సాక్షి, యశవంతపుర: బెంగళూరు ఉత్తర తాలూకా రాజనకుంట ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థిని లయస్మితను పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో పాటు సొంత అత్త కూతురు కావడంతో పవన్ ఆమె పేరును తన హృదయంపై ట్యాటూ వేసుకున్నాడు. ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో స్మిత ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడు.
హత్యకు గంట ముందు సోషల్ మీడియాలో అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోలను డిలిట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె హత్యకు గురైందని మృతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పవన్ కోలుకోగానే విచారణ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు.
గ్రామస్తులతో విద్యార్థుల గొడవలు
రాజనకుంట సమీపంలోని దిబ్బూరు వద్దనున్న ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులతో స్థానిక గ్రామస్థులు ఇబ్బందు పడుతున్నారు. రోజూ విద్యార్థులు మద్యం తాగి గ్రామస్తులతో గొడవలు పడుతున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని దిబ్బూరు చుట్టు పక్కల గ్రామస్తులు బెంగళూరు గ్రామీణ ఎస్పీ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. గురువారం ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానిక పోలీసుల పనితీరు సరిగా లేదంటూ వినతిపత్రంలో ఆరోపించారు.
(చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..)
Comments
Please login to add a commentAdd a comment