న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో ఉద్యోగాల కోత ప్రకంపనలు రేపుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు సహా స్టార్టప్ కంపెనీలు కూడా వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా యూకేకు చెందిన అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్, టెలికాం కంపెనీ బీటీ గ్రూపు భారీగా ఉద్యోగులను తీసివేయాలని యోచిస్తోంది. కాస్ట్‌కట్‌లో భాగంగా 55 వేల లేఆఫ్‌లను ప్రకటించనుంది.
లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్రిటీష్ బహుళజాతి టెలికమ్యూనికేషన్స్ హోల్డింగ్ కంపెనీ బీటీ గ్రూప్, ఫైబర్-ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ 5 జీ మొబైల్ నెట్‌వర్క్‌లు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇపుడిక ఎక్కువ మంది కార్మికులు అవసరం లేదని చెప్పింది. ఖర్చులను తగ్గించే క్రమంలోనే కాంట్రాక్టర్లతో సహా మొత్తం 55,000 ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తున్నట్లు గురువారం తెలిపింది. ఈ దశాబ్దం చివరికి లీనియర్ బిజినెస్‌తో బ్రైటర్ ఫ్యూచర్‌గా బీటీ గ్రూప్ రూపాంతరం చెందుతుందని, బెస్ట్ అండ్ టాప్, నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్‌లకు ఉత్తమమైన కస్టమర్ సర్వీస్, సొల్యూషన్‌లతో కనెక్ట్ అవుతుందని గ్రూప్ సీఈవో ఫిలిప్ జాన్సెన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్)
కాగా బీటీ గ్రూపులో ప్రస్తుతం సిబ్బంది, కాంట్రాక్టర్లతో సహా 130,000 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలి ఆదాయ ప్రకటనల సమయంలో 2028-2030 నాటికి తమ ఉద్యోగుల సంఖ్య 75-90వేల మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించడం గమనార్హం.
మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్, వార్తల కోసం చదవండి: సాక్షి బిజినెస్
Comments
Please login to add a commentAdd a comment