
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు తన పోర్ట్‌ఫోలియోలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (prepaid plans) జోడిస్తోంది. ఈ క్రమంలోనే మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక వాలిడిటీతో వస్తాయి.
150 రోజుల ప్లాన్
బీఎస్ఎన్ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ .397. ఇది అపరిమిత కాలింగ్ 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తుంది. అయితే ప్రయోజనాలన్నీ మొదటి 30 రోజులు మాత్రమే ఉంటాయి. మిగిలిన 120 రోజులకు నంబర్‌కు వ్యాలిడిటీ అందుబాటులో ఉంటుంది. కాలింగ్, డేటా ప్రయోజనాల కన్నా ఇన్ కమింగ్ కాల్స్, సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవడం ముఖ్యం అనేకునేవారికి ఈ ప్లాన్ సరిపోతుంది.
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ బెస్ట్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..
160 రోజుల ప్లాన్
160 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ ధర రూ.997. ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి అపరిమిత కాలింగ్, 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. కాలింగ్, డేటాతో లాంగ్ టర్మ్ వాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ మరింత అనుకూలంగా ఉంటుంది.
180 రోజుల ప్లాన్
ఇది ఆరు నెలల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ధర రూ .897. ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్వర్క్‌లకు అపరిమిత కాలింగ్, 180 రోజుల పాటు 90 జీబీ మొత్తం డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రోజువారీ కోటా గురించి ఆందోళన చెందకుండా ఒకేసారి ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది.
Comments
Please login to add a commentAdd a comment