తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ బెస్ట్ ప్లాన్స్! | bsnl best prepaid plans with long validity | Sakshi
Sakshi News home page

తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ బెస్ట్ ప్లాన్స్!

Published Sat, Oct 5 2024 9:40 PM | Last Updated on Sun, Oct 6 2024 10:25 AM

bsnl best prepaid plans with long validity

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది. నెలకు రూ. 200 కంటే తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లతో ఆనందించవచ్చు. దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూసే వారు ఈ వీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఒక లుక్కేయండి..

రూ. 997 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డైలీ 2జీబీ హై స్పీడ్ డేటా, అన్‌ లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. దీంతోపాటు రోజుకు  100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. అక్టోబర్ 24వ తేదీ లోపుగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు 24 రోజుల చెల్లుబాటు కలిగిన 24GB ల అదనపు డేటా లభిస్తుంది.

రూ. 1,198 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్ ఏడాది అంటే 365 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. అయితే ఈ  ప్లాన్ ప్రయోజనాలు నెలవారీగా అందుతాయి. ఈ ప్లాన్ తో నెలకు 300 మినిట్స్ కాలింగ్, 3జీబీ డేటా, 30 ఎస్‌ఎంఎస్‌ల చొప్పున 12 నెలలపాటు లభిస్తాయి. ప్లాన్‌ను అక్టోబర్ 24వ తేదీ లోపు రీఛార్జ్ చేసుకునే వారు 24 రోజుల వ్యాలిడిటీ కలిగిన 24జీబీ డేటాను అదనంగా పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement