కోమాలోకి వెళ్లింది. ఈక్రమంలో రజనీ బుధవారం మృతి చెందింది. ఇదిలా ఉండగా ఘటనపై దొడ్డస్వామిని పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. -
‘రిమోట్ ఇవ్వలేదని ఉరేసుకుంది’
హైదరాబాద్: క్షణికావేశం ఓ బాలిక ప్రాణాలు తీసింది. వివరాలు..నిజాంపేట రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే విమల, ప్రకాష్‌లిద్దరూ భార్యాభర్తలు. దంపతులకు జోత్స్న(13), ప్రవీణ్(16) అనే ఇద్దరు పిల్లలున్నారు. అన్నా చెల్లెళ్లు గత రాత్రి టీవీ రిమోట్ కోసం గొడవపడ్డారు. టీవీ రిమోట్ ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో జోత్న్స గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన జరిగిన సమయంలో తల్లి వంట చేస్తూ ఉంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
అమ్మా నన్ను క్షమించు...!
⇔ మాతృదినోత్సవం నాడు నీకు శోకం కలిగించినందుకు...!! ⇔ ప్రేమోన్మాదానికి యువతి ఆత్మహత్య ⇔ తనను ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసాడని సూసైడ్ నోట్ పిఠాపురం/కొత్తపల్లి : ‘అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం. మాతృ దినోత్సవం నాడు నీకు పుత్రికా శోకం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించు. నాకు బాగా చదువు కోవాలని ఐఏఎస్ అవ్వాలని ఉంది కాని నన్ను ఒక ప్రేమోన్మాది మోసం చేసాడు. అందుకే నేను అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నా’ అంటు ఒక యువతి సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగరంలో తీవ్ర విషాదఛాయలు నింపింది. ‘ప్రేమ పేరుతో వంచించి ముఖం చాటేశాడు. వాళ్ల నాన్నను, అమ్మను అడిగితే నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో అన్నారు. అలాగని అతనిని మర్చిపోలేను అతనంటే నాకు చాలా ఇష్టం అందుకే మీకు అన్యాయం చేసి వెళ్లి పోతున్నా’. ‘నా చావుకు నన్ను మోసం చేసిన కన్నాతో పాటు వాళ్ల కుటుంబం కారణం. ఎవరిని వదిలినా బేబమ్మను మాత్రం వదలకు. అమ్మా ఐలవ్యూ. మాతృదినోత్సవ శుభాకాంక్షలు నన్ను క్షమించు మరో జన్మంటు ఉంటే మళ్లీ నీరుణం తీర్చుకుంటా. చెల్లి అమ్మ జాగ్రత్త, సునీల్ బాగా చదువుకో అమ్మను బాగా చూసుకో’ అంటు మృతురాలు రాసిన సూసైడ్ నోట్ చూసిన ప్రతి ఒక్కరు కంట తడిపెడుతున్నారు. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌లో ఆదివారం బక్కా శిరీష 19 అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్ అవతానని కలలు కన్న తన కన్న కూతురు మాతృదినోత్సవం నాడు అర్థంతరంగా తనువు చాలించడం తట్టుకోలేని మృతురాలి తల్లి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. ఐఏఎస్ అవ్వాలని..! కాకినాడ శాంతి నగర్‌కు చెందిన బక్కా శ్రీను, భవాని దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. వారిలో పెద్దదయిన శిరీష చదువులో ప్రతిభా వంతురాలు. ఐఏఎస్ అవ్వాలనే పట్టుదలతో బాగా చదివింది. నా కూతురు కలెక్టరు అని మీరు గర్వంగా చెప్పుకునేలా చేస్తానంటు ఎప్పుడు తల్లిదండ్రులతో అంటూ ఉండేదని ఆమె బంధువులు తెలిపారు.పదో తరగతిలో 9.8 గ్రేడు సాధిచిన శిరీష ఇంటర్లో 980 మార్కులు సాధించింది. డిగ్రీ చదువుతూ తల్లిదండ్రులకు భారం కాకూడదని పిఠాపురంలో ఒక ప్రైవేటు స్కూలులో టీచర్‌గా చేసేది. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌లో ఉంటున్న అమ్మమ్మ సాకా చిన సత్తిరాజు ఇంటి దగ్గర ఉంటుండేది. అమ్మమ్మ వ్యవసాయ పనుల మీద పిఠాపురం మండలం నర్శింగపురంలో ఒక పొలంలో తాత్కాలికంగా నివాసముంటున్నారు. ఏం జరిగిందంటే..! బాధితురాలి బంధువుల కథనం ప్రకారం పిఠాపురం మండలం కోలంకకు చెందిన ఒక పాస్టర్ ఆనందనగర్‌లో కొన్నేళ్లుగా ఒక ప్రార్థనా మందిరం నిర్వహిస్తున్నాడు. ఆయన కూడా అతని కుమారుడు కన్నా (మృతురాలి సూసైడ్ నోట్లో రాసిన ప్రకారం) వచ్చే వాడు. ఈ నేపథ్యంలో శిరీషతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నానని నమ్మబలికి తరచూ కలిసేవాడు. ఇలా ఉండే అతడు కొద్ది రోజులుగా మాట్లాడడం మానేసి, ఫేస్ బుక్‌లో తన ఖాతా తొలగించి, వాట్సాప్ నిలిపివేసి, ఫోన్‌కు బదులిచ్చేవాడు కాదు. ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ తెలియకపోవడంతో శనివారం అతని స్వగ్రామమైన కోలంక వెళ్లి కన్నా కుటుంబ సభ్యులను ఆరా తీసింది. అయితే మా కొడుకే కనిపించడం లేదు అయినా మావాడితో నీకు సంబంధం ఏమిటీ? మర్యాదగా వెళ్లిపో నీఇష్టం వచ్చినట్లు చేసుకో అని గెంటేసినట్టు చెబుతున్నారు. దీంతో తాను మోసపోయానని ఏడుస్తూ స్థానికులకు తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంది. ఆమె బాధను ఎవరూ పట్టించుకోపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అదే గ్రామంలో పొలంలో ఉన్న అమ్మమ్మ వద్దకు వెళ్లి ఆ రాత్రికి ఉండిపోయింది. ఆదివారం ఉదయం ఆనందనగర్ వచ్చిన శిరీష ఉదయం నుంచి ఇంట్లోనే ఉండిపోయింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతలో ఆమె బంధువులు ఇంట్లో చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దింపి చూడగా ఆమె మృతి చెందిఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. తన చావుకు కన్నా వాళ్ల అమ్మ నాన్నలే కారణమని మృతురాలు రాసిన సూసైడ్‌నోట్ సైతం లభించింది. పోలీసులు దానిని కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ, ఏఎస్సై లోవరాజులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నా తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
వీడియోలు లీక్ చేసిన లవర్.. యువతి ఆత్మహత్య
ఢిల్లీ యూనివర్సిటీలో చదివే 21 ఏళ్ల అమ్మాయి ఉత్తరఢిల్లీలోని రూప్‌నగర్ ప్రాంతంలోగల తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తామిద్దరం కలిసున్న వ్యక్తిగత వీడియోలను తన ప్రేమికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తట్టుకోలేని ఆ యువతి.. ప్రాణాలు తీసుకుంది. స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్‌లో బీకాం చదువుతున్న ఆ యువతి.. తన చావుకు ప్రేమికుడే కారణమని చెబుతూ సూసైడ్ నోట్ రాసింది. ఇటీవలే ఆమె మోడల్ టౌన్ పోలీసు స్టేషన్లో తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిందని, అయితే పోలీసులు దానిపై చురుగ్గా స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అందుకు ప్రేరేపించాడంటూ నిందితుడు పట్నాకు చెందిన వేద్ ప్రకాష్ మీద పోలీసులు కేసు పెట్టారు. అతడిని అరెస్టు చేయడానికి ఓ బృందాన్ని పంపామని డీసీపీ జతిన్ నర్వాల్ తెలిపారు. యువతి కుటుంబం మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. ఆమె చదువుకోడానికి ఢిల్లీ వచ్చి తోటి విద్యార్థి అయిన ప్రకాష్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉండేవారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు గానీ, తర్వాత ఎందుకోగానీ ఇద్దరికీ చెడిపోయింది. ఇద్దరూ మూడేళ్ల పాటు సహజీవనం చేసినట్లు తెలిసిందని, అయితే వాళ్ల కుటుంబాలు అంగీకరించలేదని పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులను వదిలేసి తనతో పాటు బిహార్ వచ్చేయమని ప్రకాష్ అడిగేవాడని, అయితే అందుకు ఆమె నిరాకరించిందని అన్నారు. అలా రాకపోతే వ్యక్తిగత వీడియోలు బయట పెడతానంటూ అతడు బెదిరించేవాడని తెలిసింది. కొంతకాలం తర్వాత అతడు బిహార్ వెళ్లిపోయాడని, ఆమె ఫోన్లు ఆన్సర్ చేయకపోవడంతో పాటు ఆమెను కలవడం కూడా మానేశాడని చెప్పారు. దాంతో ఆమె ఏప్రిల్ 8వ తేదీన తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిందని, తాము దానిపై విచారణ జరుపుతుండగానే ఆమె ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెప్పారు. -
అడ్మిషన్‌కు నగదులేక విద్యార్థిని ఆత్మహత్య
రాంచీ: పాత పెద్ద నోట్ల రద్దుకు మరో విద్యార్థిని బలైంది. బీఈడీ అడ్మిషన్ ఫీజు సకాలంలో చెల్లించలేక జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ జిల్లాలో ఓ అమ్మాయి గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిందు తన గ్రామీణ బ్యాంక్ ఖాతాలోని రూ.37,000 నుంచి ఫీజు కోసం రూ.30,000 విత్‌డ్రా చేయాలనుకుంది. అరుుతే, రెండ్రోజుల క్రితం బ్యాంకు అధికారులు ఆమెకు ఖాతా నుంచి కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చారు. రూ.30,000 ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో సకాలంలో కాలేజీ ప్రవేశ రుసుం చెల్లించలేక, మనోవేదనకు గురైన బిందు ఆత్మహత్య చేసుకుందని గ్రామ సర్పంచ్ రాయ్మణి చెప్పారు. -
ప్రేమ వేధింపులు: బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ వేధింపులతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే ముత్యాల సోనీ(17) అనే మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన సూరజ్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో అతని ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. గత కొన్ని రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో.. బాలిక మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించింది. ఈ అంశంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సూరజ్ వల్ల తనకు, తన కుంటుంబానికి ప్రాణహాని ఉందని భావించిన బాలిక శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. అయితే విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. చనిపోవడానికి ముందు బాలిక సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ అంశంపై పోలీసులను వివరణ కోరగా వారి వాదన వేరే విధంగా ఉంది. బాలిక ఆత్మహత్యకు ముందు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యోగం లేదని యువతి ఆత్మహత్య
యాకుత్‌పురా: ఇంజినీరింగ్ చదివిని ఓ యువతి ఉద్యోగం రావడంలేదని ఆత్మహత్య చేసుకుంది. మీర్‌చౌక్ ఎస్ఐ అంజిరెడ్డి కథనం ప్రకారం... మీరాలంమండి జేజేనగర్ ప్రాంతానికి చెందిన శ్రీహరి, అరుణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కూతురు చంద్రవేణి (23) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని విఫలమైంది. బీటెక్ చదివినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రవేణి ఆదివారం రాత్రి ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ బాలిక మరణానికి కారకులు దొరికారు
రాజేంద్రనగర్: బాలికను ప్రేమ పేరుతో వేధించి, ఆమె మరణానికి కారణమైన బాలుడితో పాటు యువకుడిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానిక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. నాలుగు నెలలుగా హౌసింగ్ బోర్డుకు చెందిన అక్బర్ (20) బాలిక తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. పాఠశాలకు వచ్చిపోయే సమయంలో వెంబడించేవాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా అతడిని పిలిచి మందలించారు. నెల రోజుల పాటు మిన్నకుండిన అక్బర్ ఆ తర్వాత ఈ విషయాన్ని శాంతినగర్‌కు చెందిన తన స్నేహితుడైన బాలుడు (17)కు చెప్పాడు. 20 రోజుల క్రితం బాలిక సెల్‌ఫోన్ నెంబర్ తెలుసుకున్న వీరిద్దరూ ఆమెకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. తమలో ఎవరినైనా ప్రేమించాలని, తమతో బయటకు రావాలని భయభ్రాంతులకు గురి చేసేవారు. ఇదే క్రమంలో ఈ నెల 13వ తేదీ రాత్రి బాలికకు ఫోన్ చేసిన బాలుడు.. తన మాట వినకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. 14వ తేదీ ఉదయం మళ్లీ ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాలిక ఇంట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు మొదట నిందితులిద్దరూ మైనర్లని భావించారు. అనంతరం విచారణలో అక్బర్ వయసు 20 సంవత్సరాలుగా నిర్ధారణ కావడంతో బాలుడితో పాటు సదరు యువకుడిపై నిర్భయ కేసును నమోదు చేశారు. శనివారం ఇద్దరిని అరెస్టు చేశారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు, యువకుడిని రిమాండ్‌కు తరలించారు. -
ఫేస్బుక్లో ఫొటోలు పెట్టాడని.. బాలిక ఆత్మహత్య
సోషల్ మీడియా.. మరో చావుకు కారణమైంది. ప్రేయసి తనకు దూరమైందన్న ఉక్రోషంతో ఓ యువకుడు గతంలో తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దాంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బిష్ణుపూర్‌లో జరిగింది. ఫేస్బుక్లో వీళ్ల ఫొటోలు విపరీతంగా సర్క్యులేట్ కావడంతో పాటు వాటికి కామెంట్లు కూడా పిచ్చిపిచ్చిగా వస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. 20 ఏళ్ల యువకుడికి, 12వ తరగతి చదివే బాలికు మధ్య మూడేళ్ల పాటు ప్రేమాయణం నడిచింది. అయితే, ఏడాది క్రితం కుటుంబ సమస్యల కారణంగా వాళ్లిద్దరూ విడిపోయారు. దీనిపై మౌనంగా ఉండకపోతే ఆ ఫొటోలను ఫేస్బుక్లో పెడతానంటూ యువకుడు చాలాసార్లు బెదిరించాడు. చిరవకు తాను అన్నంత పనీ చేశాడు. ఆ బాధను తట్టుకోలేని బాలిక.. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని బాలిక తల్లిని సైతం అతడు బెదిరించాడు. దాంతో అతడి గురించి బాలిక తల్లి పోలీసులకు ముందే ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు స్పందించి చర్యలు తీసుకునేలోపే బాలిక ప్రాణాలు తీసుకుంది. -
నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్య
కమలాపురం: పట్టణంలోని రాం నగర్‌కు చెందిన సేగారి స్నేహ(12) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సేగారి శ్యామల, సోమయ్యకు ఇద్దరు సంతానం. వారిలో స్నేహ తొలి సంతానం. స్థానిక బాలికల హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక బుధవారం స్కూల్‌కు వెళ్లలేదు. దీంతో తల్లి శ్యామల మందలించింది. గురువారం ఉదయం ఉపాధి పనికి పోతున్న తల్లి.. ‘స్కూల్‌కు వెళ్లే.. లేక పోతే నీ కథ చెబుతా’ అని మందలించింది. తండ్రి సోమయ్య ఆటో వృత్తిపై వెళ్లిపోయాడు. స్నేహ స్కూల్‌కు వెళ్లలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అరుస్తుందని భయపడిందో.. ఏమో.. తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మంటలకు తట్టుకోలేక గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టారు. అప్పటికే 80 శాతం కాలిపోయింది. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఎస్ఐ తెలిపారు. స్నేహ మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
యువతి ఫేక్ నగ్న చిత్రాలు పోస్ట్ చేయడంతో..
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని యువకుడు చేసిన చిల్లరపనికి ఓ యువతి బలైంది. ఫేస్బుక్లో ఆమె ఫేస్‌తో నఖిలీ నగ్న చిత్రాలు పోస్ట్ చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. వాస్తవానికి పోలీసులు వేగంగా స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని ఈ ఘటన చూస్తే అర్థం చేసుకోవచ్చు. సాలెం జిల్లాలోని ఎలంపిల్లాయ్కు చెందిన 21 ఏళ్ల యువతి ఇటీవలె కెమిస్ట్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గత వారం ఆమె స్నేహితులు ఫోన్ చేసి ఫేస్ బుక్‌లో మార్పింగ్ చేసిన తన నగ్న చిత్రాలు ఉన్నాయని చెప్పడంతో బాధితురాలు తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేసేందుకు పోలీసుకు తండ్రి ఒక కొత్త ఫోన్ కూడా కొన్నాడు. అయినా పట్టించుకోకపోవడంతో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ అదేశాల మేరకు బాలిక ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో ఓ వ్యక్తిని పిలిచి దర్యాప్తు చేశారు. అతడు కాదని నిర్ధారించారు. దీంతో పదిహేను రోజుల్లోగా అతడిని పట్టుకుంటామని హామీ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే, మరోసారి అదే ఫేస్ బుక్ మరో నగ్న ఫొటోను పోస్ట్ చేయడంతోపాటు ఆమె తండ్రి ఫోన్ నెంబర్ కూడా పెట్టారు. దీంతో భరించలేని ఆ బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ఆమె తండ్రి స్పందిస్తూ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే తన కూతురు బతికి ఉండేదని బోరుమన్నాడు. నిందితుడిని అరెస్టు చేసే వరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లబోమని ధర్నాకు దిగారు. -
అత్యాచారయత్నం చేశాడని...
కాన్పూర్: తనకు జరిగిన అవమానంతో కుంగిపోయిన ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. తనపై జరిగిన అత్యాచారయత్నంతో నాలుగు గోడల మధ్య కుమిలిపోయిన ఆమె చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా సుతాన్ పర్వా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలిక ఉరేసుకుని బలవన్మరణం చెందింది. ఈ నెల 9న ఆమెపై శివమ్ అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అప్పటినుంచి ఇంట్లోనే ఉండిపోయిన ఆమె బుధవారం సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీకి వెళ్లొచ్చేటప్పుడు బాలికను శివమ్ వేధించేవాడని కాన్పూర్ ఎస్పీ పుష్పాంజలి మాథూర్ తెలిపారు. అతడి గురించి బాలిక తన తల్లిదండ్రులతో చెప్పినప్పటికీ అవమానాలకు గురికావాల్సి వస్తుందేమోనన్న భయంతో వారు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన శివమ్ పై కేసు నమోదు చేశామని చెప్పారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
ఆ ఇంటి జ్యోతి ఆరిపోయింది
ఆ కుటుంబం ఆశలన్నీ ఆ అమ్మాయిపైనే.. అందుకే ఎంతో కష్టపడి కూలి పనులు చేస్తూ ఆమెను చదివిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ అమ్మాయి కూడా చదువులో రాణిస్తోంది. రాజమహేంద్రవరంలోని వీటీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ ఫస్టియర్ చదువుతోంది... ఇంతలో ఓ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించసాగాడు. అంతేకాదు ఆమె ఇంటికి ఫోన్ చేసి ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాలకు రావాలంటేనే భయమేస్తోందని, తన చదువుకు ఆటంకం లేకుండా రక్షణ కల్పించాలని ఆ అమ్మాయి లేఖ రాసింది. దాంతో ప్రిన్సిపాల్ ఆ యువకుడిని మందలించారు. ‘తాను ఎప్పుడూ ఆ అమ్మాయి జోలికి వెళ్లను’ అంటూ తనను క్షమించాలని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ... ఏమైందో కానీ ఆ యువతి కిరోసిన్ పోసుకుని తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుంది. యువకుడి వేధింపులకు ఆ ఇంటి ‘జ్యోతి’ ఆరిపోయింది. కన్నవారికి కన్నీళ్లు మిగుల్చుతూ దివికేగింది. - పెదరాయవరం(రంగంపేట) రంగంపేట మండలం పెదరాయవరం గ్రామానికి చెందిన గొర్ల సత్తిబాబు, నారాయణమ్మలకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె అనూషజ్యోతి(18) రాజమహేంద్రవరంలో బీఎస్సీ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుండగా, రెండో కుమార్తె దుర్గ చండ్రేడు హైస్కూల్లో పదోతరగతి చదువుతోంది. అనూషాజ్యోతి తండ్రి సత్తిబాబు వ్యవసాయకూలి కాగా, తల్లి నారాయణమ్మ వడిశలేరులో జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. రాజమహేంద్రవరం వి.టి కళాశాలలో చదువుతున్న అనూష జ్యోతిని రాజమండ్రికి చెందిన రేకాడ మణికంఠ అనే బీఎస్సీ ఫస్టియర్ విద్యార్థి మూడునెలలుగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 25న ఆమె ఇంటికి ఫోన్ చేసి ‘జ్యోతి ఉందా?’ అని అడిగి ఫోన్ కట్ చేశాడు. ఈ విషయమై అనూష జ్యోతి తల్లిదండ్రులు అదే నెల 28న వి.టి.కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ మణికంఠను మందలించారు. దాంతో ‘తానెప్పుడూ ఎవ్వరినీ వేధించనని, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించనని, క్షమించమని కోరుతూ రాసిచ్చాడు. అయితే ఈనెల 20న కళాశాలకు వెళ్లిన జ్యోతి అక్కడ ఏం జరిగిందో తల్లిదండ్రులకు చెప్పలేదు. 22వ తేదీన తల్లిదండ్రులు కూలి పనులకు, చెల్లి దుర్గ స్కూల్‌కు వెళ్లిన సమయంలో కిరోసిన్ పోసుకుని కాలినగాయాలతో మృతిచెందింది. సోమవారం రాత్రి గ్రామంలో జ్యోతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. తమకుమార్తె ఇలా మృతి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అనూషజ్యోతి మృతి తీరని లోటు పెదరాయవరం(రంగంపేట): చదువులోు, వినయవిధేయతలతో, ఇంటిపనిలో అన్ని విధాలా అగ్రగామిగా ఉన్న అనూషజ్యోతి లేదని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామస్తులు. ఎదుటవారిని నొప్పించే మనస్తత్వం ఆమెది కాదంటున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చండ్రేడు హైస్కూల్లో,ఇంటర్ రాజమహేంద్రవరం ఆదిత్య కళాశాలలో చదివింది. ఆమె ఆత్మహత్య సంఘటన పలువురిని విషాదంలో ముంచింది. కళాశాల ఎదుట బంధువులు, విద్యార్థులు ఆందోళన యువతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె తండ్రి సత్యనారాయణ తోపాటు బంధువులు, విద్యార్థులు బుధవారం వి.టి.కాలేజీ వద్ద ధర్నా చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ నిర్వాకం వల్లే యువతి మృతి చెందిందని, వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే కాలేజీ ప్రిన్సిపాల్ అడ్డుకున్నారని, అందువల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. -
పదేపదే ఈవ్ టీజింగ్.. యువతి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లో కొంతమంది యువకులు తనను పదే పదే ఈవ్ టీజింగ్ చేస్తుండటంతో ఆ వేధింపులు భరించలేని యువతి (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చార్పాన్ ఖుర్ద్ గ్రామంలో జరిగింది. ఇటీవలే ఆమె బీఎస్ఎఫ్ ప్రిలిమినరీ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది, మెయిన్స్ కోసం ప్రిపేరవుతోంది. గత శుక్రవారం నాడే ఆమె తనను ఇద్దరు యువకులు పదే పదే వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వాళ్లను కస్టడీలోకి తీసుకుని, తర్వాత వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయినా వాళ్ల వేధింపులు ఆగకపోవడంతో ఆదివారం రాత్రి ఆమె ఉరేసుకుని మరణించింది. దోషులపై కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమితాబ్ యశ్ తెలిపారు. నలుగురు వ్యక్తులపై కేసు దాఖలు చేశామని, ఒకరిని అరెస్టు చేశామని ఎస్పీ బ్రిజేశ్ సింగ్ చెప్పారు. -
వివాహం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య
