Telecom company
-
దివాళా తీసిన ఈ కంపెనీ గుర్తుందా..? 3Gలో దీనిదే హవా!!
-
కేవలం రూ.3,400 కోట్లకే అమ్మించారు.. ఎయిర్‌సెల్ ఫౌండర్ ఆవేదన
రాజకీయ నాయకుల ఒత్తిడి, జోక్యంతో తన కంపెనీని కోల్పోయానని, తక్కువ మొత్తానికి అమ్మేసుకున్నానని ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు చిన్నకన్నన్ శివశంకరన్ పేర్కొన్నారు. దశాబ్దం క్రితంతో పోలిస్తే నేటి భారతదేశం చాలా భిన్నంగా ఉందని చెప్పారు.అప్పట్లో వ్యాపారాలు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయని ఒక పాడ్‌కాస్ట్ షోలో మాట్లాడుతూ చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా విజయవంతమైతే అదొక సమస్యగా ఉండేదన్నారు. ‘రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారు.. నేను నా కంపెనీని కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు. తాను కేవలం రూ.3,400 కోట్లకే కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చిందని, అదే ఏటీఅండ్‌టీకి అమ్మి ఉంటే తనకు 8 బిలియన్ డాలర్లు ఆదాయం వచ్చేదని చెప్పారు. ఇప్పట్లా అప్పుడు లేదు. ఒక పారిశ్రామికవేత్త తన కంపెనీని ఒక నిర్దిష్ట వ్యక్తికే విక్రయించాలని ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీ ఈస్ట్, పశ్చిమబెంగాల్ వంటి 13 సర్కిళ్లలో స్పెక్ట్రమ్ కోసం ఎయిర్‌సెల్ రూ. 6,500 కోట్లు చెల్లించింది. 2012 నవంబర్ నాటికి ఈ సంస్థ సుమారు 5 మిలియన్ల 3G వినియోగదారులను కలిగి ఉంది. 3జీలో కీలక పాత్ర పోషించిన ఎయిర్ సెల్ 3జీ టారిఫ్ ను అప్పట్లో భారీగా తగ్గించింది. 2011లో భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి యాపిల్ ఐఫోన్ 4 లాంచ్ భాగస్వామి అయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఎయిర్ సెల్ 2018 ఫిబ్రవరిలో మార్కెట్ నుంచి నిష్క్రమించింది. 2006లో మాక్సిస్ బెర్హాద్ 74 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్ సెల్ ను స్వాధీనం చేసుకుంది. 2011లో తన వాటాను మ్యాక్సిస్ బెర్హాద్ కు విక్రయించాలని తనపై ఒత్తిడి తెచ్చారని చిన్నకన్నన్ శివశంకరన్ ఆరోపించారు. -
Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో ఉద్యోగాల కోత ప్రకంపనలు రేపుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు సహా స్టార్టప్ కంపెనీలు కూడా వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా యూకేకు చెందిన అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్, టెలికాం కంపెనీ బీటీ గ్రూపు భారీగా ఉద్యోగులను తీసివేయాలని యోచిస్తోంది. కాస్ట్కట్లో భాగంగా 55 వేల లేఆఫ్‌లను ప్రకటించనుంది. లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్రిటీష్ బహుళజాతి టెలికమ్యూనికేషన్స్ హోల్డింగ్ కంపెనీ బీటీ గ్రూప్, ఫైబర్-ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ 5 జీ మొబైల్ నెట్‌వర్క్‌లు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇపుడిక ఎక్కువ మంది కార్మికులు అవసరం లేదని చెప్పింది. ఖర్చులను తగ్గించే క్రమంలోనే కాంట్రాక్టర్లతో సహా మొత్తం 55,000 ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తున్నట్లు గురువారం తెలిపింది. ఈ దశాబ్దం చివరికి లీనియర్ బిజినెస్‌తో బ్రైటర్ ఫ్యూచర్‌గా బీటీ గ్రూప్ రూపాంతరం చెందుతుందని, బెస్ట్ అండ్ టాప్, నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్‌లకు ఉత్తమమైన కస్టమర్ సర్వీస్, సొల్యూషన్లతో కనెక్ట్ అవుతుందని గ్రూప్ సీఈవో ఫిలిప్ జాన్సెన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) కాగా బీటీ గ్రూపులో ప్రస్తుతం సిబ్బంది, కాంట్రాక్టర్లతో సహా 130,000 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలి ఆదాయ ప్రకటనల సమయంలో 2028-2030 నాటికి తమ ఉద్యోగుల సంఖ్య 75-90వేల మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించడం గమనార్హం. మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, వార్తల కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
టెల్కోల ఆదాయాల్లో స్థిర వృద్ధి
న్యూఢిల్లీ: కొత్త యూజర్ల సంఖ్య మందగించినప్పటికీ ప్రస్తుత సబ్‌స్క్రయిబర్స్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) మెరుగుపడటం, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) భారం కొంత తగ్గుతుండటం వంటి అంశాల కారణంగా రెండో త్రైమాసికంలో టెల్కోల ఆదాయాలు స్థిరమైన వృద్ధి నమోదు చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్రైమాసికాలవారీగా చూస్తే మార్జిన్లు పెరుగుతాయని టెల్కోల ఆదాయాల ప్రివ్యూ నివేదికలో బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ పేర్కొంది. అటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ‘రెవెన్యూ వృద్ధి స్థిరంగా‘ ఉంటుందని, ఎస్‌యూసీ తగ్గుదల వల్ల మార్జిన్లు ఎగియవచ్చని పేర్కొంది. ‘సవరించిన స్థూల ఆదాయంలో (ఏజీఆర్) ఎస్‌యూసీ 3–3.5 శాతంగా ఉండేది. ఈ ఏడాది జూలైలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంపై ఇది నామమాత్రం స్థాయికి తగ్గిపోయింది. ఈ పూర్తి ప్రయోజనాలు మూడో త్రైమాసికంలో ప్రతిఫలించవచ్చు‘ అని తెలిపింది. ఏఆర్పీయూ త్రైమాసికాలవారీగా 1.5–3 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొంది. మరోవైపు జెఫ్రీస్ కూడా దాదాపు ఇదే తరహా అంచనాలు ప్రకటించింది. రెండో త్రైమాసికంలో ఆదాయాల వృద్ధి స్థిరంగా ఉంటుందని, త్రైమాసికాలవారీగా భారతి/జియో ఆదాయ వృద్ధి 2–4 శాతం స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. రెండో త్రైమాసికంలో రోజులు ఎక్కువ ఉన్నందున సీక్వెన్షియల్‌గా ఏఆర్పీయూ 1–2 శాతం పెరగవచ్చని వివరించింది. అయితే, అంతక్రితం రెండు త్రైమాసికాలతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా టెల్కోల ఆదాయ వృద్ధి బలహీనంగా (2.4 శాతం స్థాయిలో) ఉండవచ్చని, వార్షికంగా చూస్తే మాత్రం 19 శాతం పెరుగుదల నమోదు కావచ్చని బీఎన్పీ పారిబా పేర్కొంది. టారిఫ్‌ల పెంపు ప్రయోజనాలు ఇప్పటికే లభించడం, కొత్తగా చేరే యూజర్ల సంఖ్య అంతంతమాత్రంగానే ఉండటం ఇందుకు కారణమని తెలిపింది. 5జీపై దృష్టి.. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించే 5జీ సేవల విస్తరణ, పెట్టుబడులు, టారిఫ్‌లు తదితర అంశాలపై టెల్కోలు క్యూ2 ఫలితాల సందర్భంగా ఏం చెప్పబోతున్నాయన్న దానిపై నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారతి ఎయిర్టెల్ ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై తదితర 8 నగరాల్లో క్రమంగా 5జీ సేవలు విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలో జియో .. బీటా ట్రయల్స్ నిర్వహిస్తోంది. జియో 2023 డిసెంబర్ కల్లా దేశవ్యాప్తంగా 5జీ సర్వీసులు విస్తరించనున్నట్లు ప్రకటించగా, 2024 మార్చి నాటికి దీన్ని సాధించనున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది.అటు యాపిల్, శాంసంగ్ వంటి టాప్ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు .. భారత్‌లోని తమ 5జీ ఎనేబుల్డ్ ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నాయి. చదవండి: ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు -
భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు.. షాకింగ్ దృశ్యాలు వైరల్
బీజింగ్: చైనాలోని బహుళ అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పలు అంతస్థులు మంటల్లో దగ్ధమైపోయాయి. దట్టమైన పొగతో అక్కడి వాతావరణం అత్యంత భయానకంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే రెస్క్యూ కార్యక్రమం చేపట్టింది. ఆ భవనం ప్రభుత్వ యజమాన్యంలోని టెలికాం కార్యాలయం అని చైనా పేర్కొంది. ఈ ఘటన సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షాలో చోటుచేసుకుంది. ఈ భయానక ఘటనకు సంబధించిన వీడియో అన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: క్వీన్ అంత్యక్రియల వేళ... అనుహ్య ఘటన) -
4జీ చార్జీలకే 5జీ సేవలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం అయిన 5జీ సేవలను నేడో రేపో ప్రారంభించేందుకు భారత టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. స్పెక్ట్రం అందుకున్న కంపెనీలు ఒకవైపు.. 5జీ హ్యాండ్‌సెట్స్‌తో 5 కోట్ల మంది కస్టమర్లు మరోవైపు. అయితే అందరి చూపూ చార్జీలు ఎలా ఉండబోతున్నాయనే. టెలికం కంపెనీల నుంచి అందుతున్న సమాచారం మేరకు 4జీ రేటుకే 5జీ సేవలను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో కస్టమర్ నుంచి సమకూరే ఆదాయాన్ని పెంచుకోవాలని కొన్నేళ్లుగా టెలికం సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన ఈ సంస్థలు అందుకు తగ్గ ప్రణాళికనూ రెడీ చేసుకున్నాయి. ఆరు నెలల తర్వాతే.. ముందుగా 4జీ టారిఫ్‌లోనే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా అందించే అవకాశం ఉందని దిగ్గజ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కొత్త టెక్నాలజీపట్ల కస్టమర్ అనుభూతి చెందాలి. 5జీ ప్రయోజనాలు అందుకోవాలి. అంత వరకు రేట్ల సవరణ ఉండకపోవచ్చు. ఆరు నెలల తర్వాతే క్రమంగా కొత్త చార్జీలు అమలులోకి వచ్చే చాన్స్ ఉంది. నెట్వర్క్ స్లైసింగ్ విధానంలో ఒక్కో వినియోగదారుడు కోరుకున్న వేగాన్ని 5జీలో అందించే వీలుంది. నెట్వర్క్ అప్‌గ్రేడ్ కారణంగా అటు 4జీ సేవల నాణ్యతా పెరుగుతుంది’ అని వివరించారు. 2022 మే 31 నాటికి దేశవ్యాప్తంగా 79.47 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదార్లు ఉన్నారు. వీరిలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 76.55 కోట్లు. సగటున ఒక్కో కస్టమర్ నుంచి టెలికం కంపెనీకి సమకూరుతున్న ఆదాయం రూ.200లోపే ఉంటోంది. దీనిని రూ.300–350కి చేర్చాలన్నది కంపెనీల లక్ష్యం. 2021 నవంబర్–డిసెంబర్లో చార్జీలు 20–25 శాతం పెరిగాయి. కంపెనీలకు స్పెక్ట్రం భారం.. టెలికం కంపెనీలు 5జీ స్పెక్ట్రం కోసం భారీగానే ఖర్చు చేశాయి. రిలయన్స్ జియో ఏకంగా రూ.88,078 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఒక్క 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 10 మెగాహెట్జ్ స్పెక్ట్రం కోసం జియో ఏకంగా రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందంటే ఆశ్చర్యం వేయకమానదు. 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో అంటోంది. 5జీ సేవల్లో భాగంగా మూడు ప్రైవేట్ టెలికం సంస్థలు నెట్వర్క్ అప్‌గ్రేడ్, విస్తరణకు అయిదేళ్లలో రూ.1.43–1.59 లక్షల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని ఓ కన్సల్టింగ్ కంపెనీ వెల్లడించింది. భారీగా ఖర్చులు ఉన్నందున ప్యాక్‌ల చార్జీలు పెంచక తప్పదు. అది కూడా ఆచితూచి వ్యవహరించాలన్నది కంపెనీల భావన. రెండేళ్లలో 15 కోట్లు.. ప్రస్తుతం దేశంలో 5 కోట్ల మంది వద్ద 5జీ హ్యాండ్సెట్స్ ఉన్నాయి. రెండేళ్లలో ఈ సంఖ్యను 15 కోట్లకు చేర్చాలన్నది టెలికం కంపెనీల లక్ష్యం. ఇందుకు అనుగుణంగా మొబైల్స్ తయారీ సంస్థలతో కలిసి బండిల్ ఆఫర్లను టెలికం సంస్థలు ప్రవేశపెట్టనున్నాయి. జియో రాకతో ఒక్కసారిగా దేశంలో 4జీ విప్లవం వచ్చింది. మూడు కంపెనీల గట్టి పోటీతో 5జీలోనూ అదే ఊపు ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
గెట్ రెడీ వచ్చేస్తున్నాం.. ఆగస్ట్‌లో 5జీ సేవలు: ఎయిర్టెల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ఈ నెలలోనే 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందుకోసం టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్తో ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం ప్రకటించింది. ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ బిడ్డింగ్‌లో ఎయిర్టెల్ సైతం పాల్గొన్న సంగతి తెలిసిందే. 900 మెగాహెట్జ్, 1800, 2100, 3300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్స్‌లో 19,867.8 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కంపెనీ దక్కించుకుంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకై ఈ సంస్థ రూ.43,084 కోట్లు వెచ్చించింది. భారత్‌లో 5జీ విప్లవానికి నాంది పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ‘ఆగస్ట్‌లో 5జీ సేవలను ప్రారంభిస్తున్నాం. నెట్వర్క్ ఒప్పందాలు పూర్తయ్యాయి. 5జీ పూర్తి ప్రయో జనాలను వినియోగదార్లకు అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేస్తాం’ అని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. చదవండి: Lic: ఇదే మొదటి సారి.. అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ! -
ఇండియాలో తొలి 5జీ కాల్ మాట్లాడింది ఎవరు? ఎక్కడ?
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన పరికరాలతో ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటు చేసిన ట్రయల్ నెట్వర్క్ ద్వారా తొలి 5జీ వీడియో కాల్ చేసినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘ఆత్మనిర్భర్ 5జీ. ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్‌ను విజయవంతంగా పరీక్షించాం. ఈ నెట్వర్క్ పూర్తిగా భారత్‌లోనే అభివృద్ధి చేశారు‘ అని గురువారం కాల్ అనంతరం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశీయంగా 4జీ, 5జీ టెక్నాలజీలో పూర్తి సామర్థ్యాలు సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష దీనితో సాకారమైనట్లయిందని మంత్రి పేర్కొన్నారు. 5జీ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్‌బెడ్‌ను ఐఐటీ మద్రాస్‌లో ప్రధాని మంగళవారమే ఆవిష్కరించారు. ప్రస్తుతం టెలికం కంపెనీలు ప్రయోగాత్మకంగానే 5జీ సేవలను పరీక్షిస్తున్నాయి. ఇవి ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్లలో అందుబాటులోకి రాగలవన్న అంచనాలు ఉన్నాయి. Aatmanirbhar 5G 🇮🇳 Successfully tested 5G call at IIT Madras. Entire end to end network is designed and developed in India. pic.twitter.com/FGdzkD4LN0 — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 19, 2022 చదవండి: అదిరిపోయేలా 5జీ డౌన్‌లోన్ స్పీడ్ -
డచ్ టెల్కోపై రిలయన్స్ కన్ను
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా నెదర్లాండ్స్‌కు చెందిన టెలికం సంస్థ కొనుగోలుపై దృష్టి పెట్టింది. టీ–మొబైల్ నెదర్లాండ్స్ బీవీలో మెజారిటీ వాటాలను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించి ఒక నెల రోజుల్లోగా.. సుమారు 5.7 బిలియన్ డాలర్ల డీల్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లావాదేవీకి అవసరమయ్యే నిధులను సమీకరించుకునేందుకు రిలయన్స్ ఇప్పటికే రుణదాతలను షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియ మొదలుపెట్టిందని వివరించాయి. డీల్‌కు కావాల్సిన రుణాన్ని అందించేందుకు పలు దిగ్గజ విదేశీ బ్యాంకులు సిండికేట్‌గా ఏర్పడుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టీ–మొబైల్ నెదర్లాండ్స్ కొనుగోలుపై రిలయన్స్ గత మూడు నెలలుగా కసరత్తు చేస్తోందని, అప్పట్నుంచి చర్చలు గణనీయంగా పురోగమించాయని వివరించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన టెలికం దిగ్గజం జియో డైరెక్టర్‌గా ఉన్న ఆకాశ్ అంబానీ (రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు) వ్యక్తిగతంగా ఈ లావాదేవీని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాయి. టీ–మొబైల్ కొనుగోలుతో జియోకి యూరప్ టెలికం మార్కెట్లో అడుగుపెట్టేందుకు వీలవుతుంది. అలాగే, ఇతర మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా వ్యాపారపరమైన రిసు్కలను కూడా తగ్గించుకునేందుకు దోహదపడగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. టీ–మొబైల్ కథ ఇదీ.. జర్మనీకి చెందిన డాయిష్ టెలికం ఏజీ .. 2000 సంవత్సరంలో బెల్గాకామ్ ఎస్ఏ, టెలి డాన్మార్క్తో జాయింట్ వెంచర్ కంపెనీలో కొంత వాటాలను కొనుగోలు చేయడం ద్వారా నెదర్లాండ్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. మిగతా వాటాలను కూడా దక్కించుకున్న తర్వాత టీ–మొబైల్ నెదర్లాండ్స్ కింద తిరిగి పేరు మార్చింది. 2019లో టెలీ2 ఏబీ కార్యకలాపాలను టీ–మొబైల్ నెదర్లాండ్స్ విలీనం చేసుకుంది. టీ–మొబైల్ నెదర్లాండ్స్‌లో డాయిష్ టెలికంనకు 75 శాతం, టెలీ2కి మిగతా వాటా ఉంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో అతి పెద్ద టెలికం సంస్థ అయిన టీ–మొబైల్‌కు 57 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. మరో అనుబంధ సంస్థ ద్వారా డాయిష్ టెలికంనకు, అమెరికాలోని టీ–మొబైల్లో కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో వాటాలు ఉన్నాయి. అమెరికాలో టెలికం స్పెక్ట్రం కొనుగోలు చేసేందుకు 2015లోనే టీ–మొబైల్ నెదర్లాండ్స్‌ను విక్రయించాలని డాయిష్ టెలికం భావించింది. కానీ, తర్వాత ఆ ప్రతిపాదన విరమించుకుంది. టీ–మొబైల్ నెదర్లాండ్స్‌కు బ్రిటన్‌లో కూడా గణనీయంగా వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. -
మెరుగైన సేవలపైనే వొడాఫోన్ దృష్టి..
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా తాజాగా తమ ఉద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నాల్లో ఉంది. కంపెనీపై వస్తున్న వార్తలను పక్కన పెట్టి కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, మార్కెట్లో దీటుగా రాణించేందుకు కృషి చేయాలని ఉద్యోగులకు అంతర్గతంగా కంపెనీ సీఈవో రవీందర్ టక్కర్ సూచించారు. టాప్ స్థాయిలో చోటుచేసుకున్న నాయకత్వ మార్పుల గురించి వారికి వివరించారు. కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకోవడం, సంస్థను నిలబెట్టే క్రమంలో దాన్ని ప్రభుత్వానికి లేదా ఇతర కంపెనీకి అప్పగించేందుకు సిద్ధమంటూ ప్రకటించడం తదితర పరిణామాలు తెలిసిందే. -
స్పెక్ట్రమ్ షేరింగ్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన టెలికం కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్ పంపిణీ వివరాలను (షేరింగ్) ఇవ్వాలని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా టెలికం శాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రిలయన్స్ జియో మధ్య స్పెక్ట్రమ్ పంపకం జరగ్గా.. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను వాడుకున్నందుకు, ఆ కంపెనీ స్పెక్ట్రమ్ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లోగడ విచారణలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ కామ్ తోపాటు, వీడియోకాన్ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న విషయం గమనార్హం. ‘‘వీడియోకాన్ స్పెక్ట్రమ్ బదలాయించాలంటే, దాని కంటే ముందు గత బకాయిలను కంపెనీ చెల్లించాలి’’ అంటూ వీడియోకాన్ విషయమై ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ వీడియోకాన్ చెల్లించకపోతే, ఆ స్పెక్ట్రమ్ ను సొంతం చేసుకున్న భారతీ ఎయిర్ టెల్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వీడియోకాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కార్పొరేట్ దివాలా చర్యల ప్రక్రియకు వెలుపల తాము ఎటువంటి బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కలిగిలేమని నివేదించారు. ఏజీఆర్ బకాయిలను ఐబీసీ కింద నిర్వహణ బకాయిలుగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను జియో వినియోగించుకున్నందున ఆ మొత్తానికి సంబంధించి జియో చెల్లించాల్సిన బకాయిల వివరాలను అడిగినా ఇవ్వలేదేమంటూ ధర్మాసనం టెలికం శాఖను ప్రశ్నించింది. అనంతరం దివాలా చర్యల పరిధిలో ఉన్న కంపెనీల స్పెక్ట్రమ్ పంపిణీకి సంబంధించి ఎంత మేర బకాయిలు రావాలన్న వివరాలను సమర్పించాలని టెలికం శాఖను ఆదేశించింది. 1999 నుంచి ఏ కంపెనీలు స్పెక్ట్రమ్ ను వినియోగించుకున్నదీ, వాటి మధ్య వాణిజ్య ఒప్పంద వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. ఏజీఆర్ బకాయిలను ఏటా కొంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించేందుకు అనుమతించాలని భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ధర్మాసనాన్ని అభ్యర్థించాయి. ఈ రెండు కంపెనీలు కలసి రూ.లక్ష కోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. టెలికం శాఖ డిమాండ్ ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ.58,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.8,000 కోట్లను ఇప్పటి వరకు జమ చేయగలిగింది. భారతీ ఎయిర్ టెల్ రూ.43,000 కోట్ల బకాయిలకు గాను రూ.18,000 కోట్లను చెల్లించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన గల సుప్రీం ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. -
ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఐడియా!
ముంబై: భారీ రుణభారంతో కుదేలైన వొడాఫోన్ ఐడియా కంపెనీ ఆస్తుల విక్రయానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆప్టిక్ ఫైబర్ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్తోనూ, నవీ ముంబైలో ఉన్న డేటా సెంటర్‌ను అమ్మేయడానికి ఎడెల్వీజ్ గ్రూప్‌తోనూ ఐడియా చర్చలు జరుపుతోందని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... వొడాఫోన్ ఐడియా కంపెనీ తన 1,56,000 కిమీ. ఆప్టిక్ ఫైబర్ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. ఈ వ్యాపారం విలువ 150–200 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. ఇక నవీ ముంబైలోని డేటా సెంటర్‌ను ఎడెల్వీజ్ సంస్థకు చెందిన ఎడెల్వీజ్ ఈల్డ్ ప్లస్ ఫండ్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డేటా సెంటర్ విలువ 6–10 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చు. సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్)కు సంబంధించి వొడాఫోన్ ఐడియా రూ.53,000 కోట్ల బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్ట్ ఈ ఏడాది అక్టోబర్24న తీర్పునిచి్చంది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా ఈ బకాయిలను కొంతైనా తీర్చాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అయితే టెలికం రంగానికి రూ.7 లక్షల కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో ఆప్టిక్ ఫైబర్ ఆస్తుల విక్రయానికి బ్యాంక్‌లు అభ్యతరం చెప్పే అవకాశాలున్నాయి. -
ఆర్‌కామ్ ఆస్తుల రేసులో ఎయిర్టెల్, జియో
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు 11 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోటీ కంపెనీలైన భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా వీటిలో ఉన్నాయి. ‘ మూడు సంస్థల (ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు మొత్తం 11 బిడ్స్ వచ్చాయి. వీటిలో వర్డే క్యాపిటల్, యూవీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మొదలైన సంస్థల బిడ్స్ కూడా ఉన్నాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్ డేటా సెంటర్, ఆప్టికల్ ఫైబర్ వ్యాపారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుందని భావించిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ సంస్థ.. అసలు బిడ్ దాఖలు చేయలేదని వివరించాయి. బిడ్లను సోమవారమే ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. రుణదాతల కమిటీ (సీవోసీ) దీన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. ఆర్‌కామ్ సెక్యూర్డ్ రుణాలు దాదాపు రూ. 33,000 కోట్ల మేర ఉండగా.. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్ చేశారు. బాకీల చెల్లింపు కోసం అసెట్స్‌ను విక్రయించేందుకు గతంలో కూడా ఆర్‌కామ్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. స్పెక్ట్రం చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీల కోసం ప్రొవిజనింగ్ చేయడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అటు కంపెనీ చైర్మన్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేసినప్పటికీ.. రుణదాతలు ఆమోదముద్ర వేయలేదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) ఆర్‌కామ్ వ్యవహారం చేరింది. ఎన్సీఎల్టీ ఆదేశాల ప్రకారం పరిష్కార నిపుణుడు (ఆర్పీ) 2020 జనవరి 10లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. స్టాక్ .. అప్పర్ సర్క్యూట్.. బిడ్డింగ్ వార్తలతో సోమవారం ఆర్‌కామ్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఆరు శాతం ఎగిశాయి. బీఎస్ఈలో ఆర్‌కామ్ షేరు 69 పైసలు పెరిగి రూ. 4.55 వద్ద ముగిసింది. -
డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పెంపు చట్టం శీతాకాల సమావేశాల్లోనే!
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతమున్న రూ.లక్ష బీమా మొత్తాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన చట్టాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, కోపరేటివ్ బ్యాంకుల నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని కూడా తేనున్నట్టు చెప్పారు. మంత్రి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలకు కోత విధించే ప్రణాళికేమీ లేదన్నారు. బడ్జెట్లో కేటాయించిన మేరకు పూర్తి నిధుల వినియోగం దిశగా అన్ని శాఖలను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 18 (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏ ఒక్క కంపెనీ వెళ్లిపోకూడదు.. టెలికం కంపెనీల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘ఏ కంపెనీ కూడా కార్యకలాపాలను మూసివేయాలని కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ కార్యకలాపాలు కొనసాగించాలి. వ్యాపారాల్లో ఎన్నో కంపెనీలు కొనసాగే ఆర్థిక వ్యవస్థను కోరుకుంటున్నాం. ఒక్క టెలికం రంగమే కాదు.. ప్రతీ రంగంలోనూ ప్రతీ కంపెనీ కొనసాగాలన్నదే నా అభిలాష’’ అని మంత్రి బదులిచ్చారు. టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు సెక్రటరీలతో ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే భవిష్యత్తులో అదనపు పెట్టుబడులు పెట్టడం అసాధ్యమంటూ వొడాఫోన్ ఐడియా కంపెనీ పేర్కొన్న విషయం తెలిసిందే. -
టెల్కోలపై ‘ఏజీఆర్’ పిడుగు
న్యూఢిల్లీ: ఏజీఆర్‌పై (సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్టెల్ కంపెనీ రూ.23,045 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా రూ.74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్) కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూ2లో ఎయిర్‌టెల్‌పై భారం 28,450 కోట్లు టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ త్రైమాసిక కాలానికి భారీగా నష్టాలు వచ్చాయి. ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) విషయమై సుప్రీం కోర్ట్ ఇటీవల ఇచ్చిన తీర్పుతో కంపెనీకి ఈ క్యూ2లో అత్యధిక స్థాయిలో త్రైమాసిక నష్టాలు తప్పలేదు. గత క్యూ2లో రూ.119 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.23,045 కోట్ల నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయని ఎయిర్టెల్ తెలిపింది. ఈ క్యూ2లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.21,199 కోట్లకు పెరిగిందని పేర్కొంది. కొత్త అకౌంటింగ్ విధానాలను అనుసరించినందువల్ల గత క్యూ2, ఈ క్యూ2 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. సుప్రీంకోర్టు ఏజీఆర్ విషయమై తాజాగా ఇచ్చిన తీర్పు కారణంగా స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు(ఎస్‌యూసీ), లైసెన్స్ ఫీజు తదితర అంశాలకు సంబంధించి ఈ క్యూ2లో ఈ కంపెనీపై రూ.28,450 కోట్ల భారం పడిం ది. దీంతో కంపెనీ నికర నష్టాలు రూ.23,045 కోట్లకు పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం. ఏజీఆర్ భారం లేకుంటే కంపెనీ నికర నష్టాలు రూ.1,123 కోట్లుగా ఉండేవి. నిర్వహణ లాభం రూ. 6,343 కోట్ల నుంచి రూ.8,936 కోట్లకు పెరిగింది. భారత విభాగం ఆదాయం 3% పెరిగి రూ.15,361 కోట్లకు చేరింది. ఆఫ్రికా విభాగం ఆదాయం 13% ఎగసింది. వొడాఫోన్ ఐడియాపై పెనుభారం... ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇంత వరకూ ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించలేదు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో తమ నష్టాలు రూ.4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఇక ఆదాయం 42 శాతం ఎగసి రూ.11,146 కోట్లకు పెరిగిందని వివరించింది. సుప్రీం తాజా తీర్పు కారణంగా తాము చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.44,150 కోట్లుగా ఉంటాయని అంచనా వేసిన వొడాఫోన్ ఐడియా, ఈ క్యూ2లో రూ.25,680 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఇరు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ప్రతికూల అంచనాలతోనే ఈ రెండు షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎయిర్టెల్ షేర్ బీఎస్ఈలో 1.5% నష్టంతో రూ.363 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా షేర్ 20% క్షీణించి రూ.2.95 వద్దకు చేరింది. మొత్తం బకాయిలు రూ.1.4 లక్షల కోట్లు... టెలికం విభాగం తాజా అంచనాల ప్రకారం... ఏజీఆర్‌కు సంబంధించి ఎయిర్టెల్ రూ.62,187 కోట్లు, (టాటా గ్రూప్ టెలికం కంపెనీలను, టెలినార్‌ను కూడా విలీనం చేసుకున్నందు వల్ల వాటి భారం ఎయిర్టెల్ మీదనే పడింది) వొడాఫోన్ ఐడియాలు రూ.54,184 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ బకాయిలను 3 నెలల్లోగా చెల్లించాలని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. తాజాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగానే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం విభాగం నోటీసులు జారీ చేసింది. మొత్తం టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఐడియా రివ్యూ పిటిషన్...!: ఏజీఆర్‌కు సంబంధించి స్పష్టత లేదంటూ గత నెలలోనే వెల్లడించాల్సిన ఆర్థిక ఫలితాలను ఎయిర్టెల్ వాయిదా వేసింది. కాగా టెలికం పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్‌పై సానుకూల నిర్ణయం తీసుకోగలదన్న ఆశాభావాన్ని క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా ఎయిర్టెల్ వ్యక్తం చేసింది. మరోవైపు ఏజీఆర్ విషయమై ఒక రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్ ఐడియా సన్నాహాలు చేస్తోంది. ఏజీఆర్‌కు సంబంధించి సానుకూల నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటేనే తమ కంపెనీ కొనసాగగలదని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైననే తమ కంపెనీ మనుగడ ఆధారపడి ఉందని వివరించింది. -
మొబైల్ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ ప్రీ–పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సోమవారం కొత్తగా ప్రకటించిన రూ. 599 ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అదనంగా రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఈ రీచార్జ్ వేలిడిటీ 84 రోజులు ఉంటుందని, ప్రతీ రీచార్జ్‌తో పాటు బీమా కవరేజీ ఆటోమేటిక్‌గా మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపింది. 18–54 ఏళ్ల కస్టమర్లకు ఇది వర్తిస్తుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యపరీక్షలు అవసరం లేదని వివరించింది. దీన్ని ప్రస్తుతం ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనే ప్రవేశపెట్టినట్లు, క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ వివరించింది. -
మొత్తం బాకీలన్నీ మాఫీ చేయండి
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియాలతో పాటు మిగతా టెల్కోల మొత్తం పాత బకాయిలు (సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) మాఫీ చేసేయాలని కోరింది. అలా కుదరకపోతే కనీసం వడ్డీలు, పెనాల్టీలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. గతంలో రాసిన లేఖకు అనుబంధంగా కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ అక్టోబర్ 31న తాజా లేఖ రాశారు. కేంద్రం చెబుతున్నట్లుగా ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) ఫార్ములాకు తగ్గట్లు పాత బకాయిలన్నింటిని లెక్కగట్టి, కేంద్రానికి చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు అక్టోబర్ 24న టెల్కోలను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం భారతి ఎయిర్టెల్ ఏకంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు పైగా కట్టాల్సి రావొచ్చని అంచనా. రింగ్ వ్యవధి 30 సెకన్లు.. టెలిఫోన్ రింగ్ అయ్యే వ్యవధిని నిర్దేశిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లకైతే ఇది 30 సెకన్లుగాను, ల్యాండ్‌లైన్ ఫోన్లకు∙60 సెకన్లుగాను నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత నిబంధనలకు సవరణ చేసింది. -
చైనాలో 5జీ సేవలు షురూ
బీజింగ్: టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికం సేవలు ప్రారంభించింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు గురువారం ఈ సర్వీసులు ప్రారంభించాయి. బీజింగ్, షాంఘై తదితర 50 నగరాల్లో తమ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని చైనా మొబైల్ సంస్థ వెల్లడించింది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి (18 డాలర్లు) ప్రారంభమవుతాయని పేర్కొంది. అటు పోటీ సంస్థలైన చైనా టెలికం, చైనా యూనికామ్ కూడా ఇదే స్థాయి టారిఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండే 5జీ సేవలతో సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్రైవర్‌రహిత కార్లు, ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ వంటి వాటికి ఇవి ఉపయోగపడనున్నాయి. వచ్చే ఏడాది నాటికి 17 కోట్ల మంది యూజర్లతో 5జీ వినియోగంలో చైనా అగ్రస్థానంలో నిలుస్తుందని, సుమారు 75,000 మంది యూజర్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో.. 10,000 మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. 5జీ పరికరాల ఉత్పత్తిలో అగ్రగాములైన చైనా సంస్థలు హువావే, జెడ్‌టీఈలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టెల్కోలకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్ నిర్వచనం సరైనదేనని న్యాయస్థానం భావిస్తోంది. డాట్ అప్పీలును సమర్ధిస్తూ, లైసెన్సీల (టెల్కోలు) పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది‘ అని పేర్కొంది. టెలికం కంపెనీల మిగతా అభ్యర్ధనలను కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. దీనిపై తదుపరి వాదనలేవీ ఉండబోవని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు .. నిర్దేశిత గడువులోగా జరిమానాలు, వడ్డీతో కలిపి డాట్‌కు బకాయిలన్నీ కట్టాలని ఆదేశించింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. వివాదం ఇదీ.. కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 1.4 లక్షల కోట్లపైనే భారం జరిమానాలు, వడ్డీల్లాంటివన్నీ కలిపితే.. సవరించిన ఆదాయాల ప్రకారం టెలికం ఆపరేటర్లు కట్టాల్సిన బకాయిలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల పైగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘టెల్కోలు కట్టాల్సిన బకాయిలను మళ్లీ లెక్కిస్తే సుమారు రూ. 1.34 లక్షల కోట్లకు చేరుతుంది. మరో త్రైమాసికం లెక్కలు కూడా జోడిస్తే.. ఇది ఇంకో 4–5 శాతం పెరగవచ్చు‘ అని పేర్కొన్నాయి. 10 రోజుల్లో అందరు ఆపరేటర్స్‌కి డిమాండ్ నోటీసులు పంపిస్తామని, అవి అందిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. కొత్త లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలన్నీ కలిపి భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్–ఐడియా రూ. 40,000 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని అంచనా. జియో కేవలం రూ. 14 కోట్లు కట్టాల్సి రావచ్చు. వొడాఐడియా షేరు కుదేల్.. లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలతో గురువారం వొడాఫోన్ ఐడియా షేరు ఇంట్రాడేలో ఏకంగా 27 శాతం క్రాష్ అయ్యింది. బీఎస్ఈలో ఒక దశలో రూ. 4.10 (52 వారాల కనిష్ట స్థాయి)కి పడిపోయింది. చివరికి కొంత కోలుకుని 23 శాతం నష్టంతో రూ. 4.33 వద్ద క్లోజయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,793 కోట్ల మేర హరించుకుపోయి.. రూ. 12,442 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, భారతి ఎయిర్టెల్ కూడా ఇంట్రాడేలో సుమారు 10 శాతం క్షీణించి రూ. 325.60కి పడిపోయినప్పటికీ.. తర్వాత కోలుకుని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద క్లోజయ్యింది. కేంద్రం పునఃసమీక్షించాలి: టెల్కోలు ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న టెలికం పరిశ్రమను తాజా తీర్పు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందని వొడాఫోన్ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. రివ్యూ పిటిషన్ అవకాశాలపై న్యాయనిపుణులను సంప్రతిస్తామని పేర్కొంది. టెల్కోలపై తీర్పు పెనుభారం మోపుతుందని, కేంద్రం దీన్ని పునఃసమీక్షించాలని ఎయిర్టెల్ తెలిపింది. తీవ్రంగా నిరాశపర్చింది: సీవోఏఐ సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) వ్యాఖ్యానించింది. దాదాపు రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న టెలికం పరిశ్రమకు ఇది గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. -
వొడాఫోన్ ఐడియా నష్టం 5,005 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్– ఐడియాకు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.5,006 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటం, నెట్వర్క్ ఇంటిగ్రేషన్ వ్యయాలు కూడా ఎక్కువగా ఉండటం, మొబైల్ టవర్ వ్యాపారం నుంచి నిష్క్రమించిన వ్యయాలు కూడా అధికంగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ రెండు కంపెనీలకు కలసి రూ.1,285 కోట్ల నష్టాలొచ్చాయి. గత ఏడాది ఆగస్టు 31న ఐడియా, వొడాఫోన్ల విలీనం పూర్తయినందువల్ల ఫలితాలను పోల్చడానికి లేదు. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర నష్టాలు మరింతగా పెరిగాయి. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లు... ఈ క్యూ3లో మొత్తం ఆదాయం రూ.11,983 కోట్లకు పెరిగిందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఈ క్యూ2లో సాధించిన మొత్తం ఆదాయం రూ.7,879 కోట్లతో పోల్చితే 52 శాతం వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ బాలేశ్ శర్మ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.6,552 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లుగా ఉన్నాయని, మొబైల్ టవర్ల వ్యాపారం నుంచి బైటకు వచ్చామని, దీనికి గాను వెండర్లకు రూ.725 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉందని తెలిపారు. ఇండస్ టవర్స్‌లో 11.15 శాతం వాటాను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ వాటా విలువ రూ.4,960 కోట్లుగా ఉండొచ్చ న్నారు. అలాగే 1.58 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విక్రయించనున్నామని, ఈ విక్రయాల ద్వారా సమకూరిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపారు. రూ.89కు ఏఆర్పీయూ.. ఈ క్యూ3లో ఎబిటా రూ.1,137 కోట్లుగా నమోదైందని, ఈ క్యూ2లో 6 శాతంగా ఉన్న మార్జిన్ ఈ క్యూ3లో 9.7 శాతానికి పెరిగిందని బాలేశ్ శర్మ పేర్కొన్నారు. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 1.5 శాతం పెరిగి రూ.89కు చేరిందని తెలిపారు. ఒక్కో వినియోగదారుడు వినియోగించే డేటా 5.6 జీబీనుంచి 6.2 జీబీకి పెరిగిందన్నారు. 75 కోట్ల మందికి 4జీ సర్వీసులందేలా 11,123 సైట్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ క్యూ3లో కొత్తగా 95 లక్షల 4జీ యూజర్లు జతయ్యారని, దీంతో మొత్తం 4జీ కస్టమర్ల సంఖ్య 7.53 కోట్లకు చేరిందని వివరించారు. 4జీ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టామని బాలేశ్ శర్మ చెప్పారు. అలాగే 4జీ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలనేది లక్ష్య మన్నారు. మూలధన సమీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని, ఈ ప్రణాళికకనుగుణంగా సమీకరించిన నిధులతో వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తాజా ఏడాది కనిష్టానికి షేరు.. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.29.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.28.80ను తాకింది. -
కెనడాలో హువావే సీఎఫ్‌వో అరెస్ట్
ఒటావా: చైనా టెలికం దిగ్గజం హువావే వ్యవస్థాపకుడు కుమార్తె, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మెంగ్ వాంఝూను కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించడం ద్వారా హువావే నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలే ఇందుకు కారణమని తెలియవచ్చింది. మెంగ్ వాంఝూను అప్పగించాల్సిందిగా అమెరికా కోరుతోందని, ఆమె బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుందని కెనడా న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హువావేతో దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న అమెరికా... ఇప్పటికే ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అంశంపై హువావే మీద విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టే విధంగా చైనా వ్యవహరిస్తోందని, దీన్ని తాము చూస్తూ కూర్చోబోమని అమెరికా సెనేటర్ బెన్ సాసీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. తద్వారా వాంఝూ అరెస్ట్ వెనుక ఇరాన్ కోణం ఉన్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. అటు ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్‌తో పాటు అమెరికా చట్టాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని హువావే పేర్కొంది. ఈ మధ్యే వాణిజ్య యుద్ధాలపై తాత్కాలిక సంధి కుదుర్చుకున్న చైనా, అమెరికా మధ్య ఈ పరిణామంతో మరోసారి అగ్గి రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా, చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరిన రోజు డిసెంబర్ 1వ తేదీ నాడే వాంఝూను కెనడాలో అరెస్ట్ చేశారు. మెంగ్‌ను తక్షణం విడుదల చేయాలంటూ కెనడాలోని చైనా దౌత్య కార్యాలయం డిమాండ్ చేసింది. సంధి చర్యలు సత్వరం అమలుపై చైనా దృష్టి.. అమెరికాతో కుదుర్చుకున్న తాత్కాలిక సంధి చర్యలను సత్వరం అమలు చేయనున్నట్లు చైనా వెల్లడించింది. నిర్దేశిత 90 రోజుల్లోగా డీల్ కుదుర్చుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. సుంకాలపరమైన పోరుతో వాణిజ్య యుద్ధానికి దారి తీసిన వివాదాల పరిష్కారానికి ఇరు దేశాలు 90 రోజుల గడువు విధించుకున్న సంగతి తెలిసిందే. సంధి ఒప్పందం ప్రకారం గడువు తీరేదాకా 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలను 25 శాతానికి పెంచకుండా 10% స్థాయిలోనే అమెరికా కొనసాగించనుంది. అటు చైనా తన వంతుగా అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు మరి న్ని అమెరికన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోనుంది. -
రెండు వారాల్లో కేబినెట్ ముందుకు టెలికం పాలసీ
న్యూఢిల్లీ: నూతన టెలికం పాలసీ రెండు వారాల్లో కేబినెట్ ఆమోదానికి రానున్నట్లు ఆ శాఖ కార్యదర్శి అరుణ సౌందరాజన్ తెలిపారు. అంతర్గత మంత్రిత్వ శాఖల సంప్రదింపులు ముగిశాయని, కేబినెట్ ఆమోదానికి సమర్పించడానికి ముందు తుది మెరుగులు దిద్దుకుంటోందని చెప్పారామె. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్డీసీపీ) అయిన దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బహిర్గత పరిచింది. టెలికం రంగంలో కొత్తగా రూ.6.5 లక్షల మేర పెట్టుబడులను ఆకర్షించడం, 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాలను కల్పించడం, లెవీలను క్రమబద్ధీకరించడం ద్వారా టెలికం కంపెనీలపై భారాన్ని తగ్గించడం, 50ఎంబీపీఎస్ బ్రాడ్ బ్యాండ్ వేగాన్ని స్టాండర్డ్‌గా మార్చడం, 5జీ సేవల్ని తీసుకురావవడం వంటి లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. -
మళ్లీ నిరాశ పరిచిన భారతీ ఎయిర్టెల్
న్యూఢిల్లీ: జియో రంగ ప్రవేశం తర్వాత ఆదాయం, లాభాలను కోల్పోతూ వస్తున్న టెలికం రంగ కంపెనీ భారతీ ఎయిర్టెల్ జూన్ త్రైమాసికంలోనూ కుదుటపడలేదు. మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 73% తగ్గిపోయి రూ.97 కోట్లకు పరిమితమైంది. ఆదాయం సైతం 9% తగ్గి రూ.20,080 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.367 కోట్లు, ఆదాయం రూ.21,958 కోట్లుగా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్ పరంగా చూస్తే ఆదాయం 7 శాతం తగ్గి రూ.14,930 కోట్లుగా ఉంది. మార్కెట్లో ధరలు ఇప్పటికీ అనుకూలంగా లేవని కంపెనీ ఎండీ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. అయినప్పటికీ బండిల్ పథకాలు, కంటెంట్ భాగస్వామ్యం, హ్యాండ్సెట్ అప్‌గ్రేడ్ పథకాలతో మొబైల్డేటా ట్రాఫిక్ అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 355 శాతం పెరిగినట్టు ఆయన చెప్పారు. -
భారతి ఇన్ఫ్రాటెల్తో ఇండస్ టవర్స్ విలీనం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం టవర్ల సంస్థ ఏర్పాటు దిశగా భారతి ఇన్ఫ్రాటెల్, ఇండస్ టవర్స్ త్వరలో విలీనం కానున్నాయి. తద్వారా 14.6 బిలియన్ డాలర్ల (రూ. 96,500 కోట్లు) దిగ్గజం ఆవిర్భవించనుంది. ఏకంగా 1,63,000 టవర్లతో చైనా టవర్ సంస్థ తర్వాత ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టవర్స్ సంస్థగా నిలవనుంది. విలీనానికి సంబంధించి ఇరు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చాయి. విలీన సంస్థ పేరు ఇండస్ టవర్స్ లిమిటెడ్‌గా ఉంటుంది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ తదితర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరులోగా డీల్ పూర్తి కాగలదని అంచనా. ప్రత్యేక స్కీమ్ ప్రకారం భారతి ఇన్ఫ్రాటెల్లో ఇండస్ టవర్స్ విలీనం అవుతుందని భారతి ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండస్ టవర్స్ ప్రస్తుతం 15 టెలికం సర్కిల్స్‌లోను, భారతి ఇన్ఫ్రాటెల్ మిగతా 7 సర్కిల్స్‌లోనూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2017–18లో ఇరు కంపెనీల ఆదాయాలు రూ. 25,360 కోట్ల పైగా ఉన్నాయి. వాటాల పంపకం ఇలా.. ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌కి భారతి ఇన్ఫ్రాటెల్లో 53.5 శాతం వాటాలున్నాయి. విలీన సంస్థలో దీనికి 33.8 నుంచి 37.2 శాతం వాటాలు దక్కే అవకాశం ఉంది. ఇండస్ టవర్‌లో వొడాఫోన్‌కి 42 శాతం వాటాలుండగా, విలీన సంస్థలో 26.7 శాతం నుంచి 29.4 శాతం దాకా వాటాలు దక్కనున్నాయి. ఇండస్ టవర్‌లో భారతి ఇన్ఫ్రాటెల్కు కూడా 42 శాతం వాటా ఉండగా, ఐడియాకి 11.15 శాతం, ప్రావిడెన్స్‌కి 4.85 శాతం వాటాలున్నాయి. విలీన సంస్థలో ఐడియా, ప్రావిడెన్స్లు తమ వాటాలను అట్టే పెట్టుకోవడం లేదా విక్రయించడాన్ని బట్టి ఎయిర్టెల్, వొడాఫోన్ల వాటాలు పెరగడం లేదా తగ్గడం ఆధారపడి ఉంటుంది. విలీన కంపెనీలో కొంత వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లతో చర్చించనున్నట్లు భారతి ఎయిర్టెల్ తెలిపింది. డీల్ ప్రకారం భారతి ఇన్ఫ్రాటెల్కి చెందిన ప్రతి 1,565 షేర్లకు ఇండస్ టవర్ షేరు ఒక్కటి చొప్పున లభిస్తుంది. విలీన సంస్థలో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్‌కి సమాన అధికారాలుంటాయి. డీల్ పూర్తయ్యాక 11 మంది డైరెక్టర్లలో ఇరు సంస్థల నుంచి చెరి ముగ్గురు నియమితులవుతారు. ఐడియా, ప్రావిడెన్స్లు వాటాలు విక్రయిస్తే.. ఒకవేళ ఐడియా తన వాటాలను పూర్తిగా, ప్రావిడెన్స్ తనకున్న 4.85 శాతం వాటాలో 3.35 శాతాన్ని విక్రయించాలనుకున్న పక్షంలో .. విలీన సంస్థలో భారతి ఎయిర్‌టెల్‌కు 37.2 శాతం, వొడాఫోన్ గ్రూప్‌నకు 29.4 శాతం, ప్రావిడెన్స్‌కి 1.1 శాతం, మిగతా వాటాలు పబ్లిక్ షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటాయి. అలా కాకుండా ఐడియా, ప్రావిడెన్స్ తమ పెట్టుబడులను కొనసాగించాలనుకుంటే భారతి ఎయిర్‌టెల్‌కి 33.8 శాతం, వొడాఫోన్‌కి 26.7 శాతం వాటాలు ఉంటాయి. ఐడియా గ్రూప్‌నకు 7.1 శాతం, ప్రావిడెన్స్‌కి 3.1 శాతం, మిగతా 29.3 శాతం వాటాలు పబ్లిక్ షేర్‌హోల్డర్స్ దగ్గర ఉంటాయి. -
