ఏడాది వ్యాలిడిటీతో డేటా ప్యాక్స్ తీసుకురండి
టెల్కోలకు ట్రాయ్ ఆదేశం
న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఏడాది కాల పరిమితితో (వ్యాలిడిటీ) కనీసం ఒక మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్‌నైనా అందుబాటులోకి తీసుకురావాలని టెలికం కంపెనీలను కోరింది. కాగా ట్రాయ్ గతేడాది ఆగస్ట్‌లో మొబైల్ డేటా ప్యాక్స్ వ్యాలిడిటీని 90 రోజుల నుంచి 365 రోజుల దాకా పొడిగించుకోవచ్చని అనుమతినిచ్చింది. దీంతో దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుందని, వన్‌టైమ్ యూజర్లను ఆకర్షించవచ్చని ట్రాయ్ భావించింది. పలు టెలికం కంపెనీలు ఏడాది వ్యాలిడిటీతో సరైన డేటా ప్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు.