validity
-
తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్!
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది. నెలకు రూ. 200 కంటే తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లతో ఆనందించవచ్చు. దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూసే వారు ఈ వీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఒక లుక్కేయండి..రూ. 997 ప్లాన్బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డైలీ 2జీబీ హై స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. అక్టోబర్ 24వ తేదీ లోపుగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు 24 రోజుల చెల్లుబాటు కలిగిన 24GB ల అదనపు డేటా లభిస్తుంది.రూ. 1,198 ప్లాన్బీఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్ ఏడాది అంటే 365 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ ప్రయోజనాలు నెలవారీగా అందుతాయి. ఈ ప్లాన్ తో నెలకు 300 మినిట్స్ కాలింగ్, 3జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్ల చొప్పున 12 నెలలపాటు లభిస్తాయి. ప్లాన్‌ను అక్టోబర్ 24వ తేదీ లోపు రీఛార్జ్ చేసుకునే వారు 24 రోజుల వ్యాలిడిటీ కలిగిన 24జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. -
ఒకేసారి రీచార్జ్.. ఏడాదంతా డైలీ 3జీబీ డేటా
దీర్ఘకాలం వ్యాలిడిటీతో రోజూ ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో తక్కువ ధరకే డైలీ 3జీబీ డేటాను ఆస్వాదించవచ్చు. ఇలాంటి ప్లాన్లు ఇతర ప్రైవేటు టెలికం కంపెనీల్లో లేకపోవడం గమనార్హం.365 రోజులు వ్యాలిడిటీ 365 రోజులు వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ. 2,999. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదంతా అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఆనందించవచ్చు. ప్రతిరోజూ 3జీబీ హై స్పీడ్ డేటా పొందవచ్చు. ఈ వార్షిక ప్లాన్‌లో కస్టమర్లకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.సినిమాల స్ట్రీమింగ్, గేమింగ్ కోసం ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఏడాదిపాటు ప్రతిరోజూ 3జీబీ డేటా అందించే ప్లాన్లు ఇతర ప్రైవేట్ టెలికం కంపెనీల్లో లేవు. గరిష్టంగా 84 రోజుల వ్యాలిడిటీతో ఇలాంటి ప్లాన్ జియోలో రూ.1799లకు, ఎయిర్‌టెల్‌లో రూ.1798లకు అందుబాటులో ఉంది. -
టాప్ కంపెనీకి టెన్షన్.. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు అపరిమిత వాయిస్ కాల్స్, డేటా వంటి ప్రయోజనాలను తక్కువ ధరలకే దీర్ఘ కాల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. ఇంత తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లు టాప్ టెలికాం కంపెనీలలో దేనిలోనూ లేవు. అందుకే ఈ ప్లాన్‌తో టాప్ కంపెనీకి టెన్షన్ తప్పదు.బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన అద్బుతమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.997 ప్లాన్ ఒకటి. ఇది 160 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 320 జీబీ హై స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే రోజూ 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పంపుకోవచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ దేశం అంతటా ఉచిత రోమింగ్, జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి అనేక విలువ-ఆధారిత సేవలతో వస్తుంది.ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ కూడా యూజర్లకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీస్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో 5జీ సేవలను కూడా ప్రారంభించే పనిలో ఉంది. 5జీ నెట్వర్క్ టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
సైలెంట్‌గా వచ్చిన కొత్త రీచార్జ్ ప్లాన్! అధిక వ్యాలిడిటీతో..
అధిక వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్ తో ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. రూ.279 విలువైన ఈ ప్లాన్ ను సైలెంట్‌గా వెబ్సైట్లో చేర్చేసింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.సాధారణంగా చాలా రీచార్జ్ ప్లాన్లు 28 లేదా 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి. కానీ రూ .279 ప్లాన్ 45 రోజుల వాలిడిటీతో వస్తుంది. కాబట్టి, 15 రోజులు చెల్లుబాటు అదనంగా లభిస్తుంది. అధిక వ్యాలిడిటీ మాత్రమే కాకుండా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, లోకల్, ఎస్టీడీ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.ఇక అధిక వ్యాలిడిటీ ఉన్న ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే రూ .279 ప్లాన్ కూడా చాలా తక్కువ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 2 జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. ఎక్కువ డేటాను పొందాలనుకుంటే, ప్రత్యేక డేటా వోచర్లలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జియో తన చాలా ప్లాన్లతో ఇచ్చినట్లుగా ఇందులో ఉచిత అపరిమిత 5జీ ఆప్షన్ లేదు. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు మొత్తం 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
సూపర్ రీచార్జ్ ప్లాన్: రెండు కంపెనీల్లో ఒకటే.. మరి ఏది బెస్ట్?
దీర్ఘకాల వ్యాలిడిటీ రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్న వారి కోసం ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్లలో అద్భుతమైన ప్లాన్లు ఉన్నాయి. రూ.395తో రెండు కంపెనీలు ప్లాన్లను అందిస్తున్నాయి. ధర ఒకటే అయినా వ్యాలిడిటీ, డేటా, ఇతర ప్రయోజనాల్లో తేడాలున్నాయి. ఏ కంపెనీ రీచార్జ్ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయో ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం..జియో రూ.395 ప్లాన్» 84 రోజుల వ్యాలిడిటీ» అపరిమిత 5జీ డేటా» 5జీ కనెక్టివిటీ, 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్సెట్ లేకపోతే వాడుకునేందుకు 6 జీబీ డేటా» అపరిమిత వాయిస్ కాలింగ్ » మొత్తం 1000 ఎస్ఎంఎస్లు» జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్» "మై జియో యాప్ ఎక్స్ క్లూజివ్" ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.395 ప్లాన్» 70 రోజుల వ్యాలిడిటీ » మొత్తంగా 6 జీబీ హైస్పీడ్ డేటా» 600 ఎస్ఎంఎస్లు» అపోలో 24|7 సర్కిల్‌కు 3 నెలల పాటు యాక్సెస్» ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు» అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్» రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ యాప్, వెబ్సైట్లో లభ్యం -
ఫుల్ వ్యాలిడిటీ.. ఈ రీచార్జ్ ప్లాన్ల గురించి తెలుసా?
దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్టెల్ 30, 60, 90 రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్లను అందిస్తోంది. నెలంతా కచ్చితమైన వ్యాలిడిటీని ఇచ్చే ప్లాన్ల కోసం వినియోగదారుల నుంచి అభ్యర్థనలు రావడంతో 30, 60, 90 రోజుల ప్లాన్లను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది.ఇంతకుముందు 28, 56 లేదా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి.30 రోజుల ప్లాన్లుఎయిర్టెల్లో మొత్తం మూడు 30 రోజుల ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్లు వరుసగా రూ.199, రూ.296, రూ.489 ధరల శ్రేణిలో లభిస్తాయి. ఈ అన్ని ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను పొందవచ్చు.రూ.199 ప్లాన్‌లో 3 జీబీ డేటా, రూ.296 ప్లాన్‌లో 25 జీబీ డేటా, రూ.489 ప్లాన్‌లో 50 జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.296, రూ.489 ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా ఆఫర్ కూడా ఉంది.60 రోజుల వాలిడిటీతో..ఎయిర్ టెల్ రూ.519 ప్లాన్ 60 రోజుల వాలిడిటీని అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.90 రోజుల ప్లాన్లు90 రోజుల ప్లాన్ ధర రూ.779. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితో పాటు అపరిమిత 5 జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కూడా పొందవచ్చు. -
కొత్త రీచార్జ్ ప్లాన్.. ‘28 రోజులు’ టెన్షన్ లేదిక!
Airtel 35 Days Validity Plan: దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. నెలవారీ రీచార్జ్‌కు సంబంధించి టెలికాం కంపెనీలు సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీనే అందిస్తుంటాయి. అయితే తక్కువ వ్యాలిడిటీతో ఇబ్బందిపడే కస్టమర్ల కోసం ఎయిర్టెల్ 35 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రీఛార్జ్ ప్లాన్లలో తక్కువ వ్యాలిడిటీ పీరియడ్ల సమస్యకు ప్రతిస్పందనగా ఎయిర్టెల్ నుండి తాజా ఆఫర్ వచ్చింది. అంతరాయం లేని సేవల కోసం ప్రతి 28 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా మంది వినియోగదారులు తరచుగా అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సవాలును గుర్తించి ఎయిర్టెల్ 35 రోజుల పాటు ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీని అందిస్తూ రూ.289 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ప్లాన్ ప్రయోజనాలు ఎయిర్టెల్ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ అధిక వ్యాలిడిటీని అందించడమే కాకుండా వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చెల్లుబాటు వ్యవధిలో అపరిమిత కాలింగ్‌తో పాటు, రోజుకు 300 ఉచిత ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. అయితే అధిక డేటా అవసరాలు ఉన్న వినియోగదారులకు ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు. ఎందుకంటే మొత్తం చెల్లుబాటు వ్యవధికి 4GB డేటా మాత్రమే ఈ ప్లాన్‌పై లభిస్తుంది. -
గుడ్‌న్యూస్: తక్కువ ధరకు 5 నెలల వ్యాలిడిటీ.. సూపర్ రీచార్జ్ ప్లాన్
తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీని అందించే సూపర్ రీచార్జ్ ప్లాన్ (Recharge Plan) ను ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తీసుకొచ్చింది. 150 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ. 397 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్ కొత్తది కాదు. ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ గతంలోనే అందించింది. అయితే ప్రస్తుతం పెట్టిన ప్లాన్‌లో మాత్రం కొన్ని ప్రయోజనాలు మారాయి. ఇంతకుముందు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు ఉండగా ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులకు తగ్గింది. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత ఫోన్ కాల్స్ వంటి ప్రయోజనాలు ఉన్నా ఇవన్నీ 30 రోజుల్లోనే ముగుస్తాయి. పాత ప్లాన్‌లో ఈ ప్రయోజనాలన్నీ 60 రోజులపాటు ఉండేవి. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: అతి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్.. నెలంతా అన్లిమిటెడ్! -
నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధమేనా? మళ్లీ తెరపైకి
న్యూఢిల్లీ: దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో తీసుకున్న సంచలన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నల్లధనం, నకిలీ నోట్ల చలామణికి చెక్ పెట్టేందుకంటూ రాత్రికి రాత్రే ప్రకటించిన ఈ నిషేధం పెను దుమారాన్ని సృష్టించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ వివాదాస్పద అంశం వార్తల్లో నిలిచింది. నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రేపు (బుధవారం) సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. దీనికి ఏకంగా నాలుగు రాజ్యాంగ ధర్మాసనాలు అధ్యక్షత వహించనున్నాయి. వివరణాత్మక విచారణ తేదీని బెంచ్ నిర్ణయించే అవకాశం ఉంది. డిసెంబరు 16, 2016న ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించినప్పటికీ ఇంకా బెంచ్‌ను ఏర్పాటు చేయలేదు. కాగా నవంబర్ 8, 2016న ఆకస్మికంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అనూహ్యంగాఅదే రోజు అర్ధరాత్రినుండి, అప్పటికి చెలామణిలోఉన్న 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని తీసుకున్న బాధ్యతా రాహిత్యమైన ఈ చర్య దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేసిందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అంతేకాదు ఉన్న నోట్లను మార్చకునేందుకు క్యూలైన్లలో సామాన్య ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నగదు కొరత కారణంగా బ్యాంకుల వద్ద పొడవైన లైన్లు వేచి ఉండలేక కొంతమంది క్యూ లైన్లలోనే ప్రాణాలు కోల్పోయారు. -
జియో యూజర్లకు న్యూయర్ గిఫ్ట్..!
Jio Happy New Year Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తన యూజర్లకు న్యూయర్ గిఫ్ట్‌ను అందించింది. రూ. 2545 ప్రీపెయిడ్ ప్లాన్‌పై హ్యపీ న్యూయర్ ఆఫర్‌ను యూజర్లకు జియో ప్రకటించింది. సాధారణంగా జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2545 యూజర్లకు 336 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. హ్యాపీ న్యూయర్ ఆఫర్లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే యూజర్లు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను పొందవచ్చును. దీంతో 365 రోజులపాటు వ్యాలిడిటీ యూజర్ల సొంతమవుతుంది. కాగా ప్లాన్ కేవలం 2022 జనవరి 2 వరకే అందుబాటులో ఉండనుంది. రూ. 2545 ప్లాన్ మరిన్ని వివరాలు..! జియో రూ. 2,545 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 సందేశాలు, రోజువారీ ప్రాతిపదికన 1.5GB హై-స్పీడ్ డేటా రానుంది. దాంతో పాటుగా జియో టీవీ. జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలను పొందవచ్చును. చదవండి: ఈ ఏడాదిలో ఎగబడి సందర్శించిన వెబ్సైట్ ఇదే..! గూగుల్ మాత్రం కాదండోయ్..! -
బీఎస్ఎన్ఎల్ షాకింగ్ నిర్ణయం..!
ప్రభుత్వ రంగ మొబైల్ నెట్వర్క్ సంస్థ బీఎస్ఎన్ఎల్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. సగటు స్థూల ఆదాయాన్ని పెంచుకునే చర్యలో భాగంగా పలు టెలికాం సంస్థలు మొబైల్ టారిఫ్‌లను రివైజ్ చేశాయి. ఇప్పటికే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లను రివైజ్ చేశాయి. కాగా ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టెలికాం సంస్థల అడుగుజాడల్లోనే బీఎన్ఎన్ఎల్ నడుస్తోంది. పలు మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లను రివైజ్ చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రివీజన్‌లో భాగంగా ప్లాన్లను ధరలను మార్చకుండా ప్లాన్ల వ్యాలిడీటీ కుదించింది. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అందుబాటులో ఉన్న రూ. 49, రూ. 75, రూ. 94 ప్లాన్ల వ్యాలిడీటీను తగ్గించింది. అంతేకాకుండా రూ. 106, రూ.107, రూ.197, రూ. 397 ప్లాన్లను కూడా రివైజ్ చేసింది. బీఎస్ఎన్ఎల్ రూ.49 ప్లాన్ వ్యాలిడిటీని 24 రోజులుగా, రూ.75 ప్లాన్ వ్యాలిడిటీని 50 రోజులుగా, రూ. 94 ప్లాన్ వ్యాలిడిటీని 75 రోజులుగా నిర్ణయించింది. దాంతోపాటుగా రూ.106, రూ. 107, ప్లాన్లకు అందించే 100 రోజుల వ్యాలిడిటీని 84 రోజులకు కుదించింది. రూ. 197 ప్లాన్‌కు అందించే 180 రోజుల వ్యాలిడిటీని 150 రోజులకు కుదించింది. రూ. 397 ప్లాన్‌కు అందించే 365 రోజుల వ్యాలిడిటీని 300 రోజులకు కుదించింది. -
జియో ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్!
రిలయన్స్ జియో తన ఫైబర్ వినియోగదారులకు శుభవార్త అందించింది. జియోఫైబర్ యూజర్లు నెల నెల ప్లాన్ కాకుండా వార్షిక, ఆరు నెలల ప్లాన్లు ఎంచుకుంటే అదనపు వ్యాలిడిటీని అందించనున్నట్లు పేర్కొంది. జియోఫైబర్ వార్షిక ప్యాకేజీలపై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని, ఆరునెలల ప్యాకేజీపై 15 రోజులు అదనంగా అందిస్తోంది. జియో ఫైబర్ వార్షిక ప్యాకేజీ రూ.4,788(నెలకు రూ.399 రూపాయల బేస్ ప్లాన్ కోసం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త ఆఫర్ కింద వార్షిక కనెక్షన్ తీసుకున్న కానీ, వార్షిక ప్లాన్ కు అప్ గ్రేడ్ అయిన వ్యాలిడిటీ 395 రోజులకు పెరగనుంది. అలాగే ఆరు నెలల ప్లాన్లపై 15 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వార్షిక, ఆరు నెలల ప్లాన్లకు వర్తించనుంది. ఈ ఆఫర్ జియోఫైబర్ రూ.399, రూ.699, రూ.999, రూ.1,499, రూ.2,499, రూ.3,999, రూ.8,4999 నెలవారీ ప్రణాళికలకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ గల వినియోగదారులు 12 నెలల పాటు కొనుగోలు చేస్తే 30 రోజుల అదనపు డేటాను పొందవచ్చు. అదేవిధంగా, వినియోగదారులు జియోఫైబర్ సెమీ-వార్షిక ప్యాక్‌లను కొనుగోలు చేస్తే ఆరు నెలల చెల్లుబాటుతో పాటు 15 రోజులు అదనంగా డేటా ఇవ్వబడుతుంది.-ప్రస్తుతానికి, త్రైమాసిక లేదా నెలవారీ జియోఫైబర్ ప్లాన్లపై ఎటువంటి ఆఫర్లు లేవు. చదవండి: ఐదు రోజుల్లో రూ.2వేలు పెరిగిన బంగారం ధరలు -
టెట్ వ్యాలిడిటీ శాశ్వతం..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉంది. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన ఎన్సీటీఈ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్సీటీఈ భావిస్తోంది. 2010లో టెట్‌ను అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించగా, కొన్ని రాష్ట్రాలు రెండు మూడేళ్లకోసారి టెట్ నిర్వహించాయి. మొదట్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన లక్షల మందికి సంబంధించిన టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. అందుకే వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. వీరికీ వర్తిస్తుందా?: ఉమ్మడి ఏపీలో 4 సార్లు, తెలంగాణ వచ్చాక 2 సార్లు టెట్ నిర్వహించారు. మొదటిసారి టెట్‌ను 2011 జూలై 1న నిర్వహించగా, అందులో పేపర్–1లో 1,35,105 మంది, పేపర్–2లో 1,66,262 మంది అర్హత సాధించా రు. రెండో టెట్‌లో పేపర్–1లో 24,578 మంది, పేపర్–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. మూడో టెట్‌లో పేపర్–1లో 26,382 మంది, పేపర్–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. అయితే అందులో టెట్ స్కోర్ పెంచుకునేందుకు రెండోసారి మూడోసారి రాసిన వారు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొదటి మూడు టెట్లలో మొత్తంగా 7 లక్షల మందికి పైగా అర్హత సాధించగా, అందులో తెలంగాణ విద్యార్థులు 3 లక్షల మందికిపైగా ఉన్నారు. ఇప్పటికే వారందరి టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. వారి విషయంలో ఎన్సీటీఈ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. -
బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్డౌన్ సమయంలో మొబైల్ సబ్‌స్కైబర్స్‌కు వెసులుబాటు కలిగించేలా ఒక ప్రకటన చేసింది. ఉచితంగా వ్యాలిడిటీని పొడగించడంతోపాటు, టాక్‌టైమ్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ సమయంలో రీచార్జ్ చేసుకోవడం కుదరని వారికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. మర్చి 20 తర్వాత వ్యాలిడిటీ అయిపోయిన మొబైల్ వినియోగదారులకు ఏప్రిల్ 20 వరకు ఉచితంగా వ్యాలిడిటీని పొడిగించనున్నట్టు ప్రకటించింది. అలాగే లాక్డౌన్ కాలంలో వినియోగదారుల బ్యాలెన్స్ జీరోకు చేరితే.. వారికి 10 రూపాయల ఉచిత టాక్‌టైమ్ అందించనున్నట్టు తెలిపింది. ‘ఈ కష్ట సమయంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మద్దతుగా నిలుస్తుంది. వినియోగదారు రీచార్జ్ చేసుకోవడానికి డిజిటల్ పద్దతులు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందుకు మై బీఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్, బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ వాలెట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి’ అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ పండుగ ఆఫర్ : 90 రోజులు ఫ్రీ
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన చందాదారులకు అద్భుత ఆఫర్ తీసుకొచ్చింది. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను సమీక్షించి బీఎస్ఎన్ఎల్ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్‌పై అదనపు ప్రయోజనలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్ వివరాలు రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు మాత్రమే. దీంతోపాటు అక్టోబర్ మాసంలో రోజుకు 3.5 జీబీ (1.5 జీబీ అదనం) డేటాను అందిస్తోంది. నవంబరు డిసెంబర్ మాసాల్లో రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది. అలాగే ఏడాదిపాటు ఉచిత వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (పిఆర్బిటి) లేదా కాలర్ ట్యూన్లను కూడా అందిస్తుంది. రోజుకు 2 జీబీ డేటాతో పాటు రోజుకు 250 నిమిషాలు కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అంటే అక్టోబర్ 31 లోపు రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 90 రోజుల అదనపు ప్రయోజనాలు అందుబాటులో వుంటాయి. -
ఎయిర్టెల్ కస్టమర్లకు షాక్
న్యూఢిల్లీ : సబ్‌స్ర్కైబర్లకు మొబైల్ దిగ్గజం ఎయిర్టెల్ షాక్ ఇచ్చింది. వ్యాలిడిటీ ముగిసిన తర్వాత 15 రోజుల వరకూ సబ్‌స్ర్కైబర్ ఇన్కమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు దాన్ని వారం రోజులకు కుదించింది. కనీస రీచార్జ్ స్కీమ్‌లో ఎయిర్టెల్ ఈ మార్పులు చేసింది. దీంతో ఎయిర్టెల్ కస్టమర్ తాను ఎంచుకున్న ప్లాన్ ముగిసిన తర్వాత వారం రోజుల వరకే ఇన్కమింగ్ కాల్స్‌ను రిసీవ్ చేసుకుంటారు. మరోవైపు అకౌంట్ బ్యాలెన్స్ ఉన్నా సబ్‌స్ర్ర్కైబర్లు వ్యాలిడిటీ ముగిసిన తర్వాత రీచార్జ్ చేయకపోతే వాయిస్ కాల్స్ చేసుకోలేరు. యూజర్ నుంచి సగటు రాబడి (ఏఆర్పీయూ) పెంచుకునేందుకే ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు తమ ప్రీపెయిడ్ సబ్‌స్ర్కైబర్ల కోసం వొడాఫోన్, ఐడియా కూడా ఈ దిశగా యోచిస్తున్నట్టు సమాచారం. ఎయిర్టెల్ నిర్ణయంతో సబ్‌స్ర్కైబర్లు ఇతర నెట్‌వర్క్‌లకు మళ్లవచ్చని భావిస్తున్నారు. -
ఇప్పుడు నిఖా హలాల్ వంతు
న్యూఢిల్లీ : ముస్లింల వివాదాస్పద విడాకుల చట్టం ‘ట్రిపుల్ తలాక్’ను చట్టబద్దం కాదని తేల్చిన కేంద్రం ఇప్పుడు ‘నిఖా హలాల్, బహుభార్యత్వా’ల చట్టబద్దతలను పరిశీలించనున్నట్లు సమాచారం. ‘నిఖా హలాల్, బహుభార్యత్వా’ల ప్రామణికతను సవాలు చేస్తూ గతంలో సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ‘ట్రిపుల్ తలాక్’ అంశంతో పాటే వీటిని కూడా పరిశీలించాల్సిందిగా కేంద్రం, సుప్రీం కోర్టును కోరింది. కానీ సుప్రీం కోర్టు ముందు ట్రిపుల్ తలాక్ అంశాన్ని విచారించిన తర్వాత నిఖా హలాల్ అంశాలను చర్చిస్తానని తెలిపింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ అంశాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ‘నిఖా హలాల్, బహుభార్యత్వం అంశాలు లింగ సమానత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి సుప్రీం కోర్టు వీటి చట్టబద్దతను విచారించనుంద’ని ఒక సీనియర్ న్యాయాధికారి తెలిపారు. గతేడాది ‘ట్రిపుల్ తలాక్’ అంశం చట్టవిరుద్దమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ‘నిఖా హలాల్, బహుభార్యత్వం’ అంశాల గురించి చర్చించేందుకు ఈ ఏడాది మార్చ్‌లో సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘కేంద్రం తన మాటకు కట్టుబడి ఉంటుంది. నిఖా హలల, బహుభార్యత్వం వంటి అంశాలకు భారత ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకమే. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ఇదే అంశాన్ని తెలుపుతుంద’ని ఒక సీనియర్ న్యాయశాఖ అధికారి తెలిపారు. నిఖా హలాల్... ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. -
ఏడాది వ్యాలిడిటీతో డేటా ప్యాక్స్ తీసుకురండి
టెల్కోలకు ట్రాయ్ ఆదేశం న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఏడాది కాల పరిమితితో (వ్యాలిడిటీ) కనీసం ఒక మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్‌నైనా అందుబాటులోకి తీసుకురావాలని టెలికం కంపెనీలను కోరింది. కాగా ట్రాయ్ గతేడాది ఆగస్ట్‌లో మొబైల్ డేటా ప్యాక్స్ వ్యాలిడిటీని 90 రోజుల నుంచి 365 రోజుల దాకా పొడిగించుకోవచ్చని అనుమతినిచ్చింది. దీంతో దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుందని, వన్‌టైమ్ యూజర్లను ఆకర్షించవచ్చని ట్రాయ్ భావించింది. పలు టెలికం కంపెనీలు ఏడాది వ్యాలిడిటీతో సరైన డేటా ప్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. -
మద్యం దుకాణాల లెసైన్సు ఇక రెండేళ్లు
నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ ఏడాదికి 10% మేర పెరగనున్న లెసైన్సు ఫీజు ♦ దరఖాస్తు ఫారం ధర ♦ రూ. 25 వేల నుంచి రూ. 50 వేలకు పెంపు ♦ 2,216 దుకాణాలకు లెసైన్సులు మంజూరు చేయనున్న ప్రభుత్వం ♦ జీహెచ్ఎంసీ పరిధిలోనే 503 షాపులు ♦ దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతి సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ఈసారి రెండేళ్ల కాలపరిమితితో దుకాణాలకు లెసైన్సులు జారీ చేయాలని నిర్ణయించారు. జూలై నుంచి ఎక్సైజ్ విధానం అమల్లోకి రావాల్సి ఉన్నా.. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం అక్టోబర్‌కు వాయిదా వేసింది. చీప్‌లిక్కర్ ప్రతిపాదనలపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో పాత పద్ధతిలోనే ఎక్సైజ్ లెసైన్సులు జారీ చేయాలని సీఎం నిర్ణయించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ(ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సోమవారం నుంచి చైనా పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని సవరణలతో మద్యం విధానాన్ని ఆమోదిస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న విధానంలోనే మద్యం దుకాణాల లెసైన్సులు జారీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటిదాకా ఏడాది కాలానికి లెసైన్సు జారీ చేసేవారు.. ఇప్పుడు దాన్ని రెండేళ్లు చేశారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి, జనాభా ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తారు. దుకాణాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తే జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా లెసైన్సులు జారీ చేస్తారు. ఈ నెల 30లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. లెసైన్సు ఫీజు పెంపు రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 మద్యం దుకాణాలకు లెసైన్సు జారీ చేయాల్సి ఉంటుంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 503 షాపులుండటం గమనార్హం. జనాభా ప్రాతిపదికన ఈ దుకాణాల సంఖ్యను నిర్ణయించారు. అలాగే లెసైన్సు ఫీజు కూడా జనాభా ప్రాతిపదికనే నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉన్న లెసైన్సు ఫీజును ఏడాదికి పది శాతం పెంచుతూ రెండేళ్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించడంతో మొత్తంగా ఈ ఫీజు 20 శాతం పెరగనుంది. ఉదాహరణకు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక దుకాణం లెసైన్సు ఫీజు రూ.90 లక్షలు ఉండగా.. పదిశాతం అదనంగా అంటే రూ. 9 లక్షల దాకా పెరిగే అవకాశం ఉంది. అంటే ఇంచుమించు ఏడాదికి కోటి రూపాయల చొప్పున రెండేళ్ల కాల పరిమితికి ఫీజు వసూలు చేయనున్నారు. 2017 జూన్ వరకు కొత్త విధానం.. సాధారణంగా ఎక్సైజ్ సంవత్సరం జూలైతో మొదలై జూన్‌తో ముగుస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వం గుడుంబాకు బదులుగా చౌక మద్యం తేవాలనే ఆలోచనతో దుకాణాల లెసైన్సుల గడువును మరో మూడు నెలలకు పొడిగించింది. దీంతో నూతన మద్యం విధానం ఈ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. రెండేళ్ల పాటు ఇదే విధానం కొనసాగనుంది. 2017 జూన్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. దరఖాస్తు ఫారం ధర రూ.50 వేలు! మద్యం దుకాణాల కోసం చేసుకునే దరఖాస్తు ధరను కూడా ప్రభుత్వం రెండింతలు చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా రూ. 25 వేలుగా ఉన్న దరఖాస్తు ఫారం ధరను రూ.50 వేలుగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ దరఖాస్తు ఫారానికి వెచ్చించే సొమ్ము తిరిగి రాదు (నాన్ రిఫండబుల్). పోటీ అధికంగా ఉండే దుకాణాలకు దరఖాస్తులు పెరిగితే ఎక్సైజ్ శాఖకు కాసుల పంటే. ఈ వారంలోపే నోటిఫికేషన్ జారీ చేసి, జిల్లాల వారీగా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న లెసైన్సు ఫీజులివి. ఏడాదికి 10 శాతం చొప్పున ఈ ఫీజులను పెంచే అవకాశం ఉంది.