టెల్కోల ‘డేటా’గిరీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీల మధ్య కొనసాగుతున్న పోటీతో ఇంటర్నెట్ వ్యయాలు భారీగా దిగొచ్చాయి. మరోవైపు దేశీయ కంపెనీలతోపాటు విదేశీ దిగ్గజాల నుంచి ఆకట్టుకునే స్మార్ట్ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంకేముంది మొబైల్లో డేటా వాడేవారి సంఖ్య భారత్‌లో అంచనాలను మించి పెరుగుతోంది. 2017 డిసెంబర్ నాటికే ఈ సంఖ్య 45.6 కోట్లు దాటింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 17.22 శాతం అధికం. 2018 జూన్ నాటికి మొబైల్ డేటా కస్టమర్ల సంఖ్య సుమారు 47.8 కోట్లను తాకనుంది. డేటా ప్యాక్‌లతో బండిల్ కింద ఉచిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ను టెల్కోలు అందించడం కస్టమర్ల సంఖ్య ఇంతలా పెరిగేందుకు దోహదం చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. డేటాపైనే ఎక్కువ ఖర్చు... దేశంలో 2013 నుంచి వాయిస్ ప్యాక్‌లపై కస్టమర్లు చేస్తున్న ఖర్చు తగ్గుతూ వచ్చింది. స్మార్ట్ఫోన్లు వెల్లువెత్తడంతో వినియోగదార్లు క్రమేపీ డేటా వైపు మొగ్గు చూపారు. సోషల్ మీడియా, యూట్యూబ్, వీడియో చాటింగ్‌లతో డేటా వినియోగం పెరిగింది. దేశంలో నెలకు 80 లక్షల పైచిలుకు స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం సగటు 2014 జూన్‌లో 70.10 ఎంబీ నమోదైంది. 2017 సెప్టెంబర్ నాటికి ఇది 1,600 ఎంబీకి చేరిందని ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. దీనినిబట్టి డేటా వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్ జియో అరంగేట్రం తర్వాత డేటా వాడకం కట్టలుతెంచుకుంది. 2013లో కస్టమర్ సగటున రూ.100 వ్యయం చేస్తే, ఇందులో వాయిస్‌పైన 55 శాతం ఖర్చు ఉండేది. ఇప్పుడు వాయిస్‌పైన చేస్తున్న వ్యయం 16 శాతానికి వచ్చి చేరిందని కాంటార్–ఐఎంఆర్‌బీతో కలిసి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన నివేదిక చెబుతోంది. బండిల్ ప్యాక్‌లవైపు.. డేటాతోపాటు ఉచిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు ఉన్న బండిల్ 4జీ ప్యాక్‌లవైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. చిన్న ప్యాక్‌లతో పోలిస్తే డేటా, వాయిస్ ప్రయోజనాలు అధికంగా ఉండడం ఇందుకు కారణం. డేటా, వాయిస్ కాల్స్‌కు వేర్వేరు ప్యాక్‌లు తీసుకుంటే కస్టమర్‌కు తడిసిమోపెడవుతుంది. ప్రస్తుతం టెలికం రంగంలో ట్రెండ్ బండిల్ ప్యాక్‌లవైపు వెళ్తోందని ఐడియా ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలు బండిల్ ప్యాక్ కింద లోకల్, ఎస్టీడీ ఉచిత అపరిమిత కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తున్నాయి. కాగా, తక్కువ విలువ ఉన్న టాప్ అప్స్ విక్రయాలు తగ్గుతూ వస్తున్నాయని స్థానిక ఆర్కే కమ్యూనికేషన్స్ ప్రతినిధి కేశవ్ తెలిపారు. బండిల్ ప్యాక్‌ల వాటా 60–70 శాతానికి చేరిందని చెప్పారు. టాప్ ప్యాక్‌లు ఇవే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో రిలయన్స్ జియో 84 రోజుల కాలపరిమితితో రూ.399 ప్యాక్‌ను అందుబాటులో తెచ్చింది. ప్రతిరోజు 1.5 జీబీ డేటా ఉచితం. ప్రతిరోజు 1.4 జీబీ డేటాతో 82 రోజుల వ్యాలిడిటీ ప్యాక్‌ను ఎయిర్టెల్, ఐడియా ప్రవేశపెట్టాయి. ఎయిర్టెల్ రూ.448, ఐడియా రూ.449 ధరకు ఈ ప్యాక్‌ను విక్రయిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు రూ.199లకు ప్రతిరోజు 1.4 జీబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ.485 ప్యాక్‌లో 90 రోజులపాటు ప్రతిరోజు 1.5 జీబీ 3జీ డేటాను ఇస్తోంది. -
టారిఫ్‌లను పోల్చి చూసుకోవడానికి పోర్టల్
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల టారిఫ్‌లను పోల్చి చూసుకోవడానికి టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఒక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఇది బీటా వెర్షన్. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు అందించే టారిఫ్‌ల వివరాలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ట్రాయ్ www.tariff.trai.gov.in పేరిట ఈ పోర్టల్‌ను తీసుకువచ్చింది. పలు రకాల టారిఫ్ ప్లాన్స్‌ను, ఇతర టారిఫ్ ఇన్స్ట్రూమెంట్స్ను డౌన్లోడ్ ఫార్మాట్ రూపంలో వెబ్సైట్లో ఉంచుతామని తెలిపింది. తొలి దశలో ఈ సేవలను ఢిల్లీ సర్కిల్లో అందుబాటులో ఉంచామని, యూజర్లు ఈ సర్వీసుపై ఫీడ్‌బ్యాక్ అందించాలని కోరింది. సేవలను తర్వాత దశలవారీగా ఇతర సర్కిళ్లకు విస్తరిస్తామని పేర్కొంది. -
టెలికం కంపెనీలకు భారీ ఊరట
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న టెలికం రంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీకి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన కంపెనీలు అందుకు సంబంధించిన ఫీజు చెల్లింపులకు మరింత వ్యవధి ఇవ్వడం ఇందులో ప్రధానమైంది. అలాగే, స్పెక్ట్రమ్ హోల్డింగ్ గరిష్ట పరిమితిని కూడా సరళీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్ మంత్రిత్వ శాఖల బృందం చేసిన సిఫారసుల మేరకు ఈ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టారిఫ్‌ల క్షీణతతో లాభాలు అడుగంటిపోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న టెలికం రంగంపై అధ్యయనానికి కేంద్రం పలు శాఖలతో కూడిన అధికారులతో కమిటీని గతేడాది ఏర్పాటు చేసింది. స్పెక్ట్రమ్ ఫీజుల చెల్లింపునకు 10 ఏళ్లుగా ఉన్న గడువును 15 ఏళ్లకు పెంచాలని ఈ కమిటీ సిఫారసు చేయగా దానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశీయ టెలికం రంగం ప్రస్తుతం రూ.4.6 లక్షల కోట్ల రుణభారాన్ని మోస్తోంది. చెల్లింపులకు అదనపు సమయం ఇవ్వడం వల్ల వాటికి నిధుల లభ్యత పెరుగుతుందని, స్పెక్ట్రమ్ పరిమితిని సరళీకరించడం వల్ల స్థిరత్వం ఏర్పడి భవిష్యత్తు స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ప్రీపెయిడే ముద్దు గురూ!!
ముంబయి/న్యూఢిల్లీ: కస్టమర్లను కాపాడుకోవాలి.. కొత్త వారిని ఆకర్షించాలి.. ఆదాయం పెంచుకుకోవాలి.. ఇలా ఎన్నో టార్గెట్లతో సతమతమౌతోన్న టెలికం కంపెనీలకు ఇంకొక చిక్కొచ్చిపడింది. కొత్త కొత్త మార్గాలతో రాబడి పెంచుకుని పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న టెల్కోలకు పోస్ట్‌పెయిడ్ రూపంలో సమస్య ఎదురైంది. మొబైల్ యూజర్లు పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు మారిపోతున్నారు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌తో పోలిస్తే ప్రీపెయిడ్ ప్లాన్స్ అధిక విలువ కలిగి ఉండటం ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. టెలికం కంపెనీలు పోస్ట్‌పెయిడ్ విభాగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ యూజర్లు అటువైపు నుంచి ప్రీపెయిడ్ వైపునకు వస్తున్నారు. టెల్కోలకు సాధారణంగా పోస్ట్‌పెయిడ్ విభాగం నుంచి రాబడి ఎక్కువగా ఉంటుంది. పోస్ట్‌పెయిడ్ యూజర్లు తగ్గారు.. కస్టమర్లు ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు ఆకర్షితులౌతుండటంతో పోస్ట్‌పెయిడ్ విభాగపు సబ్స్క్రైబర్ల సంఖ్య త్రైమాసికం పరంగా చూస్తే తగ్గింది. సెప్టెంబర్ క్వార్టర్లో 2 శాతంమేర క్షీణించింది. సాధారణంగానే పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కన్నా ప్రీపెయిడ్ యూజర్లు ఎక్కువగా ఉంటారు. సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం సబ్స్క్రైబర్ల (4జీ ఎల్టీఈ యూజర్లు సహా) సంఖ్యలో ప్రీపెయిడ్ విభాగపు వాటా 95.6 శాతానికి ఎగసింది. జూన్ త్రైమాసికంలో ఇది 95.5 శాతంగా ఉంది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో పోస్ట్‌పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య (ఎల్టీఈ యూజర్లు సహా) 5.17 కోట్లకు తగ్గింది. మెట్రోలు సహా ఏ, బీ కేటగిరి సర్కిళ్లలోనూ ప్రీపెయిడ్ యూజర్ల సంఖ్య పెరిగింది. ఆదాయం 10 శాతం డౌన్ సెప్టెంబర్ క్వార్టర్లో పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయం త్రైమాసికం పరంగా చూస్తే 10 శాతంమేర తగ్గింది. రూ.5,900 కోట్లుగా నమోదయ్యింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 23 శాతంమేర తగ్గింది. ‘జూన్ త్రైమాసికం నుంచి గమనిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయం 10 శాతంమేర క్షీణతతో రూ.5,900 కోట్లకు తగ్గిందని కొటక్ సెక్యూరిటీస్ తెలిపింది. ఇదే సమయంలో ప్రీపెయిడ్ విభాగపు ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.24,000 కోట్లకు పెరిగింది. దీనికి జియో ప్రధాన కారణమనే అభిప్రాయముంది. పరిశ్రమ ఆదాయంలో పోస్ట్‌పెయిడ్ విభాగపు వాటా 20 శాతానికి పడిపోయింది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా దాదాపు 30–40 శాతం గా ఉండేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. టెల్కోలపై ఒత్తిడి ఇంకా పెరగనుందా? టెల్కోలు ఆదాయం పెంచుకునేందుకు ఎక్కువ మందిని పోస్ట్‌పెయిడ్ విభాగంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. అయితే ప్రీపెయిడ్‌లో మంచి డీల్స్ లభిస్తున్నాయి. దీంతో కస్టమర్లు ప్రీపెయిడ్ వైపు ఆకర్షితులౌతున్నారు. ఈ ట్రెండ్ నేపథ్యంలో వచ్చే త్రైమాసికాల్లో టెల్కోలపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎక్కువ కావొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘రానున్న నెలల్లో పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను దక్కించుకోవడం టెల్కోలకు కష్టతరం కావొచ్చు. ప్రీపెయిడ్ విభాగంలో మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమలో ధరల పోటీ నడుస్తోంది’ అని ఫిచ్ డైరెక్టర్ నితిన్ సోని తెలిపారు. ప్రీపెయిడ్ విభాగంలోని ధరల తగ్గింపు అనేది పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ సేవల మధ్య ధరల విలువలో వ్యత్యాసానికి దారితీసిందని, దీంతో యూజర్లు ప్రీపెయిడ్కు వెళ్తున్నారని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. పోస్ట్‌పెయిడ్ ఆదాయంపై నెలకొని ఉన్న తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో టెలికం కంపెనీలు ఈ విభాగంలోని ప్లాన్స్ ధరలు సవరించడం సహా డిస్కౌంట్లను కూడా ప్రకటిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. 2017 తొలినాళ్లలో టారిఫ్‌లలో మార్పులు చేయడం పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిందని ఈవైకు చెందిన ప్రశాంత్ సింఘాల్ తెలిపారు. -
కొత్త కస్టమర్లు ఎయిర్టెల్ వైపు..
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ను దిగ్గజ టెలికం కంపెనీ అని ఎందుకు పిలుస్తారో మరొకసారి రుజువైంది. సెప్టెంబర్ నెలలో ఎయిర్‌టెల్‌కు మాత్రమే కొత్తగా యూజర్లు జతయ్యారు. సీవోఏఐ ప్రకారం.. ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య కొత్తగా 10 లక్షలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌సెల్, టెలినార్ సంస్థలు మొత్తంగా 29 లక్షలకుపైగా యూజర్లను కోల్పోయాయి. టెలినార్ కస్టమర్ల సంఖ్య ఏకంగా 9.37 లక్షలమేర తగ్గింది. అయితే టెలినార్ – ఎయిర్టెల్ విలీనం ఇప్పటికే దాదాపు ఖరారవటం ఈ సందర్భంగా గమనార్హం. ఐడియా 9.04 లక్షలమేర, వొడాఫోన్ 7 లక్షలమేర, ఎయిర్‌సెల్ 3.94 లక్షలమేర సబ్స్క్రైబర్లను కోల్పోయాయి. సెప్టెంబర్ చివరి నాటికి చూస్తే.. భారతీ ఎయిర్టెల్ 29.8 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని మొత్తం యూజర్ల సంఖ్య 28.2 కోట్లుగా ఉంది. దీని తర్వాతి స్థానంలో వొడాఫోన్ (20.74 కోట్లు), ఐడియా (19 కోట్లు) ఉన్నాయి. కాగా రిలయన్స్ జియో, టాటా టెలీసర్వీసెస్, ఆర్‌కామ్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సబ్స్క్రైబర్ల సంఖ్యను సీవోఏఐ ప్రకటించలేదు. -
బీఎస్ఎన్ఎల్కు భూమే బంగారం
♦ ఖరీదైన భూములు ♦ ఒక వంతుభూమి విలువే రూ.65,000 కోట్లు ♦ పుస్తక విలువ కంటే ఎన్నో రెట్లు అధికం న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్కు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములు, భవనాలు ఆ సంస్థకు వరం కానున్నాయి. సంస్థ ఆధ్వర్యంలోని భూముల్లో మూడింట ఒక వంతు తేలిగ్గా రూ. 65,000 కోట్ల విలువ చేస్తాయని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. కానీ, 15,000 చోట్ల భూములు, భవనాలకు సంబంధించి పుస్తక విలువ ఎన్నో దశాబ్దాల క్రితం మదింపు వేసిన రూ.975 కోట్లుగానే ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన తెలిపారు. వీటి వాస్తవ విలువ తెలిసేందుకు వీలుగా తిరిగి నిపుణులతో మదింపు వేయిస్తున్నట్టు చెప్పారు. 2015–16లో బీఎస్ఎన్ఎల్ రూ.3,880 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నట్టు అంచనా. దీంతో సంస్థ ఆస్తుల విలువను లెక్కించే వసుంధర ప్రాజెక్టును ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. దీన్ని కేపీఎంజీ సంస్థ చూస్తోంది. ముఖ్యంగా సంస్థ నిర్వహణలోని భూములు, భవనాల్లో మూడింట ఒక వంతు అందులోనూ ప్రముఖ పట్టణాల్లో ఉన్న వాటి విలువను తేల్చే పనిలో ఉన్నారు. అది ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఈ పని 98% వరకు పూర్తయిందని, ఒక వంతు ఆస్తుల అసలు విలువ రూ.65,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు. ఇలా లెక్కిస్తున్న వాటిలో ఢిల్లీ, ముంబై, పుణే, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, చెన్నై, కోల్‌కతా తదితర నగరాల్లోని ఆస్తులు కూడా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ కార్యాలయం ఒక్కదాని విలువే రూ. 2,500 కోట్లు చేస్తుందని శ్రీవాస్తవ వెల్లడించారు. వ్యాపార పునరుద్ధరణ ప్రణాళికలపైనా బీఎస్ఎన్ఎల్ దృష్టి సారించడం గమనార్హం. లాభదాయకమైనవి: బీఎస్ఎన్ఎల్ మొత్తం ఆస్తుల్లో కేవలం ఒక వంతు వాటి విలువనే ఎందుకు లెక్కిస్తున్నారన్న ప్రశ్నకు, అవి అత్యంత లాభదాయకమైనవిగా శ్రీవాస్తవ పేర్కొన్నారు. మిగిలిన వాటి విలువ మరీ అంత ఎక్కువేమీ ఉండదన్నారు. వీటిని విక్రయించి నిధులు సమీకరించాలనుకుంటే, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవాలన్నా తాజా మదింపు ఉపయోగపడుతుందన్నారు. భూముల అసలు విలువ బీఎస్ఎన్ఎల్ ఖాతా పుస్తకాల్లో ప్రతిఫలిస్తుంద చెప్పారు. -
ఉచిత ఆఫర్లను నిరోధించండి
♦ జియో ఆఫర్ల వల్లే టెలికం రంగానికి కష్టాలు ♦ టెర్మినేట్ కాల్ చార్జీలు పెంచాలి ♦ ఐఎంజీకి మూడు టెలికం కంపెనీల నివేదన న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా మరోసారి టెలికం కంపెనీలు గళం విప్పాయి. ఎయిర్‌టెల్‌తో పాటు, వొడాఫోన్, ఐడియా సెల్యులర్ కంపెనీలు అంతర మంత్రిత్వ శాఖ(ఐఎంజీ–ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్)తో విడివిడిగా సమావేశమయ్యాయి. ఈ సమావేశాల్లో రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల వల్లే టెలికం రంగం తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిందని ఈ కంపెనీలు పేర్కొన్నాయి. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలను, జీఎస్టీని తగ్గించాలని ఈ మూడు టెలికం కంపెనీలు ముక్తకంఠంతో కోరాయి. . కాల్ కనెక్ట్ చార్జీలు(ఐయూసీ–ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీ) ప్రస్తుతం నిమిషానికి 14 పైసలుగా ఉందని, ఇది వ్యయం కంటే తక్కువని, దీనిని సవరించాల్సి ఉందని, దీంతో పాటు మరికొన్ని సూచనలను ఈ కంపెనీలు చేశాయి. వివరాలు.... కాల్ టెర్మినేట్ చార్జీలు పెంచాలి.. రిలయన్స్ జియో అనుచిత రీతిలో టెలికం టారిఫ్‌లను నిర్ణయిస్తోందని భారతీ ఎయిర్టెల్ విమర్శించింది. టెలికం కంపెనీల నెట్‌వర్క్‌ల్లో టెర్మినేట్ అయ్యే కాల్స్ చార్జీలను పెంచాలని కూడా డిమాండ్ చేసింది. టెర్మినెట్ అయ్యే కాల్స్‌కు ఎంత మొత్తం వ్యయం అవుతుందో అంత మొత్తాన్ని ఇతర టెలికం కంపెనీలు చెల్లించేలా చూడాలని సూచించింది. ఫ్లోర్‌ప్రైస్ నిర్ణయించాలి... ఐయూసీను సవరిస్తే, అనుచిత రీతిలో టెలికం టారిఫ్‌లను ఆఫర్ చేయడం నిరోధించడం కుదురుతుందని ఐడియా సెల్యులర్ పేర్కొంది. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా టెలికం పరిశ్రమ బాగా దెబ్బతిన్నదని, వాయిస్, డేటా టారిఫ్‌లకు ఫ్లోర్‌ప్రైస్(కనీస ధర)లను నిర్ణయించడం వల్ల అనుచిత రీతిలో ఆఫర్లను అందించడాన్ని నిరోధించవచ్చని సూచించింది. టెలికం రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన– ఐఎంజీ టెలికం కంపెనీలతో ఈ వారమంతా చర్చలు జరుపుతూనే ఉంది. జియోపై ఫిర్యాదును కొట్టేసిన సీసీఐ మరోవైపు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తాజాగా మరొకసారి జియోపై వచ్చిన ఫిర్యాదును తోసిపుచ్చింది. ఈ ఫిర్యాదు ప్రధానంగా ఉచిత సేవలకు సంబంధించింది. జియో ఆఫర్లలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేదని పేర్కొంది. కాగా సీసీఐ.. జియోపై వచ్చిన ఫిర్యాదులను తిరస్కరించడం ఇది రెండోసారి. ఇది ఇదివరకు ఎయిర్టెల్ చేసిన ఫిర్యాదును జూన్ 9న తోసిపుచ్చింది. -
ఏడాది వ్యాలిడిటీతో డేటా ప్యాక్స్ తీసుకురండి
టెల్కోలకు ట్రాయ్ ఆదేశం న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఏడాది కాల పరిమితితో (వ్యాలిడిటీ) కనీసం ఒక మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్‌నైనా అందుబాటులోకి తీసుకురావాలని టెలికం కంపెనీలను కోరింది. కాగా ట్రాయ్ గతేడాది ఆగస్ట్‌లో మొబైల్ డేటా ప్యాక్స్ వ్యాలిడిటీని 90 రోజుల నుంచి 365 రోజుల దాకా పొడిగించుకోవచ్చని అనుమతినిచ్చింది. దీంతో దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుందని, వన్‌టైమ్ యూజర్లను ఆకర్షించవచ్చని ట్రాయ్ భావించింది. పలు టెలికం కంపెనీలు ఏడాది వ్యాలిడిటీతో సరైన డేటా ప్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. -
టెల్కోల ఆదాయం తగ్గొచ్చు జియో ఎఫెక్ట్
ముంబై: రిలయన్స్ జియో ఉచిత సేవల వల్ల 2016–17 ఆర్థిక సంవత్సరపు జనవరి–మార్చి త్రైమాసికం (క్యూ4)లోనూ టెలికం కంపెనీల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతోందని అంచనా. త్రైమాసికం పరంగా చూస్తే టెల్కోల మొబైల్ రెవెన్యూ 6.5–7.5 శాతంమేర తగ్గొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. సెల్యులర్ సర్వీసులకు త్వరలో కొత్త మార్గదర్శకాలు: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ రానున్న కొన్ని వారాల్లో సెల్యులర్ సర్వీసులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. మొబైల్ సర్వీసులు సహా వీఓఎల్టీఈ వంటి కొత్త టెక్నాలజీకి నాణ్యత ప్రమాణాలను తీసుకువస్తామని ట్రాయ్ చైర్మన్ శర్మ పేర్కొన్నారు. కాల్ డ్రాప్ సమస్యలు కొనసాగుతున్నాయ్: టెలికం ఆపరేటర్లు సహా కేంద్ర ప్రభుత్వం కాల్ డ్రాప్ సమస్య తగ్గిపోయిందని చెబుతుంటే.. మరొకవైపు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్) సర్వేలో అందుకు భిన్నమైన అంశాలు వెల్లడయ్యాయి. ఒక సర్వే ప్రకారం చూస్తే చాలా మంది మొబైల్ సబ్స్క్రైబర్లు ఇంకా కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొంటున్నారు. -
బీఎస్ఎన్ ఎల్ బంపర్ ఆఫర్స్
సాక్షి, సిటీ బ్యూరో: బీఎస్ఎన్ పర్ ఆఫర్స్ ప్రకటించింది. ప్రైవేటు టెలికాం కంపెనీలకు ధీటుగా మొబైల్ సేవలను విస్తరించేందుకు చర్యలకు ఉపక్రమించినట్లు పీజీఎం రాంచంద్ర తెలిపారు. ఆల్‌ఫ్రీ ప్లాన్ ... ఆల్ ఫ్రీ ప్లాన్ పేరుతో రూ.144 వోచర్లకు 30 రోజుల కాలపరిమితితో అన్నిరకాల నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలపాటు ఉచితంగా మాట్లాడుకునే సదుపాయం కలదు. 90 రోజుల కాలపరిమితితో రూ.439 వోచర్‌కు అన్ని రకాల నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. ఆఫర్ మార్చి 31 వరకు వర్తిస్తుంది. స్పెషల్ టారిఫ్ వోచర్... 28 రోజుల కాలపరిమితితో రూ.339 వోచర్‌పై అన్ని రకాల నెట్‌వర్క్‌లకు అపరిమిత ఉచిత కాల్స్‌తోపాటు 1జీబీ డాటాను అందిస్తోంది. రూ.139 వోచర్‌పై బీఎస్ఎన్ ఎల్ నెట్‌వర్క్‌కు పరిమితి లేకుండా ఉచిత కాల్స్‌తో పాటు 300 ఎంబీ డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్ మార్చి 17 వరకు ఉంటుంది. ఫుల్ అదనపు టాక్‌టైమ్... రూ. 220, రూ. 2000, రూ.2200, రూ. 2500, రూ.3000 టాప్‌ఆప్‌పై ఫుల్ టాక్ టైమ్, రూ. 550 టాప్‌ఆప్‌పై 575, రూ. 1100లకు 1200లు, రూ.3300లకు 3500, రూ.5500 లకు 6000ల ఎక్స్ట్రా టాక్ టైమ్ లభించనుంది. కాంబో ఎస్టీవీ... ఈ ఆఫర్ కింద రెండు రోజుల కాలపరిమితితో రూ. 13కు 15 రూపాయల టాక్‌టైమ్, 10ఎంబీ డాటా, 10 రోజుల కాలపరిమితి గల రూ.77 వోచర్‌కు రూ. 80 టాక్‌టైమ్, 30 ఎంబీల డాటా, 15 రోజుల కాలపరిమితితో రూ.177 వోచర్‌కు రూ. 180 టాక్ టైమ్తోపాటు 50 ఎంబీ డాటాను అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది. రూ. 30 రోజుల కాలపరిమితితో 1099 విలువగల ఎస్‌టీవీకి అన్ లిమిటేడ్ డాటా స్పీడ్ ప్రకటించింది. డబుల్ డాటా ఆఫర్స్.. ఎస్టీవీ కింద డబుల్ డాటా ఆఫర్స్ ప్రకటించింది. ఏడాది కాలపరిమితిలో రూ. 4498 వోచర్‌కు 80 జీబీలు. రూ. 3998లకు 60 జీబీలు, 2798లకు 36 జీబీలు, 1498లకు 18జీబీల డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్ మార్చి 31 వరకు ఉంటాయి. కొత్త కనెక్షన్లకు 300 ఎంబీ డాటా ఉచితంగా అందిస్తోంది. 5 రోజుల కాలపరిమితి గల రూ.78లకు 2జీబీ, 14 రోజుల కాలపరిమితితో రూ.98లకు 2జీబీ, 15 రోజుల కాలపరిమితితో రూ.155లకు 2జీబీ, 10 రోజుల కాలపరిమితితో రూ.156లకు 3జీబీ, 29 కాలపరిమితితో రూ. 198లకు 3జీబీ, 28 కాలపరిమితితో రూ.198లకు 3జీబీ, 28 కాలపరిమితితో రూ. 291లకు 8జీబీ, 60 రోజుల కాలపరిమితి గల రూ. 444లకు 8జీబీలు, 60 రోజుల కాలపరిమితితో రూ.451లకు 6జీబీ, 80 టాక్‌టైమ్, 30 రోజుల కాలపరిమితితో రూ.549లకు 15జీబీ, 60 రోజుల కాలపరిమితితో రూ.561లకు 11జీబీ, 60 రోజుల కాలపరిమితితో రూ.821లకు 15జీబీ, 30 రోజుల కాలపరిమితితో రూ. 3099లకు 20జీబీ డాటా, 300 ఎస్ఎంఎస్లు, ఉచిత కాల్స్ వర్తిస్తాయి. -
నిమిషానికి 20 పైసలు: టెలినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ రూ.22 విలువ గల స్పెషల్ టారిఫ్ వోచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దేశంలో ఏ ప్రాంతానికి చేసే కాల్ అయినా నిముషానికి 20 పైసలు మాత్రమే చార్జీ చేస్తారు. వోచర్ కాలపరిమితి 28 రోజులు. సర్కిల్లో ఇదే చవకైన కాల్ రేట్ అని కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలిపారు. -
20 లక్షలు పెరిగిన ప్రముఖ టెల్కోల సబ్స్క్రైబర్లు
న్యూఢిల్లీ: ప్రధాన జీఎస్ఎం టెలికం కంపెనీలైన ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, టెలినార్ వంటి కంపెనీల యూజర్ల సంఖ్య జూలైలో 20 లక్షలకు పైగా పెరిగింది. టెలికం సమాఖ్య సీఓఏఐ నివేదిక ప్రకారం.. మొత్తం జీఎస్ఎం సబ్స్క్రైబర్ల సంఖ్య 77.90 కోట్లుగా ఉంది. -
80 లక్షల మంది కస్టమర్లకు బీమా: టెలినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘సురక్ష’ బీమా పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఆరు సర్కిళ్లలో 1.8 కోట్ల మంది కస్టమర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, సుమారు 80 లక్షల మంది బీమా రక్షణ పొందారని కంపెనీ వెల్లడించింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 20 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 50 శాతం మంది బీమా కవరేజ్ పొందారని టెలినార్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. టెలినార్ సురక్ష కింద కస్టమర్లకు రూ.50 వేల వరకు బీమా కవరేజ్ ఇస్తున్నట్టు చెప్పారు. బీమా కోసం వినియోగదార్లు ఎటువంటి ప్రీమియం చెల్లించక్కర లేదు. ఒక నెలలో చేసిన రిచార్జ్ మొత్తానికి రూ.50 వేలకు మించకుండా తదుపరి నెలకు 100 రెట్లు కవరేజ్ ఉంటుంది. ఉదాహరణకు జనవరిలో మొత్తం రూ.200 రిచార్జ్ చేసిన వినియోగదారుడికి ఫిబ్రవరిలో రూ.20 వేల బీమా కవరేజ్ ఇస్తారు. ఒక నెలలో కనీసం రూ.40 రిచార్జ్ చేయాలి. క్లెయిమ్‌ను వారం లోపే పరిష్కరిస్తారు. కస్టమర్ మృతి చెందితే మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ గుర్తింపు కార్డు, సిమ్ కార్డుతో కంపెనీని సంప్రదించాలి. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక కస్టమర్ చనిపోతే ఆయన కుటుంబానికి రూ.50 వేల చెక్కును కంపెనీ అందజేసింది. దేశవ్యాప్తంగా కంపెనీ చందాదారుల సంఖ్య 5 కోట్లకుపైమాటే. -
సమస్యలున్నాయి.. డేటా ఇవ్వలేం
విజయవాడ: ఓటుకు నోటు కేసుకు సంబంధించి మత్తయ్య ఫోన్ కాల్ డేటా వివరాలను ఏపీ సీఐడీ టెలికాం కంపెనీలను కోరింది. అయితే తమకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున వివరాలు ఇవ్వలేమంటూ టెలికం కంపెనీలు తేల్చేశాయి. అందుకు ఒప్పుకున్న ఏపీ సీఐడీ ఇవ్వకుంటే సరేగానీ.. సమాచారం మాత్రం భద్రపరచాలని కంపెనీలను కోరింది. -
లెసైన్సు పొడిగింపుపై టెల్కోలకు సుప్రీంలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: స్పెక్ట్రం లెసైన్సుల గడువును పొడిగించాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన టెలికం కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. వాటి వాదనల్లో పసలేదంటూ పిటీషన్లను జస్టిస్ జె. చలమేశ్వర్ సారథ్యం లోని బెంచ్ తోసిపుచ్చింది. వొడాఫోన్, భారతీ ఎయిర్టెల్ తదితర సంస్థలు ఈ పిటీషన్లు వేశాయి. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం లెసైన్సుల గడువును మరో పదేళ్ల పాటు పొడిగించకపోవడంతో పాటు తమ వద్దనున్న స్పెక్ట్రంను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుని వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 20 ఏళ్ల పాటు వర్తించేలా గతంలో ఇచ్చిన లెసైన్సు ఒప్పంద నిబంధనల ప్రకారం ప్రభుత్వం మరో 10 ఏళ్ల పాటు పొడిగించాల్సి ఉంటుందని టెల్కోలు వాదించాయి. అయితే, నిబంధనల్లో ‘పొడిగించవచ్చు’ అని మాత్రమే ఉంది కనుక, దానిపై నిర్ణయం తీసుకోవడం అన్నది పరిస్థితులను బట్టి తన విచక్షణపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం వాదించింది. -
యునినార్ క్రికెట్ అన్లిమిటెడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ యునినార్ క్రికెట్ అన్లిమిటెడ్ పేరుతో ప్రత్యేక ప్యాక్‌ను విడుదల చేసింది. ఈ ప్యాక్ ద్వారా ప్రస్తుత ప్రపంచ కప్ క్రికెట్ విశేషాలు కస్టమర్లు తెలుసుకోవచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్కోర్ సమాచారం, ప్రత్యక్ష ప్రసారాన్ని వినొచ్చు. అంతేగాక కాంటెస్ట్‌లో పాల్గొని ఎల్ఈడీ టీవీలు, బంగారు నాణేలతోపాటు ఇతర బహుమతులు గెలుపొందవచ్చని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ కన్నన్ తెలిపారు. ఇందుకు కస్టమర్లు నెల చందా రూ.30 చెల్లించాలి. -
రక్షణ శాఖకు స్పెక్ట్రం బ్యాండ్ కేటాయింపు
న్యూఢిల్లీ: రక్షణ శాఖ, ఇతర శాఖల మధ్య దాదాపు ఎనిమిదేళ్లుగా నలుగుతున్న స్పెక్ట్రం షేరింగ్ వివాదానికి కేంద్రం తెర దించింది. రక్షణ శాఖ అవసరాల కోసం ప్రత్యేకంగా టెలికం స్పెక్ట్రం బ్యాండ్‌ను కేటాయించింది. 3 మెగాహెట్జ్ నుంచి 40 గిగాహెట్జ్ మధ్య 49 బ్యాండ్స్‌లో మొత్తం తొమ్మిదింటిని కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. మిగతా 31 బ్యాండ్లను టెలికం సంస్థలు, పౌర విమానయాన శాఖ, బ్రాడ్కాస్టర్లు తదితర యూజర్లకు కేటాయించింది. మరో తొమ్మిదింటి విషయంలో వివిధ శాఖల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. అటు డిఫెన్స్, టెలికం శాఖలు వివిధ బ్యాండ్ల స్పెక్ట్రంను పరస్పరం మార్చుకునే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. దీని ప్రకారం టెలికం శాఖ తన వద్ద 1900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఉన్న 15 మెగాహెట్జ్ స్పెక్ట్రంను.. డిఫెన్స్ శాఖ దగ్గరున్న 2100 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంతో మార్చుకుంటుంది. 2100 మెగాహెట్జ్ బ్యాండ్ .. 3జీ టెలికం సేవలకు ఉపయోగపడుతుంది. -
టాటా సన్స్‌పై డొకొమో దావా
న్యూఢిల్లీ/టోక్యో: జపాన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎన్టీటీ డొకొమో టాటా సన్స్‌ను ఆర్బిట్రేషన్ కోర్టుకు లాగింది. టాటా టెలిసర్వీసెస్‌తో తాము ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో వాటా కొనుగోలు విషయంలో టాటా సన్స్ విఫలమైందనేది ఎన్టీటీ డొకొమో వాదన. ఈ నెల 3న లండన్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో టాటా సన్స్‌కు వ్యతిరేకంగా డొకొమో ఈ దావా దాఖలు చేసింది. వివరాలివీ... టాటా డొకొమోతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో తమకున్న 26.5 శాతం (రూ.7,250 కోట్ల విలువ) వాటాను విక్రయించడం ద్వారా ఆ జేవీ నుంచి వైదొలగనున్నామని ఎన్టీటీ డొకొమో గత ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది. ఆ జేవీలో భాగస్వామిగా ఉన్న టాటా సన్స్ ఆ వాటాను కొనుగోలు చేస్తుందని పేర్కొంది. అయితే ఇరువైపులా తలెత్తిన కొన్ని విభేదాల కారణంగా ఈ డీల్ సాకారం కాలేదు. ఈ డీల్ విషయమై టాటా సన్స్‌తో పదే పదే సంప్రదింపులకు ప్రయత్నాలు చేశామని, అయినప్పటికీ టాటా సన్స్ విఫలమైందని డొకొమో తన పిటిషన్లో పేర్కొంది. అయితే ఈ డీల్ సాకారం కోసం తమ వంతు ప్రయత్నాలు చేశామని టాటా సన్స్ ప్రతినిధి చెప్పారు. -
బ్యాటరీతో నడిచే ఐడియా వైఫై డాంగిల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్ స్మార్ట్‌వైఫై హబ్ పేరుతో బ్యాటరీతో పనిచేసే 3జీ వైఫై డాంగిల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.2,999 ఉంది. 1500 ఎంఏహెచ్ బ్యాటరీని దీనికి పొందుపరిచారు. డాంగిల్‌ను పవర్ సాకెట్‌కు, ల్యాప్టాప్కుగానీ అనుసంధానించే అవసరమే లేదు. ఎక్కడైనా ఉంచి ఇంటర్నెట్లో విహరించొచ్చు. ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్.. ఇలా 10 ఉపకరణాల్లో ఒకేసారి నెట్‌ను ఆస్వాదించొచ్చు. డౌన్లోడ్ వేగం 21.6 ఎంబీపీఎస్, అప్లోడ్ వేగం 11 ఎంబీపీఎస్ వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. డాంగిల్ 900, 2100 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌ను సపోర్ట్ చేస్తుం ది. ఇల్లు, చిన్న కార్యాలయాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని ఐడియా తెలిపింది. బండిల్ ఆఫర్లో ఒక నెల 6 జీబీ 3జీ డేటా ఉచితం. అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఆసియా: సర్వే బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఈ ఏడాది ఆసియా అవతరిస్తుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) సర్వేలో వెల్లడైంది. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఉత్తర అమెరికాను తోసిరాజని ఆసియా ప్రాంతం మొదటి స్థానంలోకి దూసుకువస్తుందని ఈఐయూ సర్వే పేర్కొంది. ఎకనామిస్ట్ మ్యాగజైన్ గ్రూప్ అడ్వైజరీ కంపెనీగా వ్యవహరిస్తున్న ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, మకావూ, భారత్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల్లో మొత్తం 5,500 మంది మహిళలపై ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. వివరాలు... - ఈ కామర్స్‌లో రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది ఆసియాలో 5 శాతం వృద్ధితో 7.6 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతాయి. ఇది ఉత్తర అమెరికాలో 2.5 శాతం, యూరప్‌లో 0.8 శాతం చొప్పున వృద్ధి ఉండొచ్చు. - ఆసియా మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక శక్తి పెరగడం, ఆన్లైన్ షాపింగ్‌పై మక్కువ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల అసియాలో ఈ కామర్స్ హవా పెరుగుతోంది. - షాప్‌కు వెళ్లడం కంటే ఆన్లైన్లోనే షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని సగానికి పైగా మహిళలు చెప్పారు. - వస్తువులు, సేవలకోసం రోజులో ఒక్కసారైనా నెట్‌ను వాడతామని 63% మంది చెప్పారు. -
ఒక్క సెకన్లో 6,000 సినిమాలు!
లండన్: ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఏదైనా సినిమా డౌన్లోడ్ పెట్టారు.. లేదా ఏవైనా పాటల ఆల్బమ్ కాపీ చేసుకుంటున్నారు.. ఎంత సేపు పడుతుంది? మామూలు బ్రాడ్‌బ్యాండ్‌తో అయితే గంట, గంటన్నర... మంచి వేగం ఉన్న కనెక్షన్‌పై అయితే.. పది నిమిషాలో, పావుగంటో పడుతుంది. అదే కేవలం ఒకే సెకన్లో 6,000 సినిమాలు డౌన్లోడ్ చేసుకోగలిగితే..!? సూపర్ కదూ! డెన్మార్క్ టెక్నలాజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సెకనుకు 43 టెరాబిట్ల (5504 జీబీల) వేగంతో సమాచారాన్ని ప్రసారం చేయగలిగారు. జపాన్‌కు చెందిన టెలికం సంస్థ ఎన్ఎన్టీ సహకారంతో రూపొందించిన ఏడు గాజు తీగలున్న కొత్త తరహా ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను దీనికోసం వినియోగించారు. సాధారణ కేబుల్‌లో ఒకే తీగను వాడతారు. అయితే ఈ కేబుల్‌లో ఏడు తీగలున్నా.. పరిమాణం మాత్రం సాధారణ కేబుల్ స్థాయిలోనే ఉండడం గమనార్హం. కాగా, ఇంతకుముందు జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు సెకనుకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా 32 టెరాబిట్ల వేగంతో సమాచారాన్ని ప్రసారం చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో వొడాఫోన్ 3జీ రోమింగ్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 3జీ రోమింగ్ సేవలను అందిస్తున్నట్టు ప్రకటించింది. 3జీ రోమింగ్ ఒప్పందాలపై టెలికం శాఖ(డాట్) విధించిన నిషేధం చెల్లదని టెలికం వివాదాల పరిష్కారాల ప్రత్యేక న్యాయస్థానం(టీడీశాట్) ఏప్రిల్ 29న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 3జీ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో వొడాఫోన్ పునరుద్ధరించింది. ఇక నుంచి కంపెనీ కొత్త కస్టమర్లను చేర్చుకుంటుంది. గతేడాది ఏప్రిల్‌లో డాట్ ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 3జీ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను వొడాఫోన్ నిలిపివేసింది. పాత కస్టమర్లకు మటుకు సేవలను కొనసాగించేందుకు డాట్ వెసులుబాటు కల్పించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని వీలే ్లదని తేల్చి చెప్పింది. వొడాఫోన్‌కు ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో సుమారు 2.5 లక్షల మంది 3జీ కస్టమర్లు ఉన్నారు. మంచి వృద్ధి ఆశిస్తున్నాం.. 3జీ విభాగంలో గణనీయ వృద్ధి ఆశిస్తున్నట్టు వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ మన్దీప్ సింగ్ భాటియా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పోస్ట్ పెయిడ్ విభాగంలో నెలవారీ అద్దె రూ.150 నుంచి ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. 500 ఎంబీ నుంచి 8 జీబీ వరకు డేటా ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రిపెయిడ్ విభాగంలో రూ.43 నుంచి రూ.650 వరకు ప్యాక్‌లు ఉన్నాయని, 150 ఎంబీ నుంచి 5 జీబీ వరకు డాటా ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. 2జీ కస్టమర్లు అత్యధికులు 3జీకి అప్‌గ్రేడ్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐడియా సహకారంతో వొడాఫోన్ సేవలందిస్తోంది. -
టవర్ల పేరుతో ఫ్లవర్లు
నిరుద్యోగుల అమాయకత్వాన్ని మోసగాడు దర్జాగా సొమ్ము చేసుకున్నాడు. గ్రామాల్లో ఇళ్లపై సెల్‌టవర్లు, సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని, ఇంజనీర్లు కావాలంటూ ప్రకటన గుప్పించి వారి నుంచి డబ్బులు వసూలు నిండా ముంచాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన మహ్మద్ సాద్ ఏడాదికాలంగా బంజారాహిల్స్ రోడ్డునెం.2లోని కమలాపురికాలనీలో సిల్వర్టన్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. తమ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో సెల్‌టవర్లు, సోలార్ ప్యానళ్లను ఏర్పాటుచేస్తుందని..వీటి కోసం సర్వే చేయడానికి ఇంజనీర్లు కావాలంటూ ఆయా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. దీన్ని నమ్మిన ఆయా జిల్లాలకు చెందిన బీటెక్,ఎంటెక్ తదితర విద్యార్హతలు కలిగిన 300మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోరి వద్ద రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశాడు. మూడునెలలు వీరందర్ని గ్రామాల్లో సర్వే పేరుతో పనిచేయించుకొని జీతం చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన పలువురు నిరుద్యోగులు వారం క్రితం కార్యాలయానికి చేరుకొని యజమానిని నిలదీశారు. విషయం తెలిసిపోయిందని గ్రహించిన మహ్మద్సాద్ పరారయ్యాడు. మోసపోయామని నిర్దారించుకున్న నిరుద్యోగులు అనేకమంది మంగళవారం కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చే యగా..సాద్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. జిల్లాల్లోనూ దగా : మీ ఇంటిపై, ఖాళీ స్థలంలో సెల్‌టవర్లు నిర్మించి వేలాది రూపాయల అద్దె ఇస్తామంటూ వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్టణం తదితర జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు సంస్థ తరఫున ఉద్యోగులు వెళ్లారు. తమ సంస్థ దేశంలోని పలు టెలికాం సంస్థలతో సెల్టవర్ల నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకుందని..ఇందులో భాగంగానే గ్రామాల్లో, పట్టణాల్లో సెల్టవర్ల నిర్మాణం కోసం సర్వే నిర్వహిస్తున్నామని నమ్మబలికారు. ఇవి ఏర్పాటు చేస్తే ఆదాయం బాగా వస్తుందని నమ్మించారు. ఇలా అనేక గ్రామాల్లో వందలాదిమంది నుంచి రూ.9వేల చొప్పున డీడీలు కట్టించుకున్నారు. డీడీలు పంపి నెలలు గడిచినా సెల్టవర్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు బాధితులు సంస్థ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఇదంతా పచ్చిమోసమని తేలింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. జిల్లాల్లో ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు రావడంతో నమ్మి మోసపోయామని వరంగల్‌వాసి రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. - బంజారాహిల్స్,న్యూస్‌లైన్ -
స్పెక్ట్రమ్ ధర పెంచితే టారిఫ్‌లూ పెరుగుతాయ్
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ ధర భారీగా ఉంటే తాము కాల్స్, ఎస్ఎంఎస్, ఇతర చార్జీలు 50 శాతం దాకా పెంచాల్సి వస్తుందని టెలికం కంపెనీలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే వేలంలో స్పెక్ట్రమ్ బేస్ ధరను తగ్గించాలని కోరాయి. స్పెక్ట్రమ్ ధర మరీ అధికంగా ఉంటే.. టారిఫ్‌లు భారీగా పెరుగుతాయని, స్పెక్ట్రమ్ కూడా అమ్ముడు కాకపోవడం వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వచ్చే అవకాశాలు ఉండబోవని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి తెలిపాయి. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, లూప్ మొబైల్ సంస్థల లెసైన్సు గడువు 2014తో ముగిసిపోనుండటంతో.. రీఫార్మింగ్ కింద వాటి స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేయనుంది. ఇందుకోసం బేస్ ధరను 2008 నాటి రేటుతో పోలిస్తే 11 రెట్లు అధికంగా నిర్ణయించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశాయి. మొబైల్ కాల్ చార్జీలు గత రెండేళ్లలో 100 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం నిమిషానికి 90 పైసల నుంచి రూ. 1.20 దాకా చార్జీలు ఉన్నాయి. ట్రాయ్ సిఫార్సులు ఆమోదించిన పక్షంలో టారిఫ్‌లు మరో 26 పైసల దాకా పెరగొచ్చని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు ఎయిర్టెల్ తెలిపింది. మరోవైపు, రీఫార్మింగ్ వల్ల నెట్‌వర్క్‌లో మార్పులు చేర్పుల కోసం పరిశ్రమ రూ. 55,000 కోట్లు, నిర్వహణ వ్యయాల కింద ఏటా మరో రూ. 11,800 కోట్ల మేర వెచ్చించాల్సి వస్తుందని లూప్ మొబైల్ పేర్కొంది. గతంలో ఉన్న బేస్ ధరనే కొనసాగిస్తే మంచిదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అభిప్రాయపడింది. రూ. 30,000 కోట్ల బకాయిలు.. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సహా టెలికం కంపెనీలు మొత్తం రూ. 30,158 కోట్ల మేర స్పెక్ట్రం చార్జీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో వన్ టైమ్ ఫీజు, యూసేజ్ చార్జీలు కూడా ఉన్నాయి. దీంతో ఆపరేటర్లకు డిమాండ్ నోటీసులు పంపినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయమంత్రి మిలింద్ దేవరా తెలిపారు. బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా రూ. 6,980 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ. 6,075 కోట్లు, వొడాఫోన్ రూ. 4,477 కోట్లు, ఐడియా రూ. 2,206 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 2,004 కోట్లు, టాటా టెలీసర్వీసెస్‌రూ. 1,400 కోట్లు చెల్లించాల్సి ఉంది.