lover murder
-
పథకం ప్రకారమే లయస్మిత హత్య ?
సాక్షి, యశవంతపుర: బెంగళూరు ఉత్తర తాలూకా రాజనకుంట ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థిని లయస్మితను పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో పాటు సొంత అత్త కూతురు కావడంతో పవన్ ఆమె పేరును తన హృదయంపై ట్యాటూ వేసుకున్నాడు. ఎఫ్బీ, ఇన్‌స్టాలో స్మిత ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడు. హత్యకు గంట ముందు సోషల్ మీడియాలో అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోలను డిలిట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె హత్యకు గురైందని మృతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పవన్ కోలుకోగానే విచారణ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. గ్రామస్తులతో విద్యార్థుల గొడవలు రాజనకుంట సమీపంలోని దిబ్బూరు వద్దనున్న ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులతో స్థానిక గ్రామస్థులు ఇబ్బందు పడుతున్నారు. రోజూ విద్యార్థులు మద్యం తాగి గ్రామస్తులతో గొడవలు పడుతున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని దిబ్బూరు చుట్టు పక్కల గ్రామస్తులు బెంగళూరు గ్రామీణ ఎస్పీ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. గురువారం ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానిక పోలీసుల పనితీరు సరిగా లేదంటూ వినతిపత్రంలో ఆరోపించారు. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
అంతం చేసింది అత్త కొడుకే..
యశవంతపుర: ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన ఇంజినీరింగ్ విద్యారి్థని హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దిబ్బూరు గ్రామంలోని ప్రెసిడెన్సీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న కోలారుకు చెందిన లయస్మితను మరో కళాశాలలో చదువున్న పవన్ అనే యువకుడు హత్య చేశాడు. నిందితుడిని లయస్మిత మేనత్త కొడుకుగా పోలీసులు గుర్తించారు. ప్రేమను నిరాకరించిందనే ఆక్రోశంతోనే ఘోరానికి తెగబడ్డాడని తేలింది. మరో విద్యార్థి ఐడీ కార్డుతో కళాశాలలోకి ప్రవేశం ఇతరులు కాలేజీలోనికి వెళ్లటానికి అవకాశంలేదు. హత్య చేసిన పవన్ ఎలా లోపలకు వెళ్లాడనే విషయంపై అరా తీయగా మరో విద్యార్థి ఐడీ కార్డును ఉపయోగించుకుని కాలేజీలోకి వెళ్లాడు. ప్రెసిడెన్సీ కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు సహకరించటం వల్ల లోపలకు వెళ్లి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు కాలేజీ గేట్‌వద్దకు వెళ్లాడు. అక్కడ మరో విద్యార్థిని పరిచయం చేసుకున్నారు. అతడి కాలేజీ ఐడీతో లోపలకు వెళ్లి లయస్మిత తరగతి గది వద్దకు వెళ్లాడు. ఆమె గది నుంచి బయటకు వస్తుండగానే కత్తితో గుండెపై పొడిచాడు. అయితే నిందితుడి వద్ద ఉన్న ఐడీ కార్డు ఎవరిదనే విషయంపై పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే లయస్మిత తండ్రి నాగరాజు మూడు నెలల క్రితమే మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కూతుర్లు. లయను ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. -
మరొకరిని పెళ్లి చేసుకుందని దారుణం.. ప్రియురాలిని 6 భాగాలుగా కోసి..
లక్నో: శ్రద్దా వాకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చి 10 రోజులు గడుస్తున్నా.. నిందితుడి అఫ్తాబ్ విచారణలో ఇంకా అనేక విషయాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ హత్య ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఉదంతం అనంతరం ఇలాంటి కోవకే చెందిన మరిన్ని కేసులు నమోదవుతుండటం కలవరానికి గురిచేస్తున్నాయి. కారణాలేవైనా ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణంగా హత్యకు గురైన వార్తలు ఇటీవల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్నాయి. జీవితాంతం కలిసి ఉంటామని నమ్మించిన వాడి చేతులోనే అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా యూపీలో మరో ఘోరం జరిగింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ప్రియురాలిని ప్రియుడు గొండు నులిమి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ఆరు భాగాలుగా కోసి బావిలో పడేశాడు. వివరాలు.. ప్రిన్స్ యాదవ్ అనే యువకుడు 20 ఏళ్ల వయసున్న ఆరాధనను ప్రేమించాడు. అయితే యువతి ఇతన్ని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి అనంతరం కూడా యాదవ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన యాదవ్.. తన తల్లిదండ్రులు, బంధువు సర్వేశ్, ఇతర బంధువులతో కలిసి ఆమెను అంతమొందించేందుకు ప్లాన్‌వేవాడు. మాట్లాడాలని చెప్పి నవంబర్ 9న ఆరాధనను బైక్‌పై గుడికి తీసుకెళ్లి సర్వేష్ సహాయంతో చెరకు తోటలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆమె మృతదేహాన్ని ఆరు భాగాలుగా నరికి పాలిథిన్ సంచిలో వేసి కొంత దూరంలో బావిలో పడేశారు. నవంబర్ 15న పశ్చిమి గ్రామం శివారులో ఉన్న బావిలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన యువతిని ఆరాధనగా గుర్తించారు. ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు ప్రిన్స్ యాదవ్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. చదవండి: షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి.. హత్య చేసిన మృతదేహాన్ని గుర్తించేంఉదకు నిందితుడిని పోలీసులు సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. అ క్రమంలో యాదవ్ తప్పించుకునే ప్రయత్నంలో ఇంతకుముందే సదరు ప్రదేశంలో దాచిపెట్టిన పిస్టోల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడి కాలుకు బుల్లెట్ గాయమైంది. ఈ కేసులో ఇప్పటివరకు పదునైన ఆయుధం, కంట్రీ మేడ్ పిస్టల్, క్యాట్రిడ్జ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రేయసి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలింది. శ్రద్ధాను చంపిన 15, 20 రోజుల్లోనే అప్తాబ్ డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి యువతుకలు గాలం వేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. గతంలో అదే డేటింగ్ యాప్‌లో శ్రద్ధాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇలా మరో యువతితో పరిచయం పెంచుకొని.. ప్రియురాలి శవం ఫ్రిజ్‌లో ఉండగానే జూన్, జూలై నెలలో ఆమెను ఇంటికి పిలిపించినట్లు తెలిసింది. అయితే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. శ్రద్ధా శరీర భాగాలను అల్మారాకు తరలించేవాడని తెలిపారు. అంతేగాక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన పలువురు మహిళలను అతడు ఇంటికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చెఫ్‌గా శిక్షణ పొందిన అఫ్తాబ్, శ్రద్ధా శరీరాన్ని ముక్కలుగా చేసే ముందు రక్తపు మరకలు ఎలా శుభ్రం చేయాలో గూగుల్ చూసి నేర్చుకున్నట్లు, శరీరాన్ని ముక్కలు చేయడం కోసం హ్యుమన్ అనాటమీని చదివినట్లు పేర్కొన్నారు. క్రైం థ్రిల్లర్స్, వెబ్ సిరీస్‌లు చూసే అలవాటున్న అఫ్తాబ్.. అమెరికన్ వెబ్ సిరీస్ ‘డెక్సటర్’ ద్వారా ప్రేరణ పొంది శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు అగర్బత్తీలు వెలిగించడం, ఫ్రిజ్‌లో దాచిన ఆమె ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసుకునేవాడు. త్వరగా చెడిపోతున్న శరీర భాగాలను ముందుగా పారేసేవాడు. అతడి స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు.. తరచుగా ఇంటికి వస్తున్నా…ఇంట్లో కొన్నాళ్ల నుంచి మృతదేహం విడిభాగాలు ఉన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త వహించాడు. చదవండి: శ్రద్ధా హత్య కేసు: కటకటాల్లో అఫ్తాబ్ సుఖనిద్ర! శ్రద్ధా హత్య తెలియకుండా ఉండేందుకు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను అఫ్తాబ్ ఉపయోగించేవాడు. దాని నుంచి తన స్నేహితులకు మెసెజ్ చూస్తూ ఉండేవాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా చెల్లించేవాడు. అయితే రెండు నెలలుగా శ్రద్ధా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ఆరు నెలలకు ఈ ఉదంతం బయటకు రావడం గమనార్హం. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రద్ధాను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నారు. కాగా 24 ఏళ్ల శ్రద్ధాకు అఫ్తాబ్‌తో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. దాదాపు మూడేళ్లు కలిసి జీవించారు. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇద్దరు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ ఢిల్లీకి మకాం మార్చారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి తీసుకురావడంతో వీరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మే 18న మరోసారి ఇద్దిరి మధ్య గొడవ జరగడంతో శ్రద్ధను అత్యంత అమానుషంగా గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీర భాగాలను 35 ముక్కలుగా కట్ చేసి పాడవకుండా ఉండేందుకు భారీ ఫ్రిజ్‌లో అమర్చాడు. తరువాత వాటిని ఒక్కొక్కొటిగా ఢిల్లీ నగరమంతా పారేశాడు. -
ప్రేమ కథ: యువతి ఆత్మహత్య, యువకుడు హత్య
సాక్షి, బాగేపల్లి: ఒక ప్రేమకథ విషాదాంతం కావడంతో పాటు గ్రామంలో కక్షలకు ఆజ్యం పోసింది. బాగేపల్లి తాలుకాలోని యగవమద్దలఖాన గ్రామంలో యువకుడు హత్య, అనంతరం విధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. యువకుడు హరీష్‌ను హత్య చేసిన కేసులో వెంకటేశ్, అతని సోదరున్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు హరీష్, వెంకటేశ్ కుమార్తె ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో 10 రోజుల క్రితం ఇద్దరు ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని పథకం వేశారు. ఇరు కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రేమ జంటను పట్టుకుని కుటుంబాలకు అప్పజెప్పారు. ఇరువర్గాలూ పంచాయతీ చేసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత రెండు రోజులకే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణంతో ఆగ్రహోదగ్రుడైన వెంకటేశ్.. శుక్రవారం రాత్రి కాపుకాచి హరీష్ రాగానే కత్తితో దాడిచేశాడు. 17 సార్లు పొడవడంతో హరీష్ మరణించాడు. తరువాత నిందితులు పరారు కాగా, హతుని బంధువులు వారి ఇళ్లపై దాడి చేసి వస్తుసామగ్రిని ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం కేసులో సుమారు 10 మందిని అరెస్టు చేసి మరో 15 మంది కోసం గాలిస్తున్నారు. గ్రామంలో మహిళలు తప్ప పురుషులు కనిపించకుండా పోయారు. రెండో పెళ్లి చేసుకొని డబ్బు దండుకున్నాడు హుబ్లీ: భార్య ఉన్నా లేదని చెప్పి తనను వివాహం చేసుకొని లక్షల రూపాయలు నగదు దండుకొని మొదటి భార్య పిల్లలతో తనపై దాడి చేయించాడని నగరానికి చెందిన ఓ మహిళ వాపోయింది. ఆదివారం ఆమె హుబ్లీలో మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకుంది. కలఘటిగి తాలూకా హీరేహొన్నళ్లికి చెందిన వ్యక్తి 2012లో తనను వివాహం చేసుకొని కాపురం చేశాడని, ఈక్రమంలో తన ఇంటి స్థలాన్ని అమ్మించి రూ.25 లక్షలు తీసుకొన్నాడని ఆరోపించింది. ఆ డబ్బు ఇవ్వాలని కోరినందుకు మొదటి భార్య పిల్లలతో కలిసి తనపై దాడి చేయించారని, దీనిపై కలఘటిగి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాననన్నారు. అయితే ఆ వ్యక్తికి రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయింది. అధికారులు న్యాయం చేయాలని వేడుకుంది. -
రాముడు కాదు.. రాక్షసుడు
షాద్‌నగర్‌రూరల్: ఒక్కరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా ఐదు మందిని హతమార్చాడు.. బంధాల ను, బంధుత్వాలను పక్కన పెట్టి కిరాతకంగా వ్యవహరించాడు.. చిన్న చిన్న సంఘటన మనస్సులో పెట్టుకుని రాములు మానవ మృగంలా మారాడు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యలను, ప్రియురాలిని కర్కషంగా హతమార్చాడు. తాజాగా ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. కిరాతకుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సా యంత్రం షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ వెల్లడించారు. కోరిక తీర్చలేదని ప్రియురాలి హత్య.... ఫరూఖ్‌నగర్ మండలం మహల్ ఎలికట్ట గ్రామా నికి చెందిన రాములు కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన జంగం మంగమ్మతో పరిచయం ఏర్పడింది. దీంతో తన కోరిక తీర్చాలని రాములు మం గమ్మను వేధించాడు. అందుకు ఆమె నిరాకరిం చింది. అయితే తన కోరిక తీర్చలేదని ఎలాగైనా ఆ మెను అంతమొందించాలని రాములు కుట్రపన్నా డు. ఈ నేపథ్యంలో ఈనెల 26న సాయంత్రం జం గం మంగమ్మ కూలీ పనులు చేసి ఒంటరిగా ఇం టికి వెలుతున్న సమయంలో మహల్ ఎలికట్ట గ్రా మ శివారులో రాములు ఆమె ఒంటిపై కిరోసిన్ పో సి నిప్పటించాడు. ఈ విషయాన్ని గమనించిన సా ్థనికులు 108 సహాయంతో మంగమ్మను చికిత్స ని మిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స ని మిత్తం ఆమెను ఉస్మాని యా ఆసుపత్రికి తరలించ గా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రాములును శుక్రవారం అరెస్టు చేసి రిమాం డ్కు తరలించినట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. ఇప్పటికే నలుగురి హత్య... రాములుకు 24ఏళ్ళ కిందట మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన పార్వతమ్మతో మొదటి వివాహమయింది. కొంత కాలం రాములు పార్వతమ్మల కాపురం సజావుగా సాగింది. ఆతర్వాత వారిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో రాములు మొదటి భార్య పార్వతమ్మ ఒంటి పై కిరోసిన్ పోసి హత్య చేశాడు. తర్వాత కొందుర్గుకు చెందిన స్వప్నతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెపై అనుమానం పెంచుకుని తండ్రి జంగం అలియాస్ పులాయిల అడివయ్యతో పాటుగా భార్య స్వప్నలను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ కేసులో రాములు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కిషన్‌నగర్ గ్రామానికి చెందిన మంజులను మూడో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. రాములు నేర చరిత్ర తెలుసుకున్న మంజుల బంధువులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఎలికట్ట గ్రామంలో ఉన్న 20గుంటల పొలాన్ని మంజుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఆమెను వివాహమాడాడు. ఈ నేపథ్యంలో మూడో భార్య మంజులను మభ్యపెట్టి ఆమె పేరు న ఉన్న భూమిని విక్రయించాడు. ఈ విషయంలో మూడో భార్య మంజుల కుటుంబ సభ్యులకు, రాములుకు మధ్య గొడవలు జరిగాయి. దీంతో కొంత కాలం పాటు మంజుల తన పుట్టింటికి వెళ్లింది. దీంతో భూ విక్రయ డబ్బులు ఇస్తానని మంజు ల కుటుంబ సభ్యులను ఒప్పించి భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యం 2016లో డిసెంబర్లో మూడో భార్య మంజుల తండ్రి పోచయ్య మహల్ ఎలికట్ట గ్రామానికి వచ్చాడు. అప్పటికే మామ పోచయ్య పై పగపెంచుకున్న రాములు అతడిని మద్యం సేవించేందుకు మహల్ ఎలికట్ట గ్రామ శివారులోకి తీసుకెళ్లి బండరాళ్లతో దారుణంగా హతమార్చాడు. కన్న తండ్రిని, కట్టుకున్న వాడే అతికిరాతకంగా హతమార్చాడని తెలియడంతో మూడో భార్య మంజుల రాములును వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటిరిగా ఉన్న రాములు తాజాగా అదే గ్రామానికి చెందిన మంగమ్మ లోబర్చుకునేందుకు ఆమె వెంట పడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకున్న రాములు మంగమ్మను హతమర్చాడు. ఇప్పటికే ఐదు హత్యలు చేసిన రాములు నరహంతకుడిగా మారాడు. జైలుకు వెళ్లినా మారని తీరు... నాలుగు హత్యలు చేసిన రాములు అన్ని కేసుల్లో జైలు శిక్షలు అనుభవించాడు. అయినా రాములు వ్యవహార శైలి మార్చకోలేదు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యను హతమార్చిన కేసులను కోర్టులో కొట్టేసినట్లు, 2016లో మామను హత్య చేసిన కేసు మహబూబ్‌నగర్ కోర్టులో నడుస్తున్నట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. ఐదు హత్యలకు పాల్పడిన రాములుపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడి హత్య..
శంషాబాద్: షాద్‌నగర్‌లో సంచలనం రేపిన యువకుడి హత్య కేసులో ప్రియురాలే నిందితురాలని పోలీసులు తేల్చారు. ఆమెతో పాటు మరో యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు వివరాలను బుధవారం శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తన కార్యాలయంలో వెల్లడించారు. ఫరూఖ్‌నగర్‌లో నివాసముండే ఎండీ పర్వీన్‌బేగం, అదే ప్రాంతంలో నివాసముంటున్న ఈరమోని శేఖర్(24) మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే, ఎనిమిది నెలలుగా పర్వీన్బేగంకు జానంపేటలో నివాసముంటున్న ఆసిఫ్ఖురేషితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో శేఖర్‌తో పర్వీన్ మాట్లాడుతున్న సమయంలో ఆసిఫ్ గమనించి ప్రశ్నించగా.. గతంలో అతడిని ప్రేమించానని, తన వద్ద కొంత డబ్బు కూడా అప్పుగా తీసుకుని శేఖర్ ఇవ్వడం లేదని తెలిపింది. దీంతో ఆసిఫ్‌కు శేఖర్‌పై కోపం పెరిగింది. ఈ క్రమంలో శేఖర్‌ను హత్య చేయాలని ఆసిఫ్, పర్వీన్‌లు పథకం వేశారు. ఈ నెల 20న పర్వీన్ శేఖర్‌ను తన ఇంటికి పిలిచింది. అక్కడి వచ్చిన తర్వాత బీరులో మాత్రం కలిపి ఇచ్చింది. మొత్తం మూడు బీర్లు తాగిన తర్వాత శేఖర్‌ను అక్కడే కాపు కాసి ఉన్న ఆసిఫ్ కత్తితో కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతడి శవాన్ని మూటగట్టి బయటపారేసి పరారయ్యారు. ఈ హత్య వెలుగులోకి రావడంతో డీసీపీ ప్రకాష్‌రెడ్డి సూచనల మేరకు బృందాలుగా ఏర్పడిన షాద్‌నగర్ పోలీసులు నగరం నుంచి తిరిగి వస్తున్న ఇద్దరు నిందితులను షాద్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, కత్తులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
ప్రియురాలిని హతమార్చి.. ఆపై
కేకే నగర్: వివాహానికి ఒప్పుకోకపోవడంతో ప్రియురాలిని హత్య చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం కరూర్‌లో జరిగింది. తిరువారూర్ జిల్లా పళయపాళెం ప్రాంతానికి చెందిన వినోద్ (27) ఇంజినీరింగ్ చదివి అగ్నిమాపక పరికరాలను సప్లై చేసే వ్యాపారం చేస్తున్నాడు. అతను కళాశాల్లో 3వ సంవత్సరం చదివే సమయంలో మొదటి సంవత్సరం చదువుతున్న షణ్ముగప్రియతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. సోమవారం సాయంత్రం కరూర్‌లోని షణ్ముగప్రియ ఇంటికి వినోద్ వెళ్లాడు. అక్కడ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొద్దిసేపటి తరువాత షణ్ముగప్రియ తల్లి గౌరీశంకరి మార్కెట్ నుంచి ఇంటికి వచ్చి చూడగా షణ్ముగప్రియ చనిపోయి కనిపించింది. ఆమె సమీపంలో వినోద్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన గౌరీశంకరి భయంతో పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది. స్థానికులు వెంటనే కరూర్ టౌన్ పోలీసులకు సమాచారం పంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుగా.. షణ్ముగప్రియ గొంతును టవల్‌తో బిగించి హత్య చేసిన గుర్తులు కనిపించాయి. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. విచారణలో షణ్ముగప్రియకు చెన్నైలోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం వచ్చిందని, మరో వారంలో ఉద్యోగంలో చేరేందుకు ఉత్తర్వులందాయని తెలిసింది. అయితే ఆమె ఉద్యోగం చేయడం ఇష్టంలేని వినోద్ ఆమెకు వద్దని చెప్పాడని, అయితే కొన్నాళ్లు ఓపిక పట్టమని షణ్ముగప్రియ ఎంత చెప్పినా వినోద్ వినలేదని.. కోపంలో షణ్ముగప్రియ గొంతు నులిమి హత్య చేసి ఆ తర్వాత వినోద్ తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
ఫేస్బుక్ వాడుతున్నాడని ప్రియుడ్ని చంపింది
లండన్: ఫేస్బుక్ వాడకం ప్రాణాల మీదికి తెస్తుందంటే ఏంటో అనుకుంటుంటాం. కానీ ఓ హెయిర్ డ్రెస్సర్ చేసిన పని తెలిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. తన బోయ్‌ఫ్రెండ్ ఫేస్బుక్ వీపరీతంగా వాడతున్నాడని, దానివల్ల అతడి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని భావించి ఆవేశానికి లోనైన ప్రియురాలు.. అతడ్ని హత్య చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు నిందితురాలికి 12 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ, ఆ గడువు ముగిసిన తర్వాత పెరోల్‌పై బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. గతేడాది ఆగస్టులో జరిగిన హత్య ఘటనలో పూర్తి వివరాలిలా ఉన్నాయి. టెర్రీ మారీ పామర్ అనే యువతి హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తుండేది. నిరుద్యోగి అయిన ఆమె బోయ్ ఫ్రెండ్ డామన్ సియర్సన్ ఇటీవలే ఓ మొబైల్ ఫోన్ కొన్నాడు. అందులో ఫేస్బుక్ చాటింగ్ చేయడం మొదలెట్టాడు. తన అర్ధనగ్న ఫొటోలు కూడా విపరీతంగా పోస్ట్ చేసేవాడు. అలా.. అతడి వాడకం శృతిమించింది. దాంతో బాగా విసిగిప ఓయిన పామర్.. అతడ్ని చంపేయాలని నిర్ణయించుకుంది. గతేడాది ఆగస్టు13వ తేదీన బోయ్ ఫ్రెండ్ సియర్సన్‌ను గుండెల్లో కత్తితో పలు పోట్లు పొడిచి హత్యచేసింది. ఆ వెంటనే షాక్ నుంచి తేరుకుని స్వయంగా తానే అత్యవసర సేవల నంబర్ 999కు కాల్ చేసింది. తన లవర్ పొరపాటున కత్తితో పొడుచుకుని గాయపడ్డాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల విచారణ తర్వాత పోలీసుల దర్యాప్తులో నిజాలు ఒక్కక్కటిగా బయటపడ్డాయి. బోయ్ ఫ్రెండ్ లేకపోవడంతో తనకు చాలా బోరింగ్‌గా ఉందని ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పంపిన ఆమె... సియర్సన్ వ్యవహారం నచ్చకనే అతడ్ని చంపేశానంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. కొత్త ఫోన్ కొన్న తర్వాక ఫేస్బుక్ అతిగా వాడటం, కొత్త స్నేహాలు పెంచుకోవడమే సియర్సన్ మృతికి కారణమయ్యాయని పోలీసులు వివరించారు. తనను వదిలించుకోవాలని ప్రయత్నించాడని, వేరొక యువతిలో సన్నిహితంగా ఉంటున్నాడని భావించి ప్రియుడ్ని హత్యచేసినట్లుగా పామర్ కోర్టులో చెప్పింది. -
ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, చెన్నై:ప్రియురాలు తనకు దక్కడం లేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన పైశాచికత్వాన్ని ప్రియురాలి కుటుంబంపై ప్రదర్శించాడు. ఆమె తల్లిదండ్రులను, అవ్వను కిరాతకంగా కడతేర్చాడు. ప్రియురాలిని సైతం వదిలిపెట్ట లేదు. తీవ్రంగా గాయపడిన యువతి కూడలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం అర్ధరాత్రి నీలగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. నీలగిరి జిల్లా కూడలూరు సమీపంలోని ఓవెలి భారతీ నగర్‌కు చెందిన జాన్, గిరిజ దంపతుల కుమార్తె సోనా(24). మూడేళ్ల క్రితం సోనా కేరళ రాష్ర్టం మల్లప్పురంలోని ఓ కేటరింగ్ కళాశాలలో చదువుకుంది. అదే కళాశాలలో రాష్ట్రంలోని వైనాడైకు చెందిన జోనియల్ కుమారుడు లెనిన్(27) కూడా చదువుకున్నాడు. ఇద్దరు చదువుకునే సమయంలో ప్రేమలో పడ్డారు. కలసి మెలిసి తిరిగారు. చదువులు పూర్తయ్యాక కొచ్చిలోని ఓ హోటల్లో ఇద్దరు కలసి పనిచేశారు. ఈ సమయంలో ఏమి జరిగిందో ఏమోగానీ, కొన్నాళ్లకు లెనిన్తో సోనాకు విబేధాలు తలెత్తాయి. దీంతో తన స్వగ్రామం ఓవెలికి ఆమె తిరిగి వచ్చేంసింది. లెనిన్తో సంబంధాలు తెగ తెంపులు చేసుకునే ప్రయత్నం చేసింది. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఉద్యోగం లభించడంతో సోనా మూడు నెలల క్రితం నీలగిరి నుంచి వెళ్లి పోయింది. వివాహ ఏర్పాట్లు:తనకు సోనా దూరం అవుతుండడంతో తీవ్ర మానసిక వేదనకు లెనిన్ లోనయ్యాడు. ఆమె కోసం పలు మార్లు ఓవెలికి వచ్చి వెళ్లినట్టు సమాచారం. పదిహేను రోజుల క్రితం దుబాయ్ నుంచి ఓవెలికి సోనా వచ్చింది. తమ కుమార్తెకు జోషప్ అనే వ్యక్తితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయించారు. రెండు రోజుల క్రితం నిశ్చితార్థం సైతం జరిగినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న లెనిన్ కోపోద్రిక్తుడయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఓవెలికి తన మిత్రులతో కలసి చేరుకున్నాడు. అక్కడి ఓ హోటల్లో బస చేశాడు. కిరాతకం: రాత్రి తన మిత్రులతో కలసి సోనా ఇంటికి వద్దకు వెళ్లాడు. మిత్రులను కూత వేటు దూరంలో వదలి పెట్టి వెనుక దారి గుండా లోనికి వెళ్లిన లెనిన్ అక్కడున్న సోనా తల్లి గిరిజ , అవ్వ అమ్ములుతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తాను సోనాను ప్రేమిస్తున్నానని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. తమ కుమార్తెకు నిశ్చితార్థం సైతం జరిగి పోయిందని వారు నచ్చచెప్పినా లెనిన్ పట్టించుకోలేదు. సోనాను తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన సోనా తండ్రి జాన్ లెనిన్‌ను వారించాడు. మరింత కోపోద్రిక్తుడైన లెనిన్ ఆ ఇంటి బయట ఉన్న గడ్డ పారను చే త బట్టి వీరంగం సృష్టించారు. గిరిజ, అమ్ము, జాన్ తలలను పగల కొట్టాడు. అడ్డొచ్చిన సోనా మీద దాడి చేశాడు. దీంతో సంఘటనా స్థలంలో నే గిరిజ, అమ్ములు మృతి చెందారు. రక్తగాయాలతో సోనా, జాన్‌లు పెడుతున్న కేకలు విన్న ఇరుగు పొరు గు వారు పరుగులు తీశారు. పారిపోతున్న లెనిన్‌ను, అతడి మిత్రుల్ని పట్టుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న జాన్, సోనాలను కూడలూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక జాన్ మృతిచెం దగా, సోనా ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. కలకలం: ప్రేమోన్మాది దాడి సమాచారం ఉదయాన్న నీలగిరి జిల్లాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఆ జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్, కలెక్టర్ శంకర్, ఎంపీ గోపాలకృష్ణన్, తాడ్కో అధ్యక్షుడు కలై సెల్వన్‌లు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనాను పరామర్శించారు. అయితే, ఆమె తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండడంతో, మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి డాక్టర్లకు సూచించారు. భారతీ నగర్ వాసులకు చిక్కిన లెనిన్, అతడి మిత్రులను న్యూ ఒవెన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమోన్మాది లెనిన్‌ను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. చంపేశాడు
మంత్రాలయం : ప్రేమతో వంచించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. పెద్దలు సైతం పెళ్లి పత్రికలు వేయించారు. ఐదు రోజులు గడిస్తే పెళ్లి పీటలెక్కాల్సిన యువతిని కసితీరా చంపేసి ప్రేమపెళ్లిని మసి చేశాడు. తాళి కట్టాల్సిన చేతులతో యువతిని కడతేర్చిన ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల సమాచారం మేరకు వివరాలివి.. చిలకలడోణ గ్రామానికి చెందిన యాకోబు, హైమావతి రెండో కుమార్తె మార్తమ్మ (18), అదే గ్రామానికి చెందిన పౌలు, జయమ్మ మూడో కుమారుడు యోహాను ప్రేమించుకున్నారు. అయితే, వివాహం చేసుకునేందుకు యోహానుకు ఇష్టంలేదు. విషయం తెలిసిన పెద్దలు బలవంతంగా యోహానును ఒప్పించారు. ఈనెల 26న వివాహం చేసేందుకు పెళ్లి పత్రికలు సైతం ముద్రించారు. దీంతో యోహాను గురువారం రాత్రి మార్తమ్మను కడతేర్చేందుకు వ్యూహం పన్నాడు. 8 గంటల సమయంలో యువతికి ఫోన్‌చేసి రమ్మని చెప్పాడు. యువతిని మాటలతో మభ్యపెట్టి తుంగభద్ర దిగువ కాలువ మీదుగా బాపురం గ్రామ మార్గాన 2 కి.మీ దూరం తీసుకెళ్లాడు. యువతి కాళ్లను విద్యుత్ తీగలతో కట్టేశాడు. కసితీరా చంపేసి కాలువ చాంబర్లో పడేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మరోవైపు రాత్రి 8 గంటలకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో యోహాను దగ్గరకి వెళ్లి ఉంటుందేమోనని తల్లి హైమావతి భావించింది. అయితే, రాత్రి 10.30 గంటల సమయంలో ఓ పెళ్లి మెరవణిలో యోహాను ఈలలు వేస్తూ చిందులేస్తూ కనిపించాడు. అక్కడేమైనా ఉందేమోనని తల్లి వెళ్లి చూడగా కుమార్తె ఆచూకీ లేకపోవడంతో ఊరంతా వెతికారు. ఉదయం చాంబర్లో కాలిపడి ఉన్న మహిళా మృతదేహాన్ని ఓ పశువుల కాపరి చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. కూతురు కాలిన మంటల్లో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. యువతిని చంపేందుకు వినియోగించిన కటింగ్ ప్లేయర్, పెనుగులాడిన ప్రదేశాలను పోలీసులు పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు యోహానును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, యోహాన్‌పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ముంబైకి వలస వెళ్లి అక్కడో యువతిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, అక్కడి వారు దేహశుద్ధి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే, బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైనట్లు తెలుపుతున్నారు. యువతిని ఒక్కడే మట్టుబెట్టాడా.. వేరొకరి సాయం తో దారుణానికి ఒడిగట్టాడా అనే కోణాలలో పోలీసులు ఆరా తీస్తున్నారు.