న్యూఢిల్లీ: నూతన టెలికం పాలసీ రెండు వారాల్లో కేబినెట్ ఆమోదానికి రానున్నట్లు ఆ శాఖ కార్యదర్శి అరుణ సౌందరాజన్ తెలిపారు. అంతర్గత మంత్రిత్వ శాఖల సంప్రదింపులు ముగిశాయని, కేబినెట్ ఆమోదానికి సమర్పించడానికి ముందు తుది మెరుగులు దిద్దుకుంటోందని చెప్పారామె.
నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్‌డీసీపీ) అయిన దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బహిర్గత పరిచింది. టెలికం రంగంలో కొత్తగా రూ.6.5 లక్షల మేర పెట్టుబడులను ఆకర్షించడం, 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాలను కల్పించడం, లెవీలను క్రమబద్ధీకరించడం ద్వారా టెలికం కంపెనీలపై భారాన్ని తగ్గించడం, 50ఎంబీపీఎస్ బ్రాడ్ బ్యాండ్ వేగాన్ని స్టాండర్డ్‌గా మార్చడం, 5జీ సేవల్ని తీసుకురావవడం వంటి లక్ష్యాలు ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment