ప్రేమ కథ: యువతి ఆత్మహత్య, యువకుడు హత్య | Girl Deceased And Her Lover Assassinated In Karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమ కథ: యువతి ఆత్మహత్య, యువకుడు హత్య

Published Mon, Jul 27 2020 9:46 AM | Last Updated on Mon, Jul 27 2020 9:46 AM

Girl Deceased And Her Lover Assassinated In Karnataka - Sakshi

హత్యకు గురైన హరీష్, ఆత్మహత్య చేసుకున్న యువతి (ఫైల్‌),

సాక్షి, బాగేపల్లి: ఒక ప్రేమకథ విషాదాంతం కావడంతో పాటు గ్రామంలో కక్షలకు ఆజ్యం పోసింది. బాగేపల్లి తాలుకాలోని యగవమద్దలఖాన గ్రామంలో యువకుడు హత్య, అనంతరం విధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. యువకుడు హరీష్‌ను హత్య చేసిన కేసులో వెంకటేశ్, అతని సోదరున్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు హరీష్‌, వెంకటేశ్‌‌ కుమార్తె ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో 10 రోజుల క్రితం ఇద్దరు ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని పథకం వేశారు.

ఇరు కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రేమ జంటను పట్టుకుని కుటుంబాలకు అప్పజెప్పారు. ఇరువర్గాలూ పంచాయతీ చేసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత రెండు రోజులకే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణంతో ఆగ్రహోదగ్రుడైన వెంకటేశ్‌.. శుక్రవారం రాత్రి కాపుకాచి హరీష్‌ రాగానే కత్తితో దాడిచేశాడు. 17 సార్లు పొడవడంతో హరీష్‌ మరణించాడు. తరువాత నిందితులు పరారు కాగా, హతుని బంధువులు వారి ఇళ్లపై దాడి చేసి వస్తుసామగ్రిని ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం కేసులో సుమారు 10 మందిని అరెస్టు చేసి మరో 15 మంది కోసం గాలిస్తున్నారు. గ్రామంలో మహిళలు తప్ప పురుషులు కనిపించకుండా పోయారు.

రెండో పెళ్లి చేసుకొని డబ్బు దండుకున్నాడు
హుబ్లీ: భార్య ఉన్నా లేదని చెప్పి తనను వివాహం చేసుకొని లక్షల రూపాయలు నగదు దండుకొని మొదటి భార్య  పిల్లలతో తనపై దాడి చేయించాడని నగరానికి చెందిన  ఓ మహిళ వాపోయింది. ఆదివారం ఆమె హుబ్లీలో మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకుంది. కలఘటిగి తాలూకా హీరేహొన్నళ్లికి చెందిన వ్యక్తి 2012లో తనను వివాహం చేసుకొని కాపురం చేశాడని, ఈక్రమంలో తన ఇంటి స్థలాన్ని అమ్మించి రూ.25 లక్షలు తీసుకొన్నాడని ఆరోపించింది. ఆ డబ్బు ఇవ్వాలని కోరినందుకు మొదటి భార్య పిల్లలతో కలిసి తనపై దాడి చేయించారని, దీనిపై కలఘటిగి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాననన్నారు. అయితే ఆ వ్యక్తికి రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయింది. అధికారులు న్యాయం చేయాలని వేడుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement