ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) వినియోగదారుల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాల్స్, డేటా వంటి ప్రయోజనాలను తక్కువ ధరలకే దీర్ఘ కాల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. ఇంత తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్‌లు టాప్ టెలికాం కంపెనీలలో దేనిలోనూ లేవు. అందుకే ఈ ప్లాన్‌తో టాప్ కంపెనీకి టెన్షన్ తప్పదు.
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన అద్బుతమైన రీఛార్జ్ ప్లాన్‌లలో రూ.997 ప్లాన్ ఒకటి. ఇది 160 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 320 జీబీ హై స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను ఉచితంగా పంపుకోవచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ దేశం అంతటా ఉచిత రోమింగ్, జింగ్ మ్యూజిక్, బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్ వంటి అనేక విలువ-ఆధారిత సేవలతో వస్తుంది.
ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ కూడా యూజర్లకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సర్వీస్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో 5జీ సేవలను కూడా ప్రారంభించే పనిలో ఉంది. 5జీ నెట్‌వర్క్ టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment