plan
-
రోజూ 2 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. సంస్థ యూజర్లకు దీర్ఘకాలిక సర్వీసు అందించే లక్ష్యంతో 365 రోజుల వ్యాలిడిటీతో ఆకర్షణీయమైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రోజూ 2 జీబీ డేటాను అందించే ఈ ప్యాక్ సంవత్సరం పొడవునా ఇంటర్నెట్ అవసరమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.కొత్త ప్లాన్ వివరాలు..వాలిడిటీ: ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అంటే వినియోగదారులు ఒకసారి రీఛార్జ్‌తో ఏడాది పొడవునా నిరంతరాయ సేవలను పొందవచ్చు.రోజువారీ డేటా: వినియోగదారులకు రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.ధర: ఈ ప్లాన్ ధర రూ.1515.వాయిస్ కాల్స్ ఉండవు..ఈ ప్లాన్‌లో ప్రధానంగా డేటాపై దృష్టి సారించారు. ఇందులో ఉచిత వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు ఉండవు. అయితే బీఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ వంటి అదనపు ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను అందిస్తోంది. ఏడాది పొడవునా స్థిరమైన ఇంటర్నెట్ అవసరమయ్యే విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.ఇదీ చదవండి: ఐపీఎల్ స్పాన్సర్షిప్ డీల్ దక్కించుకున్న రిలయన్స్బీఎస్ఎన్ఎల్ విభిన్న ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను కూడా అందిస్తుంది. రూ.1198 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీ ఉంటుంది. నెలకు 300 నిమిషాల ఉచిత కాల్స్, 3 జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్లు, ఉచిత రోమింగ్ అందిస్తుంది. వినియోగదారులకు ఈ ప్లాన్ కోసం నెలకు రూ.100 వరకు ఖర్చు అవుతుంది. డేటా, వాయిస్ సర్వీసులు కావాలనుకునే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. -
BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. 365 రోజులు.. రోజుకు రూ. 3 మాత్రమే
మొబైల్ ఫోను వినియోగదారుల కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. 365 రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎంతో చౌకైనది కూడా. ఈ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు రోజుకు రూ. 3 మాత్రమే ఖర్చవుతుంది. 4జీ నెట్వర్క్పైపు వేగంగా అడుగులు వేస్తున్న బీఎస్ఎన్ల్ అందిస్తున్న ఈ ప్లాన్ మొబైల్ ఫోను వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.1,198. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా ఉపయోగించే వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి నెలా రూ. 100 వరకూ ఖర్చవుతుంది.ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కైనా కాల్ చేయడానికి ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు అందుబాటులో ఉంటాయి. అలాగే వినియోగదారులు ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటా ప్రయోజనాన్ని అందుకుంటారు. ప్రతి నెలా 30 ఉచిత SMSల ప్రయోజనం పొందుతారు. ఉచిత జాతీయ రోమింగ్ కూడా ఈ ప్లాన్‌లో ఉంది. భారతదేశం అంతటా రోమింగ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు ఉచిత ఇన్కమింగ్ కాల్స్‌ను అందుకోవచ్చు.కాగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ కోసం ప్రభుత్వం రూ.6,000 కోట్ల ప్రోత్సాహాన్ని అందించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్- ఎంటీఎన్ఎల్ల 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ అదనపు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో ఈ రెండు టెలికాం కంపెనీల వినియోగదారులు పూర్తిస్థాయిలో 4జీ సేవలను అందుకోనున్నారు.ఇది కూడా చదవండి: Nepal: 23 మంది భారతీయులు అరెస్ట్.. కారణం ఇదే.. -
సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..
జియో, ఎయిర్టెల్ కంపెనీలు యూజర్లను ఆకర్షిస్తున్న వేళ.. 'వోడాఫోన్ ఐడియా' (VI) వినియోగదారుల కోసం ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర రూ. 209 మాత్రమే. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ అన్ని రకాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వోడాఫోన్ ఐడియా అందిస్తున్న 209 రూపాయల ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా, రోజుకు 2జీబీ డేటా అందిస్తుంది. అంతే కాకుండా 300 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అందించే ప్రయోజనాలు రూ.199 ప్లాన్‌కు సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. రూ.209 ప్లాన్‌లో కంపెనీ అపరిమిత కాలర్ ట్యూన్లను అందిస్తోంది. రూ. 209 ప్లాన్ కాకుండా.. కంపెనీ రూ. 218, రూ. 249, రూ. 289 ప్లాన్స్ కూడా అందిస్తోంది.రూ. 218 ప్లాన్కంపెనీ రూ.218 ప్లాన్ ద్వారా 1 నెల వాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో, మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 3జీబీ డేటాను పొందుతారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ప్లాన్‌లో.. కంపెనీ అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. 300 ఎస్ఎమ్ఎస్ల పరిమితి ముగిసిన తర్వాత.. ఒక్కో లోకల్ ఎస్ఎమ్ఎస్ కోసం రూ.1, ఎస్టీడీ ఎస్ఎమ్ఎస్ కోసం రూ. 1.5 పైసలు చెల్లించాల్సి వస్తుంది.రూ. 249 ప్లాన్కంపెనీ అందించే.. ఈ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 1 జీబీ డేటా పొందవచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, ప్లాన్‌లో అందించే ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ ప్రతిరోజూ 100 ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. దీనితో పాటు, మీరు అపరిమిత కాలింగ్ కూడా పొందుతారు.రూ. 289 ప్లాన్ఈ ప్లాన్ ద్వారా మీరు 40 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. 4 జీబీ డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ఈ ప్లాన్ 600 ఉచిత ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండిమొబైల్ రీఛార్జ్ మరింత భారం అవుతుందా?రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్.. 425 రోజులు అన్లిమిటెడ్..
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) ప్రత్యేక న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది.ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్. అన్ని ఇతర కంపెనీలు గరిష్టంగా 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి బీఎస్ఎన్ఎల్ ప్లాన్లతో పోలిస్తే ఖరీదైనవి. గత సంవత్సరం ద్వితీయార్థంలో బీఎస్ఎన్ఎల్ సేవలను పొందేందుకు లక్షలాది మంది వినియోగదారులు తమ నంబర్లను పోర్ట్ చేసుకున్నారు. గత ఏడాది ఇతర కంపెనీలు టారిఫ్‌లు పెంచేయడంతో బీఎస్ఎన్ఎల్ మంచి ఎంపికగా నిలిచింది.Get 2GB/Day Data & Unlimited Calls for 425 Days – all for just ₹2399/-! Hurry, offer valid till 16th Jan 2025 – don’t let this deal slip away! Stay ahead. Stay connected. Stay with BSNL!#BSNLIndia #UnlimitedCalls #2GBData #StayConnected pic.twitter.com/23lkFS3phH— BSNL India (@BSNLCorporate) January 2, 2025 -
11 నదుల అనుంధానానికి రూ. 40 వేల కోట్లు
దేశంలో నదుల అనుసంధానం వివిధ ప్రాంతాలు తాగు,సాగునీటి అవసరాలను తీరుస్తుందనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. దీనిని రాజస్థాన్‌లో సాకారం చేసేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది.రాజస్థాన్‌లోని 11 నదులను అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్‌ను నీటి మిగులు రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్లో జరిగిన సుచి సెమికాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ, భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటర్ హార్వెస్టింగ్‌పై కృషి చేయాలని ఆయన వివిధ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.రాజస్థాన్‌లో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని, నరేంద్ర మోదీ ప్రారంభించనున్న 11 నదులను అనుసంధానించే ప్రాజెక్టుతో రాష్టంలో తలెత్తుతున్న నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాజస్థాన్-మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి ఎద్దడి తగ్గుతుందన్నారు. నూతనంగా చంబల్, దాని ఉపనదులైన పార్వతి, కలిసింద్, కునో, బనాస్, బంగంగా, రూపారెల్, గంభీరి, మేజ్ తదిర ప్రధాన నదులను అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఫలితంగా ఝలావర్, కోట, బుండి, టోంక్, సవాయి మాధోపూర్, గంగాపూర్, దౌసా, కరౌలి, భరత్పూర్, రాజస్థాన్‌లోని అల్వార్ మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, షియోపూర్, సెహోర్‌లతో సహా కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
ఆ రెండు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ మద్దతు ఎవరికి?
న్యూఢిల్లీ: త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆయన తన మిత్రపక్షం అయిన ఇండియా అలయన్స్‌తో పాటు ఇతర మిత్రపక్ష పార్టీలకు ప్రచారం చేయనున్నారు.కేజ్రీవాల్ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి (ఎంవీఏ) తరపున ప్రచారం చేయనున్నారు. పార్టీ వాలంటీర్లు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు, పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ రెండు రాష్ట్రాలలో ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ జార్ఖండ్‌లో.. జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. అలాగే ఇండియా బ్లాక్‌లోని అర్బన్ స్థానాలకు ఆయన ప్రచారం చేయనున్నారు.మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితం వెలువడనుంది. మహారాష్ట్రలో ప్రధాన పోటీ ఎంఏవీ పాలక మహాయుతికి మధ్యనే ఉంది. అధికార మహా కూటమిలో బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్), శివసేన (ఏక్నాథ్ షిండే) ఉన్నాయి. రెండవ కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) ఉన్నాయి. రెండు కూటముల్లోనూ సీట్ల పంపకం జరిగింది. ఎన్నికల ప్రచారం కూడా మొదలైంది.జార్ఖండ్‌లో నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. జార్ఖండ్‌లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోరులోకి దిగింది.ఇది కూడా చదవండి: ‘ప్రియాంక రోడ్డు షో.. సీజనల్ ఫెస్టివల్ లాంటిది’ -
పాక్ ప్రియురాలి కోసం సరిహద్దులు దాటబోయి..
భుజ్: పాకిస్తాన్‌లోని తన ప్రియురాలిని కలుసుకునేందుకు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ జిల్లా ఖవ్రా గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడ జమ్ముకశ్మీర్‌కు చెందిన 36 ఏళ్ల యువకుడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్లో పరిచయమైన ఓ యువతిని కలుసుకునేందుకు ఆ యువకుడు అక్రమంగా సరిహద్దులు దాటి, పాకిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నించాడు.పోలీసులు నిందితుడిని ఇంతియాజ్ షేక్ ముల్తాన్‌గా గుర్తించారు. అతను బందిపోరా జిల్లా వాసి. ఓ పాకిస్తానీ యువతిని కలుకునేందుకు కచ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి పాక్ వెళ్లేందుకు స్థానికుల నుంచి సహకారం కోరాడు. ఈ ఉదంతం గురించి కచ్ (పశ్చిమ) ఎస్పీ సాగర్ బాగ్మార్ మాట్లాడుతూ ఆ యువకుడు ఆన్లైన్లో పరిచయమైన యువతిని కలుసుకునేందుకు సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు వెళ్లాలనుకున్నాడన్నారు. ఈ నేపధ్యంలోనే తాము అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసులతో అతను చెప్పిన విషయాలను ధృవీకరించాక, అతనితో ఎటువంటి ముప్పులేదని నిర్ధారించాక అతనిని విడుదల చేశామన్నారు.ఆ యువకుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, పాక్‌లోని ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆకర్షితుడయ్యాడన్నారు. గూగుల్ మ్యాప్స్ చూసి, కచ్ నుంచి పాక్ వెళదామనుకుని స్థానికుల సహకారం కోరాడన్నారు. అయితే వారు ఆ యువకునిపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారన్నారు. ఆ తర్వాత ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సాగర్ బాగ్మార్ తెలిపారు.ఇది కూడా చదవండి: Jharkhand: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం -
జియో రెండు ఆఫర్లు.. ఒకే రూపాయి తేడా!
న్యూఢిల్లీ: ఇప్పుడున్న రోజుల్లో రూపాయికి ఏమొస్తుందని ఎవరినైనా అడిగితే చాక్లెట్ కూడా కష్టమే అని అంటారు. అయితే జియో సంస్థ కేవలం రూపాయికి ఎంతో తేడా చూపింది. మరింత విలువను ఆపాదించింది. వినడానికి వింతగానే ఉన్నా దీని గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. రిలయన్స్ జియో అందిస్తున్న రూ. 448, రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్లను పరిశీలిస్తే రూపాయి విలువెంతో అర్థం అవుతుంది. కేవలం రూపాయి తేడాతో జియో ఎంత మ్యాజిక్ చేసిందో ఇప్పుడు చూద్దాం.రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన రెండు ప్లాన్లను అందిస్తోంది. వీటిలో ఒక ప్లాన్ ధర రూ.448 కాగా, మరొక ప్లాన్ ధర రూ.449. దీనిని వినగానే ఒక్క రూపాయి తేడాతో రెండు ప్లాన్లు ఎందుకని మనకు అనిపిస్తుంది. పైగా చూసేందుకు ఈ రెండు ప్లాన్లు ఒకే విధంగా కనిపిస్తాయి.అయితే ఆ రెండు ప్లాన్ల వివరాలను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే కంపెనీ 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అయితే డేటా విషయానికి వస్తే ఈ ప్లాన్‌లో 56 జీబీ డేటా ఉంటుంది. దీనిలో రోజుకు 2 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉంటుంది. అలాగే జియో టీవీ యాప్, సోని లివ్, జీ5, లైన్గాటా ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కన్చా లాంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫన్ కోడ్, హోయ్‌చోయ్ మొదలైన వినోద వేదికల్లో సబ్స్క్రిప్షన్ జతచేరుతుంది.ఇక రిలయన్స్ జియో రూ. 449 ప్లాన్ విషయానికొస్తే ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ కేవలం 28 రోజులు. అయితే ఇందులో 84 జీబీ డేటా ఉంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటా అందుతుంది. దీనిలో అపరిమిత కాలింగ్, 100 ఉచిత ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా జతచేరుతుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఉండదు. ఇదంతా తెలుసుకున్నాక ఈ రెండు ప్లాన్ల మధ్య తేడా ఇంత ఉందా అని అనిపిస్తుంది.ప్రతిరోజూ ఎక్కువ డేటా వినియోగం అవసరమయ్యే వారు రూ. 449 ప్లాన్ తీసుకోవచ్చు. దీనిలో ప్రతిరోజూ 3జీబీ డేటా లభిస్తుంది. ఫోనులో ఆటలు ఆడేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే మరింత వినోదాన్ని కోరుకునేవారు రూ. 448 ప్లాన్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీనిలో వివిధ వినోద మాధ్యమాల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే రోజుకు 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి... ఒక్క రూపాయిని జియో ఎంత పవర్‌ఫుల్‌గా మార్చిందో.. -
టాప్ కంపెనీకి టెన్షన్.. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు అపరిమిత వాయిస్ కాల్స్, డేటా వంటి ప్రయోజనాలను తక్కువ ధరలకే దీర్ఘ కాల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. ఇంత తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లు టాప్ టెలికాం కంపెనీలలో దేనిలోనూ లేవు. అందుకే ఈ ప్లాన్‌తో టాప్ కంపెనీకి టెన్షన్ తప్పదు.బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన అద్బుతమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.997 ప్లాన్ ఒకటి. ఇది 160 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 320 జీబీ హై స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే రోజూ 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పంపుకోవచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ దేశం అంతటా ఉచిత రోమింగ్, జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి అనేక విలువ-ఆధారిత సేవలతో వస్తుంది.ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ కూడా యూజర్లకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీస్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో 5జీ సేవలను కూడా ప్రారంభించే పనిలో ఉంది. 5జీ నెట్వర్క్ టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
తక్కువ ధరకు బీఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరల పెంచడంతో చాలా మంది యూజర్లు ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL)కు మారుతున్నారు. దీంతోపాటు 4జీ సేవలు పెరగడం, 5జీ నెట్ వర్క్ కూడా అందుబాటులోకి రానుండటం, అందుబాటు ధరల్లో రీచార్జ్ ప్లాన్లు అందించడంతో బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ అనేక ఆకర్షణీయ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. ఇతర ప్రైవేటు టెలికాం సంస్థల ప్లాన్ లతో పోలిస్తే తక్కువ ధరకే సేవలు అందిస్తోంది. ఇటీవల 30 రోజుల వ్యాలిడిటీతో రూ.229 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ రూ.229 ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMSలు అందిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే ప్లాన్ వ్యాలిడిటీలో 60GB డేటాను పొందవచ్చు. 2GB డేటాతో, 30 రోజుల వ్యాలిడిటీని కేవలం తక్కువ ధరకే BSNL అందిస్తోంది. -
వరల్డ్ క్లాస్ లుక్‌లో గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్
గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ త్వరలో వరల్డ్ క్లాస్ లుక్‌లో కనిపించనుంది. ఈ రైల్వే స్టేషన్‌ను రూ.498 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్లో పలు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నామని నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు, రోగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. బడ్జెట్ హోటల్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా ఇక్కడకు వచ్చి సినిమాలు చూసేందుకు, షాపింగ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో ట్రావెలేటర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇది ప్రత్యేక తరహా ఎస్కలేటర్. దానిపై నిలబడి నడవకుండానే ఒక చోట నుంచి మరో చోటికి చేరుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులతో సహా ప్రయాణికులంతా ట్రావెలేటర్ను వినియోగించుకోవచ్చు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. 2023 జూలై 7న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
వివాదానికి తెర.. వెనక్కి తగ్గిన దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో వైద్యులు- ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగిన వైద్యుల లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది.సమ్మె చేస్తున్న వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య మంత్రి చౌ క్యో హాంగ్ తెలిపారు. వారు తిరిగి విధుల్లో చేరాలని ఆయన కోరారు. అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఎన్ని వేల మంది వైద్యులు విధుల్లోకి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అత్యవసర చికిత్సలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు చికిత్స అందించే వైద్యుల కొరతను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని చౌ క్యో హాంగ్ పేర్కొన్నారు. కాగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచాలన్న ప్రభుత్వ యోచనకు నిరసనగా ఫిబ్రవరి నుంచి మెడికల్ ట్రైనీలుగా పనిచేస్తున్న 13వేల మంది జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్స్ సమ్మెకు దిగారు. ఇది ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది.ప్రభుత్వ ప్రణాళికకు మద్దతుగా మేలో సియోల్ కోర్టు తీర్పు ఇవ్వడంతో సమ్మెకు దిగిన వైద్యులకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఆ దరిమిలా ఆసుపత్రుల్లో విధుల నిర్వహణకు తిరిగివచ్చే వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు 2035 నాటికి 10 వేల మంది వైద్యులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికారులు తెలిపారు.అయితే దేశంలో వైద్య విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో, ఇది అంతిమంగా దేశంలోని వైద్య సేవలపై ప్రభావం చూపుతుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. కాగా దక్షిణ కొరియాలో అత్యధిక వేతనం పొందే వృత్తులలో వైద్య వృత్తి ఒకటి. వైద్యుల సంఖ్య పెరిగితే తమ ఆదాయాలు తగ్గిపోతాయని పలువురు వైద్యులు ఆందోళన చెందున్నారు. -
సూపర్ రీచార్జ్ ప్లాన్: రెండు కంపెనీల్లో ఒకటే.. మరి ఏది బెస్ట్?
దీర్ఘకాల వ్యాలిడిటీ రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్న వారి కోసం ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్లలో అద్భుతమైన ప్లాన్లు ఉన్నాయి. రూ.395తో రెండు కంపెనీలు ప్లాన్లను అందిస్తున్నాయి. ధర ఒకటే అయినా వ్యాలిడిటీ, డేటా, ఇతర ప్రయోజనాల్లో తేడాలున్నాయి. ఏ కంపెనీ రీచార్జ్ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయో ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం..జియో రూ.395 ప్లాన్» 84 రోజుల వ్యాలిడిటీ» అపరిమిత 5జీ డేటా» 5జీ కనెక్టివిటీ, 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్సెట్ లేకపోతే వాడుకునేందుకు 6 జీబీ డేటా» అపరిమిత వాయిస్ కాలింగ్ » మొత్తం 1000 ఎస్ఎంఎస్లు» జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్» "మై జియో యాప్ ఎక్స్ క్లూజివ్" ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.395 ప్లాన్» 70 రోజుల వ్యాలిడిటీ » మొత్తంగా 6 జీబీ హైస్పీడ్ డేటా» 600 ఎస్ఎంఎస్లు» అపోలో 24|7 సర్కిల్‌కు 3 నెలల పాటు యాక్సెస్» ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు» అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్» రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ యాప్, వెబ్సైట్లో లభ్యం -
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?
భారతీయ రైల్వేను ‘దేశానికి లైఫ్ లైన్’ అని అంటారు. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను రైల్వేలు తమ గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇంతటి ఘనత కలిగిన రైల్వేశాఖ నుంచి వచ్చిన ఒక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పునరాభివృద్ధి కోసం ఈ ఏడాది చివరి నాటికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను మూసివేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆ తరువాత న్యూఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ఎప్పటి నుంచి మూసివేస్తారనేదానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది ఈ ఏడాది చివరి నాటికి జరగవచ్చని తెలుస్తోంది.రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో దేశంలోని సుమారు 1,300 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. దీనికి సంబంధించిన పనులు నిదానంగా పూర్తవుతున్నాయి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించే పనులు ప్రారంభంకానున్నాయి. కాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో రోజుకు ఆరు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి రైల్వే స్టేషన్‌ను అకస్మాత్తుగా మూసివేయడం రైల్వేకు పెను సవాలుగా మారనుంది. అయితే ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లను వివిధ స్టేషన్ల మీదుగా దారిమళ్లించనున్నారు. ఈస్ట్ ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లను ఆనంద్ విహార్ స్టేషన్‌కు మార్చనున్నారు. అలాగే పంజాబ్, హర్యానాకు వెళ్లే రైళ్లను సరాయ్ రోహిల్లా వైపు మళ్లించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే రైళ్లను ఢిల్లీ కాంట్, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల మీదుగా మళ్లించనున్నారు. మిగిలిన కొన్ని రైళ్లను ఘజియాబాద్‌కు మళ్లించే అవకాశ ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో రైల్వేశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడనుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పనుల కోసం నాలుగేళ్లపాటు మూసివేయనున్నారు. ఈ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఈ పనులను ఏకకాలంలో చేయాలని గతంలో ప్రభుత్వం యోచించింది. అయితే ఇప్పుడు దశలవారీగా ఈ పనులను చేయాలని నిర్ణయించారు. 2023 బడ్జెట్ సెషన్లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. -
టీడీపీ హింసా కాండ వెనుక.. చంద్రబాబు పక్కా ప్లాన్
-
కొత్త రీచార్జ్ ప్లాన్.. ‘28 రోజులు’ టెన్షన్ లేదిక!
Airtel 35 Days Validity Plan: దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. నెలవారీ రీచార్జ్‌కు సంబంధించి టెలికాం కంపెనీలు సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీనే అందిస్తుంటాయి. అయితే తక్కువ వ్యాలిడిటీతో ఇబ్బందిపడే కస్టమర్ల కోసం ఎయిర్టెల్ 35 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రీఛార్జ్ ప్లాన్లలో తక్కువ వ్యాలిడిటీ పీరియడ్ల సమస్యకు ప్రతిస్పందనగా ఎయిర్టెల్ నుండి తాజా ఆఫర్ వచ్చింది. అంతరాయం లేని సేవల కోసం ప్రతి 28 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా మంది వినియోగదారులు తరచుగా అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సవాలును గుర్తించి ఎయిర్టెల్ 35 రోజుల పాటు ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీని అందిస్తూ రూ.289 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ప్లాన్ ప్రయోజనాలు ఎయిర్టెల్ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ అధిక వ్యాలిడిటీని అందించడమే కాకుండా వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చెల్లుబాటు వ్యవధిలో అపరిమిత కాలింగ్‌తో పాటు, రోజుకు 300 ఉచిత ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. అయితే అధిక డేటా అవసరాలు ఉన్న వినియోగదారులకు ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు. ఎందుకంటే మొత్తం చెల్లుబాటు వ్యవధికి 4GB డేటా మాత్రమే ఈ ప్లాన్‌పై లభిస్తుంది. -
ఢిల్లీలో విజయానికి బీజేపీ ప్రణాళిక ఏమిటి?
దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలనూ కైవసం చేసుకోవాలనే ప్రణాళికతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉంది. ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. బీజేపీకి కొత్త ఇబ్బందులను సృష్టించింది. అయినప్పటికీ బీజేపీ ఢిల్లీలోని అన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత అక్కడి ప్రభుత్వ పనితీరులో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ మరింత క్రియాశీలకంగా మారింది. అయితే ఇంతలో బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆప్ పార్టీకి చెందిన మరొకరిని సీఎం చేయాలని సలహా ఇచ్చారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఆదరణపై బీజేపీ పూర్తి నమ్మకంతో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్న సమయంలోనూ ఢిల్లీ ప్రజలు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీని గెలిపించారని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా, అది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని, ఎందుకంటే గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 57 శాతం ఓట్లు వచ్చాయని, అదే తీరు ఇప్పటికీ కొనసాగుతుందని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది. ఈసారి బీజేపీ మనోజ్ తివారీకి చెందిన ఢిల్లీ లోక్ సభ స్థానం మినహా మిగిలిన ఆరు స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్, చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, దక్షిణ ఢిల్లీ నుంచి రామ్‌వీర్ సింగ్ బిధూరి, పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్జిత్ సెహ్రావత్, తూర్పు ఢిల్లీ నుంచి హర్ష్ మల్హోత్రా, వాయువ్య ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా బీజేపీ తరపున బరిలోకి దిగారు. -
కమలదళం.. కదనరంగం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలరోజులకు (మార్చి25 – ఏప్రిల్ 25)పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణను రాష్ట్ర బీజేపీ సిద్ధం చేసింది. పోలింగ్‌బూత్ స్థాయిల్లో మోదీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినవారు, మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)ను కలిసి వారిద్వారా వివిధవర్గాల మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది. ఆదివారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యకుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్లు, ప్రభారీలు, మోర్చాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయకార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. నేతల తీరుపై సునీల్‌బన్సల్ అసంతృప్తి ! అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించినా, ఆశించినస్థాయిలో జనాల్లోకి వెళ్లలేదని బీజేపీ నేతలపై ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్‌బన్సల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. డిజిటల్ వ్యాన్స్ ఇచ్చాం. అయినా ఎక్కడా తిరగట్లేదు..ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించినట్టు సమాచారం. ‘ప్రతి బూత్‌లో అధికంగా ఓట్లు వస్తేనే.. పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం. మనకు ఇంకా టైం ఉంది. ఇప్పటికైనా స్పీడప్ చేయాలి. అలా అయితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పినట్టు తెలిసింది. పదాధికారుల భేటీలో తీసుకున్న నిర్ణయాలు ► పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6న పోలింగ్సెంటర్ వారీగా ’టిఫిన్ బైఠక్’ల నిర్వహణ ► నమో యాప్ ద్వారా చిన్నమొత్తం నిధులు (మైకో డొనేష¯ŒŒ్స) పొందేందుకు కృషి ► ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం ► ప్రతి పోలింగ్ బూత్‌లో 370 ఓట్లు (సుమారుగా పోలైన ఓట్లలో 50 శాతం) సాధించేందుకు కృషి ► ప్రతి బూత్‌ను పార్టీ బలాన్ని బట్టి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి బలోపేతానికి కృషి చేయాలి ► లోక్‌సభ అభ్యర్థి నేరుగా పాల్గొనేలా సమావేశాల నిర్వహణ ► లోక్‌సభ, అసెంబ్లీ స్థాయిల్లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ భేటీలు తరచు నిర్వహించి, ప్రచార కార్యక్రమాల ముమ్మరం ► గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని స్థా యిల్లో కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించడం ► వివిధ మోర్చాలు.. ముఖ్యంగా యువమోర్చా– మొదటిసారి ఓటేస్తున్న యువతను ఆకర్శించే విధంగా, కిసాన్‌మోర్చా– రైతులలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మోర్చాలు– ఆయా వర్గాలతో నిరంతర సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీకి అధిక ఓట్లు వచ్చే విధంగా కృషి చేయడం ► నామినేషన్ల దాఖలు పూర్తయ్యే దాకా ప్రతి లోక్‌సభ సెగ్మెంట్లో విస్తృతస్థాయి సమావేశాల ఏర్పాటు ► బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రతి నాయకుడు తన పోలింగ్ బూత్‌లో కోఆర్డినేటర్‌గా పనిచేయాలి ► నామినేషన్ల దాఖలులోపు బూత్ స్థాయిలో ఓటర్ల లిస్ట్‌పై అవగాహన కల్పించుకోవాలి ► ఎన్నికలలోపు ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు కలిసేవిధంగా కార్యాచరణ రూపొందించాలి -
ఉద్యోగుల విషయంలో టీసీఎస్ తప్పు తెలుసుకుందా?
TCS plans to increase headcount : ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు నిత్య కృత్యమైన ప్రస్తుత తరుణంలో చాలా కంపెనీలు నియామకాల జోలికే వెళ్లడం లేదు. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆశ్చర్యకరమైన ప్రణాళికను బయటపెట్టింది. గతేడాది టీసీఎస్ సైతం గణనీయమైన తొలగింపులు చేపట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని భావిస్తుండగా ఇందుకు విరుద్ధంగా తమ శ్రామిక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశాన్ని టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేకే కృతివాసన్ నాస్కామ్ సెషన్లో టీసీఎస్ నియామకాల లక్ష్యాల గురించి మాట్లాడారు. రిక్రూట్మెంట్ ప్రయత్నాలను తగ్గించే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ మందగించడంతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల నియామకాలు తగ్గుతాయని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్న తరుణంలో ఇందుకు విరుద్ధంగా టీసీఎస్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ముఖ్యంగా 2023లో టీసీఎస్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. లైవ్‌మింట్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరంలో 10,818 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. నియామక ధోరణుల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ.. " ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు చూస్తున్నాం. మాకు మరింత మంది సిబ్బంది అవసరం ఉంది" అని కృతివాసన్ పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో సర్దుబాట్లు చేసినప్పటికీ, రిక్రూట్మెంట్ కార్యక్రమాలలో ఎలాంటి తగ్గింపు ఉండదని సూచిస్తూ కంపెనీ నియామక ఎజెండా పట్ల టీసీఎస్ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. 6 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న టీసీఎస్.. మార్కెట్లో సవాళ్లు ప్రబలంగా ఉన్నప్పటికీ దాని మధ్యస్థ, దీర్ఘకాలిక అవకాశాల గురించి ఆశాజనకంగా ఉందని పీటీఐ నివేదించింది. ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో టీసీఎస్ నికర లాభంలో 8.2 శాతం వృద్ధిని సాధించింది. టీసీఎస్ నియామక ప్రణాళికలతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై కంపెనీ వైఖరిని సైతం కృతివాసన్ ప్రస్తావించారు. సంస్థాగత సంస్కృతి, విలువలను మెరుగుపరచడానికి రిమోట్ వర్క్ లేదా హైబ్రిడ్ మోడల్‌లు సరైనవి కాదన్నారు. వ్యక్తిగత సహకారం, అభ్యాసం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సహోద్యోగులను, సీనియర్లను గమనిస్తూ విలువైన పాఠాలు కార్యాలయ వాతావరణంలో ఉత్తమంగా నేర్చుకోవచ్చని సూచించారు. -
వెడ్డింగ్ ప్లాన్ ఇలా ఉంటే అదుర్స్!
భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కన్యాదాత ఎంతో హంగు, ఆర్భాటాలతో పెళ్లి చేస్తాడు. ఒకోసారి వరుడి తరఫు వారే పెళ్లి ఖర్చులు పెట్టుకోవడం, లేదా ఖర్చును ఇద్దరూ కలిసి పంచుకోవడం... ఏ రకంగా చూసినా సరే, జీవితంలో ఒక్కసారే జరిగే సంబరం కావడంతో ఖర్చుకు ఎక్కడా వెనుకాడరు. పెళ్లి శుభలేఖ దగ్గర నుంచి.. మండపాలంకరణ వరకు, పెళ్లిబట్టల నుంచి నగల వరకు; టిఫిన్ల దగ్గర నుంచి విందు భోజనాల వరకు... ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదే. భారతీయులు సగటున పెళ్లికోసం చేస్తున్న ఖర్చు రూ. 5 లక్షల నుంచి రూ. కోటికి పైగా ఉంటుందన్నది ఒక అంచనా. ఇల్లలకగానే పండగా... అన్నట్లు ఉన్నదంతా వదిలించుకుని లేదా లేకపోతే అప్పులు చేసి మరీ పెళ్లి చేసిన తర్వాత ఆ జంట కాపురం కోసం మరికొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏది తక్కువైనా నవ్వుల పాలు కావడం ఖాయం. అయితే వైభవంగా పెళ్లి చేయడం వరకు తప్పేం లేదు కానీ స్తోమతకు మించి అప్పులు చేయడంలోనే అభ్యంతరం... తప్పనిసరి వాటికి ఎలాగూ ఖర్చు తప్పదు కానీ కాస్త ఆచి తూచి ప్లాన్ ప్రకారం చేస్తే పెళ్లికి అయ్యే వృథా ఖర్చును కొంత తగ్గించవచ్చు. అదెలాగో చూద్దాం... ముందస్తు ప్రణాళిక ... పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేశాం అనే దానికన్నా ఎంత ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్ చేశామన్నది ముఖ్యం. అనుకున్న బడ్జెట్ లోపు చేయాలంటే ఖర్చు ఎక్కడ పెట్టాలి.. ఎక్కడ తగ్గించుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇందుకోసం పెళ్లి తంతులో వివిధ ఘట్టాలకు అవసరమైన వస్తు సామగ్రిని ముందుగానే జాబితా రాసుకోవాలి. అవసరమైతే మండపం, అలంకరణ, కేటరింగ్ వంటి వాటిని ఒకరికే కాంట్రాక్ట్ ఇస్తే కొంతమేరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పర్యవేక్షణ కూడా బావుంటుంది. వస్త్రాలు, నగలు కూడా అవసరం మేరకే కొనుగోలు చేయాలి. అతిథుల జాబితా అన్నింటికన్నా ముఖ్యం... పెళ్లి అంటేనే సకుటుంబ సపరివారంతోపాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అంతా హాజరు కావాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం బంధువులకు ఒకటని, మిత్రులకు మరొకటని కార్డులు ప్రింట్ చేయిస్తుంటారు. ఇక్కడ కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందరికీ కామన్‌గా ఒకే ఆహ్వాన పత్రిక ఉంటే ఖర్చు తగ్గుతుంది. సేహితులకు కార్డులు కొట్టించే బదులు ఈ ఇన్విటేషన్ల ద్వారా కూడా ఆహ్వానం పంపుకోవచ్చు. అలాగే పెళ్లిలో మెహందీ అని, సంగీత్ అని, హల్దీ అనీ, రిసెప్షన్ అనీ ఇలా చాలా రకాల ఈవెంట్స్ చేస్తున్నారు. పెళ్లికూతురు దగ్గర కొన్ని, పెళ్లి కొడుకు వద్ద మరికొన్ని.. ఇద్దరిని కలిపి కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. వీటికి ఎవరెవరిని పిలవాలనే దానిపై కూడా కసరత్తు చేయాలి. అప్పుడు ఏ ఈవెంట్ కు ఎంతమంది వస్తారో అవగాహన ఉంటుంది కాబట్టి.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ముందుగా బడ్జెట్ వేసుకోండి... పెళ్లికి ముందు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. బడ్జెట్ లేకుండా వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహిస్తే ఖర్చులు భారీగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ సిద్ధం చేసుకోవడం మొదటి పని. వివాహం అలా చేసుకోవాలని ఇలా చేసుకోవాలని చాలా కోరికలు ఉంటాయి. కానీ అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి. ఉదాహరణకు వివాహానికి బట్టలు, ఆభరణాలు అవసరం. అలాగని ఖరీదైన బట్టలు, ఆభరణాలు అవసరం లేదు. బడ్జెట్లో వచ్చే వాటిని తీసుకోవడం ఉత్తమం. క్యాటరింగ్: పెళ్లి విందులకు డబ్బు గుడ్డిగా ఖర్చు చేస్తారు. చాలా పెళ్లిళ్ల లో ఆహారం వృథా అవడం గమనిస్తూనే ఉంటాం. వివాహ విందు మెనులో అవసరమైన ఆహార పదార్థాలను మాత్రమే చేర్చండి. లేనిపోని గొప్పల కోసం మెనూని పెంచవద్దు. హాజరయ్యే అతిథుల సంఖ్యకు అనుగుణంగా క్యాటరింగ్ సిద్ధం చేసుకోవాలి. అలంకరణ సామగ్రి పెళ్లి ఇంట్లో చాలా అలంకరణ ఉంటుంది. అవసరమైన అలంకరణ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. వీటిలో పువ్వులు చాలా ముఖ్యమైనవి. వాటిని చౌకగా ఉన్న ప్రదేశాల నుంచి కొనుగోలు చేస్తే కొంత డబ్బు ఆదా అవుతుంది. హనీమూన్ ట్రిప్... పెళ్లితంతు ముగిసిన తర్వాత నూతన వధూవరుల హనీమూన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హనీమూన్ డెస్టినేషన్లుగా పేరుగాంచిన దేశాలకు ఎగిరిపోతున్నారు. ఇది కూడా బడ్జెట్ పెరగడానికి కారణం అవుతుంది. దీని బదులుగా మన దేశంలోనే అనువైన ప్రాంతాలను ఎంచుకుంటే చాలా సమయంతో పాటు ధనమూ ఆదా అవుతుంది. ఒకవేళ విదేశాలకే వెళ్లాలనుకుంటే తక్కువ ఖర్చుతో వెళ్లిరాగలిగే మలేసియా, థాయ్‌ల్యాండ్ వంటివి ఎంచుకుంటే సరిపోతుంది. (చదవండి: మూడ్‌ని మార్చి రిఫ్రెష్ అయ్యేలా చేసే సూపర్ ఫుడ్స్ ఇవే! ) -
జియో, ఎయిర్టెల్ కొత్త రీచార్జ్.. ప్లాన్ ఒక్కటే! మరి బెనిఫిట్లు..
దేశంలో దిగ్గజ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ( Jio ), భారతీ ఎయిర్టెల్ ( Airtel ) రెండూ ఒకే రకమైన కొత్త రీచ్చార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం చాలా తేడా ఉంది. రెండు ప్లాన్లతో కస్టమర్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. జియో రూ.666 ప్లాన్ ➥ 84 రోజుల వ్యాలిడిటీ ➥ 84 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత కాలింగ్ ➥ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులకు 126జీబీ డేటా అందిస్తుంది. రోజుకు 1.5జీబీ డేటాను ఉపయోగించవచ్చు. ➥ రోజుకు 100 SMS ➥ జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ సబ్స్క్రిప్షన్లు ఎయిర్టెల్ రూ.666 ప్లాన్ ➥ మొత్తంగా 115జీబీ డేటా. రోజుకు 1.5 జీబీ డేటా వాడుకోవచ్చు. ➥ 77 రోజుల వరకు వ్యాలిడిటీ ➥ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సబ్స్క్రిప్షన్ ➥ వింక్ మ్యూజిక్‌తోపాటు హలో ట్యూన్స్‌కి ఉచిత సబ్స్క్రిప్షన్ ఈ ప్లాన్‌లో రెండు కంపెనీలు తమ కస్టమర్లకు అపరిమిత 5G డేటాను అందిస్తున్నాయి. రిలయన్స్ జియోకు 44 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. మరోవైపు ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 37 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. రెండు టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఈ రీఛార్జ్ ప్లాన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. -
పేదింటి పద్దు రూ.25 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు ఈ ఆర్థిక సంవత్స రంలో రూ.25 వేల కోట్లు ప్రతిపాదించా లని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పట్లో తక్కువ విస్తీర్ణంలో ఆ ఇళ్లను నిర్మించగా, ఇప్పుడు రెండు పడగ్గదులతో నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం యూనిట్ కాస్ట్ ను రూ.5 లక్షలుగా ఖరారు చేస్తూ ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన విష యం తెలిసిందే. మొత్తంగా ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్లను నిర్మించాలని అనుకుంటోంది. దీంతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయా లని నిర్ణయించింది. వీటన్నింటికి కలిపి తొలి ఏడాదిలో రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని తాజాగా అంచనాకొచ్చింది. అధికారులతో ఉప ము ఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించి ప్రాథ మికంగా నిర్ణయించారు. దావోస్ పర్యటన కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రాగానే ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకే రూ.20 వేల కోట్లు.. తొలి ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనాకొచ్చారు. నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను చేపడితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున ఇంత బడ్జెట్ అవసరమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న అప్పు రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో తొలి సంవత్సరం రూ.వేయి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లను కేటాయించాలని లెక్కలు వేశారు. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 2వేల కోట్లు గత ప్రభుత్వంలో మొదలై పూర్తి కాకుండా మిగిలిపోయి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లను కేటాయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా, త్వరలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న నేపథ్యంలో అందులో గృహనిర్మాణ పద్దు కింద ఎంత కేటాయిస్తుంది, ఏయే పథకాల కింద రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయి.. అన్న అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న భావనను కూడా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. -
Jio New Year Offer: జియో ‘కొత్త’ ఆఫర్! బెనిఫిట్స్ ఇవే..
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) నూతన సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ పేరిట రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని కింద ఇప్పటికే ఉన్న ఏడాది కాలపరిమితి రీఛార్జ్ ప్లాన్ రూ.2,999పై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. దీనివల్ల లాంగ్‌టర్మ్ ప్లాన్ వినియోగించే వారికి ప్రయోజనం కలుగుతుంది. ప్లాన్ ప్రయోజనాలు ఇవే.. జియో రూ.2,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై 24 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్‌ని వినియోగించుకోవచ్చు. దీని ప్రకారం.. రోజుకు రూ.8.21 పడే ప్లాన్ ధర రూ.7.70లకే తగ్గుతుంది. రోజుకు 2.5 జీబీ అపరిమిత 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటా, వాయిస్‌కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. వీటితో పాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి జియో యాప్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో జియో సినిమా ప్రీమియం మెంబర్షిప్ ఉండదు. ఇది కావాలంటే విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో న్యూ ఇయర్ ప్లాన్ ప్రయోజనాలు డిసెంబర్ 20 తర్వాత రీచార్జ్ చేసుకున్నవారికి వర్తిస్తాయి. కాగా ఆఫర్‌ను పొందేందుకు చివరి తేదీ అంటూ కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించలేదు. -
టాప్-5 డైట్ ప్లాన్స్... 2023లో ఇలా బరువు తగ్గారట!
2023లో కొన్ని డైట్ ప్లాన్లు వార్తల్లో నిలిచాయి. వీటిలో వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఉండే డైట్ ప్లాన్ కూడా ఉంది. ఆ వివరాలతో పాటు 2023లో చర్చకు వచ్చిన టాప్-5 డైట్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెడిటేరియన్ డైట్ 2023లో మెడిటేరియన్ డైట్ అధికంగా చర్చల్లోకి వచ్చింది. చాలా మంది దీనిని అనుసరించారు. ఈ డైట్ ప్లాన్‌లో వారానికోసారి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కెర, కొవ్వు పదారార్థాలు తీసుకోకూడదు. గుండెపోటు, స్ట్రోక్, టైప్ -2 డయాబెటిస్ బాధితులు వైద్యుల సూచనల మేరకు ఈ ప్లాన్ అనుసరించారు. 2. వెయిట్ వాచర్స్ రెసిపీ డైట్ వెయిట్ వాచర్స్ రెసిపీలో వేగంగా బరువు తగ్గడంలో సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో సహాయపడే ఆహార ప్రణాళిక దీనిలో ఉంది. దీనిలో రెండు ఫార్ములాలు ఉన్నాయి. మొదటి ఫార్ములాలో ఆహారంలో నూనె పదార్థాలకు దూరంగా ఉండటం. రెండవ ఫార్ములా.. అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం. అలాగే కార్బోహైడ్రేట్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం. 3. కీటో డైట్ కీటో డైట్లో తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు పదార్ధాల వినియోగంపై దృష్టి పెట్టాలి. కీటో డైట్ ద్వారా కొన్ని వారాల్లోనే వేగంగా బరువు తగ్గవచ్చు. వైద్యులు పర్యవేక్షణలో ఈ డైట్‌ని ఎంచుకోవాలి. ఎందుకంటే దీనిని దీర్ఘకాలం పాటు ఫాలో చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 4. డాష్ డైట్ డాష్ డైట్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెబుతారు. డాష్ అంటే హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి ఉపయోగపడే డైట్ ప్లాన్. ఇది అధిక రక్తపోటు నియంత్రణకు రూపొందించిన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక. హృద్రోగులు దీనిని పాటిస్తుంటారు. 5. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అడపాదడపా ఉపవాసం. ప్రతిరోజూ కొంత సమయం లేదా వారంలో ఒకరోజు ఏమీ తినకుండా ఉండటం. అడపాదడపా ఉపవాసంలో ప్రతిరోజూ కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. లేదా వారంలో ఒక రోజు ఉపవాసం చేసి, మరుసటి రోజు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఈ ఐదు డైట్ ప్లాన్లు 2023లో అత్యంత ఆదరణ పొందాయి. ఇది కూడా చదవండి: గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు! -
పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం మద్యపానమే!వెలుగులోకి షాకింగ్ విషయాలు
ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం పురుషులు మద్యం సేవించడం మానేయాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేదంటే గర్భధారణ సమస్యలు లేదా పిల్లల్లో సరైన పెరుగుదల లేకపోవడం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉటాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కనీసం ఓ వారం రెండు వారాల నుంచి మద్య మానేయడం కాదని బాంబు పేల్చారు. సేవించిన మద్యం ప్రభావం స్పెర్మ్‌పై ఎలా ఉంటుందో కూడా సవివరంగా వివరించారు. మద్య సేవించే పురుషులకు పుట్టే పిల్లల్లో ఎలాంటి సమస్యలొస్తాయో తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇంతవరకు గర్భధారణ, పిల్లల అభివృద్ధి విషయాల్లో తల్లి ఆరోగ్యాన్ని కీలకంగా పరిగణించేవారు పరిశోధకులు. ఆ దిశగానే పరిశోధనలు చేయడం జరిగింది. అయితే గర్భధారణకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా ఆ మహిళకు పిల్లలు కనడంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే దిశగా పరిశోధనలు జరగలేదు. తొలిసారిగా ఆవైపుగా అధ్యయనం సాగించారు శాస్త్రవేత్తలు. ఆ పిండానికి ఆల్కహాల్ సిండ్రోమ్(ఎఫ్ఏఎస్)తో సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయా? అనే దిశగా సరికొత్త ప్రయోగాలు చేశారు. ఆ అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా బరువు తక్కువుగా జననాలు, హైపర్ యాక్టీవిటీ సమస్యలు, సరైన ఎదుగుదల లేని పిల్లలు పుట్టడానికి కారణమని తేలింది. పిల్లలను లేదా ఫ్యామీలిని ప్లాన్ చేసుకుంటే మగవాళ్లని మద్యం సేవించకుండా మహిళలే చూసుకోవాలని లేదా బాధ్యత తీసుకోవాలని సూచించారు పరిశోధకులు. మద్యం సేవించిన ఎంతకాలం వరకు స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం ఉంటుందనే దానిపై కూడా పరిశోధనలు నిర్వహించారు. తండ్రి ఆల్కహాల్ అలవాట్లు పిండం అభివృద్ధిలో బలమైన ప్రభావం ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. దీంతో తాము స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం తగ్గడానికి ఎంత సమయం పడుతుందో అనే దిశగా కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అందుకోసం మగ ఎలుకలపై ప్రయోగాలు చేయగా..కొన్నింటి ఆల్కహాల్‌కు గురిచేసి మరికొన్నింటికి ఆల్కహాల్ ఇవ్వకుండా చూడగా వాటి జన్యువుల్లో సంభించిన పలు మార్పులను గమనించినట్లు తెలిపారు. ఈ పరిశోధనల్లో కనీసం మూడు, నాలుగు వారాలు కాకుండా ఏకంగా మూడు నెలల పాటు ఆల్కహాల్‌కి దూరంగా ఉంటేనే వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్‌పై ప్రభావం ఉండదని అధ్యయనంలో వెల్లడయ్యిందని అన్నారు. అలాగే మగవారిలో స్పెర్మ్ 60 రోజుల వ్యవధిలో తయారవుతుందని మాకు తెలుసు. కానీ మద్యం మానేసిన ఒక నెలకు గానీ సెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గటం ప్రారంభమవ్వదని అన్నారు. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పడూ కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు మద్యం మానేయాల్సిందేనని సూచించారు. అప్పటి వరకు ఆగి ఫ్యామిలీని ప్లానే చేసుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు మద్యం మానేసినప్పటికీ దాని తాలుకా రసాయనా ప్రభావం శరీరంలో అలా కొనసాగుతు ఉంటుందని అందువల్ల మూడు నెలల సమయం విరామం తీసుకోవాల్సిందేనని అన్నారు. లేదంటే తల్లిదండ్రులు ఆల్కహాలిక్ సంబంధిత పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు పరిశోధకులు. (చదవండి: భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు) -
చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు!
జిత్తులమారి చైనాకు చెక్ పెట్టేందుకు భారత్, అమెరికాలు సిద్ధమవుతున్నాయి. అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంకలో తన ‘గూఢచారి’ నౌకా వ్యవహారాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్న చైనాను అడ్డుకునేందుకు పెట్టుబడుల మంత్రమేస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో ముందుకొచ్చాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న శ్రీలంకను దోచుకుంటున్న చైనాకు చెక్ పెట్టే దిశగా ముందుకు కదులుతున్నాయి. కొలంబో పోర్ట్‌లో డీప్ వాటర్ షిప్పింగ్ కంటైనర్ టెర్మినల్‌ను నిర్మించడానికి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశానికి చెందిన అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్టును కొలంబోలో ముందుకు తీసుకువెళ్లనుంది. దీంతో చైనా ఆటలకు అడ్డుకట్ట పడనుంది. శ్రీలంకకు చైనా భారీగా అప్పులు ఇచ్చి, అందుకు ప్రతిగా శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవును 99 సంవత్సరాల ఒప్పందం మేరకు ఆక్రమించింది. ఇదేవిధంగా చైనా తన ‘గూఢచారి’ నౌకను శ్రీలంకకు పంపింది. ఇది పరిశోధనా నౌక అని సమాచారం. చైనా ఈ నౌక సాయంతో భారత్‌పై గూఢచర్యం చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. చైనా చేస్తున్న ఈ దుర్మార్గపు ఎత్తుగడను తిప్పికొట్టేందుకు, దాని దురహంకారాన్ని తుదముట్టించేందుకు భారత్, అమెరికాలు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. కొలంబో పోర్ట్ కోసం అమెరికా పెట్టుబడులు పెడుతుండటంతో శ్రీలంకకు ప్రయోజనం చేకూరనుంది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్.. కొలంబో పోర్ట్‌ను ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయనుంది. శ్రీలంకపై అప్పుల భారం తగ్గేందుకు ఇది దోహదపడుతుందని, దీని కారణంగా మిత్రదేశాలకు మేలు జరుగుతుందని అమెరికా చెబుతోంది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీలంకలో అమెరికా పెట్టుబడుల ప్రకటన వెలువడింది. బంగాళాఖాతంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడంలో ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. కాగా చైనా ఇచ్చిన రుణాన్ని తీర్చలేని శ్రీలంక తమ దేశానికి చెందిన హంబన్‌టోటా పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే చైనా కుయుక్తులతో తన ‘గూఢచారి’ నౌకను కొలంబో పోర్టుకు పంపడంలో విజయం సాధించింది. ఇది కూడా చదవండి: గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది? -
విశాఖ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సాక్షి, విశాఖపట్నం : నీతి ఆయోగ్ గ్రోత్ హబ్స్ జాబితాలో విశాఖ ఎంపికైన నేపథ్యంలో అభివృద్ధికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ, టూరి జం ఆర్డీ శ్రీనివాస్‌పాణి, మెట్రోరైల్ ఎండీ యూజేఎం రావు తదితరులతో మాట్లాడారు. విశాఖ అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై ప్ర త్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టు నాలుగు విభాగాలుగా రూ పొందుతోందని మెట్రో ఎండీ యూజేఎంరావు తెలిపారు. లైట్ కారిడార్, మోడరన్ కారిడార్ పేర్లతో రూపొందుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని జవహర్‌రెడ్డి సూచించారు. జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అర్బన్ గ్రోత్ హబ్ సిటీస్ జాబితాలో విశాఖ చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. 2047 నాటి కి వికసిత్ భారత్‌గా వెలుగొందాలంటే అర్బన్ సిటీ స్ గ్రోత్ సెంటర్స్ ముఖ్యమని నీతి ఆయోగ్ గుర్తించిందని తెలిపారు. ఇందుకోసం నీతి ఆయోగ్ బృందం టోక్యో, న్యూయార్క్ వంటి 20 ప్రపంచస్థాయి నగరాల్ని అధ్యయనం చేసి రోడ్ మ్యాప్ సిద్ధం చే సిందని, ఇందులో భాగంగా విశాఖని ఎంపిక చేసిందని వివరించారు. విశాఖ నుంచి సీఎం పరిపాలనపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామన్నారు. -
35 ఏళ్లలోపు రిటైర్.. చేతిలో రూ. 41 కోట్లు.. ఈ గూగుల్ ఉద్యోగి ప్లాన్ తెలిస్తే..!
Google employee plan: సాధారణంగా యువత ఆలోచనలు ఇలా ఉంటాయి.. మంచి కంపెనీలో జాబ్ చేయాలి.. వృద్ధాప్యం వరకూ ఉద్యోగం చేసి బాగా సంపాదించాలి.. కుటుంబాలను సెటిల్ చేసి ఏ 60 ఏళ్లకో రిటైర్ కావాలి అనుకుంటారు. కానీ ఆ యువకుడు మాత్రం 35 ఏళ్లకే రిటైర్ కావాలనుకుంటున్నాడు. అతని ప్లానింగ్ తెలిస్తే అదిరిపోతారు. గూగుల్ (Google)లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల ఇతాన్ నున్లీ (Ethan Nguonly).. వీలైనంత తొందరంగా అంటే 35 ఏళ్లలోపే రిటైర్ కావాలనుకుంటున్నాడు. ఆ లోపు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 41 కోట్లు) సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎన్‌బీసీ నివేదించింది. ఇదీ చదవండి: వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు! ఆర్థిక భద్రత వైపు నున్లీ ప్రయాణం చిన్నతనం నుంచే ప్రారంభమైంది. తీర ప్రాంతంలో పెరిగిన నున్లీకి పెట్టుబడి ఆవశ్యకతను తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుండేవారు. పొదుపు ఖాతాలో డబ్బు దాచుకోవడం కంటే పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే లాభాల గురించి చెప్పేవారు. చిన్నతనం నుంచే ఆర్థిక పాఠాలు నేర్పించడంతో అతని ఆర్థిక దృక్పథాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. రెండేళ్లలోనే ఉన్నత విద్యాభ్యాసం ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలనే నున్లీ దృఢ సంకల్పం కేవలం రెండేళ్లలోనే బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తన కంప్యూటర్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసేలా చేసింది. అదే సమయంలో అతను పూర్తి సమయం ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఇన్ఫర్మేషన్, డేటా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాడు. గూగుల్‌లో పని చేయాలనే నున్లీ ఆకాంక్ష 2021 డిసెంబర్లో నిజమైంది. ఈ టెక్ దిగ్గజంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. బోనస్‌లు, స్టాక్ యూనిట్లతో కలిపుకొని నున్లీ మొత్తం వార్షిక ఆదాయం సుమారు 1,94,000 డాలర్లు (దాదాపు రూ. 1.60 కోట్లు). విస్తృతంగా పెట్టుబడులు చిన్న వయసులోనే రిటైర్ కావాలన్న తన ఆశయం కోసం నున్లీ శ్రద్ధగా పెట్టుబడి పెడుతున్నాడు. వివిధ రిటైర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లలో దాదాపు 1,35,000 డాలర్లు (దాదాపు రూ. 1.11 కోట్లు) ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాడు. తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో ఆస్తులను సంపాదించి రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టాడు. బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులతో కలిసి జీవించిన నున్లీ క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నియమావళికి కట్టుబడి 60,000 డాలర్లను పొదుపు చేయగలిగాడు.ఈ ఆర్థిక క్రమశిక్షణ ఫ్లోరిడాలోని రివర్‌వ్యూలో అతని మొదటి పెట్టుబడి ఆస్తిని పొందేందుకు దోహదపడింది. రాష్ట్రం వెలుపల రెంటల్ ప్రాపర్టీలను నిర్వహించడంలో సవాళ్లు ఎదురైనప్పటికీ, నున్లీ అంకితభావం ఫలించింది. తద్వారా అతను రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరపడేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత నున్లీ కాలిఫోర్నియాలోని లా పాల్మాలో మొదటి ఇంటిని కొన్నాడు. నున్లీ ఆర్థిక ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడుల కోసమే కేటాయించాడు. ఇలా ఆస్తులు కొనుగోలు చేస్తుండటంతో అధిక పెట్టుబడుల సంకల్పం సవాలుగా మారినప్పటికీ, నున్లీ తన టేక్-హోమ్ పేలో 35 శాతాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎదురుదెబ్బలే పాఠాలు పెట్టుబడులతో దూసుకెళ్తున్న నున్లీకి ఎదురుదెబ్బలూ తగిలాయి. 2021లో క్రిప్టోకరెన్సీలో మార్జిన్లో భారీగా పెట్టుబడి పెట్టినప్పుడు సుమారు 80,000 డాలర్లు నష్టపోయాడు. అయితే ఈ అనుభవం ఒక విలువైన పాఠంగా పనిచేసింది. దీర్ఘకాలిక పెట్టుబడులపై, ప్రత్యేకించి ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్లపై మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని అనుసరించేలా ప్రేరేపించింది. -
గుడ్‌న్యూస్: తక్కువ ధరకు 5 నెలల వ్యాలిడిటీ.. సూపర్ రీచార్జ్ ప్లాన్
తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీని అందించే సూపర్ రీచార్జ్ ప్లాన్ (Recharge Plan) ను ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తీసుకొచ్చింది. 150 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ. 397 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్ కొత్తది కాదు. ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ గతంలోనే అందించింది. అయితే ప్రస్తుతం పెట్టిన ప్లాన్‌లో మాత్రం కొన్ని ప్రయోజనాలు మారాయి. ఇంతకుముందు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు ఉండగా ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులకు తగ్గింది. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత ఫోన్ కాల్స్ వంటి ప్రయోజనాలు ఉన్నా ఇవన్నీ 30 రోజుల్లోనే ముగుస్తాయి. పాత ప్లాన్‌లో ఈ ప్రయోజనాలన్నీ 60 రోజులపాటు ఉండేవి. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: అతి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్.. నెలంతా అన్లిమిటెడ్! -
పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..
సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కటమే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వారిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మారణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహాత్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు. చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు 2. టీఎం బాబు (40) ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులివీ.. 1. క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్‌లో పరిధిలో జరిగిన కేసు 2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్ 3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు 3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్ 448, 427, 323, 324, రెడ్‌విత్ 34 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు 3. భాష్యం విశ్వనాథనాయుడు (45) మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు 1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155 సెక్షన్ల కింద రెండో కేసు 3. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నం.130–2022 , ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్‌విత్ 149 కింద కేసు 4. జి.దేవేంద్ర (31) ఊరు: గోపన్నగారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కేసు నమోదైంది. 5. లెక్కల ధనుంజయనాయుడు ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత కేసులు: రెండుకేసుల్లో నిందితుడు 1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 341, 506, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 కింద కేసు నమోదు 2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీ యాక్ట్ కింద కేసులు 6. ముల్లంగి వెంకటరమణ (52) ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత కేసులు: మూడు కేసుల్లో నిందితుడు 1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. ఇదే స్టేషన్ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు 3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్ విత్ 34 కింద మరో కేసు 7. నూకల నాగార్జున నాయుడు (33) ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు 1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటు సెక్షన్ 3 కింద ఈడీయాక్ట్ నమోదు 2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్ విత్, 149 3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507 4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్ విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ 6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్‌విత్ 149 8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55) ఊరు: రాయవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి 1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34 ఐపీసీ 9. నాగిశెట్టి నాగరాజ (38) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు 1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149తో పాటు సెక్షన్ 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ. 4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ. 5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్పీసీ 10. కె.సహదేవుడు (50) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 331–2020 సీఆర్పీసీ 151 3. క్రైం.నం. 365–2020 సీఆర్పీసీ 151 4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్ విత్ 34 5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్ 151 6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్‌విత్ 149 8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153 11. ఉయ్యాల రమణ (44) ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్ 353, 341 రెడ్ విత్ 34 2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్‌విత్ 34 6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 ఏ ఒక్కర్నీ వదలం పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
ప్లాన్ A కుదరకపోతే..పుంగనూరును వల్లకాడు చేసేలా ప్లాన్ B
-
తెలంగాణలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై బీజేపీ నేతల కసరత్తు... ఇంకా ఇతర అప్డేట్స్
-
Bruce Lee Workout Plan: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్..
బ్రూస్ లీ.. ఈ పేరు విననివారు ఎవరూ ఉండరు. మార్షల్ ఆర్ట్స్ అనగానే ఎవరికైనా టక్కున బ్రూస్ లీ పేరు గుర్తుకు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పటి వరకూ బ్రూస్లీ పేరును పడగొట్టే మొనగాడెవడూ లేడంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్లో బ్రూస్ లీ గురించి వెదుకులాట.. తన 32 ఏళ్ల జీవితంలో బ్రూస్ లీ అద్భుత ప్రతిభతలో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచమంతా బ్రూస్ లీని ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తుంది. బ్రూస్ లీ 1940లో ఫ్రాన్సిస్కోలో జన్మించారు. నేటి కాలంలోనూ ఇంటర్నెట్లో బ్రూస్ లీకి సంబంధించిన అనేక విషయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే లెక్కకు మించిన నెటిజన్లు తరచూ బ్రూస్ లీ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు. ఇటీవల బ్రూస్ లీకి సంబంధించిన 1965 నాటి వర్క్అవుట్ ప్లాన్ వైరల్‌గా మారింది. Bruce Lee early Training plan in 1965. pic.twitter.com/H1uLj49NFK — World Of History (@UmarBzv) May 17, 2023 బ్రూస్ లీ వర్క్అవుట్ ఇలా.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్ కెవుంగ్ జిమ్నాషియంతో ముడిపడివుంది. దీనిలో అతను ఏ వర్క్అవుట్ ఎన్నిసార్లు, ఎంతసేపు చేసేవాడనే వివరాలు ఉన్నాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారు ఈ రొటీన్‌ను ఫాలో చేయడం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. ట్వీట్ చేసిన ఈ పోస్టులో బ్రూస్ లీకి సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో కనిపిస్తోంది. అతని ట్రైనింగ్ ప్రోగ్రాం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో కనిపిస్తోంది. ఈ ప్లాన్ చూసిన వారంతా.. ట్విట్టర్‌పై ఈ పోస్టును ‘వరల్డ్ ఆఫ్ హిస్టరీ’(@UmarBzv) పేరు గల పేజీలో షేర్ చేశారు. దానికి 1965లో బ్రూస్ లీ ఎర్లీ ట్రైనింగ్ ప్లాన్ అనే కామెంట్ రాశారు. ఈ పోస్టుకు 8 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కాయి. 70 వేలకుపైగా లైక్స్ పడ్డాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతూ, దీనిని ఫాలో చేయడం అసాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్‌ను పరిశీలించి ఈ ప్లాన్ పూర్తి చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని లెక్కవేశారు. ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే.. -
ఎల్ఐసీ కొత్త ప్లాన్.. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపు కూడా
ముంబై: బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన వృద్ధి’ పేరుతో క్లోజ్ ఎండెడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్లాన్‌ను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. పొదుపుతో కూడిన సింగిల్ ప్రీమియం ప్లాన్. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపును ఆఫర్ చేస్తుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే కుటుంబానికి పరిహారం అందిస్తుంది. గడువు ముగిసే వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ మొత్తం తిరిగి వస్తుంది. ఈ ప్లాన్‌లో రెండు రకాల బీమా ఆప్షన్లు ఉన్నాయి. మరణ పరిహారం చెల్లించే ప్రీమియానికి 1.25 రెట్లు లేదంటే పది రెట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 10, 15, 18 ఏళ్ల కాల వ్యవధిపై తీసుకోవచ్చు. కనీసం రూ.1,25,000 బీమా నుంచి ఎంత మొత్తమైనా ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి పాలసీ సంవత్సరం ముగిసిన తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ గ్యారంటీడ్ అడిషన్ అనేది మొదటి ఆప్షన్లో ప్రతి రూ.1,000 సమ్ అష్యూర్డ్‌పై రూ.60–75 మధ్య, రెండో ఆప్షన్లో రూ.25–40 మధ్య ఉంటుంది. ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీ లేదా మరణ పరిహారాన్ని కావాలంటే వాయిదాల పద్ధతిలోనూ తీసుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంటుంది. -
శిక్షణ విమానం క్రాష్ ల్యాండింగ్
కర్ణాటక: సాంకేతిక లోపం కారణంగా శిక్షణ విమానం అత్యవసరంగా దిగింది. ఈ సంఘటన బెళగావిలో జరిగింది. ఇద్దరు పైలట్లతో కలిసి బెళగావి సాంబ్రా విమానాశ్రయం నుంచి రెడ్‌బర్డ్ ఫ్లయింగ్ అకాడమీకి చెందిన చిన్నపాటి శిక్షణ విమానం మంగళవారం ఉదయం 9:30 గంటలకు టేకాఫ్ అయ్యింది. 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక మారిహళ సమీపంలో సాంకేతి లోపం తలెత్తింది. వెంటనే హొన్నిహళ సమీపంలోని రోడ్డు పక్కనున్న పొలంలో క్రాష్ ల్యాండింగ్ చేశారు. విమానం వేగంగా నేలను తాకడం వల్ల ముందు చక్రాలు, రెక్కలు ధ్వంసమయ్యాయి. ఓ పైలట్‌కు మాత్రం చిన్న గాయాలయ్యాయి. పైలట్‌ను వాయుసేన ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. మారిహళ పోలీసులు, పెద్దసంఖ్యలో జనం విమానం వద్దకు చేరుకున్నారు. -
బీజేపీని మట్టికరిపించేలా 'వన్ ఆన్ వన్ వ్యూహం'!
కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయాన్ని కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా విపక్షాలన్ని ఏకతాటి పైకి వచ్చి బీజేపీని ఎదుర్కొనేలా పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ పాటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను ముందుగానే కాంగ్రెస్‌కి మద్దతిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ అనూహ్యమైన యూటర్న్ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో జరిగిన సమావేశం అనంతరమే దీదీ(మమతా) ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనతాదళ్ పార్టీ సీనియర్‌నాయకుడు కేసీ త్యాగి చెప్పారు. ఆయన మమతకు విపక్షాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యేలా ఐక్య సూత్రం 'వన్ ఆన్ వన్' వ్యూహం గురించి తెలియజేసిన తర్వాతే ఆమె ఇలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిజానికి మమత 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని అనుకున్నారని చెప్పారు. నితీష్‌తో జరిగిన సమావేశం అనతరం ఈ వ్యూహానికి సానుకూలంగా స్పందించినట్లు త్యాగి తెలిపారు. ఈ మేరకు మమతా బలమైన పార్టీలన్నీ 2024 ఎన్నికలకు బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కొవడం కోసం ఒంటిరి ఉండాలని అన్నారు. నితీష్ కుమార్ వ్యహాన్ని అంగీకరిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒకరిపై ఒకరు అభ్యర్థులను నిలబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రతిగా ప్రతిక్ష పోటీలో ఉన్న జాతీయ పార్టీల్లో 200 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మదతివ్వాలని చెప్పారు అలాగే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ పోరాడదు. అందుకు ఉదహారణ కర్ణాటకలో కాంగ్రెస్ విజయమే. ప్రజలు దౌర్జన్యాలను వ్యతిరేకిస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కులు బుల్డోజర్ చేయబడుతున్నాయి. అని బెనర్జీ అన్నారు. ఎక్కడైన బలంగా ఉన్నవారి ప్రాంతంలో వారి కలిసి పోరాడాలి. ఉదహారణకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్, ఢిల్లీలో ఆప్, బిహార్‌లో నితీష్ కుమార్, తేజస్వీయ యాదవ్ వాళ్లు పోరాడలి, అలాగే తమిళనాడుతలో ఎంకే స్టాలిన్ పోరాడాలన్నారు. బలమైన పార్టీకీ మన ప్రాధాన్యత ఇవ్వాలి. కాంగ్రెస్‌కు 200 సీట్లు వచ్చి బలంగా ఉంటే పోరాడనివ్వండని, అందుకు మద్దతిస్తాం అని మమతా చెప్పారు. అంతేగాదు మనం బీజేపిని ఓడించిలే మంచి జరగాలంటే కొన్ని ప్రాంతాలలో మనల్ని మనం త్యాగం చేసుకోక తప్పదని బెనర్జీ అభిప్రాయపడ్డారు. (చదవండి: భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి..) -
పథకం ప్రకారమే లయస్మిత హత్య ?
సాక్షి, యశవంతపుర: బెంగళూరు ఉత్తర తాలూకా రాజనకుంట ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థిని లయస్మితను పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో పాటు సొంత అత్త కూతురు కావడంతో పవన్ ఆమె పేరును తన హృదయంపై ట్యాటూ వేసుకున్నాడు. ఎఫ్బీ, ఇన్‌స్టాలో స్మిత ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడు. హత్యకు గంట ముందు సోషల్ మీడియాలో అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోలను డిలిట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె హత్యకు గురైందని మృతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పవన్ కోలుకోగానే విచారణ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. గ్రామస్తులతో విద్యార్థుల గొడవలు రాజనకుంట సమీపంలోని దిబ్బూరు వద్దనున్న ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులతో స్థానిక గ్రామస్థులు ఇబ్బందు పడుతున్నారు. రోజూ విద్యార్థులు మద్యం తాగి గ్రామస్తులతో గొడవలు పడుతున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని దిబ్బూరు చుట్టు పక్కల గ్రామస్తులు బెంగళూరు గ్రామీణ ఎస్పీ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. గురువారం ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానిక పోలీసుల పనితీరు సరిగా లేదంటూ వినతిపత్రంలో ఆరోపించారు. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
పొలిటికల్ కారిడార్: బండి సంజయ్ ను మెచ్చుకున్న జేపీ నడ్డా
-
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?
సాక్షి, ముంబై: దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. తన నెలవారీ రీచార్జ్ ప్లాన్ ఏకంగా 57 శాతం పెంచేసింది. తన కనీస రీఛార్జ్ ధర 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ ధరను సుమారు 57 శాతం పెంచి రూ. 155కి పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్! కంపెనీ వెబ్సైట్ ప్రకారం కంపెనీ రూ.99 కనీస రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది. ఇప్పుడు అపరిమిత కాలింగ్, 1 జీబీ డేటా, 300 SMSలతో రూ.155 ప్లాన్‌ను ప్రారంభించింది. అయితే ఈ ప్లాన్ హరియాణా, ఒడిశాలకు పరిమితమైన ఈ కొత్త ప్లాన్‌ను మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు చేయనుందనే ఆందోళన యూజర్లలో నెలకొంది. అటు తొలుత ట్రయల్‌గా లాంచ్ చేసిన ఈ ప్లాన్‌ను భారతదేశం అంతటా విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో, 2021లో ఎంపిక చేసిన సర్కిల్‌లలో కనీస రీఛార్జ్ ఆఫర్‌ను రూ.79 నుండి రూ.99కి పెంచినప్పుడు కంపెనీ ఇదే తరహా విధమైన కసరత్తు (మార్కెట్-టెస్టింగ్) చేసిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఇది చదవండి: ‘రస్నా’ ఫౌండర్ కన్నుమూత, ‘మిస్ యూ’ అంటున్న అభిమానులు -
ఢిల్లీలో ఏం చేస్తున్నారు?.. తెలంగాణ కాషాయదళం యాక్షన్ ప్లాన్ ఏంటీ?
భారతీయ జనతా పార్టీ తెలంగాణ కీలక నేతలు ఢిల్లీ చేరారు. హస్తిన నుంచే ఏదో కొత్త ఆపరేషన్ మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ హస్తినాపురానికి వెళ్లిన నేతలు కొన్ని కీలక అంశాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొన్ని కీలక అంశాల్లో అధిష్టానం వీరికి దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. కారు నుంచి దించాలి.. కమలంలో చేర్చాలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సిట్టింగులకే సీట్లు అని స్పష్టం చేశారు. దీంతో గులాబీ పార్టీలోని అసమ్మతి నేతలు, ఆశావహులు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని కాషాయ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని మునుగోడుతో తేలిపోవడంతో ఆ నేతలు కూడా కాషాయ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు చర్చించుకుంటున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు దాటింది. తాజాగా బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో ఎదో చేస్తున్నారనే ప్రచారం మాత్రం సాగుతోంది. హస్తిన నుంచే ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఉంటే ఇంటెలిజెన్స్ ఇబ్బందుల కారణంగా, ఆ రాడార్ పరిధికి దూరంగా ఉండి జాయినింగ్స్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హస్తిన నుంచే హస్తానికి షాక్ తెలంగాణలో కాంగ్రెస్‌ను మరింత బలహీనపరచాలని బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలను అదునుగా తీసుకుని బలమైన నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడంపై కాషాయదళం కసరత్తు చేస్తోంది. రేవంత్ రెడ్డి తీరు నచ్చనివారు, కాంగ్రెస్‌లో భవిష్యత్ లేదని భావిస్తున్న బలమైన నేతలను కమలం పార్టీ క్యాష్ చేయాలనుకుంటోంది. ఇప్పటికే మర్రి శశిధర్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆయన తాను ఢిల్లీకి వెళ్లడం కొత్తేంకాదని క్లారిటీ ఇచ్చుకున్నా సమయం చూసి కాషాయతీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఢిల్లీ వేదికగా ఈటల చేపడుతన్న ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది భవిష్యత్ లో తేలనుంది. ఢిల్లీకి కావాల్సింది రిజల్ట్సే మునుగోడు ఉప ఎన్నికల ఓటమి బాధ నుంచి బీజేపీ శ్రేణులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఓటు బ్యాంకు పెరిగిందని పైకి సంబురపడుతున్నా లోలోన మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ను ఢీకొట్టడం అంత ఈజీ కాదనే భావనలో ఉంది. దీనిపై అధిష్టానం కూడా కాస్త సీరియస్ గానే ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీంతో రాష్ట్ర బీజేపీ అలర్ట్ అయింది. నేతలు యాక్షన్ లోకి దిగి చేరికలపై దృష్టి సారిస్తున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఉత్తరాదిన జై కిసాన్.. పక్కా ప్లాన్ రెడీ చేసుకున్న సీఎం కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో ప్రవేశానికి కొంతకాలంగా పునాది వేసుకుంటూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులతో రెండురోజుల పాటు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వారితో విస్తృతంగా చర్చలు జరపడంతో పాటు తెలంగాణ వ్యవసాయ విధానాన్ని వివరించిన కేసీఆర్.. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సదస్సులు నిర్వహించడం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని రైతు సంఘాలు, భావసారూప్య రాజకీయ పార్టీలకు సదస్సుల్లో భాగస్వామ్యం కల్పించాలనే యోచనలో ఉన్నారు. చెక్కులు పంపిణీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు గత మే నెలలో చండీగఢ్‌లో బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఇదే తరహాలో త్వరలో ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే రైతు సదస్సుల్లోనూ పరిహారం చెక్కులను అందజేయనున్నారు. అదే సమయంలో తెలంగాణ వ్యవసాయ విధానాన్ని వివరిస్తారు. రైతు సదస్సుల నిర్వహణ, షెడ్యూల్ ఖరారు, రైతు సంఘాలతో సమన్వయ బాధ్యతలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. జాతీయ పార్టీపై ఆచితూచి.. వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, గతంలో ప్రకటించిన తరహాలో కాకుండా జాతీయ పార్టీ ఏర్పాటుపై కొంత ఆచితూచి వ్యవహరించాలనే ధోరణిలో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలు, నేతలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే కేసీఆర్ బుధవారం బిహార్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. వాస్తవానికి మే 29, 30 తేదీల్లోనే బిహార్, పశ్చిమ బెంగాల్ పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించిన సీఎం.. చివరి నిమిషంలో రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీల ముఖ్యమంత్రులు, నేతలతో త్వరలో జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బిహార్ సీఎం నితీష్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో జరిగే భేటీలో జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ తీరుతో పాటు ఈ సదస్సు నిర్వహణపై చర్చించే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో సదస్సు ఉండే అవకాశమున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీ దూకుడును అడ్డుకునేలా.. ఇక రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ, టీఆర్ఎస్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంపై కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగానే ఈ నెల 3న రాష్ట్ర కేబినెట్ భేటీ, సాయంత్రం పార్టీ శాసనసభ, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవన సముదాయాలు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్.. సెప్టెంబర్ 5న నిజామాబాద్, 10న జగిత్యాల కలెక్టరేట్లు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించనున్నారు. మరోవైపు 12వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ధరణి, పోడు భూముల సమస్య, ఉపాధ్యాయుల పదోన్నతులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలు ఈ నెల 3న జరిగే కేబినెట్ భేటీ ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముందని సమాచారం. మళ్లీ రెవెన్యూ సదస్సులు ధరణి సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రకటించిన రెవెన్యూ సదస్సులు వరుస వర్షాలతో వాయిదా పడిన నేపథ్యంలో వాటిని తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. 3న జరిగే కేబినెట్ భేటీలో ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. రెవెన్యూ సదస్సుల్లో ఎమ్మెల్యేలు క్రియాశీల భాగస్వాములు కావాలని 3న వారితో జరిగే భేటీలో సీఎం ఆదేశించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు వంటి అంశాలు కూడా చర్చిస్తారు. మొత్తం మీద తాను జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించకుండా, రాష్ట్రంలోనే కట్టడి చేయాలనే బీజేపీ వ్యూహాన్ని సమర్ధంగా తిప్పికొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను గాడిన పెట్టడం, జాతీయ రాజకీయాలపై పట్టు సాధించడంపై ముఖ్యమంత్రి సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాదిలో బీజేపీ ప్రభావమున్న ఏవైనా ఐదు రాష్ట్రాల్లో అక్టోబర్, నవంబర్ మాసాల్లో రైతు సదస్సులు జరిగే అవకాశం ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాలు కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరిగే గుజరాత్‌లోనూ ఈ తరహా సదస్సును నిర్వహించాలనే యోచనలో ఆయన ఉన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ, ఆసరా వంటి సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ రైతు సదస్సుల ప్రధాన ఎజెండాగా ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
భారత్‌పై రివైంజ్ కోసమే ఆత్మాహుతి దాడి ప్లాన్
భారత్‌లో కీలక నేతపై దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ప్లాన్ చేస్తున్నట్లు రష్యా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రష్యా బలగాల అదుపులో ఉన్న ఐఎస్ ఉగ్రవాది తామెందుకు ఈ ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశామో ఒక వీడియోలో వివరించాడు. ప్రవక్తను అవమానించినందుకు గానూ ప్రతికారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దాడికి ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు భారతదేశ పాలక వర్గాలకు చెందిన ప్రతినిధుల్లో ఒకరిపై దాడి చేసేందుకు పథకం రచించినట్లు తెలిపాడు. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వ్యక్తిగా రష్యా పేర్కొంది. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు టర్కీలో ఉన్నట్లు వెల్లడించింది. అక్కడ అతన్ని ఐఎస్ నాయకులలో ఒకరు ఆత్మాహుతి బాంబర్‌గా నియమించారని, ఇస్తాంబుల్‌లోని వ్యక్తిగత సమావేశాల్లో అతన్ని రిమోట్‌గా ప్రాసెస్ చేస్తారని తెలిపింది. ఈ మేరకు ఆ ఉగ్రవాదిని రష్యాలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) నిషేధించిన ఐఎస్ ఉగ్రవాది సభ్యుడిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. సూసైడ్ బాంబర్ అరెస్ట్!) -
సంచలనం: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు ప్లాన్
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు జరిగిన కుట్ర జరిగింది. ఈ హత్యకు పాల్పడాలని అనుకుంది ఎవరో కాదు.. యువ నటుడు ర్యాన్ గ్రాంథమ్(24). తల్లి హత్యకేసులో నిందితుడిగా కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ర్యాన్ గ్రాంథమ్.. ఈ సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రివర్‌డేల్’, ‘డెయిరీ ఆఫ్ ఏ వింపీ కిడ్’ ఫేమ్ ర్యాన్ గ్రాంథమ్.. కెనడా ప్రధాని ట్రూడో హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. 2020 మార్చి 31వ తేదీన స్క్వామిష్ టౌన్హౌజ్లో తన ఇంట్లో తల్లి బార్బరాను తల వెనుక భాగంలో తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కేసు బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తల్లిని హత్య చేసిన తర్వాత.. తన కారులో ఆయుధాలను, మందు గుండును, మ్యాప్ సాయంతో కెనడా రిడ్యూ కాటేజ్ వైపు బయలుదేరాడు గ్రాంథమ్. అక్కడే ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో ఉంటున్నారు. ఈ విషయాన్ని పోలీసుల స్టేట్మెంట్లో గ్రాంథమ్ నిర్ధారించాడు కూడా. ఇదిలా ఉంటే.. గ్రాంథమ్ మానసిక స్థితి బాగోలేదని, చాలా కాలంగా డిప్రెషనలో ఉన్నాడని, ప్రధాని నివాసంలో తాను సృష్టించాలనుకున్న నరమేధం తాలుకా ట్రయల్స్‌లో భాగంగానే.. తల్లిని హతమార్చి ఉంటాడని ప్రాసెక్యూటర్ డోన్నెల్లీ కోర్టుకు వెల్లడించారు. అయితే తాను వాన్కోవర్ పోలీసులకు లొంగిపోవాలనే వెళ్లినట్లు నిందితుడి తరపున ప్రాసిక్యూటర్ వాదించారు. రివర్డేల్లోనూ ర్యాన్ పాత్ర ‘కిల్లర్’ కావడం గమనార్హం. -
ఏపీ: ఖరీఫ్‌కు సన్నద్ధం
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి ఖరీఫ్–2022 సీజన్ మొదలు కానుంది. మే నుంచే రైతులు సేద్యపు పనులు ప్రారంభించనున్నారు. జూన్ నుంచి సెపె్టంబర్ మధ్య నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలకు పంటలు సాగులోకి రానున్నాయి.æ ప్రణాళిక, వ్యవసాయశాఖ అంచనా మేరకు ఈ ఖరీఫ్‌లో శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల పరిధిలో 6,52,741 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేయనున్నారు. అనంతపురం జిల్లాలో 3,76,810 హెక్టార్లు సాగు అంచనా వేశారు. 2,43,578 హెక్టార్లలో వేరుశనగ జిల్లాలో ప్రధానపంట వేరుశనగ 2,43,578 హెక్టార్లలో సాగవనుంది. ఇందులో గుంతకల్లు మండలంలో అత్యధికంగా 15 వేల హెక్టార్లు, వజ్రకరూరు, కళ్యాణదుర్గంలో 14 వేల హెక్టార్లు, కూడేరు, గుత్తిలో 13 వేల హెక్టార్లు, రాయదుర్గం, బ్రహ్మసముద్రం, కుందురి్ప, ఉరవకొండ, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట మండలాల్లో 10 వేల హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో వేరుశనగ వేయనున్నారు. తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో మాత్రమే వెయ్యి హెక్టార్లలోపు సాగు చేసే పరిస్థితి నెలకొంది. ట పెద్దవడుగూరు మండలంలో పత్తి ఏకంగా 16 వేల హెక్టార్లు సాగు అంచనా వేశారు. ఆ తర్వాత పామిడి, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు, గుత్తి, వజ్రకరూరు, విడపనకల్లు, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, బొమ్మనహాళ్, శింగనమల మండలాల్లో పత్తి సాగులోకి రానుంది. టపుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి, రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉంటుంది. ట ఆత్మకూరు, కూడేరు, గుంతకల్లు, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, గార్లదిన్నె మండలాల్లో ఆముదం పంట ఎక్కువగా సాగు చేయనున్నారు. ట గార్లదిన్నె, ఆత్మకూరు, కూడేరు, గుంతకల్లు, గుత్తి, రాప్తాడు, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో కంది అధికంగా సాగులోకి రావచ్చని అంచనా వేశారు. ఆర్బీకే ద్వారా విత్తనాలు, ఎరువులు ఖరీఫ్ సమీపిస్తుండటంతో రైతులకు ఇబ్బంది లేకుండా విత్తన వేరుశనగ, కంది తదితర విత్తనాల సేకరణ, అవసరమైన ఎరువుల సరఫరాపై వ్యవసాయశాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆర్బీకే వేదికగానే రైతులకు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) బి.చంద్రానాయక్ తెలిపారు. ఇది కూడా చదవండి: వైద్య శాఖలో బయోమెట్రిక్ తప్పనిసరి -
పేదలకు అత్యాధునిక వైద్యం: మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: ఎయిమ్స్ తరహాలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)పేరిట నగరం నలుదిక్కులా ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఆసుపత్రుల్లో మూడింటికి సీఎం కేసీఆర్ మంగళవారం భూమి పూజ చేయనున్నారు. బొల్లారం, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లలో రూ.2,679 కోట్ల వ్యయంతో ప్రభుత్వం వీటిని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బొల్లారంలో ఆసుపత్రి నిర్మించనున్న స్థలంతోపాటు, సభాస్థలి ఏర్పాట్లను ఆదివారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పరిశీలించారు. పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు చేపడుతున్న మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని హరీశ్‌రావు చెప్పారు. వీటితో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య కూడా మరింత బలోపేతమవుతుందన్నారు. రూ.897 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బొల్లారం ఆసుపత్రితో మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, కంటోన్మెంట్ ప్రజలకు సకాలంలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయన్నారు. -
రైతుల కోసం అగ్రిల్యాబ్స్:సీఎం జగన్
-
నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ►ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నాం ► సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నాం ► రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయి ► గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్ చేస్తున్నాం ► వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య: ►గ్రామీణనియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం ► ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం ►గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు.. ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం ►పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం ► దీనికి నాబార్డు సహాయ సహకారాలు కావాలి ► రైతులు చేస్తున్న ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఈ కార్యక్రమాలన్నీ ►సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం ►పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం ►ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు ►దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశించాను ►ఫుడ్ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం ► ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తాం ►వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధిచేస్తాం ►వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం ►16 కొత్త మెడికల్‌కాలేజీలను నిర్మిస్తున్నాం ►ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం ►స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం ►నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం ►ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాం.. ► పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించాం ►భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ నరులుగా అభివృద్ధి చెందుతారు ►గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని... దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు ►అందుకనే నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం ►ఫ్లోరోసిస్ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ►వీరికి రక్షిత తాగునీటి అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం ►మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ►ఇలాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రంలో హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పే పనులు ప్రారంభం అయ్యాయి ►రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ప్రభుత్వం దృష్టిపెట్టింది ►ఎంపిక చేసిన ఈప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం చదవండి: గోదావరి గట్టెక్కింది -
భారత్‌పై దావూద్ ఇబ్రహీం మళ్లీ గురి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్లీ భారత్‌పై గురిపెట్టాడా? ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడా? ఈ ప్రశ్నలకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అవుననే సమాధానం చెబుతోంది. భారత్‌లో భీకర దాడులతో అల్లకల్లోలం సృష్టించేందుకు దావూద్ ఓ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ బహిర్గతం చేయడం సంచలనాత్మకంగా మారింది. ‘ఇండియాటుడే’ కథనం ప్రకారం.. దావూద్‌పై ఎన్ఐఏ ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో విరుచుకుపడేందుకు దావూద్ ముఠా ప్రణాళిక రూపొందించిందని ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. ఢిల్లీ, ముంబై నగరాలపై దావూద్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఎన్ఐఆర్ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో దావూద్ ఇబ్రహీంతోపాటు అతడి అనుచరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవలే మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. -
ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపిన భార్య
సాక్షి, కెలమంగలం (కర్ణాటక): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియునితో కలిసి హతమార్చిన భార్యను డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రూప, తంగమణి. వివరాలు.. డెంకణీకోట సమీపంలోని ఉణిసెట్టి గ్రామానికి చెందిన అయ్యప్ప (37) టెంపో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రూప (25). వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అయ్యప్ప బంధువు తంగమణి (20) జవుళగిరి సమీపంలోని మంచుగిరి గ్రామంలో ఉండగా, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల క్రితం ఇద్దరూ ఇళ్లలో నుంచి వెళ్లిపోయారు. 10 రోజుల క్రితం బంధువులు వారిని పట్టుకుని ఎవరి ఇళ్లకు వారి పంపారు. మర్యాద పోయిందని అయ్యప్ప రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినా బయటపడ్డాడు. ఇదే అదనుగా రూప, తంగమణితో కలిసి భర్తను చంపాలనుకుంది. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అయ్యప్పను ఇద్దరూ కలిసి గొంతు పిసికి చంపారు. ఉదయాన్నే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని రూప విలపించసాగింది. డెంకణీకోట పోలీసులు అనుమానంతో రూప, తంగమణిలను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఇరువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తండ్రి హత్య, తల్లి జైలుకు పోవడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు. -
సుపరిపాలనను ప్రతిబింబించాలి
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం సుపరిపాలనకు తగ్గట్టుగా ఉండాలని.. పరిశుభ్రంగా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వరద నీటి, డ్రైనేజీ వ్యవస్థలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ముందుగా విధించుకున్న గడువులోగా మొత్తం పనులు పూర్తిచేసి, సచివాలయ భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. కాంక్రీట్ నిర్మాణ పనులు పూర్తయ్యేలోగానే.. తర్వాత అవసరం పడే దర్వాజాలు, కిటికీలు, ఫర్నిచర్, విద్యుత్, ప్లంబింగ్, టైల్స్ వంటి సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. దీనివల్ల జాప్యాన్ని నివారించవచ్చని చెప్పారు. సచివాలయ ముఖద్వారం, బయటి గేటు పనులు, వాటికి అమర్చాల్సిన గ్రిల్స్ తదితరాలకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. మంత్రులు, సీఎస్ సహా ఇతర అధికారుల కార్యాలయాలు ఉండే ఏరియాలు, విదేశీ ప్రతినిధులు, ప్రముఖుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ హాల్ పనులను తనిఖీ చేశారు. పార్కింగ్, హెలిప్యాడ్ గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ఏర్పాటు చేసే వసతులపై ప్రశ్నించారు. బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రౌండ్ ఫ్లోర్ పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో పైఅంతస్తుల పనులపై కచ్చితమైన ప్రణాళిక, వర్క్‌చార్టు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని హంగులతో.. ప్రజల వద్దకే పాలన ఫలాలు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగా అన్ని హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక పాలన సాగుతోందని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ అద్భుత పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా సుపరిపాలన సాగుతున్న క్రమంలో అందుకు తగ్గట్టు సచివాలయ భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నామన్నారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రేగా కాంతారావు, అంజయ్య యాదవ్, కృష్ణమోహన్‌రెడ్డి, హన్మంత్ షిండే, రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. -
'సినిమా చూస్తున్నంతసేపు..కనీసం మొభైల్ కూడా చూడరు'
హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్లాన్ బి’. ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎవిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ "ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో సాగె కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠంగా ఉంటుంది. మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాము" అని తెలిపారు. నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ "మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తీ అయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని, కథ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. 'ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఈ సినిమా విడుదల కి ముందే మా దర్శకుడికి మరో రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి, అభినవ్ సర్దార్, చిత్రం శీను, షాని, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. -
టాటా గ్రూప్ నుంచి ఇలా విడిపోతాం..!
సాక్షి, ముంబై: టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని బోర్డ్ తొలగించిన 2016 అక్టోబర్ 28 తర్వాత మిస్త్రీలు-టాటాల మధ్య న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి సంగతి తెలిసిందే. ‘‘టాటా సన్స్ అనేది రెండు గ్రూపులు కలిసిన కంపెనీ. టాటా గ్రూప్‌లో టాటా ట్రస్టులు, టాటా కుటుంబ సభ్యులు, టాటా కంపెనీలు ఉన్నాయి. వీరికి 81.6 శాతం వాటా ఉంది. ఇక 18.37 శాతం వాటా మిస్త్రీల కుటుంబానికి ఉంది’’ అని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసినట్లు షాపూర్జీ పలోంజీ గ్రూప్ ప్రకటన పేర్కొంది. (టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా) ప్రకటన ప్రకారం... విడిపోవడానికి సంబంధించిన ప్రణాళిక ఇలా: ప్రో-రేటా స్ప్లిట్ ఆఫ్ లిస్టెడ్ అసెట్స్ (షేర్ ధరల విలువ ప్రాతిపదిక) ప్రో-రేటా షేర్ ఆఫ్ ఆఫ్ ది బ్రాండ్ (ఇప్పటికే టాటాలు పబ్లిష్ చేసిన బ్రాండ్ విలువ ప్రాతిపదికన) నికర రుణాలు సర్దుబాటు చేసిన అన్‌లిస్టెడ్ అసెట్స్‌కు సంబంధించి తటస్థంగా ఉండే థర్డ్ పార్టీ వ్యాల్యూషన్ ప్రకారం... టాటా సన్స్ ప్రస్తుతం వాటా కలిగిన లిస్టయిన టాటా సంస్థల్లో ప్రో–రేటా షేర్ల ప్రాతిపదికన నాన్-క్యాష్ సెటిల్మెంట్ జరగాలని ఎస్పీ గ్రూప్ కోరుతోంది. ఉదాహరణకు టీసీఎస్‌లో టాటాలకు 72 శాతం వాటా ఉంటే (టాటా సన్స్‌లో 18.37 శాతం ఎస్పీ గ్రూప్ యాజమాన్యం ప్రాతిపతికన) ఇందులో 13.22 శాతం ఎస్పీ గ్రూప్‌కు దక్కాల్సి ఉంటుంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.1,35,000 కోట్లు. నికర రుణానికి సంబంధించి సర్దుబాటు చేసిన బ్రాండ్ వ్యాల్యూ ప్రో–రేటా షేర్‌ను నగదు లేదా లిస్టెడ్ సెక్యూరిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అన్‌లిస్టెడ్ కంపెనీల విషయానికి వస్తే, ఇరు పార్టీలకూ సమ్మతమైన వ్యాల్యూయేటర్లు వీటి విలువను నిర్ధారిస్తారు. దీనిని కూడా నగదు లేదా లిస్టెడ్ సెక్యూరిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చు. -
కేటీఎం 390 బైక్ : కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ ఆటో బైక్ లవర్స్ కోసం కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. తన అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌పై ఈ కొత్త ఫైనాన్స్ పథకాన్ని అందిస్తోంది. కేటీఎం 390 బైక్ కేటీఎం 390 అడ్వెంచర్ బైక్‌ను సులువైన ఈఎంఐల ద్వారా కొనుగోలుచేసే అవకాశాన్ని తాజాగా కల్పిస్తోంది. ఆన్-రోడ్ ధర మీద 80 శాతం ఫైనాన్స్ సదుపాయాన్నిఅందిస్తోంది. తద్వారా మరింతమంది వినియోగదారులకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నట్టు బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు భాగస్వామ్యంతో ఈ ఫైనాన్స్ పథకాన్ని అందస్తున్నట్టు తెలిపింది. తాజా నిర్ణయంతో ఈ బైక్‌ను 6,999 రూపాయల సులభ వాయిదాలతో కొనుగోలు దారులు ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా చాలామంది కస్టమర్లు అప్గ్రేడయ్యే అవకాశం కల్పిస్తున్నామని బజాజ్ ఆటోలిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ అన్నారు. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా వినియోగదారులు 95 శాతం వరకు ఫైనాన్స్ కవరేజ్, తక్కువ వడ్డీరేట్లు, హెచ్ఢీఎఫ్సీనుంచి ఇతర ఫైనాన్స్ ఆఫర్లను కూడా పొందవచ్చని తెలిపారు. అలాగే ఆసక్తికరమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను కేటీఎం డీలర్ల వద్ద లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో ప్రారంభించిన కేటీఎం 390 ధర (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) 3.04 లక్షల రూపాయలు. ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్‌లో బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉంది. కాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 38,267 యూనిట్లతో పోలిస్తే ఏప్రిల్-జూన్ నెలల్లో 33,220 కేటీఎం బైక్‌ల అమ్మకాలను నమోదు చేసింది. -
కరోనా : బీఎస్ఎన్ఎల్, నెల రోజులు ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్ననేపథ్యంలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల సౌలభ్యం కోసం ఒక ఆఫర్‌ను తీసుకొచ్చింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఇంటినుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ లైన్ వినియోగదారులకోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 'వర్క్ ఫ్రమ్ హోమ్' ను బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. ప్రమోషనల్ ఆఫర్ తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో ల్యాండ్‌లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజులు పాటు ఈ సేవలను అందించనుంది. ప్రమోషనల్ వ్యవధి ముగిసిన తరువాత, పై ప్లాన్ కింద ఉన్న కస్టమర్లు వారి ఉపయోగాల ప్రకారం సాధారణ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మరలతారని బీఎస్ఎన్ఎల్ తన సర్క్యులర్‌లో తెలిపింది. ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్ఎస్ డౌన్ స్పీడ్‌ను, రోజుకు 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉండి, బ్రాడ్‌బ్యాండ్ లేని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ బ్రాడ్‌బ్యాండ్ సేవను ఒక నెల ఉచితంగా అందిస్తున్నామని, తద్వారా వారు ఈ సేవను ఇంటి నుండి పని చేయడానికి, ఇంటి నుండే విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సిఎఫ్ఎ వివేక్ బంజాల్ చెప్పారు. ఇంటి నుండే కిరాణాను ఆన్లైన్లో కొనుగోలు, లేదా అవసరమైన అవసరాల నిమిత్తం బయటికి వెళ్లవలసిన అవసరాన్ని తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా ల్యాండ్‌లైన్ వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులుగా మార్చడంలో ఈ సరికొత్త ప్లాన్ సహాయపడుతుందని అంచనా. ముఖ్యంగా ప్రధాన పోటీదారులు, ఎయిర్టెల్, జియోతోపాటు, ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లతో బాగా పోటీ పడటానికి సహాయపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
యస్ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ
సాక్షి, ముంబై : యస్ బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పునర్నిర్మాణ చర్యల్ని ఆర్బీఐ, కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆర్బీఐ ప్రతిపాదించిన బ్యాంకు రికన్స్ట్రక్షన్ స్కీమునకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. యస్ బ్యాంకు షేరు రూ.10 చొప్పున 725 కోట్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడులకు ఎస్బీఐ నిర్ణయించింది. అలాగే ప్రైవేటుబ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ కూడా రూ. 1,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. 100 కోట్ల ఈక్విటీ షేర్లను షేరుకు రూ. 10 చొప్పున కొనుగోలు చేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐపెట్టబడుల ప్రకటన తరువాత వరుసగా ప్రైవేటు బ్యాంకులు యస్‌బ్యాంకు వాటాల కొనుగోలుకు క్యూ కట్టాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ ,కోటక్ మహీంద్ర బ్యాంకు బోర్డులు ఈపెట్టుబడులకు ఆమోదం తెలిపాయి. ప్రైవేటుబ్యాంకు యాక్సిస్ బ్యాంకు కూడా రూ. 600 కోట్లు పెట్టుబడికి అంగకీరించింది. ఐసీఐసీఐ తరువాత, యాక్సిస్ బ్యాంక్ ఈ పెట్టుబడులను ప్రకటించింది. శుక్రవారం జరిగిన యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో 60 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల కొనుగోలుకు రూ. 600 కోట్ల (రూ.ఆరు వందల కోట్లు మాత్రమే) పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇచ్చిందని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం యస్ బ్యాంక్ పునర్నిర్మాణం ప్రతిపాదిత ప్రణాళికలోఈక్విటీ షేరుకు రూ .2 (రూ.8 ప్రీమియంతో)కు కొనుగోలు చేయనున్నామని యాక్సిస్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు హెచ్డీఎఫ్సీ కూడా వెయ్యికోట్ల రూపాయల పెట్టుడిని యస్‌బ్యాంకుకు సమకూర్చనుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ .10 చొప్పున 50 కోట్ల యస్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. (రాణా, ఆయన భార్యకు సీబీఐ మరో షాక్) చదవండి : ‘యస్’ పునర్నిర్మాణ పథకం, త్వరలోనే ఆంక్షలు ఎత్తివేత -
‘యస్’ పునర్నిర్మాణ పథకం, త్వరలోనే ఆంక్షలు ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో పడిన ప్రైవేటు బ్యాంకు యస్ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్బీఐ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తక్షణ మూలధన అవసరాల నిమిత్తం రూ. 1100 కోట్ల నుంచి రూ. 6200 కోట్లకు పెంచినట్టు ఆమె ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో బ్యాంక్ పునర్నిర్మాణ పథకాన్ని ఆమోదించామనీ, ప్రధానంగా డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్బీఐ 49 శాతం ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎస్బీఐ షేర్లకు 26 శాతం చొప్పున మూడేళ్ల లాక్ ఇన్ వ్యవధి ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడిదారుల 75 శాతం పెట్టుబడులకు మూడేళ్ల లాక్-ఇన్ వ్యవధి ఉంటుందని చెప్పారు. ఇతర పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఆర్బీఐ ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందన్నారు. నోటిఫికేషన్ వచ్చిన మూడు రోజుల (వర్కింగ్) తరువాత మారటోరియం ఎత్తివేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. నోటిఫికేషన్ వెలువడిన 7 రోజుల్లో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. అలాగే బోర్డులో కనీసం ఇద్దర డైరెక్టర్లు ఎస్బీఐకి చెందినవారు వుంటారు. మరోవైపు యస్ బ్యాంక్ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సుమారు 1.35 బిలియన్ షేర్లను రూ .10 చొప్పున కొనుగోలు చేయనుంది. అలాగే ఈక్విటీ ద్వారా రూ .1000 కోట్ల పెట్టబడులను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు ఆమోదించింది. -
కొరత లేకుండా ఇసుక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత లేకుండా అవసరమైనంత మేర అందుబాటులో ఉంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధారణంగా వర్షాల సమయంలో నదుల్లో నీరు ప్రవహించడం వల్ల రీచ్‌లలో ఇసుక తవ్వకం సాధ్యం కాదు. దీంతో ఇసుక కొరత ఏర్పడుతోంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల నిర్మాణాలకు ఇసుక దొరకడం లేదన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో పరిస్థితి చక్కదిద్ది, ప్రజలకు సులభంగా ఇసుకను అందుబాటులో ఉంచడానికి ప్రణాళికను రూపొందించింది. విశాఖ, ప్రకాశం జిల్లాల్లో పెద్ద నదులు లేకపోవడం వల్ల స్థానికంగా ఇసుక కొరత తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విశాఖ జిల్లాకు శ్రీకాకుళం జిల్లాలోని పురుషోత్తపురం, తూర్పుగోదావరి జిల్లాలోని కేతవానిలంక డీసిల్టేషన్ పాయింట్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ రెండు చోట్ల మొత్తం 1,75,000 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల అవసరాల కోసం నెల్లూరు జిల్లా బుచి్చరెడ్డిపాలెం మండలంలోని మినవాగు ఇసుక రీచ్‌ను కేటాయించింది. ఇక్కడ 28,000 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎంతైనా తెచ్చుకోవచ్చు: ఏపీ నుంచి ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతైనా ఇసుక తెచ్చుకోవచ్చు. ఒడిశాలో ఇసుక భారీగా అందుబాటులో ఉంది. అక్కడి నుంచి ఎవరు ఇసుక తెచ్చుకున్నా చెక్‌పోస్టుల్లో అభ్యంతరం పెట్టరు. ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎవరు ఇసుక తెప్పించుకున్నా అడ్డుకోవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ‘‘మన రాష్ట్రంలో భవిష్యత్తులో ఇసుక కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఇతర రాష్ట్రాలకు ఇసుకను రవాణా చేయడంపై నిషేధం ఉంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఇసుక తెప్పించుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవు’’’ అని భూగర్భ గనుల శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. దూరాన్ని బట్టి ధర నిర్ణయం : రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీన కొత్త విధానం అమల్లోకి రానుంది. నిర్మాణాలకు ఇసుక అవసరమైన వారు అధికారులకు దరఖాస్తు చేసి, పరి్మట్లు తీసుకుని తెచ్చుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కొందరు వ్యక్తులు ఇసుక కొరత ఏర్పడిందని ప్రచారం చేసి, అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచి్చంది. ఈ పరిస్థితి ఎక్కువగా విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించింది. అందుకే సమీపంలోని జిల్లాల్లో రీచ్‌లు కేటాయించింది. లారీ ఇసుకకు లోడింగ్, అన్లోడింగ్ చార్జీలు, క్వారీ నుంచి ఎంత దూరం ఉందో లెక్కగట్టి రవాణా వ్యయాన్ని నిర్ణయించి అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. దూరాన్ని ధర ఎంత ఉండాలో నిర్ణయించి, అమలు చేసేలా చూడాలని భూగర్భ గనుల శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. -
స్కెచ్చేశాడు.. చంపించాడు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చిత్తు కాగితాల వ్యాపారిగా ప్రస్థానం మొదలెట్టిన కోగంటి సత్యనారాయణ అలియాస్ సత్యం రూ. కోట్లు టర్నోవర్ చేసే స్టీల్ వ్యాపారి స్థాయికి ఎదిగాడు. మరోవైపు భూకబ్జాలకు పాల్పడటం, స్థల వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేయడం.. ప్రత్యర్థులను తుదముట్టించడం వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతూ ఏ–1 రౌడీషీటర్‌గా ఎదిగాడు. ఈ తరహా ఆరోపణల నేపథ్యంలో బెజవాడలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సత్యంపై 21 కేసులు నమోదయ్యాయి. సత్యం ఆగడాలు మితిమీరడంతో పోలీసులు అతడిపై ఏ–1 రౌడీషీట్ తెరిచారు. వ్యాపార లావాదేవీల్లో వచ్చిన స్పర్థల నేపథ్యంలో స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్‌ను కోగంటి సత్యం తుదముట్టించినట్టు తేలడం నగరంలో కలకలం రేపింది. పక్కా స్కెచ్ అమలు.. తేలప్రోలు రాంప్రసాద్, కోగంటి సత్యం ఇద్దరూ 2003 నుంచి కలిసి వ్యాపారం చేశారు. ఈ నేపథ్యంలో రూ.70 కోట్లను కోగంటి సత్యంకు రాంప్రసాద్ బకాయిపడ్డాడు. ఈ వివాదం పెద్దల వద్దకు వెళ్లడంతో రూ.23 కోట్లు చెల్లించేవిధంగా సెటిల్మెంట్ చేశారు. రుణ మొత్తం భారీగా తగ్గించినా రాంప్రసాద్ అప్పు తీర్చకపోవడంతో కోగంటి సత్యం ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా రాంప్రసాద్‌ను హతమార్చాలనే నిర్ణయానికొచ్చి తన అనుచరుడు శ్యామ్‌ను ఆశ్రయించాడు. రాంప్రసాద్ హత్య కేసులో ఏ–3గా ఉన్న ఆంజనేయ ప్రసాద్ అంతకుముందు తన మామగారి మెడికల్‌షాపు కేసు విషయమై సత్యంను కలిశాడు. అతడి అవసరాలను ఆసరాగా చేసుకున్న శ్యామ్ హత్య ప్రణాళిక గురించి అతడికి తెలిపాడు. హత్య కేసును అతనిపై రానివ్వకుండా చూసుకుంటామని, మెడికల్ షాపు వ్యవహారంలో అతనికి న్యాయం చేస్తామని నమ్మబలకడంతో రాంప్రసాద్‌ను హత్య చేయడానికి ఆంజనేయ ప్రసాద్ ఒప్పుకున్నాడు. ఇలా మొత్తం రూ.10 లక్షలకు సుపారీ ఇచ్చి హత్యకు పథక రచన చేశారు. ఇందులో ఆంజనేయ ప్రసాద్‌కు శ్యామ్ రూ.2 లక్షలు ఇచ్చాడు. ఇదే కేసులో ఏ–7 నిందితునిగా ఉన్న చంద్రిక ఆనంద్‌కు రూ.3 లక్షలు ఇచ్చాడు. కాగా కోగంటి సత్యం ఏ–6 నిందితుడైన తిరుపతి సురేష్‌కు రూ.25 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ నెల 6న పంజాగుట్ట సమీపంలో వ్యాపారి రాంప్రసాద్‌ను నిందితులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రాంప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య వైదేహి ఇచ్చి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా గుర్తించారు. ఏ–1 నిందితుడైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రామును పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయగా.. మిగిలిన ఆరుగురు నిందితులు తిరుపతి సురేష్, చంద్రిక ఆనంద్, శ్రీరామ్ రమేష్, షేక్ అజారుద్దీన్ అలియాస్ చోటు, పత్తిపాటి నరేష్, వెంకట రామ్‌రెడ్డి పరారీలో ఉన్నారు. కేసును పక్కదోవ పట్టించేలా.. కోగంటి సత్యం సూచన మేరకు అతని అనుచరుడు శ్యామ్ మీడియాతో పాటు పోలీసులకు ఈ హత్యతో సత్యంకు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు చెప్పాడు. శ్యామ్ మాటలపై పోలీసుల అనుమానం మరింత పెరిగింది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. రాంప్రసాద్ నుంచి డబ్బు రాకపోవడంతో రాంప్రసాద్‌ను హత్య చేయిస్తే.. అతడి బావమరిది తనకు ఇవ్వాల్సిన రూ.12 కోట్లు అయినా భయపడి ఇస్తాడని ఆశించి కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
రాజమండ్రి ప్లాంటు రుణాలు తీరుతాయా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారంతో కుంగిపోతున్న జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్ (జీఆర్‌ఈఎల్), అప్పుల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. ఈ ప్రణాళికకు కంపెనీ రుణదాతలు ఆమోదం తెలిపారని పేర్కొంది. జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీకి రూ.2,353 కోట్ల రుణ భారం ఉంది. తొలుత దీన్లో రూ.1,412 కోట్లను చెల్లించేందుకు ఒక విధానాన్ని రూపొందించారు. రూ. 1,412కోట్లలో 20% చెల్లించేందుకు, ఇంకా తొలి ఏడాది వడ్డీల కోసం జీఎంఆర్ గ్రూప్ రూ.395 కోట్లు కేటాయిస్తుంది. మిగిలిన రూ. 1,130 కోట్ల రుణాన్ని 9% ఫ్లోటింగ్ వడ్డీతో వచ్చే 20 ఏళ్లలో చెల్లించనుంది. మొత్తం రూ. 2353 కోట్లలో రూ. 1,412 కోట్లు పోగా మిగిలిన రూ. 941 కోట్ల రుణాన్ని భవిష్యత్‌లో చెల్లుబడయ్యే సీఆర్‌పీఎస్‌గా (క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు) మార్చింది. ఈ షేర్లకు ఇప్పటినుంచి 17–20 ఏళ్ల మధ్య 0.1% వడ్డీతో చెల్లింపులు చేస్తారు. ఈ ప్రణాళిక కంపెనీకి, రుణదాతలకు మేలు చేస్తుందని జీఎంఆర్ ఇన్ఫ్రా ఎండీ గ్రంధి కిరణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తమ గ్రూప్ మొత్తం రుణాలు తగ్గేందుకు ఈ ప్రణాళిక ఉపకరిస్తుందన్నారు. రాజమండ్రి ప్లాంట్ పనిచేసేందుకు తగిన గ్యాస్ లభిస్తుందనే నమ్మకాన్ని జీఎంఆర్ వ్యక్తంచేస్తోంది. తద్వారా జీఆర్‌ఈఎల్ నిర్వహణ కొనసాగి సీఆర్‌పీఎస్‌లు డిఫాల్ట్ కాకుండా ఉంటాయని భావిస్తోంది. 2016లో జీఆర్‌ఈఎల్ వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణకు(ఎస్డీఆర్) వెళ్లింది. 2012లో ఈ ప్లాంట్ పూర్తయింది. కానీ గ్యాస్ సరఫరాలో కొరత కారణంగా కార్యకలాపాలు ఆలస్యమయ్యాయి. దీంతో వ్యయాలు పెరిగి రుణభారం ఎక్కువైంది. 2015లో సంస్థ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. -
ప్రకాశం జిల్లా రిమ్స్ అస్పత్రిపై కిమ్స్ మాస్టర్ ప్లాన్
-
చిలుక సాయం
కోసల రాజ్యంలో నరేంద్రుడనే రైతు ఉండేవాడు. తనకు వాటాగా సంక్రమించిన కొద్దిపాటి పొలంలో ఆరుగాలం కష్టపడి పొట్టపోసుకునేవాడు. ప్రతి ఒక్కరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఉన్నంతలోనే అందరికీ సహాయం చేసేవాడు. అతనికి పశుపక్ష్యాదులంటే ఎనలేని ప్రేమ. అతని ఇల్లు ఎన్నో జంతువుల నిలయం. ఒక జంతు ప్రదర్శన శాలలా కనబడేది. తను పస్తులున్నా సరే, వాటికి మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకునేవాడు. పేదవాడైనా సరే, ఊరిలో అతడు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఒక రోజు ఎప్పటిలాగే నరేంద్రుడు తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. పొలంలోని చెట్టుకింద, ఒక రామ చిలుక గాయాలతో కనిపించింది. అరే, చిలుకకు ఏమై ఉంటుంది. ఎగరడం లేదు, అనుకుంటూ దానిని చేతిలోకి తీసుకున్నాడు. కొన ఊపిరితో ఉంది. రెక్కలకు తీవ్ర గాయాలు కనిపించాయి. వెంటనే దానిని ఇంటికి తీసుకెళ్ళాడు. తెలిసిన వైద్యం చేశాడు. రామ చిలుక, మెల్లగా కోలుకోసాగింది. ప్రతిరోజూ రామ చిలుకకు ఇష్టమైన పండ్లు తినిపించేవాడు. దాంతో వారి మధ్య మంచి స్నేహం కుదిరింది. నరేంద్రుడు, ఆ చిలుకతో రోజు ఎన్నో కబుర్లు చెప్పేవాడు. చిలుక సైతం, తన పలుకులతో స్పందించేది చిలుక భాష నరేంద్రుడికి, నరేంద్రుడి భాష చిలుకకు అర్థమయ్యేంత అవగాహన పెరిగింది.చిలుక పూర్తిగా కోలుకుంది. ఒకరోజు నరేంద్రునితో ‘‘నా ప్రాణాలు కాపాడినందుకు, నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను మా అమ్మ, నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను, నీ వద్దకు తీరిక దొరికినప్పుడల్లా వచ్చిపోతాను సెలవిప్పించండి’’ అంది రామ చిలుక. ’సరే’, అన్నాడు బాధగా నరేంద్రుడు. ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయింది రామ చిలుక. నరేంద్రుడు చాలా మంచివాడు. అతనికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది రామ చిలుక. దానికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే రాణి గారి అంతఃపురం చేరింది. రాణి గారి ముత్యాల హారాన్ని నోట కరుచుకొని, నరేంద్రుని ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయింది.నరేంద్రుడు హారాన్ని చూశాడు. ఈ విలువైన హారం ఇక్కడికి ఎలా వచ్చింది, అనుకుంటూ చేతిలోకి తీసుకున్నాడు. పరిశీలించాడు.ఇది చాలా విలువైన ఆభరణంలా ఉంది. బహుశ రాజకుటుంబీకులకు చెందినది కావచ్చు అని అనుకొని దానిని భద్రంగా రాజ భవనానికి తీసుకెళ్ళాడు. రాజును దర్శించి, ‘‘ప్రభూ! నా ఇంటి ముందు ఈ ముత్యాల హారం పడి ఉంది. ఎలా వచ్చిందో తెలియదు. మీకు అప్పగించాలని వచ్చాను’’ అని విన్నవించాడు. రాజు జాగ్రత్తగా పరిశీలించి, రాణి ధరించే ఆభరణంగా గుర్తించాడు.రాజు, నరేంద్రుని నిజాయతీని మెచ్చుకొని, అతడిని ఖజానా కాపలాదారుగా నియమించాడు. నరేంద్రుడు చాలా సంతోషించాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు రామచిలుక అతని ఇంటికి వచ్చింది. నరేంద్రునితో, ‘‘ఒక బందిపోటు దొంగల ముఠా రాజు గారి ఖజానాపై కన్నేసింది. దానిపై దాడిచేసి ఖజానాను లూటీ చేయాలని వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ ముఠా అడవిలోని మర్రిచెట్టు కింద సమావేశమై ఎలా దాడి చేయాలనే దానిపై మాట్లాడుకుంటున్నారు. వారి మాటలను నేను చెట్టు పై నుంచి విన్నాను’’ అని చెప్పింది.నరేంద్రుడు వెంటనే ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. రాజు సైనికులను అప్రమత్తం చేశాడు. దొంగల ముఠా దాడిని సులువుగా తిప్పికొట్టారు. ముఠాలోని దొంగలందరినీ బంధించి, రాజుగారి ముందు హాజరుపరచారు. నరేంద్రుని తెలివిని, తెగువను మెచ్చుకున్న రాజు అతనికి సైన్యంలో ఉన్నతోద్యోగం ఇచ్చాడు. మరికొన్ని నెలలు గడిచాయి మళ్ళీ రామచిలుక ఇంటికి వచ్చి నరేంద్రుడిని కలిసింది. ‘‘రాజు గారిని కూలదోయడానికి దాయాదులు కుట్ర పన్నుతున్నారు. నేను దాయాదుల మాటలు విన్నాను. రాజును మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పు’’ అని చెప్పి వెళ్ళింది.నరేంద్రుడు ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. రాజు ముందుగా ఈ విషయాన్ని నమ్మలేదు. అయినప్పటికి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.నమ్మకమైన అంగరక్షకులను నియమించుకున్నాడు. అనుకున్నట్టు గానే దాయాదులు రాజ మందిరంపై దాడి చేశారు. అయితే అంగరక్షకులు దాడిని తిప్పికొట్టారు. రాజు సురక్షితంగా బయటపడ్డారు.రాజు వెంటనే నరేంద్రుడిని రమ్మని కబురు పంపాడు. ‘‘నీకు రుణపడి ఉంటాను. నీ ముందస్తు సమాచారం వల్లనే నేను ప్రాణాలతో బయటపడ్డాను. నీ వంటి విధేయులు నాకు ఎంతో అవసరం. నా రాజ్యానికి మరింత అవసరం. నిన్ను సైన్యాధ్యక్షునిగా నియమిస్తున్నాను’’ అంటూ ఉత్తర్వులు జారీ చేశాడు.ఏడాది గడిచాక ఒక రోజు చిలుక మళ్ళీ వచ్చింది. నరేంద్రునితో ముచ్చటిస్తూ ‘‘ఒక ముఖ్యమైన వార్తను మోసుకు వచ్చాను. రాజ్యానికి ఉత్తరాన ఉన్న సరిహద్దు రాజ్యం ఈ రాజ్యాన్ని కబళించాలని వ్యూహ రచన చేస్తోంది. నీవు నీ సైన్యంతో అప్రమత్తంగా ఉండు’’ అంటూ వారి సైనిక కదలికలను ఎప్పటికప్పుడు నరేంద్రునికి చేరవేసింది. యుద్ధంలో నరేంద్రుని సైన్యం, పొరుగు రాజు సేనలను చిత్తు చేసింది. నరేంద్రుని పేరు ప్రఖ్యాతలు దశ దిశలా వ్యాపించాయి. నరేంద్రుని శక్తియుక్తులపై రాజుకు పూర్తిగా నమ్మకం ఎర్పడింది.కొన్నాళ్లకు రాజు వ్యాధిగ్రస్తుడై మంచం పట్టాడు. వైద్యులు నయంగాని వ్యాధి అని చేతులెత్తేశారు. దీంతో రాజు మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో చర్చించి, వారి ఆమోదంతో నరేంద్రుడిని రాజుగా ప్రకటించాడు. నరేంద్రుని పట్టాభిషేకం ఘనంగా జరిగింది. రామచిలుకలు పూల మాలతో సన్మానించాయి. చిలుక సహాయానికి, ఆ పక్షిని రాజ్య పక్షిగా ప్రకటించాడు. తన రాజ్యంలోజంతు హింసను నిషేధించి, జనరంజకంగా పరిపాలిస్తూ ప్రజల మన్ననలను పొందసాగాడు. - పుల్లూరు జగదీశ్వరరావు -
‘లావుగా ఉన్నానన్నాడు.. అందుకే చంపేశా’
లక్నో : గ్యాంగ్‌స్టర్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ మున్నా బజరంగీ సోమవారం ఉదయం బాగ్పట్ జైల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. అదే జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతీ బజరంగీని తుపాకితో కాల్చి చంపాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడిలో ఉన్న రాతీ విచారణలో ‘బజరంగీ తనను లావుగా ఉన్నాని హేళన చేశాడని, అందుకే తాను బజరంగీని హత్య చేసినట్లు’ తెలిపాడు. ఈ విషయం గురించి రాతీ ‘ఆ రోజు నేను మా గదిలో ఎప్పటిలానే నడుస్తూ ఉన్నాను. ఇంతలో బజరంగీ నన్ను దాటుకుని ముందుకు వెళ్లి, నేను చాలా లావుగా ఉన్నానంటూ హేళన చేయడం ప్రారంభించాడు. నేను అతని మాటలను వ్యతిరేకించాను. నన్ను హేళన చేయవద్దని చెప్పాను. అయినా అతను వినలేదు. దాంతో మా మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇంతలో బజరంగీ ఉన్నట్టుండి తుపాకీ తీశాడు. దాంతో నేను అతన్ని కొట్టి అతని చేతిలో నుంచి తుపాకీని లాక్కున్నాను. వెంటనే ఆ తుపాకీలో ఉన్న తుటాలన్నింటిని బజరంగీ తలలోకి దింపేశాను’ అన్నాడు. అనంతరం ఆ తుపాకీని బయట మురుగు కాల్వలో పడేశానని తెలిపాడు. అయితే రాతీ, బజరంగీ మధ్య గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న మరో ఖైదీ రాతీ వ్యాఖ్యలను ఖండించాడు. అసలు వారిద్దరి మధ్య ఎటువంటి గొడవ జరగలేదని తెలిపాడు. రాతీ కావాలనే బజరంగీపై దాడి చేశాడని.. కనీసం బజరంగీకి పారిపోయే అవకాశం కూడా దొరకలేదని తెలిపాడు. వీరిద్దరి మాటలను రికార్డు చేసిన పోలీసు అధికారులు ‘బజరంగీని అతని శత్రువులు పథకం ప్రకారమే హత్య చేయించి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కేసు నిమిత్తమై కోర్టులో ప్రవేశపెట్టేందుకు గాను బజరంగీని ఆదివారమే ఝాన్సీ జైలు నుంచి బాగ్పట్ జైలుకు తీసుకువచ్చారుము. కాబట్టి రాత్రికి రాత్రే బజరంగీ ఆయుధాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు అని పోలీసులు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వొడాఫోన్ ఎఫెక్ట్ : ఎయిర్టెల్ డేటా పెంపు
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన రూ.499 పోస్టు పెయిడ్ ప్లాన్‌ను సమీక్షిస్తున్నట్టు తెలిపింది. ఈ సమీక్షించిన ప్లాన్ కింద 87.5 శాతం ఎక్కువ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. అంతకముందు ఈ ప్లాన్ కింద కేవలం 40 జీబీ డేటా మాత్రమే సబ్స్క్రైబర్లకు లభించేది. ప్రస్తుతం 75 జీబీ డేటా లభ్యం కానుంది. దీనిలోనే రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేయనుంది. అదనంగా ఈ ప్లాన్‌లోనే ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, హ్యాండ్సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలను అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమేనని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో మరింత మందికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు కూడా చెప్పింది. అంతేకాక ఒక నెలలో వాడుకోని డేటాను మరో నెలకు యాడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఇటీవల వొడాఫోన్ తన రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్లు రూ.399ను, రూ.2,999ను సమీక్షించింది. దీనికి కౌంటర్‌గా ఎయిర్టెల్ సైతం ఈ నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్ సమీక్షించిన ప్లాన్లపై అపరిమిత కాల్స్‌ను, 300 జీబీ వరకు డేటాను, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఆ ఆఫర్లతోనే కాక వొడాఫోన్ ప్లే, మొబైల్ షీల్డ్, రెడ్ హాట్ డీల్స్, బిల్ గ్యారెంటీ వంటి ఉచితంగా లభించనున్నాయి. అంతేకాక కొత్త రూ.299 రెడ్ బేసిక్ పోస్టు పెయిడ్ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 20 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. మరోవైపు జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కౌంటర్‌గా కంపెనీ తన ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో కూడా మార్పులు చేపట్టింది. -
ఇద్దరు యువకుల ఘాతుకం
సాక్షి, కోటవురట్ల(పాయకరావుపేట) : వావివరుసలు మరచి ఇద్దరు యువకులు చెల్లి వరుస అయిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా ఉరివేసి హత్యచేసేందుకు యత్నించిన సంఘటన ఆలస్యంగా బీకే పల్లిలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆమె కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. బాలిక తల్లి లక్ష్మి వివరాలు ఇలా ఉన్నాయి. తమ పక్క ఇంటిలో ఉంటున్న పైల గోపి, పైల సునీల్ తన కుమార్తెకు అన్నదమ్ముల వరుస అవుతారని, దానిని మరిచి ఇద్దరూ ఆమెపై లైంగికదాడికి యత్నించి, ఆపై చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. పథకం ప్రకారం ఆదివారం పాకలోకి పిలిచి లైంగికదాడికి యత్నించారని తెలిపింది. బాలిక అడ్డుకోవడంతో వెలుగులోకి వస్తే ప్రమాదమని భావించి ఉరి వేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. చనిపోయిందనుకుని ఏమీ తెలియనట్టుగా తమ పెద్ద కూతురు ఉమాదేవి వద్దకు వచ్చి మీ చెల్లిపై సిమెంట్ బస్తాలు పడిపోయాయని గోపి చెప్పాడని, అక్కడకు వెళ్లేసరికి కొనఊపిరితో ఉన్న కుమార్తెను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వైద్య సిబ్బంది కూడా జరిగిన సంఘటనపై అనుమానం వ్యక్తం చేశారని, సిమెంట్ బస్తాలు పడితే పెనుగులాడినట్టు తల, వీపుపై మట్టి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారని తెలిపింది. పరిస్థితి ఆందోళనగా ఉండడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా మెడ నరాలు తెగిపోవడంతో పాటు చిన్న మెదడు దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారన్నారు. జరిగిన అన్యాయంపై మంగళవారం కోటవురట్లలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ స్పందించలేదని, కేసు పెడితే ఆ ఇద్దరు ఏమైనా చేసుకుంటే బాధ్యత మీదేనని నిందితుల తరఫున మాట్లాడుతూ బెదిరించారన్నారు. మొదటి నుంచి గోపి, సునీల్ తమ రెండో కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫొటోలను అసభ్యంగా తయారు చేసి వాట్సప్‌లో పెడతామని బెదిరించేవారని, ప్రతీసారీ రూ.1000, రూ.2 వేలు తెమ్మని డిమాండ్ చేసేవారని చెప్పింది. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని తెలిపింది. ఈ విషయాన్ని నిలదీసినందుకే తన మూడో కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. కఠినంగా శిక్షించాలి ఆ యువకులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఎస్ఐ మధుసూదనరావును సస్పెండ్ చేయాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. సమాచారం తెలుసుకున్న ఐద్వా సభ్యులు గురువారం విశాఖలో బాధితురాలిని పరామర్శించారు. శుక్రవారం బి.కె.పల్లి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలను బ్లాక్మెయిల్ చేస్తూ వేధించిన పైల గోపి, పైల సునీల్‌లను తక్షణం అరెస్టు చేసి, విచారించాలన్నారు. హత్యచేసుందుకు యత్నించిడంతో బాధితురాలు కోలుకోలేని స్థితిలో కేజీహెచ్‌లో వైద్యం పొందుతోందని చెప్పారు. కేజీహెచ్‌లో వైద్యం చేస్తే ఆమె పూర్తిగా కోలుకోలేదని, అందువల్ల కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించాలన్నారు. వైద్యానికి రోజుకు రూ.45 వేలు వరకు ఖర్చు అవుతుందని, 90 రోజుల పాటు వైద్యం అందించాలని, ఇందుకు రూ.90 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మద్దతుగా జన విజ్ఞాన వేదిక నక్కపల్లి మండల కన్వీనర్ బి.రాము, సీపీఎం మండల కన్వీనర్ జి.డేవిడ్ నిలిచారు. గ్రామంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. దీనిపై ఎస్ఐ మధుసూదనరావును వివరణ కోరగా తాను ఇటీవల కోటవురట్ల ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నానని, మండలంపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు. ఓ బాలికకు అన్యాయం జరిగితే నిందితులను కాపాడే నీచమైన వ్యక్తిత్వం తనది కాదన్నారు. బాధితురాలు నోరు విప్పితే అన్ని విషయాలు బయటకు వస్తాయని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని, పైల గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధితురాలికి వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడినట్టు తెలిపారు. -
ఫ్యూచర్ ప్లాన్
‘‘ఈ గది 10్ఠ 8 ఉండాలి’’ అంది శ్రీమతి మాలిక్ వాళ్ల ముందరి టేబుల్ మీదున్న ఇంటి ప్లానును చూపిస్తూ. ఆమె అలా సూచించడం అది మూడోసారి. దానిని ఆమె భర్తగాని, ఇంటి డిజైన్ తయారుచేసే వ్యక్తిగాని గుర్తించినట్లు లేదు. మాలిక్ దంపతులు ఢిల్లీలో సొంతిల్లు కట్టుకోబోతున్నారు. ఇల్లు కట్టడం పూర్తయితే, తన భర్త వేరే చోటికి బదిలీ అయినా తాను మాత్రం సొంత ఇంట్లోనే ఉండాలని శ్రీమతి మాలిక్ మనస్సులో నిశ్చయించుకొంది. భర్త ఉద్యోగంలో బదిలీ మీద తిరిగి తిరిగి ఆమె అలసిపోయింది. ఇప్పుడు పిల్లలు పెరిగి వస్తున్నారు. వాళ్లను ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు మారుస్తూ పోవడం ఇంక మంచిది కాదు. ఆమె పిల్లలతో ఢిల్లీలోనే స్థిరపడుతుంది. వాళ్లత్త ఆమెకు తోడు ఉంటుంది. మాలిక్‌కు కూడా ఇందులో అభ్యంతరం లేదు. ‘‘ఈ గది 10 8 అయ్యుండాలి’’ ఆమె మళ్లీ అంది. ఆమె భర్త పక్క గదిలో ఎవరితోనో టెలిఫోన్లో మాట్లాడుతున్నాడు. ‘‘కాని ఇది స్టోర్’’ వాస్తు శిల్పి ఆమెకు వివరించాడు. ‘‘అవును, అయితే దానిని మా అత్త ఉన్నన్నాళ్లు ఆమెకిచ్చి, ఆ తర్వాత స్టోర్‌రూమ్‌గా వాడుకోవచ్చనుకున్నాను’’. వాస్తు శిల్పికి అర్థమైనట్లు లేదు. శ్రీమతి మాలిక్ మాటలు విని అతను అయోమయంగా చూశాడు. ‘‘నా ఉద్దేశం మా అత్త ఆ గదిని వాడుకుంటుంది... మీకు తెలుసుగదా ఆమె ముసలావిడ... ఎక్కువకాలం ఉండదు. ఆమె తర్వాత ఆ గదిని స్టోర్‌రూమ్‌గా మార్చుకోవచ్చు’’. మాలిక్ వచ్చి వాళ్లతో చేరాడు. అతను ఫోన్లో మాట్లాడుతూనే తన భార్య సూచనను గురించి కూడా ఆలోచించినట్లున్నాడు. అతను కూడా స్టోర్ కొంచెం పెద్దదిగానే ఉండాలన్న అభిప్రాయంలో ఉన్నాడు. స్టోర్ రూమ్ ఎప్పుడూ పెద్దదిగా ఉంటే పెట్టెల మధ్య ఫ్రీగా తిరగడానికి వీలవుతుంది. వంటగది పక్కగదిని 10 ్ఠ 8 కొలతల్లో కట్టాలని నిర్ణయించబడింది. మండువా కొంత ఇరుగ్గా ఉంటుంది. అది పెద్ద సమస్య కాదు. మిగతా పనంతా పూర్తయింది. ప్లాను ఆమోదం కోసం కార్పొరేషన్‌కు పంపించారు. శ్రీమతి మాలిక్ ఇంటి నిర్మాణం మీద శ్రద్ధగా పనిచేసింది. రోజంతా గొడుగు వేసుకొని నిలబడి పని చేయించింది. అవసరమైనప్పుడు మేస్త్రీలకు చేతి సహాయం కూడా చేసింది. ఇల్లు కట్టినన్ని రోజులూ అక్కడికి మొట్టమొదట వచ్చేది ఆమే, చిట్టచివర వెళ్లేది ఆమే. తొందరగానే ఇల్లు పూర్తయింది. ఇంటికి కొత్త ఫర్నిచర్ తేవాలని పట్టుబట్టింది. పాత ఫర్నిచర్లో ఒక ముక్కను కూడా కొత్తింట్లోకి తీసుకు రాకూడదనుకొంది. కొత్తింట్లోకి ఎప్పుడు మారాలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతలో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొందని తెలిసింది. శ్రీమతి మాలిక్‌కు చాలా కోపం వచ్చింది. ఇంటి కట్టడాన్ని పర్యవేక్షిస్తున్నప్పుడే ఇంటికి సంబంధించి అనేక పథకాలను రూపొందించింది. అన్ని మరిచిపోవాల్సి వచ్చింది. అప్పుడే వాళ్లకు ఢిల్లీ నుంచి బదిలీ అయ్యింది. శ్రీమతి మాలిక్ చాలా సంతోషించింది. ఈ యింట్లో ఉండలేక పోయినందుకు బాధపడనక్కరలేదు. ప్రభుత్వమే వాళ్ల యింటిని అద్దెకు తీసుకోవడంతో ఒక రకంగా వాళ్లు అదృష్టవంతులే. ప్రైవేటు వ్యక్తులతో తలనొప్పి. పైగా బాడుగ సక్రమంగా ఇవ్వరు. ప్రభుత్వం నెలనెలా బాడుగను వాళ్ల బ్యాంక్ అకౌంటుకు జమ చేస్తుంది. ఒక చోటి నుండి మరొక చోటికి బదిలీ అవుతూ ఢిల్లీకి పోస్టింగ్ రావడానికి మాత్రం చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆమె అత్త చనిపోయింది. వాళ్ల అమ్మాయికి పెళ్లయిపోయింది. వాళ్ల అబ్బాయి మాత్రమే పెళ్లికాకుండా మిగిలి ఉన్నాడు. మాలిక్ రిటైర్ అయ్యేలోపల ఆ పనికూడా చేసేయ్యొచ్చనుకున్నారు. వాళ్లబ్బాయికి పెళ్లయింది, మాలిక్ రిటైర్ అయ్యాడు. ప్రభుత్వం మాత్రం ఇంటిని ఖాళీ చెయ్యలేదు. మాలిక్, అతని భార్య కొడుకు కోడలుతో కలిసి బాడుగ ఇంట్లో ఉన్నారు. మాలిక్ ఇల్లు ఖాళీ చేయించడానికి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడు. తాము కట్టించుకున్న ఇంట్లో ఒక్కరోజు కూడా కాపురం చెయ్యకుండానే మాలిక్ మరణించాడు. మూడు నెలల్లో ఇల్లు ఖాళీ అయ్యింది. శ్రీమతి మాలిక్ కన్నా ఆమె కోడలు సొంతింట్లోకి వెళ్లడానికి ఉత్సాహపడుతున్నది. ఇల్లు స్వాధీనం కాగానే, ఇంటికి రంగులు వేయించి, ఇంట్లోకి మారడం ప్రారంభించింది. ఫర్నిచర్ డీలర్‌ని పిలిచి అతని దగ్గర ఉన్న ప్రతి వస్తువూ పంపమని చెప్పింది. సోమవారం ఉదయం ఇంట్లోకి మారవలసి ఉండింది. మంచిరోజు గనుక ఆరోజే ఇంట్లోకి మారితే బాగుండునని శ్రీమతి మాలిక్ ఆశ. మంగళవారం అమంగళం. ఆరోజు ఇల్లు మారాలని అనుకోనుకూడా అనుకోరాదు. అమ్మ మనసు తెలిసి, కొడుకు వాన కురుస్తున్నా ఇల్లు మారాలని నిర్ణయించుకున్నాడు. సొంతకారుతో బాటు ఒక టాక్సీని రప్పించి, ఇంట్లోకి మారినట్లు మారారు. లగేజి ఇంకా మార్చవలసి ఉంది.వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. కార్లో వెనక సీట్లో కూర్చున్న శ్రీమతి మాలిక్ స్మృతుల్లోకి వెళ్లిపోయింది. ఇల్లు కట్టేటప్పుడు తనెంత శ్రమించింది? భోజనం తప్పిపోయిన రోజులున్నాయి. ఇంటిపని చూస్తూ మండుటెండలో మాడుతూ నిల్చుంది! వానలో ముద్దయిన రోజులున్నాయి. వాస్తు శిల్పి ఇల్లంతా కట్టడం పూర్తయితే ఎలా ఉంటుందో రంగుల చిత్రంగా వేసి చూపించాడు. అందులో ఒక అమ్మాయి మార్బుల్ స్తంభానికి ఆనుకొని వీపు చూపిస్తూ వరండాలో నిలబడినట్లుంది. ఎంత అందం! ఆత్మ తృప్తికి సంకేతం. మెరూన్ చీర ధరించింది. శిల్పి తననే చెక్కినట్లు శ్రీమతి మాలిక్ భావించింది. అయితే ఆమె మెరూన్ చీరలెప్పుడూ కట్టలేదు. స్కెచ్‌లోని బొమ్మ ఆమెలాగే పొడవుగా ఉంది. ఆ స్కెచ్‌ను తన కోడలికి చూపించాలనుకొంది. కోడలు ముందు సీట్లో తన భర్త పక్కన కూర్చొని ఉంది. కారుకున్న రియర్‌వ్యూ గ్లాసును తిప్పుకొని పెదవులకు తిరిగి రంగు అద్దుకుంది. సొంత ఇంటికి వెళ్తూ పెదవులకు రంగు వేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఈ కాలపు ఆడపిల్లల వాలకమే ఇంత. ఉన్నట్టుండి వాస్తు శిల్పి దిద్దిన బొమ్మ తన కోడలిది కావచ్చని అనిపించింది ఆమెకు. అదెలా సాధ్యం? ఇంటిప్లాన్ తయారు చేసేటప్పుడు కోడలు రంగంలోనే లేదు. అయితే ఆమె బొమ్మలో లాగే మెరూన్ చీర ధరించింది. అవును, ఇది మెరూన్ కలరే. శ్రీమతి మాలిక్‌కు మెరూన్ కలర్ ఎప్పుడూ ఇష్టం లేదు. వాళ్లు ఇల్లు చేరుకున్నారు. కొడుకు కారును నేరుగా పోర్టికోలోకి పోనిచ్చాడు. కోడలు కారులోంచి ఎగిరి దూకింది. వరండాలో మార్బుల్ స్తంభం దగ్గర నిలబడి ఆనుకొంది. శిల్పి స్కెచ్‌లో వేసినట్లే నిలబడింది. శ్రీమతి మాలిక్‌కు గుండెల్లో కలుక్కుమంది. శిల్పి ఈ అమ్మాయినే అనుకరించాడేమో! టాక్సీలోని లగేజి అంతా ఇంట్లోకి చేరింది. బాడుగ తీసుకొని టాక్సీ డ్రైవర్ వెళ్లిపోయాడు. శ్రీమతి మాలిక్ ఇంకా కారు వెనక సీట్లో కూర్చునే ఉంది. ఆమెకు తాను కిందికి దిగిపోతున్న అనుభూతి కలుగుతోంది. కొడుకు కోడలు ఇంట్లోకి వెళ్లారు. ఒకటొకటిగా లైట్లు వేశారు. అన్ని గదులూ వెలుతురుతో నిండాయి. ఉద్వేగంలో శ్రీమతి మాలిక్‌కు తలుపు తెరవాలని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. హఠాత్తుగా కొడుక్కి తల్లి గుర్తొచ్చింది. పరుగెత్తికెళ్లి కారు తలుపులు తెరిచాడు. ‘నేను ఏమీ తినను, ఆకలిగా లేదు’’ శ్రీమతి మాలిక్ అంది. ‘‘నేను నిద్రపోతాను’’. ‘‘అయితే మీ రూములో పడుకోండి’’ కోడలు 10 ్ఠ 8 కొలతల గదిని చూపిస్తూ అంది. కొడుకు ఆమెను ఆ గదిలోకి పట్టుకుపోయి దించాడు. ఆమెకు బాగా మత్తుగా ఉంది.‘మా అత్త ఆ గదిని వాడుకుంటుంది. ఆమె తర్వాత ఆ గదిని స్టోర్‌రూమ్‌గా మార్చుకోవచ్చు’. పడక మీద పడుకొన్న శ్రీమతి మాలిక్ చెవుల్లో ఈ మాటలు మార్మోగాయి. ఆమె మాటిమాటికి తల తిప్పుతూంది. ఆమె కేమయ్యింది? భర్త ఎప్పుడో పోయాడు. ఆమె అతణ్ని అనుసరిస్తుంది. అప్పుడు ఆమె కోడలు ‘‘ఇల్లు బాగానే ప్లాన్ చేశారు. స్టోర్ రూమ్ ఒక్కటి లేదు. ఒక పెద్ద స్టోర్ రూమ్ కావాలి’’ అనడం వినిపించింది. శ్రీమతి మాలిక్ ఆ మాటలు వింది. ఆమెకు లోతులకు లోలోతులకు, అగాధమైన బావిలోకి దిగిపోతున్నట్లు అనిపించింది. -
ప్రాంతీయ దూకుడుకు అడ్డుకట్ట!
కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సరైన మెజారిటీ రాని పక్షంలో సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమయ్యే అవకాశాలతో.. కమలదళంలో ఒక రకమైన కలవరం మొదలైంది. కర్ణాటక ఫలితాలు, ఎస్పీ–బీఎస్పీల పొత్తు ప్రభావంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ ముఖ్య నేతలు బీజేపీ కీలక నేతలతో త్వరలోనే సమావేశం కానున్నారు. సమీప భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై ప్రత్యేక వ్యూహాలను, ప్రాంతీయ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేసి బీజేపీ బేస్‌ను పెంచే కార్యాచరణతోపాటుగా జాతీయ విద్యా విధానం, భద్రతాపరమైన అంశాలు, కశ్మీర్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులనూ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై దృష్టి మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలకు ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు చెబుతుండటం, అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వంపైనా పలు (ఆర్థికాంశాలు, ఇంధన ధరల పెరుగుదల, దళితులతోపాటు మైనార్టీల్లో అసంతృప్తి, మహిళలపై అత్యాచారాలు తదితర) అంశాల్లో కనబడుతున్న వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సమీక్షించాలని సంఘ్ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇకపై రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాలను నిర్ణయించే భేటీల్లో ఆరెస్సెస్ కీలక పాత్ర పోషించనుంది. కర్ణాటక ఎన్నికల కోసం స్థానిక స్వయం సేవకులతోపాటు పక్క రాష్ట్రాల నుంచి 50 వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు రెండు నెలలపాటు శ్రమించారు. దీంతోపాటు, దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో మరింత బలోపేతం కావడంపైనా ఆరెస్సెస్ దృష్టిపెట్టింది. ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతున్న బీజేపీ.. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ దూసుకుపోవాలనే ప్రయత్నాల్లో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. దీనికితోడు ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో క్షేత్రస్థాయి కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
ఇండస్ట్రీ.. ప్లాన్ బి!
ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయం, లక్ ఉండాలి. కానీ వీటన్నిటి కంటే ముఖ్యంగా కావాల్సింది పట్టుదల అంటున్నారు శ్రద్ధాదాస్. హీరోయిన్గా రాణించాలనుకుంటున్న వారికి ‘ప్లాన్ బి’ కూడా ఉండాలంటున్నారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ– ‘‘ఆర్టిస్ట్‌గా పైకి రావాలంటే ముఖ్యంగా కావాల్సింది పట్టుదల. ఇక్కడ నిలబడాలంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ప్రయత్నించగలగాలి. యాక్చువల్లీ యాక్టర్స్ కావాలనుకునేవారిని ‘ఇండస్ట్రీలో ఉండాలంటే చాలా టఫ్‌గా నిలబడగలగాలి. అలా స్ట్రాంగ్‌గా లేకపోతే వెనక్కి వెళ్లిపోండి’ అని నేనే చాలాసార్లు డిస్కరేజ్ చేశాను. అప్పటికీ రావాలనుకునేవాళ్లకు... ‘‘ఇది ‘ప్లాన్ బి’గా మాత్రమే పెట్టుకొని రండి. మీరు చేస్తున్న కార్పొరేట్ జాబ్, ఇంకేదైనా కూడా ప్లాన్ ‘ఏ’గానే ఉండాలి. అంటే.. ఇండస్ట్రీ అనేది సెకండరీ అనుకోవాలి’ అని చెబుతుంటాను. కొన్నిసార్లు మనం బాగా సూట్ అవుతాం అనుకున్న పాత్ర ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లకు వెళ్లిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో జనరల్‌గా జరిగే విషయాల్లో ఇదొకటి. అలాంటి సందర్భాల్లో చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటుంది. కానీ ఆ తర్వాత అనిపిస్తుంది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఫస్ట్ కొన్ని చాన్స్‌లు రావడం వరకే. ఆ తర్వాత ఎవరి టాలెంట్‌ని బట్టి వాళ్లకి చాన్సులు లభిస్తాయని. ఎప్పటికైనా ‘స్క్రీన్ మీద ఎలా ఉన్నాం’ అన్నదే మ్యాటర్. బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేదా? అన్నది ఆడియన్స్‌కు అనవసరం’’ అని పేర్కొన్నారు. -
ఎగ్జామ్స్ గైడ్
పరీక్షలొచ్చేస్తున్నాయి. పరీక్షలకు సిద్ధపడే పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులకూ పరీక్షలంటే ఎంతో కొంత ఆందోళన సహజం. ఏడాది పాటు నేర్చుకున్న పాఠాలను, వాటి ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ప్రదర్శించి, మంచి మార్కులు సాధించడానికి పరీక్షలు ఒక అవకాశం. కొందరు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేసి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధపడితే, చాలామంది విద్యార్థులు పాఠాలు చదువుకున్నా, పరీక్షల్లో సరిగా రాయగలమో లేదోననే ఆందోళనతో సతమతమవుతుంటారు. తరగతి గదుల్లో బాగా రాణించే విద్యార్థులు సైతం ఆందోళన కారణంగా పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించలేక పోతుంటారు. పరీక్షల గురించి ఆందోళన చెందడం వల్ల ఫలితం చెడుతుందే తప్ప ప్రయోజనం ఉండదు గానీ, కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఒత్తిడి నుంచి బయటపడి పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. సమయం శరణం గచ్ఛామి పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించడానికి, సత్ఫలితాలు సాధించడానికి కీలకమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఉంటుందని విద్యారంగ నిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్న మాట. పరీక్షలకు సంసిద్ధమయ్యేటప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై వారు చేస్తున్న సూచనలు కొన్ని... ∙చదవాల్సిన అంశాలను వాయిదా వేయడం తగదు. ముందుగా సిద్ధం చేసుకున్న నోట్సును శ్రద్ధగా పునశ్చరణ చేసుకోవడం ద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి చెందకుండా జాగ్రత్త పడాలి. ∙మిత్రులతో బాతాఖానీ, టీవీ చూస్తూ కూర్చోవడం, సోషల్ మీడియా చాటింగ్, సినిమాలు, షికార్లు, వీడియోగేమ్స్ వంటి కాలాన్ని హరించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ∙సిలబస్ కొండలా కనిపించినా నిర్ణీత టైమ్‌టేబుల్‌ను కచ్చితంగా అమలు చేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలను ఇట్టే రాయవచ్చు. ∙రోజూ నిర్ణీత సమయం ప్రకారం చదవాలి. ఏకధాటిగా గంటల తరబడి చదవడం వల్ల అలసట అనిపించవచ్చు. అలాంటప్పుడు కొద్దిసేపు మనసుకు నచ్చిన పనులు చేస్తూ రిఫ్రెష్ అయి మళ్లీ చదవడం మొదలుపెట్టాలి. ∙నిద్ర, కాలకృత్యాలు, ఆహారం తీసుకోవడం, స్వల్ప విరామం వంటివన్నీ పోయినా, రోజుకు కనీసం పది గంటల సమయం ఉంటుంది. విద్యార్థులు ఆ పదిగంటల సమయాన్నీ గరిష్టంగా చదువు కోసమే వినియోగించుకునేలా చూసుకోవాలి. ∙ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు వంటి గాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం క్షేమం. వీటి వల్ల సమయం వృథా కావడమే కాకుండా, చదువుపై ఏకాగ్రత దెబ్బతింటుంది. ∙రిలాక్సేషన్ కోసం కొద్దిసేపు ఆటలు ఆడటం, డ్యాన్స్, స్విమ్మింగ్ వంటివి చేయడం మంచిది. వీటి వల్ల చురుకుదనం పెరుగుతుంది. అనుకూల వాతావరణం చుట్టూ అనుకూల వాతావరణం ఉన్నప్పుడే ఎవరైనా పనులు సజావుగా చేయగలరు. విద్యార్థులు కూడా అంతే. ఒకే చోట కూర్చుని గంటల తరబడి చదువుకోవాలంటే ఎవరికైనా కష్టమే. పిల్లలు చదువుకునే గదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. గదిలోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉంటే చదువుపై ఉత్సాహం పెరుగుతుంది. పుస్తకాల ర్యాక్‌లో పాఠ్యపుస్తకాలతో పాటు మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే మంచి సాహిత్యం, మెదడుకు పదునుపెట్టే పజిల్స్‌కు సంబంధించిన పుస్తకాలు, పదసంపదను పెంపొందించే నిఘంటువులు వంటివి కూడా ఉండేలా చూసుకోవాలి. ప్రణాళికతో కూడిన సాధనే కీలకం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ప్రణాళికతో కూడిన సాధనే కీలకం. విద్యా ప్రమాణాలను గుర్తించి భిన్న కోణాల్లో ఆలోచించి రాసే జవాబులను వాక్య పరిమితిని పాటిస్తూ నోట్స్ తయారు చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి సబ్జెక్టులోనూ ప్రతి పాఠ్యాంశమూ ఫలితాల సాధనలో కీలకమైనవే. చాలామంది విద్యార్థులు ఏయే చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి? ఏవి ముఖ్యమైనవి? అని అడుగుతూ ఉంటారు. పాఠ్యాంశాల్లో కీలకమైనవి, ప్రాధాన్యం లేనివి అంటూ ఏవీ ఉండవు. అన్నీ కీలకమైనవే. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందే. గతంలో అడిగిన ప్రశ్నలను గుర్తుచేసుకుని, వాటిని ఇంకా ఎన్ని విధాలుగా అడిగే అవకాశాలు ఉన్నాయో అవగాహన చేసుకోవాలి. పాఠ్యాంశాల్లో ఉన్న చిత్రాలు, గ్రాఫ్‌లు, పట్టికల్లో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి పూర్తి చేయాలి. కీలకమైన పదాల అభ్యసనాన్ని మెరుగు పరచుకోవాలి. కఠిన పదాలు ఎదురైనప్పుడు ఉపాధ్యాయులను లేదా పెద్దలను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే డిక్షనరీలు తిరగేయడం ద్వారా వాటి అర్థాలను తెలుసుకోవాలి. తరగతిలో జరిగే చర్చల్లో పాల్గొనడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా పరీక్షల్లో సులువుగా జవాబులను రాయవచ్చు. పరీక్షలకు ముందుగానే తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికి పూర్తిగా కట్టుబడి చదువు సాగించేటట్లయితే చివరి నిమిషంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉంటుంది. ఇలా ప్రణాళిక వేసుకోవాలి పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు మంచి ఫలితాలను సాధించడానికి అందుకు తగిన ప్రణాళికను ఎలా వేసుకోవాలనే దానిపై విద్యారంగ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన సూచనలు... ∙మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో, పరీక్షలు మొదలవడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో చూసుకోవాలి. ∙ఒక్కొక్క సబ్జెక్టుకు ఎన్ని రోజులు కేటాయించడం సాధ్యమవుతుందో లెక్క వేసుకోవాలి. చేతిలో ఉన్న డబ్బును ఖర్చు చేయడానికి బడ్జెట్ వేసుకున్నట్లే పరీక్షల కోసం కచ్చితమైన టైమ్ టేబుల్ వేసుకోవాలి. ∙కొన్ని సబ్జెక్టులు సులభంగా అనిపిస్తాయి. కొన్ని సబ్జెక్టులు కష్టంగా అనిపిస్తాయి. అలాంటప్పుడు సులభంగా పూర్తి చేయగలమనుకునే సబ్జెక్టులకు సిద్ధపడాల్సిన రోజులు తగ్గించుకుని, కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ రోజులు కేటాయించుకోవాలి. ∙రోజుకు ఎన్ని గంటలు చదవడానికి కేటాయించగలమనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. సబ్జెక్టుల కోసం కేటాయించే వ్యవధిని సహేతుకంగా లెక్క వేసుకుని, వీలైనంత వరకు దానికి కట్టుబడి ఉండాలి. ∙చదువుకునే సమయాన్ని, రిలాక్స్ అయ్యే సమయాన్ని, రివిజన్ చేసుకునే సమయాన్ని, నిద్రకు కేటాయించే సమయాన్ని హేతుబద్ధంగా విభజించుకుని, ఆ టైమ్ టేబుల్‌కు కట్టుబడి పరీక్షలకు సమాయత్తం కావాలి. పాజిటివ్‌గా ఆలోచించాలి పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా వారిని పాజిటివ్ దృక్పథంతోనే ప్రోత్సహించాలి. ‘అమ్మో! ఇంత సిలబస్ ఉంది. ఎప్పుడు చదవాలి? ఎలా పూర్తి చేయాలి? ఇదంతా గుర్తు పెట్టుకోగలనా?’ అని బెంబేలెత్తిపోకుండా, ‘ఇదంతా నేను చక్కగా చదివి అర్థం చేసుకోగలను. బాగా జ్ఞాపకం ఉంచుకోగలను’ అనే భావనను పెంపొందించుకోవాలి. ఈ భావన కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. పరీక్షల సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వారిని మరింత ఒత్తిడికి లోను చేయకుండా ఉండాలి. ‘ఈ పాఠం ఎప్పుడు పూర్తి చేస్తావు? ఇంతసేపు చదివినా ఆ పోయెమ్ రాదు. ఇక ఎగ్జామ్ ఎలా రాస్తావు?’ అంటూ వారిలో మరింతగా భయాందోళనలను సృష్టించరాదు. తల్లిదండ్రులే సంయమనాన్ని కోల్పోయి పిల్లలను ఒత్తిడికి గురిచేస్తే వారిలో నెగెటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఈ పరీక్షలు రాయడం తన వల్ల కాదనుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే వారు తమకు వచ్చిన అంశాలను కూడా కంగారులో మర్చిపోతారు. ఇక పిల్లలు చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు టీవీలు చూస్తూ , కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఇలాంటి పనుల వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒత్తిడిని ఇలా జయించండి పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించడానికి పలువురు మానసిక శాస్త్ర నిపుణులు, యోగా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలను పాటించినట్లయితే ఒత్తిడి, ఆందోళన లేకుండా పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించవచ్చని వారు చెబుతున్నారు. ∙ఉపాధ్యాయులైనా, తల్లిదండ్రులైనా ‘పరీక్షలంటే యుద్ధం’ అనే భావనను పిల్లల్లో రేకెత్తించరాదు. వారి సామర్థ్యాన్ని గుర్తించి, వారి వెన్నంటే ఉండి, సామర్థ్యానికి తగిన ఫలితాలను రాబట్టేలా పిల్లలను ప్రోత్సహించడం కొనసాగించాలి. ∙ఒత్తిడి అనిపించినప్పుడు పిల్లలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఐదు నుంచి పది అంకెల వరకు లెక్కపెట్టిన తర్వాత శ్వాసను వదలడం ద్వారా ఒత్తిడి నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. ∙కొందరు పిల్లలు పరీక్ష హాలుకు వెళ్లేంత వరకు చదువుతూనే ఉంటారు. చివరి నిమిషం వరకు చదివితే బాగా రాసేస్తారని అనుకోవడం సరికాదు. చివరి నిమిషం ఒత్తిడిలో ఉన్నప్పుడు చదవడం వల్ల వచ్చిన విషయాలను కూడా మర్చిపోతారు. పరీక్ష హాలుకు వెళ్లడానికి కనీసం రెండు గంటల ముందు నుంచి చదవడం మానేస్తే మంచిది. ∙కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటి పానీయాలకు దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటివి తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందనుకోవడం ఉత్త భ్రమ మాత్రమే. కెఫీన్ మోతాదు పెరిగితే ఆలోచనల్లోని స్పష్టత లోపించే ప్రమాదం ఉంది. ∙పరీక్షల కోసం సిద్ధపడే విద్యార్థులు చదువు సాగించేటప్పుడు ప్రతి గంటకు పది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. విరామ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ చూడటం వంటి పనుల ద్వారా రిలాక్సేషన్ పొంది మళ్లీ చదువు కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ∙చదువు సాగించేటప్పుడు విజువలైజేషన్ టెక్నిక్ బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కళ్లు మూసుకుని పరీక్ష హాలులోనే ఉన్నట్లు ఊహించుకోండి. ప్రశ్నపత్రం తీసుకున్నట్లు, అన్నీ మీకు తెలిసిన ప్రశ్నలే వచ్చినట్లు ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల మీలో పాజిటివ్ దృక్పథం దానంతట అదే పెరుగుతుంది. పాజిటివ్ ఆలోచనలు మీరు మంచి ఫలితాలను సాధించడానికి దోహదపడతాయి. ప్రశాంతంగా నిద్రించండి పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలామంది విద్యార్థులు అర్ధరాత్రి దాటేంత వరకు చదువుతూ జాగారాలు చేస్తుంటారు. ఇలా జాగారాలు ఉండటం కంటే రోజూ కనీసం ఆరేడు గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రలోనే మెదడుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. నిద్రించేటప్పుడు ‘సెరటోనిన్’ ఎంజైమ్ చురుగ్గా స్రవిస్తుంది. దీనివల్ల అభ్యసన సామర్థ్యం, జ్ఞాపకశక్తి దానంతట అదే పెరుగుతుంది. తగినంత విశ్రాంతి తర్వాత చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, కంటి నిండా నిద్రపోయే వారే ఎక్కువ పదాలను గుర్తుంచుకోగలరని పలు పరిశోధనల్లో ఇప్పటికే రుజువైంది. అందువల్ల పరీక్షల సమయంలో విద్యార్థులు రోజూ కనీసం ఆరేడు గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోవాలి. ‘బట్టీ’ విక్రమార్కులు కావద్దు పాఠాలను కేవలం బట్టీ పట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇదివరకటి పద్ధతిలో ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను బట్టీ పట్టేస్తే పరీక్షలు గట్టెక్కేసే అవకాశాలు ఉండేవి. ప్రస్తుత విధానంలో అన్ని పాఠాలను విధిగా చదివి అవగాహన చేసుకోక తప్పదు. పాఠ్య పుస్తకంలోని ప్రతి అంశాన్నీ, ప్రతి భావనను సమగ్రంగా అవగాహన చేసుకుని సమాధానాలను రాయాలి. ప్రశ్నలకు సూటిగా సమాధానాలు రాయడానికి బదులు బహుళ సమాధానాలు వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది. ఒకసారి పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు తదుపరి సంవత్సరాల్లో జరిగే పరీక్షల్లో పునరావృతమయ్యే అవకాశాలు దాదాపు ఉండవు. అందువల్ల బట్టీ విధానం కంటే, పాఠాలను అర్థం చేసుకుంటూ అధ్యయనం సాగించడమే మేలు. ఎగ్జామ్స్ మేడిన్ చైనా... పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏదో ఒక దశలో ‘ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టాడ్రా బాబూ! అనుకోకుండా ఉండరు. పరీక్షలు కనిపెట్టిన మహానుభావుడు ఎవరో ఇదమిత్థంగా తెలియకపోయినా, అతగాడిని నోరారా తిట్టుకుంటూ ఉంటారు. ఇటీవల కొందరు ఔత్సాహికులు హెన్రీ ఫిషెల్ అమెరికన్ అనే తత్వవేత్త ఫొటో సామాజిక మాధ్యమాల్లో పెట్టి, విద్యార్థులను వేధించడానికి పరీక్షలు కనిపెట్టిన కఠినాత్ముడు, క్రూరాత్ముడు ఇతగాడేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. జర్మనీలో పుట్టి, అమెరికాలో స్థిరపడ్డ హెన్రీ ఫిషెల్ ఈ విషయంలో ఎలాంటి పాపమూ ఎరుగడు. ఈ పెద్దమనిషి ఇరవయ్యో శతాబ్దికి చెందిన తత్వవేత్త. పరీక్షల విధానం అంతకు చాలా పూర్వం నుంచే వాడుకలో ఉండేది. మొట్టమొదటగా చైనాలోని సుయి వంశీకుల పాలనలో క్రీస్తుశకం 605 సంవత్సరంలో పరీక్షల విధానం అమలులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఈ పద్ధతి వాడుకలోకి వచ్చింది. కింగ్ వంశీకులు ఈ పద్ధతిని 1905లో రద్దు చేశారు. అయితే, క్రీస్తుశకం 1806లో బ్రిటిష్ పాలకులు పరీక్షల పద్ధతిని తొలిసారిగా యూరోప్‌లో ప్రవేశపెట్టారు. సివిల్ సర్వీస్ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రవేశపెట్టిన ఈ పరీక్షల పద్ధతి శరవేగంగా ఇతర దేశాలకూ వ్యాపించింది. ఉద్యోగాలకు తగిన అభ్యర్థుల ఎంపిక కోసమే కాకుండా, పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు తరగతుల్లో ఉత్తీర్ణులను నిర్ధారించడానికి సైతం పరీక్షలు నిర్వహించడం వాడుకలోకి వచ్చింది. రియలిస్టిక్ ప్లాన్ ఉండాలి! పరీక్షలనగానే పిల్లలకు కాస్తంత భయం, ఒత్తిడి ఉండడం ఆరోగ్యకరమైన విషయమే! అసలు ఏమాత్రం భయం లేకున్నా పరీక్షలంటే సీరియస్‌నెస్ పోతుంది. అయితే ఇది స్థాయి దాటి ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తేనే ప్రమాదం. ఒత్తిడి ఎక్కువ అవ్వడం అన్నది సాధారణంగా అందరిలోనూ చూస్తూంటాం. ఇది ముఖ్యంగా పరీక్షలు దగ్గరవుతున్న కొద్దీ ఎక్కువవుతూ ఉంటుంది. పరీక్ష రోజు, ఆ ముందు రోజే కాకుండా ముందు నుంచే చదవడం మొదలుపెడితే పరీక్షల సమయంలో ఒత్తిడిని తప్పించుకోవచ్చు. అలాగే పరీక్షల సమయంలో ‘రోజుకు ఇన్ని గంటలు చదివేస్తా. అన్ని చాప్టర్లూ ఫినిష్ చేసేస్తా..’ లాంటివి పెట్టుకోకుండా, రియలిస్టిక్ ప్లాన్ ఉంటే మంచిది. నిద్ర, ఆహారాలు మాని చదవడం ప్రమాదకరం. నిజానికి పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడానికి ఇంకాస్త ఎక్కువ నిద్రే అవసరం. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదవమని ఒత్తిడి పెంచొద్దు. ఫిజికల్ ఎక్సర్సైజ్ పరీక్షల సమయంలో కొందరు స్కిప్ చేస్తుంటారు. కానీ దానివల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. పాజిటివ్ ఆటిట్యూడ్‌ను ఎప్పటికీ వదులుకోవద్దు. – డా. పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్ టైమ్ టేబుల్ వేస్కొని చదువుతున్నా! పరీక్షలు దగ్గరైపోయాయి. ఇప్పటికే ఏయే సబ్జెక్ట్స్ ఎలా ఎలా చదవాలో టైమ్ టేబుల్ వేస్కున్నా. మ్యాథ్స్ కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. ఏది కష్టమో ఆ సబ్జెక్ట్‌కు ఎక్కువ టైమ్ ఇచ్చి చదువుతున్నా. కొంచెం భయమైతే ఉంది కానీ, ఇంట్లో, స్కూల్లో అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అమ్మ వాళ్లైతే ఇప్పుడు ఏ పనీ చెప్పడం లేదు కూడా. బాగా రాస్తానన్న నమ్మకం ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్. – దేవర ఉదయ్‌కిరణ్, పదో తరగతి విద్యార్థి టెక్ట్స్ బుక్స్ బాగా చదవాలి! పరీక్షల సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. బాగా చదివిన విద్యార్థులు కూడా ‘చదివినవన్నీ గుర్తుంటాయా?’ అని ఆందోళన పడుతూంటారు. అందుకే రోజూ ధ్యానం చేస్తే ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. ముఖ్యంగా పరీక్ష రోజు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతబాగా పరీక్ష రాయగలరని తెలుసుకోవాలి. ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రోజ్ మిల్క్, ఆయిల్ తక్కువగా ఉండే వంటకాలు, పండ్లు, కూరగాయలను పిల్లల డైట్లో చేరిస్తే బాగుంటుంది. పిల్లలు బట్టీ పట్టకుండా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధిస్తారు. టెక్స్›్టబుక్స్ బాగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. – లక్ష్మీ శారద, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు -
మధ్యలో ఉన్నవే.. ఆదీ అంతం
జీవితాన్ని మధ్యలోనుంచైనా మొదలు పెట్టేందుకు సిద్ధమై ఉన్నప్పుడు ఎలా ఆరంభించాలి? ఎలా ముగించాలి అనే నిస్పృహే తలెత్తదు. ‘‘నేనొక పుస్తకాన్ని రాయాలని సంకల్పించిన ప్రతిసారీ.. ప్రారంభంలో, ముగింపులో నిస్పృహకు లోనవుతున్నాను. ఎందుకిలా అవుతోంది?’’ అని ఒక రచయిత.. ఆచార్య రజనీశ్ని అడిగాడు. ‘‘ప్రారంభం, ముగింపు.. ఈ రెండూ అతి కష్టమైన విషయాలు. మధ్యలోనిది ఒకటే తేలికైనది. అందులోంచే ఆ రెండిటినీ మనం స్వీకరించాలి’’ అన్నారు రజనీశ్. జీవితంలో కూడా ప్రారంభం, ముగింపు రెండూ మనిషి చేతిలో లేనివే. అందుకే వాటి కోసం మనం అన్వేషించాలి. తిప్పలు పడాలి. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించే ముందు మనం పడే ఘర్షణ ఈ ప్రాథమిక సృష్టి తత్వం కారణంగా జరిగేదే. ముగింపు కూడా అంతే. దాని కోసం ముందుగా ప్రణాళిక వెయ్యలేం. ఈ సందిగ్ధతను తొలగించుకోవాలంటే.. మధ్యలో ఏదైతే ఉందో దాన్నుంచే ఒక ప్రారంభాన్ని, ఒక ముగింపును ఎంచుకోవాలి. అంటే ఎక్కడి నుంచైనా ప్రారంభించి, ఎక్కడైనా ముగించవచ్చు. అప్పుడు ఎలా మొదలు పెడితే అదే ప్రారంభం, ఎక్కడ ఆగిపోతే అదే ముగింపు అవుతుంది. ఆద్యంతాల కోసం జీవితాన్ని తవ్వుకుంటూ వెళ్లే బాధ తప్పుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. ముహూర్తాలతో అకస్మాత్తుగా కొత్త జీవితం మొదలు కాదు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచే, మనం ఎలా ఉన్నామో అలా, ఆ క్షణం నుంచే ఒక పనిని సంకల్పించినప్పుడు అదే ముహూర్తం అవుతుంది. సంకల్పసిద్ధి జరిగినప్పుడు ప్రారంభానికి కాక, ముగింపునకు ప్రాధాన్యం వస్తుంది. ప్రత్యేకంగా అంతిమత్వం కోసం శ్రమించనక్కర్లేదు. జీవితాన్ని ఏ విధంగానైనా మొదలు పెట్టేందుకు, ఏ విధమైన జీవితాన్నయినా దర్శించేందుకు సిద్ధమై ఉన్నప్పుడు ఎలా ఆరంభించాలి? ఎలా ముగించాలి అనే నిస్పృహే తలెత్తదు. మధ్యలో ఏదైతే ఉందో అదే మనం. మొదటిది చివరిది ఎప్పటికీ మనది కాదు. -
పక్కా ప్రణాళికతోనే హత్య
పోలవరం రూరల్: పోలవరం మండలం ఎల్ఎన్డీ పేట గ్రామానికి చెందిన ఇళ్ల సావిత్రి, ఆమె కుమార్తె పులిబోయిన మంగతాయారును పథకం ప్రకారమే వారి భర్తలు హతమార్చారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో విషయం బయటపడింది. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. వీరిని ఆదివారం జడ్జి ఎదుట హాజరుపరిచారు. పోలవరం పోలీస్‌స్టేషన్ వద్ద డీఎస్పీ ఏటీవీ రవికుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. తల్లీకూతుళ్లు సావిత్రి, మంగతాయారును వారి భర్తలు ఇళ్ల రామాంజనేయులు, పులిబోయిన నా గరాజు హత్య చేసినట్టు చెప్పారు. ముందుగా వీరు వేసుకున్న పథకం ప్రకారం హతమార్చారు. గతేడాది నవంబర్ 8న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు కనిపించడం లేదని సావిత్రి తల్లి కొండా గంగమ్మ పోలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో సావిత్రి భర్త రామాంజనేయులపై వరకట్న వేధింపుల కేసు ఉంది. దీంతె రా మాంజనేయులు విడిగా ఉంటున్నాడు. పు లిబోయిన నాగరాజు భార్య మంగతాయారుపై అనుమానం పెంచుకుని అతడూ విడిగా ఉంటున్నాడు. ఈనేపథ్యంలో తల్లీకూతుళ్లు ఎల్ఎన్డీ పేటలో నివసిస్తున్నారు. కుమార్తె మంగతాయారును కాపురానికి తీసుకువెళ్లాలని నాగరాజు వద్ద సావిత్రి పట్టుబట్టింది. దీంతో ఎలాగైనా తల్లీకూతుళ్లను అంతమొందించాలని మామాఅల్లుళ్లు నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలో పక్కాగా ప్రణాళిక రచించారు. నాగరాజు భార్యను కాపురానికి తీసుకువెళతానని నమ్మించాడు. బుట్టాయగూడెం మండలం కేఆర్ పురం ఐటీడీఏ సమీపంలోని జీడిమామిడి తోటలో మామాఅల్లుళ్లు గొయ్యి తీసి సిద్ధం చేశారు. ఇల్లు చూశాను, మీరు చూస్తే కాపురం మొదలుపెడతామని అదేరోజు నాగరాజు తల్లీకూతుళ్లను నమ్మించి కన్నాపురం రమ్మన్నాడు. ముందుగా నాగరాజు భార్యను మోటార్‌సైకిల్‌పై మామిడితోటలోకి తీసుకువెళ్లగా అక్కడే పొదల మధ్య పొంచి ఉన్న ఆంజనేయులు మెడలో నైలాన్ తాడు వేసి బిగించి ఆమెను హతమార్చాడు. సమీపంలో తీసిన గోతిలో మృతదేహాన్ని పడేశాడు. తర్వాత నాగరాజు అత్త సావిత్రిని మోటార్‌సైకిల్‌పై తీసుకువచ్చాడు. ఆమెనూ హతమార్చి అదే గోతిలో వేసి పూడ్చి వీరిద్దరూ పరారయ్యారు. నాగరాజు, రామాంజనేయులను పూర్తిగా విచారించగా అసలు విషయం బయటపడిందని డీఎస్పీ పేర్కొన్నారు. సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సై కె.శ్రీహరిరావు ఉన్నారు. -
నేనొక ప్లాన్ వేశాను
‘‘సుష్మా! నేను ఫోరంకి వెళ్లొస్తాను. మా నాన్నకి బాగాలేదంట. తమ్ముడు ఫోన్ చేశాడు. వెళ్లి చూసొస్తాను. సాయంకాలానికి వచ్చేస్తాలే. మీ నాన్నకు మందులు ఇవ్వు అన్నం తినగానే.’’ అన్నది హైమావతి.‘‘సరే! పిన్నీ’’ అన్నది సుష్మ.హైమావతి బెడ్రూమ్లోకి వెళ్లింది. నాగభూషణం కళ్లుమూసుకొని ఉన్నాడు.‘‘ఏమండీ!’’ అని తట్టి పిలిచింది.నాగభూషణం కళ్లు తెరిచాడు.‘‘ఫోరంకి వెళ్లొస్తాను. మా నాన్నకి బాగాలేదంట’’ అన్నది.నాగభూషణం తల ఊపాడు. హైమావతి భవానీపురం నుంచి విజయవాడ బస్‌స్టేషన్‌కి వెళ్లే బస్సు ఎక్కింది. అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు వీర్రాజు. ఇద్దరూ ఒక హోటల్‌కెళ్లి ఫ్యామిలీరూమ్లో కూర్చున్నారు.‘‘అర్జెంట్ అన్నావు. ఏంటది?’’ అడిగాడు వీర్రాజు.‘‘ఉండవల్లిలో పొలం అమ్మడానికి బేరంపెట్టాడు మా ఆయన. ఆ డబ్బుతో కూతురి పెళ్లి చేయాలని ప్లాన్. అది అమ్మేస్తే నాది అథోగతే. అందుకే నేనొక ప్లాన్ వేశాను.’’‘ప్లానా?’’‘‘ఔను. రేపు ఉదయం పది తర్వాత నువ్వు నీ కారు తీసుకురా. కాన్సర్ ఆసుపత్రికని ఆయన్ని తీసుకొస్తాను. దారిలో ఎక్కడో ఒక చోట కారు ఆపి ముఖం మీద దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేద్దాం. పీడావిరగడ అవుతుంది’’ చెప్పింది హైమావతి.వీర్రాజు ఆలోచనలో పడ్డాడు.నాగభూషణం రెండో భార్య హైమావతి. రిటైర్మెంట్ దగ్గరికొచ్చాక నాగభూషణం భార్య చనిపోయింది. హైమావతిని పెళ్లి చేసుకున్నాడు. వయసులో ఇరవై ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఆమెకు వీర్రాజుతో అక్రమ సంబంధం ఉంది. వీర్రాజుకి సొంతంగా కారు ఉంది. తనే డ్రైవ్ చేసుకుంటూ టాక్సీలా తిప్పుతుంటాడు. ఉండవల్లి ఊళ్లో నాగభూషణానికి ఎకరం పొలం ఉంది. అది రాజధానికి దగ్గరగా ఉండడంతో విలువ పెరిగింది. రిటైరైన తర్వాత నాగభూషణానికి క్యాన్సర్ జబ్బు బయట పడింది. తను పోయే లోపల కూతురు సుష్మ పెళ్లి గ్రాండ్‌గా చేసి అత్తారింటికి పంపేయాలని ఆలోచనలో ఉన్నాడు. కోటి రూపాయల కట్నమైనా ఇచ్చి మంచి ఉద్యోగస్తుడికి ఇవ్వాలని కోరిక. అందుకు హైమావతి వ్యతిరేకి. పొలం అమ్మడం ఇష్టం లేదు. బ్యాంకులో ఉన్న డబ్బుతో మామూలు సాదాసీదా సంబంధం చూసి సుష్మ పెళ్లి చేసి పంపాలని పోరుతోంది. పొలం అమ్మేస్తే ఆయన పోయాక తనకేం మిగులుతుంది? భార్యగా వచ్చే ఫ్యామిలీ పెన్షన్‌తో బతకాలి. ‘‘సరే అయితే! ఆసుపత్రికి వెళ్లేటప్పుడు వద్దు. ముందు ఆసుపత్రికి వెళ్దాం. అక్కడ టెస్టులు అవీ చేస్తారు. టైమ్ పడుతుంది. ఆయన్ని అక్కడ ఉంచి మనం హాయ్‌ల్యాండ్‌లో గడుపుదాం. సాయంకాలం వెళ్లి ఆయన్ని కారెక్కించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఫినిష్ చేద్దాం. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు. ఎటూ క్యాన్సర్‌తో పోయేవాడే అని అందరికీ తెలుసు.’’ అన్నాడు వీర్రాజు.హైమావతి తల ఊపింది. వీర్రాజుతో అప్పుడప్పుడు హోటళ్లలో గడపడం ఆమెకు మామూలే. మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన ఏజెంట్ విక్రమ్ లాప్టాప్లో వధువుల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న అబ్బాయిల ఫొటోలు, బయోడేటాలు నాగభూషణానికి చూపిస్తున్నాడు. ఎక్కువగా అమెరికాలో జాబ్స్ చేస్తున్న వాళ్లవే ఉన్నాయి. నాగభూషణానికి ఫారిన్ సంబంధం చేయడం ఇష్టం లేదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని భారీ ఎత్తున కట్నాలు ఇచ్చి కూతురితో పెళ్లి చేసి మోసపోయిన వార్తలు ఈమధ్య ఎక్కువగా వస్తున్నాయి. కొందరేమో అక్కడ ఆల్రెడీ ఏ తెల్లమ్మాయినో పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంటారు. తల్లిదండ్రులకు ఆ సంగతి చెప్పరు. ఇక్కడ పేరెంట్స్ ఒత్తిడి చేస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి కాపురానికి వెళ్లాక అసలు సంగతి బయటపడి లబోదిబోమంటారు. ఇంకొందరు యువకులకు అమెరికాలో ఏ ఉద్యోగం ఉండదు. సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. తీరా కాపురానికి వెళ్లాక తెలుస్తుంది, అక్కడ ఏ పెట్రోలు బంకులోనో, సూపర్ మార్కెట్లోనో ఉద్యోగం చేస్తున్నాడని.అందుకే నాగభూషణం ఇండియాలోనే ఉద్యోగం చేస్తున్న సంబంధాలు చూడమని చెప్పాడు. సుష్మ బీటెక్ చదివింది. తర్వాత అమెరికాలో ఎమ్మెస్ చేయాలనుకుంటోంది. ఆమె స్నేహితురాళ్లు చాలామంది అమెరికాకి వెళ్లి చదవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ తండ్రికి క్యాన్సర్ అని బయటపడగానే ఆమె ఆశలు నీరు కారిపోయాయి.మ్యారేజ్ బ్యూరో ఏజెంట్ వెళ్లిపోయిన తర్వాత సుష్మ తండ్రితో చెప్పింది. ‘‘నాన్నా! నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. కావాలంటే ఇక్కడే ఎంటెక్ చేస్తాను.’’‘‘కాదమ్మా! నువ్వు అమెరికాలో ఎమ్మెస్ చేసినా, ఇక్కడ ఎంటెక్ చేసినా తేడా ఏం లేదు. కాకపోతే నా పరిస్థితి తెలుసుగా? ఎప్పుడు పోతానో తెలీదు. నేను ఉండగానే నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది.’’ అన్నాడు నాగభూషణం. తండ్రి సంగతి ఆమెకు బాగా తెలుసు. తను అనుకున్నదే చేస్తాడు. ఎవరిమాటా వినడు. తన తల్లి చనిపోయినప్పుడు చాలామంది మళ్లీ ఈ వయసులో పెళ్లెందుకు? వద్దు అన్నారు. ఇరవై ఏళ్ల చిన్నదాన్ని చేసుకోవడం ఎందుకు? అన్నారు. అయినా ఆయన వినలేదు. హైమావతి తండ్రి కూడా విధవరాలైన కూతురికి పెళ్లి చెయ్యలేక పోతున్నాడు. నాగభూషణం పోయినా సొంత ఇల్లు, పొలం ఉంది, పైగా కూతురికి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని ఆలోచించి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు.ఇప్పుడిక సుష్మ చదువుకి ఫుల్స్టాప్ పెట్టక తప్పని పరిస్థితిలో ఉంది. పెళ్లి చేసుకోక తప్పదని ఆమెకు అర్థమైంది. ∙∙ నాగభూషణం సుష్మ పెళ్లి చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండడంతో హైమావతి పెళ్లి ఆపడానికి అన్నిరకాలుగా ఆలోచిస్తోంది. ఎలాగూ భర్త తన మాటవినడు.‘‘నువ్వు పెళ్లికి ఒప్పుకోకు. మీ నాన్న ఒత్తిడి చేస్తాడు. ఏ సంబంధం నచ్చలేదని చెప్తుండు. ఆయన ఎక్కువ రోజులు బతకడు. ఆ తర్వాత నువ్వు అమెరికా వెళ్లి చదువుకుందువు గాని’’ అని సుష్మకు ఎక్కించింది. సవతి తల్లికి తన మీద ఎంతో ప్రేమ ఉందని సుష్మ అనుకుంది. అసలు సంగతి అది కాదనే గ్రహింపు లేదు. అందుకే తనకు పెళ్లి వద్దని తండ్రితో వాదిస్తోంది. కానీ తండ్రి తన మాటలు లెక్కచేయడని ఆమెకు తెలుసు. జరిగేది జరుగుతుందనే నిర్వేదంలో పడిపోయింది సుష్మ.అనుకున్నట్టుగానే వీర్రాజు ఉదయం పది గంటలకు భవానీపురంలోని నాగభూషణం ఇంటికి కారు తీసుకొచ్చాడు.నాగభూషణం అప్పుడు టిఫిన్ చేస్తున్నాడు.‘‘వీర్రాజూ! టిఫిన్ చేద్దువుగాని లోపలకు రా!’’ అని పిలిచింది హైమావతి.‘‘వద్దండీ! టిఫిన్ చేసొచ్చాను అమ్మగారూ!’’ అని వినయం ఒలకబోశాడు వీర్రాజు.తర్వాత నాగభూషణాన్ని ఎక్కించుకుని కారులో బయల్దేరారు. తాడేపల్లిలో ఉంది మణిపాల్ క్యాన్సర్ హాస్పిటల్. విజయవాడలో కృష్ణానది మీదున్న కనకదుర్గ వారధి దాటి తాడేపల్లికి చేరుకున్నారు. నాగభూషణాన్ని ఆసుపత్రిలో నర్స్‌కి అప్పగించారు. ఆమె శ్రద్ధగా చూస్తుంది నాగభూషణాన్ని.నాగభూషణం టీచర్‌గా పని చేస్తున్నప్పుడు నర్స్ సునీత ఆయన శిష్యురాలు. అందుకే వచ్చినప్పుడల్లా ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుంది. మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసి టెస్ట్‌లు, ట్రీట్మెంట్ను శ్రద్ధగా చేస్తుంది.నాగభూషణం శిష్యురాలు అక్కడ ఉండడం హైమావతికి వెసులుబాటుగా ఉంది. ఆయన్ని అప్పగించి వీర్రాజుతో ఎంజాయ్ చేయడానికి బయలుదేరింది. ∙∙ సాయంకాలమైంది. చీకటిపడింది. హైమావతి తిరిగి రాలేదు. నర్స్ సునీత.. నాగభూషణం దగ్గరున్న సెల్‌ఫోన్ నుంచి హైమావతికి కాల్ చేసింది. రింగవుతున్నది కానీ ఆమె లిఫ్ట్ చేయడం లేదు.‘‘మాష్టారూ! మేడమ్ లిఫ్ట్ చెయ్యడం లేదు’’ అన్నది సునీత. ‘‘ఈ పాటికే రావాలి కదా?’’ అన్నాడు.ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా రింగవుతుంది కానీ హైమావతి కాల్ లిఫ్ట్ చేయడం లేదు.‘‘సునీతా! మా అమ్మాయికి కాల్ చెయ్యి. అసలు ఇంట్లో నుంచి హైమా బయల్దేరిందో లేదో? అన్నాడు నాగభూషణం. సుష్మ ఫోన్ ఎత్తగానే సునీత ఫోన్‌ను నాగభూషణానికి అందించింది.‘‘నాన్నా! ఘోరం జరిగిపోయింది.’’ అన్నది సుష్మ వణుకుతున్న గొంతుతో. ‘‘ఏం జరిగిందమ్మా?’’ అడిగాడు కూతుర్ని.‘‘నాన్నా! నందన్ రిసార్ట్స్ వెళ్లే దారిలో పిన్ని వెళ్తున్న కారును ఓ బస్సు ఢీ కొట్టిందట. పిన్ని హ్యాండ్‌బ్యాగ్‌ని, అందులోని తన ఫొటోను టీవీలో చూపిస్తున్నారు. పిన్ని స్పాట్లోనే చనిపోయిందట నాన్నా. శవాన్ని కూడా చూపిస్తున్నారు..!’’ అని చెప్పింది సుష్మ.ఎప్పుడూ హాయ్‌ల్యాండ్‌లో ఎంజాయ్ చేసే వీర్రాజు, హైమావతి ఈసారి నందన్ రిసార్ట్స్‌లో గడపాలనుకున్నారు. విధి చిన్నచూపు చూసింది. అందుకే అంటారు తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని. నాగభూషణం బిత్తరపోయాడు.‘‘అటువైపు ఎందుకు వెళ్లింది?’’ అడిగాడు కూతుర్ని. సుష్మకి మాత్రం ఏం తెలుసు?‘‘ఏమో నాన్నా!’’ అన్నది. -
కొత్త ఏడాదైనా కాస్త మారదాం..!