పరిగి (రంగారెడ్డి జిల్లా): వివాహం ఇష్టం లేక మనస్తాపం చెందిన ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్‌పల్లి అనుబంధ రావులపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాళ్లాపూర్ సత్తయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు మౌనిక(15) చిన్నప్పటి నుంచి దోమ మండల పరిధిలోని పాలెపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. దోమ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఇటీవల బాలిక తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. పాఠశాలకు వేసవి సెలవులు ఉండటంతో మౌనిక నెలరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా పొలానికి వెళ్లిన బాలిక చున్నీ అంచుపై వేసి బావిలో దూకింది. పక్కపొలం రైతులు గమనించి వెంటనే బావిలోకి దూకి బాలికను బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. అప్పటికే మౌనిక మృతిచెందింది. అయితే.. మౌనికకు ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారని.. మగ పెళ్లివారు ఆదివారం మౌనికను చూసేందుకు వస్తున్నారని తెలిసి.. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని గ్రామస్తులు తెలిపారు. మౌనిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, బాలిక ఆత్మహత్యపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
బాలిక ఆత్మహత్య ఘటనలో ప్రిన్సిపల్ సస్పెండ్
పశ్చిమగోదావరి (పెదపాడు): పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రిన్సిపలేనంటూ బాలిక కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వడ్లూరు గురుకుల పాఠశాల ఎదుట గల జాతీయ రహదారిపై జరిగింది. బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో.. ఆ స్కూలు ప్రిన్సిపల్ నంబూరి భారతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్యం వేధింపుల వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్, ల్యాప్‌టాప్‌లు ధ్వంసం చేశారు. -
ప్రేమ వేధింపులతో.. బాలిక ఆత్మహత్యాయత్నం
ధర్మవరం అర్బన్: అభం.. శుభం కూడా తెలియని ఓ మైనర్ బాలిక ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. నిండా 14 సంవత్సరాలు కూడా నిండని ఆ బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతో పాటు, చంపుతామని కూడా బెదిరించడంతో కన్నవారికి చెప్పుకోలేకా... తానే ఈ లోకం నుండి వెళ్ళిపోవాలని ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరం పట్టణం లక్ష్మినగర్‌కు చెందిన మైనర్ బాలిక జోత్స్న (14) కొత్తపేట ప్రాంతంలోని మసీదు వద్ద ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సంవత్సరకాలం నుంచి ఇదే కాలనీలో కూలిమగ్గం నేసుకునే హరి అనే యువకుడు ప్రేమ పేరుతో ఆ బాలికను వేదింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో నెలరోజుల నుంచి ఈ వేధింపులు మరింత ఎక్కువగా కావడంతో విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో తల్లిదండ్రులు విషయాన్ని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా... పదిరోజుల క్రితం స్టేషన్‌కు తీసుకువచ్చి యువకుడికి కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. పెద్ద మనుషుల జోక్యం తర్వాత హరి వేధింపులు మరింత పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కత్తి తీసుకుని వచ్చి ప్రేమించకపోతే చంపుతానని తీవ్రస్థాయిలోనే బెదిరించాడు. విషయాన్ని బయటకు చెప్పినా ఇదే గతి పడుతుందని బెదిరించడంతో బాలిక బయపడిపోయి విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు. అయితే రెండు రోజుల క్రితం హరి అతని స్నేహితులు ముసుగులు ధరించి బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకుని పోతామని, ఎంతకైనా తెగిస్తామని చెప్పడంతో... భయపడిన బాలిక గురువారం రాత్రి 9.30గంటల సమయంలో ఇంట్లోని గదిలోకి వెళ్ళి ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు బాలికను హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... 80శాతం కాలిన గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ సీఐ భాస్కర్‌గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
నాతో వచ్చేయ్ లేకుంటే.. అందర్నీ చంపేస్తా..!
⇒ మరణించిన స్నేహితురాలు పిలుస్తోందంటూ.. ⇒ మానసిక వేదనతో బాలిక ఆత్మహత్య ⇒ పుంగనూరులో విషాదం... పుంగనూరు: ‘‘అమ్మా.. చనిపోయిన నా స్నేహితురాలు మమత నన్ను రోజూ రమ్మని పిలుస్తోంది. లేకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తోంది. ప్రతి అమావాస్యకూ నన్ను చెరువులోకి తీసుకెళ్లి నాకు తోడు ఎవరూ లేరు నాతో వచ్చేయ్ లేకపోతే అందర్నీ చంపేస్తా అంటూ బెదిరిస్తోంది. అందుకే నేను మమత వద్దకు వెళ్లిపోతున్నా బాయ్.. బాయ్.. నాకోసం బాధపడవద్దు. నాన్నకు, అన్నకు చెప్పండి. నేను చనిపోతున్నా’’ అంటూ యువతి లేఖరాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రకాశం కాలనీలో చోటుచేసుకుంది. హృదయ విదారకమైన ఈ ఘటన పుంగనూరులో కలకలం రేపింది. ప్రకాశం కాలనీకి చెందిన సత్యనారాయణ, నారాయణమ్మ కుమార్తె కల్పన (15) స్థానిక బాలికల హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన కల్పన రామసముద్రం రోడ్డులోని పటాలమ్మ ఆలయం వద్ద బావిలో దూకింది. కొద్దిగా ఆలస్యంగా గమనించిన గ్రామస్తులు బాలికను కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అప్పటికే కల్పన మృతి చెందింది. బావి వద్ద ఆమె రాసిన లేఖ దొరికింది. ఆ లేఖలో కల్పన పేర్కొన్న మేరకు.. ఇదే కాలనీకి చెందిన మమత ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. ఆ నాటి నుంచి కల్పనకు నిత్యం ఆమె కలలో కనిపిస్తుండేదనీ.. తనవద్దకు రాకపోతే కల్పనతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తానని చెబుతున్నట్టు పేర్కొంది. మానసిక వేదన ఎక్కువ కావడంతో కల్పన ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఎస్ఐ అంజనప్ప కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మా కన్నా స్నేహితురాలే ఎక్కువైందా తల్లీ.. కల్పన ఆత్మహత్య చేసుకున్న బావి వద్దకు చేరుకుని తల్లిదండ్రులు బోరున విలపించారు. ‘15 ఏళ్లుగా కష్టపడి పెంచామే.. మా కన్నా స్నేహితురాలే ఎక్కువైందా..మేము ఏం పాపం చేశామని మాకు ఈ శిక్ష వేశావు’ అంటూ తల్లి రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. మూఢ నమ్మకాలతోనే బాలిక బలి ఆత్మలు, ప్రేతాత్మలు అమావాస్య నా డు రావడం, పిలవడం అంతా భ్రమ. తీవ్రమైన మానసిక రుగ్మత కారణంగానే కల్పన ఆత్మహత్య చేసుకుంది. మానసికంగా ఇబ్బందిపడుతున్న పిల్లలకు తాయత్తులు కట్టించడం, మంత్రా లు వేయించడం తల్లిదండ్రులు చేయరాదు. మానసిక వైద్యులను సంప్రదిం చాలి. పిల్లల సంరక్షణపై జాగ్రత్తలు తీసుకోవాలి. - ఎన్బీ సుధాకర్‌రెడ్డి, మానసిక శాస్త్ర నిపుణుడు -
కాబోయే భర్తను మోసం చేయలేక....
ఆదిలాబాద్ : నోటి నుంచి రక్తం వస్తుండటంతో తనకు క్యాన్సర్ ఉందనుకుందో యువతి. త్వరలో పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని మోసం చేయడం ఇష్టంలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి పెట్టింది. ఈ సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో జరిగింది. టూటౌన్ ఎస్ఐ రాము కథనం ప్రకారం... పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన పరమేశ్, లక్ష్మీ దంపతులు కూలీలు. వీరికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురికి వివాహం చేయగా,రెండో కుమార్తె అపర్ణ (18) ఇంటర్మీడియేట్ పూర్తి చేసింది. మండలంలోని అనుకుంటకు చెందిన యువకుడితో అపర్ణ వివాహ నిశ్చయం ఈ నెల 17న జరిగింది. మరో వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుందామనుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అపర్ణ తల్లిదండ్రులు పెళ్లి పనులకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటానికి మార్కెట్‌కు వెళ్లారు. మూడు రోజులుగా నోటినుంచి రక్తం పడుతుండటంతో అపర్ణ ఆందోళనకు గురైంది. మంగళవారం కూడా రక్తం రావటంతో కంగారుపడింది. అదే సమయంలో ఇంటి పక్కనున్నవారు గమనించి 'ఏం కాదులే...' అంటూ ధైర్యం చెప్పారు. పదే పదే నోటి నుంచి రక్తం రావటంతో తనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని మనస్తాపం చెందిన అపర్ణ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. -
ప్రియుడు పెళ్లి చేసుకోడేమోనని..
అశ్వాపురం, న్యూస్‌లైన్: ప్రేమించిన వ్యక్తి ెపెళ్లి చేసుకోడేమోనని మనస్తాపంతో ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండలంలోని చింతిర్యాలగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతిర్యాలగూడేనికి చెందిన సవలం రాధిక(19) అదే గ్రామానికి చెందిన కాటి వెంకటనారాయణ ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా వెంకటనారాయణ వాయిదా వేస్తున్నాడు. ఈ విషయం ఇరుకుటుంబాలకు తెలిసింది. ఈ క్రమంలో తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రులు పలుమార్లు వెంకటనారాయణ తల్లిదండ్రులను కోరారు. పెళ్లి చేస్తామని, కొంత గడువు కావాలని వారు జాప్యం చేస్తూ వచ్చారు. అతను తమ కుమార్తెను పెళ్లి చేసుకోడేమోనని ఆందోళనతో రాధిక తల్లిదండ్రులు ఇటీవల గ్రామ పెద్దలకు విషయం తెలిపారు. శుక్రవారం రాత్రి గ్రామపెద్దలు సమావేశమై వెంకటనారాయణ తల్లిదండ్రులను పంచాయితీకి రావాలని కోరారు. కానీ రాత్రి సమయంలో తాము రాలేమని, శనివారం ఉదయం వస్తామని తెలిపారు. దీంతో గ్రామ పెద్దలు కూడా శనివారం మాట్లాడుదామని చెప్పి రాధిక తల్లిదండ్రులను పంపించారు. ఈ క్రమంలో తనను వెంకటనారాయణ పెళ్లి చేసుకోడేమోనని మనస్తాపానికి గురైన రాధిక శనివారం తెల్లవారుజామున అందరు నిద్రిస్తున్న సమయంలో పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను గమనించి అశ్వాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా వృతి చెందింది. అశ్వాపురం ఎస్సై కిరణ్ శనివారం వృతురాలి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రాధిక తండ్రి ముత్తయ్య ఫిర్యాదు మేరకు వెంకటనారాయణపై కేసు నమోదు చేసి వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం తరలించారు. -
మనస్తాపంతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
కాన్పూర్: ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపాన కొత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో గొడవపడిన అనంతరం మనస్తాపానికి గురై ఆ బాలిక తన ఇంటిలో ఉరివేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఓ డిగ్నీ కళాశాలలో బిఎ చదువుతున్న ఆ బాలిక సుధీర్ శుక్లా కుమారై పరూల్ (18) గా పోలీసులు గుర్తించారు. పరూల్ తల్లి రాధ తమ ఇంటికి వచ్చిన బంధువులను కలవడానికి వెళ్లిన సమయంలో ఆమె ఒక్కదే ఇంట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ చిన్ని గుడ్డతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు ఓ పోలీస్ అధికారి చెప్పారు. బాలిక మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. ప్రాథమిక నివేధిక ప్రకారం... ఆ బాలిక తమ కుటుంబ గొడవలతోనే మనస్తాపానికి గురైనట్టు వెల్లడైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
ఫేస్బుక్లో బూతు సందేశాలు పంపాడని.. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
16 ఏళ్ల యువకుడు ఫేస్బుక్ అకౌంట్‌కు అసభ్యకర సందేశాలు పంపి మానసిక క్షోభకు గురిచేయడం, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ముంబైలో జరిగింది. ముంబై పత్రిక మిడ్ డే కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముంబయి శివారు ప్రాంతం కాండివ్లి చెందిన ఈ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గత కొంత కాలంగా ఓ టీనేజర్ ఆమె ఫేస్బుక్ అకౌంట్‌కు బూతు సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. తన తండ్రితో కలసి వెళ్లి ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసు గురించి పట్టించుకోలేదు. మంగళవారం సాయంత్రం ఆ బాలిక తన గదిలో చదువుకుంటోంది. కాసేపటి తర్వాత ఆమె తల్లి వెళ్లి చూడగా గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆకతాయి కుర్రాడు ఫేస్బుక్ అకౌంట్‌కు మళ్లీ అసభ్యకర సందేశాలు పంపాడని, అందుకే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి ఆరోపించారు. నిందితుడిని గుర్తించామని, త్వరలోనే విచారిస్తామని పోలీసలు తెలిపారు. అలాగే మృతురాలి ఫేస్బుక్ అకౌంట్ కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ
బెంగళూరు: ఫేస్బుక్ ప్రేమ బెంగళూరులో ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో ప్రేమాయణం సాగించిన 14 ఏళ్ల బాలిక చివరకు మోసపోయి ప్రాణాలు తీసుకుంది. ప్రియుడు మొహం చాటేయడంతో కలత చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. యలహంక శేషాద్రిపురం కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ఎం మనోజ్ కుమార్ ఫేస్బుక్లో పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను తొమ్మిదో తరగతి విద్యార్థిని శిఖా(పేరు మార్చాం) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆమోదించింది. తర్వాత వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. ఈ విషయం తెలిసి శిఖా తల్లిదండ్రులు ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీయించేశారు. బయట ఇంటర్నెట్ కేఫ్‌ల్లో చాటుగా అతడితో చాటింగ్ చేసేది. అతడు తనను పెళ్లి చేసుకుంటాడని ఆమె ఆశపడింది. ఒకరోజు నందిని లేవుట్లోని తన రూముకు ఆహ్వానించి శిఖాను వశపరుచుకున్నాడు. తర్వాత నుంచి అతడు శిఖాతో మాట్లాడడం మానేశాడు. 'ఇదంతా సరదా కోసం చేశాను, సీరియస్‌గా తీసుకోవద్దు' అంటూ హేళన చేశాడు. మోసపోయానని తెలుసుకున్న శిఖా మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శిఖాను మోసం చేసిన మనోజ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.