మరో సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. మరి ఆర్థికాంశాలకు సంబంధించి ఎప్పుడూ ఏవేవో సాకులు చెప్పుకుంటూ వాయిదాలు వేస్తూ వస్తున్న వారు ఇప్పటికైనా సరైన ప్రణాళిక వేసుకున్నారా? లేదనుకోండి... ఇకనైనా ఆలస్యం చెయ్యకండి. ఎందుకంటే గమ్యంపై స్పష్టత ఉంటేనే ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనుసరించదగ్గ ఆర్థిక తీర్మానాల గురించి నిపుణులు, ఆర్థిక సలహాదారులు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం... ఆలస్యం విషమే! కొత్తవారైతే ముందు 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్ 80సీ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే పెట్టుబడులకింకా మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. మార్చిలోపు పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. చివరి నిమిషం వరకు వాయిదా వేస్తే ఆఖర్లో ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే ముందుగా ఆరంభిస్తే వయసు, అవసరాలు, రిస్క్ తీసుకోగల స్థాయి, రాబడులు, అవసరంలో నగదు చేసుకోగల వెసులుబాటు వంటివన్నీ పరిశీలించి తగిన సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ఆరంభం అవుతుంది కనక కనీసం జూన్ నుంచయినా పన్ను ఆదా పెట్టుబడులను ఆరంభించి ఏడాది పాటు కొనసాగించాలి. ముందుగా ఆరంభించడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనంతో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. సకాలంలో రిటర్నులు వేయండి... మనలో కొందరు పన్ను రిటర్నులను సకాలంలో దాఖలు చేయరు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఆలస్యమైతే వడ్డీతో పాటు పెనాల్టీ కూడా భరించాలి. గడువులోపు రిటర్నులు వేయకపోతే ఆలస్య రుసుం గతంలో రూ.1,000గా ఉండగా అదిప్పుడు రూ.10,000గా మారింది. అందుకే గడువులోపు రిటర్నులు ఫైల్ చేయాలి. గడువులోపు బీమా పాలసీల ప్రీమియం చెల్లించడం కూడా అవసరమే. లేదంటే బీమా రక్షణ కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా రుణాలకు సకాలంలో చెల్లింపులు చేయడం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఆలస్యమైతే అనవసర వడ్డీ భారంతో పాటు క్రెడిట్‌స్కోరు కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం కట్టేస్తే బెటర్! చాలా మందికి క్రెడిట్ కార్డుపై భారీ మొత్తం వాడటం, నెలయ్యేసరికి ఎంతో కొంత కనీస బిల్లు చెల్లించటం అలవాటు. కానీ అలా చేయటం వల్ల వారి మొత్తం రుణం ఎప్పటికీ తీరదనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బ్యాలెన్స్ మొత్తంపై దాదాపు నెలకు 2.5 నుంచి 3 శాతం వడ్డీ అంటే ఏడాదికి 30–36 శాతం చెల్లించాల్సి వస్తుంది. దీనికి ఆలస్యపు చెల్లింపుల ఫీజు కూడా తోడైతే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే కార్డుపై వీలైనంత తక్కువ వాడటం... ఏ నెలకు ఆ నెల మొత్తం బిల్లు చెల్లించేయటం చేస్తుండాలి. రుణ సమస్యల్లో ఉన్న వారు ముందుగా తీర్చేయాల్సింది క్రెడిట్ కార్డు బకాయిలే. రివాల్వింగ్ క్రెడిట్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. జీవితానికీ కవరేజీ తప్పనిసరి.. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఎందుకంటే జీవితం, ఆరోగ్యం అన్నవి ఇలానే ఉంటాయని ఊహించలేం. అనారోగ్యం పాలైతే అయ్యే వ్యయాలు బడ్జెట్‌ను గుల్ల చేసేస్తాయి. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి దూరమైతే ఆ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. అందుకే తమ వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర బీమా పాలసీ తీసుకోవడం మరవద్దు. ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే వాటికి సరిపడా బీమా కవరేజీ పెంచుకోవాలి. జీవిత బీమాకు టర్మ్ పాలసీలు ఉత్తమం. తక్కువ ప్రీమియానికే గణనీయమైన కవరేజీనిస్తాయి. అలాగే రూ.4–5 లక్షల కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్‌పాలసీ కూడా తీసుకోవాలి. ఖర్చుల్లో స్మార్ట్‌గా... ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. అనుకోని, అనూహ్య, అత్యవసరాలు ఏర్పడితే ఆదుకుం టుంది. ఈ నిధుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా తక్కువ రిస్క్ ఉండే లిక్విడ్ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవసరంలో వేగంగా వీటిని వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే, సంక్షోభం ఏర్పడితే తప్ప ఈ నిధుల్ని కదలించకూడదు. మీ బడ్జెట్ పరిమితుల్లో స్మార్ట్‌గా ఖర్చు చేయడాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ ఖర్చులు చేయి దాటిపోకుండా వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఈ విషయంలో సా యం చేయడానికి ఆన్లైన్ మనీ మేనేజ్మెంట్ టూల్స్ చాలానే ఉన్నాయి. అవసరం లేని వాటిని రుణం తీసుకుని కొనే చర్యలకు దూరంగా ఉండాలి. ఈక్విటీల్లో సిప్ చేయండి.. ఏడాదికి 4– 6 శాతం వడ్డీనిచ్చే సేవింగ్స్ ఖాతాలో నిధులను నిల్వ చేసుకోవడం సరికాదు. పైగా సేవింగ్స్ రాబడులు ఏడాదిలో రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అధిక రాబడులను ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశాలపై దృష్టి సారించడం మంచిది. స్థిరమైన ఆదాయం కోసం డెట్ సాధనాలు అవసరమే కానీ, వీటిలో చాలా వరకు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇవ్వలేవు. ఈక్విటీలకు మాత్రం ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులనిచ్చే సత్తా ఉంది. అందుకే, ఏ సాధనానికి ఎంత కేటాయించాలన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ వయసు, అవసరాలు, రిస్క్‌కు అనుగుణంగా ఈక్విటీ, డెట్ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి అందరికీ నప్పే ఓ ఆచరణీయ సూత్రం ఉంది. 100 నుంచి మీ ప్రస్తుత వయసు తీసివేయగా, ఎంత వస్తే అంత మేర ఈక్విటీలకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు మీ వయసు 35 అనుకోండి. అప్పుడు 65 వస్తుంది. అంటే ఈక్విటీలకు మీ పెట్టుబడుల్లో 65 శాతం కేటాయించుకోవచ్చని అర్థం. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం కొంత వరకు రక్షణాత్మకం. స్వల్పకాలంలో అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం మంచి ఫండ్స్ రెండంకెల స్థాయిలో లాభాలను ఇస్తున్నాయి. పైపెచ్చు ఈక్విటీ ఫండ్స్‌లో ఏకమొత్తంలో కంటే నెలవారీ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయటమే మంచిది. ముఖ్యంగా మార్కెట్లు బాగా పెరిగి ఉన్న ప్రస్తుత స్థితిలో స్టాక్స్ విలువలు చాలా గణనీయమైన స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ మార్కెట్లు కరెక్షన్కు లోనవుతున్నా గానీ సిప్ రూపంలో పెట్టుబడులు ఆపకూడదు. మార్కెట్లు తగ్గుతున్నప్పుడు ఫండ్స్ యూనిట్ల విలువ కూడా తగ్గుతుంది. కనుక సిప్ రూపంలో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. స్వల్పకాలంలో ఆటుపోట్లు కనిపించినా దీర్ఘకాలంలో సిప్ చాలా చక్కని రాబడులకు బాట వేస్తుంది. -
కోత్త యాక్షన్ ప్లాన్ తో జనంలోకి
-
సెలవు తీసుకుంటున్నారా...?
విదేశాల్లోనయితే ఉద్యోగులు ఏటా కొన్ని రోజులు సెలవు పెట్టి వెళ్లడం సర్వ సాధారణం. కంపెనీలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉద్యోగులకు సెలవు కాలంలో అదనపు వేతనాలు చెల్లిస్తుంటాయి. ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ హెరాల్డ్‌లో నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఏటా 40 రోజులు సెలవుపై వెళ్లడం తప్పనిసరి. ఈ కాలంలో వారికి సాధారణ వేతనం కంటే 50 శాతం అదనంగా చెల్లిస్తారు. కానీ, మనదేశంలో పరిస్థితులు భిన్నం. నిత్య జీవితపు ఒత్తిళ్లను పక్కన పెట్టి కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్లొద్దామన్నా... సెలవు దొరకడం కష్టం. ఒకవేళ సెలవు దొరికినా... ఏదైనా టూర్‌కు వెళ్లి వద్దామనుకుంటే అందుకు సరిపడా నిధులుండవు. ఎక్కువ మందికి ఎదురయ్యేవి ఈ పరిస్థితులే. మన దేశంలో ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా ఎక్కువే. ఇక ఈ ప్రపంచంలో సెలవుల భాగ్యం నోచుకుని వారిలో భారతీయులు నాలుగో స్థానంలో ఉన్నట్టు ‘ఎక్స్పీడియా వెకేషన్ డిప్రీవియేషన్ రిపోర్ట్ 2016’ చెబుతోంది. ఇటీవలే ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన సర్వేలోనూ మూడింట రెండొంతులు తమకు తగినంత విరామందొరకడం లేదనే చెప్పారు.మన దేశంలో ముఖ్యంగా మధ్య వయసులో ఉన్న వారు ఎక్కువగా సెలవులకు దూరమవుతున్నారు. 30 ఏళ్లలోపు వారిలో ఇది 64 శాతం ఉంటే 41–50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఇది 71 శాతంగా ఉంది. ఒకవేళ వీలు దొరికి సెలవు చిక్కి ఎటైనా వెళ్లినా గానీ, వారు కార్యాలయానికి సంబంధించిన మెయిల్స్‌ను తరచూ చెక్ చేసుకోవడంతోపాటు, తమ ఫోన్‌కు వచ్చే ఆఫీసు సంబంధిత కాల్స్‌ను రిసీవ్ చేసుకుని సమాధానం చెప్పాల్సి వస్తుందట. కానీ, మనస్తత్వ శాస్త్రవేతల విశ్లేషణ ప్రకారం కేవలం ఉద్యోగం, పనే కాదు!! విరామం, విశ్రాంతి కూడా అవసరమే. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఉద్యోగికి తగినంత విశ్రాంతి లభిస్తే పని మీద ఎక్కువ దృష్టి సారించగలరనేది వారి మాట. ఎందుకని...? మన దేశంలో ఉద్యోగులు ఎక్కువ రోజుల పాటు సెలవు తీసుకునే సాహసం దాదాపు చేయరు. అన్నేసి రోజులు సెలవు పెట్టి యాజమాన్యం ఆగ్రహానికి గురి కావడం ఎందుకన్న ధోరణే అందుకు కారణమన్నది నిపుణుల మాట. కొన్ని కంపెనీల్లో ఉద్యోగులు సెలవు తీసుకోవడాన్ని నిరుత్సాహపరిచే విధానాలు కూడా అమలవుతుంటాయి. అయితే, మరింత మంది యువత ఉద్యోగాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ ధోరణి మారాల్సి ఉందని పీపుల్ స్ట్రాంగ్‌కు చెందిన దేవాశిష్ శర్మ అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యతలు, ప్రణాళిక సెలవు సంపాదించారనుకోండి... ఆ తర్వాత దృష్టి సారించాల్సింది ప్రణాళికపైనే. తగిన ప్రణాళిక, షెడ్యూల్‌తో సెలవులను పూర్తిగా ఆస్వాదించొచ్చంటున్నారు నిపుణులు. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, కిరణ్ దంపతులు ఏటా ఓ పది రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లడం తప్పనిసరిగా చేస్తుంటారు. అందుకోసం వారు టికెట్లు, హోటల్ రూమ్‌ను చాలా ముందుగానే బుక్ చేసుకుంటారు. దీంతో తక్కువ చార్జీలకే బుకింగ్ పూర్తి చేయడం ద్వారా వారు తగినంత ఆదా చేసుకుంటున్నారు. వీరి టూర్ బడ్జెట్ రూ.60,000. దీంతో ఎక్కడికి వెళ్లాలి, ఏ మార్గంలో వెళ్లాలి. అక్కడ ఏమేం చూడాలి, స్థానికంగా విడిది, భోజనం, ప్రయాణం ఇవన్నీ కూడా కచ్చితమైన ప్రణాళిక మేరకు ప్లాన్ చేసుకుని బడ్జెట్‌లోపే వెకేషన్ పూర్తి చేస్తామని వారు తెలియజేశారు. బడ్జెట్ కీలకం ప్రయాణానికి కావాల్సింది బడ్జెటే. వాస్తవానికి మన దేశంలో ఎక్కువ మంది పొదుపరులే. కానీ ఎటైనా వెళ్లాలనుకుంటే మాత్రం డబ్బులకు కటకట కనిపిస్తుంది. 34 శాతం మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కారణం సెలవు పెట్టి ఎటైనా వెళ్లి రావడం అన్నది వారి దృష్టిలో ముఖ్యం కాకపోవడం ఒకటైతే, రెండోది పొదుపు చేయకపోవడం. అందుకే వెకేషన్‌కు బడ్జెట్ నిర్ణయించుకుని ప్రతీ నెలా కొంత మొత్తం పక్కన పెడుతూ వెళ్లడమే దీనికి పరిష్కారం. ఇందుకోసం సిప్ మంచి మార్గం అంటున్నారు ఆర్థిక సలహాదారులు. బడ్జెట్‌కు అనుగుణంగా నెలకు రూ.2,000 నుంచి వీలైనంత షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వీటిని నగదుగా మార్చుకోవచ్చు. పైగా ఆటుపోట్లు లేకుండా స్థిరమైన రాబడులు ఇస్తాయి ఇవి. ఏడాది, ఆలోపు అవసరాల కోసం స్టాక్స్‌లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ కారణంగా అసలు లక్ష్యం నెరవేరకపోవచ్చు. గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మీ స్వల్ప కాలిక అవసరం కోసం పొదుపు చేస్తున్నారే గానీ, రాబడుల కోసం ఇన్వెస్ట్ చేయడం లేదు. అందుకే రిస్క్ సాధనాలను ఎంచుకోవడం తగదు. ఒకవేళ హాలిడే ప్లాన్‌కు మూడు, నాలుగేళ్ల సమయం ఉంటే అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఎక్కువ వ్యవధి ఉంటుంది కనుక, రిస్క్ ఉన్నప్పటికీ పొదుపుతోపాటు మెరుగైన రాబడులూ అందుకోవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ రూ.187: కొత్త ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల ఆంక్షలకనుగుణంగా తారిఫ్లో మార్పులు చేసింది. ముఖ్యంగా ఇటీవల జియో ఎయిర్టెల్ లాంటి ఇతర మేజర్ సంస్థలు పోటా పోటీగా సరికొత్త ప్లాన్లను తీసుకు రావడంతో పాటు బీఎస్ఎన్ఎల్ కూడా తన ప్లాన్లను సమీక్షించింది. దాదాపు నెల రోజుల క్రితం లాంచ్ చేసిన రూ.187ల ప్లాన్‌లో సరికొత్త మార్పుతీసుకొచ్చింది. 28 రోజుల వాలిడిటీ ఉన్న ఈప్లాన్‌లో 1 జీబీ డేటాతోపాటు అన్లిమిటెడ్ (నేషనల్ రోమింగ్) కాలింగ్‌ను అందిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్లాన్‌లో 1 జీబీ డేటా, అన్లిమిటెడ్ (హోమ్ సర్కిల్లో)లోక్‌ల్ కాలింగ్మాత్రమే. అయితే ఢిల్లీ, ముంబాయి నగరాలు తప్ప దేశ వ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రదేశాలకు ఈ ప్లాన్ వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్ మరో ప్లాన్ రూ. 186లో అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ వాయిస్ కాల్స్ , 1 జీబీ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్180 రోజులు చెల్లుతుంది. కానీ డేటా మొదటి 28 రోజుల్లో మాత్రమే ఇవ్వబడుతుంది. అలాగే, అపరిమిత వాయిస్ కాల్స్ ఆన్-నెట్ , ఆఫ్-నెట్ వాయిస్ కాల్స్ కూడా. -
టాటా సన్స్ ప్రతిపాదనపై మిస్త్రీ ఫైర్
సాక్షి, ముంబై: టాటా గ్రూపులోని టాటా సన్స్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ లిమిటెడ్‌గా అవతరించనుంది. టాటా సన్స్ సంస్థను ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చే ప్రతిపాదనను మైనారిటీ షేర్‌హోల్డర్ల అనుమతి కోరేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్లలో మార్పులు చేయాల్సి ఉండగా.. దీనికి వాటాదారుల అనుమతి కంపెనీ కోరనుంది. అయితే మిస్త్రీ కుటుంబానికి చెందిన పెట్టుబడి సంస్థ సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రెవేట్ లిమిటెడ్ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ హక్కుల అణచివేసేందుకు తీసుకున్న చర్య అంటూ బోర్డు కు ఒక లేఖ రాసింది. ఈ ప్రతిపాదన మైనారిటీ వాటాదారులను మరింత అణిచివేసే "మరొక ఆయుధం" గా పేర్కొంది. మరోవైపు టాటా సన్స్ ఒక ప్రైవేటు కంపెనీగా మారితే, మైనారిటీ వాటాదారుల హక్కులను మరింత నిరుత్సాహపరుస్తుందని ప్రాక్సీ సలహా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇది ఒక తిరోగమన దశ అని పేర్కొన్నారు. ఒకవేళ టాటాసన్స్ ప్రతిపాదనను షేర్హోల్డర్లు ఆమోదిస్తే, టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా కంపెనీ పేరు మారుతుంది. సెప్టెంబర్ 21న వార్షిక సర్వ సభ్య సమావేశం జరగనుండగా.. దీనికి ముందుగా ఈ ప్రతిపాదన రావడం విశేషం. అయితే.. దీనికి నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ ఆమోదం రావాల్సి ఉంటుంది. దీంతో పాటు 75 శాతం మైనారిటీ వాటాదారులు కూడా అనుమతించాలి. సైరస్ మిస్త్రీ ని టాటా సన్స్ బోర్డు ఛైర్మన్‌గా తొలగించిన తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. -
టీడీపీలో కుట్ర మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర చేసిన వ్యవహారం టీడీపీలో మంటలు రేపుతోంది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణుల్లో చీలిక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి, వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుపై టీడీపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే పార్టీకి 5వేల మంది రాజీనామా చేస్తారంటూ ఆయన వర్గం అల్టిమేటం ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర పన్నారంటూ అప్పలనాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుట్ర పన్ని అప్పలనాయు డును అరెస్ట్ చేయించారని మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ అరోపిస్తున్న సంగతి తెలిసిందే. అండగా ఉండాల్సిందిపోయి కుట్రలా.. ఈ వ్యవహారం అనంతరం టీడీపీలో రెండు వర్గాల వారు రోడ్డెక్కినా పార్టీ అధినాయకత్వం తనకేమీ తెలియనట్టే నటిస్తోంది. అప్పలనాయుడును చింతమనేని కావాలనే ఇరికించారని, కుట్రకు బలైన తమకు అండగా నిలవాల్సింది పోయి చర్యలు తీసుకోవడం ఏంటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ఇసుక మాఫియా నేతలకు, పోలీసులపై దాడులకు దిగిన వారికి, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్న వారికి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి పార్టీ అధిషా ్టనం ఎలా కొమ్ము కాస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పలనాయుడుపై క్రమశిక్షణ చర్యలను వెనక్కి తీసుకుని, అక్రమ కేసులు ఎత్తివేయకపోతే వెంకటాపురం, చుట్టుపక్కల ఉన్న 5వేల మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. చింతమనేని, అప్పలనాయుడు వర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదంతో ఏలూరు నియోజకవర్గ టీడీపీలో సంక్షోభం తలెత్తింది. దెందులూరు నియోజకవర్గానికీ ఇది పాకింది. అప్పలనాయుడుకు తూర్పుకాపు సంఘం మద్దతు మరోవైపు తూర్పు కాపు సంఘం రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా నిలిచింది. ఆయనపై కక్షసాధింపు చర్యలు ఆపకపోతే తామంతా పార్టీకి దూరమవుతామని ఆ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తమకు అండగా ఉన్నారని, ఆయన సాయంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావును, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇదిలావుంటే.. చింతమనేని ప్రభాకర్ వర్గం దీనిపై ఆగ్రహంగా ఉంది. తమ నేతను హత్య చేయడానికి కుట్ర పన్నిన వారికి ఏలూరు ఎమ్మెల్యే ఎలా అండగా ఉంటారని ప్రశ్నిస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు వెంకటాపురం గ్రామ పంచాయతీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న తనకు అప్పలనాయుడు నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్కు సోమవారం విజ్ఞప్తి చేశారు. తన ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ ఇప్పించాలని ఎస్పీని కోరారు. పోలీసులకు తలనొప్పి చింతమనేని ప్రభాకర్, రౌడీషీటర్ జుజ్జువరపు జయరాజు, కోమర్తి మధులను హత్య చేసేందుకు అధికార పార్టీకి చెందిన రెడ్డి అప్పలనాయుడు కుట్ర పన్నిన వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక వర్గం రెడ్డి అప్పలనాయుడుపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరో వర్గం ఈ కేసు నుంచి అప్పలనాయుడును బయట పడేసేందుకు ప్రయత్ని స్తోంది. ఇరువర్గాల మధ్య తాము నలిగిపోతున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు తుపాకీ లైసెన్స్ కోసం చింతమనేని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆ అవకాశం కల్పించలేదు. తనకు గన్మెన్లు వద్దని, ఎస్కార్ట్ కావాలని అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును గతంలో చింతమనేని కోరారు. దీనికి సానుకూల స్పందన రాలేదు. ఇప్పుడు హత్యకు కుట్ర పన్నిన వివాదం ముందుకు రావడంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. చింతమనేనిపై రౌడీషీట్ ఉండటం, అతని వ్యవహార శైలి కారణంగా తుపాకీ లైసెన్స్ ఇవ్వడానికి పోలీసు శాఖ అంగీకరించడం లేదు. మరోవైపు రౌడీషీటర్ జయరాజు కూడా తనకు తుపాకీ లైసెన్స్ కావాలని కోరడం గమనార్హం. దీనిపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
టీడీపీలో కుట్ర మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర చేసిన వ్యవహారం టీడీపీలో మంటలు రేపుతోంది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణుల్లో చీలిక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి, వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుపై టీడీపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే పార్టీకి 5వేల మంది రాజీనామా చేస్తారంటూ ఆయన వర్గం అల్టిమేటం ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర పన్నారంటూ అప్పలనాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుట్ర పన్ని అప్పలనాయు డును అరెస్ట్ చేయించారని మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ అరోపిస్తున్న సంగతి తెలిసిందే. అండగా ఉండాల్సిందిపోయి కుట్రలా.. ఈ వ్యవహారం అనంతరం టీడీపీలో రెండు వర్గాల వారు రోడ్డెక్కినా పార్టీ అధినాయకత్వం తనకేమీ తెలియనట్టే నటిస్తోంది. అప్పలనాయుడును చింతమనేని కావాలనే ఇరికించారని, కుట్రకు బలైన తమకు అండగా నిలవాల్సింది పోయి చర్యలు తీసుకోవడం ఏంటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ఇసుక మాఫియా నేతలకు, పోలీసులపై దాడులకు దిగిన వారికి, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్న వారికి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి పార్టీ అధిషా ్టనం ఎలా కొమ్ము కాస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పలనాయుడుపై క్రమశిక్షణ చర్యలను వెనక్కి తీసుకుని, అక్రమ కేసులు ఎత్తివేయకపోతే వెంకటాపురం, చుట్టుపక్కల ఉన్న 5వేల మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. చింతమనేని, అప్పలనాయుడు వర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదంతో ఏలూరు నియోజకవర్గ టీడీపీలో సంక్షోభం తలెత్తింది. దెందులూరు నియోజకవర్గానికీ ఇది పాకింది. అప్పలనాయుడుకు తూర్పుకాపు సంఘం మద్దతు మరోవైపు తూర్పు కాపు సంఘం రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా నిలిచింది. ఆయనపై కక్షసాధింపు చర్యలు ఆపకపోతే తామంతా పార్టీకి దూరమవుతామని ఆ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తమకు అండగా ఉన్నారని, ఆయన సాయంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావును, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇదిలావుంటే.. చింతమనేని ప్రభాకర్ వర్గం దీనిపై ఆగ్రహంగా ఉంది. తమ నేతను హత్య చేయడానికి కుట్ర పన్నిన వారికి ఏలూరు ఎమ్మెల్యే ఎలా అండగా ఉంటారని ప్రశ్నిస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు వెంకటాపురం గ్రామ పంచాయతీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న తనకు అప్పలనాయుడు నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్కు సోమవారం విజ్ఞప్తి చేశారు. తన ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ ఇప్పించాలని ఎస్పీని కోరారు. పోలీసులకు తలనొప్పి చింతమనేని ప్రభాకర్, రౌడీషీటర్ జుజ్జువరపు జయరాజు, కోమర్తి మధులను హత్య చేసేందుకు అధికార పార్టీకి చెందిన రెడ్డి అప్పలనాయుడు కుట్ర పన్నిన వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక వర్గం రెడ్డి అప్పలనాయుడుపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరో వర్గం ఈ కేసు నుంచి అప్పలనాయుడును బయట పడేసేందుకు ప్రయత్ని స్తోంది. ఇరువర్గాల మధ్య తాము నలిగిపోతున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు తుపాకీ లైసెన్స్ కోసం చింతమనేని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆ అవకాశం కల్పించలేదు. తనకు గన్మెన్లు వద్దని, ఎస్కార్ట్ కావాలని అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును గతంలో చింతమనేని కోరారు. దీనికి సానుకూల స్పందన రాలేదు. ఇప్పుడు హత్యకు కుట్ర పన్నిన వివాదం ముందుకు రావడంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. చింతమనేనిపై రౌడీషీట్ ఉండటం, అతని వ్యవహార శైలి కారణంగా తుపాకీ లైసెన్స్ ఇవ్వడానికి పోలీసు శాఖ అంగీకరించడం లేదు. మరోవైపు రౌడీషీటర్ జయరాజు కూడా తనకు తుపాకీ లైసెన్స్కావాలని కోరడం గమనార్హం. దీనిపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
టీడీపీలో కుట్ర మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర చేసిన వ్యవహారం టీడీపీలో మంటలు రేపుతోంది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణుల్లో చీలిక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి, వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుపై టీడీపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే పార్టీకి 5వేల మంది రాజీనామా చేస్తారంటూ ఆయన వర్గం అల్టిమేటం ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర పన్నారంటూ అప్పలనాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుట్ర పన్ని అప్పలనాయు డును అరెస్ట్ చేయించారని మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ అరోపిస్తున్న సంగతి తెలిసిందే. అండగా ఉండాల్సిందిపోయి కుట్రలా.. ఈ వ్యవహారం అనంతరం టీడీపీలో రెండు వర్గాల వారు రోడ్డెక్కినా పార్టీ అధినాయకత్వం తనకేమీ తెలియనట్టే నటిస్తోంది. అప్పలనాయుడును చింతమనేని కావాలనే ఇరికించారని, కుట్రకు బలైన తమకు అండగా నిలవాల్సింది పోయి చర్యలు తీసుకోవడం ఏంటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ఇసుక మాఫియా నేతలకు, పోలీసులపై దాడులకు దిగిన వారికి, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్న వారికి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి పార్టీ అధిషా ్టనం ఎలా కొమ్ము కాస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పలనాయుడుపై క్రమశిక్షణ చర్యలను వెనక్కి తీసుకుని, అక్రమ కేసులు ఎత్తివేయకపోతే వెంకటాపురం, చుట్టుపక్కల ఉన్న 5వేల మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. చింతమనేని, అప్పలనాయుడు వర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదంతో ఏలూరు నియోజకవర్గ టీడీపీలో సంక్షోభం తలెత్తింది. దెందులూరు నియోజకవర్గానికీ ఇది పాకింది. అప్పలనాయుడుకు తూర్పుకాపు సంఘం మద్దతు మరోవైపు తూర్పు కాపు సంఘం రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా నిలిచింది. ఆయనపై కక్షసాధింపు చర్యలు ఆపకపోతే తామంతా పార్టీకి దూరమవుతామని ఆ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తమకు అండగా ఉన్నారని, ఆయన సాయంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావును, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇదిలావుంటే.. చింతమనేని ప్రభాకర్ వర్గం దీనిపై ఆగ్రహంగా ఉంది. తమ నేతను హత్య చేయడానికి కుట్ర పన్నిన వారికి ఏలూరు ఎమ్మెల్యే ఎలా అండగా ఉంటారని ప్రశ్నిస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు వెంకటాపురం గ్రామ పంచాయతీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న తనకు అప్పలనాయుడు నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్కు సోమవారం విజ్ఞప్తి చేశారు. తన ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ ఇప్పించాలని ఎస్పీని కోరారు. పోలీసులకు తలనొప్పి చింతమనేని ప్రభాకర్, రౌడీషీటర్ జుజ్జువరపు జయరాజు, కోమర్తి మధులను హత్య చేసేందుకు అధికార పార్టీకి చెందిన రెడ్డి అప్పలనాయుడు కుట్ర పన్నిన వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక వర్గం రెడ్డి అప్పలనాయుడుపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరో వర్గం ఈ కేసు నుంచి అప్పలనాయుడును బయట పడేసేందుకు ప్రయత్ని స్తోంది. ఇరువర్గాల మధ్య తాము నలిగిపోతున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు తుపాకీ లైసెన్స్ కోసం చింతమనేని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆ అవకాశం కల్పించలేదు. తనకు గన్మెన్లు వద్దని, ఎస్కార్ట్ కావాలని అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును గతంలో చింతమనేని కోరారు. దీనికి సానుకూల స్పందన రాలేదు. ఇప్పుడు హత్యకు కుట్ర పన్నిన వివాదం ముందుకు రావడంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. చింతమనేనిపై రౌడీషీట్ ఉండటం, అతని వ్యవహార శైలి కారణంగా తుపాకీ లైసెన్స్ ఇవ్వడానికి పోలీసు శాఖ అంగీకరించడం లేదు. మరోవైపు రౌడీషీటర్ జయరాజు కూడా తనకు తుపాకీ లైసెన్స్కావాలని కోరడం గమనార్హం. దీనిపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.